
నూజివీడు ఇన్‌చార్జి ఆర్డీవోగా చక్రపాణి
నూజివీడు: స్థానిక సబ్‌కలెక్టర్ కార్యాలయం ఇన్‌చార్జి ఆర్డీవోగా గుడివాడ ఆర్డీవో ఎం.చక్రపాణిను నియమించారు. చక్రపాణి బుధవారం నూజివీడు సబ్‌కలెక్టర్ కార్యాలయానికి విచ్చేసి బాధ్యతలు స్వీకరించారు. కార్యాలయ సిబ్బందితో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. ప్రజల పనులను త్వరితగతిన చేయాలన్నారు. ఫైళ్లు పెండింగ్ ఉండటానికి ఏ మాత్రం వీల్లేదన్నారు. ఒక పని గురించి ప్రజలను పదేపదే కార్యాలయం చుట్టూ తిప్పుకోవద్దన్నారు. అలా తిప్పుకోవడం వల్ల కార్యాలయానికి, అధికారికి, సిబ్బందికి చెడ్డపేరు వస్తుందన్నారు. కార్యాలయానికి వచ్చే ప్రజలతో మర్యాదపూర్వకంగా మాట్లాడి, వారు అడిగిన విషయాలకు సరైన వివరణ ఇవ్వాలన్నారు. నూజివీడు తహసీల్దారు దోనవల్లి వనజాక్షి ఆర్డీవోకు పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. కార్యక్రమంలో కార్యాలయ ఇన్‌చార్జి
ఏవో కాకుమాను స్లీవజోజి, సిబ్బంది పాల్గొన్నారు.