ఉద్యోగ మేళాతో యువతకు ఉపాధి
నవులూరు (మంగళగిరి) : రాజధాని గ్రామాల్లోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ మేళా ద్వారా ఉపాధి కల్పించడమే అమరావతి స్కిల్ డెవలప్‌మెంట్ సంస్థ లక్ష్యమని ఐటీ మానిటరింగ్ సోషల్ డెవలప్‌మెంట్ ఐటీ డైరెక్టర్ టి.ప్రభాకర్‌రెడ్డి చెప్పారు. గురువారం నవులూరులోని సంస్థ కార్యాలయంలో ఉద్యోగ మేళా నిర్వహించారు. రైజింగ్ స్టార్ మొబైల్, డ్రీమ్ సేవియర్ కంపెనీలు నిర్వహించిన మేళాకు 251 మంది నిరుద్యోగ యువతీ యువకులు హాజరయ్యారు. వీరిలో 131 మందిని ఎంపికచేసి అపాయింట్‌మెంట్ లెటర్లు అందజేశారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఉన్నత విద్యనభ్యసించిన ప్రతి నిరుద్యోగికి ఉపాధి కల్పించేలా శిక్షణ ఇస్తామని చెప్పారు.