
మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నానికి తప్పిన ప్రమాదం
ఏలూరు : వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నానికి తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో లిఫ్ట్లో వెళుతుండగా లిఫ్ట్ వైర్ తెగిపోవడంతో ఒక్కసారిగా అయిదో అంతస్తు నుంచి కిందకు పడిపోయింది. ఈ సంఘటన బుధవారం చోటుచేసుకుంది. లిఫ్ట్ కింద పడిపోవడంతో వెంటనే అప్పమత్తమైన సిబ్బంది గ్రిల్స్ తొలగించి ఆయనను బయటకు తీసుకొచ్చారు. కాగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ కార్యకర్తను ఆళ్లనాని పరామర్శించేందుకు వెళ్లిన సందర్భంగా ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది.