
జాబ్‌మేళాకు విశేష స్పందన
కడప కోటిరెడ్డి సర్కిల్:
జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతీ యువకులకు శిక్షణతో నిమిత్తం లేకుండా శ్రీరామ లైఫ్ ఇన్సూ్యరెన్స్‌లో డెవలప్‌మెంట్ ఆఫీసర్లు, యూనిట్ మేనేజర్ ఉద్యోగాలకు 25 మందిని ఎంపిక చేసినట్లు డీఆర్‌డీఏ పీడీ అనిల్‌కుమార్‌రెడ్డి తెలిపారు. 80 మంది అభ్యర్థులు హాజరు కాగా, వారిలో ప్రతిభ కలిగిన 25 మందిని ఎంపిక చేశామని పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులంతా ఈనెల 27న రిపోర్టు చేయాల్సి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో కంపెనీ మేనేజర్ రాజశేఖర్‌రెడ్డి, సాయి రమణారెడ్డి, నరసింహరెడ్డి, జేడీఎం హరప్రసాద్‌రాజు, ఏపీఎం ఎస్తేర్‌రాణి, ఈజీఎం సిబ్బంది పుథ్విరాజ్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.