విడాకులివ్వాలని వేధింపులు
సిద్దిపేట క్రైం: అదనపు కట్నం తీసుకురావాలని వేధింపులకు గురి చేసిన అ త్తింటి వారిపై బాధితురాళ్ల ఫిర్యాదు మేరకు గు రువారం వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. సిద్దిపేట పట్టణం శ్రీనగర్‌కాలనీకి చెందిన దేవసాని స్వప్నకు కరీంనగర్‌లోని మంకమ్మతోటకు చెందిన మధన్‌మోహన్‌తో మార్చి 2012లో వివాహం జరిగింది. పెళ్లి సమయంలో రూ. 10లక్షలు, 40తులాల బంగారం, కిలో వెండీతోపాటు ఇతర వస్తువులను కట్నకానుకలుగా అందజేశారు. హైదరాబాద్‌లో దంపతులు కాపురం పెట్టారు.
ఈ క్ర మంలో భర్త అదనపు కట్నం మరో రూ. 20 లక్షలు తీసుకురావాలని స్వప్నను వేధింపులకు గురి చేశాడు. అనంతరం స్వప్న తన పుట్టింటికి వచ్చింది. ఈ విషయమై పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టారు. భార్యాభర్తలిద్దరికీ నచ్చజెప్పి కాపురానికి పంపించారు. దీంతో ఫిబ్రవరి 2014లో భార్య స్వప్నను తీసుకుని మధన్‌మోహన్ అమెరికాకు వెళ్లాడు. అమెరికాలో తన చేష్టలతో మానసిక ఇబ్బందులకు గురి చేశాడు. ఏప్రిల్ 2016లో స్వప్న తన తమ్ముడి వివాహం ఉందని అమెరికా నుంచి సిద్దిపేటకు వచ్చింది. కాగా అమెరికాలో ఉన్న మధన్‌మోహన్ ఇటీవల స్వప్నకు లీగల్ నోటీస్‌ను పంపాడు. అలాగే మధన్‌మోహన్ కుటుంబీకులు కూడా స్వప్నను విడాకులు ఇవ్వాలని వేధిస్తున్నారు. దీంతో స్వప్న ఫిర్యాదు మేరకు భర్త మ ధన్‌మోహన్, అత్తామామలు సరస్వతి, ఆం జనేయులు, అడపడుచు మానస, బంధువులు సుధా, గోపాల్, అనసూయ, ఎల్లవ్వ, ఉమా, వడ్డెపల్లి పద్మ, సాంబమూర్తి, ఉమలపై కేసు న మోదుచేసినట్లు ఎస్‌ఐ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.
అదనపు కట్నం కోసం..
అదనపు కట్నం కోసం వేధిస్తున్న అత్తింటివారిపై గురువారం వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు... సిద్దిపేట పట్టణంలోని భారత్‌నగర్‌కు చెందిన తమ్మిశెట్టి దివ్యకు వరంగల్ జిల్లా జనగామకు చెందిన నాగరాజుతో డిసెంబర్ 2014లో వివాహం చేశారు. పెళ్లి సమయంలో రూ. 10లక్షలు, 20తులాల బంగారంతోపాటు ఇతర వస్తువులు కట్నకానుకల కింద అందజేశారు. ఈ క్రమంలో నెల రోజులపాటు బాగానే ఉన్నారు.
అదనపు కట్నం మరో రూ. 10లక్షలు తీసుకురావాలని అత్తింటివారు వేధించారు. ఈ నేపథ్యంలో 2015లో పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టారు. పెద్దల సమక్షంలో దివ్యను తీసుకోని ఆస్ట్రేలియా వెళ్తానని చెప్పిన నాగరాజు ఆమెను జనగామకు తీసుకెళ్లాడు. అనంతరం జూలై 2015లో జనగామలోనే దివ్యను వదిలి నాగరాజు ఆస్ట్రేలియాకు వెళ్లాడు. ఇటీవల మే 2016లో ఆస్ట్రేలియా నుంచి జనగామకు తిరిగివచ్చాడు. కాగా దివ్య ఇంటికి వెళ్లగా, అదనపు కట్నం తీసుకురావాలని వేధిస్తున్నారు. దీంతో బాధితురాలు దివ్య ఫిర్యాదు మేరకు భర్త నాగరాజు, అత్తమామలు సుజాత, వెంకటేశం, బావ సతీష్‌లపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.