గుంటూరు: గుంటూరు జిల్లా బెల్లంకొండ సమీపంలోశనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందారు. చౌటపాపాయపాలెం గ్రామానికి చెందిన ఆరుగురు వ్యక్తులు మిరప నారు తీసుకుని బెల్లంకొండకు ఆటోలో బయలుదేరారు. బెల్లంకొండ సమీపంలోని ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ఆటో బోల్తా పడింది.
ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే చనిపోగా... మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి... క్షతగాత్రులను సత్తెనపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.