రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి
విజయవాడ(రైల్వే స్టేషన్) :
రైలు నుంచి జారిపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. జీఆర్పీ పోలీసులు అందించిన వివరాలు.. బల్బు క్యాబిన్ సమీపంలోని రైల్వేట్రాక్‌పై ఒక గుర్తు తెలియని యువకుడి మృతదేహం పడి ఉండడంతో గమనించిన ప్రయాణికులు సమాచారం అందించారు. మృతుడికి సుమారు(25) సంవత్సరాలు వయసు, నలుపు రంగు ప్యాంట్ , నీలం రంగు షర్టు ధరించాడని, ఎత్తు 5 అడుగులున్నాడని వివరించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్‌కానిస్టేబుల్ మహంకాళీరావు తెలిపారు.
రైలు నుంచి జారిపడి గుర్తు తెలియని వృద్ధురాలు మృతి చెందిన సంఘటనపై శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలు.. వాంబే కాలనీ సమీపంలోని రైల్వేట్రాక్‌పై ఒక గుర్తు తెలియని వృద్ధురాలు మృతదేహం పడి ఉండడంతో గమనించిన ట్రాక్‌మేన్ వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మృతురాలికి 70 సంవత్సరాలు వయసు ఉంటుందని చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్‌కానిస్టేబుల్ పూర్ణచందరరావు తెలిపారు.