
డబుల్బెడ్రూం ఇళ్లను పరిశీలిస్తున్న ఇంజినీర్ల బృందం
- 46 మంది ఎర్రవల్లిలో డబుల్‌బెడ్‌రూం పనుల పరిశీలన
- మధ్యప్రదేశ్ రాష్ట్ర హౌసింగ్ సబ్ ఇంజినీర్ల కితాబు
జగదేవ్‌పూర్: సీఎం కేసీఆర్ దత్తత గ్రామమైన ఎర్రవల్లి అభివృద్ధికి మారుపేరు అని, ప్రతి పని చాలా బ్రహ్మండంగా జరుగుతున్నాయని మధ్యప్రదేశ్ హౌసింగ్ ఇఫ్రా డెవలప్‌మెంట్ బోర్డు సబ్ ఇంజనీర్ల బృందం కోఆర్డినేటర్ అంజయ్య అన్నారు. శనివారం మధ్యాహ్నం 46 మంది సబ్‌ఇంజనీర్ల బృందం గ్రామంలో పర్యటించి, జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరును గ్రామస్తులను ఆడిగితెలుసుకున్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ న్యాక్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో మూడు రోజుల పాటు ఇండ్ల నిర్మాణంపై శిక్షణ ఇచ్చారన్నారు. అందులో భాగంగానే సీఎం దత్తత గ్రామమైన ఎర్రవల్లిలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించేందుకు ఇక్కడి వచ్చామన్నారు. ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్‌బెడ్రూం ఇళ్లు అద్భుతంగా ఉన్నాయని కితాబు ఇచ్చారు. అలాగే కుంటల అభివృద్ధి, ఆధునిక వ్యవసాయ పద్ధతులు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉన్నాయని చెప్పారు.
డబుల్‌బెడ్రూం ఇండ్లను మధ్యప్రదేశ్‌లో కూడా కట్టించే విధంగా ప్రభుత్వ దృష్టికి తీసుకపోతామన్నారు. ఇళ్లకు కావాల్సిన ఇసుకను, సిమెంట్, ఇటుక తదితర ఖర్చులపై ఆరా తీశారు. అలాగే రెడ్‌మిక్స్ ప్లాంట్‌ను త్యేకంగా పరిశీలించి పనితీరును ఆడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో హౌసింగ్ డీఈ బాకీ, సర్పంచ్ భాగ్య, వీడీసీ ఛైర్మన్ కిష్టారెడ్డి, ఎంపీటీసీ భాగ్యమ్మ, వీడీసీ గౌరవ అధ్యక్షులు బాల్‌రాజు, ఉపాధ్యక్షుడు తుమ్మ కృష్ణ, సభ్యులు సత్తయ్య, మల్లేశం, నవీన్, బాబు, నందం, బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.