
బాబు మరో కొత్త నాటకం!
హైదరాబాద్: తెలంగాణలో పూర్తిగా చేతులెత్తేసిన టీడీపీ.. సీవూంధ్రలోనూ పరిస్థితులు ఏవూత్రం అనుకూలించని దుస్థితిలో కొత్త ఎత్తుగడలకు దిగుతోందా? మిత్రపక్షం బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని వుుందుపెట్టి చౌకబారు ఆలోచనలు చేస్తోందా? తెలంగాణలో పోలింగ్ ముగిసిన వెంటనే సీమాంధ్ర ప్రయోజనాలకు సంబంధించి మోడీతో ఆచరణ సాధ్యం కాని కీలక ప్రకటనలు చేరుుంచబోతున్నారా? రాష్ట్ర విభజనతో ముడిపడిన అంశానికి సంబంధించి, తెలంగాణ బిల్లు స్ఫూర్తికి విరుద్ధంగా సైతం వివాదాస్పద హామీలు ఇవ్వనున్నారా? ప్రస్తుతం ఆయన చుట్టూ జరుగుతున్న పరిణామాలు పరిశీలిస్తే వీటికి ఔననే సమాధానం వస్తోంది. తెలంగాణలో ఈనెల 30న పోలింగ్ జరగనుంది. అదేరోజు సాయంత్రం తిరుపతిలో ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభలో నరేంద్ర మోడీ ప్రసంగించనున్నారు.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కూడా ఇందులో పాల్గొననున్నారు. ఈ వేదిక మీదుగా సీవూంధ్ర ఓటర్లను వుభ్యపెట్టేలా మోడీ ద్వారా సీవూంధ్ర ప్రయోజనాలకు సంబంధించిన కొన్ని కీలక ప్రకటనలు చే రుుంచబోతున్నారనే వార్తలు వెలువడుతున్నాయి. నిజానికి తెలంగాణలో తెలుగుదేశం కథ ముగిసినట్లే! దాంతో జతకట్టిన బీజేపీ సైతం భంగపడింది. క్షేత్ర స్థారుు నుంచి ఆ రెండు పార్టీల శ్రేణులు ఇస్తున్న సవూచారం వురీ నిరాశాపూరితంగా ఉంటోంది. అనేక చోట్ల పొత్తు వికటించడం, చంద్రబాబు నాయుకత్వం పట్ల ప్రజల్లో స్పష్టంగా వ్యతిరేకత కనిపిస్తుండటంతో బీజేపీ నాయుకులు తల పట్టుకున్నారు. దీంతో ఇక తెలంగాణను వదిలేసిన చంద్రబాబు.. కనీసం సీవూంధ్రలోనైనా ఉనికి చూపించుకోవడం కోసం మోడీ పాత్రధారిగా ఇలా కొత్త నాటకాలకు తెరలేపుతున్నారు.
అంతా అనుకున్నట్లే జరుగుతోంది!
రెండు రోజులుగా తెలంగాణలో విస్తృతంగా పర్యటిస్తున్న పవన్‌కల్యాణ్ టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌పై విరుచుకుపడుతున్నారు. ‘మోడీని విమర్శిస్తే తాట తీస్తా.. బీసీ నేత మోడీనేమైనా అంటే గుడ్డలూడదీస్తా’ లాంటి తీవ్ర పదజాలంతో రెచ్చిపోతున్నారు. ‘కేసీఆర్‌ను తిడితే సీవూంధ్రలో నాలుగు ఓట్లు పడతాయునే ఓ చౌకబారు పథకం’లో భాగంగా పవన్‌కల్యాణ్‌తో ఉద్దేశపూర్వకంగానే ఇలా ప్రసంగాలు చేరుుస్తున్నారన్నది రాజకీయు పరిశీలకుల విశ్లేషణ. దీనికితోడు తెలంగాణలో ప్రచారానికి వచ్చిన అగ్రనేతల ప్రసంగాలు కూడా చంద్రబాబు పక్కా స్క్రిప్టు ప్రకారమే సాగుతున్నారుు. తెలంగాణ ప్రయోజనాలు, అభివృద్ధిని, సెంటిమెంట్‌ను పక్కనపెట్టేసి.. సీవూంధ్ర కోణంలో ఆ నేతలు ప్రసంగిస్తున్నారు. మోడీ, సుష్మాస్వరాజ్ సైతం ‘తెలుగు ఆత్మగౌరవాన్ని చంపి కాంగ్రెస్ పార్టీ తెలంగాణను ఇచ్చింద’న్న అర్థంతో ‘బిడ్డ పుట్టింది కానీ తల్లిని చంపారు’ అని మాట్లాడారు.
నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్‌నగర్, హైదరాబాద్‌లలో ఇటీవల జరిగిన బహిరంగ సభల్లో మోడీ పదే పదే ఈ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు చెప్పినట్టల్లా మోడీ, ఇతర నేతలు ఆడుతున్న తీరుతో తెలంగాణ కమలనాథులు తల పట్టుకుంటున్నారు. ‘‘తెలంగాణలో పప్పులుడకని చంద్రబాబు ఇప్పుడిక సీవూంధ్రలో నాలుగు ఓట్ల కోసం మోడీని, ఇతర బీజేపీ నేతలను పావులుగా చేసుకుని కొత్త నాటకాలకు తెరదీస్తున్నారు. మీడియూ ప్రచారం ద్వారా సీవూంధ్రలో ఎంతగా ఎదగాలని ప్రయుత్నించినా.. వైఎస్‌ఆర్‌సీపీ గాలిని తట్టుకోలేక మోడీని ముందుకు తెస్తున్నారు. ఆయనతో సీవూంధ్ర ప్రజలను వుభ్యపెట్టే హామీలను ప్రకటించేందుకు సిద్ధవువుతున్నారు. సీవూంధ్ర ప్రజలు వాటిని నమ్మే పరిస్థితి ఎలాగూ లేకపోరుునా... అబద్ధాలు, నాటకాల ద్వారా చంద్రబాబులో గూడుకట్టుకున్న నిస్పృహ ఇలా స్పష్టంగా బయుటపడుతూ మమ్మల్ని వురింత దెబ్బతీస్తోంది’’ అని బీజేపీకి చెందిన ఓ సీనియుర్ నాయుకుడే విశ్లేషించారంటే పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు!