
నన్నడగొద్దు ప్లీజ్
సర్! నేను బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను.
లవ్ డాక్టర్
సర్! నేను బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. నేను, చందు అనే అమ్మాయి ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నాం. ఆరు నెలల క్రితం మా ఇద్దరి విషయం పెద్దవాళ్లకు తెలిసిపోయింది. మా ఇంట్లో ఒప్పించి మా అమ్మతో వాళ్లకి కాల్ చేయించాను. వాళ్లు ఒప్పుకోలేదు. పైగా నానా మాటలు అన్నారు. ‘వాళ్ల పేరెంట్స్‌కి నేను తన వెంటపడ్డానని, ట్రాప్ చేశానని చెప్పింది.’ మళ్లీ కాల్ చెయ్యొద్దని వాళ్ల అన్న చేత వార్నింగ్ ఇప్పించింది. దాంతో మూడు నెలల క్రితం మా పేరెంట్స్ నాకు నా మరదలితో పెళ్లి ఫిక్స్ చేశారు.
తను ఆ విషయం తెలుసుకుని మళ్లీ కాల్ చేసింది. నువ్వు లేకపోతే చచ్చిపోతానని బెదిరిస్తోంది. ఒకసారి అటెంప్ట్ కూడా చేసింది. అసలు అప్పుడు అలా ఎందుకు చేసిందో ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతుందో అర్థం కావడం లేదు. నా మరదలు కూడా నన్ను చిన్నప్పటి నుంచి లవ్ చేస్తోందట. తను ఆ సంగతి పెళ్లి ఫిక్స్ అయ్యాక చెప్పింది. ఇప్పుడు పెళ్లి ఆగిపోతే మరదలు ఏం చేసుకుంటుందో అని భయంగా ఉంది. ఇద్దరిలో ఎవరూ బాధపడకూడదు. దయచేసి సలహా ఇవ్వండి. నా జీవితం మీరు చెప్పే సలహా మీదనే ఆధారపడి ఉంది?
– గ్రిప్సన్
‘సార్... మీ బుద్ధి బలం నిరూపించుకునే సింగిల్ ఛాలెంజ్ సార్ ఇది’ ఎందుకు అంతగా ఎగై్జట్ అవుతున్నావు నీలాంబరీ..? ‘సార్... అయిపోయింది సార్... మీ పని అయిపోయింది.’ ‘జాగ్రత్త... సింగిల్ లెగ్ మీద లేచి హుషారుగా ఎగురుతున్నావు, పక్కనే అరటిపండ్లున్నాయి జారి పడగలవు.’ ‘సార్... ఈ సారి జారి పడేది డెఫెనెట్లీ మీరే... ఈ క్వశ్చన్ మీ కాలు కింద అరటి తొక్కే సార్...’
అంత రఫ్పా... అంత టఫ్పా..? విషయం చెప్పు. ‘సార్... టూ గర్ల్స్... లవ్ ఒన్ బాయ్. రెండో గర్ల్ మరదలితో పెళ్లి ఫిక్స్. ఫస్ట్ గర్ల్ రిటర్న్స్. హూ విల్ అబ్బాయి మ్యారీ..? ఇది విషయం సార్’
అబ్బాయి మంచి డిమాండ్‌లో ఉన్నాడంటావ్. నాకు తెలిసి గ్రిప్సన్ ఇంకా ఫస్ట్ లవ్‌లోనే ఉన్నాడు. ఆ అమ్మాయినే ఇష్టపడుతున్నాడు. ‘‘అమ్మ సెంటిమెంట్’’... ‘‘మరదలి సెంటిమెంట్’’ అని కబుర్లు చెబుతున్నాడు కానీ, ఇంకా ఫస్ట్ లవ్‌లోనే ఉన్నాడు. ఆ అమ్మాయికి ముందు ఆన్సర్ ఇచ్చి ఆ తరువాత మరదలితో తేల్చుకోవడం కరెక్ట్. ‘మరదలికి తెలిస్తే ఫీల్ అవుతుంది కదా సార్..?’ తెలియకుండా చేసుకుంటే ఇంకా ఫీల్ అవుతుంది. ‘ఇంకో మార్గం లేదా సార్’..? ఉంది... నేను వంద గెలలు తినే దాకా ఆగాలి. ప్రాబ్లమ్ అదే సాల్వ్ అయిపోతుంది.
- ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్
ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి.
లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com