
♦ రష్యన్ ‘సొప్రానో’ ఐదా గారిఫులినా పాటతో ఫుట్‌బాల్ ప్రపంచ కప్ ప్రారంభ వేడుకలు మొదలయ్యాయి. గొంతులో అత్యధిక గమకాలను పలికించగల ప్రతిభ ఉన్న మహిళను, బాలికను ‘సొప్రానో’ అంటారు
♦ తెలంగాణ ‘ఐసెట్’లో (ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్) నాల్గవ ర్యాంకుతో ఎస్.లక్ష్మీ స్రవంతి బాలికల్లో ప్రథమ స్థానంలో నిలిచింది. మేథ్స్‌ని సాల్వ్ చేయడం ఇష్టం అంటున్న స్రవంతి ఉస్మానియా యూనివర్సిటీలో చేరాలనుకుంటోంది
♦ మెదక్ జిల్లా ఎస్పీ చందనా దీప్తి ‘రోజుకొక కొత్త నైపుణ్యాన్ని సాధించగలరా?’ అని ట్విట్టర్‌లో తన పరిధిలోని పోలీసు అధికారులందరికీ సవాల్ విసిరారు. చందన 2012 బ్యాచ్ ఐపీఎస్ అధికారి
♦ భారత ప్రభుత్వం తొలిసారిగా ఒక మహిళను హజ్ యాత్రకు కోఆర్డినేటర్‌గా నియమించింది! ఇండియన్ డిఫెన్స్ అకౌంట్స్ సర్వీసులో పనిచేస్తున్న మొయినా బెనజీర్.. ఒంటరిగా హజ్‌కు బయల్దేరుతున్న 1300 మంది మహిళలకు సమన్వయకర్తగా ఉంటారు
♦ ముంబైలోని ప్రభాదేవి ఏరియాలో ఉన్న అతి విలాసవంతమైన 33 అంతస్తుల ‘బ్యూమాండె’ అపార్ట్‌మెంట్ ‘బి’వింగ్ పెంట్‌హౌస్ డ్యూప్లెక్స్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. బాలీవుడ్ నటి దీపికా పదుకోన్ ఫ్లాట్ ఆ అపార్ట్‌మెంట్‌లోనే ఉండడంతో ఆమె సురక్షితంగానే ఉన్నారా అనే విషయమై అభిమానులు ఆందోళన చెందారు
♦ తల్లి కడుపులో ఉన్న శిశువులకు మొజార్ట్ సంగీతం వినసొంపుగా ఉంటుందనీ, అడెల్ సంగీతం కలవరం కలిగించే ప్రమాదం ఉందని లండన్‌లో జరిగిన ఒక సర్వే వెల్లడించింది. మోజార్ట్ 18వ శతాబ్దం నాటి ఆస్ట్రియా సంగీతకారుడు కాగా, అడెల్ 1988లో పుట్టిన ముప్పై ఏళ్ల ఇంగ్లండ్ గాయని
♦ లైంగిక వేధింపుల ఆరోపణలు రుజువు కావడంతో లాస్ ఏంజెలిస్‌లో ప్రసిద్ధ ఫ్యాషన్ కంపెనీ ‘గెస్’ సహసంస్థాపకుడు పాల్ మార్సియానో తన పదవి నుంచి వైదొలిగారు. ఎనిమిదేళ్ల క్రితం ఫొటోషూట్‌కి పిలిచి, పాల్ తన వక్షోజాలను తాకాడని కేట్ అప్‌టన్ అనే మోడల్ తొలిసారిగా బహిర్గతం చెయ్యడంతో మిగతా బాధితులు కూడా బయటికొచ్చారు
♦ పిల్లల్ని ఎక్కువ సమయం తండ్రితో గడపనివ్వాలని హాలీవుడ్ నటి ఏంజెలీనా జోలీకి కోర్టు సూచించింది. ఏంజెలీనా, బ్రాడ్‌పిట్ దంపతులు విడిపోయాక, పిల్లల సంరక్షణ బాధ్యతపై కోర్టును ఆశ్రయించినప్పుడు న్యాయమూర్తి ఈ విధమైన సూచనను చేశారు
♦ యు.ఎస్.లోని నంబర్ వన్ ఆటోమొబైల్స్ కంపెనీ ‘జనరల్ మోటార్స్’ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా దివ్యా సూర్యదేవర సెప్టెంబర్ 1న బాధ్యతలు చేపట్టబోతున్నారు. ప్రస్తుతం ఆమె కంపెనీ కార్పోరేట్ ఫైనాన్స్‌కు వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment