భాషణం : చలి నిర్దాక్షిణ్యమైపోతుంది | Cold feet, Cold eye, Cold heart, Cold blood | Sakshi
Sakshi News home page

భాషణం : చలి నిర్దాక్షిణ్యమైపోతుంది

Published Sun, Nov 17 2013 2:04 AM | Last Updated on Sat, Sep 2 2017 12:40 AM

భాషణం : చలి నిర్దాక్షిణ్యమైపోతుంది

భాషణం : చలి నిర్దాక్షిణ్యమైపోతుంది

చలి పెరుగుతోంది. మరికొన్ని రోజులు గడిస్తే చలి నిర్దాక్షిణ్యమైపోతుంది. నో సింపథీ, ఓల్లీ క్రూయెల్టీ. అంటే cold- blooded అన్నమాట. వాస్తవానికి ఈ కోల్డ్ బ్లడెడ్ అనే మాటను చలి తీవ్రతను సూచించడానికి ఉపయోగించరు. అందుకు వేరేమాటలు ఉన్నాయి. ice-cold అనీ, stone-cold... ఇలా. ఈ వాక్యాలు చూడండి. 1. I felt her hand and it was ice-cold. 2. Your dinner has been on the table for over an hour and it's stone-cold.
 
 stone cold sober అంటే మాత్రం not having drunk any alcohol అని. మద్యం సేవించలేదని. Are you sober (not drunk) enough to drive, Gowtam? అని అడగొచ్చు. మరీ డ్రైవ్ చేయలేనంతగా తాగలేదు కదా అని అనడమన్నమాట.
 మరి cold-blooded అనే మాటను ఏ సందర్భంలో వాడతారు. దాని గురించి చెప్పుకునే ముందు cold గురించి కొన్ని మాటలు.
 
 Cold అనే మాటకు ప్రధానంగా మూడు సాధారణ అర్థాలు ఉన్నాయి. 1.Low temperature 2.Unfriendly 3.Illness. కోల్డ్‌తో జతపడి వచ్చే పదబంధాలకు మాత్రం ఇందుకు పూర్తి భిన్నమైన అర్థాలు కనిపిస్తాయి. ఉదా: cold-blooded నే తీసుకుందాం. పరిసరాల వాతావరణానికి అనుగుణంగా శరీర ఉష్ణోగ్రతను నియంత్రించుకునే జీవుల్ని కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్ అంటారు. (పాములు, బల్లులు ఇలాంటివే).  ఎమోషన్లు, ఫీలింగ్స్ గట్రా లేని వాళ్లను కూడా cold-blooded అనే అంటారు. అలా వచ్చిందే... cold-blooded murder అనే మాట.
 
 cold call అని ఇంకో మాట ఉంది. మనం ఎవరో తెలియకుండానే, ఆఫర్‌లు ఉన్నాయంటూ ఏదైనా కంపెనీ నుంచి మనకు వచ్చే టెలిఫోన్ కాల్... కోల్డ్ కాల్.
 cold snap అంటే ఇలా వచ్చి, అలా వెళ్లిపోయే చలిగాలులు లేదా చల్లని వాతావరణం. cold sore అంటే పెదవుల మీదగానీ, ముక్కు మీద గానీ వైరస్ కారణంగా వచ్చే దద్దుర్లతో వచ్చే వాపు.
 cold sweat అంటే భయం, అమితమైన ఆందోళన. (I break out in a cold sweat (become extremely anxious) just thinking about public speaking).
 
 cold turkey అంటే సిగరెట్‌గానీ, డ్రగ్స్ గానీ, ఇతర వ్యసనాలు గానీ మానుకున్నప్పుడు సంభవించే బాధాకరమైన దశ. (Six years ago she went cold turkey on (stopped completely) a three-pack-a-day smoking hibit).
 
 cold war అంటే ప్రచ్ఛన్న యుద్ధం. రెండు దేశాల మధ్య అంతర్లీనంగా ప్రతి విషయంలోనూ ఉండే వ్యతిరేకతే కోల్డ్‌వార్. అంటే... యుద్ధం జరగదు కానీ, యుద్ధం జరుగుతుందేమోనన్న భయాందోళనలు రెండు దేశాల్లోనూ ఉంటాయి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా రష్యాల మధ్య చాలాకాలం పాటు ప్రచ్ఛన్న యుద్ధం నడిచింది.
 
 head cold అంటే ముక్కు దిబ్బడ. common cold అంటే జలుబు, దగ్గు, గొంతునొప్పి.
 cold అనే మాటతో వచ్చే ఇలాంటి కొన్ని idioms, phrases కొన్ని ఉన్నాయి. blood run cold అంటే భయపడడం.      (I heard a tapping on the window which made my blood run cold.
 
 get cold feet అంటే ఏదైనా పని చేయాలంటే కలిగే భయం. కాళ్లు చల్లబడడం అంటాం కదా, అలాంటిది. కొందరికి పెళ్లి మాటెత్తితే చాలు కాళ్లు చల్లబడతాయి. th-row cold water అంటే ఉత్సాహంపై నీళ్లు చల్లడం. లేదా నిరుత్సాహపరచడం.need a cold shower అంటే... 'excitement'ను చల్లబరచాల్సి వచ్చింది. ఇదొక humorous expression. ఈ వాక్యం చదివితే మీకు అర్థమైపోతుంది. Did you see the dress she was wearing? I think I'd better go and take a cold shower!
 
 మరీ ఇంత కోల్డా!!
 cold eyed అంటే అసహనం లేదా చికాకు. అన్‌ఫ్రెండ్లీ అన్నమాట. (She gave him a cold-eyed stare). cold-hearted కూడా ఇలాంటి మాటే. అలాగే cold fish అన్నా కూడా ఇదే అర్థం. లోపల ఏదో పెట్టుకుని ముభావంగా ఉండే వ్యక్తి.

Advertisement
Advertisement