హయత్‌నగర్ (హైదరాబాద్): హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అబ్దుల్లాపూర్‌మెట్ వద్ద ఆగిఉన్న లారీని డీసీఎం వ్యాను ఢీకొంది. బుధవారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో డీసీఎం వ్యాను క్యాబిన్‌లో ఇరుక్కుని ఒకరు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.