
చూడండి.. ఈ బాటిల్ వైపే చూడండి.. అంతేకానీ తాగాలనుకున్నారో మీ పని ఖతమే.. అయినా ఫర్వాలేదు.. ఎంత ఖర్చయినా సరే తాగేస్తాం అనుకుంటున్నారా.. అయితే మీ ఇష్టం. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వైన్ అట! ఒక్క బాటిల్ వైన్ ధర ఎంతో తెలుసా రూ.20 లక్షలు మాత్రమే.
దీని పేరు ఆరమ్‌రెడ్ గోల్డ్. అంత ఖరీదైన దీని ప్రత్యేకతలేంటంటే.. దీన్ని టెంప్రానిల్లో అనే రకం ద్రాక్ష పళ్ల నుంచి తయారు చేశారు. దీన్ని కేన్సర్, ఎయిడ్స్, స్లీ్కరోసిస్ వంటి వ్యాధుల చికిత్సకు ఉపయోగించే ఓజోన్ థెరపీలో వినియోగిస్తారు. శరీరంలో ఆక్సిజన్ స్థాయిని పెంచుతారు.