
సాక్షి, ముంబై: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌కు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) షాక్ ఇచ్చింది. అక్రమ నిర్మాణాల విషయంలో ఆయనతోపాటు ఏడుగురికి నోటీసులు జారీచేసింది. తూర్పు గోరేగావ్‌లోని ఫిలింసిటీకి సమీపంలో అమితాబ్ బచ్చన్‌తోపాటు పలువురు బాలీవుడ్ నిర్మాతలకు విలావసంతమైన భవనాలు ఉన్నాయి. ఈ భవనాలకు సంబంధించి పలు అక్రమ నిర్మాణాలు చేపట్టినట్టు గతంలో ఆరోపణలు వచ్చాయి.
ఈ నేపథ్యంలోఈ అక్రమ నిర్మాణాల కూల్చివేత ఏమేరకు వచ్చిందో తెలుపాలంటూ సమాచార హక్కు కార్యకర్త అనిల్ గల్‌గోలి బీఎంసీకి దరఖాస్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో అమితాబ్‌తోపాటు రాజ్‌కుమార్ హిరానీ, ఒబేరాయ్ రియాల్టీ, పంజజ్ బాలాజీ, సంజయ్ వ్యాస్, హరేశ్ ఖండెల్‌వాల్, హరేశ్ జగ్తాని తదితరులకు బీఎంసీ నోటీసులు జారీచేసింది. గోరేగావ్‌లో తమ విలాసవంతమైన భవనాల కోసం బీఎంసీకి సమర్పించిన ప్లాన్‌కు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు చేపట్టారని, ఇలా అక్రమ నిర్మాణాలు చేపట్టడం నిబంధనలకు విరుద్ధం కావడంతో బిగ్ బీతోపాటు ఇతర బాలీవుడ్ పెద్దలకు నోటీసులు అందాయని హక్కుల కార్యకర్త అనిల్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment