నా కళాజీవితం కొనసాగాలి | Lonely no-celebration birthday for Kamal Haasan | Sakshi
Sakshi News home page

నా కళాజీవితం కొనసాగాలి

Published Wed, Nov 9 2016 4:11 AM | Last Updated on Mon, Sep 4 2017 7:33 PM

నా కళాజీవితం కొనసాగాలి

తమిళసినిమా; తన కళాజీవితం ఇంకా చాలా కాలం కొనసాగాలని ఆశిస్తున్నట్లు విశ్వనటుడు కమలహాసన్ మంగళవారం తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. సోమవారం కమలహాసన్ పుట్టిన రోజు అన్న సంగతి తెలిసిందే. అయితే ముఖ్యమంత్రి అమ్మ అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కారణంగా తన పుట్టిన రోజు వేడుకను జరుపుకోవద్దని, అభిమానులు కూడా ఎలాంటి వేడుకలను నిర్వహించవద్దని కమల్ ఇంతకు ముందే విజ్ఞప్తి చేశారు.
 
 దీంతో సోమవారం కమల్ ఎలాంటి వేడుకలు జరుపుకోలేదు. అయితే పలువురు సినీ ప్రముఖులు కమలహాసన్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలను ఫోన్ల ద్వారా తెలియజేశారు. ఈ నేపథ్యంలో కమల్ మంగళవారం ట్విట్టర్‌లో పేర్కొంటూ తనకు శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్లు పేర్కొన్నారు. అభిమానులు తనపై పెట్టుకున్న అంచనాలను అందుకోవడానికి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటానని, సుదీర్ఘకాలం తన కళాజీవితాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నానని ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement