నో సెలబ్రేషన్స్‌! | Superstar Amitabh Bachchan says will not celebrate birthday | Sakshi
Sakshi News home page

నో సెలబ్రేషన్స్‌!

Published Tue, Oct 10 2017 1:13 AM | Last Updated on Mon, May 28 2018 4:04 PM

Superstar Amitabh Bachchan says will not celebrate birthday - Sakshi

75 కేజీలు బరువున్న కేక్‌ కట్‌ చేయిస్తే ఆయన రేంజ్‌కి తగ్గట్టు ఉంటుంది... 75 అడుగుల కటౌట్‌ పెడితే ఆ కటౌట్‌కి తగ్గ మర్యాద ఇచ్చినట్లు ఉంటుంది... 75 రకాల పూలతో బొకే తయారు చేసి, ఇస్తే... బిగ్‌ బి దిల్‌ ఖుష్‌ అవుతుంది... ఒకవైపు అమితాబ్‌ అభిమానులు ఇలా డిస్కస్‌ చేసుకుంటుంటే మరోవైపు ఆయన కుటుంబ సభ్యులు భారీ ఎత్తున బర్త్‌డే సెలబ్రేషన్స్‌ని ప్లాన్‌ చేస్తున్నారని ఇండస్ట్రీలో ఓ వార్త షికారు చేస్తోంది. రేపు అమితాబ్‌ 75వ జన్మదినం. ఆయన పుట్టినరోజు వేడుకల గురించి వాడివేడి చర్చలు జరుగుతుండగా, వాటికి ఫుల్‌స్టాప్‌ పడేలా అమితాబ్‌ ఓ స్టేట్‌మెంట్‌ ఇచ్చారు.

‘‘నో సెలబ్రేషన్స్‌.. బర్త్‌డేనే కాదు.. దీపావళి పండగ కూడా జరుపుకోవడంలేదు’’ అని పేర్కొన్నారాయన. కారణాలు మాత్రం చెప్పలేదు. కారణం ఏదైనా అమితాబ్‌ ఇచ్చిన ఈ స్టేట్‌మెంట్‌ మాత్రం ఆయన అభిమానుల ఉత్సాహం మీద నీళ్లు జల్లింది. పోనీ, ఆ రోజు ఇంటికెళ్లి కలుద్దామంటే అది కూడా కుదరదట. ఎందుకంటే, బిగ్‌ బి సిటీలో ఉండటంలేదు. ఈ విషయాన్నీ ఆయనే తెలియజేశారు. ‘‘సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం బర్త్‌డే వేడుకలు భారీగా జరగబోతున్నాయని చెప్పుకుంటున్నారు. ఆ సన్నిహితులెవరో తెలియడంలేదు’’ అని కూడా బిగ్‌ బి చమత్కరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement