
మెగాస్టార్ చిరంజీవి హీరోగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘సైరా’ మూవీ కోసం గతేడాదిగా మెగా ఫ్యాన్స్ వేయి కళ్లతో వేచి చూస్తున్నారు. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహరెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్‌పై మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. మెగా అభిమానుల కోసం స్వాతంత్ర దినోత్సవ కానుకగా ‘సైరా నరసింహారెడ్డి’ మేకింగ్ వీడియోను చిత్ర బృందం బుధవారం విడుదల చేసింది.
షూటింగ్ సందర్భంగా చోటుచేసుకున్న పలు ఆసక్తికర సన్నివేశాలతో ఈ వీడియో అభిమానులను అలరిస్తుంది. ఈ వీడియోలో సినిమాలోని ప్రధాన పాత్రలన్నింటిని మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. బిగ్ బీ అమితాబ్ బచ్చన్, నయన తార, సుదీప్, జగపతి బాబు, విజయ్ సేతుపతి, నిహారిక, తమన్నా పాత్రలతో పాటు సెట్‌లో జరిగిన వివిధ సంఘటనల్ని వీడియోలో చూపించారు. ఇక ఈ నెల 20న టీజర్‌ను రిలీజ్ చేస్తుండగా.. సినిమాను అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment