
సూర్యకు అభినందనల వెల్లువ
విభిన్న కథాంశంతో వెండితెర మీదకు వచ్చిన 24 హీరో సూర్యను పలువురు టాలీవుడ్, కోలీవుడ్ హీరోలు అభినందనలతో ముంచెత్తుతున్నారు.
విభిన్న కథాంశంతో వెండితెర మీదకు వచ్చిన 24 హీరో సూర్యను పలువురు టాలీవుడ్, కోలీవుడ్ హీరోలు అభినందనలతో ముంచెత్తుతున్నారు. సినిమాలో ట్విస్టులు అదిరిపోయాయని, కథాంశం కూడా చాలా బాగుందని చెబుతున్నారు. మంచి ఓపెనింగ్ కూడా వచ్చిందని మెచ్చుకుంటున్నారు. తాను ఈ సినిమాను ఎంతగానో లవ్ చేశానని, ముఖ్యంగా చివరి 20 నిమిషాలు అదిరిపోయిందని టాలీవుడ్ హీరో అల్లు శిరీష్ అన్నాడు. విజువల్స్, ట్విస్టులు, సూర్య నటన చాలా బాగున్నాయని, ఈ సినిమాను తప్పనిసరిగా చూడాల్సిందేనని ట్వీట్ చేశాడు.
ఇక 'అ.. ఆ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న హీరో నితిన్ కూడా ఈ సినిమాపై స్పందించాడు. ముందుగా టీమ్ 24కు కంగ్రాట్స్ చెప్పాడు. సినిమా గురించి చాలా అద్భుతాలు వింటున్నానని, ఈ మాస్టర్ పీస్‌తో శ్రేష్ట్ మూవీస్‌కు కూడా అనుబంధం ఉన్నందుకు సంతోషంగా ఉందని అన్నాడు. దర్శకుడు విక్రమ్‌కు, హీరో సూర్యకు థాంక్స్ చెప్పాడు. ఇక ఈ సినిమాకు రాక్‌స్టార్ ఓపెనింగ్ వచ్చిందని, ఆల్ ద బెస్ట్ అని కోలీవుడ్ హీరో మాధవన్ అన్నాడు. ఇది చాలా పెద్ద సినిమా అవుతుందని కూడా చెప్పాడు.
Loved #24TheMovie. Esp last 20 mins. The visuals, twists & @Suriya_offl' s performance as Mani & Athreya were superb. 24 is a must watch!
— Allu Sirish (@AlluSirish) 6 May 2016
CONGRATS team24!hearing amazing stuff bt d film!happy tht sreshth movies is associated with this master piece..thanku vikram n @Suriya_offl
— nithiin (@actor_nithiin) 6 May 2016
@Suriya_offl wish you all the very best for a rock star opening bro....This is the big one ... Go @24
— Ranganathan Madhavan (@ActorMadhavan) 6 May 2016