
అనసూయ... వర్సెస్ ఆనంద్
అనగనగా ఓ అబ్బాయి. పేరు - ఆనంద్ విహారి. ఓ శుభముహర్తాన అతను ప్రేమలో పడ్డాడు. ఆ కథలోకి అనసూయా రామలింగం వచ్చింది.
అనగనగా ఓ అబ్బాయి. పేరు - ఆనంద్ విహారి. ఓ శుభముహర్తాన అతను ప్రేమలో పడ్డాడు. ఆ కథలోకి అనసూయా రామలింగం వచ్చింది. ఎవరామె? ఆ తర్వాత ఏం జరిగింది? ఆ విషయం తెలియాలంటే ‘అ...ఆ...’ సినిమా కోసం నాలుగు నెలలు ఆగాలి. ‘అనసూయ రామలింగం వర్సెస్ ఆనంద్ విహారి’ అనేది ఉపశీర్షిక. ఆనంద్ విహారి హీరో.
మరి, అనసూయ ఎవరన్నది సస్పెన్స్. నితిన్, సమంత, అనుపమా పరమేశ్వరన్ హీరో, హీరోయిన్లుగా త్రివిక్రమ్ దర్శకత్వంలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రం గురువారం హైదరాబాద్‌లో మొదలైంది. నిర్మాత మాట్లాడుతూ - ‘‘త్రివిక్రమ్ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ తయారు చేశారు. వచ్చే నెల 10న రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. సంక్రాంతికి విడుదల చేయనున్నాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: అనిరుధ్, కెమెరా: నటరాజ్ సుబ్రమణియన్, ఎడిటింగ్: కోటగిరి, ఎగ్జిక్యూ టివ్ నిర్మాత: పి.డి.వి. ప్రసాద్, సమర్పణ: శ్రీమతి మమత.