'మతం మారు.. లేదంటే నరికేస్తాం' | Writer Receives Threat Letter To Convert To Islam | Sakshi
Sakshi News home page

కాలు, చేయి నరికేస్తా.. రచయితకు వార్నింగ్‌

Published Sat, Jul 22 2017 10:45 AM | Last Updated on Tue, Aug 28 2018 7:22 PM

'మతం మారు.. లేదంటే నరికేస్తాం' - Sakshi

'మతం మారు.. లేదంటే నరికేస్తాం'

తిరువనంతపురం: 'మతం మారు లేదంటే ఆరు నెలల్లో కాలు, చేయి నరికేస్తాం' అంటూ మలయాళీ ప్రముఖ రచయిత కేపీ రామనుణ్ణికి బెదిరింపు లేఖ వచ్చింది. ఆరు నెలల్లో ముస్లిం మతంలోకి మారకుంటే ఆయన కుడి చేతిని, ఎడమకాలిని నరికేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తులు ఆయనకు బెదిరింపు లేఖ పంపించారు. కోజికోడ్‌లోని ఆయన నివాసానికి ఆరు రోజుల కిందట ఈ లేఖ వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన పోలీసులను ఆశ్రయించారు. అయితే, ఈ లేఖ విషయంలో తనకు ఎవరిపైనా అనుమానం లేదని అంటున్నారు. ఈ లేఖపై ఉన్న చిరునామా ప్రకారం అది మళప్పురం జిల్లాలోని మంజేరీ ప్రాంతం నుంచి వచ్చినట్లు తెలుస్తోంది.

'ఈ బెదిరింపు లేఖ ఎవరు ఉన్నారనే విషయం నాకు తెలియదు. నేను కోజికోడ్‌లో పోలీస్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేశాను. ఆయన ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకొని విచారిస్తామని చెప్పారు. తొలుత ఈ లేఖ వచ్చాక నేను పెద్దగా పట్టించుకోలేదు. కానీ, కొంతమంది అనుభవజ్ఞులు ఇచ్చిన సలహా మేరకు నేను పోలీసులకు ఫిర్యాదు చేశాను' అని ఆయన తెలిపారు. ఇటీవల ముస్లిం యువతను తప్పుదోవ పట్టించేలా రామనుణ్ణి రచనలు చేస్తున్నారని, వారికి విరుద్ధంగా రచనలు చేస్తున్న ఆయన వెంటనే ముస్లిం మతంలోకి మారాల్సిందేనని లేదంటే కాళ్లు, చేతులు నరికేస్తానని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement