
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని వైఎస్సార్ కాం గ్రెస్ పార్టీలో పలు నియామకాలు చేపట్టారు. పార్టీని నమ్ముకొని దివంగత మహానేత వైఎస్సార్ ఆశయాల సాధనకు అహర్నిశలు శ్రమిస్తున్నవారికి కీలకబాధ్యతలు అప్పగించారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ తెలంగాణ అధ్యక్షుడు డాక్టర్ గట్టు శ్రీకాంత్‌రెడ్డి క్రియాశీలంగా పనిచేస్తున్న నాయకులను ఆయా జిల్లాల పార్టీ అధ్యక్షులుగా నియమించారు.
లింగారెడ్డి జస్వంత్‌రెడ్డి(వనపర్తి జిల్లా అధ్యక్షుడు), ముల్కల గోవర్ధన్‌శాస్త్రి (పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు), అప్పం కిషన్ (జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు), షేక్ తజ్ముల్ హుస్సేన్ (నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు), మహ్మద్ సయ్యద్ ముఖ్తార్(వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శిగా), వేమిరెడ్డి రోషిరెడ్డి(వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శిగా, ఖమ్మం టౌన్ ఇన్‌చార్జ్), జన్ను విల్సన్ రాబర్ట్ (వరంగల్ ఈస్ట్ నియోజకవర్గ కోఆర్డినేటర్‌గా), మాజిద్‌ఖాన్ (చాంద్రాయణగుట్ట నియోజకవర్గ కోఆర్డినేటర్‌గా) నియమితులయ్యారు.
ఆ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. పదవుల్లో నియమితులైనవారు తక్షణమే జిల్లాల్లో ప్రజాసమస్యలపై పోరాటాలకు సిద్ధపడాలని శ్రీకాంత్‌రెడ్డి సూచించారు. లక్ష ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకరావటానికి జూలై 25న రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో, ఆగస్టు 2న అన్ని కలెక్టరేట్ల వద్ద ధర్నాలు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమాలను కొత్త నాయకత్వం ప్రత్యేకశ్రద్ధతో విజయవంతం చేయాలని సూచించారు.