
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ కాలేజి అథ్లెటిక్స్ మీట్‌లో భవన్స్ శ్రీ అరబిందో జూనియర్ కాలేజి సత్తా చాటింది. గచ్చిబౌలిలో జరిగిన ఈ చాంపియన్‌షిప్‌లో బాలుర, బాలికల విభాగాల్లో ఓవరాల్ చాంపియన్‌గా నిలిచింది. భవన్స్ కాలేజి వరుసగా ఐదోసారి ఈ టోర్నీలో ఓవరాల్ చాంపియన్‌గా నిలవడం విశేషం. ఈసారి 13 స్వర్ణాలు, 17 రజతాలు, 9 కాంస్యాలను భవన్స్ కాలేజి జట్లు సాధించాయి. భవన్స్ కాలేజి తరఫున రాహుల్ శర్మ (800 మీ. పరుగు), వి. సనత్ రెడ్డి (110 మీ. హర్డిల్స్), సూరజ్ (400 మీ. హర్డిల్స్), అజయ్ జోషి (డిస్కస్ త్రో), పి. శ్రీచరణ్ రెడ్డి (హైజంప్), బి. అనంతు (హ్యామర్ త్రో), సచిన్ పిళ్లై (5 కి.మీ నడక), బాలుర 4–100 మీ. రిలే, 4–400 మీ. రిలే, జి. దివ్యశ్రీ (200 మీ.), ఐశ్వర్య (400 మీ.), ఎన్. అపూర్వ (లాంగ్‌జంప్), ప్రణీత (3 కి.మీ నడక) పసిడి పతకాలను గెలుచుకున్నారు.
ఇతర ఈవెంట్‌ల విజేతల వివరాలు
బాలురు: 100 మీ. పరుగు: 1. జి. చైతన్య, 2. ఎ. సాయి చందు, 3. షాన్వాజ్ అహ్మద్; బాలికలు: 1. హర్షిత, 2. జి. దివ్యశ్రీ, 3. బి. శ్రీలత. 200 మీ. పరుగు: 1. ఆర్. శశివర్ధన్, 2. ఎ. సాయి చందు, 3. జె. నరేశ్; బాలికలు: 1. జి.దివ్యశ్రీ, 2. కిరణ్మయి, 3. అంజలి సింగ్. 400 మీ. పరుగు: 1. ఆర్.శశివర్ధన్, 2. జె. నరేశ్, 3. బి. దివాకర్; బాలికలు: 1. ఎ.కీర్తి, 2. కె. గంగోత్రి, 3. అంజలి సింగ్. 800 మీ. పరుగు: 1. రాహుల్ శర్మ, 2. బి. శ్రీశైలం, 3. భరత్ కుమార్; బాలికలు: 1. ఎ. కీర్తి, 2. ఎ. తరుణి, 3. ప్రాచి బజాజ్. 110 మీ. హర్డిల్స్ బాలురు : 1. వి. సనత్ రెడ్డి, 2. బి. దివాకర్, 3. సిద్ధార్థ్. 100 మీ. హర్డిల్స్ బాలికలు: 1. కసక్, 2. ఐశ్వర్య, 3. అపూర్వ. 400 మీ. హర్డిల్స్: 1. సూరజ్, 2. జె. నరేశ్, 3. బి.దివాకర్; బాలికలు: 1. ఐశ్వర్య, 2. పి. సౌమ్య, 3. కె. మాధురి. షాట్‌పుట్: 1. బి. వంశీ, 2. కె. శ్రీను, 3. పి. రోహిత్; బాలికలు: 1. శ్రీ రజిత, 2. టి. సింధు ప్రీతి, 3. బి. అనూష. డిస్కస్ త్రో: 1. అజయ్ జోషి, 2. పి. వంశీ, 3. గౌతమ్; బాలికలు: 1. నిఖిత, 2. టి. సింధు ప్రీతి, 3. శ్రీ రజిత. లాంగ్‌జంప్: 1. షాన్వాజ్ అహ్మద్, 2. శ్రీచరణ్, 3. ఆర్. శామ్యూల్; బాలికలు: 1. ఎన్. అపూర్వ, 2. టి. శ్రీలక్ష్మి, 2. అరుణ జ్యోతి, 3. కిరణ్మయి. ట్రిపుల్ జంప్: 1. ఆర్. శామ్యూల్, 2. శ్రీచరణ్, 3. వి. సనత్ రెడ్డి; బాలికలు: 1. బి. శ్రీలత, 2. టి. శ్రీలక్ష్మి, 3. శ్రీబృంద. హైజంప్: 1. పి. శ్రీచరన్ రెడ్డి, 2. ఆర్. శామ్యూల్, 3. సూర్య; బాలికలు: 1. కసక్, 2. ఎన్. అపూర్వ, 3. ఆపేక్ష.
జావెలిన్ త్రో: 1. పి. వంశీ, 2. పి. రోహిత్, 3. అజయ్ జోషి; బాలురు: 1. బి. సింధుప్రీతి, 2. జేఎన్ భవాని, 3. డి. భవాని. హ్యామర్ త్రో: 1. బి. అనంతు, 2. కె. మదన్, 3. సి. వశీ; బాలికలు: 1. కె. రుషిత, 2. డి. రుషిత, 3. బి. అనూష. 1500 మీ.: 1. పవన్ తేజ, 2. టి. రాజేశ్, 3. కె. శ్రీధర్; బాలికలు: 1. ఎ. కీర్తి, 2. కె. గంగోత్రి, 3. శ్రావణి.
3 కి.మీ వాక్ బాలికలు: 1. ఎం. ప్రణీత, 2. తేజశ్రీ, 3. సుజన్. 5 కి.మీ వాక్: 1. సచిన్, 2. బి.రోహిత్ కుమార్, 3. మహేశ్‌బాబు. 4–100 మీ. రిలే:1. భవన్స్ కాలేజి, 2. ఓబుల్ రెడ్డి కాలేజి, 3. హెచ్‌పీఎస్. బాలికలు: 1. భవన్స్ కాలేజి, 2. టీఎస్‌డబ్ల్యూఆర్‌ఐఎస్, 3. ఓబుల్ రెడ్డి. 4–400 మీ. రిలే: 1. భవన్స్ కాలేజి, 2. రైల్వేస్ కాలేజి, 3. ఓబుల్ రెడ్డి; బాలికలు: 1. భవన్స్ కాలేజి, 2. కస్తూర్బా జూనియర్ కాలేజి.
Comments
Please login to add a commentAdd a comment