
కోల్‌కతా: తనకు ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్ వార్నే ఆదర్శమని అంటున్నాడు టీమిండియా చైనామన్ బౌలర్(ఎడమచేతి మణికట్టు స్పిన్నర్) కుల్దీప్ యాదవ్. ఇక అతని సమక్షంలో బౌలింగ్ చేయాల్సి వస్తే ఆ మజానే వేరని కుల్దీప్ తెలిపాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో కోల్‌కతా నైట్‌రైడర్స్ తరపున ఆడుతున్నకుల్దీప్ ఆకట్టుకుంటున్నాడు.
వార్న్ మెంటార్‌గా ఉన్న రాజస్తాన్ రాయల్స్‌తో ఇటీవల జరిగిన మ్యాచ్‌లో కుల్దీప్ నాలుగు వికెట్లతో సత్తాచాటాడు. దీనిలో భాగంగా మాట్లాడిన కుల్దీప్.. ‘నేను వార్న్‌కు పెద్ద అభిమానిని. అతడే నాకు ఆదర్శం. వార్న్ సమక్షంలో బౌలింగ్ చేసినప్పుడల్లా ఎంతో స్ఫూర్తి పొందుతా. రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో చెలరేగి బౌలింగ్ చేయడానికి వార్నే కారణం’ అని కుల్దీప్ స్పష్టం చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment