
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ ఇంటర్ కాలేజి అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో సెయింట్ ఆన్స్ మహిళా కాలేజి (మెహదీపట్నం), ప్రభుత్వ వ్యాయామ విద్య కాలేజి (జీసీపీఈ, దోమల్‌గూడ) జట్లు సత్తా చాటాయి. గచ్చిబౌలిలో జరిగిన ఈ టోర్నీలో ఈ రెండు జట్లు టీమ్ చాంపియన్‌షిప్‌ను ౖకైవసం చేసుకున్నాయి. మహిళల విభాగంలో సెయింట్ ఆన్స్ (57 పాయింట్లు), జీసీపీఈ (29 పాయింట్లు), లయోలా అకాడమీ (22 పాయింట్లు) వరుసగా తొలి మూడు స్థానాలను సాధించాయి. పురుషుల విభాగంలో జీసీపీఈ 52 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకోగా, నిజాం కాలేజి (28 పాయింట్లు), హెచ్‌జీపీఎం కాలేజి (27 పాయింట్లు) తర్వాతి స్థానాల్లో నిలిచాయి. అమ్లాన్ బోర్గెహెన్ (అవినాశ్ కాలేజి), జి. నిత్య (సెయింట్ ఆన్స్) ‘బెస్ట్ అథ్లెట్’ పురస్కారాలను అందుకున్నారు.
ఇతర ఈవెంట్‌ల విజేతల వివరాలు
100 మీ. పరుగు: మహిళలు: 1. జి. నిత్య, 2. ఎస్. సుజాత, 3. ఎం. తేజస్విని; పురుషులు: 1. అమ్లాన్ బోర్గెహెన్, 2. కె. రాము, 3. ఎం. అరుణ్.
400 మీ. మహిళలు: 1. పి. సుష్మితా రాణి, 2. కె. ప్రత్యూష, 3. ఎన్. సుచిత్ర; పురుషులు: 1. శ్రవణ్ కుమార్, 2. డీఎస్ రాహుల్, 3. పి. యశ్వంత్ సాయి.
1500 మీ. మహిళలు: 1. ఎన్. సుచిత్ర, 2. బి. సంధ్య, 3. కె. మౌనిక; పురుషులు: 1. వి. మారుతి, 2. బి. వెంకటప్ప, 3. కె. నరేశ్.
3000 మీ. స్టీపుల్ చేజ్: 1. వి. శ్రీనివాస్, 2. బి. ప్రశాంత్, 3. బి. రంగయ్య.
10000 మీ. మహిళలు: 1. ఆర్. కలైవాణి, 2. పి. రజిత, 3. పి. తేజస్వి; పురుషులు: 1. బి. రమేశ్, 2. పి. మహిపాల్, 3. బి. రంగయ్య.
హ్యామర్ త్రో: 1. కె. నాగ అనూష, 2. యాస్మిన్, 3. ఎం. అంబిక; పురుషులు: 1. అన్వేష్, 2. అంకిత్ పాథక్, 3. జె. అమరేందర్.
ట్రిపుల్ జంప్ మహిళలు: 1. హిజ్రత్, 2. మోహన రవళి, 3. డి. మానస; పురుషులు: 1. పీఎన్. సాయికుమార్, 2. శ్రీకాంత్ రెడ్డి, 3. ఆర్. సతీశ్.
హైజంప్: 1. సీహెచ్ మోహన రవళి, 2. పి. స్రవంతి, 3. బి. ఉషారాణి.
జావెలిన్ త్రో పురుషులు: 1. రత్నాకర్, 2. కృష్ణారెడ్డి, 3. ఆర్. శ్రీనివాస్.
4–100మీ. రిలే పురుషులు: 1. జీసీపీఈ, 2. నిజాం కాలేజి, 3. లయోలా అకాడమీ; మహిళలు: 1. జీసీపీఈ, 2. నిజాం కాలేజి, 3. లయోలా అకాడమీ.
Comments
Please login to add a commentAdd a comment