ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: హైదరాబాద్ జిల్లా స్కూల్ గేమ్స్ సమాఖ్య ఇంటర్ కాలేజి అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో రైల్వే జూనియర్ కాలేజి సత్తాచాటింది. బాలుర విభాగంలో ఓవరాల్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను గెలుచుకుంది. వ్యక్తిగత విభాగంలో 15 పాయింట్లు సాధించిన పి.గోపాల్ చాంపియన్‌షిప్‌ను సొంతం చేసుకున్నాడు. 800 మీ. 1500 మీ. 400 మీ హర్డిల్స్‌లో అతను అగ్రస్థానంలో నిలిచాడు.
400 మీటర్లలో సాయిరామ్ రెండో స్థానంలో; లాంగ్‌జంప్, ట్రిపుల్ జంప్‌లో దుర్గాప్రసాద్ మూడో స్థానంతో సంతృప్తిపడ్డాడు. భరత్ కుమార్ 200 మీటర్లలో రెండో స్థానంలో; 800 మీటర్లలో మూడో స్థానంలో నిలిచాడు. హైజంప్‌లో రూడీ స్టాన్లీ అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. 4ఁ100 మీ. రిలేలో పరమేశ్, సాయిరామ్, రాకేష్, గోపాల్ బృందం విజేతగా నిలవగా; దుర్గా ప్రసాద్, సాయిరామ్, హేమంత్ సావిన్ కుమార్‌ల జట్టు మూడో స్థానంతో సరిపెట్టుకుంది.
రైల్వే జట్టుకు అథ్లెటిక్స్ టీమ్ టైటిల్
Published Sat, Nov 30 2013 11:46 PM | Last Updated on Sat, Sep 2 2017 1:08 AM
Advertisement
Advertisement