
ఆ ఛాన్స్ వస్తే వదులుకోను: ఆఫ్రిది
సీనియర్ ఆల్ రౌండర్ షాహిద్ ఆఫ్రిది మరోసారి పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు నాయకత్వం వహించాలని కోరుకుంటున్నాడు.
సీనియర్ ఆల్ రౌండర్ షాహిద్ ఆఫ్రిది మరోసారి పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు నాయకత్వం వహించాలని కోరుకుంటున్నాడు. కెప్టెన్ ఛాన్స్ వస్తే వదులుకోనని 17 ఏళ్లుగా పాక్ టీమ్కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఆఫ్రిది చెప్పాడు. జాతీయ జట్టుకు సారథిగా ఉండడం గొప్ప గౌరవంగా భావిస్తానని అన్నాడు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) తనను కెప్టెన్గా ఉండమని కోరితే మరో ఆలోచన లేకుండా అంగీకరిస్తానని వెల్లడించాడు.
జట్టులో స్థానానికి పోటీ ఎక్కువగా ఉందని చెప్పాడు. దక్షిణాఫ్రికా సిరిస్లో సీనియర్లు స్థాయిమేరకు రాణించాలన్నాడు. పీసీబీతో విభేధాల కారణంగా టి20, వన్డే జట్టు కెప్టెన్ పదవి నుంచి 2011లో ఆఫ్రిదిని తొలగించారు. అప్పటి నుంచి మళ్లీ అతడికి నాయకత్వ పగ్గాలు అప్పగించలేదు. అయితే దక్షిణాఫ్రికాతో జరగనున్న సిరీస్కు మిస్బాను తప్పించి ఆఫ్రిదిని కెప్టెన్గా నియమిస్తారని పీసీబీ వర్గాలు అంటున్నాయి.