
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ ఇంటర్ కాలేజి అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో ఇ. సురేశ్, పి.కావ్య సత్తా చాటారు. గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి స్టేడియంలో జరుగుతోన్న ఈ టోర్నీలో 800మీ. పరుగులో వీరిద్దరూ స్వర్ణా లను సాధించారు. పురుషుల 800మీ. పరుగులో వివేకానంద ప్రభుత్వ కాలేజీకి చెందిన సురేశ్ విజేతగా నిలవగా... కె. అజయ్ కుమార్ (ఎస్పీ కాలేజి), ఎం. రాము (జీసీపీఈ) వరుసగా రెండు, మూడు స్థానాలను దక్కించుకున్నారు. మహిళల విభాగంలో పి. కావ్య (ఎస్.ఎన్. వనిత), ఎన్. సుచిత్ర (సెయింట్ ఆన్స్), ఎ. కీర్తి (భవన్స్ కాలేజి) వరుసగా స్వర్ణ, రజత, కాంస్యాలను గెలుచుకున్నారు. నిజాం కాలేజి ఆధ్వర్యంలో జరుగుతోన్న ఈ టోర్నీ ప్రారంభోత్స వంలో శాట్స్ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్‌రెడ్డి, ఉస్మానియా యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ఎల్. రామచంద్రారావు ముఖ్య అతిథులుగా విచ్చేసి పోటీలను ప్రారంభించారు. క్రీడాకారుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో నిజాం కాలేజి ప్రిన్సిపాల్ ఎల్.బి. లక్ష్మీకాంత్ రాథోడ్, ఓయూ ఐయూటీ సెక్రటరీ ప్రొఫెసర్ బి. సునీల్ కుమార్ పాల్గొన్నారు.
ఇతర ఈవెంట్‌ల విజేతల వివరాలు
లాంగ్ జంప్: 1. పి. శ్రీకాంత్ రెడ్డి (లయోలా), 2. ఆర్. సతీశ్ (జీసీపీఈ), 3. తేజ (బీజేఆర్).
షాట్‌పుట్: 1. జె. సంధ్య (జీసీపీఈ), 2. ఎం. అంబిక (జీసీపీఈ), 3. ఎం. సుమన (బీవీసీ).
మహిళల 4–400మీ. రిలే : 1. సెయింట్ ఆన్స్, 2. జీసీపీఈ, 3. భవన్స్ వివేకానంద డిగ్రీ కాలేజి.
పురుషుల 4–400మీ. రిలే: 1. నిజాం కాలేజి, 2. జీసీపీఈ, 3. హిందీ మహావిద్యాలయ.
షాట్‌పుట్: 1. అలెక్స్ జోసెఫ్ (బీవీసీ), 2. శ్రీశైలం (ఎస్‌డీసీపీఈ), 3. మోహన్‌లాల్ (ఓయూ పీజీ కాలేజి).
లాంగ్‌జంప్: 1. ఎస్‌కే హిజ్రత్ (ఓసీపీఈ), 2. ఇరిన్ దిల్నా (సెయింట్ పాయ్స్), 3. రమా వాసవి (వెస్లీ డిగ్రీ కాలేజి).
400మీ. హర్డిల్స్: 1. బి. మమత (నిజాం కాలేజి), 2. హఫీజా బేగం (సెయింట్ ఆన్స్), 3. పి. ప్రియ (జీసీపీఈ). 200మీ. పరుగు: 1 జి. నిత్య (సెయింట్ ఆన్స్), 2. ఆర్. భవాని (కేశవ్ మెమోరియల్), 3. దివ్యశ్రీ (డీవీఎం).
Comments
Please login to add a commentAdd a comment