నేడు 70 పోలీసు బృందాల బందోబస్తు
Published Tue, Dec 31 2013 12:41 AM | Last Updated on Wed, Oct 17 2018 4:29 PM
న్యూఢిల్లీ: నూతన సంవత్సర వేడుకల సందర్భంగా అల్లర్లను, ట్రాఫిక్ ఇబ్బందులను అరికట్టడానికి 70 ట్రాఫిక్ పోలీసు బృందాలను మోహరించినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. మంగళవారం సాయంత్రం 7 గంటల నుంచి వేడుకలు ముగిసే వరకు వీరు విధుల్లో కొనసాగుతారని పోలీసులు తెలిపారు. నూతన సంవత్సర వేడుకల సందర ్బంగా మద్యం సేవించి వాహనాలను నడిపే వారిని అదుపు చేయడానికి ఈ బృందాలు నగర వ్యాప్తంగా నిఘా, తనిఖీలు కొనసాగిస్తాయన్నారు.
పీసీఆర్ వాహనాలు మెహ్రోలీ, సాకేత్, వసంత్‌విహార్, సౌత్ ఎక్స్‌టెన్షన్, రాజౌరీగార్డెన్, పీతంపుర, లక్ష్మీనగర్, మయూర్ విహార్ ప్రాంతాల్లో మంగళవారం సాయంకాలం నుంచి ఈ బలగాలు మోహరిస్తాయి. సాకేత్, ఎం-బ్లాక్, గ్రేటర్ కైలాష్ మార్కెట్, చిరాగ్ ఢిల్లీ, న్యూ ఫ్రెండ్స్ కాలనీ, డిఫెన్స్ కాలనీ తదితర ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. కన్నాట్‌ప్లేస్, మండీహౌస్, బెంగాలీ మార్కెట్, రంజిత్ సింగ్ ఫ్లైఓవర్, మింటో రోడ్డు, దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ మార్గ్, చెమ్స్‌ఫోర్డ్ రోడ్డు, న్యూఢిల్లీ రైల్వే స్టేషన్, ఆర్‌కే ఆశ్రమ్ మార్గ్, ఫిరోజ్‌షా రోడ్డు క్రాసింగ్, జైసింగ్ రోడ్డు, బంగ్లాసాహిబ్ లేన్ మార్గాల్లో సాయంత్రం ఏడు గంటల నుంచి ఎటువంటి పబ్లిక్, ప్రైవేట్ వాహనాలను అనుమతించమని ప్రకటించారు. కన్నాట్ ప్లేస్ ప్రాంతంలో పార్కింగ్ వసతి ముందువచ్చిన వారికి ముందు ప్రాతిపాదికన కేటాయిస్తామన్నారు.
Advertisement