ఆంధ్రప్రదేశ్లో కీలకమైన ఐఏఎస్ అధికారులు కొందరిని బదిలీ చేశారు. పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎ.గిరిధర్ను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) కార్యదర్శిగా బదిలీ చేశారు.
ఆంధ్రప్రదేశ్లో కీలకమైన ఐఏఎస్ అధికారులు కొందరిని బదిలీ చేశారు. పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎ.గిరిధర్ను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) కార్యదర్శిగా బదిలీ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని మాస్టర్ ప్లాన్ తయారీ వ్యవహారంలో మంత్రి నారాయణ వైఖరితో గిరిధర్ తీవ్రంగా విభేదించారు.
రాజమండ్రిలో రాజధాని సీడ్ క్యాపిటల్ మాస్టర్ ప్లాన్ను సింగపూర్ అందజేసినప్పుడు ఆ కార్యక్రమానికి ఉన్నతాధికారులు అందరూ హాజరైనా.. గిరిధర్ మాత్రం గైర్హాజరయ్యారు. ఇదే అసంతృప్తి కారణంగా ఆయన 20 రోజులుగా సెలవులో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఆయనను అత్యంత కీలకమైన పట్టణాభివృద్ధి శాఖ నుంచి అంత ప్రాధాన్యం లేని ఏపీపీఎస్సీకి పంపడం గమనార్హం.
బదిలీల్లో భాగంగా కరికాల వల్లవన్కు పౌరసరఫరాల శాఖ అదనపు బాధ్యతలు అప్పగించారు. అలాగే శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరు సబ్ కలెక్టర్గా పి.గిరీషను నియమించారు.