అనాథ యువతికి నిశ్చితార్థం | orpan young girl gets Engagement Under the Bethel charity | Sakshi
Sakshi News home page

అనాథ యువతికి నిశ్చితార్థం

Feb 4 2015 8:36 AM | Updated on Sep 2 2017 8:47 PM

అనాథ యువతికి నిశ్చితార్థం కార్యక్రమంలో ఏంపీపీ, తదితరులు పాల్గొన్న దృశ్యం

అనాథ యువతికి నిశ్చితార్థం కార్యక్రమంలో ఏంపీపీ, తదితరులు పాల్గొన్న దృశ్యం

దోమకొండ మండల కేంద్రానికి చెందిన పిట్ల విజయ అనే అనాథ యువతికి నిశ్చితార్థం చేసి ఉదారతను చాటుకున్నారు.

ఉదారతను చాటుకున్న స్వచ్ఛంద సంస్థనిజామాబాద్: జిల్లాలోని దోమకొండ మండల కేంద్రానికి చెందిన పిట్ల విజయ అనే అనాథ యువతికి నిశ్చితార్థం చేసి ఉదారతను చాటుకున్నారు స్వచ్ఛంద సంస్థవారు. దోమకొండకు చెందిన పిట్ల విజయ తల్లితండ్రులు పది సంవత్సరాల క్రితం చనిపోగా, బేతేల్ స్వచ్చంధ సంస్థవారి ఆనాథాశ్రమంలో ఉంటోంది. ప్రస్తుతం ఇంటర్మీడియట్ చదువుతున్న యువతికి నిజామాబాద్‌కు చెందిన రాజుతో మంగళవారం నిశ్చితార్థం చేయించినట్లు సంస్థ నిర్వహకులు దాస్ ఏల్లం తెలిపారు.

ఏంపీపీ గంగు బాలరాజవ్వ, గ్రామ సర్పంచ్ దీకొండ శారద, పలువురు పెద్దల సమక్షంలో వారి నిశ్చితార్థం జరిపామని, త్వరలోనే వివాహం కూడా జరుపుతామన్నారు. ఈసందర్బంగా సంస్థ నిర్వహకులు దాస్ ఏల్లం, విక్టోరియ సుగుణలను ఏంపీపీతో పలువురు అభినందించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement