
సౌర విద్యుత్ విధానానికి టీ కేబినెట్ ఆమోదం
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో సౌర విద్యుత్ విధానానికి శ్రీకారం చుట్టేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. సచివాలయంలో మంగళవారం సాయంత్రం ప్రారంభమైన తెలంగాణ కేబినెట్ భేటీ ముగిసింది.
కొత్త విద్యుత్ ప్లాంట్ల నిర్మాణాలకు, బీహెచ్ఈఎల్ తో ఒప్పందాలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గృహ నిర్మాణ విధానానికి మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ఓపెన్ బిడ్డింగ్ విధానంలోనే ఇళ్లు నిర్మించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. శాసనమండలి ఎన్నికల నిర్వహణ, డబుల్ బెడ్‌రూం ఇళ్లు, పారిశ్రామిక విధానం మొదలైన అంశాలపై చర్చించారు.