కోల్‌సిటీ :
గోదావరిఖని జీఎం కాలనీలో శనివారం అనుమానాస్పద స్థితిలో హత్యకు గురైన చింతల సులోచన మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చేతులు, కాళ్లను తాళ్లతో బంధించి.. మెడ కోసి హత్య చేసిన ఆనవాళ్లు ఉండడం వెనుక తెలిసినవారి ప్రమేయముం దా..? లేక దుండగులా చేశారా..? అనేది ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు ఆమెను దుండగులు పథకం ప్రకారమే హత్య చేసి అనం తరం కారంపొడి చల్లారని స్థానికులు అను మానిస్తుండడం ఈ కేసులో కొత్త కోణం.
అనేక సందేహాలు..
దారుణ హత్యకు గురైన సులోచన ఇంటి నుంచి ఎలాంటి అరుపులూ వినిపించలేదని స్థానికులు చర్చించుకుంటున్నారు. వంటింట్లో చాపపై పడుకోబెట్టి ఉండడం, ఇంట్లోని గదులన్నీ కా రం పొడి చల్లిఉండడం.. ఒంటిపై ఉన్న బంగా రు ఆభరణాలు.. బీరువాలో ఖరీదైన చీరలున్నా వాటిని ముట్టుకోకుండా కేవలం బీరువాలోని బంగారు ఆభరణాలు మాత్రమే దోచుకెళ్లడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఎప్పుడూ లాకర్‌లో ఉంచే బంగారు ఆభరణాలు బీరువాలోకి ఎలా వచ్చాయి..? ఆ విషయం హత్య చేసిన వారికి ఎలా తెలిసింది..? అనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది. సులోచన ఇల్లు రహదారి సమీపంలోనే ఉంది. ప్రజలు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. అయినా హత్య చేసినవారు అంత సులువుగా ఎలా పారిపోయారో తెలియడం లేదు. పైగా ఇంటి వెనకాల రక్తం మరకలను బక్కెట్లోని నీటితో కడుక్కున్న ఆనవాళ్లు కనిపించాయి.
పోస్టుమార్టంపైనే అందరి దృష్టి
సులోచన మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన డాక్టర్లు పూర్తి నివేదిక కోసం కొన్ని అవయవాలను ఫొరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. హత్య సమంలో ఆమె ఎలా ఉంది.. ? ఆమెను ఏదైనా ఆహార పదార్థంలో మత్తు మందు కలిపి తినిపించి హత్య చేశారా..? లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా..? అనే కోణంలో విచారణ చేస్తున్నారు. పోస్టుమార్టం నివేదికకు 15 రోజులు పడుతుందని సమాచారం.
సెల్‌ఫోన్ కాల్‌లిస్ట్‌పై ఆరా
సులోచన సెల్‌ఫోన్ కనిపించకుండాపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. నిందితులు సంఘటనకు ముందే సులోచనకు ఫోన్ చేసైనా ఉండాలి..? లేదా ఆమెతో తరు చూ మాట్లాడేవారైనా ఉండాలి..? అనే కోణం లో పోలీసులు ఆరా తీస్తున్నారు. మిస్సింగ్ అయిన సులోచన సెల్‌ఫోన్‌పై నిఘా పెట్టిన పోలీసులు.. కాల్‌లిస్ట్ సేకరిస్తున్నట్లు సమాచా రం. హత్యకు ముందు రెండ్రోజులుగా సులోచనకు ఎవరెవరు ఎన్నిసార్లు ఫోన్ చేశారో..? సులోచన ఫోన్ నుంచి ఎవరెవరికి ఎన్నికాల్స్ వెళ్లాయో తెలుసుకుంటున్నారు. కాల్‌లిస్టు సమాచారం కోసం ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించారు.
స్వగ్రామంలో అంత్యక్రియలు
గోదావరిఖని ప్రభుత్వాస్పత్రిలో ఆదివారం పోస్టుమార్టం అనంతరం ఆమె మృతదేహాన్ని స్వగ్రామమైన జమ్మికుంట సమీపంలోని చెల్పూర్‌కు తీసుకెళ్లారు. అక్కడ ఆమెకు కుటుంబసభ్యులు, బంధువులు అంత్యక్రియలు నిర్వహించారు.
తెలిసినవారా..? దుండగులా..?
Published Mon, Nov 3 2014 4:07 AM | Last Updated on Sat, Sep 2 2017 3:46 PM
Advertisement
Advertisement