
బంగారు గని కూలి 12 మంది మృతి
జకర్తా: ఇండోనేసియాలో అక్రమ తవ్వకాలు జరుపుతుండగా బంగారు గని కూలడంతో కనీసం 12 మంది మరణించారు. మంగళవారం జావా ప్రావిన్స్లో ఈ దుర్ఘటన జరిగినట్టు పోలీసులు తెలిపారు. మరణించవారందరూ మైనర్లు.
భద్రత చర్యలు తీసుకోకపోవడమే ప్రమాదానికి కారణమని పోలీసులు చెప్పారు. గని కూలడంతో ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోయి ఉంటారని తెలిపారు. 10 నుంచి 30 మీటర్ల లోతున కూరుకుపోయినట్టు చెప్పారు. నెల రోజుల క్రితం స్థానిక యంత్రాంగం ఈ గనిని మూసివేసింది. అయితే మైనర్లు అక్రమంగా తవ్వకాలు జరుపుతుండగా ప్రమాదం జరిగింది.