
ఔరంగజేబు రోడ్డుకు కలాం పేరు
దేశ రాజధాని ఢిల్లీలో ఉన్నత వర్గాలు నివసించే ఔరంగజేబు రోడ్డు పేరు మార్చారు. దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పేరు దానికి పెట్టారు.
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఉన్నత వర్గాలు నివసించే ఔరంగజేబు రోడ్డు పేరు మార్చారు. దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పేరు దానికి పెట్టారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ట్విటర్ ద్వారా తెలిపారు. ఔరంగజేబు రోడ్డుకు కలాం పేరు పెట్టాలని ఎన్ఎండీసీ నిర్ణయించిందని ప్రకటించారు. కేంద్ర హోంశాఖ ఆమోదంతో సెంట్రల్ ఢిల్లీ పౌర పాలకవర్గం ఈ నిర్ణయం తీసుకుంది.
కాగా కేజ్రీవాల్ ట్వీట్ ను పెద్ద సంఖ్యలో రీ-ట్వీట్ చేశారు. బీజేపీ మద్దతుదారులు ఆయనపై విమర్శలు గుప్పించారు. బీజేపీ నాయకుల ప్రతిపాదనను తనదిగా కేజ్రీవాల్ ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు. ఔరంగజేబు రోడ్డుకు కలాం పేరు పెడతామని ప్రధాని నరేంద్ర మోదీ ఈనెలారంభంలోనే ప్రకటించారని బీజేపీ నేత మహేశ్ గిరీ గుర్తు చేశారు. అబ్దుల్ కలాం జూలై 27న కన్నుమూశారు.