Orissa
-
మృత్యువులోనూ వీడని బంధం
కొరాపుట్: ఆ దంపతులను మృత్యువు వెంటాడింది. రైల్వేట్రాక్ దాటుతుండగా రెండు రైళ్లు వేర్వేరు ట్రాకుల నుంచి ఒకేసారి దూసుకురావడంతో ఎటు వెళ్లాలో తెలియక అయోమయానికి గురయ్యారు. ఈ క్రమంలో రైలు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందారు. ఈ విషాద ఘటన బుధవారం కొరాపుట్ జిల్లా లక్ష్మీపూర్ రైల్వే స్టేషన్‌కు కిలోమీటరు దూరంలో ఉన్న బుయిపట్న గ్రామ సమీపంలో చోటుచేసుకుంది. ఇదే సమితిలోని బుర్జా గ్రామానికి చెందిన బురస ఖోర (60), జమున ఖోర (59) గిరిజన గ్రామాల్లో ఎండు చేపలు అమ్మకం చేస్తుంటారు. ఎప్పట్లాగే బుధవారం కూడా చేపలు అమ్మేందుకు వెళ్లి రైల్వే ట్రాక్ దాటుతుండగా డీఎంయూ రైలు ఒక వైపు, గూడ్స్ రైలు మరోవైపు ఒకేసారి వచ్చాయి. ట్రాక్ పై ఉండగా ఎటువైపు వెళ్లాలో తెలియని సమయంలో డీఎంయూ రైలు దంపతులను ఢీకొట్టుకుంటూ వెళ్లిపోయింది. దీంతో ఇద్దరూ ఘటనా స్థలంలోనే మృతిచెందారు. విషయం తెలుసుకున్న రైల్వే అధికారుల, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. రైలు ఢీకొని దంపతుల మృత్యువాత ట్రాక్ దాటుతుండగా దూసుకొచ్చిన రెండు రైళ్లు -
41 ఎకరాలలో గంజాయి పంట ధ్వంసం
కొరాపుట్: కొరాపుట్ జిల్లాలో 41 ఎకరాల్లో అక్రమంగా సాగవుతున్న గంజాయి పంటను అధికారులు గుర్తించి బుధవారం ధ్వంసం చేశారు. నందపూర్ సమితి పాడువ పోలీస్‌స్టేషన్ పరిధిలో శిఖరపుట్, బి.మాలిపుట్ గ్రామాల మధ్య అటవీ ప్రాంతంలో సాగవుతున్న గంజాయి పంటను గుర్తించారు. ఎకై ్సజ్, డీవీఎఫ్, పోలీసులు సంయుక్తంగా గంజాయి మొక్కలను నరికి తగలబెట్టారు. సుమారు 57,400 గంజాయి మొక్కలన ధ్వంసం చేసినట్టు అధికారులు ప్రకటించారు. మత్తిలి సమితిలో 24 ఏకరాల్లో.. మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా మత్తిలి సమితి మడ్కపోధర్ పంచాయతీ శుక్రీపూట్ గ్రామం అడవీ ప్రాంతంలో సాగవుతున్న గంజాయి తోటలను ఎకై ్సజ్ పోలీసులు బుధవారం గుర్తించారు. ఈ సందర్భంగా 24 ఏకరాల్లో సాగవుతున్న గంజాయి తోటలను ధ్వంసం చేశారు. మొత్తం 36 వేల గంజాయి మొక్కలను తొలగించి కాల్చివేశారు. దీని విలువ మూడు కోట్ల ఆరవై వేల రూపాయలు ఉంటుందని ఎకై ్సజ్ డిప్వూటీ ఇన్స్పెక్టర్ టంకధర్ భోయి తెలిపారు. ఈ ఘటనపై మత్తిలి ఎకై ్సజ్ పోలీసుస్టేషన్లో కేసు నమోదు చేశారు. అలాగే గంజాయి తోటలను సాగు చేస్తున్న భూమి ఎవరిదో పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాలని రెవెన్యూశాఖ అధికారులను అదేశించారు. దర్యాప్తు అనంతరం భూమికి చెందిన వ్యక్తులపై చర్యలు తీసుకుంటామన్నారు. దాడిలో ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్ సతీష్ కుమార్ బాల, సబ్ ఇన్స్పెక్టర్ అషితా కుమార్, నాయక్, దీలిప్ కుమార్ సమాల్, ఏఎస్ఐ రామ్చంద్రహంతాల్ తదితరులు ఉన్నారు. -
యంత్రాలతో వ్యవసాయం లాభదాయకం
స్థాయిలో ప్రదర్శిస్తున్నట్లు వెల్లడించారు. పంటల కోసేందుకు దేశీయ పద్ధతిలో ఎకరాకు పది నుంచి పన్నెండు మంది మనుషులను వినియోగించటం జరుగుతుందని, అందువలన అధిక ఖర్చు, సమయం వెచ్చించాల్సి వస్తుందన్నారు. ఒక యంత్రం ఒక గంటలో 3, 4 క్వింటాళ్లు పుష్టికర ఆహార వ్యవసాయ పంటల కోత కోసి పరిశుభ్ర పరుస్తుందన్నారు. పాత పద్ధతిలో చేతులతో పంటలు కోసి నూర్పుడి చేస్తే గంటకు కేవలం 2, 3 కేజీలు మాత్రం చేయగలరన్నారు. ఇటీవల ఒడిశా వ్యవసాయ వైజ్ఞానిక విశ్వవిద్యాలయం వారు గంటలో చోళ్లు పంట కోత కోసి 80 కేజీలు పరిశుభ్రపరచారని ఉదహరించారు. రాష్ట్రంలో అధికంగా చోళ్లు, ఇతర పౌష్టికాహార పంటలు పండించేందకు అధునూతన యంత్రాలు అవసరమన్నారు. ఒడిశాలో మెట్ట ప్రాంతాలలో పౌష్టికాహార పంటలు, పథకం ప్రయోగాత్మకంగా కొరాపుట్, నవరంగపూర్, నువాపడ, ఖెంజూర్, సుందరఘడ్ జిల్లాల్లో పరిశోధనలు, రైతులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ యంత్ర వినియోగ కోఆర్డినేటర్ సంగ్రామ కేశర స్వై, వ్యవసాయ వైజ్ఞానికులు డాక్టర్ ప్రసాద్ కముడి, ఎం.ఎస్.స్వామినాథన్ రిసెర్చ్ కేంద్రం డైరెక్టర్ ప్రశాంత కుమార్ పరిడ, శ్రీఅన్న అభిజాన్ యోజన అధికారి తాపస రంజన్ రాయ్, పలువురు వ్యవసాయ విబాగ సిబ్బంది, పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.జయపురం: వ్యవసాయంలో యంత్రాలను వినియోగిస్తే రైతులకు లాభదాయకమని కొరాపుట్ కలెక్టర్ వి.కీర్తి వాసన్ అన్నారు. ఎం.ఎస్.స్వామినాథ్న్ రిసెర్చ్ ఫౌండేషన్ జయపురం, ఒడిశా వ్యవసాయ విజ్ఞాన విశ్వవిద్యాలయం, ఇక్రిసాట్ సంస్థల సంయుక్తంగా కొరాపుట్ జిల్లా మచ్చర గ్రామంలో బుధవారం పంటలు కోసే యంత్రాలను క్షేత్ర ప్రదర్శన చేపట్టాయి. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం మిలెట్ మిషన్ ద్వారా (నేడు శ్రీఅన్నఅభిజాన్ యోజన) గత 5 ఏళ్ల కాలంలో చేపట్టిన పౌష్టికాహార వ్యవసాయం ప్రపంచ దేశాలను అమితంగా ఆకట్టుకుందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 100 వ్యవసాయ ఉత్పాతన సంఘాల ద్వారా పుష్టికర వ్యవసాయం కోసం యంత్రాల అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో చిన్న, మధ్య తరగతి రైతులు చిన్న, చిన్న యంత్రాలను వినియోగిస్తున్నారన్నారు. ఎక్కువ భూమిలో పండించే పంటలను కోసేందుకు పెద్ద యంత్రాల వినియోగం అవసరమన్నారు. ఒడిశా వ్యవసాయ, విజ్ఞాన విశ్వవిద్యాలయం ద్వారా పరిశోధనలు చేసి విత్తనాలు నాటే యంత్రాలు, పంటలు కోసే యంత్రాలు, పంటను పరిశుభ్రపరచే యంత్రాలు వినియోగించటం జరుగుతుందని వెల్లడించారు. జిల్లా వ్యవసాయ అధికారి ప్రదీప్ కుమార్ మహంతి మాట్లాడుతూ ముఖ్యంగా సుందరఘడ్, సంబల్పూర్ జిల్లాల్లో చిరు ధాన్యాలు, కొరాపుట్, డెంకానల్ జిల్లాల్లో చోళ్లు(మండియ) పంటలకు దుక్కులు దున్నటం, విత్తులు నాటేందుకు, పంటలు కోసేందుకు ప్రయోగాత్మకంగా యంత్రాలు వినియోగంపై పరీక్ష మూలకంగా క్షేత్ర -
ఉత్తమ రైతుకు సన్మానం
పర్లాకిమిడి: గజపతి జిల్లా మోహానా బ్లాక్ కోంకరడా గ్రామానికి చెందిన రైతు సారంగో శోబోరును మిల్లెట్ మిషన్ సమావేశంలో ముఖ్యమంత్రి మోహాన్ చరణ్ మఝి సన్మానించారు. కోంకరడా గ్రామస్తులు సంతోషించారు. గజపతి జిల్లాలో అత్యధికంగా పండిస్తున్న మోహానా బ్లాక్‌లో కోంకరడా గ్రామావాసి సారంగో శోబోరో తన ఐదు ఎకరాల పొలంలో రాగులు పండించారు. గత ఏడాది జిల్లా వ్యవసాయ అధికారులు, మిల్లెట్ మిషన్ అధికారుల మన్ననలను పొందారు. ఆయన పేరును రాష్ట్ర మిల్లెట్ మిషన్‌కు సిఫారసు చేయగా.. భువనేశ్వర్‌కు పిలిచి స్వయంగా ముఖ్యమంత్రి అవార్డును ప్రదానం చేశారు. -
హుండీ ఆదాయం లెక్కింపు
రాయగడ: జిల్లాలోని కళ్యాణసింగుపూర్‌లో జగన్నాథ మందిరంలో హుండీ ఆదాయాన్ని బుధవారం లెక్కించారు. కానుకల రూపంలో రూ.40051 ఆదాయం వచ్చినట్టు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ రంజన్ కుమార్ మానసెఠి, మందిర నిర్వాహక కమిటీ అధ్యక్షులు నరసింహ పాఢి, సభ్యులు గుడ్ల ప్రసాదరావు, గోపాల్ శెఠి పెంటియా, పాలకొండ పటి, శ్రీనివాస్ చౌదరి, మావుడి బారిక్, ఆర్ఐ గౌరి కొండగిరి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు వైద్య పరీక్షలు రాయగడ: జాతీయ ఫార్మసీ వారోత్సవాల్లో భాగంగా స్థానిక సెంచూరియన్ పబ్లిక్ స్కూల్లో విద్యార్థులకు బుధవారం వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సెంచూరియన్ విశ్వవిద్యాలయం డైరెక్టర్ డాక్టర్ రాజేష్ పాడి, ఫార్మసీ విభాగం అధ్యక్షులు డాక్టర్ చంద్రశేఖర్ పాత్రో, నర్సింగ్ విభాగానికి చెందిన కె.ఊర్మిల, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. నలుగురు దోపిడీ దొంగలు అరెస్టు జయపురం: దోపిడీ కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు జయపురం సబ్ డివిజన్ కుంధ్రా పోలీసు స్టేషన్ అధికారి బుధవారం తెలిపారు. నిందితుల వద్ద నుంచి రూ.3000 నగదు, బైక్, ఐదు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అరెస్టయిన వారిలో తర్గెయ్ గ్రామానికి చెందిన రంజన్ కెచప్, కలియగాం గ్రామానికి చెందిన ఆలియ హరిజన్, రవీంద్ర టకిరి, తెర్జి గ్రామానికి కయినా నాయిక్ ఉన్నారు. వీరంతా ఈ నెల 9న మల్కనగిరి జిల్లా నెం.వి 39 గ్రామానికి చెందిన భారత్ ఫైనాన్స్ మేనేజర్ సులోచనరంజన్ హల్దార్‌ను అడ్డగించి నగదు, ఇతర వస్తువులు దోచుకున్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేసి బుధవారం కోర్టులో హాజరుపరచినట్లు వెల్లడించారు. ప్రమాదానికి గురైన వ్యాన్ ● డ్రైవర్‌కు గాయాలు జయపురం: జిల్లాలోని 26వ జాతీయ రహదారి జయపురం–బొరిగుమ్మ మధ్య ఉమ్మిరి వద్ద మంగళవారం అర్ధరాత్రి దాటిన తరువాత రెండు గంటల సమయంలో రోడ్డు ప్రమాదం సంభవించింది. వ్యాన్ ప్రమాదానికి గురికావడంతో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన వ్యక్తిని ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన నాగేష్ కుమార్ మహిలింగ(30)గా గుర్తించారు. అతడిని 108 అంబులెన్స్‌లో జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలిచారు. రాయిపూర్ నుంచి పార్శిల్లతో వస్తున్న వ్యాన్ ఉమ్మిరి వంతెన ప్రాతంలో వంతెన కంచెను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని వ్యాన్‌లో చిక్కుకున్న డ్రైవర్ నాగేష్‌ను బయటకు తీసి రక్షించారు. జయపురం సదర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
గజపతి జిల్లాలో పడిపోయిన ఉష్ణోగ్రతలు
పర్లాకిమిడి: గజపతి జిల్లాలో ఏజెన్సీ ప్రాంతాలైన మోహానా, చంద్రగిరి, మహేంద్రగడ, రామగిరి, ఆర్.ఉదయగిరిలలో నాలుగు రోజులుగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. పగటి పూట ఎండకాస్తున్నప్పటికీ సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆర్.ఉదయగిరి, మహేంద్రగడ, మోహానా, చంద్రగిరిలో మంచు కురుస్తున్నది. బుధవారం చంద్రగిరి, మోహానా, సరిహద్దు ఫుల్భాణీలో 18 డిగ్రీల చొప్పున ఒడిశాలో ఫుల్భానీ జిల్లా దరింగిబడిలో 16 డిగ్రీల పగటి పూట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాబోయే రోజుల్లో పగటి పూట ఉష్ణోగ్రతలు 15 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోతాయని ఐఎండీ మాజీ డైరెక్టర్ డాక్టర్ శరత్ చంద్ర సాహు తెలిపారు. ఈనెల 24న తమిళనాడులో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండడంతో దక్షిణ ఒడిశాలో చలితీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. ఉన్ని దుస్తులకు గిరాకీ చలితీవ్రత పెరగడంతో జనం వెచ్చదనాన్ని ఇచ్చే ఉన్ని దుస్తులు కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో పర్లాకిమిడిలోని పలు ప్రాంతాల్లో వీటి విక్రయాలు ప్రారంభమయ్యాయి. జనంఉన్ని దుస్తులు కొనుగోలు చేస్తూ చలినుంచి రక్షించుకుంటున్నారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం
రాయగడ: జిల్లాలోని కళ్యాణసింగుపూర్ సమితి బొలొదియా గ్రామ సమీపంలో మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. సమితిలోని టికిరపడ పంచాయతీ టికరపొడ గ్రామానికి చెందిన మహేశ్వర్ హుయిక, మధుహుయిక, శ్యాంభ కడ్రకలు ఒకే బైకుపై సెరిగుమ్మ గ్రామానికి తమ బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా బైక్ అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో శ్యాంభ కడ్రక(26) అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన మహేశ్వర్, మధులను కళ్యాణసింగుపూర్ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో నలుగురికి గాయాలు పర్లాకిమిడి: రోడ్డు ప్రమాదంలో నలుగురు గాయపడ్డారు. గజపతి జిల్లా మోహానా బ్లాక్ పిండికి రోడ్డు వద్ద బుధవారం ఉదయం రెండు బైక్‌లు ఢీకున్న ఘటనలో వీరికి గాయాలయ్యాయి. తీవ్ర గాయాలైన అభిజిత్ శోబోరో, మార్క్మండళ్తోపాటు మరో ఇద్దరిని మోహానా పీహెచ్‌సీకి స్థానికులు తరలించగా డాక్టర్లు చికిత్స అందజేశారు. మోహానా పోలీసు అధికారి (ఐఐసీ) బసంత్ కుమార్ సెఠి రెండు బైక్‌లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. డిసెంబర్ 18 నుంచి పల్లెశ్రీ మేళాపర్లాకిమిడి: డిసెంబరు 18 నుంచి 25 వరకూ గజపతి స్టేడియంలో జరగనున్న జిల్లా స్థాయి పల్లెశ్రీ మేళాను విజయవంతం చేయాలని కలెక్టర్ బిజయకుమార్ దాస్ కోరారు. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ, సి.డి.ఎం. గుణనిధి నాయక్, సబ్ కలెక్టర్ అనుప్ పండా, అదనపు ముఖ్యకార్వనిర్వహణ అధికారి పృథ్వీరాజ్ మండల్, ఓర్మాస్ అధికారి సోభులోకుమార్ జనమణితో కలిసి కలెక్టరేట్లో సమావేశం నిర్వహించారు. పల్లెశ్రీ మేళాలో భాగంగా స్టేడియంలో 200 స్టాల్స్ ఏర్పాటుచేయాలని, జిల్లాలోని మహిళా స్వయం సహాయక గ్రూపుల ఉత్పత్తులు ప్రదర్శించాలని కలెక్టర్ ఆదేశించారు. -
సంక్షేమ పథకాల అమలులో.. సహకార సంస్థలది కీలక పాత్ర
జయపురం: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందజేయటంలో సహకార సంస్థలు ప్రధాన భూమిక వహించాలని కొరాపుట్ వెమ్మెల్యే రఘునాథ్ మచ్చ పిలుపునిచ్చారు. స్థానిక కొరాపుట్ కేంద్ర సహకార బ్యాంక్ (కేసీసీ బ్యాంక్) సభాగృహంలో జిల్లా సహకార విభాగంవారు 71వ అఖిల భారత సహకార వారోత్సవాలు బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కొరాపుట్ జిల్లాలో కాపీ, మత్య్స, చోడి, వివిధ మసాలాలు, ఇతర పంటలు పండించి వాటిని సహకార సంస్థలతో మార్కెట్ చేయాలన్నారు. అలా జరిగినప్పుడే రైతులు లబ్ధిపొంది ఆర్థిక ఉన్నతి జరుగుతుందన్నారు. దీనికి సహకార సంస్థలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. సహకార ఉద్యమంలో సీనియర్ కార్యకర్త బొరిగుమ్మ వాసి లాలూ మణిసింగ్, జయపురం సహకార బ్యాంక్ ఉత్తమ మేనేజర్ సుధాంశు శేఖర పాడీ, ఉత్తమ బ్రాంచ్ మేనేజర్ మనోజ్ కుమార్ దాస్‌లను ఎమ్మెల్యే సన్మానించారు. సహకార ఉద్యమంపై విద్యార్థులకు నిర్వహించిన వ్యాస రచన, వక్తృత్వ తదితర పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. ఉత్తమ సహకార సంస్థల ఉద్యోగులకు, జిల్లాలో 11 ఉత్తమ సహకార సంస్థలకు బహమతులు అందించారు. కొరాపుట్ కేంద్ర సహకారం బ్యాంక్ అధ్యక్షుడు, ఇంజినీర్ ఈశ్వర చంద్ర పాణిగ్రహీ అధ్యక్షతన జరిగిన సహకార వారోత్సవాలలో బ్యాంక్ సీనియర్ డైరెక్టర్ రమాకాంత రౌళొ, డీఆర్‌సీఎస్ భీమ సేన్ సాహు, వారోత్సవాల పరిచాలన కమిటీ ఉపాధ్యక్షుడు దృపద భొత్ర, బ్యాంక్ కార్యదర్శి హరిశ్చంద్ర బొనగాడి, నబార్డ్ డీడీఎం దేవేంద్ర కుమార్ ప్రధాన్ అతిథిలుగా హాజరయ్యారు. సహకార సంఘ విభాగ ఎస్ఆర్సీఎస్ శశికాంత దాస్, మరో ఎస్ఆర్సీఎస్ బిద్యాధర్ బెహర, కొరాపుట్ సహకార శిక్షణ కేంద్ర ప్రిన్సిపాల్ అక్షయ కుమార్ పాత్రో, బ్యాంక్ సిబ్బంది ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. కొరాపుట్ ఎమ్మెల్యే రఘునాథ్ మచ్చ -
ఆశ్రమ పాఠశాల సందర్శన
● 141 బియ్యం బస్తాలు మాయమైనట్లు గుర్తింపు..మల్కన్‌గిరి: జిల్లాలోని మల్కన్‌గిరి సమితి పద్మాగిరి పంచాయతీలో ఉన్న షెడ్యూల్డ్ తెగకు చేందిన ఆశ్రమ పాఠశాలను మల్కన్‌గిరి ఎమ్మెల్యే నర్సింగ్ మడ్కమి సందర్శించారు. విద్యార్థులకు సరైన సదుపాయాలు కల్పించకపోవడంతో పాఠశాల సిబ్బందిపై మండిపడ్డారు. తరగతి గదులను, విద్యార్థుల హాజరును పరిశీలించారు. 7వ తరగతి విద్యర్థులకు స్వయంగా పాఠం బోధించారు. 6, 7వ తరగతి విద్యార్థుల సంఖ్యతో ఎందుకు తేడాలున్నాయని హెచ్ఎం లక్ష్మణ్ పాత్సాని ప్రశ్నించారు. అనంతరం వసతి గృహన్ని సందర్శించారు. అక్కడ మరుగుదొడ్లు అపరిశుభ్రంగా ఉండటంతో విద్యార్థుల పరిస్థితిని చూసి చలించిపోయారు. ఇలా ఉంటే రోగాలబారిన పడాతారని, అందుచేత వీలైనంత త్వరాగా శుభ్రం చేయించండని ఆదేశించారు. వంటశాలను చూడగా పిల్లల కోసం ఉంచిన 141 బియ్యం బస్తాలు మాయమైనట్లు గుర్తించారు. వీటిగూర్చి ఉపాధ్యాయుడితో చర్చించారు. ఇక్కడ పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నట్లు గుర్తించారు. ఇలాంటి అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మల్కన్‌గిరి జిల్లా అదనపు కలెక్టర్ సోమనాథ్ ప్రదాన్, మల్కన్‌గిరి సమితి వైస్ ప్రెసిడెంట్ నిరంజర్ హల్ద్ర్, సత్య సర్యపాల్ పాల్గొన్నారు. -
350 కిలోల నిషేధిత ప్లాస్టిక్ ఉత్పత్తులు స్వాధీనం
విజయనగరం: విజయనగరం కార్పొరేషన్ పరిధిలో నిషేధిత ప్లాస్టిక్ వస్తువుల విక్రయాలపై దాడులు నిర్వహించిన ప్రజారోగ్య విభాగ బృందం 350 కేజీల ప్లాస్టిక్ సామగ్రిని స్వాధీనం చేసుకుంది. ఈ మేరకు బుధవారం ప్రజారోగ్య అధికారి డాక్టర్ కొండపల్లి సాంబమూర్తి ఆధ్వర్యంలో పీడబ్ల్యూ మార్కెట్లో వివిధ ప్లాస్టిక్ విక్రయాల దుకాణాలపై దాడులు నిర్వహించి సింగిల్ యూస్ ప్లాస్టిక్ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. నగరంలో ఒకసారి మాత్రమే వినియోగించే ప్లాస్టిక్ వస్తువులను నిషేధించినట్లు ప్రజారోగ్య శాఖ అధికారి డాక్టర్ కొండపల్లి సాంబమూర్తి ఈ సందర్భంగా తెలిపారు. పలుమార్లు హెచ్చరించినా ప్లాస్టిక్ విక్రయదారుల్లో మార్పు రావడం లేదన్నారు. ఈ మధ్యనే 560 కేజీల ప్లాస్టిక్ సామగ్రిని స్వాధీనం చేసుకున్నామని, మళ్లీ పీడబ్ల్యూ మార్కెట్లో కొందరు నిషేధిత ప్లాస్టిక్‌ను విక్రయిస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు దాడులు చేపట్టామన్నారు. ప్రజారోగ్యానికి, పర్యావరణానికి తీవ్ర విఘాతం కలిగించే ప్లాస్టిక్ విక్రయాలను తక్షణమే నిలిపివేయాలని కోరారు. అలాగే ప్రజలు కూడా క్యారీ బ్యాగులు కాకుండా కాటన్ సంచులు వినియోగించుకోవాలని సూచించారు. ఇకపై నిషేధిత ప్లాస్టిక్ విక్రయాలు సాగిస్తే భారీ అపరాధ రుసుములతో పాటు దుకాణాలను కూడా సీజ్ చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ప్రజారోగ్య పర్యవేక్షకులు, కార్యదర్శులు, మేసీ్త్రలు పాల్గొన్నారు. -
యంత్రాలతో వ్యవసాయం లాభదాయకం
స్థాయిలో ప్రదర్శిస్తున్నట్లు వెల్లడించారు. పంటల కోసేందుకు దేశీయ పద్ధతిలో ఎకరాకు పది నుంచి పన్నెండు మంది మనుషులను వినియోగించటం జరుగుతుందని, అందువలన అధిక ఖర్చు, సమయం వెచ్చించాల్సి వస్తుందన్నారు. ఒక యంత్రం ఒక గంటలో 3, 4 క్వింటాళ్లు పుష్టికర ఆహార వ్యవసాయ పంటల కోత కోసి పరిశుభ్ర పరుస్తుందన్నారు. పాత పద్ధతిలో చేతులతో పంటలు కోసి నూర్పుడి చేస్తే గంటకు కేవలం 2, 3 కేజీలు మాత్రం చేయగలరన్నారు. ఇటీవల ఒడిశా వ్యవసాయ వైజ్ఞానిక విశ్వవిద్యాలయం వారు గంటలో చోళ్లు పంట కోత కోసి 80 కేజీలు పరిశుభ్రపరచారని ఉదహరించారు. రాష్ట్రంలో అధికంగా చోళ్లు, ఇతర పౌష్టికాహార పంటలు పండించేందకు అధునూతన యంత్రాలు అవసరమన్నారు. ఒడిశాలో మెట్ట ప్రాంతాలలో పౌష్టికాహార పంటలు, పథకం ప్రయోగాత్మకంగా కొరాపుట్, నవరంగపూర్, నువాపడ, ఖెంజూర్, సుందరఘడ్ జిల్లాల్లో పరిశోధనలు, రైతులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ యంత్ర వినియోగ కోఆర్డినేటర్ సంగ్రామ కేశర స్వై, వ్యవసాయ వైజ్ఞానికులు డాక్టర్ ప్రసాద్ కముడి, ఎం.ఎస్.స్వామినాథన్ రిసెర్చ్ కేంద్రం డైరెక్టర్ ప్రశాంత కుమార్ పరిడ, శ్రీఅన్న అభిజాన్ యోజన అధికారి తాపస రంజన్ రాయ్, పలువురు వ్యవసాయ విబాగ సిబ్బంది, పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.జయపురం: వ్యవసాయంలో యంత్రాలను వినియోగిస్తే రైతులకు లాభదాయకమని కొరాపుట్ కలెక్టర్ వి.కీర్తి వాసన్ అన్నారు. ఎం.ఎస్.స్వామినాథ్న్ రిసెర్చ్ ఫౌండేషన్ జయపురం, ఒడిశా వ్యవసాయ విజ్ఞాన విశ్వవిద్యాలయం, ఇక్రిసాట్ సంస్థల సంయుక్తంగా కొరాపుట్ జిల్లా మచ్చర గ్రామంలో బుధవారం పంటలు కోసే యంత్రాలను క్షేత్ర ప్రదర్శన చేపట్టాయి. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం మిలెట్ మిషన్ ద్వారా (నేడు శ్రీఅన్నఅభిజాన్ యోజన) గత 5 ఏళ్ల కాలంలో చేపట్టిన పౌష్టికాహార వ్యవసాయం ప్రపంచ దేశాలను అమితంగా ఆకట్టుకుందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 100 వ్యవసాయ ఉత్పాతన సంఘాల ద్వారా పుష్టికర వ్యవసాయం కోసం యంత్రాల అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో చిన్న, మధ్య తరగతి రైతులు చిన్న, చిన్న యంత్రాలను వినియోగిస్తున్నారన్నారు. ఎక్కువ భూమిలో పండించే పంటలను కోసేందుకు పెద్ద యంత్రాల వినియోగం అవసరమన్నారు. ఒడిశా వ్యవసాయ, విజ్ఞాన విశ్వవిద్యాలయం ద్వారా పరిశోధనలు చేసి విత్తనాలు నాటే యంత్రాలు, పంటలు కోసే యంత్రాలు, పంటను పరిశుభ్రపరచే యంత్రాలు వినియోగించటం జరుగుతుందని వెల్లడించారు. జిల్లా వ్యవసాయ అధికారి ప్రదీప్ కుమార్ మహంతి మాట్లాడుతూ ముఖ్యంగా సుందరఘడ్, సంబల్పూర్ జిల్లాల్లో చిరు ధాన్యాలు, కొరాపుట్, డెంకానల్ జిల్లాల్లో చోళ్లు(మండియ) పంటలకు దుక్కులు దున్నటం, విత్తులు నాటేందుకు, పంటలు కోసేందుకు ప్రయోగాత్మకంగా యంత్రాలు వినియోగంపై పరీక్ష మూలకంగా క్షేత్ర -
బాధిత కుటుంబానికి సాయం
రాయగడ: ఆర్థిక ఇబ్బందుల కారణంగా తొమ్మిది రోజుల పసికందును 20 వేల రుపాయలకు విక్రయించడం విచారకరమని, ఇటువంటి ఘటనలు చోటుచేసుకోకుండా జిల్లా యంత్రాంగం పటిష్ట చర్యలు చేపట్టాలని రాయగడ ఎమ్మెల్యే అప్పలస్వామి కడ్రక అన్నారు. బుధవారం నువాపడ బస్తీలో పర్యటించి బిడ్డను విక్రయించిన తల్లిదండ్రులను పరామార్శించారు. వారి ఆర్థిక పరిస్థితులను తెలుసుకుని బియ్యం, నిత్యావసర వస్తువులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లాలో ఇటువంటి దారుణ సంఘటన చోటుచేసుకోవడం సిగ్గుచేటన్నారు. అధికారులు కేవలం కార్యాలయాలకే పరిమితం కాకుండా ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు క్షేత్రస్థాయిలోనూ పర్యటించాలన్నారు. పసికందు విక్రయంపై అసెంబ్లీలో ప్రస్తావించి ప్రభుత్వ దృష్టికి తీసుకువెళతానని చెప్పారు. జేకేపేపర్ మిల్లు వంటి పరిశ్రమ ఉన్నప్పటికీ నిరుద్యోగ సమస్య వెంటాడటంతో రోజురోజుకూ వలసలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కొద్దిరోజుల కిందట కంధమాల్ జిల్లాలో మామిడి టెంకల జావ తాగి మృత్యువాత పడిన ఘటనను గుర్తు చేశారు. ఇప్పటికై నా ప్రభుత్వం కళ్లుతెరవాలని కోరారు. -
గిరిజన వర్సిటీని త్వరగా పూర్తి చేయాలి
● మంత్రి లోకేష్ ప్రకటన విరమించుకోవాలి ● ఉత్తరాంధ్ర అభివృద్ది వేదిక ప్రధాన కార్యదర్శి అజశర్మవిజయనగరం పూల్‌బాగ్/మెంటాడ : గిరిజన యూనివర్సిటీ నిర్మాణం యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని, గిరిజన యూనివర్సిటీని కొత్తవలస వద్ద రెల్లి గ్రామం వద్దకు మారుస్తామని మంత్రి లోకేష్ అసెంబ్లీలో చేసిన ప్రకటనను విరమించుకోవాలని ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి ఎ.అజశర్మ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన మెంటాడ మండలంలోని కుంటినవలసలో నిర్మాణంలో ఉన్న గిరిజన యూనివర్సిటీ పనులను పరిశీలించారు. అనంతరం విజయనగరంలోని ఎన్పీఅర్ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర విభజన చట్టంలోని గిరిజన యూనివర్సిటీ నిర్మాణం లో తీవ్ర జాప్యం జరిగిందన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వాలు మారినప్పుడల్లా దీని స్థలాన్ని మార్చడంతో నేటికీ కుంటినవలస వద్ద వర్సిటీ నిర్మాణం ప్రారంభ దశలోనే ఉందన్నారు. నేడు మళ్లీ దీన్ని కొత్తవలస మండలంలో రెల్లి వద్ద అప్పుడు సేకరించిన స్థలంలోనే నిర్మిస్తామని ఈ నెల 13 న రాష్ట్ర అసెంబ్లీలో మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించారన్నారు. ప్రతిసారీ మార్చడం అవివేకం మత్రి ప్రకటిన వల్ల వర్సిటీ నిర్మాణం మరింత ఆలస్యమవుతుంది తప్ప మరొకటి కాదన్నారు. గత ప్రభుత్వం రెల్లి నుంచి ఇక్కడికి మార్చిందని, ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఇలా స్థలాలు మార్చుకోవడం భావ్యం కాదని హితవు పలికారు. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న దీనిని మార్చడం అంటే అవివేకం తప్ప మరొకటి కాదని ఎద్దేవా చేశారు. గిరిజనులకు 50 శాతం సీట్లు కేటాయించాలి ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక కేంద్ర విద్యా శాఖ మంత్రికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఇంకే మాత్రం జాప్యం చేయకుండా మెంటాడలోనే దీనిని నిర్మించాలని లేఖలు రాశామన్నారు. గిరిజనులకు 50శాతం సీట్లు కేటాయించేలా చట్టబద్ధత ఏర్పాటు చేయాలని కూడా ఆ లేఖలో కోరినట్లు తెలిపారు. బుధవారం తమ బృందం యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ టి. శ్రీనివాసన్‌ను కలిసి చర్చించినట్లు చెప్పారు. ఎస్టీ అసెంబ్లీ నియోజక వర్గం సాలూరులో భాగంగా ఉన్న మెంటాడ మండలంలోని కుంటినివలస గ్రామం వద్ద దీని నిర్మాణం యుద్ధ ప్రాతిపదికన 2025 లోగా పూర్తి చేయాలని, శాశ్వత సిబ్బందిని నియమించి, అన్ని కోర్సులను అందుబాటులోకి తేవాలని, గిరిజనులకు 50శాతం సీట్లు కేటాయించేలా చట్టబద్ధ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆర్గనైజింగ్ కార్యదర్శి ఎంఎస్ వాసా, ఉపాధ్యక్షురాలు కె. విజయ గౌరి, గిరిజన సంఘం విజయనగరం జిల్లా కార్యదర్శి టి. సోములు, మన్యం జిల్లా కార్యదర్శి సీదిరి అప్పారావు, వ్యవసాయ సంఘం జిల్లా కార్యదర్శి రాకోటి రాము, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు రాము, జగదీష్, రవికుమార్, కాంతారావు, గ్రామ సర్పంచ్ రమేష్, వెంకటరావు తదితరులు పాల్గొన్నారు. -
చిల్లంగి నెపంతో దాడి
● రాజకీయ కక్ష అంటూ పోలీసులకు బాధితుల ఫిర్యాదు బొబ్బిలి: ‘నిత్యం కడుపునొప్పి వస్తోంది. నువ్వు రోజూ కలలో కనిపిస్తున్నావు. నువ్వే చిల్లంగి పెట్టిఉంటావు’’ అంటూ వైఎస్సార్సీపీ పంచాయతీ వార్డు మెంబర్ భర్తపై అదే గ్రామానికి చెందిన టీడీపీ సర్పంచ్ అనుచరుడు దాడి చేశాడు. అంతే కాకుండా బాధితుడి భార్య వార్డు మెంబర్పైనా దూషణలకు దిగాడు. బొబ్బిలి మండలం కొండదేవుపల్లి గ్రామంలో రెండురోజుల క్రితం జరిగిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. ఇన్నాళ్లూ గ్రామంలోనే ఉన్న వార్డు మెంబర్ భర్తపై లేనిపోని ఆరోపణలను టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక రాజకీయ కక్షలతో దాడులకు దిగడం దారుణమని స్థానికులు విమర్శిస్తున్నారు. ఈ దాడిపై స్థానిక వైఎస్సార్సీపీ నాయకులకు చెప్పి భార్యాభర్తలిద్దరూ కన్నీళ్లు పెట్టుకున్నారు. దీనిపై గ్రామ పెద్దలతో కలిసి బుధవారం బొబ్బిలి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు క్యాంపు కార్యాలయానికి వెళ్లి మొరపెటుకున్నారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని వేడుకున్నారు. దీంతో శంబంగి పోలీసులకు ఫోన్‌చేసి ఇదేం సంప్రదాయం? ఇలాగేనా రాజకీయ కక్షలు తీర్చుకుంటారు. ఈ రోజుల్లో కూడా చిల్లంగి వంటి పాతనమ్మకాలను అడ్డంపెట్టుకుని రాజకీయకక్షలు సాధిస్తారా? ఈ సంఘటనపై చర్యలు తీసుకోవాలని కోరారు. దాడి వెనుక నేపథ్యం..! కొండదేవుపల్లిలో పంచాయతీ వార్డు మెంబర్ల స్థానాలు వైఎస్సార్ సీపీ, టీడీపీకి సమానంగా వచ్చాయి. ఇందులో బొమ్మరిల్లు అప్పలనర్సమ్మ కూడా ఉన్నారు. వారిలో ఒకరు టీడీపీలోకి వస్తే ఉప సర్పంచ్ పదవి వస్తుందని అప్పలనర్సమ్మను టీడీపీ వారు ప్రలోభపెట్టారు. దీనికి ఆమె, ఆమె భర్త వ్యతిరేకించారు.మేం వైఎస్సార్సీపీకి మద్దతు దారులం. ఎప్పుడైనా పార్టీ మారేది లేదని తెగేసి చెప్పారు. అప్పటి నుంచి కక్ష పెంచుకున్న టీడీపీ నాయకులు ఇలా కక్ష తీర్చుకుంటున్నారని స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు తెలియజేస్తున్నారు. -
పిల్లలను నిరంతరం పర్యవేక్షించాలి
● బాలల హక్కుల కమిషన్ రాష్ట్ర చైర్మన్ అప్పారావు విజయనగరం ఫోర్ట్: పిల్లలను నిరంతరం పర్యవేక్షించాలని బాలల హక్కుల కమిషన్ రాష్ట్ర చైర్మన్ కేసలి అప్పారావు అన్నారు. ఈ మేరకు బాలల వారోత్సవాల ముగింపు సందర్భంగా కలెక్టరేట్లో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బాలికలపై లైంగిక దాడులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బాలికలపై లైంగిక దాడులు జరగడం దురదృష్టకరమన్నారు. బాలికలు చెడు స్నేహాలు, సెల్ఫోన్లకు దూరంగా ఉండాలని హితవు పలికారు. విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేఽశించుకుని దాన్ని సాధించడానికి కృషి చేయాలని కోరారు. విద్యార్థులపై తల్లిదండ్రులకంటే ఉపాధ్యాయలకు బాధ్యత ఎక్కువని స్పష్టం చేశారు. బాలికల విద్యాభివృధ్ధికి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ మాట్లాడుతూ పండిట్ జవహర్లాల్ పుట్టిన రోజు నవంబర్ 14న బాలల దినోత్సవం జరుపుకుంటామని, గతంలో బాలలకు హక్కులు గురించి చెప్పేవారు ఉండేవారు కాదన్నారు. నేడు బాలల హక్కులు గురించే తెలియజేసే అనేక సంస్థలు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. సాంకేతికత చాలా అభివృద్ధి చెందిందని, సాంకేతికతను మంచికి ఉపయోగించాలని పిలుపునిచ్చారు. చదువుపై విద్యార్థులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. అనంతరం శిశు గృహ వారు ఊయల కార్యక్రమంపై రుపొందించిన వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. బాలల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన, క్విజ్ వివిధ క్రీడా పోటీల్లో రాణించిన విద్యార్థులకు మెమెంటోలు అందజేశారు. సమావేశంలో బాలల సంక్షేమ కమిటీ చైర్మన్ హిమబిందు, సభ్యులు చిట్టిబాబు, ఐసీడీఎస్ పీడీ బి.శాంతకుమారి, డీసీపీయూ యాళ్ల నాగరాజు, శిశు గృహ మేనేజర్ త్రివేణి, పీఓఐసీ బి.రామకోటి పాల్గొన్నారు. -
కొనసాగుతున్న నేత్ర వైద్య పరీక్షలు
పార్వతీపురంటౌన్: కంటివెలుగు కార్యక్రమంలో భాగంగా జిల్లా అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో పార్వతీపురం మన్యం జిల్లా వ్యాప్తంగా సచివాలయాల పరిధిలో నేత్ర వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని డాక్టర్ నగేష్ రెడ్డి అన్నారు. ఈ మేరకు స్థానిక జిల్లా ఆస్పత్రిలో బుధవారం వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు నేత్ర పరీక్షలు, వైద్య చికిత్సలు చేసి ఉచితంగా మందుల పంపిణీ, దృష్టి దోషం ఉన్న వారికి ఉచితంగా శస్త్ర చికిత్సలు నిర్వహించి కంటి చూపు కాపాడాల్సిన బాధ్యత జిల్లా అంధత్వ నివారణ సంస్థ చేపడుతుందని చెప్పారు. నేత్ర సమస్యలు ఉన్నవారిని గుర్తించి వారికి ఉచితంగా శస్త్ర చికిత్సల కోసం పుష్పగిరి కంటి ఆస్పత్రి, జెమ్స్ ఆస్పత్రి, పాలకొండ, పార్వతీపురం ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించి నిర్వహిస్తామన్నారు. వారందరికీ ఉచిత రవాణా, వసతి, భోజనం, కళ్ల జొళ్లు, మందుల సౌకర్యాలు కల్పిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో నేత్ర వైద్య అధికారులు, కంటి వైద్య సహాయకులు, ఆరోగ్య కార్యకర్తలు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు. -
సైబర్ నేరాల నియంత్రణకు సహకరించాలి
● బ్యాంకు అధికారులకు ఎస్పీ ఎస్.వి.మాధవ్‌రెడ్డి సూచనపార్వతీపురంటౌన్: సైబర్ నేరాల నియంత్రణకు బ్యాంకు అధికారులు, సిబ్బంది సహకరించాలని ఎస్పీ ఎస్.వి.మాధవ్‌రెడ్డి కోరారు. ఎస్పీ కార్యాలయంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న వివిధ బ్యాంకుల్లో పని చేస్తున్న బ్యాంకు మేనేజర్లతో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సైబర్ నేరాలపై దర్యాప్తుచేసే పోలీస్ అధికారులకు అవసరమైన సమాచారం ఇచ్చేందుకు బ్యాంకర్లు సహకరించాలని కోరారు. బ్యాంకుల వద్ద భద్రత, సీసీ కెమెరాల ఏర్పాటుపై సమీక్షించారు. సైబర్ నేరాల్లో ఉమ్మడి విజయనగరం జిల్లాకు చెందిన బాధితులు 2023లో రూ.1,15,27,069లు, 2024లో రూ.21,85,79,595లు పోగొట్టుకున్నారన్నారు. రానున్న రోజుల్లో ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందన్నారు. నేరాలు తగ్గుముఖం పట్టేలా, నగదు పోగొట్టుకున్న బాధితులకు న్యాయంచేసే దిశగా బ్యాంకు అధికారులు, పోలీస్ వారు సమన్వయంతో తగు చర్యలు తీసుకోవాలని కోరారు. నిరక్షరాస్యులు, గిరిజన ప్రాంతవాసులను సైబర్ నేరగాళ్లు మోసం చేస్తున్నారన్నారు. పూర్తి ఆధారాలు సేకరించాకే బ్యాంకు ఖాతా తెరవాలన్నారు. ఎక్కువ మొత్తంలో నగదు లావాదేవీలు జరిపే అనుమానస్పద బ్యాంకు అకౌంట్లపై నిఘా పెట్టాలని, పోలీసులకు తెలియజేయాలని కోరారు. ఫేక్‌లోన్ యాప్‌లపై అన్రమత్తత అవసరం ఫేక్‌లోన్ యాప్‌లు, సామాజిక మాధ్యమాల్లో లింక్‌లను పంపి ఇన్వెస్ట్మెంట్ చేయాలని నమ్మించడం, డిజిటల్ అరెస్టు, ఫెడెక్స్, బ్లూ డాట్ కొరియర్స్, లోన్ యాప్ మోసాలు, క్రెడిట్ కార్డు, ఓటీపీ మోసాలపై ప్రజలను అప్రమత్తం చేయాలని బ్యాంకు అధికారులకు సూచించారు. సమావేశంలో అదనపు ఎస్పీ ఒ.దిలీప్ కిరణ్, పార్వతీపురం ఏఎస్పీ అంకిత సురాన, పాలకొండ డీఎస్పీ రాంబాబు, ఎస్బీ సీఐ పైడి రంగనాథం, డీసీఆర్బీ సీఐ ఎర్రంనాయుడు, సైబర్ సెల్ సీఐ శ్రీనివాస్, జిల్లాల్లో ఉన్న పలు బ్యాంకు అధికారులు, కో ఆర్డినేటర్లు పాల్గొన్నారు. -
పోటాపోటీగా ఐటీడీఏ స్థాయి క్రీడా పోటీలు
సీతంపేట: స్థానిక ఐటీడీఏ గ్రీన్‌ఫీల్డ్ స్టేడియంలో గిరిజన సంక్షేమ ఆశ్రమ, గురుకు పాఠశాల విద్యార్థులకు బుధవారం పోటాపోటీగా ఐటీడీఏ స్థాయి క్రీడాపోటీలు జరిగాయి. మొత్తం 175 మంది విద్యార్థులు హాజరు కాగా వారికి వాలీబాల్, ఆర్చరీ, జావెలిన్‌త్రో తోపాటు డ్రాయింగ్, వ్యాసరచన, డిబేట్ పోటీలు జరిగాయి. క్రీడాపోటీలను ప్రారంభించిన ఐటీడీఏ పీఓ యశ్వంత్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ క్రీడల్లో పాల్గొనే క్రీడాకారులు గెలుపు ఓటములతో సంబంధం లేకుండా క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించాలని సూచించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఈనెల 23 నుంచి 26 తేదీ వరకు విశాఖపట్నంలో రాష్ట్రస్థాయి పోటీలు ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో ఏపీవో చిన్నబాబు, ట్రైబల్ వెల్ఫేర్ డీడీ అన్నదొర, ఏటీడబ్ల్యూవో మంగవేణి, డిప్యూటీఈవో పి.నారాయుడు, ఏఎంవో కోటిబాబు, సీఎంవో చిరంజీవి, జీసీడీవో రాములమ్మ, స్పోర్ట్స్ ఇన్చార్జ్ జాకాబ్ దయానంద్, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
అరకొరగా హోమియో మందులు
● తప్పక బయట షాపుల్లో కొనుగోలు ● వదులుతున్న చేతిచమురు విజయనగరం ఫోర్ట్: గంట్యాడ మండలానికి చెందిన డి.అప్పలసత్యం రెండు రోజుల క్రితం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ఉన్న ప్రభుత్వ హోమియో వైద్యశాలకు చర్మ సంబంధిత వ్యాధితో వెళ్లాడు. పరీక్షించిన హోమియో వైద్యుడు మూడు రకాల మందులు రాశారు. ఆ చీటీ పట్టుకుని ఆస్పత్రిలోని హోమియో ఫార్మశీ వద్దకు వెళ్లగా అక్కడ ఒక రకం మందు మాత్రమే ఇచ్చారు. రెండు రకాల మందులు లేవని, బయట కొనుగోలు చేసుకోవాలని చెప్పారు. దీంతో చేసేది లేక ప్రైవేట్ హోమియో మందుల దుకాణంలో రూ. 200 పెట్టి కొనుగోలు చేశాడు. ఇదే మండలానికి చెందిన సీహెచ్.ఈశ్వరమ్మ మెడ, నడుం నొప్పితో మూడు రోజుల క్రితం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలోని ప్రభుత్వ హోమియో వైద్యశాలకు వెళ్లింది. ఆమెను పరీక్షించిన వైద్యులు నాలుగు రకాల మందులు రాశారు. ఆ చీటీ పట్టుకు హోమియో ఫార్మశీ వద్దకు వెళ్లగా ఒక రకం మందు మాత్రమే ఇచ్చారు. మూడు రకాల మందులు లేవు. బయట కొనుగోలు చేసుకోవాలని చెప్పారు. దీంతో చేసేది లేక రూ.400 పెట్టి ఆమె బయట కొనుగోలు చేసింది. ఇది వీరిద్దరికే కాదు. అనేక మందికి ఎదురవుతున్న పరిస్థితి. హోమియో వైద్యశాలకు వెళ్లిన అధికశాతం మంది బయట మందులు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి. ప్రభుత్వ హోమియో వైద్యశాలకు వచ్చేది పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన వారే. ప్రభుత్వ వైద్యశాలలో వైద్యంతో పాటు, మందులు ఉచితంగా అందించాల్సి ఉంది. కానీ ఇక్కడికి వచ్చిన రోగులకు మందుల కోసం డబ్బులు వెచ్చించాల్సిన పరిస్థితి. హోమియో వైద్యశాలకు 40నుంచి 50 మంది రోగులు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ఉన్న ప్రభుత్వ హోమియో వైద్యశాలకు రోజుకు 40నుంచి 50 మంది వరకు రోగులు వస్తారు. చర్మ, బీపీ. షుగర్, సైనసైటిస్, రక్తహీనత, కీళ్లవాతం, గొంతునొప్పి, తదితర వ్యాధులకు సంబంధించిన రోగులు హోమియో వైద్యశాలకు వస్తారు. వదులుతున్న చేతిచమురు ప్రభుత్వ హోమియో వైద్యశాలలో మందులు పూర్తి స్థాయిలో లేక పోవడంతో రోగులు ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వ వైద్య శాలకు వెళ్లిన వారు తప్పక చేతిచమురు వదిలించుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. హోమియో వైద్యశాలలో మందులు లేక పోవడం వల్ల ప్రైవేట్ హోమియో మందుల దుకాణాల్లో ఒక్కో రోగి రూ. 400 నుంచి రూ. 500 వెచ్చిస్త మందులు కొనుగోలు చేస్తున్నారు. -
భర్తను హత్య చేసిన మహిళకు, మరో వ్యక్తికి యావజ్జీవ జైలు
విశాఖ లీగల్: వివాహేతర సంబంధం నేపథ్యంలో భర్తను అతి కిరాతకంగా హత్య చేసిన మహిళతో పాటు మరో ఇద్దరికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ నగరంలోని ప్రధాన జిల్లా న్యాయమూర్తి ఆలపాటి గిరిధర్ బుధవారం తీర్పు చెప్పారు. జైలు శిక్షతోపాటు నిందితులు రూ.1.50 లక్షలు జరిమానా చెల్లించాలని.. ఆ మొత్తంలో రూ.1.20 లక్షలు మృతి చెందిన వ్యక్తి పిల్లలకు ఇవ్వాలని తీర్పులో పేర్కొన్నారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ కాండ్రేగుల జగదీశ్వరరావు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. విజయనగరం జిల్లా డెంకాడ మండలంలోని మోదవలస గ్రామానికి చెందిన బాడిద బోయిన రాములప్పుడికి 2008లో విశాఖ జిల్లా పద్మనాభం మండలం కురుపల్లి గ్రామానికి చెందిన నరసయ్యమ్మతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. పెళ్లయిన కొంతకాలం తర్వాత నరసయ్యమ్మ తన అక్క కొడుకు గండిబోయిన అప్పలరాజుతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయంపై తరచూ రాములప్పుడు, నరసయ్యమ్మ గొడవలు పడేవారు. 2018 ఫిబ్రవరి 13న శివరాత్రి పండగకు రాములప్పుడు తన స్వగ్రామమైన మోదవలస వెళ్లాడు. భార్యా పిల్లలు కూడా వెంట ఉన్నారు. మోదివలసలో రామప్పడును చంపడానికి నరసయ్యమ్మ.. అప్పలరాజుతో కలిసి పథకం రచించింది. అప్పలరాజు తన తమ్ముడు ఎల్లారావు(ఎల్లాజీ)తో కలిసి రాములప్పడును చంపడానికి సిద్ధమయ్యాడు. రాత్రి సమయంలో రాములప్పడును కరల్రతో కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. వెంటనే ముగ్గురూ కలిసి మృతుడిని మోదవలస నుంచి పద్మనాభం మండలం కురిపిల్లికి తెచ్చి వదిలేశారు. వెంటనే వారు మళ్లీ గ్రామానికి వెళ్లిపోయారు. తన అన్నయ్య అనుమానాస్పదంగా చనిపోయి ఉండడంతో తమ్ముడు ఆనందపురం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆనందపురం పోలీసులు దర్యాప్తు జరిపి, నిందితులపై భారతీయ శిక్షాస్మృతి 302, 120 బి, 364 సెక్షన్ల కింద నేరాభియోగ పత్రాన్ని దాఖలు చేశారు. నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి పైవిధంగా తీర్పు చెప్పారు. ఈ కేసులో రెండో నిందితుడిగా ఉన్న గండిబోయిన ఎల్లాజీ మైనర్ కావడంతో వేరే న్యాయస్థానంలో కేసు దర్యాప్తు జరిగింది. ఆ బాలునికి మూడేళ్ల జైలు శిక్ష విధించి, బాలల సంరక్షణ పరివర్తన కేంద్రానికి పంపించారు. తల్లి జైలుకి వెళ్లడం, తండ్రి మృతి చెందడంతో పిల్లల సంరక్షణ చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ను ప్రధాన న్యాయమూర్తి సూచించారు. -
23 నుంచి సయ్యద్ ముస్తాక్ అలీ క్రికెట్ పోటీలు
● ఏసీఏ కార్యదర్శి సానా సతీష్ బాబు విజయనగరం: దేశవాళీ టీ20 క్రికెట్ టోర్నీ అయిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ పోటీలు విశాఖపట్నంలోని పీఎంపాలెం ఏసీఏ–వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, విజయనగరంలోని పీవీజీ రాజు కాంప్లెక్స్, విజ్జి స్టేడియంలలో ఈ నెల 23వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) కార్యదర్శి సానా సతీష్ బాబు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ మ్యాచ్‌లు డిసెంబర్ 5వ తేదీ వరకు జరుగుతాయని వెల్లడించారు. మ్యాచ్ నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. టోర్నమెంట్లో అస్సాం, రైల్వేస్, చండీగఢ్, పాండిచ్చేరి, విదర్భ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ జట్లు పోటీపడనున్నాయి. ఆయా జట్లు బుధవారం విశాఖపట్నం చేరుకున్నాయి. ఇండియా, ఐపీఎల్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆటగాళ్లు ఈ పోట్లీల్లో పాల్గొననున్నారు. బోధనేతర పనులు రద్దు చేయాలిపార్వతీపురంటౌన్: పాఠశాలల్లో బోధన సమయాన్ని పెంచేందుకు విద్యాశాఖ, హైస్కూల్ పని వేళల సమయాన్ని పెంచడాన్ని యూటీఎఫ్ వ్యతిరేకిస్తోందని రాష్ట్ర కార్యదర్శి ఎస్. మురళీ మోహనరావు తెలిపారు. ప్రస్తుతం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు 8 పీరియడ్లు కొనసాగుతున్నాయని, మార్చిన సమయంలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 8 పీరియడ్లు కొనసాగుతాయని, దీనివలన ఏమీ ప్రయోజనం ఉండదన్నారు. ప్రస్తుతం ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు సాయంత్రం 4గంటల నుంచి 5గంటల వరకు 10వ తరగతి విద్యార్థులకు స్టడీ అవర్స్ ఉన్నాయని, కావున సమయం పెంచడం వల్ల ప్రయోజనం ఏమీ ఉండదన్నారు. బోధనేతర కార్యక్రమాలు, యాప్‌ల నుంచి ఉపాధ్యాయులకు ఉపశమనం కల్గిస్తే బోధన సమయం పెరుగుతుందన్నారు. కావున వెంటనే ఈ పని వేళలు పెంచే ఆలోచనను విరమించుకోవాలని లేని పక్షంలో ఆందోళన చేస్తామని తెలియచేశారు. పశువుల లారీ సీజ్దత్తిరాజేరు: పార్వతీపురం నుంచి విజయనగరం కబేళాకు 32 పశువులను అక్రమంగా తరలిస్తున్న లారీని పట్టుకుని సీజ్ చేసినట్లు ఎస్ బూర్జవలస ఎస్సై జి.రాజేష్ బుధవారం తెలిపారు. మంగళవారం రాత్రి కొంతమంది కబేళా వ్యాపారులు ఇచ్చిన సమాచారం మేరకు చౌదంతివలస కూడలి వద్ద పట్టుకున్న లారీలో తినడానికి గడ్డి లేకుండా తాగడానికి నీరు లేకుండా కాళ్లు కట్టేసి ఉన్న పశువులను స్వాధీనం చేసుకుని పశువుల యజమాని గణేష్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై చెప్పారు. -
మళ్లీ ఎంఈఓపై విచారణ
గరుగుబిల్లి: గతంలో ఎంఈఓగా విధులు నిర్వహించిన ఎన్.నాగభూషణరావుపై స్థానిక ఎంఆర్సీలో విద్యాశాఖ జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ పి.దామోదర్‌రావు, పార్వతీపురం డిప్యూటీ డీఈఓ బి.రాజ్‌కుమార్‌లు మరోసారి బుధవారం విచారణ నిర్వహించారు. ఎంఈఓ నాగభూషణ్ రావు పలు ఆరోపణలు ఎదుర్కొని సస్పెన్షన్‌కు గురైన విషయం పాఠకులకు విదితమే. ఈ సందర్భంగా విచారణాధికారులకు పార్వతీపురం యుటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు టి.రమేష్, కె.భాస్కరరావు, యుటీఎఫ్ మండల కార్యదర్శి టి.శ్రీనివాసరావులు గతంలో ఎంఈఓ చేసిన అక్రమాలు, అవినీతి, సర్వీస్ తప్పిదాలపై ఆధారాలను సమర్పించారు. అనంతరం ఎ.డి దామోదర్‌రావు మాట్లాడుతూ గతంలో గరుగుబిల్లి, జియ్యమ్మవలస ఎంఈఓగా పనిచేసిన నాగభూషణరావుపై పలు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో రీజినల్ జాయింట్ డైరెక్టర్ ఆదేశాలమేరకు విచారణ చేపట్టామన్నారు. విచారణలో సేకరించిన అంశాలపై పూర్తిస్థాయిలో నివేదిక తయారుచేసి తదుపరి చర్యల నిమిత్తం ఆర్జేడీకి సమర్పించనున్నామన్నారు. ఈ విచారణలో స్థానిక ఎంఈఓ డి.అప్పలనాయుడు, ఎంఈఓ–2 కె.కొండలరావు, జియ్యమ్మవలస ఎంఈఓ–2 ఎం.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
22న బొల్లినేని మెడిస్కిల్స్‌లో జాబ్‌మేళా
శ్రీకాకుళం రూరల్: మండలంలోని రాగోలు జెమ్స్ ఆస్పత్రి, బొల్లినేని మెడిస్కిల్స్‌లో ఫైజర్ హెల్త్‌కేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఉద్యోగాలకు ఈ నెల 22న జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సీహెచ్ నాగేశ్వరరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2023–24 సంవత్సరాల్లో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన 18 నుంచి 20 ఏళ్లలోపు విద్యార్థినులు అర్హులని పేర్కొన్నారు. ఎంపికై నవారికి ఉచిత వసతి, భోజన సదుపాయాలు కల్పించనున్నట్లు తెలిపారు. ఎంపికై న వారికి నెలకు రూ.13,500 వేతనం అందుతుందని, అనకాపల్లి జిల్లా పరవాడలో పనిచేయాల్సి ఉంటుందన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఉదయం 8.30 గంటలకు ప్రారంభమయ్యే జాబ్‌మేళాకు ధ్రువపత్రాలతో హాజరుకావాలని, పూర్తి వివరాలకు 7680945357, 7995013422 నంబర్లను సంప్రదించవచ్చని పేర్కొన్నారు. బస్సును ఢీకొట్టిన మరో బస్సుడెంకాడ: విజయనగరం–విశాఖ జాతీయ రహదారిపై డెంకాడ మండలంలోని మోదవలస సమీపంలో అనీల్నీరుకొండ ఆస్పత్రి బస్సును వెనుక నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొట్డడంతో పలువురికి గాయాలయ్యాయని ఎస్సై ఎ.సన్యాసినాయుడు తెలిపారు. బుధవారం ఉదయం అనీల్నీరుకొండ ఆస్పత్రికి చెందిన బస్సు విజయనగరం నుంచి తగరపువలస వైపు వెళ్తోంది. అదే వైపు నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సు వెనుకనుంచి ఢీకొంది. దీంతో బస్సుల్లో ఉన్న 15 మంది వరకూ గాయాలపాలైనట్లు పోలీసులు తెలిపారు. బాధితులను వెంటనే తగరపువలస వద్ద ఉన్న అనీల్ నీరుకొండ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నట్లు చెప్పారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై సన్యాసినాయుడు తెలిపారు. వ్యవసాయ విద్యుత్ మోటార్ల చోరీపూసపాటిరేగ : మండలంలోని చౌడువాడ పంచాయతీ కొణతాల పాలెం సమీపంలో గల వ్యవసాయక్షేత్రంలో మూడు వ్యవసాయ విద్యుత్ మోటార్లు చోరీకి గురయ్యాయి. కొణతాల పాలెం సమీపంలో దన్నాన సత్యనారాయణకు చెందిన వ్యవసాయ క్షేత్రంలో గల షెడ్లో గల మూడు వ్యవసాయ విద్యుత్ మోటార్లును గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు. సుమారు రూ.2 లక్షల విలువైన మోటార్లు చోరీకి గురవడంతో పోలీస్ష్టేషన్లో బాధితులు బుధవారం ఫిర్యాదు చేశారు.షెడ్ తలుపులు విరగ్గొట్టి దొంతనానికి పాల్పడినట్లు బాధిత రైతు ఫిర్యాదులో తెలియజేశాడు. ఇదే తరహాలో మండలంలోని పలు గ్రామాలులో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ వైర్లు తరుచూ చోరీకి గురవుతూనే ఉన్నాయి. పోక్సో కేసు నమోదువిజయనగరం క్రైమ్: జిల్లాకేంద్రం విజయనగరం వన్‌టౌన్ పరిధిలో రెండో తరగతి చదువుతున్న బాలికపై లైంగిక దాడికి మంగళవారం సాయంత్రం ఓ వ్యక్తి యత్నించాడు. ఈ ఘటనకు సంబంధించి విజయనగరం డీఎస్పీ ఎం.శ్రీనివాసరావు బుధవారం తెలియజేసిన వివరాలిలా ఉన్నాయి. వన్‌టౌన్ పరిధిలో ఉన్న ఓ స్కూల్‌కు రిక్షాలో రెండేళ్లుగా పాపను తీసుకువెళ్లి, తీసుకువచ్చే 56 ఏళ్ల వ్యక్తి మంగళవారం సాయంత్రం చిన్నారిని స్కూల్ నుంచి ఇంటికి తీసుకువస్తున్న సమయంలో నిర్మానుష్య ప్రాంతానికి వచ్చేసరికి చిన్నారిపై లైంగికదాడికి యత్నిస్తుండగా స్థానికులు చూసి చితకబాది వన్‌టౌన్ పోలీసులకు అప్పగించారు. విచారణ అనంతరం నిందితుడిపై దిశ స్టేషన్లో పోక్సో కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. 100 లీటర్ల బెల్లం ఊట ధ్వంసంరామభద్రపురం: మండలంలోని చందాపురం గ్రామ పరిధిలో బుధవారం ఎకై ్సజ్ సీఐ పి చిన్నంనాయుడు సిబ్బందితో కలిసి సారాబట్టీలపై దాడులు చేశారు. ఈ క్రమంలో 100 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్రమంగా సారా తయారు చేసే నిర్వాహకులు, మద్యం దుకాణ యజమానులు బెల్టు షాపుల ఏర్పాటుకు ప్రోత్సహించినా, అక్రమంగా సరఫరా చేసిట్లు తనిఖీలలో గుర్తిస్తే ఆయా లైసెన్స్‌దారులపై కేసులు నమోదుచేస్తామని హెచ్చరించారు. -
నేవీ డే వేడుకలకు రాష్ట్రపతి రాక
భువనేశ్వర్: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్ర పర్యటనకు విచ్చేయనున్నారు. నేవీ డే వేడుకల్లో పాల్గొనేందుకు ఆమె పర్యటన ఖరారైంది. డిసెంబరు నెల 4న పూరీ బ్లూ ఫ్లాగ్ తీరంలో నేవీ దినం వేడుకల కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేడుకల్లో ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ఈ సందర్భంగా డిసెంబరు నెల 3 నుంచి 7వ తేదీ వరకు రాష్ట్రపతి రాష్ట్రంలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా సొంత జిల్లా మయూర్భంజ్ సందర్శిస్తారు. వచ్చే నెల 3న స్థానిక బిజూ పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుతారు. మర్నాడు పూరీ సాగర తీరంలో జరగనున్న నేవీ డే వేడుకల్లో ముఖ్య అతిథిగా పాలుపంచుకుంటారు. అదే రోజు స్థానిక ఒడిశా వ్యవసాయ సాంకేతిక విశ్వ విద్యాలయం ఓయూఏటీ 40వ కాన్వొకేషను కార్యక్రమంలో పాల్గొంటారు. డిసెంబరు నెల 5న కొత్త జుడిషియల్ కోర్టు సముదాయం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభిస్తారు. మర్నాడు కోల్కత్తా మీదుగా ఆమె సొంత జిల్లా మయూర్భంజ్ చేరుతారు. కోల్‌కతా డిఫెన్సు ఎయిర్ బేస్ నుంచి ప్రత్యేక హెలికాప్టరులో మయూర్భంజ్ రొంగొమటియా వద్ద ఏర్పాటు చేసిన తాత్కాలిక హెలిప్యాడ్‌లో దిగుతారు. రోడ్డు మార్గంలో దళిత గ్రామం ఉప్పొరొబెడా చేరుతారు. ఈ ప్రాంతంలో రాష్ట్రపతి విద్యాభ్యాసం పొందిన ప్రభుత్వ పాఠశాల సందర్శించి అక్కడి ఉపాధ్యాయులు, బాలలతో ప్రత్యక్షంగా సంభాషించి కాసేపు ముచ్చటగా కాలక్షేపం చేస్తారు. రాయరంగపూర్ తన సొంత ఇంటిలో ఆరోజు మద్యాహ్న భోజనం చేస్తారు. స్వగ్రామం ఆస్పత్రిలో అంబులెన్సు వాహన సేవల్ని రాష్ట్రపతి ప్రారంభిస్తారు. అనంతరం రాయరంగపూర్ మహిళా కళాశాల సందర్శన పురస్కరించుకుని విద్యార్థినులతో సంభాషిస్తారు. అక్కడి పుణేశ్వర ఆలయంలో రాష్ట్రపతి ప్రత్యేక పూజాదుల్లో పాల్గొంటారు. కార్యక్రమాలు ముగియడంతో సొంత ఇంటికి చేరి రాత్రి బస చేస్తారు. మరుసటి రోజు ఉదయం స్థానికులతో కలిసి మెలిసి కాసేపు గడిపి దండబోష్ ఎయిర్ స్ట్రిప్ నుంచి వాయు మార్గంలో బంగిరిపొషి చేరుతారు. ఆ ప్రాంతంలో 3 రైల్వే ప్రాజెక్టులకు రాష్ట్రపతి శంకు స్థాపన చేస్తారు. వీటిలో బాదం పహాడ్ – కెంజొహర్‌గొడొ, బంగిరపొషి – గోరుమొహిషాని మరియు బురామరా – చకులియా రైలు ప్రాజెక్టులు ఉన్నాయి. వీడియో కాన్ఫరెన్స్‌లో దళిత పరిశోధన కేంద్రం నిర్మాణం, దండబోష్ ఎయిర్ స్ట్రిప్, సబ్ ఆస్పత్రి అభివృద్ధికి శంకు స్థాపన చేస్తారు. కార్యక్రమాలు ముగించుకుని కోల్‌కతా డిఫెన్సు ఎయిర్ బేస్ నుంచి ప్రత్యేక విమానంలో న్యూ ఢిల్లీకి తిరిగి వెళ్తారు. -
కార్చిచ్చు నివారణకు కసరత్తు
పర్లాకిమిడి: స్థానిక కలెక్టరేట్ హాల్ నంబర్ 1లో జిల్లా స్థాయి అగ్నినివారణ సమన్వయ కమిటీ సమావేశాన్ని జిల్లా అటవీ శాఖ అధికారి ఎస్.ఆనంద్ నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ బిజయ కుమార్ దాస్, ఎస్పీ జితేంద్ర నాథ్ పండా, ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి, సబ్ కలెక్టర్ అనూప్ పండా అటవీ రేంజ్ అధికారులు, తహసీల్దార్లు, సర్పంచ్‌లు పాల్గొన్నారు. శీతాకాలంలో గజపతి జిల్లాలో మొత్తం అటవీ ప్రాంతాల్లో గత ఏడాది 921 పాయింట్లలో తరచూ అగ్నిప్రమాదాలు జరిగాయన్నారు. ముఖ్యంగా మోహన, ఆర్.ఉదయగిరి, నువాగడ అటవీ ప్రాంతాల్లో 2024– 25అటవీ ప్రాంతాల్లో కార్చిచ్చు నివారించడానికి యాక్షన్ ప్లాన్ అవసరమని కలెక్టర్ బిజయకుమార్ దాస్ అన్నారు. అటవీ ప్రాంతాల్లో కార్చిచ్చు వల్ల అనేక విలువైన అటవీ సంపదతో పాటు వన్యప్రాణులు అగ్నికి ఆహుతి అవుతున్నట్టు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌తో కార్చిచ్చు ఆపడానికి తగు చర్యలను అధికారులు వివరించారు. అటవీ ప్రాంతాల్లో దగ్గరలోని పంచాయతీ సర్పంచులు చొరవ తీసుకుని అగ్నిప్రమాదాల నివారణకు ఉపక్రమిస్తే వారికి తగు పారితోషికం, సత్కారం అందిస్తామని డీఎఫ్ఓ తెలిపారు.