Sakshi Special
-
స్మృతి ఇరానీకి ఢిల్లీ పగ్గాలు?
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా..నూతన ముఖ్యమంత్రి ఆతిశి ప్రమాణస్వీకారం.. వచ్చే ఏడాది ఆరంభంలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల పరిణామాల నేపథ్యంలో అప్రమత్తమైన బీజేపీ అధిష్టానం ఢిల్లీ పీఠాన్ని అధిరోహించాలన్న గట్టి పట్టుదలతో ముందుకు కదులుతోంది. వచ్చే ఎన్నికల్లో ప్రజల్లోనే తన నిజాయితీని నిరూపించుకొని మళ్లీ ముఖ్యమంత్రిని అవుతానంటూ కేజ్రీవాల్ ఇప్పటికే ఎన్నికల శంఖారావం పూరించడంతో ఆయనకు గట్టి పోటీనిచ్చే నేతను రంగంలోకి దించే వ్యూహాలకు పదును పెడుతోంది. ఇందులో భాగంగానే మాజీ కేంద్రమంత్రి, ఫైర్‌బ్రాండ్ స్మృతి ఇరానీని ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా తెరపైకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ఢిల్లీ సభ్యత్వ నమోదు బాధ్యతలను ఆమెకు కట్టబెట్టిన కమలదళం, మున్ముందు మరిన్ని బాధ్యతలు కట్టబెట్టాలని యోచిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.పీఠమెక్కాలన్న కసితో బీజేపీ.. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ను ఎదుర్కొనే క్రమంలో బీజేపీ మాజీ ఐపీఎస్ కిరణ్‌బేడీని తమ ముఖ్యమంత్రిగా ప్రకటించి ఎన్నికల్లో పోటీ చేసింది. ఈ ఎన్నికల్లో కిరణ్‌బేడీ ఏమాత్రం ప్రభావం చూపకపోగా, ఆమె నాయకత్వాన్ని ఏమాత్రం లెక్కపెట్టని బీజేపీ శ్రేణులన్నీ క్షేత్రస్థాయిలో మౌనం వహించాయి. దీంతో ఆ ఎన్నికల్లో బీజేపీ 70 స్థానాలకు గానూ కేవలం 3 స్థానాలు మాత్రమే గెలుచుకోగలిగింది. ఆ తర్వాత 2020 ఎన్నికల్లో సీఎం అభ్యరి్థని ప్రకటించకుండానే బీజేపీ పోటీకి దిగింది. ఈ ఎన్నికల్లోనూ బీజేపీ ఏమాత్రం ప్రభావం చూపలేదు. కేవలం 8 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచి్చంది. అదే 2019, 2024 పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం ఢిల్లీలోని ఏడింటికి ఏడు సీట్లు గెలుచుకున్న బీజేపీ.. అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి బోల్తా పడుతోంది. ఈ నేపథ్యంలో ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆప్‌కు తిరిగి అధికారం ఇవ్వకూడదన్న ఉద్దేశంతో ఉన్న బీజేపీ ముందునుంచే ఎన్నికల ప్రణాళికలను అమలు చేసే పనిలో పడింది. ఇందులో భాగంగానే స్మృతి ఇరానీని ఢిల్లీ రాజకీయాల్లో క్రియాశీలం చేసే పనిలో పడింది. ఢిల్లీ బీజేపీకి చెందిన 14 జిల్లా యూనిట్లలోని ఏడింటిలో సభ్యత్వ నమోదు బాధ్యతలను పార్టీ ఆమెకు కట్టబెట్టింది. ఈ నెల 2వ తేదీ నుంచి ఢిల్లీలోని ప్రతి వార్డులో ఆమె విస్తృతంగా పర్యటిస్తున్నారు. సభ్యత్వ కార్యక్రమాలలో బూత్ స్థాయి కార్యకర్తల ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ, పార్టీని అట్టడుగు స్థాయిలో బలోపేతం చేయడంపై ఆమె దృష్టి పెట్టారు. దక్షిణ ఢిల్లీలో ఇప్పటికే ఆమె ఒక ఇంటిని సైతం కొనుగోలు చేశారని పార్టీ అంతర్గత వర్గాలు చెబుతున్నాయి. గత ఎన్నికల్లో అమేధీ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి కిశోరీలాల్ శర్మ చేతిలో ఓటమి అనంతరం ఎక్కడా కనిపించని ఆమెకు తాజాగా ఢిల్లీ బాధ్యతలు కట్టబెట్టారనే చర్చ జరుగుతోంది. ఢిల్లీలో ఇప్పటికే బీజేపీ తరఫున దివంగత నేత సుష్మా స్వరాజ్ కుమార్తె, ఎంపీ బాసూరీ స్వరాజ్ క్రియాశీలంగా ఉన్నప్పటికీ ఆమె తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యారు. ఆమెతో పాటు ఎంపీలు మనోజ్ తివారీ, ప్రదీప్ ఖండేల్వాల్, కామజీత షెరావత్, ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా వంటి సీనియర్లు ముఖ్యమంత్రి ముఖాలుగా ఉన్నప్పటికీ వాక్చాతుర్యం, గాంధీ కుటుంబ వ్యతిరేక భావజాలమున్న ఇరానీనే సరైన మార్గమని బీజేపీ భావిస్తోందని అంటున్నారు. ఆప్ కొత్త ముఖ్యమంత్రి ఆతిశిని ఎదుర్కొనేందుకు ఇరానీ సరితూగుతారనే వ్యాఖ్యలు వస్తున్నాయి. ఇందులో భాగంగానే ఎన్నికల వ్యూహరచన, ప్రచార ప్రణాళిక, అభ్యర్థుల ఎంపిక, ప్రచారానికి నాయకత్వం వహించే బాధ్యతను ఆమెకు అప్పగించవచ్చని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. -సాక్షి, న్యూఢిల్లీ -
మెమరీ క్రిస్టల్లో మన జన్యుక్రమం
లక్షలాది ఏళ్ల క్రితం గ్రహశకలం భూమిని ఢీకొనడంతో అంత పెద్ద డైనోసార్లే నామరూపాల్లేకుండా పోయినట్టు సైన్స్ చెబుతోంది. భవిష్యత్తులో అలాంటి ప్రళయమేదన్నా వచ్చి మానవాళిని అంతం చేస్తే? అలాంటిది జరిగినా మానవ సృష్టి క్రమం కొనసాగేందుకు బ్రిటన్ సైంటిస్టులు ఓ మార్గం ఆలోచించారు. మానవ జన్యు క్రమం మొత్తాన్నీ అత్యాధునిక 5డి మెమరీ క్రిస్టల్లో నిక్షిప్తం చేసి పెట్టారు. దాని సాయంతో మనిషిని తిరిగి సృష్టించవచ్చన్నమాట. సౌతాంప్టన్ వర్సిటీ ఆప్టోఎల్రక్టానిక్స్ రీసెర్చ్ సెంటర్ పరిశోధకులు ఈ క్రిస్టల్‌ను అభివృద్ధి చేశారు. వందల కోట్ల ఏళ్లపాటు చెక్కుచెదరకుండా ఉండేలా దీన్ని తీర్చిదిద్దా రు. చూసేందుకు చిన్నగా ఉన్నా ఇందులో ఏకంగా 360 టెరాబైట్స్ సమాచారాన్ని నిక్షిప్తం చేయవచ్చట! గడ్డకట్టించే చలి మొదలుకుని కాస్మిక్ రేడియేషన్, వెయ్యి డిగ్రీ సెల్సియస్‌కు మించిన ఉష్ణోగ్రత దాకా అన్ని ప్రతికూల వాతావరణ పరిస్థితులనూ తట్టుకునేలా దీన్ని తయారు చేశారు. ఈ క్రిస్టల్ అత్యంత మన్నికైన డిజిటల్ స్టోరేజ్ మెటీరియల్‌గా 2014లోనే గిన్నిస్ రికార్డులకెక్కింది. అంతరించిపోయే జాబితాలో చేరిన జంతు, వృక్ష జాతుల జన్యుక్రమాన్ని భద్రపరిచి ముందు తరాలకు అందించేందుకు కూడా ఈ క్రిస్టల్స్ ఉపయోగపడతాయని సైంటిస్టులు చెబుతున్నారు. 5డి మెమరీ ఎందుకంటే... అత్యంత వేగవంతమైన లేజర్ల సాయంతో 5డి పద్ధతిలో మానవ జన్యు డేటాను క్రిస్టల్లో భద్రపరిచారు. ‘‘తద్వారా సమాచారం పొడవు, ఎత్తు, వెడల్పుతో పాటు స్థితి, దిగి్వన్యాసం (ఓరియంటేషన్) అనే ఐదు విభిన్న డైమెన్షన్లలో క్రిస్టల్‌లోని సూక్ష్మనిర్మాణాల్లో నిక్షిప్తమై ఉంటుంది. తద్వారా అందులోని జన్యుక్రమాన్ని సుదూర భవిష్యత్తులో కూడా వెలికితీసి పునఃసృష్టి చేసేందుకు వీలైనన్ని ఎక్కువ అవకాశాలుండేలా జాగ్రత్త పడ్డాం’’ అని పరిశోధన సారథి ప్రొఫెసర్ పీటర్ కజాన్స్కీ అన్నారు. అయితే కోట్లాది ఏళ్ల తర్వాత ఈ జన్యుక్రమం ఎవరి చేతికి చిక్కుతుందన్నది ప్రస్తుతానికి అనూహ్యమే. కనుక క్రిస్టల్‌లోని సమాచారమంతా వారికి సులువుగా చిక్కేందుకు వీలుగా అందులో ఒక విజువల్ కీని కూడా ఏర్పాటు చేశారు. క్రిస్టల్లో ఉన్న డేటా స్వరూపం, దాన్నెలా వాడుకోవాలి వంటివన్నీ ఈ కీ ద్వారా సులువుగా అర్థమైపోతాయని కజాన్స్కీ చెప్పుకొచ్చారు. ఈ క్రిస్టల్‌ను ఆ్రస్టియాలో ‘మెమరీ ఆఫ్ మ్యాన్‌కైండ్ ఆరై్కవ్’ టైమ్ క్యాప్సూల్‌లో భద్రపరిచి ఉంచారు. ఇది నిజంగా అద్భుతమేనంటూ ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్‌లో డీఎన్ఏ స్టోరేజ్ విభాగాధిపతి థామస్ హెయ్నిస్ ప్రశంసించారు. అయితే, ‘‘అంతా బాగానే ఉంది. కానీ మానవాళే అంతరించిపోతే ఈ క్రిస్టల్‌ను వాడేదెవరు? అందులోని జన్యుక్రమం సాయంతో మనిíÙని మళ్లీ సృష్టించేదెవరు?’’ అంటూ ఆయన కీలక ప్రశ్నలు సంధించడం విశేషం! – సాక్షి, నేషనల్ డెస్క్ -
International Daughters Day 2024: మన కంటిపాపకు కలలే కాదు... రెక్కలిద్దాం
మన దేశంలో కొత్తగా పెళ్లయిన దంపతులను ‘సుపుత్ర ప్రాప్తిరస్తు’ అని ఆశీర్వదించడం ఆనవాయితీ. అయితే ఇప్పుడు ‘సుపుత్రికా ప్రాప్తిరస్తు’ అంటున్నారు. ఎందుకంటే ఇప్పటి కాలంలో కూతురు పుట్టడమే పెద్ద అదృష్టం అనే విధంగా ఆలోచనలు మారుతున్నాయి. అన్ని రంగాల్లో ఆడపిల్లలు సాధిస్తున్న విజయాలు అందుకు సహకరిస్తున్న తల్లిదండ్రులను చూస్తూనే ఉన్నాం. ఇంట కూతురు ఉంటే ఆ ఇంటికి వచ్చే కళ వేరు. కూతురి సామర్థ్యాలు ఇంటికి వెలుగు. భ్రూణ హత్యల వల్ల స్త్రీల జనాభా కురచగా ఉన్న రోజులు ఇకపై చెల్లిపోవాలి. ప్రతి కూతురూ ఒక వరంలా వర్థిల్లాలి. అంతర్జాతీయ కుమార్తెల దినోత్సవం సందర్భంగా కూతురుగా, కూతురికి తల్లిగా ఉన్న కొంతమంది రచయిత్రుల అభి్రపాయాలు.మీ కూతుళ్లకేం ఇస్తున్నారు?‘మీకు ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఉండి, ఒకరిని మాత్రమే చదివించే స్థోమత ఉన్నట్లయితే అమ్మాయినే చదివించండి‘ అంటారు పెరియార్. ఆడపిల్లల చదువుప్రాధాన్యతను గుర్తించడం వల్లే కావచ్చు నన్ను, మా చెల్లిని బాగా చదివించారు మా తల్లిదండ్రులు. ఆడపిల్లలకేం కావాలి అంటే మంచి బట్టలు, నగలు అని కాకుండా ఆర్థికంగా స్వావలంబన కలిగివుండాలనే వారి ఆలోచన కారణంగానే మా జీవితాల్లో మేము నిలదొక్కుకున్నాం. ఈ కారణం చేతనే కొడుకులకు మాత్రమే తల్లిదండ్రుల బాధ్యత అనుకోకుండా వాళ్ల చివరి రోజుల్లో వారి ఆలనా పాలనా నేను చూసుకోగలిగాను. ఇప్పుడు అమ్మాయిలకి కేవలం ఆర్థిక స్వావలంబన మాత్రమే సరిపోదు. సమాజంలో భద్రత, ఆత్మరక్షణ విద్యలు కూడా అవసరం. ఇంట్లో నేను ఇద్దరు ఆడపిల్లలకు తల్లిని. కాలేజీలో నాకు ఎనిమిది వందల మంది కూతుళ్లు. వారంతా రెక్కలు తొడిగిన ఉత్సాహంతో స్వేచ్ఛగా ఎగరగలిగే వాతావరణం ఉండాలని నా ఆకాంక్ష. అమ్మాయిలు ఆర్థిక స్వావలంబనతో పాటు, ఆత్మవిశ్వాసంతో ఎదగటానికి తల్లిదండ్రులు సమాజం చేయగలిగినదంతా చేయాలి. నేటితరం కూతుళ్లందరికీ నా శుభాకాంక్షలు. – ఎం. ప్రగతి, రచయిత్రి, అనంతపురంకూతురి ప్రపంచంలోకి వెళతానుఏలూరు దగ్గర, కొక్కిరపాడు అనే పల్లెటూరులో ఆర్థికంగా చితికిపోతూ ఉన్న పెద్దరైతు కుటుంబంలో పుట్టాను. నలుగురాడపిల్లల్లో కడసారిదాన్ని. కూతురుగా ఎట్లా ఉన్నానో, ఉంటున్నానో తరచి చూసుకుంటుంటే కొత్తగా ఉంది. చిన్నప్పుడు మా అవసరాలకి డబ్బులు సరిగ్గా ఇవ్వనందుకు అమ్మానాన్నల మీద అరిచేదాన్నని అమ్మ చెపుతూ ఉంటుంది. కాని బుద్ధి పెరిగాక ఎపుడూ విసిగించింది లేదు. ‘మగపిల్లలు లేరు, అంతా ఆడమంద’ అని లోకం వెక్కిరించే రోజుల నుంచి ‘మా బిడ్డలు రత్నాలు’ అని అమ్మానాన్నలు గర్వంగా చెప్పుకునే రోజు వరకూ కూతురుగా నా ప్రయాణంలో అనేక ఎగుడు దిగుళ్లు. కులాన్ని వదిలి నా పెళ్లి నేనే చేసుకున్నందుకు, డబ్బు సంపాదన వదిలి నచ్చిన మార్గంలో వెళ్ళినపుడూ వారు రక్షకులై వెన్ను తట్టారు. చుట్టూ ప్రకృతిని, ప్రేమని ఆస్తులుగా పంచారు. ఇవ్వడం తప్ప తిరిగి అడగడం తెలీని ప్రేమమూర్తుల కూతురిని. స్త్రీలకి అన్నిరంగాలలో స్వేచ్చ ఉండాలని నమ్మే నాకు స్నిగ్ధ ఒక్కతే కూతురు. నేను నమ్మే వాటికి, పెంపకానికి మధ్య కొన్ని విషయాలలో పేచీలు వచ్చేవి, దుస్తులు, షికార్లు, ప్రేమలు వంటివి. ‘స్వేచ్ఛ అంటే నీ నిద్ర నువ్వే లేవడం కూడా’ అంటూ కొటేషన్లు చెప్పిన నాకు ఏ మాత్రం లొంగకుండా తన వ్యక్తిత్వాన్ని చక్కగా కాపాడుకున్న స్నిగ్ధని కొన్ని విషయాల్లో గురువుగా భావించే అమ్మనిపుడు. తనతో గడపడం కోసం నేను ఎదురు చూడడం కాదు, ‘అమ్మా... ముచ్చట్లు చెప్పుకుందామా?’ అని తను తరచూ అడిగే ఆకర్షణ నాలో ఉండడం కోసం ఆ వయసు వారి ప్రపంచంలోకి చొచ్చుకుపోతాను, నేర్చుకుంటాను. ‘నా విలువలకి అనుగుణంగా పెళ్లి చేసుకోకపోతే నేను రాను’ అని బెదిరించబోయానా! ‘నేను నీ ద్వారా వచ్చాను తప్ప నీ కోసం రాలేదు’ అని గట్టిగానే చెప్పింది. కూతురుగా, కూతురి తల్లిగా నా బొమ్మ వారికి సూపర్ హిట్.– కె.ఎన్. మల్లీశ్వరి, రచయిత్రి, విశాఖపట్నంఏ దేశ కరెన్సీ సరిపోదుఫలానా అమ్మాయికి మేము తల్లితండ్రులం అనే స్థాయికి ఎదిగిన ఆడపిల్లలు ఎందరో. అటువంటి అమ్మాయిలను ఆదర్శంగా తీసుకొని గొప్పగా ఎదగాలని ఇండియన్ ఆర్మీకి, సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సన్నద్ధం అయ్యాను. అనేక కారణాల చేత గమ్యం చేరుకోలేక నిస్సహాయతతో నలిగిపోయాను. ఇంట్లో పెళ్లి చేస్తాను అన్న ప్రతిసారి ‘అమ్మా! నీలాగా నా జీవితం ఇంటికి, పెళ్లి, పిల్లలకు అంకితం అవ్వకూడదు’ అని మా అమ్మను నిందించేదాన్ని. అమ్మ మౌనంగా బాధపడేది. వంటింట్లో ఉల్లిపాయలు తరుగుతూ కన్నీటిని దాచిపెట్టేది. అపుడు అర్థం అయ్యేది కాదు... నాకు పెళ్ళి అయ్యి ఒక కూతురు పుట్టే వరకు ఆమె మౌనానికి అర్థం నిస్సహాయత కాదు అది అంతర్మథనం అని నాకు తెలియలేదు. మా అమ్మ ఇద్దరు చెల్లెళ్లకు అక్కగా పుట్టింది. కొడుకులు లేని కుటుంబం. ఇద్దరూ పిన్నులు చిన్న ఉద్యోగాలు చేయడం మొదలుపెట్టారు. కానీ మా అమ్మ పరిస్థితుల రీత్యా టాలెంట్ ఉన్నా ఇంటికే పరిమితం ఐపోయింది. కానీ ఇంట్లో, ఇంటి చుట్టుపక్కల ఎవరికి ఆపరేషన్ ఐనా, ఒంట్లో బాగోలేకపోయినా, ఊరెళ్తున్నా ఇలా కారణం ఏదైనా ఆ కుటుంబానికి వండి పెట్టే బాధ్యత కూడా మా అమ్మ నిస్వార్థంగా తీసుకునేది. మా పిన్నులు జీతం సంపాదించే వారు కానీ ఇతరుల కోసం ఖర్చు చేసే సమయం సంపాదించలేక పోయారు. మా అమ్మను చూస్తూ మా తాత అనుకునేవారు..‘ ఇది నాకు కూతురు కాదు... మా అమ్మ అక్కలను కలిపి మళ్లీ పుట్టించాడు దేవుడు’ అని.. మా అమ్మ కథ విన్నాక నాకు అర్థమైంది ఏమిటంటే ఆడపిల్లగా కుటుంబానికి సహాయం చేయాలి అనుకుంటే ఉద్యోగాలే చెయ్యక్కర్లేదు.. అందరినీ నా వారు అనుకుంటూ కలుపుకుని పోతే డబ్బు సంపాదించే ఉద్యోగం చేయకపోయినా మనసులను సంపాదించొచ్చు. ఇది అర్థమయ్యాక మా అమ్మ జీవితాన్ని గమనించి ఆమె చెప్పినవి, చెప్పనివి అక్షరాలుగా రాయడం మొదలుపెట్టాను. రాయడం మొదలు పెట్టిన తరువాత తెలిసింది ఇది మా అమ్మ కథ కాదు. కొన్ని వందల వేల అమ్మల కథ. ఇంటిపట్టున మిగిలిపోయాము అని బాధపడే ఆడపిల్లల, ఆడతల్లుల మనోవ్యధ. మన దేశంలో ఆడపిల్లలు కొన్ని కోట్ల మంది ఇంటి పట్టున ఉండిపోయాము అని బాధ పడుతూ వుంటారు. మీరు ఓడిపోలేదు. మీరు కూతుర్లుగా మీ అమ్మ నాన్నల ప్రేమను, పేరును, పెంపకాన్ని నిస్వార్థంగా ప్రపంచానికి పంచుతున్నారు, కుటుంబాలను, కలలను పెంచుతున్నారు. మీరు చేస్తున్న సేవకు వెల కట్టి డబ్బు ఇవ్వాలని ఆలోచన వచ్చినా అది ఏ దేశ కరెన్సీలో ఇచ్చినా మీకు సరిపోదు. మీకు కుమార్తెల దినోత్సవ శుభాకాంక్షలు. ఇదంతా రాస్తుంటే నా 17 నెలల కూతురు ‘అమ్మ జూచు జూచు’ అనుకుంటూ ఒక గ్లాస్ ను వంకర టింకరగా పట్టుకుని నా టేబుల్ దగ్గరకు వచ్చింది. నాలో ఉన్న ఆడపిల్ల నాకు పుట్టిన ఆడపిల్లను చూసి మురిసిపోయింది. – ప్రవల్లిక, రచయిత్రి, సికింద్రాబాద్కూతుళ్లు మేజిక్ చేస్తారుఇంటికి ఆడపిల్ల వుండటం గొప్ప వైభవం. నేను ఒక కూతుర్ని, ఒక కూతురికి తల్లిని. అయితే నేను మరీ అంత గొప్ప లేదా మంచి కూతుర్ని కాదు. బహుశా ఇంకొంచం బాగా వుండాల్సింది. జీవితపు ప్రతి దశలో మా అమ్మతో/కుటుంబంతో అనేక విషయాల్లో విభేదిస్తూ, గొడవ పడుతూ, అప్పుడప్పుడూ సర్దుకుపోతూ, నా స్వాతంత్ర కాంక్షను, అభి్రపాయాలను కాపాడుకుంటూ నడిపాను. మా అమ్మ కాస్త మొండిమనిషి కాబట్టి చిన్నతనంలో అలవికాని నా అల్లరిని, ఇప్పటికీ నా స్వభావంలో వుండే లోపాల్ని భరిస్తోంది. సున్నితమైన అమ్మైతే చాలా కష్టం అయేది. కూతురిగా నాకై నేనైతే జస్ట్ పాస్ మార్క్ వేసుకుంటాను. నా కూతురి దగ్గరకొస్తే తన వల్ల నేను టెన్షన్ పడిన సందర్భాలకన్నా గర్వపడిన సందర్భాలే ఎక్కువ. కూతుళ్లు, తల్లులకన్నా, తండ్రులకు సన్నిహితంగా వుంటారు అనే లోకోక్తి నేను నమ్మను. నా కూతురు నాకు దగ్గరగా వుంటుంది. నాకు కొత్త కొత్త విషయాలు నేర్పిస్తుంది. నాతో వాదిస్తుంది. నాది తప్పైతే మన్నిస్తుంది. మంచి కూతురిగా, మా అమ్మాయికి డిస్టింక్షన్ శాంక్షన్ చేస్తాను. ఇవాళ మా అమ్మ దగ్గరకువెళ్ళి అడిగితే కూడా తనకు తక్కువ మార్కులు వేసుకొని, తన కూతురికి ఎక్కువ మార్కులు ఇస్తుంది. కూతుర్లు అంతే. మురిపిస్తారు. మాజిక్ చేస్తారు. – ఎం.ఎస్.కె. కృష్ణజ్యోతి, రచయిత్రి, విజయవాడ -
#SriLankaElections: లంకలో ముక్కోణపు పోరు!
కల్లోల శ్రీలంకలో కీలకమైన అధ్యక్ష ఎన్నికల పోరుకు సర్వం సిద్ధమైంది. శనివారం దేశవ్యాప్తంగా పోలింగ్ జరగనుంది. పెను రాజకీయ రగడకు దారితీసి దేశాన్ని కుప్పకూలి్చన 2022 ఆర్థిక సంక్షోభం అనంతరం జరుగుతున్న తొలి ఎన్నికలివి. మాజీ ఆర్మీ చీఫ్ శరత్పోన్సెకాతో పాటు 38 మంది బరిలో ఉన్నా ప్రధాన పోరు మాత్రం ముగ్గురి మధ్యే కేంద్రీకృతమైంది. అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘె, విపక్ష నేత సజిత్ ప్రేమదాస, జనాదరణతో దూసుకుపోతున్న అనూర కుమార దిస్సనాయకె అమీతుమీ తేల్చుకోనున్నారు. 1982 తర్వాత శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో త్రిముఖ పోటీ నెలకొనడం ఇదే తొలిసారి. ముగ్గుర్లో అనూరకే స్పష్టమైన మొగ్గు కనిపిస్తోందని పరిశీలకులు చెబుతున్నారు. ఎవరు నెగ్గినా కుప్పకూలిన ఆర్థిక వ్యవస్థను చక్కదిద్ది దేశాన్ని గాడిన పెట్టడం పెను సవాలుగానే కనిపిస్తోంది. మోయలేని భారంగా మారిన 300 కోట్ల డాలర్ల ఐఎంఎఫ్ అప్పు భయపెడుతున్న నేపథ్యంలో ఎకానమీయే ప్రధాన అభ్యర్థులందరికీ ప్రధాన ఎన్నికల అంశంగా మారింది... ప్రచారమంతా ఐఎంఎఫ్ రుణం చుట్టే... 2022 సంక్షోభం అనంతరం లంకను ఆదుకోవడానికి ఏ దేశమూ పెద్దగా ముందుకు రాలేదు. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అంతర్జాతీయ ద్రవ్య నిధి నుంచి 290 కోట్ల డాలర్ల రుణం సాధించడం రణిల్ సాధించిన ఘనవిజయమని ఆయన మద్దతుదారులు చెప్పుకుంటున్నారు. కానీ అందుకోసం ప్రజల బతుకులనే పణంగా పెట్టారని, సంక్షేమ పథకాలన్నింటికీ కోత పెట్టి వారిని రోడ్డు పాలు చేశారని ప్రత్యర్థులు దుయ్యబడుతున్నారు. ఈ రెండేళ్లలో ద్రవ్యోల్బణం 74 శాతం పెరగడం రణిల్ అసమర్థ పాలన ఫలితమేనని మండిపడుతున్నారు. నిజానికి 2022 నాటి ఆర్థిక సంక్షోభానికి బీజాలు అంతకు పన్నెండేళ్ల ముందే పడ్డాయి. 2009లో అంతర్యుద్ధం ముగిశాక పునరి్నర్మాణం, అభివృద్ధి పథకాలకు లంక విపరీతంగా అప్పులు చేసింది. 2020 నాటికే వాటిని తీర్చలేని పరిస్థితికి చేరుకుంది. పులిమీద పుట్రలా కరోనా వచి్చపడటంతో ప్రధాన ఆదాయ వనరైన పర్యాటకం పూర్తిగా నిలిచిపోయి గుడ్లు తేలేసింది. 2022 నాటికి చమురు ధరలు ఆకాశాన్నంటడం, అమెరికా వడ్డీ రేట్లు అమాంతంగా పెంచేయడంతో పూర్తిగా చేతులెత్తేసింది. అంతర్జాతీయ రుణ భారం 5,100 కోట్లు దాటేసింది. చమురుతో పాటు తిండి గింజలు, ఔషధాల వంటి అత్యవసరాలను కూడా దిగుమతి చేసుకోలేని దుస్థితికి దిగజారింది. ద్రవ్యోల్బణం దెబ్బకు ఒక్క గుడ్డు ధర ఏకంగా 300 రూపాయలు దాటేసింది. కడుపు కాలిన ప్రజలు రాజపక్స సర్కారుపై తిరగబడ్డారు. జనాగ్రహానికి జడిసి ఆయన దేశం వీడి పలాయనం చిత్తగించాక అన్ని పక్షాల అంగీకారంతో రణిల్ గద్దెనెక్కారు. ఐఎంఎఫ్ రుణానికి బదులుగా సంక్షేమ పథకాల్లో భారీ కోతకు ఆయన అంగీకరించడంతో కరెంటు తదితరాలపై సబ్సిడీలు అటకెక్కాయి. వ్యాట్ మోత రెండింతలైంది. పేదరికం రెట్టింపైంది. కాకపోతే ఆర్థిక సంక్షోభం నుంచి దేశం కాస్తో కూస్తో తేరుకుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ITGC Thwaites Glacier: ‘ప్రళయ’ గ్లేసియర్తో... విలయమే!
మనిషి అత్యాశ భూమి మనుగడకే ఎసరు పెట్టే రోజు ఎంతో దూరం లేదని మరోసారి రుజువైంది. గ్లోబల్ వారి్మంగ్ దెబ్బకు అంటార్కిటికాలోని ‘డూమ్స్‌డే’ గ్లేసియర్ ఊహించిన దానికంటే శరవేగంగా కరిగిపోతోందట. అది మరో 200 ఏళ్లలోపే పూర్తిగా కరగడం ఖాయమని తాజా అంతర్జాతీయ అధ్యయనం ఒకటి కుండబద్దలు కొట్టింది. ‘‘అప్పుడు సముద్రమట్టాలు కనీసం పదడుగుల దాకా పెరిగిపోతాయి. అమెరికా నుంచి ఇంగ్లాండ్ దాకా, బంగ్లాదేశ్ నుంచి పసిఫిక్ దీవుల దాకా ప్రపంచమంతటా తీర ప్రాంతాలన్నీ నీటమునుగుతాయి. తీరప్రాంత మహానగరాలన్నీ కనుమరుగైపోతాయి. పైగా మనం అంచనా కూడా వేయలేనన్ని మరిన్ని దారుణ ఉత్పాతాలకు కూడా ఈ పరిణామం దారితీస్తుంది’’ అని స్పష్టం చేసింది. 2018 నుంచి ఆ గ్లేసియర్ కరుగుదల తీరుతెన్నులను ఆరేళ్లపాటు లోతుగా పరిశీలించిన మీదట ఈ నిర్ధారణకు వచి్చంది. ‘‘శిలాజ ఇంధనాల వాడకాన్ని పూర్తిగా ఆపేయడం వంటి చర్యలతో గ్లోబల్ వారి్మంగ్‌కు ఇప్పటికిప్పుడు ఏదోలా అడ్డుకట్ట వేసినా లాభమేమీ ఉండకపోవచ్చు. ఈ గ్లేసియర్ కరుగుదల రేటును తగ్గించడం ఇక దాదాపుగా అసాధ్యమే’’ అని గురువారం విడుదల చేసిన నివేదికలో హెచ్చరించింది! అంటార్కిటికాలో థ్వైట్స్ గ్లేసియర్ విస్తృతిలో ప్రపంచంలోనే అతి పెద్దది. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం సైజులో ఉంటుంది. ఇది కరిగితే సముద్ర మట్టాలు ప్రమాదకర స్థాయిలో పెరిగి ప్రపంచ మానవాళి మనుగడనే ప్రశ్నార్థకం చేస్తాయి. దాంతో సైంటిస్టులు దీన్ని డూమ్స్‌డే (ప్రళయకాల) గ్లేసియర్‌గా పిలుస్తుంటారు. అందుకే ‘ఇంటర్నేషనల్ థ్వైట్స్ గ్లేసియర్ కొలాబరేషన్’ పేరిట దిగ్గజ సైంటిస్టులంతా బృందంగా ఏర్పడి 2018 నుంచీ దీని కరుగుదల తీరుతెన్నులను నిశితంగా పరిశీలిస్తూ వస్తున్నారు. ఇందుకు ఐస్ బ్రేకింగ్ షిప్పులు, అండర్‌వాటర్ రోబోలను రంగంలోకి దించారు. ఐస్ఫిన్ అనే టార్పెడో ఆకారంలోని రోబోను ఐస్‌బర్గ్ అడుగుకు పంపి పరిశోధించారు. అది అత్యంత ప్రమాదకరమైన వేగంతో కరిగిపోతూ వస్తోందని తేల్చారు. నివేదికలోని ముఖ్యాంశాలు... → డూమ్స్‌డే గ్లేసియర్ కరగడం 1940 నుంచీ క్రమంగా ఊపందుకుంది. గత 30 ఏళ్లుగా శరవేగంగా కరిగిపోతోంది. అది ఈ శతాబ్దంలో ఊహాతీతంగా పెరిగిపోనుంది. → మరో 200 ఏళ్లలోపే గ్లేసియర్ తాలూకు మంచుపొరలన్నీ కుప్పకూలి కరగడం ఖాయం. ఫలితంగా వచ్చి కలిసే నీటి దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా సముద్రమ ట్టం కనీసం రెండడుగులు పెరుగుతుంది. → అంటార్కిటికాలోని విస్తారమైన మంచు పలకల సమూహాన్ని కరగకుండా పట్టి ఉంచేది డూమ్స్‌డే గ్లేసియరే. కనుక దానితో పాటే ఆ భారీ మంచు పలకలన్నీ కరిగి సముద్రంలో కలుస్తాయి. దాంతో సముద్రమట్టం ఏకంగా పదడుగులకు పైగా పెరిగిపోతుంది. → డూమ్స్‌డే గ్లేసియర్ వాలుగా ఉంటుంది. దాంతో అది కరుగుతున్న కొద్దీ అందులోని మంచు వెచ్చని సముద్ర జలాల ప్రభావానికి మరింతగా లోనవుతూ వస్తుంది. వెచ్చని జలాలు గ్లేసియర్ అడుగుకు చొచ్చుకుపోతున్నాయి. దాంతో అది కరిగే వేగం మరింతగా పెరుగుతోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మోదీని అమెరికాలో కలుస్తా
వాషింగ్టన్/న్యూయార్క్: మూడ్రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని మోదీ అమెరికాకు వచి్చనపుడు ఆయనను కలుస్తానని అమెరికా ఎన్నికల్లో అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఫ్లోరిడాలోని వెస్ట్ పామ్‌బీచ్ గోల్ఫ్‌క్లబ్‌లో ఆగంతకుడు తనను చంపేందుకు విఫలయత్నంచేశాక ట్రంప్ తొలిసారిగా ఎన్నికల ప్రచారకార్యక్రమంలో పాల్గొన్నారు. బుధవారం మిషిగన్ రాష్ట్రంలోని ఫ్లింట్ నగరంలోని టౌన్హాల్లో రిపబ్లికన్ పార్టీ కార్యకర్తలనుద్దేశించి ట్రంప్ ప్రసంగించారు. ‘‘అమెరికా దిగుమతుల విషయంలో అధిక సుంకాలు విధిస్తూ భారత్ భిన్నంగా వ్యవహరిస్తోంది. అయినాసరే వారి నేత, ప్రధాని మోదీ అమెరికా పర్యటనకు వచి్చనపుడు ఆయనను కలుస్తా. ఆయన అసాధారణ వ్యక్తి’’అని అన్నారు. అయితే ట్రంప్ వ్యాఖ్యలపై భారత విదేశాంగ శాఖ స్పందించలేదు. కాబోయే అధ్యక్షులనే కాల్చుతున్నారెందుకో.. తనపై జరిగిన దాడి యత్నాన్ని ట్రంప్ ప్రస్తావించారు. ‘‘వేలాది మంది మద్దతుదారుల సమక్షంలో ప్రచారంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. అయితే కార్ రేసింగ్‌లో బుల్ రైడింగ్‌లో పాల్గొనడం ఎంత ప్రమాదకరమో అధ్యక్ష ఎన్నికల్లో పాల్గొనడం కూడా అంతే ప్రమాదకరం. అసలు కాబోయే అధ్యక్షులను మాత్రమే ఎందుకు లక్ష్యంగా చేసుకుని కాల్పులకు తెగబడుతున్నారో అర్థంకావట్లేదు’’అని ట్రంప్ అన్నారు. కాల్పుల యత్నం తర్వాత కమల తనకు ఫోన్ చేశారని ట్రంప్ వెల్లడించారు. ‘‘ఆమె అలా ఫోన్ చేయడం చాలా బాగుంది. ఇలాంటి పద్ధతిని మనం ఖచి్చతంగా అభినందించాల్సిందే’అని అన్నారు. అమెరికాలో హింసకు తావులేదు అని ట్రంప్‌కు ఫోన్‌చేసిన సందర్భంగా చెప్పానని కమల హారిస్ వెల్లడించడం తెల్సిందే. పరస్పర ఆరోపణలు ట్రంప్‌పై యత్యాయత్నాలకు మీరంటే మరే కారణమని రిపబ్లికన్, డెమొక్రటిక్ పార్టీ నేతలు పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. తాను అధ్యక్షుడినైతే డెమొక్రాట్లపై కేసులు బనాయించి, జైల్లో పడేస్తానని, శరణార్థులను బలవంతంగా దేశం నుంచి బహిష్కరించి పంపించేస్తానని ట్రంప్ చేస్తున్న ప్రకటనలే ఆయన ప్రాణాల మీదకు తెచ్చాయని డెమొక్రాట్లు ఆరోపించారు. డెమొక్రాట్ల ఎన్నికల ప్రచారంలో ట్రంప్‌పై విద్వేష వ్యాఖ్యలు చేయడం వల్లే ట్రంప్ ప్రాణాలకు ముప్పు ఏర్పడిందని రిపబ్లికన్లు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. -
Congress Prty: 7 కీలక హామీలు
సాక్షి, న్యూఢిల్లీ: హరియాణా శాసనసభ ఎన్నికలు సమీపిస్తుండటంతో కాంగ్రెస్ పార్టీ బుధవారం తమ హామీల చిట్టీని బహిర్గతం చేసింది. తాము అధికారంలోకి వస్తే ప్రజల సంక్షేమం కోసం ఏం చేస్తామనే విషయాన్ని మేనిఫెస్టోలో వివరించింది. పేద, మధ్య తరగతి ప్రజలు, మహిళలు, రైతులకు వరాలు కురిపించింది. మహిళలకు ప్రతి నెల రూ.2,000 ఆర్థికసాయం, రూ.500కే గ్యాస్ సిలిండర్ సహా పలు వర్గాలపై వరాల జల్లు కురిపించింది. ఏడు కీలకమైన హామీలు ఇచ్చింది. ఈ మేరకు మంగళవారం ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, హరియాణ మాజీ ముఖ్యమంత్రి భూపేందర్ సింగ్ హూడా, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు ఉదయ్ భాన్ల సమక్షంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే 53 పేజీల మేనిఫెస్టోను విడుదల చేశారు.ఏడు గ్యారంటీలు ఇవే → మహిళా సాధికారత: 18 నుంచి 60 ఏళ్ల వయసున్న మహిళలకు నెలకు రూ.2,00 చొప్పున ఆర్థికసాయం. రూ.500కే గ్యాస్ సిలిండర్ → సామాజిక భద్రత: వృద్ధులు, దివ్యాంగులు, వితంతులకు రూ.6,000 పెన్షన్ → యువతకు: రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ → ఉచితాలు: రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం, 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్→ పేదలకు: ప్రతి పేద కుటుంబానికి 100 గజాల స్థలంలో ఇల్లు. ఇందులో రూ.3.5 లక్షల ఖర్చుతో రెండు గదుల ఇళ్లు → రైతులకు: పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత → వెనుకబడిన వర్గాలకు: కులగణన చేసి వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి తగు చర్యలు తీసుకోవడం. క్రిమిలేయర్ పరిమితిని రూ.10లక్షలకు పెంపు గెలిచాకే సీఎం అభ్యర్థి ఖరారు: ఖర్గే హరియాణలో ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ఇచి్చన ఏడు హామీలను అమలు చేస్తామని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు. యువతకు ఉపాధి అవకాశాల కల్పనే లక్ష్యంగా రెండు లక్షల ఉద్యోగాలను భర్తీచేస్తామన్నారు. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తామని చెప్పారు ‘‘దాదాపు 35 లక్షల ఉద్యోగాలను కేంద్ర ప్రభుత్వం భర్తీ చేయకుండా నిలిపివేసింది. బీజేపీ డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఒక ఇంజన్ ముందుకు తీసుకెళ్తుంటే మరో ఇంజన్ వెనక్కి లాగుతోంది. మేం మేనిఫెస్టోలో చెప్పిన ఏడు ప్రధాన వాగ్దానాలను అధికారంలోకి రాగానే నెరవేరుస్తాం. తొమ్మిదిన్నరేళ్లలో రాష్ట్రానికి బీజేపీ చేసిన నష్టాన్ని సరిదిద్దటంతోపాటు రాష్ట్రంలో వృద్ధి పథంలో పరుగులు పెట్టించేందుకు ‘అభివృద్ధి ఎక్స్‌ప్రెస్ ఇంజన్’జత చేస్తాం’’అని ఖర్గే వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో ఘన విజయం సాధించాకే ముఖ్యమంత్రి అభ్యరి్థని ప్రకటిస్తామని ఖర్గే స్పష్టంచేశారు. మేనిఫెస్టో విడుదల సందర్భంగా హరియాణా మాజీ ముఖ్యమంత్రి భూపేందర్ హుడా సైతం మాట్లాడారు. ‘‘నాటి ప్రధాని, దివంగత ఇందిరాగాంధీ హయాంలో 1966లో మా రాష్ట్రం ఏర్పాటైంది. నాటి నుంచి 2014 వరకు రాష్ట్రం అభివృద్ధి చెందింది. అయితే తొమ్మిదిన్నరేళ్ల బీజేపీ పాలనలో రాష్ట్రం వెనుకబడిపోయింది. మేం అధికారంలోకి వచ్చాక మళ్లీ హరియాణాను నంబర్ వన్ చేస్తాం’అని హూడా అన్నారు. -
జమిలి ఇలా రెండు దశలుగా అమలు
కోవింద్ కమిటీ లోక్‌సభ ఎన్నికలకు ముందు గత మార్చిలో జమిలి ఎన్నికలపై నివేదిక సమరి్పంచింది. ’ఒక దేశం, ఒకే ఎన్నిక’ను రెండు దశల్లో అమలు చేయాలని సూచించింది. ఏం చెప్పిందంటే... → జమిలి ఎన్నికలను అమల్లోకి తెచ్చేందుకు చట్టపరంగా చెల్లుబాటయ్యే వ్యవస్థను కేంద్రం అభివృద్ధి చేయాలి. → తొలి దశలో లోక్‌సభకు, అన్ని అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరపాలి. → అనంతరం 100 రోజుల్లోపు రెండో దశలో పంచాయతీలు, మున్సిపాలిటీల వంటి స్థానిక సంస్థలన్నింటికీ ఎన్నికలు జరపేలా వ్యవస్థలను రూపొందించాలి. → సార్వత్రిక ఎన్నికలు జరిగి, కొత్తగా కొలువుదీరే లోక్‌సభ తొలిసారి సమావేశమయ్యే తేదీని ‘అపాయింటెడ్ డే’గా రాష్ట్రపతి నోటిఫై చేయాలి. దాంతో లోక్‌సభకు, అన్ని అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరిపేందుకు నాంది పడుతుంది. → అపాయింటెడ్ డే తర్వాత ఏర్పడే అన్ని అసెంబ్లీల గడువూ లోక్‌సభతో పాటే ముగుస్తుంది. తదనంతరం లోక్‌సభ, అన్నీ అసెంబ్లీల ఎన్నికలు ఒకేసారి జరుగుతాయి. → లోక్‌సభలో ఏ పారీ్టకీ మెజారిటీ రాకుండా హంగ్ ఏర్పడి, లేదా అవిశ్వాస తీర్మానం వంటివి నెగ్గి సభ రద్దయినా మళ్లీ ఎన్నికలు జరపాలి. → అలాంటి సందర్భంలో కొత్త సభ గడువు.. రద్దయిన సభలో మిగిలిన కాలావధి వరకు మాత్రమే ఉంటుంది. → అసెంబ్లీలకు కూడా ఇదే వర్తిస్తుంది. అంటే హంగ్ తదితర కారణాలతో ఎన్నికలు జరిగి మధ్యలో కొత్తగా ఏర్పడే అసెంబ్లీలు ఐదేళ్లు కొనసాగకుండా లోక్‌సభతో పాటే రద్దవుతాయి. → అన్ని ఎన్నికలకూ ఉమ్మడిగా ఒకే ఎలక్టోరల్ రోల్, ఓటర్ల ఫోటో గుర్తింపు కార్డు (ఎపిక్) ఉపయోగించాలి. ఆమోదం ఈజీ కాదు జమిలి ఎన్నికలకు పార్లమెంటు ఆమోదముద్ర పొందడం బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే సర్కారుకు అంతా ఈజీ కాబోదు. నవంబర్ గేమ్ అధికార కూటమికి అంత అనుకూలంగా లేదు. జమిలికి సంబంధించి కోవింద్ కమిటీ పలు రాజ్యాంగ సవరణలు సూచించింది. వాటికి ఆమోదం లభించాలంటే ఉభయ సభల్లోనూ మూడింట రెండొంతుల మంది ఎంపీల మద్దతు తప్పనిసరి. అందుకు 543 మంది ఎంపీలున్న లోక్‌సభలో 362 మంది; 245 మంది ఎంపీలుండే రాజ్యసభలో 164 మంది మద్దతు అవసరం. కానీ ఎన్డీయే కూటమికి లోక్‌సభలో 293 మంది, రాజ్యసభలో 113 మంది ఎంపీలే అన్నారు. అయితే కోవింద్ కమిటీ ముందు జమిలిని సమరి్థంచిన పారీ్టలకున్న లోక్‌సభ సభ్యుల సంఖ్య 271 మాత్రమే. దాన్ని వ్యతిరేకించిన 15 పారీ్టలకు 205 మంది లోక్‌సభ సభ్యులున్నారు. విపక్ష ఇండియా కూటమికి రాజ్యసభలో 85 మంది సభ్యుల బలముంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
One Nation One Election: ఆచరణ సాధ్యమేనా?
జమిలి. ప్రస్తుతం దేశమంతటా ప్రతిధ్వనిస్తున్న పదం. అయితే లోక్‌సభ, అసెంబ్లీలు, స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం ఏ మేరకు ఆచరణ సాధ్యమన్న దానిపై భిన్నాప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వంటి నాలుగైదు అసెంబ్లీలకు మాత్రమే లోక్‌సభతో పాటు ఎన్నికలు జరుగుతున్నాయి. చాలా అసెంబ్లీలకు విడిగా, వేర్వేరుగానే ఎన్నికలొస్తున్నాయి. వీటన్నింటినీ ఒక్కతాటిపైకి తెచ్చి ఒకేసారి ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. అందుకు పలు అసెంబ్లీలను గడువుకు ముందే రద్దు చేయడం, కొన్నింటిని పొడిగించడమో, లేదంటే గడువు తీరాక సుప్త చేతనావస్థలో ఉంచడం వంటి చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. ఇది ప్రజాస్వామ్యానికి, సమాఖ్య స్ఫూర్తికి గొడ్డలి పెట్టేనన్న అభిప్రాయముంది. లేదంటే లోక్‌సభ కొత్తగా తొలిసారి కొలువుదీరిన తేదీని ‘అపాయింటెడ్ డే’గా ప్రకటించి, ఆ తర్వాత ఏర్పాటయ్యే అసెంబ్లీల అన్నింటి గడువూ.. వాటి ఐదేళ్ల కాలపరిమితితో సంబంధం లేకుండా.. లోక్‌సభతో పాటే ముగిసే ప్రతిపాదనను అమలు చేయాలి. ఇలా ఒకసారి చేస్తే సరిపోతుందని, ఇక అప్పటి నుంచి జమిలి ఎన్నికలే ఉంటాయని కోవింద్ కమిటీ పేర్కొంది. ఇందులో ఆచరణపరంగా ఎన్నో ఇబ్బందులున్నాయన్నది నిపుణుల మాట. అంతేగాక అసలు ఈ ప్రతిపాదన రాష్ట్రాల అధికారాల్లో అవాంఛిత జోక్యమే తప్ప మరోటి కాదని పలు పార్టీలు వాదిస్తున్నాయి. పైగా లోక్‌సభతో పాటే అసెంబ్లీలకు ఎన్నికలు జరిగితే జాతీయాంశాలే తెరపైకి వస్తాయని, రాష్ట్రాల్లోని స్థానికాంశాలు పక్కకు పోతాయని ప్రాంతీయ పారీ్టలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ కారణంగా డీఎంకే వంటి పలు పారీ్టలు జమిలిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఆ మేరకు అసెంబ్లీల్లో తీర్మానం కూడా చేశాయి. పైగా హంగ్, అవిశ్వాస తీర్మానం నెగ్గడం వంటి ఏ కారణంతో అయినా గడువుకు ముందే చట్టసభ రద్దయితే ఎన్నికల తర్వాత ఏర్పడే కొత్త సభ ఐదేళ్లు కాకుండా రద్దయిన సభలో మిగిలిన కాలావధి పాటు మాత్రమే కొనసాగాలని కోవింద్ కమిటీ సూచించింది. అలాగైతే జమిలి ప్రక్రియకు భంగం కలగకుండా ఉంటుందని పేర్కొంది. కానీ దీనిపైనా పలు పారీ్టలు తీవ్ర అభ్యంతరం తెలుపుతున్నాయి. ప్రజాతీర్పు కోరి అత్యంత వ్యయ ప్రయాసలకు ఓర్చి అధికారంలోకి వచ్చాక ఐదేళ్లు కొనసాగరాదనడం అప్రజాస్వామికమని, రాజ్యాంగ స్ఫూర్తికి కూడా విరుద్ధమని వాదిస్తున్నాయి. రాజ్యాంగ వ్యతిరేకం: ఖర్గే ‘‘ఒకే దేశం.. ఒకే ఎన్నిక మన దేశంలో ఆచరణ సాధ్యం కాదు. ఇలాంటి ఎన్నికలు రాజ్యాంగం, సమాఖ్య స్ఫూర్తికి వ్యతిరేకం. దేశంలో ఎన్నికలు వచ్చినప్పుడల్లా సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి కొత్తకొత్త ఎత్తుగడలు వేయడం బీజేపీకి అలవాటే. ప్రజాస్వామ్య విరుద్ధమైన జమిలి ఎన్నికలను దేశ ప్రజలు ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించబోరు’’ అది సంఘ్ పరివార్ రహస్య అజెండా ‘‘ఒకే దేశం–ఒకే ఎన్నిక అనేది దేశ సమాఖ్య నిర్మాణాన్ని బలహీనపరుస్తుంది. ఇది సంఘ్ పరివార్ రహస్య అజెండాలో ఒక భాగమే. దేశంలో ప్రస్తుతం అమల్లో ఉన్న ఎన్నికల వ్యవస్థను మార్చేసి అధ్యక్ష తరహా పాలనా విధానాన్ని తీసుకురావాలన్నదే సంఘ్ పరివార్ అసలు కుట్ర. భారత పార్లమెంటరీ వ్యవస్థను దెబ్బతీయాలన్న ఆలోచనను మానుకోవాలి’’. – పినరయి విజయన్, కేరళ ముఖ్యమంత్రి ప్రజలంతా వ్యతిరేకించాలి సమాఖ్య వ్యవస్థను, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ నిర్మాణాన్ని దెబ్బతీసే జమిలి ఎన్నికలను ప్రజలంతా వ్యతిరేకించాలి. ఒకే దేశం–ఒకే ఎన్నిక ద్వారా ప్రాంతీయ పార్టీలను బలహీనపర్చేందుకు బీజేపీ కుతంత్రాలు సాగిస్తోంది. ప్రభుత్వం మధ్యలోనే కూలిపోతే ఏం చేస్తారు? – అసదుద్దీన్ ఒవైసీ, ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ – సాక్షి, నేషనల్ డెస్క్ -
అంతరిక్షంలో మన జైత్రయాత్ర
న్యూఢిల్లీ: భారత అంతరిక్ష పరిశోధనల్లో మరో ముందడుగు పడింది. అంతరిక్ష రంగంలో భారత్ జైత్రయాత్రకు మార్గం సుగమమైంది. ఈ దిశగా పలు కీలక కార్యక్రమాలకు కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది. చందమామపైకి భారత వ్యోమగాములను పంపించి, అక్కడ నమూనాలు సేకరించి, క్షేమంగా వెనక్కి తీసుకురావడానికి ఉద్దేశించిన చంద్రయాన్–4 మిషన్‌కు ఆమోద ముద్రవేసింది. వ్యోమగాములను పంపించడానికి అవసరమైన సాంకేతికత పరిజ్ఞానాన్ని, వ్యూహాలను ఈ కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి చేస్తారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.2,104.06 కోట్లు ఖర్చు చేయబోతోంది. చంద్రయాన్–4 స్పేస్‌క్రాఫ్ట్ అభివృద్ధి, లాంచింగ్ బాధ్యతను ఇస్రోకు అప్పగించబోతున్నారు. ఈ నూతన మిషన్‌కు పూర్తిగా దేశీయంగా అభివృద్ధి చేసిన టెక్నాలజీనే ఉపయోగించనున్నారు. చంద్రయాన్–3 ప్రయోగం విజయవంతం కావడంతో చంద్రయాన్–4ను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. అంతరిక్షంలో సొంతంగా ‘భారతీయ అంతరిక్ష కేంద్రం’ నిర్మించుకోవడంతోపాటు 2040 నాటికి వ్యోమగాములను చంద్రుడిపైకి పంపించాలని భారత్ లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇందులో భాగంగానే చంద్రయాన్–4కు శ్రీకారం చుడుతోంది. ఈ మిషన్‌లో భారతీయ పరిశ్రమలను, విద్యా సంస్థలను భాగస్వాములను చేస్తారు. ఎన్జీఎల్వీ సూర్య పాక్షిక పునరి్వనియోగ తదుపరి తరం లాంచ్ వెహికల్(ఎన్జీఎల్వీ) ‘సూర్య’ అభివృద్ధికి సైతం కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇస్రో లాంచ్ వెహికల్ మార్క్–3 కంటే మూడు రెట్లు అధికంగా పేలోడ్‌ను ఇది మోసుకెళ్లగలదు. మార్క్–3తో పోలిస్తే ఖర్చు మాత్రం కేవలం 50 శాతమే పెరుగుతుంది. ఎన్జీఎల్వీ ‘సూర్య’ అభివృద్ధికి ప్రభుత్వం రూ.8,240 కోట్లు కేటాయించింది. గగన్‌యాన్ కార్యక్రమాన్ని మరింత విస్తరింపజేస్తూ భారతీయ అంతరిక్ష స్టేషన్లో మొదటి మాడ్యూల్(బీఏఎస్–1) అభివృద్ధికి కేబినెట్ పచ్చజెండా ఊపింది. గగన్‌యాన్‌లో భాగంగా 2028 డిసెంబర్ నాటికి ఎనిమిది మిషన్లు పూర్తిజేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గగన్‌యాన్‌కు రూ.20,193 కోట్లు కేటాయించింది. కార్యక్రమ విస్తరణ కోసం అదనంగా రూ.11,170 కోట్లు కేటాయించింది. → బయోటెక్నాలజీ రీసెర్చ్ ఇన్నోవేషన్, ఎంటర్ప్రెన్యూర్íÙప్ డెవలప్మెంట్(బయో–రైడ్) పథకానికి మంత్రివర్గం ఆమోదం తెలియజేసింది. బయో టెక్నాలజీ రంగంలో పరిశోధనలు, అభివృద్ధికి ఈ పథకం తోడ్పాటు అందించనుంది. ఈ పథకం అమలుకు రూ.9,197 కోట్లు కేటాయించారు. → యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్, ఎక్స్టెండెడ్ రియాలిటీ రంగాల్లో నేషనల్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్(ఎన్సీఓఈ) ఏర్పాటు ప్రతిపాదనకు కేబినెట్ అంగీకారం తెలిపింది. ఈ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ద్వారా ఇండియాను కంటెంట్ హబ్‌గా మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది. → 2024–25 రబీ సీజన్లో ఫాస్ఫేట్, పొటాష్ ఎరువులపై రూ.24,474.53 కోట్ల రాయితీ ఇచ్చేందుకు కేబినెట్ సుముఖత వ్యక్తంచేసింది. ఈ రాయితీ వల్ల సాగు వ్యయం తగ్గుతుందని, రైతులకు భరోసా లభిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రైతన్నలకు కొరత లేకుండా నిరంతరాయంగా ఎరువులను అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. → ప్రధానమంత్రి అన్నదాత ఆయ్ సంరక్షణ్ అభియాన్(పీఎం–ఆశా)కు కేబినెట్ నుంచి ఆమోదం లభించింది. రైతులకు తగిన మద్దతు ధర అందించడంతోపాటు మార్కెట్లో నిత్యావసరాల ధరలను నియంత్రించడానికి 2025–26లో రూ.35,000 కోట్లతో ఈ పథకం అమలు చేస్తారు. పీఎం–ఆశాతో రైతులతోపాటు వినియోగదారులకు సైతం లబ్ధి చేకూరుతుందని ప్రధాని మోదీ స్పష్టంచేశారు. → దేశవ్యాప్తంగా గిరిజన వర్గాల సామాజిక–ఆర్థిక స్థితిగతులను మెరుగుపర్చడమే లక్ష్యంగా ‘ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత్ గ్రామ్ అభియాన్’కు మంత్రివర్గం ఆమోదం తెలియజేసింది. ఈ పథకానికి రూ.79,156 కోట్లు కేటాయించారు.‘వీనస్ ఆర్బిటార్ మిషన్’ శుక్ర గ్రహంపై మరిన్ని పరిశోధనలకు గాను ‘వీనస్ ఆర్బిటార్ మిషన్’ అభివృద్ధికి కేంద్ర కేబినెట్ అంగీకారం తెలిపింది. డిపార్టుమెంట్ ఆఫ్ స్పేస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అమలు చేస్తారు. శుక్ర గ్రహం కక్ష్యలోకి సైంటిఫిక్ స్పేస్‌క్రాఫ్ట్ పంపించాలని నిర్ణయించారు. ‘వీనస్ ఆర్బిటార్ మిషన్’కు కేంద్ర కేబినెట్ రూ.1,236 కోట్లు కేటాయించింది. ఇందులో రూ.824 కోట్లతో స్పేస్‌క్రాఫ్ట్‌ను అభివృద్ధి చేస్తారు. -
Israel Hezbollah War: పేజర్లో 3 గ్రాముల పేలుడు పదార్థం!
లెబనాన్, సిరియాల్లో పేజర్ల అనూహ్య పేలుళ్లతో గతంలో ఎన్నడూలేనంతగా తొలిసారిగా పేజర్లపై చర్చ మొదలైంది. మంగళవారం నాటి ఘటనలో లెబనాన్, సిరియాల్లో మరణించిన వారి సంఖ్య బుధవారానికి 12కు పెరిగింది. ఇందులో ఇద్దరు చిన్నారులుసైతం ఉన్నారు. దాదాపు 3,000 మంది గాయపడ్డారు. అసలు ఏమిటీ పేజర్లు? అవి ఎలా పనిచేస్తాయి? వాటిల్లోకి పేలుడు పదార్థం ఎలా వచ్చి చేరింది? తదతర అంశాలను ఓసారి చూద్దాం.ఫోన్లో నిఘా భయం.. అందుకే పేజర్గాజా స్ట్రిప్‌లో హమాస్‌కు బాసటగా నిలుస్తూ లెబనాన్‌లోని హెజ్బొల్లా.. ఇజ్రాయెల్‌పై దాడులు చేస్తోంది. తమ వ్యూహాలు ఇజ్రాయెల్‌కు చిక్కకుండా ఉండేందుకు హెజ్బొల్లా ఒక కొత్త ఎత్తుగడ వేసింది. ఫోన్ల ద్వారా సున్నిత, రహస్య సమాచార మార్పిడి జరిగితే ఇజ్రాయెల్ పసిగట్టే ప్రమాదం ఉందని గ్రహించి ఫోన్లకు స్వస్తి పలికింది. వెంటనే ఫోన్లను పగలగొట్టి పాతిపెట్టాలని హెజ్బొల్లా ప్రధాన కార్యదర్శి హసస్ నస్రల్లామ్ తమ సభ్యులకు ఫిబ్రవరి 13న పిలుపునిచ్చారు. ఫోన్లకు బదులు పేజర్ వాడాలని సూచించారు. పేజర్లో సమాచారం అత్యంత సురక్షితంగా, భద్రంగా ఉంటుందని వారి నమ్మకం. దీంతో యుద్ధక్షేత్రంలో ఉండే సైనికులు మొదలు సహాయక సేవల్లో ఉండే వైద్యుల వరకు వివిధ విభాగాల సభ్యులు పేజర్ వాడటం మొదలెట్టారు. వీరి కోసం ఈ ఏడాది ప్రారంభంలో కొత్త పేజర్లను విదేశాల నుంచి తెప్పించారు. పోలీసు, అగ్నిమాపక శాఖలు సహా పలు అత్యవసర సేవల్లో పనిచేసే సిబ్బంది తక్షణ హెచ్చరికల కోసం పేజర్లపై ఆధారపడుతున్నారు.బ్రాండ్ మాదే.. ఉత్పత్తి మాది కాదు లెబనాన్‌లో పేలుళ్లకు ఉపయోగించిన పేజర్ ఏఆర్–924 రకానికి చెందినది. ఈ ఏడాది ప్రారంభంలో 5,000 పేజర్లను హెజ్బొల్లా ఆర్డర్ చేసింది. తైవాన్‌కు చెందిన గోల్డ్ అపోలో సంస్థ నుంచి ఏఆర్–924 పేజర్లను తెప్పించినట్లు లెబనాన్ భద్రతా వర్గాలు తెలిపాయి. ఉత్పత్తి స్థాయిలోనే ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మొస్సాద్ రంగంలోకి దిగి ప్రతి పేజర్లో 3 గ్రాముల బరువైన పేలుడు పదార్థాన్ని మదర్‌బోర్డులో అమర్చిందని హెజ్బొల్లా, లెబనాన్ భద్రతా వర్గాలు ఆరోపిస్తున్నాయి. పేల్చేందుకు శత్రువు పంపిన కోడ్‌ను మదర్ బోర్డ్ అందుకున్నాక పేజర్లోని పేలుడు పదార్థం క్రియాశీలమై పేలిందని భద్రతా వర్గాలు అంచనా వేస్తున్నాయి. పేజర్లను నెలల తరబడి వాడుతున్నా వాటిలోని పేలుడు పదార్థాన్ని హెజ్బొల్లా వర్గాలు గుర్తించకపోవడం తీవ్ర భద్రతావైఫల్యంగా చెబుతున్నారు. ఆ పేజర్లను మొదట్లో స్కాన్ చేసినపుడు ఎలాంటి పేలుడు పదార్థం జాడ కనిపించలేదని వారు చెబుతున్నారు. అయితే ఈ పేజర్లను హంగేరీకి చెందిన ‘బీఏసీ కన్సల్టింగ్ కేఎఫ్టీ’ అనే సంస్థ రూపొందించిందని ఆ బ్రాండ్ యజమాని గోల్డ్ అపోలో వ్యవస్థాపకుడు హుసు చింగ్–కువాంగ్ తెలిపారు. ‘ఏఆర్–924 అనే బ్రాండ్ మాత్రమే మాది. ఆ బ్రాండ్ పేరుతో ఉన్న ఉత్పత్తి మాది కాదు. ఆ బ్రాండ్ పేరును వాడుకునేందుకు బీఏసీకి అనుమతి ఇచ్చాం. ఈ మేరకు మూడేళ్లక్రితం ఒప్పందం కుదిరింది’’ అని చింగ్కువాంగ్ బుధవారం చెప్పారు. అయితే బీఏసీ కన్సల్టింగ్ కేఎఫ్టీ అనేది ఒక డొల్లకంపెనీ అని వార్తలొచ్చాయి. హంగేరీలోని బుడాపెస్ట్ నగరంలో సంస్థ ప్రధాన కార్యాలయం ఒక జనావాస అపార్ట్మెంట్లో ఉంది. అక్కడ ఒక కిటికీకి బీఏసీ కన్సల్టింగ్ అనే స్టిక్కర్ తప్పితే అక్కడ ఏమీ లేదని అసోసియేటెడ్ ప్రెస్ పాత్రికేయులు తేల్చారు.గతంలోనూ సాంకేతికతను వాడిన ఇజ్రాయెల్పేజర్కాకుండా గతంలో ఇలాగే వస్తువుల్లో పేలుడు పదార్థాలను అమర్చి శత్రువులను అంతంచేసిన చరిత్ర మొస్సాద్‌కు ఉంది. టెక్నాలజీ సాయంతో పేలుళ్లు జరిపిన సుదీర్ఘ చరిత్ర ఇజ్రాయెల్‌కు ఉంది. 1996లో హమాస్ కీలక బాంబ్మేకర్ యాహ్యా అయాస్ను హతమార్చేందుకు ఇజ్రాయెల్ పేలుడు పదార్థాన్ని మొబైల్ ఫోన్లో అమర్చింది. ఇజ్రాయెల్ నిఘా సంస్థ షిన్‌బెట్ గతంలో యాహ్యా ఫోన్లో 15 గ్రాముల ఆర్డీఎక్స్ పేలుడు పదార్థాన్ని నింపింది. తండ్రికి అయాష్ ఫోన్ కాల్ చేసినప్పుడు ఫోన్ మాట్లాడేది అయాష్ అని నిర్ధారించుకున్నాక దానిని పేల్చి అయాస్ను అంతంచేశారు. రిమోట్ ద్వారా నియంత్రించే కృత్రిమమేధతో పనిచేసే మిషిన్గన్తో ఇరాన్ అణు శాస్త్రవేత్త, ఉప రక్షణ మంత్రి మోసెన్ ఫక్రిజాదేను 2020లో హతమార్చింది. ఇజ్రాయెల్ 2021లో ఇరాన్ చమురు మంత్రిత్వ శాఖకు చెందిన సర్వర్లను హ్యాక్ చేసి దేశవ్యాప్తంగా చమురు సరఫరాను స్తంభింపజేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇరాన్‌లోని రెండు ప్రధాన గ్యాస్ పైప్లైన్లను పేల్చి పలు నగరాల సేవలకు అంతరాయం కలిగించింది. జూలైలో టెహ్రాన్‌లోని ఒక అతిథిగృహంలోని గదిలో నెలల క్రితమే శక్తివంతమైన బాంబును అమర్చి హమాస్ నాయకుడు ఇస్మాయిల్ హనియాను హతమార్చింది.– నేషనల్ డెస్క్, సాక్షి -
Israel Hezbollah War: నిన్న పేజర్లు నేడు వాకీ టాకీలు
బీరుట్: వాకీటాకీలు, సౌర విద్యుత్ వ్యవస్థల పేలుళ్లతో లెబనాన్ దద్దరిల్లింది. గాజా స్ట్రిప్‌పై భీకర భూతల, గగనతల దాడులతో తెగబడిన ఇజ్రాయెల్ తాజా తన లక్ష్యాన్ని లెబనాన్ వైపు తిప్పిందని బుధవారం నాటి అనూహ్య పేలుళ్ల స్పష్టమైంది. హెజ్బొల్లా సాయుధులు విరివిగా వాడే పేజర్లు పేలి 24 గంటలు గడవకముందే లెబనాన్‌లో బుధవారం వాకీటాకీలు, సౌరవిద్యుత్ వ్యవస్థలు పేలిపోయాయి. ఈ అనూహ్య పేలుళ్ల ఘటనల్లో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. 450 మంది గాయాలపాలయ్యారు. మృతులు, క్షతగాత్రుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. పేజర్ల పేలుళ్లతో 13 మంది చనిపోయి 2,800 మంది రక్తమోడిన తరుణంలో మరో ‘సాంకేతిక’ పేలుళ్ల పర్వానికి దిగి ఇజ్రాయెల్ కొత్త యుద్ధతంత్రానికి తెరలేపిందని అంతర్జాతీయంగా విశ్లేషణలు వెల్లువెత్తాయి. గాజా స్ట్రిప్‌లో దాదాపు మొత్తం భూభాగాన్ని జల్లెడపట్టిన ఇజ్రాయెల్ ఇప్పుడు తన లక్ష్యాన్ని లెబనాన్‌కు మార్చుకుందని తాజా ఉదంతం చాటుతోంది. అంతిమయాత్ర వేళ పేలుళ్లు పేజర్ల పేలుళ్లలో మరణించిన ముగ్గురు హెజ్బొల్లా సభ్యులు, ఒక చిన్నారి అంతిమయాత్రలు బీరుట్ శివారులోని దహియేలో కొనసాగుతున్నపుడే వాకీటాకీలు పేలడం గమనార్హం. ‘‘బీరుట్లో చాలా చోట్ల వాకీటాకీలు పేలాయి. ఎల్రక్టానిక్ పరికరాలు పేలిన ఘటనల్లో 9 మంది చనిపోయారు’’ అని లెబనాన్ ఆరోగ్య శాఖ బుధవారం ప్రకటించింది. బీరుట్ నగరంతోపాటు లెబనాన్‌లో చాలా చోట్ల పేలుళ్లు జరిగాయని హెచ్»ొల్లా ప్రతినిధులు చెప్పారు. వాయవ్య తీర పట్టణమైన సిడాన్లో ఒక కారు, ఒక మొబైల్ ఫోన్ దుకాణం వాకీటాకీల పేలుడుకు ధ్వంసమైన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. రక్తమోడుతూ వందలాది మంది ఆస్పత్రులకు పోటెత్తుతున్న దృశ్యాలు స్థానిక మీడియాలో కనిపించాయి. ‘‘ఇలాంటిది నేనెప్పడూ చూడలేదు. గాయపడిన వారిలో చాలా మందికి చేతివేళ్లు తెగిపోయాయి. కళ్లు దెబ్బతిన్నాయి’’ అని బీరుట్‌లోని దీయూ ఆస్పత్రిలో వైద్యురాలు నౌర్ ఎల్ ఓస్తా చెప్పారు. ‘‘ వరుస అనూహ్య పేలుళ్లతో ఇజ్రాయెల్, హెజ్బొల్లాలు పూర్తిస్థాయి యుద్ధానికి ఆజ్యంపోస్తున్నాయి’ అని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ బుధవారం ఆందోళన వ్యక్తంచేశారు.దాడికి ఇదే సరైన సమయమా? వేలాది మంది హెజ్బొల్లా సైనికులు గాయాలపాలై ఆస్పత్రులకు పరిమితమయ్యారు. పేజర్ల పేలుడుతో హెజ్బొల్లాలో కమ్యూనికేషన్ నెట్వర్క్ కోలుకోనంతగా దెబ్బతింది. వాకీటాకీలు, సోలార్ వ్యవస్థల పేలుళ్లతో పౌరుల్లో ఆందోళనల నడుమ దేశంలో శాంతిభద్రతలపై లెబనాన్ దృష్టిపెట్టాల్సిఉంది. ఈ తరుణంలో దాడి చేస్తే శత్రువును భారీగా దెబ్బ కొట్టవచ్చని ఇజ్రాయెల్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. తమ గడ్డపై వరుస పేలుళ్లతో ఆగ్రహించిన లెబనాన్, హెజ్బొల్లా సాయుధాలు దాడులకు తెగబడొచ్చన్న ఇజ్రాయెల్ భావించింది. దీంతో ముందస్తు జాగ్రత్తగా లెబనాన్ సరిహద్దు ప్రాంతాలకు ఇజ్రాయెల్ అదనపు బలగాలను తరలించింది. అక్టోబర్ 8న గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ దమనకాండ మొదలైననాటి నుంచి ఇజ్రాయెల్‌పైకి హెజ్బొల్లా రాకెట్, డ్రోన్ దాడులు చేస్తోంది. ఉద్రిక్తతలను ఆపండి: ఐరాస లెబనాన్ వాకీటాకీల పేలుళ్ల ఘటనపై ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తచేసింది. ‘‘ పరిస్థితి చేయిదాట కుండా ఇరు పక్షాలు సంయమనం పాటించాలి’’ అని ఐక్యరాజ్యసమితి ప్రధానకార్యదర్శి ఆంటోనియో గుటెరస్ అన్నారు. ‘‘ బందీలను విడిచిపెట్టి శాంతి స్థాపనకు కట్టుబడాలి. ఎల్రక్టానిక్ పరికరాల పేలుళ్లకు పాల్పడటం చూస్తుంటే ఇది భారీ సైనిక చర్యకు కసరత్తులా తోస్తోంది’’ అని గుటెరస్ వ్యాఖ్యానించినట్లు ఆయన అధికార ప్రతినిధి స్టీఫెన్ డ్యుజారిక్ చెప్పారు. యుద్ధంలో కొత్త దశ మొదలైంది: ఇజ్రాయెల్వాకీటాకీల ఉదంతం తర్వాత రమాట్ డేవిడ్ వైమానిక స్థావరంలో ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యావ్ గాలంట్ మాట్లాడారు. ‘‘ యుద్ధంలో కొత్త దశకు తెరలేపుతున్నాం. యుద్ధక్షేత్ర కేంద్ర స్థానం ఉత్తరం నుంచి దిశ మార్చుకుంటోంది. మాకు ఇప్పుడు స్థిరత్వం అవసరం. బలగాలు, వనరులను వేరే లక్ష్యం వైపు వినియోగించే అవకాశముంది. బుధవారం అద్భుత ఫలితాలు సాధించాం’’ అని సైనికులనుద్దేశించి ప్రసంగించారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ అత్యున్నత స్థాయి భద్రతాధికారులతో అత్యవసరంగా సమావేశమయ్యారు. హెజ్బొల్లాపై అదనపు దాడులకు సిద్ధమవుతున్నామని చెప్పారు. దీంతో లెబనాన్‌తో పూర్తిస్థాయి యుద్ధానికి ఇజ్రాయెల్ సమాయత్తమవుతోందని అర్థమవుతోంది. కాగా, వరుస పేలుళ్లపై స్వతంత్య్ర దర్యాప్తు జరపాలని ఐరాస మానవహక్కుల సంస్థ చీఫ్ వోకర్ టర్క్ డిమాండ్‌చేశారు. – నేషనల్ డెస్క్, సాక్షి -
లంచ్ బ్రేక్‌లో లవ్వు!
అసలే జననాల రేటు తగ్గుతోంది. అది చాలదన్నట్టుగా రెండున్నరేళ్లుగా సాగుతున్న ఉక్రెయిన్ యుద్ధం రష్యా సైనికులను భారీగా బలి తీసుకుంటోంది. దీనికి తోడు నిర్బంధంగా సైన్యంలో చేరాల్సి వస్తుండటంతో యువకులు భారీ సంఖ్యలో దేశం వీడుతున్నారు. వెరసి రష్యాలో జనాభా శరవేగంగా తగ్గిపోతోంది. ఈ పరిణామం అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను తీవ్రంగా ఆందోళన పరుస్తోంది. దాంతో ఎలాగైనా జనాభాను ఇతోధికంగా పెంచి దేశసేవ చేయాలంటూ రష్యన్లకు ఆయన తాజాగా విజ్ఞప్తి చేశారు. అందుకోసం రోజూ పని మధ్యలో లంచ్, టీ విరామ సమయాల్లో కూడా వీలైనంతగా కిందా మీదా పడాల్సిందిగా సూచించారు! పుతిన్ ఇచి్చన ఈ గమ్మత్తైన పిలుపుపై నెటిజన్లు అంతే ఆసక్తికరమైన కామెంట్లు కూడా చేస్తున్నారు. లంచ్, కాఫీ బ్రేకులను సంతానోత్పత్తికి వీలైనంత ఎక్కువగా ఉపయోగించుకోవాల్సిన అవసరం చాలా ఉందని రష్యా ఆరోగ్య మంత్రి యెవగనీ షెస్తోపలోవ్ కూడా పేర్కొనడం విశేషం. ఇది ఆచరణ సాధ్యమా అన్న ప్రశ్నలను ఆయన కొట్టిపారేశారు. ‘‘దయచేసి రోజంతా పనిలో బిజీగా ఉంటున్నామని చెప్పకండి. అది పసలేని సాకు మాత్రమే. సృష్టికార్యానికి ఆఫీసు పని అడ్డంకి కారాదు. లంచ్, కాఫీ బ్రేక్... ఇలా ప్రతి అవకాశాన్నీ సెక్స్ కోసం గరిష్టంగా ఉపయోగించుకోండి. లేదంటే కాలం ఎవరి కోసమూ ఆగదు. బేబీలను కనేందుకు బ్రేక్ టైంలో కష్టపడండి’’ అంటూ హితబోధ కూడా చేశారు.పడిపోతున్న ప్రజనన నిష్పత్తి ఏ దేశంలోనైనా జనసంఖ్య స్థిరంగా ఉండాలన్నా ప్రజనన నిష్పత్తి కనీసం 2.1గా ఉండాలి. రష్యాలో అది నానాటికీ తగ్గిపోతోంది. ప్రస్తుతం ప్రతి మహిళకూ కేవలం 1.4గా ఉంది. 2024 తొలి అర్ధ భాగంలో గత పాతికేళ్లలోనే అత్యంత తక్కువ జననాల రేటు నమోదైంది! ఇది దేశ భవిష్యత్తుకు మరణశాసనమేనంటూ క్రెమ్లిన్ హాహాకారాలు చేస్తోంది.తొలి కాన్పుకు రూ.9.4 లక్షలు! జననాల రేటును పెంచేందుకు రష్యా పలు చర్యలకు దిగింది. అబార్షన్, విడాకులు అత్యంత కష్టసాధ్యంగా మార్చేసింది. పిల్లల్ని కని పెంచడమే మహిళల ప్రధాన బాధ్యతంటూ ప్రముఖులు, మత పెద్దలతో చెప్పిస్తోంది. చెల్యాబిన్స్క్ ప్రావిన్స్ తొలి కాన్పుకు ఏకంగా రూ.9.4 లక్షలు ప్రకటించింది!– సాక్షి, నేషనల్ డెస్క్ -
వచ్చేస్తోంది మార్స్ ట్రాన్స్ఫర్ విండో!
మరొక్క నెల రోజులే! సైంటిస్టులంతా రెండేళ్లుగా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘ఎర్త్–మార్స్ ట్రాన్స్ఫర్ విండో’ అక్టోబర్‌లో అందుబాటులోకి రానుంది. 2022 నాటి ట్రాన్స్ఫర్ విండో సందర్భంగా నాసా వంటి అంతరిక్ష సంస్థలు పలు అంగారక ప్రయోగాలు చేశాయి. భావి మార్స్ మిషన్లకు అవసరమైన సామగ్రిని అంగారకునిపైకి ముందే చేరేసేందుకు ప్రయతి్నంచాయి. మరో నెల రోజుల అంతరం అక్టోబర్ ‘విండో’లో కూడా అలాంటి ప్రయోగాలు చేపట్టే దిశగా యోచిస్తున్నాయి. ఏమిటీ ట్రాన్స్ఫర్ విండో? ఇది భూ, అంగారక గ్రహాలు రెండూ పరస్పరం అత్యంత సమీపానికి వచ్చే సమయమని చెప్పవచ్చు. కనుక సహజంగానే ఆ సందర్భంగా భూమికి, అంగారకునికి మధ్య దూరం అత్యంత తక్కువగా ఉంటుంది. ఆ సమయంలో అతి తక్కువ ఇంధన వ్యయంతో అంగారక ప్రయోగాలు సాధ్యపడుతాయి. ఫలితంగా ప్రయోగ ఖర్చుతో పాటు అరుణ గ్రహాన్ని చేరేందుకు పట్టే సమయమూ తగ్గుతుంది. కేవలం 6 నుంచి 8 నెలల్లో అంగారకున్ని చేరవచ్చు. అదే ఇతర సమయాల్లో అయితే ఏళ్ల కొద్దీ సమయం పడుతుంది. వీటన్నింటికీ మించి ట్రాన్స్ఫర్ విండోలో ప్రయోగించే అంతరిక్ష నౌక అంగారకుడు అత్యంత అనువైన పొజిషన్లో ఉండగా దాని కక్ష్యలోకి ప్రవేశించగలుగుతుంది. కనుక ప్రయోగం విజయవంతమయ్యే అవకాశం ఎన్నో రెట్లు పెరుగుతుంది. భూమి, అంగారకుల మధ్య ఈ విండో దాదాపు 26 నెలలకు ఓసారి పునరావృతమవుతూ ఉంటుంది. హాన్‌మన్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ సూత్రం ఆధారంగా దీన్ని లెక్కిస్తారు. ఈ విండో సమయాన్ని కచి్చతంగా లెక్కించడం అంతరిక్ష సంస్థలకు చాలా కీలకం. లేదంటే ప్రయోగం రెండేళ్లు ఆలస్యమయ్యే ప్రమాదముంటుంది. 2026 విండోపై స్పేస్ ఎక్స్ కన్ను ప్రైవేట్ అంతరిక్ష సంస్థ స్పేస్ ఎక్స్ తన అంగారక యాత్ర సన్నాహాలకు మరింత పదును పెడుతోంది. అంతా అనుకున్నట్టుగా జరిగితే 2026లో అంగారకునిపైకి మానవరహిత ‘స్టార్íÙప్’ మిషన్ చేపట్టనున్నట్టు సంస్థ అధినేత ఎలాన్ మస్క్ ప్రకటించారు. ఆ ఏడాది ‘ఎర్త్–మార్స్ ట్రాన్స్ఫర్ విండో’ సందర్భంగా ప్రయోగం ఉంటుందని వెల్లడించారు. అంతరిక్ష నౌక సజావుగా అరుణ గ్రహంపై దిగి తమ మిషన్ విజయవంతమైతే మరో రెండేళ్లలో, అంటే 2028 నాటికి మానవసహిత అంగారక యాత్ర ఉంటుందని చెప్పారు. నాసా, ఇతర అంతరిక్ష సంస్థలు కూడా 20206 విండో సందర్భంగా అంగారకునిపైకి మరింత అదనపు సామగ్రి తదితరాలను చేరవేసేందుకు ఇప్పట్నుంచే ప్రణాళికలు వేస్తున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Mahsa Amini: హిజాబ్‌ను ధిక్కరించి తలెత్తుకుని...
‘‘గుమ్మానికి పరదా కట్టినట్టే అమ్మ ముఖానికి ‘నఖాబ్’ కట్టారు’’ అంటూ ముస్లిం మహిళల జీవితాల్లోని దుఃఖాన్ని వినిపించారో కవయిత్రి. దుఃఖమో.. సంతోషమో.. హిజాబ్ చాటున దాచేది లేదని ఇరాన్ మహిళలు ఇప్పుడు తేల్చి చెబుతున్నారు. సోమవారం ఇరాన్లో పలువురు హిజాబ్‌లను తొలగించి స్వేచ్ఛగా వీధుల్లో సంచరించారు. ఇస్లామిక్ డ్రెస్‌కోడ్‌ను ధిక్కరించారనే కారణంతో 2022లో కుర్దిష్ మహిళ అయిన మహసా అమీనీని ఇరాన్ పోలీసులు అరెస్టు చేయడం, తరువాత ఆమె పోలీస్ కస్టడీలో మరణించడం తెలిసిందే. అయితే మహసా అమీనీ రెండో వర్ధంతి సందర్భంగా స్మారక సభను నిర్వహించాలని తల్లిదండ్రులు భావించగా.. పోలీసులు అందుకు అనుమతిని నిరాకరించారు. అంతేకాదు ఆమె తల్లిదండ్రులను బలవంతంగా గృహ నిర్బంధం చేశారు. అమీనీని ఖననం చేసిన సఖెజ్ నగరంలోని స్మశాన వాటికను సైతం మూసేశారు. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా.. ఇరాన్ మహిళలు మాత్రం ఆమెను స్మరించుకున్నారు. దేశ రాజధాని టెహ్రాన్ వీధుల్లో ‘జిన్.. జియాన్.. ఆజాదీ’(స్త్రీ.. జీవితం.. స్వేచ్ఛ) నినాదాలు చేశారు. ఇక టెహ్రాన్‌లోని ఏవీఎన్ జైలులోని పలువురు మహిళా ఖైదీలు నిరాహార దీక్ష చేపట్టారు. ప్రభుత్వ అణచివేత విధానాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న మహిళలతోనే తామూ ఉన్నామని చెబుతూ 34 మంది జైలు ఖైదీలునిరాహార దీక్ష చేశారు. వీరిలో ఇరాన్ ఉద్యమకారులు నర్గీస్ మొహమ్మదీ, వెరిషెహ్ మొరాది, మహబూబ్ రెజాయ్, పరివాష్ ముస్లి కూడా ఉన్నారు. తీవ్రమైన అణచివేత.. 1979లో కొత్త ప్రభుత్వం ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ ఏర్పాటయ్యాక ఇరాన్ సుప్రీం లీడర్‌గా ఖొమేనీ ఆవిర్భవించారు. ఇస్లాం మత విలువలను తిరిగి అమల్లోకి తీసుకొచ్చారు. అందులో భాగంగా మహిళలకు హక్కులను కల్పించిన కుటుంబ రక్షణ చట్టాన్ని రద్దు చేశారు. నాటి నుంచి ఇస్లాం డ్రెస్‌కోడ్ పాటించని మహిళలపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ధిక్కరించిన మహిళలను గాయపరిచిన, జరిమానాలు విధించిన ఘటనలు అనేకం. మహిళలపై నిరంతరం కెమెరాల నిఘా కొనసాగుతోంది. 2024 టెహ్రాన్ ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో మహిళలను పర్యవేక్షించడానికి ఏరియల్ డ్రోన్లను కూడా ఉపయోగించారంటే ఎంతటి నిఘా ఉందో అర్థం చేసుకోవచ్చు. హిజాబ్‌ను తిరస్కరిస్తున్న మహిళల సంఖ్య పెరగడాన్ని ప్రభుత్వం గుర్తించకపోగా.. అణచివేత చర్యలకు పాల్పడుతోంది.ఎవరీ మహసా అమీనీ ?2022లో ఇరాన్లో హిజాబ్ నియమాలను ఉల్లంఘించారనే నెపంతో సకెజ్ నగరానికి చెందిన కుర్దిష్ మహిళ 22 ఏళ్ల మహసా అమీనీని ఇరాన్ మొరాలిటీ పోలీసులు అరెస్ట్ చేశారు. కస్టడీలో ఉన్న ఆమెను తీవ్రంగా కొట్టడంతో స్పృహ తప్పి పడిపోయి, కొద్దిసేపటికే కోమాలోకి వెళ్లిపోయారు. మూడు రోజుల తరువాత ఆమె ఆస్పత్రిలో ప్రాణాలు విడిచారు. కూతురును చూడటానికి అమీనీ తల్లిదండ్రులను కూడా అనుమతించలేదు. శవ పంచనామా నివేదిక అడిగినా నిరాకరించారు. మహసా అమీనీకి ఆరోగ్య సమస్యలు ఉన్నాయని, అరెస్టు తరువాత ఆమెకు అకస్మాత్తుగా గుండెపోటు వచ్చిందని పోలీసులు చెప్పారు. డాక్టర్ కావాలని కలలు కన్న యువతి.. మరో వారం రోజుల్లో యూనివర్సిటీకి వెళ్లే ముందు వారం రోజులు తల్లిదండ్రులతో ఉందామని టెహ్రాన్‌కు వచ్చిన అమీనీ.. పోలీసుల చిత్రహింసలతో ప్రాణాలొదిలింది. -
మైకేల్ జాక్సన్ సోదరుడు టిటో జాక్సన్ కన్నుమూత
వాషింగ్టన్: పాప్ దిగ్గజం మైకేల్ జాక్సన్ సోదరుడు టిటో జాక్సన్ ఇక లేరు. ప్రఖ్యాత జాక్సన్5 పాప్ గ్రూప్ సభ్యుడైన 70 ఏళ్ల టిటో సోమవారం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతికి కారణం తెలియరాలేదు. మైకేల్‌తో పాటు ఇతర సోదరులు జాకీ, జర్మైన్, మార్లోన్లతో కలిసి జాక్సన్5 పేరిట టిటో పలు పాప్ ప్రదర్శనలిచ్చారు. జాక్సన్5 ఖాతాలో ఏబీసీ, ద లవ్ యూ సేవ్, ఐ వాంట్ యూ బ్యాక్ వంటి పలు హిట్లున్నాయి. 1964లో ఏర్పాటైన ఈ గ్రూపు ప్రేక్షకులను ఉర్రూతలూపింది. 1980లో ప్రతిష్టాత్మక హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ స్టార్ అందుకుంది. 1997లో రాక్ అండ్ రోల్ హాలాఫ్ ఫేమ్‌లో చోటుచేసుకుంది. గ్రూప్‌లో టిటో వయోలిన్ వాయించేవారు. ఆయన చివరిదాకా ప్రదర్శనలిస్తూనే ఉన్నారు. సెప్టెంబర్ 10న జర్మనీలో తుది ప్రదర్శన ఇచ్చారు. టిటో ముగ్గురు కుమారులు కూడా 3టీ గ్రూప్ పేరిట పాప్ సంగీతంలో ప్రసిద్ధులే. -
President Droupadi Murmu: మహిళా సాధికారతే దేశానికి బలం
న్యూఢిల్లీ: దేశంలో మహిళల సాధికారతే ఆ దేశానికి నిజమైన బలమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఏ ప్రాంతంలో అయినా, ఎలాంటి సమయంలోనైనా మహిళలు అభద్రతకు లోనవకుండా, వారి పట్ల గౌరవం చూపేలా ప్రజలకు అవగాహన కలి్పంచాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. మన దేశంలో మహిళల గౌరవాన్ని, గౌరవాన్ని కాపాడతామని, వారి పురోభివృద్ధికి కృషి చేస్తామని ప్రతి ఒక్కరు ప్రతిజ్ఞ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఓ వార్తా సంస్థ సోమవారం నిర్వహించిన షిశక్తి సమ్మిట్–2024లో రాష్ట్రపతి మాట్లాడుతూ దేశంలో మహిళల భద్రతకోసం కఠినమైన చట్టాలను తీసుకొచ్చామన్నారు. అయినప్పటికీ అభద్రతా భావం కొనసాగుతుండటం దురదృష్టకరమని, మహిళలను బలహీనులుగా భావించే సామాజిక సంకుచిత మనస్తత్వం, ఛాందసవాదానికి వ్యతిరేకంగా నిరంతర పోరాటాలు చేయాల్సిన అవసరముందని ఆమె నొక్కి చెప్పారు. సమాజంలో ఎన్ని మార్పులొచి్చనా కొన్ని సామాజిక దురభిప్రాయాలు లోతుగా పాతుకుపోయాయని, ఇవి మహిళా సమానత్వానికి అవరోధాలను సృష్టిస్తున్నాయని తెలిపారు. ‘‘ఎక్కడ తప్పు చేశాం? మెరుగుపడటానికి మనం ఏమి చేయాలి?’’అని మహిళలు నిరంతరం ప్రశ్నించుకోవాలని సూచించారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా శక్తి, ధైర్యసాహసాలు ప్రదర్శిస్తున్నారని మహిళలను కొనియాడారు. పితృస్వామిక దృక్పథాన్ని విడనాడాలి: సీజేఐ చట్టం మాత్రమే న్యాయమైన వ్యవస్థను తయారు చేయలేదని, సమాజం మహిళల పట్ల తన మైండ్‌సెట్‌ను మార్చుకోవాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ సోమవారం నొక్కి చెప్పారు. ప్రతిఒక్కరూ పితృస్వామిక దృక్పథాన్ని విడనాడాలని సూచించారు. మహిళల ప్రయోజనాలను పరిరక్షించడానికి విధానపరమైన, చట్టపరమైన నిబంధనలు అనేకం ఉన్నాయని, కానీ కఠినమైన చట్టాలే సమ సమాజాన్ని నిర్మించలేవన్నారు. మహిళలకు రాయితీలు ఇవ్వడం నుంచి స్వేచ్ఛగా, సమానంగా జీవించే హక్కు వారికుందనే విషయాన్ని గుర్తించే దిశగా మన మనస్తత్వాలు మార్చుకోవాలని పిలుపునిచ్చారు. మహిళల హక్కుల గురించి మాట్లాడటమంటే మొత్తం సమాజం మార్పు గురించి మాట్లాడినట్లని వ్యాఖ్యానించారు. తన జీవితంలోని కొన్ని గొప్ప పాఠాలను మహిళా సహోద్యోగుల నుంచే నేర్చుకున్నానని, మెరుగైన సమాజానికి మహిళల సమాన భాగస్వామ్యం ముఖ్యమని తాను నమ్ముతానని చెప్పారు. దేశం రాజ్యాంగాన్ని ఆమోదించక ముందే ఇండియన్ ఉమెన్స్ చార్టర్ ఆఫ్ లైఫ్‌ను స్త్రీవాది అయిన హంసా మెహతా రూపొందించారని సీజే గుర్తు చేశారు. -
స్టాండింగ్ కమిటీల ఏర్పాటు కొలిక్కి
సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుత లోక్‌సభకు సంబంధించి వివిధ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీల కూర్పు ఓ కొలిక్కి వచి్చనట్లు తెలుస్తోంది. లోక్‌సభ పరిధిలోని 16, రాజ్యసభ పరిధిలోని 8 విభాగాల స్టాండింగ్ కమిటీల్లో తమకు కనీసంగా 5 కమిటీలకు ఛైర్మన్ పదవులు ఇవ్వాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తూ వచి్చంది. దీనిపై పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు, న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్లు కాంగ్రెస్ నేతలు గౌరవ్ గొగోయ్, కె.సురేశ్, జైరాం రమేశ్ తదితరులతో చర్చించారు. 5 కమిటీలతో పాటు, కమిటీల్లో అత్యంత కీలకమైన హోంశాఖను కాంగ్రెస్ కోరింది. అయితే హోంశాఖను అప్పగించేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించలేదు. లోక్‌సభ స్టాండింగ్ కమిటీల్లో మూడింటికి ఓకే చెబుతూనే.. విదేశీ వ్యవహారాలు, గ్రామీణాభివృధ్ధి– పంచాయతీరాజ్, వ్యవసాయం వంటి కీలక విభాగాల స్టాండింగ్ కమిటీలకు కాంగ్రెస్ ఎంపీలను ఛైర్మన్లుగా నియమించేందుకు అంగీకరించింది. ఇక రాజ్యసభ కమిటీల్లో విద్యా శాఖను అప్పగించేందుకు సుముఖత వ్యక్తం చేసింది. కాంగ్రెస్ పార్టీ వర్గాలు సోమవారం దీన్ని ధృవీకరించాయి. -
రైతులు, మహిళలకు సంక్షేమ పథకాలు
శ్రీనగర్: త్వరలో జరిగే జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ సోమవారం మేనిఫెస్టోను విడుదల చేసింది. అధికారంలోకి వస్తే రైతులు, మ హిళలు, యువత కోసం పలు సంక్షేమ పథకాల ను అమలు చేస్తామని ప్రకటించింది. ప్రకృతి వైపరీ త్యాలతో నష్టపోయే అన్ని రకాల పంటలకు బీమా సౌకర్యం, యాపిల్‌కు కనీస మద్దతు ధర(ఎంఎస్పీ ) కిలోకు రూ.72 అమలు చేస్తామంది. శ్రీనగర్‌లోని పార్టీ కార్యాలయంలో సోమవారం జరిగిన కార్యక్ర మంలో ఏఐసీసీ ప్రతినిధి పవన్ ఖేరా, పీసీసీ చీఫ్ తారిఖ్ హమీద్ కర్రా మేనిఫెస్టోను విడుదల చేశారు. కౌలు రైతులకు సాయంభూమిలేని, కౌలుదార్లకు ఏటా అదనంగా రూ.4 వేల ఆర్థిక సాయం. రైతులకు సాగు భూములను 99 ఏళ్లకు లీజుకివ్వడం. సాగు భూములను 100 శాతం సాగులోకి తెచ్చేందుకు జిల్లా స్థాయి సాగునీటి ప్రాజెక్టుల కోసం రూ.2,500 కోట్లతో నిధి ఏర్పాటు.నిరుద్యోగ యువతకు..జమ్మూకశ్మీర్‌లోని అర్హులైన నిరుద్యోగ యువతకు నెలకు రూ.3,500 చొప్పున ఏడాదిపాటు అలయెన్స్. అధికారంలోకి వచ్చిన నెలరోజుల్లో జాబ్ క్యాలెండర్ విడుదల. ఖాళీగా ఉన్న లక్ష ప్రభుత్వ పోస్టుల భర్తీ. పోలీసు, ఫైర్, ఫారెస్ట్ పోస్టుల భర్తీకి ప్రత్యేక రిక్రూట్మెంట్ కార్యక్రమం. నిర్మాణ రంగ పనుల్లో నిరుద్యోగ ఇంజినీర్లకు 30 శాతం ఇచ్చే పథకం పునరుద్ధరణ. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ సమయంలో, పాస్‌పోర్టులు, ఇతర అవసరాల కోసం ధ్రువీకరణ పత్రాల పరిశీలన సులభతరం చేయడం.మహిళలకు నెలకు రూ.3 వేలుభారత్ జోడో యాత్ర సమయంలో రాహుల్ గాంధీ, ఇతర నేతలు ఇచ్చిన హామీల మేరకు మహిళా సమ్మాన్ కార్యక్రమం అమలు. ఇందులో భాగంగా కుటుంబ యజమాని అయిన మహిళకు నెలకు రూ.3 వేలు చొప్పున సాయం అందజేత. స్వయం సహాయక బృందాలకు రూ.5 లక్షల వరకు వడ్డీ లేని రుణం. ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య బీమా సౌకర్యం. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే మైనారిటీ కమిషన్ ఏర్పాటు. కశ్మీరీ పండిట్లకు పునరావాసం కల్పిస్తామంటూ గతంలో మాజీ ప్రధాని మన్మోహన్ ఇచ్చిన హామీ అమలు. -
Amit Shah: ఉగ్రవాదాన్ని పాతిపెడతాం
గులాబ్‌గఢ్/కిష్ట్వార్: మళ్లీ కోలుకోనంతగా ఉగ్రవాదాన్ని బీజేపీ ప్రభుత్వం పాతాళంలోకి పాతిపెట్టనుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. జమ్మూకశ్మీర్‌లోని కిష్ట్వార్ జిల్లాలోని పెదర్–నగ్సేని నియోజకవర్గ పరిధిలో సోమవారం గులాబ్‌గఢ్‌లో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో అమిత్ ప్రసంగించారు. ‘‘1990దశకం నుంచి ఉగ్రవాదంతో కష్టాలుపడుతున్న జమ్మూ కశ్మీర్ ప్రజలకు ఈరోజు మాట ఇస్తున్నా. మళ్లీ ఈ గడ్డపై కనిపించనంత లోతుల్లో ఉగ్రవాదాన్ని మా ప్రభుత్వం పాతిపెడుతుంది. ఇక్కడ తమ ప్రభుత్వం ఏర్పాటైతే జైళ్ల నుంచి ఉగ్రవాదులను విడుదలచేస్తామని నేషనల్ కాన్ఫెరెన్స్(ఎన్సీ) కాంగ్రెస్ పార్టీలు హామీ ఇచ్చాయి. మచియాల్ మాత సాక్షిగా చెబుతున్నా. భారతగడ్డపై ఉగ్రవాదాన్ని వ్యాప్తిచేసే సాహసం ఇంకెవ్వరూ చేయరు. ఉగ్రవాదులను ఎదుర్కొనేందుకు గ్రామ రక్షణ గార్డులు, స్పెషల్ పోలీస్ అధికారులకు పాతరకం .303 రైఫిళ్ల స్థానంలో అధునాతన ఆయుధాలిచ్చాం. ఎక్కడి నుంచైనా ఇక్కడికి ఉగ్రవాదులొస్తే వారి కథ ఇక్కడి మంచుకొండల్లో ముగిసిపోతుంది’’ అని అన్నారు. ఈ సందర్భంగా ఎన్సీ, కాంగ్రెస్‌లపై అమిత్ విమర్శలుచేశారు. ‘‘ డోగ్రాల చివరి రాజు మహారాజా హరిసింగ్‌ను వీళ్లు అవమానించారు. కశ్మీరీ పండిట్లు బలవంతంగా వెళ్లిపోవడానికి కారణం వీళ్లే. వీళ్లు మహిళ హక్కులను లాగేసుకున్నారు. అవసరమైన వర్గాలకు రిజర్వేషన్ ఫలాలు దక్కకుండా చేశారు’’ అని ఆరోపించారు. ‘‘ రువ్వేందుకు రాళ్లు పట్టుకున్న యువతకు జైళ్లు సిద్ధంగా ఉన్నాయి. అలాగే ల్యాప్‌టాప్‌లు, త్రివర్ణపతాకం పట్టుకున్న యువతకు ఉద్యోగాలు సిద్ధంగా ఉన్నాయి’ అని షా అన్నారు. రాహుల్ కశ్మీర్లో ఐస్‌క్రీమ్ తినొచ్చురామ్బాన్లో జరిగిన ర్యాలీలోనూ అమిత్ మాట్లాడారు. ‘‘ కశ్మీర్‌ను ఎన్డీఏ సర్కార్ సురక్షితమైన ప్రాంతంగా మార్చేసింది. అయితే ఇటీవల రాహుల్ ఇక్కడి కొచ్చి లాల్‌చౌక్‌లో ఐస్‌క్రీమ్ తిన్నారు. బైక్ నడిపారు. పైగా మా ప్రభుత్వాన్నే విమర్శిస్తున్నారు. రాహుల్ బాబా.. మీరు మమ్మల్ని విమర్శిస్తున్నారుగానీ ఇంతటి రక్షణ వాతావరణం మా వల్లే సాధ్యమైంది. మీ ప్రభుత్వాల్లో ఇది అసాధ్యం’’ అని అన్నారు. కాంగ్రెస్ హయాంలో హోం మంత్రిగా ఉండి కూడా లాల్‌చౌక్ ప్రాంతానికి వెళ్లాలంటేనే భయపడేవాడినని కాంగ్రెస్ నేత సుశీల్‌కుమార్ షిండే చేసిన వ్యాఖ్యలను అమిత్ గుర్తుచేశారు. ‘‘ షిండే గారూ.. ఇప్పుడు పిల్లాజెల్లాతో వచ్చేయండి. ఎంచక్కా లాల్‌చౌక్‌లో వాకింగ్ చేయండి. మీకు హాని చేసేందుకు ఎవరూ సాహసించరు’’ అని అమిత్ అన్నారు. -
Haryana: ఆ 11 స్థానాల్లో పోటాపోటీ
హరియాణాలో అసెంబ్లీ ఎన్నికల వేడి క్రమంగా తారస్థాయికి చేరుతోంది. పాలక బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు దేశమంతటినీ ఆకర్షిస్తోంది. లోక్‌సభ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో బీజేపీ బలహీనపడిందన్న (2019లో మొత్తం పది సీట్లనూ బీజేపీ నెగ్గగా.. 2024లో కాంగ్రెస్ సగం స్థానాలను చేజిక్కించుకుంది) విపక్షాల వాదనకు బలం చేకూర్చేందుకు కాంగ్రెస్‌కు, దాన్ని పూర్వపక్షం చేసేందుకు అధికార పారీ్టకి ఈ ఎన్నికల్లో ఘన విజయం అత్యవసరంగా మారింది. ఢిల్లీ , పంజాబ్ వెలుపల ఉనికి చాటుకోజూస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీకి కూడా ఈ ఎన్నికలు అగి్నపరీక్ష వంటివే. కాంగ్రెస్ సమరోత్సాహంతో కనిపిస్తుండగా, పదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ వ్యతిరేకతతో సతమతమవుతోంది. రైతు ఆందోళనల వంటివి ఆ పారీ్టకి మరింత సవాలుగా మారాయి. ఈ నేపథ్యంలో పలు అసెంబ్లీ స్థానాలు ఈ రెండు పారీ్టలతో పాటు జేజేపీ, ఐఎన్ఎల్డీ వంటి ప్రాంతీయ పార్టీల హోరాహోరీ పోరుకు వేదికగా మారాయి. అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న ఆ హాట్ సీట్లపై ఫోకస్... గర్హీ సంప్లా కిలోయీ హుడా కంచుకోట రాష్ట్ర కాంగ్రెస్ దిగ్గజం, మాజీ సీఎం భూపిందర్ సింగ్ హుడా కంచుకోట. ఐదు దశాబ్దాల రాజకీయ జీవితంలో ఇప్పటిదాకా ఓటమే ఎరగని నేత ఆయన. దాంతో ఈ స్థానాన్ని నిలుపుకోవడం కాంగ్రెస్‌కు అత్యవసరం. 25 శాతం జనాభాతో హరియాణాలో ప్రబల శక్తిగా ఉన్న జాట్ల ఓట్లు ఈ స్థానంలో నిర్ణాయకం. వారిలో తమపై తీవ్ర ఆగ్రహం నెలకొని ఉండటం బీజేపీని కలవరపెడుతోంది. హుడాపై గాంగ్స్టర్ రాజేశ్ హుడా భార్య మంజు హుడాను బీజేపీ పోటీకి నిలిపింది. ఆమె తండ్రి మాజీ పోలీసు అధికారి కావడం విశేషం.బద్లీ బీజేపీకి గట్టి పరీక్షబీజేపీ నుంచి రాష్ట్ర పార్టీ మాజీ చీఫ్, జాట్ నేతఓం ప్రకాశ్ ధన్‌ఖడ్ బరిలో ఉన్నారు. గత రెండు ఎన్నికల్లోనూ ఆయనే పోటీ చేశారు. 2014లో నెగ్గగా 2019లో కాంగ్రెస్ ప్రత్యర్థి కుల్దీప్ వత్స్ చేతిలో ఓటమి చవిచూశారు. ఈసారీ ఆయనతోనే అమీతుమీ తేల్చుకుంటున్నారు. హోదాల్ బరిలో పీసీసీ చీఫ్ ఈ ఎస్సీ రిజర్వుడు స్థానంలో కాంగ్రెస్ నుంచి పీసీసీ చీఫ్ ఉదయ్ భాన్ బరిలో ఉన్నారు. దాంతో బీజేపీ గత ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో గట్టెక్కిన జగదీశ్ నాయర్‌ను పక్కన పెట్టి హరీందర్‌సింగ్ రామ్ రతనన్కు టికెటిచి్చంది.హిస్సార్ బీజేపీకి జిందాల్ సవాల్! అసెంబ్లీ ఎన్నికల్లో ఎప్పుడూ కీలకంగా మారే ఈ స్థానం ఈసారి మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. దేశంలోనే ధనిక మహిళ అయిన పారిశ్రామిక దిగ్గజం సావిత్రి జిందాల్ ఇండిపెండెంట్‌గా బరిలో దిగడమే అందుకు కారణం. ఆమె కుమారుడు నవీన్ జిందాల్ ఇటీవలే బీజేపీలో చేరి లోక్‌సభ ఎన్నికల్లో కురుక్షేత్ర స్థానం నుంచి విజయం సాధించడం తెలిసిందే. అయినా సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి కమల్ గుప్తాకే హిస్సార్ టికెట్ దక్కింది. కాంగ్రెస్ నుంచి మళ్లీ రామ్నివాస్ రారా బరిలో ఉన్నారు.తోశాం వారసత్వ పోరుకాంగ్రెస్ నుంచి పూర్వాశ్రమంలో క్రికెట్ అడ్మిని్రస్టేటర్ అయిన అనిరుధ్ చౌదరి బరిలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థి శ్రుతి చౌదరితో ఆయన తలపడుతున్నారు. వీరిద్దరూ దివంగత సీఎం బన్సీలాల్ మనవడు, మనవరాలు కావడం విశేషం. దాంతో అన్నాచెల్లెళ్ల పోరు అందరినీ ఆకర్షిస్తోంది. ఇటీవలే కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి మారి రాజ్యసభకు ఎన్నికైన కిరణ్ చౌదరి కూతురే శ్రుతి.కైతాల్ బరిలో సుర్జేవాలా జూనియర్ కాంగ్రెస్ సీనియర్ నేత రణదీప్ సుర్జేవాలా 2019లో ఇక్కడ బీజేపీ అభ్యర్థి లీలారామ్ గుర్జర్ చేతిలో ఓటమి చవిచూశారు. ఈసారి గుర్జర్‌పై సుర్జేవాలా కుమారుడు ఆదిత్య బరిలో ఉన్నారు. తండ్రి ఓటమికి ఆయన బదులు తీర్చుకోగలరా అన్నది ఆసక్తికరంగా మారింది. జూలానా హై ప్రొఫైల్ పోరు ఈసారి అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న స్థానం. ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన ఒలింపియన్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ ఆ పార్టీ తరఫున ఇక్కడి నుంచి ఎన్నికల అరంగేట్రం చేస్తున్నారు. బీజేపీ కెపె్టన్ యోగేశ్ బైరాగికి టికెట్ ఇవ్వగా, ఆప్ నుంచి మరో రెజ్లర్ కవితా దేవి బరిలో దిగడం విశేషం. మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల వివాదంలో మోడీ సర్కారు వ్యవహార శైలి బీజేపీకి ఇక్కడ బాగా ప్రతికూలంగా మారవచ్చని అంటున్నారు.అంబాలా కంటోన్మెంట్ కాంగ్రెస్‌కు ఇంటి పోరుబీజేపీ దిగ్గజం అనిల్ విజ్ ఇక్కడ ఆరుసార్లు గెలిచారు. మనోహర్‌లాల్ ఖట్టర్ మంత్రివర్గంలో హోంమంత్రిగా చక్రం తిప్పారు. కానీ నయాబ్ సింగ్ సైనీ మంత్రివర్గంలో చేరకుండా దూరం పాటిస్తున్నారు. గురువారం ఆయన నామినేషన్ దాఖలు వేళ బీజేపీ నేతలేవరూ వెంట లేకపోవడం చర్చకు తావిచ్చింది. కాంగ్రెస్ ఇక్కడ ఇంటి పోరుతో సతమతం అవుతోంది. పరీ్వందర్ సింగ్ పరీని బరిలో దించగా పార్టీ సీనియర్ నేత నిర్మల్‌సింగ్ కుమార్తె చిత్రా శర్వర ఇండిపెండెంట్‌గా పోటీకి దిగారు. గత ఎన్నికల్లో కూడా ఆమె ఇండిపెండెంట్‌గా పోటీ చేసి అనిల్ విజ్ చేతిలో 20 వేల పైచిలుకు ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు.ఉచానా జేజేపీ అడ్డా! మాజీ డిప్యూటీ సీఎం, జేజేపీ చీఫ్ దుష్యంత్ చౌతాలా సిట్టింగ్ స్థానం. రాష్ట్రంపై జేజేపీ పట్టు సడలుతున్న దృష్ట్యా ఈసారి ఇక్కడ ఘన విజయం ఆయనకు అత్యంత కీలకం. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో జేజేపీ 10 సీట్లు నెగ్గి కింగ్ మేకర్‌గా ఆవిర్భవించడం, బీజేపీ ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారడం తెలిసిందే. బీజేపీ నుంచి దేవేందర్ అత్రి, కాంగ్రెస్ నుంచి బ్రిజేంద్ర సింగ్ ఆయనకు పోటీ ఇస్తున్నారు. మాజీ ఐఏఎస్ అయిన బ్రిజేంద్ర గత మార్చిలోనే బీజేపీ నుంచి కాంగ్రెస్‌లోకి జంప్ చేశారు.లడ్వా సీఎం సైనీకి పరీక్ష! గత మార్చిలో ఖట్టర్ స్థానంలో సీఎంగా పగ్గాలు చేపట్టిన సైనీ ఇక్కడ బరిలో ఉన్నారు. ఉప ఎన్నికల్లో ఖట్టర్ కంచుకోట అయిన కర్నాల్ నుంచి గెలిచిన ఆయన ఈసారీ అక్కడినుంచే పోటీ చేయాలని భావించారు. కానీ బీజేపీ అధిష్టానం ఆదేశం మేరకు పారీ్టకి అత్యంత సురక్షితమైన ఈ స్థానం నుంచి అయిష్టంగానే బరిలో దిగారు. 2019 ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ నెగ్గడం విశేషం. సిట్టింగ్ ఎమ్మెల్యే మేవాసింగ్ ఈసారి కూడా బరిలో అన్నారు.ఎలెనాబాద్ ఐఎన్ఎల్డీకి అగి్నపరీక్ష జేజేపీ మాదిరిగానే నానాటికీ ప్రభ తగ్గుతున్న ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ (ఐఎన్ఎల్డీ)కు ఇక్కడ విజయం ప్రతిష్టాత్మకంగా మారింది. ఈసారి కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే, పార్టీ ప్రధాన కార్యదర్శి అభయ్ సింగ్ చౌతాలా బరిలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి భారత్ సింగ్ బెనివాల్, బీజేపీ నుంచి ఆరెస్సెస్ మూలాలున్న అమర్ చంద్ మెహతా ఆయనకు పోటీ ఇస్తున్నారు. –సాక్షి, నేషనల్ డెస్క్ -
యుద్ధ ఖైదీల మార్పిడి
మాస్కో/కీవ్: రష్యా, ఉక్రెయిన్లు శనివారం 103 మంది చొప్పున యుద్ధఖైదీలను పరస్పరం మారి్పడి చేసుకున్నాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) దీనికి మధ్యవర్తిత్వం వహించింది. ‘మావాళ్లు స్వదేశానికి చేరుకున్నారు. రష్యా చెర నుంచి 103 మంది యోధులను విజయవంతంగా ఉక్రెయిన్‌కు తీసుకొచ్చాం’అని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ శనివారం ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. యుద్ధఖైదీల మారి్పడిలో భాగంగా ఉక్రెయిన్‌కు చేరిన వారిలో 82 సాధారణ పౌరులు, 21 మంది సైనిక సిబ్బంది ఉన్నారు. ‘కస్క్ ప్రాంతంలో ఉక్రెయిన్ బందీలుగా పట్టుకున్న 103 సైనిక సిబ్బంది కీవ్ ఆ«దీనంలోని భూభాగం నుంచి విముక్తులయ్యారు. బదులుగా 103 యుద్ధఖైదీలను ఉక్రెయిన్‌కు అప్పగించాం’అని రష్యా రక్షణశాఖ వెల్లడించింది. ఉక్రెయిన్ చెర వీడిన రష్యా యుద్ధఖైదీలు ప్రస్తుతం బెలారస్లో ఉన్నారు. వారికి అవసరమైన వైద్య, మానసిక సహాయాన్ని అందిస్తున్నట్లు రష్యా తెలిపింది. 2022లో రష్యా ఉక్రెయిన్‌పై దండెత్తిన తర్వాత యూఏఈ మధ్యవర్తిత్వంలో జరిగిన ఎనిమిదో యుద్ధఖైదీల మారి్పడి ఇది. మొత్తం ఇప్పటిదాకా 1,994 మంది ఖైదీలకు తమ చొరవతో చెరవీడిందని యూఏఈ తెలిపింది. రష్యాలోని సుదూర లక్ష్యాల పైకి దాడికి అనుమతించండి రష్యాలోని సుదూర లక్ష్యాల పైకి దాడి చేయడానికి తమను అనుమతించాలని ఉక్రెయిన్ పునరుద్ఘాటించింది. పశి్చమదేశాలు ఉక్రెయిన్‌కు సుదూరశ్రేణి క్షిపణులను సరఫరా చేసినప్పటికీ.. వాటి వాడకానికి అనుమతివ్వడం లేదు. ‘రష్యా ఉగ్రవాదం వారి ఆయుధాగారాలు, సైనిక విమానాశ్రయాలు, సైనిక స్థావరాల వద్ద మొదలవుతుంది. రష్యా లోపలి ప్రాంతాల్లోని లక్ష్యాలపై దాడులకు అనుమతి లభిస్తే.. పరిష్కారం వేగమంతమవుతుంది’అని ఉక్రెయిన్ అధ్యక్షుడి సలహాదారు ఆండ్రీ యెర్మాక్ శనివారం వివరించారు. -
జీఎస్టీ ఎగవేతలు రూ.2 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: జీఎస్టీ ఎగవేతల విలువ 2023–24 ఆర్థిక సంవత్సరంలో రూ.2.01 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఇందుకు సంబంధించి 6,084 కేసులను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ (డీజీజీఐ) గుర్తించింది. ఆన్లైన్ గేమింగ్, బీఎఫ్ఎస్ఐ, ఇనుము, రాగి, స్క్రాప్ విభాగాల్లో అత్యధిక ఎగవేతలు నమోదయ్యాయని డైరెక్టరేట్ వెల్లడించింది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో 4,872 కేసులు నమోదు కాగా, ఎగవేతల విలువ రూ.1.01 లక్షల కోట్లుగా ఉంది. డీజీజీఐ వార్షిక నివేదిక ప్రకారం.. పన్ను చెల్లించకపోవడానికి సంబంధించిన ఎగవేత కేసుల్లో 46 శాతం రహస్యంగా సరఫరా, తక్కువ మూల్యాంకనం, 20 శాతం నకిలీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్‌కు (ఐటీసీ) సంబంధించినవి కాగా 19 శాతం ఐటీసీని తప్పుగా పొందడం/రివర్సల్ చేయకపోవడం వంటివి ఉన్నాయి. 2023–24లో ఆన్లైన్ గేమింగ్ రంగంలో 78 కేసుల్లో గరిష్టంగా రూ.81,875 కోట్ల ఎగవేత జరిగింది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ అండ్ ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ) రంగం 171 కేసుల్లో రూ.18,961 కోట్ల ఎగవేతలను నమోదు చేసింది. -
తెలుగు రాష్ట్రాల్లో క్లెయిమ్స్ సరళతరం: ఐసీఐసీఐ ప్రు లైఫ్
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితులకు సంబంధించి క్లెయిమ్స్ ప్రక్రియను సరళతరం చేసినట్లు ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ వెల్లడించింది. క్లెయిమ్ సెటిల్మెంట్ కోసం మూడు ప్రాథమిక డాక్యుమెంట్లను సమరి్పస్తే సరిపోతుందని వివరించింది. ఐఎఫ్ఎస్సీ కోడ్ ఉన్న బ్యాంకు అకౌంటు నంబరు లేదా క్యాన్సిల్ చేసిన చెక్ కాపీ, డెత్ సరి్టఫికెట్ లేదా ఆస్పత్రులు, పోలీసులు, ప్రభుత్వాధికారులు జారీ చేసిన మృతుల జాబితా, ఆధార్ వంటి ధృవీకరణ పత్రాలను ఇవ్వొచ్చని పేర్కొంది. మొబైల్ యాప్ ద్వారా లేదా ఎస్ఎంఎస్ ద్వారా క్లెయిమ్‌ను రైజ్ చేయొచ్చని వివరించింది. ఇరవై నాలుగ్గంటలూ పనిచేసే టోల్ ఫ్రీ క్లెయిమ్కేర్ హెల్ప్‌లైన్ 1800–2660ని ప్రారంభించినట్లు సంస్థ పేర్కొంది. -
S Jaishankar: ఆ విమానంలో నా తండ్రి కూడా ఉన్నారు
జెనీవా: ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో ఇటీవల విడుదలై వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచిన ‘ఐసీ 814: ది కాందహార్ హైజాక్’వెబ్‌సిరీస్‌పై ఇంకా చర్చ జరుగుతున్న వేళ అలాంటి హైజాక్ ఉదంతంలో తన తండ్రి, మాజీ ఐఏఎస్ అధికారి కృష్ణస్వామి సుబ్రహ్మణ్యం కూడా బాధితుడిగా ఉన్నారని భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ ప్రకటించారు. 1984 ఏడాదిలో జరిగిన విమాన హైజాక్ ఉదంతంలో తన కుటుంబం సైతం తీవ్ర ఉత్కంఠను ఎదుర్కొందని ఆయన వ్యాఖ్యానించారు. జెనీవాలో ఒక భారతీయసంతతి వ్యక్తులతో భేటీ సందర్భంగా జైశంకర్ తన కుటుంబం గతంలో పడిన వేదనను అందరితో పంచుకున్నారు. ఏడుగురు హైజాకర్లు చొరబడి.. ‘1984 జులై ఐదో తేదీన ఇండియన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఐసీ 421 విమానం శ్రీనగర్ వెళ్లేందుకు ఢిల్లీ నుంచి టేకాఫ్ అయి మధ్యలో చండీగఢ్ సమీపంలోని పఠాన్‌కోట్‌లో ఆగింది. అప్పుడు ఏడుగురు హైజాకర్లు కాక్‌పిట్‌లోకి చొరబడి విమానాన్ని తమ అ«దీనంలోకి తీసుకున్నారు. విమానాన్ని హైజాక్ చేసిన వారంతా ఆలిండియా సిఖ్ స్టూడెంట్స్ ఫెడరేషన్‌కు చెందిన వాళ్లు. సిక్కు వేర్పాటువాది జరై్నల్ సింగ్ భింద్రన్‌వాలేతోపాటు ఇతర నేతలను విడుదలచేయాలని డిమాండ్ విధించారు. విమానాన్ని లాహోర్‌కు, తర్వాత కరాచీకి, చిట్టచివరకు దుబాయ్‌కు తీసుకెళ్లారు. విమానం విదేశీగడ్డపైకి వెళ్లడంతో భారత విదేశాంగ శాఖ సైతం రాయబారం నడిపేందుకు రంగంలోకి దిగింది. ఇండియన్ ఫారిన్ సరీ్వస్‌లో చేరిన తొలినాళ్లలో.. అప్పుడు నేను ఇండియన్ ఫారిన్ సరీ్వస్(ఐఎఫ్ఎస్) యువ అధికారిగా పనిచేస్తున్నా. ప్రయాణికులన విడిపించేందుకు హైజాకర్లతో చర్చలు జరపాల్సిన బృందంలో నేను కూడా సభ్యునిగా ఉన్నా. అత్యంత కీలకమైన పనిలో నిమగ్నంకావాల్సి ఉన్నందున ఇంటికి రాలేనని చెప్పేందుకు మా అమ్మకు ఫోన్ చేశా. అప్పుడు నా భార్య ఉద్యోగానికి వెళ్లింది. ఇంట్లో పసిబిడ్డగా ఉన్న నా కుమారుడిని మా అమ్మ ఒక్కరే చూసుకుంటోంది. ‘‘ఇంటికి రావడం కుదరదు. ఇక్కడ విమానాన్ని హైజాక్ చేశారు’’అని చెప్పా. అయితే పనిలో సీరియస్‌గా మునిగిపోయాక నాలుగు గంటల తర్వాత నాకో విషయం తెల్సింది. అదేంటంటే నా తండ్రి కృష్ణస్వామి కూడా అదే విమానంలో బందీగా ఉన్నారు. ఓవైపు హైజాక్ విషయం తెల్సి ప్రయాణికుల కుటుంబసభ్యులు భారత ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. బాధిత కుటుంబసభ్యుల్లో నేను ఉన్నా. మరోవైపు ప్రభుత్వం తరఫున మాట్లాడాల్సిన వ్యక్తిని కూడా నేను. ఇలాంటి విచిత్రమైన పరిస్థితి నాది. ఏదేమైనా 36 గంటల ఉత్కంఠ తర్వాత ఖలిస్తాన్ మద్దతుదారులు అధికారుల ఎదుట లొంగిపోవడంతో కథ సుఖాంతమైంది. విమానంలోని 68 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. హైజాక్ ఉదంతం విషాదాంతంగా ముగియకుండా ఒక సమస్యకు పరిష్కారంగా మలుపు తీసుకుంది’’అని అన్నారు. ‘‘నేనింకా కాందహార్ వెబ్‌సిరీస్ చూడలేదు. అయితే హైజాకర్లతో ప్రభుత్వం, మధ్యవర్తులు కాస్తంత వెనక్కి తగ్గి మాట్లాడినట్లుగా అందులో చూపించారట కదా. సినిమాల్లో హీరోను మాత్రమే అందంగా చూపిస్తారు. ప్రభుత్వం సరిగా పనిచేసినా చూపించరు’’అని అన్నారు. అణ్వస్త్ర విధానాల్లో సుబ్రహ్మణ్యం కీలకపాత్ర మాజీ ఐఏఎస్ అధికారి అయిన కృష్ణస్వామి హైజాక్ జరిగిన ఏడాది ఢిల్లీలోని డిఫెన్స్ స్టడీస్, అనాలసిస్‌కు డైరెక్టర్‌గా ఉన్నారు. ఆ తర్వాత భారత ‘అణ్వస్త్ర’విధాన రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. ప్రముఖ అంతర్జాతీయ వ్యూహాత్మక వ్యవహారాల నిపుణుడిగా పేరొందారు. ‘‘అణ్వాయుధాలను తొలుత భారత్ తనంతట తానుగా ఏ దేశం మీదా ప్రయోగించకూడదు. ఒక వేళ భారత్ మీద ఎవరైనా అణ్వాయుధం ప్రయోగిస్తే ధీటైన సమాధానం చెప్పే స్థాయికి మనం ఎదగాలి’’అనే ప్రాథమిక సిద్ధాంతాల్లో రూపకల్పనలో ఈయన పాత్ర ఉందని చెబుతారు. జాతీయ భద్రతా మండలి సలహా బోర్డుకు తొలి కనీ్వనర్‌గా వ్యవహరించారు. హైజాకర్లతో చర్చల వేళ ‘‘కావాలంటే మొదట నన్ను చంపండి. ప్రయాణికులను ఏమీ చేయకండి’’అని హైజాకర్లతో కృష్ణస్వామి అన్నారని నాటి పాత్రికేయులు రాజు సంతానం, దిలీప్ బాబ్లు చెప్పారు.