Short Stories | Sakshi
1

42 ఏళ్లకు తిరగొచ్చాడు..:

విదేశాల్లో చిక్కుకుపోయిన వ్యక్తి నాలుగు దశాబ్దాల తరువాత తిరిగి స్వదేశానికి చేరుకున్నాడు. చక్కటి ఉద్యోగం మంచి జీతం సంపాదించి కుటుంబాన్ని ఆదుకోవాలనే ఆలోచనలో పొట్టచేతపట్టుకొని వెళ్లాడు. కానీ అనుకోని పరిస్థితుల్లో చిక్కుకుని ఒకటీ రెండూ కాదు ఏకంగా 42 ఏళ్లు చిక్కుకుపోయాడు కేరళకు చెందిన గోపాలన్‌. చివరికి ఎన్‌జీవో సాయంతో ఇంటికి చేరాడు.
Read More
2

‘దేశ ప్రజలకు హామీ ఇస్తున్నా.. ఉగ్రవాదులను మట్టిలో కలిపేస్తాం’

పాట్నా: ఉగ్రవాదులు సప్తసముద్రాల అవతల దాక్కున్నా సరే వెతికి మరి మట్టిలో కలిపేస్తాం. 140 కోట్ల మంది సంకల్పం ఉగ్రవాదుల్నే కాదు వారిని పెంచి పోషిస్తున్న ఉగ్రవాద నాయకుల వెన్ను విరిచేస్తుంది’ అని హెచ్చరించారు.
Read More
3

స్విట్జర్లాండ్‌ వెళ్లి ఉంటే..ప్రాణాలతో ఉండేవాడు

‌జమ్మూలోని పహల్గామ్‌లో ఉగ్రమూకల పైశాచికత్వం అనేక కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. 26 మంది అమాయకులు అసువులు బాసారు. పహల్గామ్ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారిలో భారత నావికాదళ అధికారి, సెలవులో ఉన్న లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ (26) ఒకరు. హర్యానాకు చెందిన వినయ్‌ వివాహం ఏప్రిల్ 16న హిమాన్షితో జరిగింది. హనీమూన్‌ కోసం స్విట్జర్లాండ్‌ వెళ్లాలనుకుని, వీసా రిజెక్ట్‌ కావడంతో పహల్గాం వెళ్లారు.
Read More
4

షిమ్లా ట్రీటీకి పాక్‌ టాటా?

ఇస్లామాబాద్‌: కశ్మీర్‌లోని పహల్గాంలో 26 మంది పర్యాటకులను ఉగ్రవాదులు ఊచకోత కోసిన దరిమిలా సింధు జలాల ఒప్పందం అమలును భారత్ నిలిపివేసిన సంగతి తెలిసిందే. దీనికి పాక్‌ ప్రతిచర్యకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే చారిత్రక సిమ్లా ఒప్పందం(Shimla Agreement) నుంచి వైదొలిగే అంశాన్ని పాక్‌..
Read More
5

Pahalgam : గుండెల్ని పిండేసే బాధితుల రోదనలు

జమ్మూకశ్మీరిలోని పహల్గామ్ ఉగ్ర దాడి యావత్ దేశాన్ని కుదిపేసింది. మినీ స్విట్జర్లాండ్‌ బైసరన్ లోయలో ప్రమంగళవారం జరిగిన మారణ హోమం పలువురి కంటతడి పెట్టిస్తోం ది. ఈ సంఘటనకు భయానక వివరాలు దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి. 26 మంది 26 మంది అమాయకుల ప్రాణాలను బలిగొన్న వైనాన్ని యావద్దేశం ఖండించింది. పహల్గామ్ ఉగ్రవాద దాడిలో తండ్రి కోల్పోయిన చిన్నారి, భర్తను కోల్పోయిన నవ వధులు వేదన వర్ణనాతీం.
Read More
6

అవే చివరి మాటలనుకోలేదు : విషాదంలో టీసీఎస్‌ ఉద్యోగి కుటుంబం

పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత జరిగిన హృదయ విదారక సంగతులు వెలుగుచూస్తున్నాయి. ఈ విషాదకర దాడిలో కొంతమంది ఎన్‌ఆర్‌ఐలు కూడా ప్రాణాలు కోల్పోయారు. పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో మరణించిన 26 మందిలో అమెరికాలో ఉంటున్న 40 ఏళ్ల టీసీఎస్‌కు చెందిన టెకీ బితాన్ అధికారి పేరు కూడా వెలుగులోకి వచ్చింది. ఫ్లోరిడాలోని బ్రాండన్‌లో నివసిస్తున్న బిటాన్ అధికారి ఈ నెల ప్రారంభంలో భార్య సోహిని ,మూడేళ్ల కుమారుడితో
Read More
7

నైఫ్‌ ఎటాక్‌ తరువాత కొత్త ఇల్లు కొన్న సైఫ్‌ అలీఖాన్‌

విలక్షణ నటుడు సైఫ్ అలీ ఖాన్ తనపై కత్తి దాడి జరిగిన కొన్ని నెలల తరువాత ఖతార్‌లో మరో ఇల్లు కొనుగోలు చేశాడు. ఖతార్‌లోని దోహాలోని ది పెర్ల్‌లోని ది సెయింట్ రెగిస్ మార్సా అరేబియా ద్వీపంలో తాను పెట్టుబడి పెట్టానని సైఫ్ అలీ ఖాన్ ఇటీవల వెల్లడించాడు. ఇండియాకి దగ్గరగా ఉండటంతోపాటు, ఇది చాలా సేఫ్‌ అని కూడా తెలిపారు. ఖతార్‌లో ఇల్లు కొనాలనే తన నిర్ణయం గురించి సైఫ్ అలీ ఖాన్ ఏమన్నాడో ఒకసారి చూద్దాం.
Read More
8

పార్లమెంటే సుప్రీం

న్యూఢిల్లీ: దేశ ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ మరోసారి న్యాయ వ్యవస్థను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. చట్ట సభలను మంచి మరేయితర వ్యవస్థ సుప్రీం కాబోదంటూ ఢిల్లీ యూనివర్సిటీ కార్యక్రమంలో చెప్పారాయన. ఈ క్రమంలో గతంలో తాను చేసిన వ్యాఖ్యలకు విమర్శలు రావడంపైనా ఆయన స్పందించారు.
Read More
9

మహేష్‌ బాబుకు ఈడీ నోటీసులు

హైదరాబాద్‌: టాలీవుడ్‌ అగ్రహీరో మహేష్‌ బాబుకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ నోటీసులు జారీ చేసింది. రియల్‌ ఎస్టేట్‌ స్కామ్‌కు సంబంధించిన వ్యవహారంలో ఆయనకు జరిగిన లావాదేవీలపై ఆయన్ని ప్రశ్నించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మధ్య ఆయన ప్రచారకర్తగా ఉన్న రెండు సంస్థలపై ఈడీ దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఆ సంస్థ నుంచి ఆయనకు భారీగా..
Read More
10

ఒకేసారి రూ.3000 పెరిగిన గోల్డ్: లక్ష దాటేసిన రేటు

దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. ఈ రోజు (ఏప్రిల్ 22) గరిష్టంగా రూ. 3000 పెరిగింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా పసిడి ధరలలో మార్పులు జరిగాయి. ఈ కథనంలో ఏ ప్రాంతంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయనే వివరాలను తెలుసుకుందాం.
Read More
11

చుక్కలాంటి అందం, చక్కనైన మనసు

బాలీవుడ్ నటి దిశా పటానీ సోదరి ఖుష్బూ పటానీ ఒక పసికందును రక్షించి ఇంటర్నెట్ హృదయాన్ని గెలుచుకుంది. ఆమె ప్రదర్శించిన కరుణ, ధైర్యసాహసాలు నెట్టింట ప్రశంసలు దక్కించుకున్నాయి. ఇంతకీ ఎవరీ ఖుష్బూ పటానీ? సోదరి దిశా గ్లామర్‌ ప్రపంచాన్ని ఏలుతోంటే.. ఖుష్బూ దేశానికి సేవ చేసే ఆర్మీ ఆఫీసర్‌ ఎలా అయింది? మాజీ ఆర్మీ అధికారిణి ఖుష్బూ పటానీ ఇంట్రస్టింగ్‌ జర్నీ గురించి తెలుసు కుందామా.
Read More
12

చూపులేదని చెత్తకుప్పలో వేస్తే.. వైకల్యాన్ని జయించింది.!

మహారాష్ట్రలోని జల్గావ్ రైల్వే స్టేషన్‌లో చెత్తబుట్టలో పడేశారు కన్నవాళ్లు. ఆ చిన్నారిని గమనించిన పోలీసులు స్థానిక రిమాండ్ హోంకు తరలించారు. అక్కడి నుంచి 270 కిలోమీటర్ల దూరం ఉన్న చెవిటి, అంధుల కోసం మెరుగైన సౌకర్యాలతో ఉండే సామాజిక కార్యకర్త శంకర్‌బాబా పాపల్కర్ అనాథాశ్రమంలో చేర్చారు. ఆ ఆశ్రమంలోనే చదువుకుని సత్తా చాటుకుంది. తాజాగా నాగ్‌పూర్‌ కలెక్టరేట్‌లో ఉద్యోగం సంపాదించింది.
Read More
13

పోప్‌ ఫ్రాన్సిస్‌ కన్నుమూత

వాటికన్‌ సిటీ: క్రైస్తవ మతపెద్ద పోప్‌ ఫ్రాన్సిస్‌(88) ఇక లేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మృతి చెందినట్లు వాటికన్‌ సిటీ వర్గాలు ప్రకటించాయి. ఈస్టర్‌ సందర్భంగా నిన్న ఆయన పేరిట సందేశం వెలువడగా.. కొన్ని గంటలకే ఆయన మృతి చెందారని వీడియో సందేశం విడుదల చేయడం గమనార్హం. అదాయ అసమానతలు, వాతావరణ మార్పులు, మరణ శిక్షలకు వ్యతిరేకంగా పోరాడిన పోప్‌..
Read More
14

కొత్త ఏటీఎమ్‌.. ఇలా బంగారం వేస్తే అలా డబ్బులొస్తాయ్‌..

ఏటీఎం గురించి తెలుసా? అని ఎవరినైనా అడిగితే.. అదెందుకు తెలియదు మాకు తెలుసు అనే చాలామంది చెబుతారు. అయితే గోల్డ్ ఏటీఎం గురించి తెలుసా? అని అడిగితే.. అడిగిన వాళ్లనే అనుమానంగా చూస్తారు. బహుశా మీ అనుమానం కరెక్టే కావచ్చు, కానీ అలాంటి ఏటీఎం కూడా ఒకటి వచ్చేసింది. దాని గురించి తెలుసుకోవాలంటే, ఈ కథనం చదివేయాల్సిందే..
Read More
15

స్కిజోఫ్రెనియా, కళ్లలో కారం చల్లి..

బెంగళూరు: కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్‌ హత్య కేసు దర్యాప్తు లోతుకు వెళ్లే కొద్దీ షాకింగ్‌ విషయాలు వెలుగు చూస్తున్నాయి. భార్య పల్లవి ఆయనపై ఓ బాటిల్‌తో దాడి చేసి.. ఆపై కారం పొడి చల్లి కట్టేసి మరీ పొడిచి కడతేర్చినట్లు తెలుస్తోంది. అంతేకాదు ప్రాణం పోతున్న టైంలో పోలీసులకు సమాచారం అందించిన ఆమె.. భర్త ముఖం మీద గుడ్డ కప్పి తాపీగా కుర్చీలో కూర్చుని చూస్తున్నట్లు విచారణలో..
Read More
16

అరాచక శక్తులకు అండగా..

అమరావతి: ఏపీలో సోషల్ మీడియా నేరస్తులకు అడ్డాగా మారిందని, వ్యక్తిత్వ హననం చేస్తే అది వారికి అదే చివరి రోజు అవుతుందని చంద్రబాబు అంటున్నారు. నిజానికి సోషల్ మీడియాను దుర్వినియోగం ఎక్కువగా చేసింది టీడీపీ వారే అనే సంగతి ఆయనకూ తెలుసు. వారిని ప్రోత్సహించింది తాను, తన కుమారుడు అనే విషయం అందరికి విదితమే. ఈ మధ్య తప్పని స్థితిలో ఒక టీడీపీ కార్యకర్తను పోలీసులు అరెస్టు చేశారు. అతన్ని విచారించి..
Read More
17

ఐదేళ్లలో రూ.20 లక్షలు: ఈ పోస్టాఫీస్ స్కీమ్ గురించి తెలుసా?

ప్రతి మనిషి తన సంపాదనలో కొంత మొత్తాన్ని భవిష్యత్ కోసం తప్పకుండా దాచుకోవాలి. లేకుంటే ఆర్ధిక సమస్యలతో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని కొందరు చిన్న మొత్తాలలో సేవింగ్ చేసుకుంటుంటే.. మరికొందరు పిల్లల చదువులకు, వివాహం లేదా ఇల్లు కొనుగోలు చేయడానికి.. ఇలా కొంత పెద్ద మొత్తంలో కూడబెట్టాలనుకుంటున్నారు. అలాంటి వారికి 'పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్' మంచి ఎంపిక అవుతుంది.
Read More
18

భార్యాభర్తల బంధానికి నిదర్శనంగా.. తోడూ, నీడగా

కష్టాల్లో, సుఖాల్లో భర్తకు తోడుగా’ అంటుంటారు. కష్టాలు, సుఖాల్లోనే కాదు... వృత్తిలోనూ భర్తకు తోడూ నీడగా ఉంటుంది జ్యోతి. భర్త డ్రైవర్, భార్య క్లీనర్‌! అనారోగ్యంతో ఉన్నభర్తకు తోడుగా నీడగా ఉంటోంది. భార్యాభర్తలు ప్రేమలు, బంధాలు మర్చి, ఒకర్నినొకరు క్రూరంగా హతమార్చుకుంటున్న అనేక విషాద ఘటనల మధ్య ఈ దంపతుల స్టోరీ భార్యాభర్తల బంధానికి నిదర్శనంగా నిలుస్తోంది.
Read More
19

తండ్రి భౌతిక దేహం సాక్షిగా ప్రియురాలి మెడలో తాళి

తండ్రి నిండు మనసుతో అక్షింతలేసి ఆశీర్వదిస్తుండగా, తన ప్రియురాల్ని పెళ్లి చేసుకోవాలని భావించిన కొడుక్కి తీరని వేదని మిగిల్చిన ఘటన ఇది. తండ్రి భౌతిక దేహం సాక్షిగా అమ్మాయి మెడలో తాళి కట్టిన ఘటన తమిళనాడులోని కడలూర్‌ జిల్లాలో చోటుచేసుకుంది. భౌతికంగా తండ్రి పూర్తిగా మాయం కాకముందే, ఆయన ఆశీస్సులు పొందాలనే ఉద్దేశంతో ప్రియురాల్ని ఒప్పించి మరీ తండ్రి మృతదేహం ఎదుటే ఆమెకు తాళి కట్టారు. ఈ వీడియో వైరలైంది.
Read More
20

Rukmini Katara : డ్రాపవుట్‌ నుంచి కంపెనీ సీఈవో దాకా

రాజస్థాన్‌లోని దుంగార్‌పూర్ జిల్లాకి చెందిన రుక్మిణి కటారా 13 ఏళ్ల వయసులో పెళ్లి, తొమ్మిది తరగతిలోనే చదువుకు బ్రేక్‌. అయితేనేం ఇపుడు కోట్ల విలువ చేసే కంపెనీకి సీఈవోగా రాణిస్తూ, ప్రధానిమోదీ చేతులు మీదుగా సత్కారాన్ని అందుకున్న మహిళ. మరో 50 మంది మహిళలకు ఉపాధి క ల్పిస్తూ స్ఫూర్తిగా నిలుస్తోంది.
Read More
21

అల్ట్రా లగ్జరీ వాచ్‌తో మెరిసిన సుహానా ఖాన్‌

బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్ ఖాన్‌ కమార్తె సుహానా ఖానా మరో సారి తన ఫ్యాషన్‌ స్టైల్‌ను చాటుకుంది. అక్షయ్ కుమార్, ఆర్ మాధవన్, అనన్య పాండే నటించిన తాజా చిత్రం కేసరి చాప్టర్ 2, ఈవెంట్లో నటి అనన్య పాండేకు సపోర్ట్‌గా ఈవెంట్‌కు విచ్చేసింది సుహానా. కోట్ల విలువైన వాచ్‌ను కూడా ధరించడం హాట్‌ టాపిక్‌గా నిలిచింది.సస్టైనబుల్‌ ఫ్యాషన్‌ను సమర్ధించే సుహానా ఈ వాచ్ ధరించి కనిపించడం ఇదే మొదటిసారి కాదు.
Read More
22

దేశంలో నేటి పెట్రోల్, డీజిల్ ధరలు

దేశంలోని వివిధ నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు నేడు (ఏప్రిల్ 19) స్థిరంగా ఉన్నాయి. అయితే రాష్ట్రాల విలువ ఆధారిత పన్ను (VAT), రవాణా ఖర్చులు, స్థానిక నిబంధనల కారణంగా నగరాల మధ్య ధరలలో వ్యత్యాసం కనిపిస్తుంది. ఈ ధరలను ప్రతిరోజు ఉదయం 6 గంటలకు డైనమిక్ ఇంధన ధరల నిర్ణయ విధానం ప్రకారం సవరిస్తారు. ఇది 2017 జూన్ నుండి అమలులో ఉంది.
Read More
23

ఇషా అంబానీ ఇల్లు, లగ్జరీకి నెక్ట్స్‌ లెవల్‌ అంతే!

భారతీయ బిలియనీర్, ముఖేష్ అంబానీ కుమార్తె, ఇషా అంబానీ పిరమల్ దేశంలోని అత్యంత స్ఫూర్తిదాయ కమైన వ్యాపార మహిళలలో ఒకరు. 32 సంవత్సరాల వయస్సులో, రిలయన్స్ రిటైల్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న అంబానీ నివసించే విలాసవంతమైన ఇల్లు గురించి ఎపుడైనా ఆలోచించారా? ముంబై నడిబొడ్డున ఉందీ అద్భుతమైన ఇల్లు, అత్యాధునిక సౌకర్యాలు, విశాలమైన గదులు, పచ్చదనంతో అద్భుతంగా లగ్జరీకి నెక్ట్స్‌ లెవల్‌ అన్నట్టుగా ఉంటుంది.
Read More
24

వాట్సాప్‌లో కొత్త ఫీచర్

స్మార్ట్‌ఫోన్ వినియోగించే ప్రతి ఒక్కరూ.. దాదాపు వాట్సాప్ ఉపయోగిస్తుంటారు. ఈ యాప్ ఉచిత మెసేజింగ్ & వీడియో కాలింగ్ వంటి వాటికి అనుమతిస్తుంది. సంస్థ యూజర్ల భద్రత, సౌలబ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ యాప్‌ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూనే ఉంటుంది. ఇందులో భాగంగానే ఇప్పుడు మరో కొత్త ఫీచర్ పరిచయం చేసింది.
Read More
25

వైభవంగా బిగ్‌బాస్‌ ప్రియాంక దేశపాండే వివాహం​

ప్రముఖ యాంకర్‌, టీవీ ప్రెజెంటర్‌, బిగ్ బాస్ తమిళ సీజన్ 5 ఫేమ్‌ ప్రియాంక దేశ్‌పాండే తన అభిమానులకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది. తన నైపుణ్యంతో ప్రేక్షకులను ఆకర్షించడమే కాదు, ఆయా షోలకు సక్సెస్‌కు కీలకంగా నిలిచింది. అందుకే ఆమెను దక్షిణ భారత టీవీ పరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకునే యాంకర్‌గా పేరొందింది. తాజాగా ఆమె తనప్రియుడితో మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టింది. ఈ ఫోటోలు నెట్టింట సందడిగామారాయి.
Read More
26

స్కెలిటన్‌లా కరణ్‌జోహార్‌, నెటిజన్లు ఏమన్నారంటే.!

చిత్రనిర్మాత కరణ్ జోహార్ (Karan Johar) అకస్మాత్తుగా బరువు తగ్గి, బక్కచిక్కిపోవడం అందర్నీ దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇంత త్వరగా బాగా బరువు తగ్గి అటు అభిమానులను, ఇటు నెటిజన్ల దృష్టిని ఆకర్షించాడు. అదనపు బరువును తగ్గించడానికి అసహజ పద్ధతులను ఉపయోగిస్తున్నాడనే పుకార్లు జోరుగా వ్యాపించాయి. బరువు తగ్గడానికి ఓజెంపిక్ (Ozempic) ఇంజెక్షన్లను ఉపయోగిస్తున్నాడనే ఆరోపణలు గుప్పుమన్నాయి.
Read More
27

Goshala Row: ఎవరిది అసత్య ప్రచారం..? ప్రశ్నిస్తే కేసులే!

తిరుపతి, సాక్షి: శ్రీవారి గోశాలలో గోమాతల మరణాల వ్యవహారంలో ఊహించిందే జరిగింది. వైఎస్సార్‌సీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి(Bhumana Karunakar Reddy)పై కూటమి ప్రభుత్వం కేసు నమోదు చేయించింది.
Read More
28

టాలీవుడ్ నటి మంచు లక్ష్మీ సోషల్ మీడియా ఖాతా హ్యాక్

టాలీవుడ్ నటి, మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మీ సోషల్ మీడియా ఖాతా హ్యాకింగ్‌ గురైంది. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో పోస్ట్ వాటిని ఎవరూ నమ్మవద్దని అభిమానులను, సన్నిహితులను కోరింది. తనకు డబ్బులు అవసరమైతే డైరెక్ట్‌గా అడుగుతానని తెలిపింది. సోషల్ మీడియాలో ఎవరినీ నేను డబ్బులు అడగనని ట్వీట్ చేసింది. ఇలాంటి వాటి పట్ల దయచేసి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరింది. ఈ విషయాన్ని ట్విటర్‌ ద్వారా వెల్లడించింది.
Read More
29

'భారత్ మూడేళ్ళలో ఆ దేశాలను అధిగమిస్తుంది'

రాబోయే మూడేళ్లలో భారత ఆర్థిక వ్యవస్థ.. జర్మనీ, జపాన్ కంటే పెద్దదిగా ఉంటుంది. 2047 నాటికి రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించవచ్చని నీతి ఆయోగ్ సీఈఓ 'బీవీఆర్ సుబ్రహ్మణ్యం' న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో అన్నారు.
Read More
30

బెస్ట్‌ ఫ్రెండ్స్‌ స్టోర్‌ లాంచ్‌లో... తళుక్కున మెరిసిన నీతా

రిలయన్స్‌ ఫౌండేషన్‌ చైర్‌పర్సన్‌ నీతా అంబానీ ఫ్యాషన​ స్టైల్‌తో ఆకట్టుకున్నారు. ఖరీదైన చేనేత పట్టుచీరలు, కోట్ల విలువైన డైమండ్‌ ఆభరణాలు అనగానే ఫ్యాషన్‌ ఐకాన్‌ నీతా అంబానీ గుర్తు రాక మానరు అంటే అతిశయోక్తికాదు. రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ భార్యగా మాత్రమే కాదు, వ్యాపారవేత్తగా , ఐపీఎల్‌ ఫ్రాంచైజీ యజమానిగా, దాతగా ఎపుడూ ఆకర్షణీయంగా ఉంటారు. తాజాగా జియో వరల్డ్‌ ప్లాజాలో తళుక్కున మెరిసారు.
Read More
31

కశ్మీర్‌పై మా ఆశ చావదు

ఇస్లామాబాద్‌: కశ్మీర్‌ పాకిస్తాన్‌ ఆర్మీ చీఫ్‌ అసిమ్‌ మునీర్‌(General Asim Munir) భారత్‌ వ్యతిరేక వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లో నిలిచారు. భారత్‌, పాకిస్థాన్‌లు సిద్ధాంతాల పరంగా వేర్వేరు దేశాలేనన్న ఆయన.. కశ్మీర్‌ను ఇస్లామాబాద్‌కు గళ సిరగా అభివర్ణించారు. ఈ క్రమంలో పాక్‌ ఎట్టి పరిస్థితుల్లోనూ కశ్మీర్‌ను మరిచిపోదని, ఏ శక్తీ దానిని పాక్‌ నుంచి వేరు చేయలేదని వ్యాఖ్యానించారు.
Read More
32

లైఫ్‌కు గ్యారంటీ లేదు..పైగా మనీ వేస్ట్‌.. అందుకే..!

కేన్సర్‌ మహమ్మారి సోకిందంటే మరణ శాసనమే అని చాలా మంది భావిస్తారు. కానీ ఆధునిక వైద్య పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తరువాత కేన్సర్‌ను జయించవచ్చు. మెరుగైన వైద్యం, కుటుంబ సభ్యుల సహకారంతోపాటు, ఆత్మ విశ్వాసం, మనోధైర్యం ఉంటే ఈ వ్యాధినుంచి బైటపడవచ్చు. మరీ ముఖ్యంగా కేన్సర్‌ వ్యాధి నివారణలో ముందస్తు గుర్తింపు, అవగాహన చాలా అవసరం. ఈ అవగాహన లేమి కారణంగా పచ్చని కాపురం కుప్పకూలి పోయింది.
Read More
33

లకారానికి దగ్గర్లో పసిడి

స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధర ఇటీవలి కాలంలో తగ్గుముఖం పట్టినట్లే పట్టి తిరిగి ఈరోజు మళ్లీ పెరిగింది. త్వరలో తులం రూ.ఒక లక్షకు చేరుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Read More
34

ఒక్క క్షణం.. జీవితాంతం క్షోభ: బాబూ మోహన్‌

యువత వాహనాలు నడిపేటప్పుడు తమ కుటుంబాన్ని గుర్తుచేసుకోవాలని సినీ నటుడు, మాజీ మంత్రి బాబూమోహన్‌ సూచించారు. చౌటుప్పల్‌ పట్టణ కేంద్రంలోని అమ్మానాన్న అనాథాశ్రమాన్ని మంగళవారం ఆయన సందర్శించారు. ఆశ్రమంలోని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అక్కడ ఆశ్రయం పొందుతున్న వారికి భోజనం వడ్డించారు. మతిస్థిమితం కోల్పోయిన వ్యక్తికి జుట్టు కత్తిరించారు. అనాథలతో ఆప్యాయంగా ముచ్చటించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.
Read More
35

వెంటిలేటర్‌పై ఉండగానే, 46ఏళ్ల మహిళపై..!

మహిళల వేషధారణ, ఆహార్యం ఆధారంగా అత్యాచారాలు జరుగుతున్నాయన్న వాదనలకు చెంపపెట్టు ఈ వార్త. ఆడవారి వయసు, ప్రదేశంతో సంబంధం లేకుండా మృగాళ్లు అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. మారాల్సింది ఆడవాళ్ల దుస్తులు కాదు, కామాంధుల దుష్టబుద్ది అని నూటికి నూరుపాళ్లు స్పష్టం చేసిన విచారకరమైన వార్త ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. గురుగ్రామ్ ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై ఉన్న ఎయిర్‌హోస్టెస్‌పై లైంగిక దాడి కలకలంరేపుతోంది.
Read More
36

వ్యాపారితో బిగ్‌ బాస్‌ బ్యూటీ ఎంగేజ్‌మెంట్‌

ప్రముఖ కన్నడ నటి వైష్ణవి గౌడ (Vaishnavi Gowda) తన అభిమానులను గుడ్‌ న్యూస్‌ చెప్పింది. 2013 టీవీ సీరియల్ అగ్నిసాక్షి సీరియల్‌ పాపులర్‌ అయినా వేలాది మంది అభిమానుల హృదయాల్లో ఒక ముద్ర వేసిన ఈ అమ్మడు జీవితంలో కొత్త అధ్యయానికి నాంది పలకబోతోంది. ప్రియుడు అనుకూల్ మిశ్రాతో ఏడు అడుగులు వేసేందుకు సిద్ధమవుతోంది. ఏప్రిల్ ప తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ విషయాన్ని ప్రకటించింది.
Read More
37

టోల్ కలెక్షన్ విధానంలో సంచలన మార్పు: 15 రోజుల్లో అమలు!

టోల్ గేట్స్ వద్ద వాహనదారులు వేచి ఉండాల్సిన సమయాన్ని తగ్గించడానికి.. 2019లో ఫాస్ట్‌ట్యాగ్ (FASTag) అనే ఒక ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ సిస్టమ్ తీసుకొచ్చారు. ఇప్పుడు శాటిలైట్ బేస్డ్ టోల్ కలెక్షన్ సిస్టమ్ 'గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్' (GNSS) తీసుకురానున్నట్లు కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు.
Read More
38

బంగ్లాదేశ్‌లో టీమిండియా పర్యటన ఖరారు.. షెడ్యూల్‌ విడుదల

ఈ ఏడాది ఆగస్ట్‌లో భారత్‌ క్రికెట్‌ జట్టు బంగ్లాదేశ్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ను బీసీసీఐ ఇవాళ (ఏప్రిల్‌ 15) ప్రకటించింది. ఈ పర్యటనలో టీమిండియా మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. రెండు వేదికల్లో ఈ మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఆగస్ట్‌ 17న వన్డే సిరీస్‌.. 26న టీ20 సిరీస్‌ మొదలవుతాయి.
Read More
39

రూ. 500 కోట్ల నీతా డైమండ్‌ నెక్లెస్‌ రెప్లికా ధర ఎంతంటే?

‌మార్కెట్లో ‘రెప్లికా’ ట్రెండ్‌ సృష్టిస్తున్న మాయాజాలం అంతా ఇంతా కాదు. ఆభరణాలకు, వస్త్రాలకు నకిలీలు మార్కెట్లో సంచలనం రేపుతున్నాయి. రిలయన్స్‌ ఫౌండేషన్‌ ఛైర్‌పర్సన్‌ నీతా అంబానీ తన చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ గ్రాండ్‌ వెడ్డింగ్‌ సందర్బంగా జరిగిన ప్రీ వెడ్డింగ్ వేడుకలో నీతా అంబానీ పచ్చలు పొదిగిన డైమండ్ నక్లెస్ ఖరీదు రూ.500 కోట్లు. దీనికి సంబంధించిన రెప్లికా ఆభరణం నెట్టింట వైరలవుతోంది.
Read More
40

ఈ అవకాశం మళ్లీ రాదేమో.. తగ్గిన బంగారం ధర..

ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధర(Today Gold Rate) ఇటీవలి కాలంలో ఒడిదొడుకులకు లోనవుతుంది. సోమవారంతో పోలిస్తే మంగళవారం కొంత తగ్గి కొనుగోలుదారులకు మరింత ఊరట కల్పించింది.
Read More
41

షిర్డీ సాయినాధుడి సేవలో నీతా అంబానీ

రిలయన్స్‌ ఫౌండేషన్‌ చైర్‌పర్సన్‌ నీతా అంబానీ వ్యాపారవేత్తగా, మానవతావాదిగా మాత్రమే కాదు ఆధ్యాత్మికవాదిగా ఎప్పుడూ వార్తల్లో ఉంటుంటారు. ఇటీవల నీతా షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించింది. సాయినాధుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాంప్రదాయదుస్తుల్లో దుస్తుల్లో తల్లి పూర్ణిమ దలాల్,తల్లి పూర్ణిమ దలాల్ ,సోదరి మమతా దలాల్‌తో కలిసి షిర్డీ ఆలయంలో బాబాను దర్శించుకున్నారు.
Read More
42

Amarnath Yatra 2025: రిజిస్ట్రేషన్లు షురూ!

Amarnath Yatra 2025 ప్రముఖ ఆధ్మాత్మిక యాత్ర అనగానే ముందుగా గుర్తొచ్చేది అమర్‌నాథ్‌యాత్ర. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన అమర్‌నాథ్‌ యాత్ర షెడ్యూల్‌ వచ్చేసింది. ప్రతి ఏడాది నిర్వహించే ఈ యాత్రకు రిజిష్ట్రేషన్ల ప్రక్రియ షురూ అయింది. అన్ని పత్రాలను సమర్పించి భక్తులను ముందస్తుగా దరఖాస్తు చేసుకోవచ్చు. బాబా బర్ఫానీ యాత్రగా చెప్పుకునే ఈ ఏడాది అమర్‌నాథ్‌ యాత్ర జూలై 25 నుండి ఆగస్టు 19 వరకు వరకు సాగనుంది.
Read More
43

సన్నీ డియోల్ జాట్ మూవీ.. నాలుగు రోజుల్లో ఎన్ని కోట్లంటే?

బాలీవుడ్ స్టార్ సన్నీ డియోల్ హీరోగా నటించిన తాజా చిత్రం జాట్(Jaat Movie). ఈ సినిమాకు టాలీవుడ్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని దర్శకత్వం వహించారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ మేకర్స్ నిర్మించారు. తెలుగు సినిమా కథతో తెరకెక్కించడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
Read More
44

చైనాలో యాపిల్ ఉత్పత్తికి కారణం ఇదే: టిక్ కుక్

సుంకాల యుద్ధాన్ని ప్రారంభించిన సమయంలో.. అమెరికా అధ్యక్షుడు 'డొనాల్డ్ ట్రంప్' యాపిల్ సహా కంపెనీలు తమ ఉత్పత్తులను దేశంలో తయారు చేయాలని కోరుకున్నారు. కానీ నిపుణులు, పరిశ్రమ నాయకులు అమెరికాలో పెద్ద ఎత్తున ఉత్పత్తుల తయారీ సాధ్యం కాదని చెప్పారు.
Read More
45

సరికొత్త మ్యూజిక్‌ థెరపీ..'జెంబే'..! ఆ వ్యాధులను నయం చేస్తుందట..!

ఉరుకుల పరుగుల జీవనంలో ఉల్లాసం కావాలి. వారంలో ఒక్కరోజైనా, ఒక్క పూటైనా ఒత్తిడి నుంచి విముక్తి కావాలి. అందుకే నగరవాసులు ఎల్లప్పుడూ ఆసక్తికరమైన ప్రత్యామ్నాయ చికిత్సల కోసం అన్వేషిస్తూ ఉంటారు. అలాంటి అన్వేషణ ఫలాల్లో ఇప్పుడు, ఆఫ్రికన్‌ డ్రమ్‌ అయిన జెంబే ఒకటిగా నిలిచింది. మ్యూజిక్‌ థెరపీలో భాగంగా దీనిని నగరవాసులు ఆస్వాదించడం పెరుగుతోంది.
Read More
46

భారత్‌ అభ్యర్థన.. వజ్రాల వ్యాపారి మెహుల్‌ ఛోక్సీ అరెస్టు

ప్రముఖ వజ్రాల వ్యాపారి మెహుల్‌ ఛోక్సీని బెల్జియం పోలీసులు అరెస్ట్‌ చేశారు. భారత సీబీఐ అధికారులు కోరిక మేరకు మెహుల్‌ ఛోక్సీ అరెస్ట్‌ చేసినట్టు తెలిపారు. రూ.13,500 కోట్ల పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ మోసం కేసులో మెహుల్‌పై అభియోగాలు ఉన్న నేపథ్యంలో అతడిని అప్పగించాలని భారత్‌ కోరింది. ఈ నేపథ్యంలోనే అతడిని అరెస్ట్‌ చేసినట్టు తెలిసింది. దీంతో, ఛోక్సీని తర్వలోనే భారత్‌కు అప్పగించే అవకాశం ఉంది.
Read More
47

మతవాదులను సంతృప్తి పరిచిన కాంగ్రెస్‌: ‍ప్రధాని మోదీ

రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ హర్యానాలో పలు అభివృద్ది పథకాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన ర్యాలీలో ప్రధాని మోదీ కాంగ్రెస్‌పై ఆరోపణల దాడి చేశారు. వక్ఫ్ (సవరణ) చట్టంపై తమ వైఖరి వెల్లడించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ మతవాదులను సంతృప్తి పరచిందని ప్రధాని మోదీ ఆరోపించారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కాంగ్రెస్‌ పార్టీ రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేసిందన్నారు.
Read More
48

బంగారం తగ్గిందోచ్‌... గోల్డ్‌ స్పీడ్‌కు బ్రేక్‌!

వరుసగా ఐదు రోజులుగా దూసుకెళ్తున్న పసిడి ధరలకు బ్రేక్‌ పడింది. దేశంలో బంగారం ధరలు (Gold Prices) నేడు (April 14) కాస్త దిగొచ్చాయి. స్వల్పంగా రూ.150-రూ.160 మేర తగ్గుదల నమోదైంది. బంగారం ధరలు (Gold Rates) ద్రవ్యోల్బణం, గ్లోబల్ ధరలలో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, హెచ్చుతగ్గుల వడ్డీ రేట్లు, నగల మార్కెట్‌లతో సహా అనేక అంతర్జాతీయ కారకాలపై ఆధారపడి ఉంటాయి.
Read More
49

నాకన్నా చిన్నోడే కానీ, మగతనం ఎక్కువై: హీరో గురించి నటి

‘అతను చాలా అందంగా ఉంటాడు అంతేకాదు అతను నా కంటే ఒక సంవత్సరం చిన్నవాడు అయినా కూడా అతను ఇంకా ఫిట్‌గానే ఉన్నాడు‘ మగవాళ్లలో మేల్‌ హార్మోన్‌ అయిన టెస్టోస్టెరాన్‌ స్థాయిలు చురుకుగా ఉన్నప్పుడు, మంచి ఫిట్‌నెస్‌ పొందుతారని అది సాధారణమేనని చెప్పారు. అంటే మగతనం ఎక్కువైతే ఫిట్నెస్ దాంతో ఆడవాళ్ళ కు ఆకర్షణ కలగడం.. వల్ల ఇలాంటి ఎఫైర్స్‌ పుట్టుకొస్తాయన్నట్టుగా అభిప్రాయపడ్డారు.
Read More
50

అప్పటి నోటిఫికేషన్‌లకు ఎస్సీ రిజర్వేషన్లు వర్తించవు: ఉత్తమ్‌

తెలంగాణలో విద్య, ఉద్యోగ అవకాశాల్లో ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామన్నారు మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి. ఎస్సీ వర్గీకరణ అమలు చరిత్రాత్మకమైనదని చెప్పుకొచ్చారు. ఈరోజు నుంచే ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్లు అమలవుతాయి.. త్వరలోనే అన్ని నోటిఫికేషన్లు ఎస్సీ రిజర్వేషన్ల అమలుతో విడుదల అవుతాయి. గత ఏడాది ఫస్ట్ ఆగస్టు కు ముందు ఇచ్చిన నోటిఫికేషన్లకు ఈ రిజర్వేషన్లు వర్తించవు. గ్రూప్ఏ-1, గ్రూప్‌బీ-9, గ్రూప్‌సీ-5 శాతం..
Read More