
భారత్-పాక్ ఉద్రిక్తతల వేళ.. రాజ్‌నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు
పహల్గామ్ ఉగ్రదాడితో భారత్-పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పాక్‌తో యుద్ధం తప్పదని వార్తలు వస్తున్న వేళ.. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Read More

‘మీరు ఒక్క క్షిపణి దాడి చేశారు.. ఇక మేమేంటో చూపిస్తాం’
తమ దేశంపై హౌతీ రెబల్స్ చేసిన క్షిపణ దాడికి అంతకుమించి ప్రతీకారం తీర్చుకుంటామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతాన్యాహూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇక తాము ఏంటో చూపిస్తామంటూ హౌతీ తిరుగుబాటుదారులను..
Read More

క్రిస్ గేల్, కేఎల్ రాహుల్ సరసన ప్రభ్‌సిమ్రన్ సింగ్
లక్నో సూపర్ జెయింట్స్ (PBKS vs LSG)తో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ (Prabhsimran Singh) పరుగుల వరద పారించాడు. ప్రత్యర్థి జట్టు బౌలింగ్‌ను చితక్కొడుతూ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. అయితే, దురదృష్టవశాత్తూ శతకానికి తొమ్మిది పరుగుల దూరంలో ప్రభ్‌సిమ్రన్ ఆగిపోయాడు. అయితేనేం.. ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. క్రిస్ గేల్, కేఎల్ రాహల్ (KL Rahul)సరసన నిలిచాడు.
Read More

మరో కాంతార లాంటి సినిమా.. తెలుగు టీజర్ వచ్చేసింది!
కేజీఎఫ్, సలార్ వంటి యాక్షన్ చిత్రాలతో సంగీత దర్శకుడిగా సంచలనం సృష్టించిన రవి బస్రూర్. ఆ తర్వాత వీర చంద్రహాస చిత్రంతో దర్శకుడిగా తన సత్తా చాటారు. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రంలో శిథిల్ శెట్టి, నాగశ్రీ జిఎస్, ప్రసన్న శెట్టిగార్, ఉదయ్ కడబాల్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. హోంబలే ఫిల్మ్స్ సమర్పణలో ఓంకార్ మూవీస్ బ్యానర్‌పై ఎన్‌ఎస్ రాజ్‌కుమార్ నిర్మించారు.
Read More

ఏపీకి భారీ వర్ష సూచన. పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ
రాబోవు కొన్ని గంటల్లో ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) వెల్లడించింది. దాంతో పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేశారు.
Read More

IND vs SL: టీమిండియాకు చేదు అనుభవం.. లంక చేతిలో ఓటమి
Sri Lanka Women vs India Women: ముక్కోణపు వన్డే సిరీస్‌లో వరుస విజయాలతో జోరు మీదున్న భారత మహిళా జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. శ్రీలంకతో ఆదివారం నాటి మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ సేన మూడు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. కాగా శ్రీలంక- భారత్- దక్షిణాఫ్రికా (Sri Lanka- India- South Africa) మధ్య లంక వేదికగా త్రైపాక్షిక సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే.
Read More

మీరు యుద్ధంలో పాల్గొంటారా?.. లేదు.. ఇంగ్లండ్ పారిపోతా: పాక్ ఎంపీ
తమపై భారత్ యుద్ధానికి దిగితే ఏంటనే పరిస్థితి ఇప్పుడు పాకిస్తాన్ లో కనిపిస్తోంది. భారత్ తో పోరాడే పూర్తి శక్తి సామర్థ్యాలు ఏ రకంగా చూసే పాక్ కు లేవు. పైకి ఏదో మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నప్పటికీ నిజంగా భారత్ యుద్ధానికి దిగితే మాత్ర..
Read More

మాకు కావాల్సింది భాగస్వాములు.. బోధకులు కాదు: జై శంకర్
యూరోపియన్ దేశాలపై భారత విదేశాంగ మంత్రి ఎన్ జైశంకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ దేశాలు అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరిపై ధ్వజమెత్తారు జైశంంకర్. యూరోపియన్ దేశాలు భారత భౌగోళిక రాజకీయ వైఖరిని ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తున్నాయంటూ..
Read More

నిన్న పిజ్జా మేకర్.. నేడు ఫ్యాషన్ మోడల్..!
నిన్న మొన్నటి వరకు అతడు పిజ్జా దుకాణంలో పిజ్జా తయారు చేస్తుండేవాడు. అనుకోకుండా ఒక రోజు న్యూయార్క్‌లోని ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ వద్ద అసిస్టెంట్‌గా పనిచేసే వ్యక్తి కంటపడ్డాడు. అంతే, అతడి అదృష్టం మారిపోయింది. ఉన్నపళాన ఫ్యాషన్ మోడల్‌గా మారిపోయాడు. ఫ్యాషన్ మోడల్‌గా మారిన ఈ ఇరవైనాలుగేళ్ల పిజ్జా మేకర్ పేరు క్రిస్టియానో వెన్‌మన్.
Read More

ధీరూభాయ్ అంబానీ అసలు పేరేంటో తెలుసా?
భారదేశంలో అత్యంత ధనవంతుడైన ముకేశ్ అంబానీ.. రిలయన్స్ సామ్రాజ్యం గురించి తెలిసిన దాదాపు అందరికీ, ఈ కంపెనీ ప్రారంభించిన వారు ధీరూభాయ్ అంబానీ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ధీరూభాయ్ అంబానీ అసలు పేరు ఏమిటో.. బహుశా చాలా తక్కువమందికే తెలిసి ఉంటుంది.
Read More

మాక్సీ స్థానంలో మరో ఆస్ట్రేలియా స్టార్.. పంజాబ్ ప్రకటన
పంజాబ్ కింగ్స్ జట్టులోకి కొత్త ఆటగాడు వచ్చాడు. ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ స్థానాన్ని మరో ఆస్ట్రేలియన్ క్రికెటర్ మిచెల్ ఓవెన్‌తో పంజాబ్ యాజమాన్యం భర్తీ చేసింది. ఇందుకు సంబంధించి ఆదివారం ప్రకటన విడుదల చేసింది.
Read More

బెర్క్‌షైర్ హాత్‌వేను వీడనున్న వారెన్ బఫెట్: నెక్స్ట్ సీఈఓ ఎవరంటే?
శనివారం (2025 మే 3) జరిగిన బెర్క్‌షైర్ హాత్వే వార్షిక సమావేశంలో.. దిగ్గజ ఇన్వెస్టర్ 'వారెన్ బఫెట్' ఊహించని ప్రకటన చేశారు. తాను 2025 చివరి నాటికి కంపెనీ సీఈఓ పదవి నుంచి వైదొలగనున్నట్లు, తరువాత 'హువర్డ్ బఫెట్' కంపెనీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపడతారని పేర్కొన్నారు. గ్రెగ్ అబెల్ సంస్థ సీఈఓగా ఉంటారని అన్నారు.
Read More

కంపెనీల కార్పొరేట్ ఫలితాలు ఇలా..
రిటైల్ స్టోర్ల దిగ్గజం షాపర్స్‌స్టాప్ గతేడాది(2024–25) చివరి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. జనవరి–మార్చి(క్యూ4)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 91 శాతంపైగా పడిపోయి రూ. 2 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఏడాది(2023–24) ఇదే కాలంలో రూ. 23 కోట్లుపైగా ఆర్జించింది. అయితే మొత్తం ఆదాయం 2 శాతం పుంజుకుని రూ. 1,064 కోట్లను తాకింది. అంతక్రితం క్యూ4లో రూ. 1,046 కోట్ల అమ్మకాలు సాధించింది.
Read More

RCB VS CSK: చరిత్రలో తొలిసారి ఇలా..!
ఐపీఎల్ చరిత్రలో ఆర్సీబీ జట్టు తొలిసారి సీఎస్‌కేపై ఇంటా బయటా (ఒకే సీజన్‌లో) విజయాలు సాధించింది. ఐపీఎల్ 2025లో భాగంగా నిన్న (మే 3) హోం గ్రౌండ్‌లో సీఎస్‌కేపై విక్టరీ సాధించిన ఆర్సీబీ.. ఈ సీజన్ అవే మ్యాచ్‌లోనూ (సీఎస్‌కే హోం గ్రౌండ్‌లో) సీఎస్‌కేను చిత్తు చేసింది. బెంగళూరులో సీఎస్‌కేపై 2 పరుగుల స్వల్ప తేడాతో గెలుపొందిన ఆర్సీబీ.. మే 28న చెన్నైలో జరిగిన మ్యాచ్‌లో 50 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
Read More

ఐపీవోకు సిద్ధమవుతున్న ప్రముఖ కంపెనీలు
ఆభరణాల రిటైల్ కంపెనీ ప్రయారిటీ జ్యువెల్స్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా 54 లక్షల ఈక్విటీ షేర్లను కొత్తగా జారీ చేయనుంది. ఈ నిధుల్లో రూ. 75 కోట్లు రుణ చెల్లింపులకు వినియోగించనుంది.
Read More

లోకల్ కంటెంట్‌పై ఫోకస్.. రూ.32 వేల కోట్లు పెట్టుబడి
డిస్నీ-రిలయన్స్ విలీనం తర్వాత ఏర్పడిన మీడియా సంస్థ జియోస్టార్ వేగంగా వృద్ధి చెందుతోంది. 2026 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రూ.32,000-33,000 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు తెలిపింది. ఇది అంతకుముందు సంవత్సరం రూ.30,000 కోట్ల పెట్టుబడితో పోలిస్తే 7% అధికం. స్పోర్ట్స్ ఎంటర్‌టైన్‌మెంట్, డిజిటల్ విస్తరణపై ఫోకస్‌గా ఉన్న కంపెనీ దేశవ్యాప్తంగా స్థానిక కంటెంట్‌పై దృష్టి సారిస్తున్నట్లు తెలిపింది.
Read More

ఒక్కసారి ఛార్జ్ చేస్తే 50 ఏళ్లు వచ్చే బ్యాటరీ
ఒకసారి ఛార్జ్ చేస్తే యాభై సంవత్సరాలు నిరాటంకంగా పని చేసేలా కాంపాక్ట్ న్యూక్లియర్ బ్యాటరీలను రూపొందిస్తున్నట్లు చైనీస్ బ్యాటరీ తయారుదారు బీటెవోల్ట్ ప్రకటించింది. ఇది కాంపాక్ట్ న్యూక్లియర్ ఎనర్జీలో పురోగతిని సూచిస్తుంది. బీవీ 100 నికెల్-63 ఐసోటోపులను ఉపయోగించి రేడియోధార్మికత ద్వారా శక్తిని ఉత్పత్తి చేస్తున్నట్లు తెలిపింది.
Read More

IPL 2025: భారీ రికార్డును సొంతం చేసుకున్న ధోని.. కోహ్లి కూడా సాధ్యం కాలేదు..!
ఐపీఎల్‌లో ఎంఎస్ ధోని మరో భారీ రికార్డును సొంతం చేసుకున్నాడు. ఓ జట్టుపై 50 సిక్సర్లు పూర్తి చేసిన మూడో ఆటగాడిగా నిలిచాడు. రికార్డుల రారాజు విరాట్ కోహ్లి కూడా ఈ రికార్డు సాధ్యం కాలేదు. ధోనికి ముందు క్రిస్ గేల్, రోహిత్ శర్మ మాత్రమే ఈ ఘనత సాధించారు. గేల్ పంజాబ్ (61), కేకేఆర్‌పై (54) 50 కంటే ఎక్కువ సిక్సర్లు కొట్టగా.. రోహిత్ ఢిల్లీపై (50) ఈ ఘనత సాధించాడు.
Read More

పాకిస్థాన్ మొత్తం అప్పు ఎంతో తెలుసా..?
పాకిస్థాన్ మొత్తం రుణం పాక్ రూపాయి(పీకేఆర్)ల్లో 70.36 ట్రిలియన్లకు (భారత కరెన్సీలో సుమారు రూ.21.15 లక్షల కోట్లు) చేరింది. ఇందులో దేశీయ, ఇతర దేశాల నుంచి తీసుకొచ్చిన అప్పులు రెండూ ఉన్నాయి. వీటిలో గణనీయమైన భాగం చైనాకు చెందినవే. పాక్ మొత్తం అప్పుల్లో సుమారు 22 శాతం చైనా సమకూర్చినవే కావడం గమనార్హం.
Read More

RCB VS CSK: ఓటమికి నాదే బాధ్యత: ధోని
నిన్న (మే 3) ఆర్సీబీ చేతిలో (బెంగళూరులో) ఎదురైన ఓటమికి సీఎస్‌కే స్టాండ్ ఇన్ కెప్టెన్ ఎంఎస్ ధోని బాధ్యత తీసుకున్నాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ ఈ విషయాన్ని చెప్పాడు. ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే 214 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదిస్తూ చివరి బంతి వరకు పోరాడింది. ధోని క్రీజ్‌లోకి వచ్చే సమయానికి సీఎస్‌కేకు విజయావకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే ధోని రాణించకపోవడంతో సీఎస్‌కే 2 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
Read More

తెరుచుకున్న బద్రీనాథ్ ఆలయం
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లోని మంచుకొండల్లో కొలువైన ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన బద్రీనాథ్ ఆలయ ద్వారాలు ఆదివారం తెరచుకున్నాయి. తెల్లవారుజామున ఆలయ అధికారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీమహావిష్ణువును తొలిరోజే దర్శించుకునేందుకు దేశ నలుమూలు సహా నేపాల్ నుంచి సైతం ఇప్పటికే భక్తులు బద్రీనాథ్ చేరుకున్నారు.
Read More

RCB VS CSK: చరిత్ర సృష్టించిన విరాట్
రికార్డుల రారాజు విరాట్ కోహ్లి మరో భారీ రికార్డు సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్‌లో అత్యధిక సార్లు 500 కంటే ఎక్కువ పరుగులు (ఓ సీజన్‌లో) చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఈ సీజన్‌తో కలుపుకుని విరాట్ ఎనిమిది సీజన్లలో 500 కంటే ఎక్కువ పరుగులు చేశాడు. విరాట్ తర్వాత అత్యధిక సీజన్లలో 500 ప్లస్ పరుగులు సాధించిన ఘనత డేవిడ్ వార్నర్‌కు దక్కుతుంది. వార్నర్ ఏడు సీజన్లలో ఈ ఘనత సాధించాడు.
Read More

కోటక్ మహీంద్రా బ్యాంక్‌కు లాభమా..? నష్టమా..?
సూక్ష్మ రుణాల విభాగంలో ఒత్తిళ్ల కారణంగా గత ఆర్థిక సంవత్సరం జనవరి–మార్చి త్రైమాసికంలో ప్రైవేట్ రంగ కోటక్ మహీంద్రా బ్యాంక్ నికర లాభం 8 శాతం (కన్సాలిడేటెడ్) క్షీణించింది. రూ.5,337 కోట్ల నుంచి తగ్గి రూ. 4,933 కోట్లకు పరిమితమైంది. స్టాండెలోన్ ప్రాతిపదికన నికర లాభం రూ. 4,133 కోట్ల నుంచి 14 శాతం క్షీణించి రూ. 3,552 కోట్లకు తగ్గింది.
Read More

జీడీపీ వృద్ధిపై అంచనాలు ఇలా..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ 6.5–6.7 శాతం మేర వృద్ధిని నమోదు చేస్తుందని డెలాయిట్ అంచనా వేసింది. అంతర్జాతీయంగా అనిశ్చితులు నెలకొన్నప్పటికీ బడ్జెట్‌లో ప్రకటించిన పన్ను మినహయింపు చర్యలు దేశీ డిమాండ్‌కు మద్దతుగా నిలుస్తాయని తెలిపింది.
Read More

షెపర్డ్ విధ్వంసం.. చరిత్ర సృష్టించిన ఆర్సీబీ
షెపర్డ్ విధ్వంసకాండ ధాటికి ఐపీఎల్‌లో ఆర్సీబీ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇన్నింగ్స్ 19, 20 ఓవర్లలో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా రికార్డు నెలకొల్పింది. ఈ మ్యాచ్‌లో షెపర్డ్ చెలరేగిపోవడంతో ఆర్సీబీ చివరి రెండు ఓవర్లలో వికెట్ నష్టపోకుండా ఏకంగా 54 పరుగులు సాధించింది. గత సీజన్‌లో గుజరాత్‌పై ఢిల్లీ చివరి రెండు ఓవర్లలో 53 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ రికార్డును ఆర్సీబీ బద్దలు కొట్టింది.
Read More

తగ్గిన మొండిబాకీలు.. పెరిగిన ఆదాయం
గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఇండియన్ బ్యాంక్ ప్రోత్సాహకరమైన ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. మొండిబాకీలు తగ్గడం, ఆదాయం పెరగడంతో రూ.2,956 కోట్ల నికర లాభం నమోదు చేసింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం జనవరి–మార్చి త్రైమాసికంలో నమోదైన రూ.2,247 కోట్లతో పోలిస్తే ఇది 32 శాతం అధికం.
Read More

పాకిస్తాన్ ‘నీడ’ను దాచిపెట్టాడు.. మూల్యం చెల్లించుకున్నాడు!
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ నీడలు ఎక్కడున్నా పసిగట్టే పనిలో పడింది కేంద్రం. ఈ క్రమంలోనే ఒక భారత జవాన్ దొరికేశాడు. పాకిస్తాన్ మహిళను వివాహం చేసుకుని, ఆ విషయాన్ని తెలియకుండా గుట్టుగా ఉంచాడు.
Read More

జమ్మూ కశ్మీర్ లో పరిస్థితి ఎలా ఉంది?
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత తొలిసారి ప్రధాని నరేంద్ర మోదీతో జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా సమావేశమయ్యారు. ఈరోజు( శనివారం) ఢిల్లీలోని ప్రధాని నివాసానికి వచ్చిన ఒమర్ అబ్దుల్లా..
Read More

విశాఖ జంట హత్యల కేసు.. వివాహేతర సంబంధమే కారణం!
విశాఖ నగరంలో కలకలం సృష్టించిన జంట హత్యల కేసులో పురోగతి సాధించారు పోలీసులు. దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన వృద్ధ దంపతుల డబుల్ మర్డర్ కేస్ లో నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
Read More

ఉగ్రవాదుల్నే కాదు.. వారి మద్దతుదారుల అంతు కూడా చూస్తాం: ప్రధాని మోదీ
ఉగ్రవాదుల్ని, వారి మద్దతు దారుల అంతు చూస్తామని మరోసారి హెచ్చరించారు భారత ప్రధాని నరేంద్ర మోదీ. మానవాళికి ఉగ్రవాదం అనేది అతి పెద్ద వినాశనకారి అని పేర్కొన్న మోదీ..
Read More

‘బాబు, లోకేష్‌లు ఎంత పొగిడినా ప్రత్యేకంగా నిధులేమీ ఇవ్వలేదు’
ఏపీకి పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్ లు ఎంత పొగిడినా ఏపీ ప్రత్యేకంగా నిధులేమి ఇవ్వలేదన్నారు సీపీఐ కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు.
Read More

‘మేము అభివృద్ధి కోరుతున్నాం.. అరాచకం కాదు’
ఏపీలో ఎక్కడ చూసినా అరాచక పాలనే కొనసాగుతుందన్నారు పశ్చిమగోదావరి జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు ముదునూరి ప్రసాద్ రాజు. ఇచ్చిన హామీలను గాలికొదిలేసి..
Read More

'అతిపెద్ద మార్కెట్ క్రాష్ జరుగుతుంది': జాగ్రత్తగా ఉండండి
రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత 'రాబర్ట్ కియోసాకి' తన 'ఎక్స్' ఖాతాలో ఒక సుదీర్ఘ పోస్ట్ చేస్తూ.. నిరుద్యోగ భయం ప్రపంచవ్యాప్తంగా వైరస్ మాదిరిగా ఎలా వ్యాపిస్తుందో వివరించారు. జాగ్రత్తగా ఉండండి, అని చెబుతూనే.. నేటి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలోని వాస్తవికతను వెల్లడించారు. అంతే కాకుండా తన పుస్తకాన్ని గురించి ప్రస్తావిస్తూ.. పుస్తకంలో తాను పేర్కొన్నట్లు జరగకపోతే మంచిదని అన్నారు.
Read More

పాక్ మంత్రి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు
సింధూ జలాలను మళ్లించే ఏ నిర్మాణమైనా పేల్చేస్తామంటూ పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ వ్యాఖ్యానించారు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో సింధూ జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై మాట్లాడిన పాక్ రక్షణ మంత్రి.. సింధూ జలాలను మళ్లించేందుకు భారత్ ఏ నిర్మాణం చేపట్టినా ధ్వంసం చేస్తామంటూ రెచ్చగొట్టేలా మాట్లాడారు.
Read More

ఆంధ్రా అంటే అమరావతి ఒక్కటే కాదు: సాకే శైలజానాథ్
ఆంధ్రా అంటే ఒక్క అమరావతి మాత్రమే కాదని, ఉత్తరాంధ్ర, రాయలసీమ కూడా రాష్ట్రంలో భాగమని, ఈ విషయాన్ని కూటమి ప్రభుత్వం గుర్తుంచుకోవాలని మాజీ మంత్రి సాకే శైలజానాథ్ స్పష్టం చేశారు. అప్పులన్నీ తెచ్చి అమరావతిలో పెట్టడం తగదన్న ఆయన, ఇది కచ్చితంగా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిని ఫణంగా పెట్టడమే అని తేల్చి చెప్పారు.
Read More

RCB vs CSK: అభిమానులకు బ్యాడ్‌న్యూస్!
ఐపీఎల్-2025 (IPL 2025)లో క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ప్లే ఆఫ్స్ రేసులో ముందుకు దూసుకుపోతున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.. ఇప్పటికే పోటీ నుంచి తప్పుకొన్న చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది. అయితే ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది.
Read More

వంటింటి చెత్తతో బయోగ్యాస్
అసాధారణ జ్ఞానం నుంచి మాత్రమే కాదు అవసరాల నుంచి కూడా ఆవిష్కరణలు పుడతాయి అని చెప్పడానికి హరిణి ఒక ఉదాహరణ. వంటగది వ్యర్థాల నుంచి బయోగ్యాస్‌ను తయారుచేసే ఆలోచన చేసి విజయవంతం అయింది. ఆ ఆలోచన తమిళనాడుకు చెందిన హరిణి రవికుమార్‌ను ఎంట్రప్రెన్యూర్‌ని చేసింది.
Read More

వశిష్టాననం... లాభాలెన్నో
వశిష్ఠాసనాన్నిసైడ్ ప్లాంక్ పోజ్ అని కూడా అంటారు. ఇది అథ్లెటిక్స్ చేసే వ్యాయామాలను పోలి ఉంటుంది. కాబట్టి శరీరానికి తగినంత చురుకుదనం లభిస్తుంది. శరీర బరువు బ్యాలెన్స్‌ను సరిచూసుకోవడానికి ఈ ఆసనం ఉపయోగ పడుతుంది.
Read More

IPL 2025: సన్‌రైజర్స్ ప్లే ఆఫ్స్ చేరాలంటే..?
భారీ అంచనాలతో ఐపీఎల్-2025 (IPL 2025) బరిలో దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టు తుస్సుమనిపించింది. ఈసారి 300 స్కోరు పక్కా అనుకుంటే.. నామమాత్రపు లక్ష్యాలనూ ఛేదించలేక చతికిలపడింది. తాజాగా గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడి ప్లే ఆఫ్స్ అవకాశాలను దాదాపు కోల్పోయింది. అయితే.. ఇంకా సాంకేతికంగా మాత్రం కమిన్స్ సేన రేసులో ఉన్నట్లే.. అదెలా అంటే..
Read More

భారత్ సీఈఓలు Vs పాక్ సీఈఓలు
ప్రపంచంలోని వివిధ దేశాల్లో స్థానికంగా ఉన్న ఆర్థిక, సామాజిక పరిస్థితుల నేపథ్యంలో పరిశ్రమలు అభివృద్ధి చెందుతాయి. క్రమంగా ప్రపంచవ్యాప్తంగా వాటి ఉత్పత్తులకు ఆదరణ లభిస్తే అపార సంపద చేకూరుతుంది. ఈ నేపథ్యంలో భారతదేశం, పాకిస్థాన్ అత్యంత ప్రభావవంతమైన సీఈఓలను తయారు చేశాయి. సంపదలో హెచ్చుతగ్గులున్నా ఎవరి ప్రత్యేకత వారిదే.
Read More

‘పాక్‌పై భారత్ దాడి చేస్తే ఈశాన్య రాష్ట్రాలను ఆక్రమిస్తాం’
పహల్గాం ఉగ్ర దాడికి ప్రతీకారం తీర్చుకునేందుకు పాకిస్తాన్‌పై భారత్ దాడి చేసిన పక్షంలో చైనా సాయంతో ఏడు ఈశాన్య రాష్ట్రాలను స్వాధీనం చేసుకుంటామని బంగ్లాదేశ్ తాత్కాలిక అధ్యక్షుడు యూనుస్ సలహాదారు ఏఎల్‌ఎం ఫజ్రుల్ రెహ్మన్ బెదిరింపులకు దిగారు. ఈ మేరకు ఆయన తన ఫేస్‌బుక్ ఖాతాలో మంగళవారం బెంగాలీలో రాసుకొచ్చారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
Read More

భారత్‌తో దాయాది యుద్ధం.. బలం కోసం పాక్ ప్రధాని కొత్త ఎత్తులు!
పహల్గాం ఘటన తర్వాత పాకిస్తాన్‌కు భారత్ భయం పట్టుకుంది. భారత్ ఎప్పుడు, ఎలా దాడి చేస్తుందో తెలియక భయంతో వణికిపోతోంది. మరోవైపు.. దాడిని ప్రపంచ దేశాలు ఖండించాయి. అనేక దేశాలు భారత్‌కు మద్దతుగా నిలిచాయి. దీంతో, పాకిస్తాన్‌కు మరింత ఆందోళన పెరిగింది. ఈ నేపథ్యంలో పాక్ సర్కార్.. ప్రపంచ దేశాల సాయం చేతులు చాస్తోంది. భారత్‌పై ఒత్తిడి తీసుకురావాలని అరేబియా, యూఏఈతో సహా ఇతర గల్ఫ్ దేశాధినేతలతో భేటీ అయ్యారు.
Read More

లక్కీ ఫెలోస్.. టూర్ వెళ్తే బంగారు నిధి జాక్‌పాట్ తగిలింది..
చెక్ రిపబ్లిక్‌లో ఇద్దరు వ్యక్తులు హైకింగ్ చేసుకుంటూ ఈశాన్య పోడ్‌క్ర్కోనోసి పర్వతాలలోని అడవిలోకి వెళ్లారు. ఒకానొక ప్రదేశంలో తమ కాళ్ల కింద ఏదో ఉందని అనిపించింది. గట్టిగా అడుగులు వేయడంతో శబ్ధం వచ్చింది. దీంతో, అక్కడ కొంత భూమి పొరను తీసి చూడగానే వారిని నిధి కనిపించింది. దానిలో 598 బంగారు నాణేలు, ఆభరణాలు, పొగాకు సంచులు కనిపించడంతో పర్యాటకులు ఆశ్చర్యపోయారు. నిధిలో దొరికిన వాటి విలువ సుమారు 2.87 కోట్లు.
Read More

2014-19 మధ్య అమరావతిలో ఏం నిర్మించారు?: అంబటి
చంద్రబాబు విధానాలతో ఏపీ తీవ్రంగా నష్టపోతోందన్నారు అంబటి రాంబాబు. అమరావతి అంతా భ్రమరావతి అని ప్రజలు గమనిస్తున్నారు. 2014-19 మధ్య అమరావతిలో ఏం నిర్మించారు?. ఇప్పుడు మూడేళ్లలో ఎలా పూర్తి చేస్తారు?. విభజన హామీలు అడగరు కానీ.. వరల్డ్ క్లాస్ క్యాపిటల్ నిర్మిస్తారా?. చంద్రబాబు జిమ్మిక్కులను ప్రజలు అర్థం చేసుకోవాలి. అమరావతిపై ఇప్పటికే రూ.52వేల కోట్లు అప్పు చేశారు. గన్నవరం పక్కనే అమరావతిలో ఇంటర్నేషనల్..
Read More

చంద్రబాబూ.. రైతుల గోడు పట్టదా?: వైఎస్ జగన్
ఏపీలో రైతుల ఆందోళనలపై వైఎస్ జగన్ స్పందించారు. కనీస మద్దతు ధరలు లభించక రాష్ట్రంలో రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. రైతులను నిలువునా మోసం చేస్తున్నారు. ఇది న్యాయమేనా?. జిల్లాల్లో రైతులు ఆందోళనలు చేస్తుంటే, ఇప్పటికీ రోమ్ చక్రవర్తి ఫిడేలు వాయించినట్లుగా వ్యవహరిస్తున్నారు. రైతులు అప్పుల ఊబిలోకి కూరుకు పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
Read More

ఇదిగో ఇల్లు.. హైదరాబాదే టాప్
గడువులోగా భవన నిర్మాణాలను పూర్తి చేసి, గృహ కొనుగోలుదారులకు అందజేయడంలో దక్షిణాది నగరాలలో హైదరాబాద్ ముందంజలో నిలిచింది. గ్రేటర్‌లో 2024–25లో ఆర్థిక సంవత్సరంలో 57,304 యూనిట్లు డెలివరీ అయ్యాయి. 2023–24లో డెలివరీ అయిన 35,641 ఇళ్లతో పోలిస్తే ఏడాది కాలంలో 61 శాతం వృద్ధి రేటు నమోదైంది. ఇదే సమయంలో బెంగళూరులో 46,103, చెన్నైలో 19,650 యూనిట్లు డెలివరీ అయ్యాయి.
Read More

ఎద్దు టెస్ట్ రైడ్ బ్రో..!
సోషల్ మీడియా (Social media)విశేషాల పుట్ట. రిమ్‌జిమ్.. రిమ్‌జిమ్.. స్కూటర్ వాలా జిందాబాద్ అంటూ ఒక ఎద్దు స్కూటర్‌ను ఎంచక్కా రైడ్ చేస్తోంది. అదేంటి ఎద్దుల బండి చూశాం కానీ.. ఎద్దు స్కూటరేంటి అనుకుంటున్నారా? అయితే మీరీ కథనం చదవాల్సిందే. సోషల్‌మీడియాలో హల్‌చల్ చేస్తోన్నవీడియో చూసి తీరాల్సిందే.
Read More

ఈసారి ఐపీఎల్ టైటిల్ గెలిచేది ఆ జట్టే: గావస్కర్
టీమిండియా దిగ్గజ క్రికెటర్, కామెంటేటర్ సునిల్ గావస్కర్ ఆర్సీబీని ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు అద్భుతంగా బ్యాటింగ్ చేస్తోంది. వాళ్ల ఫీల్డింగ్ కూడా సూపర్. ఈసారి ఆర్సీబీనే టైటిల్ ఫేవరెట్‌గా కనిపిస్తోంది’’ అన్నాడు.
Read More

సెకండ్ హ్యాండ్ ఇళ్లకు గిరాకీ
స్థిరాస్తి రంగానికి ప్రత్యేకించి గృహ విభాగానికి కరోనా మహమ్మారి బూస్ట్‌లా బలానిచ్చింది. హోం ఐసోలేషన్, వర్క్ ఫ్రం హోమ్ వంటి కారణంగా సొంతింటి అవసరం తెలిసి రావడంతో నివాస విభాగం శరవేగంగా అభివృద్ధి చెందింది. దీంతో కోవిడ్ తర్వాత కొత్త ఇళ్లకే కాదు రీసేల్ ప్రాపర్టీలకూ గిరాకీ పెరిగింది.
Read More