Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
Sakshi News home page

ప్రధాన వార్తలు

AP Liquor Scam Case: YSRCP MP Mithun Reddy Arrested1
వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి అరెస్ట్‌

సాక్షి, విజయవాడ: అక్రమ మద్యం కేసులో వైఎస్సార్‌సీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిని సిట్‌ అరెస్ట్‌ చేసింది. విజయవాడలో విచారణకు హాజరైన ఆయన్ని సిట్‌ అదుపులోకి తీసుకుంది. రేపు కోర్టులో హాజరుపర్చనుంది. లేని మద్యం కేసును సృష్టించి.. చంద్రబాబు ప్రభుత్వం కుట్రలకు తెరలేపింది. రాజకీయ కక్షతో పెద్దిరెడ్డి కుటుంబాన్ని చంద్రబాబు సర్కార్‌ వేధిస్తోంది. ఏపీలో రెడ్‌బుక్‌ రాజ్యాంగం బుసలు కొడుతోంది. మిథున్‌రెడ్డి అరెస్ట్‌పై వైఎస్సార్‌సీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.మిథున్‌రెడ్డి అరెస్ట్‌ను వైఎస్సార్‌సీపీ నేతలు ఖండించారు. కూటమి పాలనలో కక్ష సాధింపులు తారాస్థాయికి చేరాయి. తప్పుడు కేసులకు భయపడే ప్రసక్తే లేదు. మిథున్‌రెడ్డి కడిన ముత్యంలా బయటకొస్తారు. రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోంది. లేని మద్యం కేసును సృష్టించి అరెస్ట్‌లు చేస్తున్నారు. కక్ష సాధింపులో భాగంగానే మిథున్‌రెడ్డిని అరెస్ట్‌ చేశారు. న్యాయ పోరాటంలో కచ్చితంగా విజయం సాధిస్తాం’’ అని వైఎస్సార్‌సీపీ నేతలు అన్నారు. కాగా, విచారణకు ముందు.. మిథున్‌రెడ్డి ఢిల్లీ నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుని, అక్కడి నుంచి సిట్ కార్యాలయానికి వెళ్లారు. ఈ ఉదయం ఆయన ఢిల్లీలో సాక్షితో మాట్లాడుతూ.. తనపై కేసులు రాజకీయ కక్షతో పెట్టినవే అని అన్నారు. తానొక ఎంపీనని, మద్యం పాలసీ రూపకల్పనలో తన ప్రమేయం ఎందుకు ఉంటుంది? అని ప్రశ్నించారు. అదే సమయంలో వైఎస్సార్‌సీపీ కీలక నేతలు ఇదంతా కూటమి ప్రభుత్వ కుట్రేనని మండిపడ్డారు. విచారణ సమయంలో సిట్ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.మిథున్ రెడ్డి అరెస్టుని ఖండించిన మాజీ ఎంపీ వంగా గీతమీరు తప్పు చేస్తున్నారని మీకు తెలుసు కాబట్టే వాటిని మేము ప్రశ్నిస్తామని భయపడి YSRCP నాయకులపై అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేయిస్తున్నారని అందరికీ తెలుసు.చంద్రబాబూ.. నిజాయితీగా పాలన చేస్తున్నవారు ఎవరూ ఇలా అక్రమ అరెస్టులు చేయించరు.మిథున్ రెడ్డి అక్రమ అరెస్టును ఖండిస్తున్నా.లేని మద్యం కేసును సృష్టించి, చంద్రబాబు ప్రభుత్వం కుట్రలకు తెరలేపుతోంది: ధర్మాన కృష్ణదాస్, మాజీ మంత్రిఎంపీ మిథున్ రెడ్డి మీద అక్రమ కేసు పెట్టి, అరెస్టు చేయించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా.ఏపీలో రెడ్‌బుక్‌ రాజ్యాంగం బుసలు కొడుతోంది అనడానికి ప్రస్తుత పరిణామాలే సాక్ష్యంచంద్రబాబు గారూ మీరు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై ఎన్ని అక్రమ కేసులు పెట్టి భయపెట్టాలని చూసినా, ఎన్ని అడ్డంకులు సృష్టించినా వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు.మిథున్ రెడ్డిపై అక్రమ అరెస్టును ఖండిస్తున్నా: గోరంట్ల మాధవ్, మాజీ ఎంపీప్రజల అండదండలు మాకు ఉన్నాయి.మీ అవినీతి అక్రమాలను ప్రశ్నిస్తూనే ఉంటాం.మిధున్ రెడ్డి అరెస్ట్ పై X లో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్లిక్కర్ స్కామ్ అంటారు… కానీ:ఆధారం లేదుడబ్బు సీజ్ కాలేదుమద్యం లభించలేదుచార్ట్ షీట్ లో పేరు లేదు ఇంకెక్కడా కుంభకోణం???? కానీ అరెస్ట్ ఉంది ఎందుకంటే టార్గెట్ జగన్ అన్నఈ కుట్రలో మిథున్ అన్నను కూడా లాగారు.ఇది స్కామ్ కాదు… ఇది చంద్రబాబు గారి ప్రతీకార డ్రామామిథున్ రెడ్డిగారి అరెస్ట్ కుట్రపూరితం, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా: గురుమూర్తి, ఎంపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మొదలు ప్రజల సమస్యలు గాలికి వదలి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై కక్షసాధింపులకు ప్రాధాన్యం ఇస్తుంది.ఎన్నికలలో ఇచ్చిన హామీల నుంచి ప్రజల దృష్టి మరల్చే విధంగా కుట్ర పూరితంగా వ్యవహరించడం దుర్మార్గం.ఈ కుట్రలన్నింటికి సమాధానం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి.

Ys Jagan Fires On Tdp Mla Bhanu Prakash Comments2
రోజాపై భానుప్రకాష్‌ వ్యాఖ్యలు అత్యంత హేయం: వైఎస్‌ జగన్‌

సాక్షి, తాడేపల్లి: మాజీ మంత్రి ఆర్కే రోజాపై టీడీపీ ఎమ్మెల్యే భాను ప్రకాష్ వ్యాఖ్యల పట్ల వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. ఎమ్మెల్యే భానుప్రకాష్‌ని అరెస్ట్‌ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రోజాకు సంఘీభావం తెలుపుతూ వైఎస్‌ జగన్‌ ట్వీట్ చేశారు. మాజీ మంత్రి ఆర్కే రోజా సెల్వమణిపై టీడీపీ ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్‌ చేసిన వ్యాఖ్యలు అత్యంత హేయం. టీడీపీలో దారుణంగా మారిన దుష్ట సంస్కృతికి ఆ వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయి’’ అంటూ వైఎస్‌ జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘ప్రభుత్వ తప్పిదాలను ఎత్తి చూపుతూ గట్టిగా మాట్లాడుతున్నందుకు, వాటిని ప్రశ్నిస్తున్నందుకూ ఓర్చుకోలేక, నా సోదరి రెండుసార్లు ఎమ్మెల్యేగానూ, మంత్రిగానూ పని చేసిన ఆర్కే రోజాను అత్యంత అసభ్యకరమైన పదజాలంతో దూషించారు. ఇది ఏదో యాదృచ్ఛికంగా జరిగింది కాదు. తమను విమర్శించే మహిళల గొంతు నొక్కడమే ధ్యేయంగా తెలుగుదేశం పార్టీలో ఒక తంతుగా మారిన అత్యంత హేయమైన సంస్కృతికి ఇది ఒక నిదర్శనం. వ్యక్తిత్వ హననం ద్వారానే చంద్రబాబు తన రాజకీయ జీవితం కొనసాగిస్తున్నారు....నిజం చెప్పాలంటే ఒక మహిళపై అత్యంత హేయంగా ఆరోపణలు చేసి, దుష్ప్రచారం చేసే ఆయన ఉన్నత పదవి పొందారు. అప్పటి నుంచే వ్యక్తిగత దాడులు, స్త్రీలను ద్వేషించే తత్వం తెలుగుదేశం పార్టీకి ఒక బ్రాండ్‌గా మారింది. ధైర్యంగా మాట్లాడే మహిళలను భయపెట్టి వారి నోరు మూయించడానికి నిస్సిగ్గుగా అత్యంత అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడంతో పాటు, విమర్శించడాన్ని ఆ పార్టీ నాయకులు ఒక ఆనవాయితీగా పెట్టుకున్నారు. ఆ కోవలోనే గత ఏడాది కాలంగా అనేక మంది మహిళా నాయకురాళ్లను వారు దారుణంగా వేధించారు.. అవమానించారు’’ అంటూ వైఎస్‌ జగన్‌ దుయ్యబట్టారు.తనపై ఒక ఎమ్మెల్యే చేసిన అత్యంత హేయమైన వ్యాఖ్యలపై ఫిర్యాదు చేయడానికి ఆర్కే రోజా వెళ్లగా, వాస్తవాలు స్పష్టంగా కళ్లెదుటే కనిపిస్తున్నా పోలీసులు తిరిగి ఆమెపైనే సందేహాలు వ్యక్తం చేశారు. ఇది రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఎంత దారుణంగా మారింది? టీడీపీ గుండాలను రక్షించేందుకు వారు ఏ స్థాయిలో తమ బాధ్యత, కర్తవ్యాన్ని మర్చి వ్యవహరిస్తున్నారన్నది చూపుతున్నాయి.నిజానికి ఒక్క రోజా విషయంలోనే కాదు.. మాజీ మంత్రి విడదల రజని, కృష్ణా జిల్లా జడ్పీ ఛైర్‌పర్సన్‌ ఉప్పాల హారికతో పాటు, మా పార్టీకి చెందిన పలువురు నాయకుల కుటుంబ సభ్యుల విషయంలో కూడా చాలా అవమానకర ఘటనలు చోటు చేసుకున్నాయి. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం వచ్చాక మహిళలకు ఏ మాత్రం రక్షణ లేకుండా పోయింది. వారికి కనీస గౌరవ, మర్యాదలు దక్కడం లేదు. వారికి ఏ విధంగానూ న్యాయం జరగడం లేదు. ఇకనైనా మాజీ మంత్రి ఆర్కే రోజాను దారుణంగా అవమానించిన ఎమ్మెల్యే భానుప్రకాష్‌ను తక్షణమే అరెస్టు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలి’’ అని వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు.The shocking verbal abuse hurled by TDP MLA Gali Bhanu Prakash against @RojaSelvamaniRK is yet another example of the deeply rotten culture within the TDP. Roja, my sister, a two-time MLA and former minister, was subjected to filthy, degrading, and offensive language simply for…— YS Jagan Mohan Reddy (@ysjagan) July 19, 2025

Weekly Horoscope In Telugu From 20-07-2025 To 26-07-20253
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..

మేషం...ముఖ్యమైన పనులు నిదానంగా సాగుతాయి. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమ మీది ఫలితం వేరొకదిగా ఉంటుంది. తీర్థయాత్రలు చేస్తారు. బంధువులతో విభేదాలు ఏర్పడతాయి. గృహ నిర్మాణయత్నాలలో అవాంతరాలు. కుటుంబ, ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. వ్యాపారాలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి. ఉద్యోగాలలో ఒత్తిళ్లు, పనిభారం పెరుగుతాయి. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా. వారం మధ్యలో శుభవార్తలు. స్వల్ప ధనలాభం. గులాబీ, లేత ఆకుపచ్చ రంగులు. శివపంచాక్షరి పఠించండి.వృషభం....కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆత్మీయులు, శ్రేయోభిలాషుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆస్తి విషయంలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. అందరిలోనూ గౌరవం పెరుగుతుంది. కోర్టు కేసులు పరిష్కారదశకు చేరతాయి. వాహనయోగం. విద్యార్థులు అనుకున్న ఫలితాలు సాధిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం. కళారంగం వారికి సత్కారాలు. వారం మధ్యలో ధనవ్యయం. ఆరోగ్యసమస్యలు. ఆకుపచ్చ, నేరేడు రంగులు. కనకధారాస్తోత్రాలు పఠించండి.మిథునం...ఆర్థికంగా ఇబ్బంది పడతారు. సోదరులు, సోదరీలతో అకారణంగా వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కొన్ని పనులు మధ్యలో విరమిస్తారు. భూవివాదాలు నెలకొంటాయి. ప్రముఖులతో చర్చలు ఫలించవు. దూరప్రాంతాల నుంచి అందిన సమాచారం కొంత ఊరట కలిగిస్తుంది. ఉద్యోగయత్నాలు నిదానంగా సాగుతాయి. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగాలలో పనిభారం పెరుగుతుంది. రాజకీయవర్గాలకు చికాకులు తప్పకపోవచ్చు. వారం మధ్యలో ధన, వస్తులాభాలు. నూతన పరిచయాలు. నేరేడు, లేత పసుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.కర్కాటకం...అనుకున్న వ్యవహారాలు సాఫీగా పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఆలయాలు సందర్శిస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయం. బంధువుల నుంచి శుభవార్తలు. భూములు, వాహనాలు కొంటారు. కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. నిరుద్యోగుల యత్నాలు కొంతమేరకు ఫలిస్తాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉంటాయి. పారిశ్రామికవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. ఎరుపు, గులాబీ రంగులు. ఆదిత్య హృదయం పఠించండి.సింహం...కొత్త వ్యక్తులు పరిచయం సంతోషం కలిగిస్తుంది. ఆప్తులు మీ అభివృద్ధిలో కీలకం కాగలరు. ఇంటర్వ్యూలు అందుకుంటారు. ఇంటాబయటా మీకు ఎదురులేని పరిస్థితి ఉంటుంది. సోదరులతో విభేదాలు తొలగుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆస్తి విషయాలలో ఒప్పందాలు చేసుకుంటారు. వాహనయోగం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. కళారంగం వారికి నూతన అవకాశాలు. వారం చివరిలో ధనవ్యయం. ఆరోగ్యసమస్యలు. పసుపు, గులాబీ రంగులు. ఆంజనేయ దండకం పఠించండి.కన్య...నూతన ఉద్యోగప్రాప్తి. కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. కొన్ని వివాదాలు తీరి ఊపిరిపీల్చుకుంటారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తిలాభ సూచనలు. ఆరోగ్యం కుదుటపడుతుంది. వేడుకల్లో పాల్గొంటారు. విద్యార్థులకు నూతన విద్యావకాశాలు దక్కుతాయి. వాహనాలు, భూములు కొంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో సమర్థతను నిరూపించుకుంటారు. రాజకీయవర్గాలకు పదవీయోగం. వారం ప్రారంభంలో వివాదాలు. అనుకోని ఖర్చులు. నీలం, నేరేడు రంగులు. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.తుల...ఆర్థిక వ్యవహారాలు కాస్త ఇబ్బంది కలిగిస్తాయి. ఉద్యోగయత్నాలు నిదానంగా సాగుతాయి. సోదరులు, సోదరీలతో అకారణంగా విభేదాలు. కొన్ని పనులు మందకొడిగా సాగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. దూరపు బంధువులను కలుసుకుంటారు. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. ఆరోగ్యం చికాకు పరుస్తుంది. వ్యాపార లావాదేవీలు అంతగా అనుకూలించవు. ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు. కళారంగం వారికి ఒత్తిడులు తప్పవు. వారం చివరిలో అప్రయత్న కార్యసిద్ధి. ఆకస్మిక ధనలబ్ధి. గులాబీ, తెలుపు రంగులు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.వృశ్చికం....అనుకోని ఖర్చులు ఎదురై అప్పులు చేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. బంధువులతో తగాదాలు. ముఖ్యమైన పనులు మధ్యలో వాయిదా వేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆస్తి వివాదాలు నెలకొంటాయి. కాంట్రాక్టర్లకు నిరాశాజనకంగా ఉంటుంది. అనారోగ్య సూచనలు. ఇంటి నిర్మాణాలలో అవరోధాలు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు. రాజకీయవర్గాలకు గందరగోళ పరిస్థితులు. వారం ప్రారంభంలో శుభవార్తలు. వాహనయోగం. ఆకుపచ్చ, లేత ఎరుపు రంగులు. శివాష్టకం పఠించండి.ధనుస్సు...అనుకున్న విధంగా వ్యవహారాలు చక్కదిద్దుతారు. ప్రముఖుల నుంచి అందిన సమాచారం సంతోషం కలిగిస్తుంది. కొత్త వ్యక్తులు పరిచయమై ఉత్సాహాన్నిస్తారు. సంఘంలో మరింత పేరు గడిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టి పెడతారు. పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు సానుకూలం. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో అనుకున్న హోదాలు దక్కించుకుంటారు. వారం చివరిలో అనారోగ్యం. కుటుంబసమస్యలు. లేత ఆకుపచ్చ, నలుపు రంగులు. హనుమాన్‌ ఛాలీసా పఠించండి.మకరం...వీరికి అన్నింటా విజయాలే. ఆర్థికంగా గతం కంటే మెరుగ్గా ఉంటుంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. శత్రువులు కూడా మిత్రులుగా మారతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆస్తి వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. ఒక కీలకమైన కేసు పరిష్కారమవుతుంది. వివాహ, ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలు మరింతగా లాభిస్తాయి. ఉద్యోగాలలో ఊహించని హోదాలు రావచ్చు. పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు, సన్మానాలు. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. బంధువిరోధాలు. గులాబీ, లేత ఎరుపు ర ంగులు. శ్రీరామరక్షాస్తోత్రాలు పఠించండి.కుంభం...అనుకున్న పనులు నత్తనడకన కొనసాగుతాయి. బంధువులతో విభేదాలు ఏర్పడవచ్చు. శ్రమ మరింతగా పెరుగుతుంది. ఆరోగ్య, కుటుంబసమస్యలు చికాకు పరుస్తాయి. గత సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. దూరప్రాంతాల నుంచి ముఖ్య సమాచారం అందుకుంటారు. వ్యాపారాలలో పెట్టుబడులు ఆలస్యమవుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు తప్పవు. పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం చివరిలో విందువినోదాలు. ఉద్యోగలాభం. నేరేడు, గులాబీ రంగులు. గణేశ్‌ను పూజించండి.మీనం...వ్యవహారాలలో ఆటంకాలు. ఆర్థిక పరిస్థితి నిరాశాజనకంగా ఉంటుంది. మిత్రులతో కలహాలు. సేవాకార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. ఆరోగ్య, కుటుంబసమస్యలు. శ్రమకు తగిన ఫలితం రాక డీలా పడతారు. దూరపు బంధువులను కలుసుకుంటారు. ముఖ్య నిర్ణయాలలో తొందరపాటు వద్దు. తీర్థయాత్రలు చేస్తారు. ఇంటి నిర్మాణయత్నాలు నెమ్మదిస్తాయి. వ్యాపారాలలో సమస్యలు. ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉండవచ్చు. కళారంగం వారికి యత్నాలలో అవాంతరాలు. వారం ప్రారంభంలో శుభవార్తలు. ప్రముఖులతో పరిచయాలు. ఆకుపచ్చ, తెలుపు రంగులు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

Kazipet Railway factory becomes largest manufacturing unit4
2026 నుంచి కాజీపేటలో చిక్‌బుక్‌ చిక్‌బుక్‌ రైలే

సాక్షి ప్రతినిధి, వరంగల్‌: కాజీపేట రైల్వే మాన్యుఫాక్చరింగ్‌ యూనిట్‌లో 2026 నాటికి ఉత్పత్తి ప్రారంభమవుతుందని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. వచ్చే డిసెంబర్‌ కల్లా యూనిట్‌ సివిల్‌ నిర్మాణ పనులు పూర్తవుతాయని చెప్పారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ యూనిట్‌ నిర్మాణం జరుగుతోందని పేర్కొన్నారు. కాజీపేట యూనిట్‌లో రైల్వే ఇంజిన్లతోపాటు కోచ్‌లు, మెట్రో రైళ్ల తయారీ, డిజైన్‌ పనులు కూడా చేపడతామని వెల్లడించారు. ఈ యూనిట్‌ ఒక మెగా ఫ్యాక్టరీగా రూపుదిద్దుకుంటోందని తెలిపారు. శనివారం హను మకొండ జిల్లా అయోధ్యపురంలోని కాజీపేట రైల్వే కోచ్‌ మాన్యుఫాక్చరింగ్‌ యూనిట్‌లో జరుగుతున్న పనులను కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు, బీజేపీఎల్‌పీ నేత ఎ.మహేశ్వర్‌రెడ్డితో కలిసి అశ్వినీ వైష్ణవ్‌ పరిశీలించారు. హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక రైలులో కాజీ పేట రైల్వేస్టేషన్‌కు చేరుకున్న ఆయన.. ఫ్యాక్టరీలో జరుగుతున్న పనుల గురించి రైల్వే అధికారులు, కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. అధికారులు పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా పనుల పురోగతిని వివరించారు. అనంతరం ఫ్యాక్టరీ ఆవరణలోనే ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అశ్వినీ వైష్ణవ్‌ మాట్లాడారు. ఎన్నో ఏళ్లపాటు కలగానే మిగిలిన కాజీపేట రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీని ప్రధానమంత్రి నరేంద్రమోదీ సాకారం చేశారని అన్నారు. రూ.500 కోట్లతో ఏర్పాటు చేస్తున్న ఈ పరిశ్రమలో బహుళ రకాల రైల్వే మాన్యుఫాక్చరింగ్‌ కార్యకలాపాలు నిర్వహిస్తారని తెలిపారు. ఈ ప్రాజెక్టు పురోగతిపై చాలా సంతోషంగా ఉన్నట్లు చెప్పారు. మోదీ మాట తప్పరు అనేందుకు ఇదే నిదర్శనం ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇచ్చిన మాట తప్పరు అనేందుకు కాజీపేట రైల్వే మాన్యుఫాక్చరింగ్‌ ఫ్యాక్టరీనే ఉదాహరణ అని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. ఈ ఫ్యాక్టరీ కోసం సుమారు 40 ఏళ్లుగా వరంగల్‌ జిల్లా ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారని, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు హయాంలో కూడా కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీ కోసం ప్రయత్నాలు జరిగాయని తెలిపారు. నరేంద్రమోదీ ప్రధాని అయిన తర్వాత కాజీపేటలో రైల్వే ఇంజన్లు, కోచ్‌లు, వ్యాగన్ల తయారీ పరిశ్రమ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారని.. ఆయనే స్వయంగా వచ్చి భూమి పూజ చేశారని గుర్తుచేశారు. తెలంగాణలో మొత్తం 40 రైల్వే స్టేషన్ల అభివృద్ధి జరుగుతోందని, వరంగల్‌ రైల్వేస్టేషన్‌ అభివృద్ధి కూడా అందులో భాగమేనని వెల్లడించారు. ఈ యూనిట్‌ ద్వారా సుమారు 3 వేల మందికి ప్రత్యక్షంగా, వేల మందికి పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి లభిస్తుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ సిఫారసు, ఆర్‌ఆర్‌ పాలసీ ప్రకారం స్థానికులకు ఫ్యాక్టరీలో ఉద్యోగాలు లభిస్తాయని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇస్తే త్వరలోనే వరంగల్‌కు ఎయిర్‌పోర్టు వరంగల్‌లో ఎయిర్‌పోర్ట్‌ అవసరం ఎంతో ఉందని.. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన భూమిని సేకరించి పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు అప్పగిస్తే వరంగల్‌ ప్రజలకు విమాన రాకపోకల సౌకర్యం కలుగుతుందని కిషన్‌రెడ్డి తెలిపారు. భూమి కోసం గత సీఎం కేసీఆర్‌కు అనేకసార్లు లిఖితపూర్వకంగా విన్నవించానని, ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇదే విషయంపై విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. ‘ప్రధాని మోదీ తెలంగాణకు ఏం ఇచ్చారు? బీజేపీ ఏం తెచ్చింది? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. అలాంటివారు తమ కళ్లు తెరిచి చూడాలి. చెవులుంటే వినాలి. మోదీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను స్వయంగా చూడాలి’అని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు, మాజీ ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, మార్తినేని ధర్మారావు, మాజీ ఎంపీ ఆజ్మీరా సీతారాం నాయక్, బీజేపీ వరంగల్‌ జిల్లా మాజీ అధ్యక్షురాలు రావు పద్మ తదితరులు పాల్గొన్నారు.

Jammula Srikanth On Air India Plane Crash Report5
పైలట్ ‘మాస్ మర్డర్-సూసైడ్’

టేకాఫ్ చేసిన కొద్ది సెకండ్లలో ఎయిరిండియా బోయింగ్ 787 విమానంలోని ఇంధన నియంత్రణ మీటల్ని కెప్టెన్ (సీనియర్ పైలట్) సుమీత్ సబర్వాల్ ఎందుకు ఆపేశాడు? ఒక్క సెకను తేడాతో రెండు స్విచ్చులు ఆఫ్ అయ్యాయి. ఫలితంగా విమానం ఇంజిన్లకు ఇంధన సరఫరా నిలిచిపోయింది. పైలట్స్ తేరుకుని మీటల్ని లాగి ఇంధన సరఫరాను పునరిద్ధరించేందుకు యత్నించినా అప్పటికే సమయం మించిపోయింది. జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇంధనం అందక, చోదక శక్తి క్షీణించి విమానం కుప్పకూలింది. గత నెల 12న అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి ఎయిరిండియా విమానం టేకాఫ్ అయిన వెంటనే సంభవించిన ఈ దుర్ఘటనలో ఒకే ఒక్క ప్రయాణికుడు మినహా మిగతా 241 మందీ దుర్మరణం పాలయ్యారు. ఈ 241 చావుల్లో ఒకదాన్ని (కెప్టెన్/సీనియర్ పైలట్) ఆత్మహత్యగా, మిగతా 240 మరణాలను హత్యలుగా (మాస్ మర్డర్-సూసైడ్) భావించాలా? వీరే కాకుండా విమానం కూలిపోయాక భూమిపై ఉన్న మరో 19 మంది చనిపోయారు. మొత్తం మరణాలు దాదాపు 260. ఇంతకూ ఇది పైలట్ ఉద్దేశపూర్వకంగా చేసిన దుష్కృత్యమా? పరధ్యానమా? లేక ప్రమాదమా? విద్రోహ చర్యా? ఏమో... ఇంకా తెలియరాలేదు. కారణాల వెలికితీత కోసం దర్యాప్తు కొనసాగుతోంది. ఈ వ్యవహారం పైలట్ల మానసిక ఆరోగ్యంపైనా చర్చను లేవదీస్తోంది.పైలట్లే కూల్చేశారు!విమాన దుర్ఘటనల్లో పైలట్ ‘హత్యాత్మహత్యల’ ఉదంతాలు అరుదు అయినప్పటికీ చరిత్రలో అవి కూడా లేకపోలేదు. 2015లో ‘జర్మన్ వింగ్స్’ కో-పైలట్ ఆండ్రియాస్ లుబిడ్జ్ తన కెప్టెన్ (సీనియర్ పైలట్)ను కాక్పిట్ వెలుపల బంధించి ఎ320 ఎయిర్ బస్ విమానంతో నేరుగా ఫ్రెంచ్ ఆల్ప్స్ పర్వతాలను ఢీకొట్టాడు. దాంతో విమానంలోని మొత్తం 150 మందీ చనిపోయారు. ఇక 1997లో ‘సిల్క్ ఎయిర్’ ఫ్లైట్ 185, 1999లో ‘ఈజిప్ట్ ఎయిర్’ ఫ్లైట్ 990 విమాన ప్రమాదాలకు పైలట్ల ఉద్దేశపూర్వక చర్యలే కారణమని అమెరికా ఇన్వెస్టిగేటర్లు నిర్ధారించారు. ఈ రెండు ఘటనల్లో 321 మంది చనిపోయారు. అయితే ఆ రెండు దుర్ఘటనలకు దారితీసిన కారణాలపై అమెరికన్ ఇన్వెస్టిగేటర్లు కనుగొన్న అంశాలతో ఇండోనేషియా, ఈజిప్ట్ విభేదించండం వేరే సంగతి. ఇక ఇటీవల 2022లో చైనా ఈస్టర్న్ ఫ్లైట్ 5735 కూడా తాను ప్రయాణిస్తున్న ఎత్తు నుంచి వేగంగా కిందికి దిగిపోయి కూలిపోవడంతో 132 మంది మరణించారు. అది కూడా పైలట్ ఉద్దేశపూర్వక చర్యేనని లీకైన డేటా సూచిస్తోంది. హిందూమహాసముద్ర గగనతలంపై ప్రయాణిస్తూ 2014లో మలేషియా ఎయిర్లైన్స్ 370 విమానం అదృశ్యమైంది. అందుకు కారణాలు ఇప్పటివరకు తెలియలేదు. విమానం కెప్టెన్ జహారీ అహ్మద్ షా ‘హత్యాత్మహత్యల’ (ఉద్దేశపూర్వక) చర్య ఫలితంగానే ఈ దుర్ఘటన సంభవించిందన్న వాదనలు కొన్ని తెరపైకి వచ్చాయి. స్విస్ ‘బ్యూరో ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్స్ ఆర్కైవ్’ సమాచారాన్ని విశ్లేషించి ‘న్యూస్ వీక్’ పత్రిక వెల్లడించిన వివరాల ప్రకారం... గత 30 ఏళ్లలో ఇలాంటి ఉద్దేశపూర్వక హత్యాత్మహత్యల వల్ల 1,034 మంది మృత్యువాత పడ్డారు. ప్రపంచవ్యాప్తంగా వాణిజ్యపరమైన విమానాల ప్రమాదాల్లో అదే గత 30 ఏళ్ల వ్యవధిలో చనిపోయిన వారి సంఖ్యతో పోలిస్తే... ఈ పైలట్ ‘మర్డర్-సూసైడ్’ మరణాల సంఖ్య 3.5 శాతంగా ఉన్నట్టు తేలింది. ఇలాంటి సంఘటనలు అరుదే అయినప్పటికీ విమానయాన భద్రతలో పైలట్ల మానసిక ఆరోగ్యానికి ఎంతటి ప్రముఖ పాత్ర ఉందో అవి తేటతెల్లం చేస్తున్నాయని ‘సెంటర్ ఫర్ ఏవియేషన్ సైకాలజీ’ క్లినికల్ సైకాలజిస్టు డాక్టర్ రాబర్ట్ బోర్ వ్యాఖ్యానించారు. మొత్తం విమాన ప్రమాదాల్లో ఈ ‘ఉద్దేశపూర్వక’ ఘటనల భాగం స్వల్పమే అయినప్పటికీ వాటిల్లే నష్టం మాత్రం అపారం. ఎందుకంటే వాటివల్ల కుటుంబాలు చిన్నాభిన్నమవుతాయి. విమానయానంపై ప్రజలు నమ్మకం కోల్పోతారు. పైలట్ల మానసిక ఆరోగ్యం పట్ల వైమానిక రంగ పర్యవేక్షణా లోపాల్ని అవి ఎండగడతాయి. పైలట్లు అత్యంత అప్రమత్తంగా మెలగాలని కోరుకుంటామని, అయితే వారు ఎదుర్కొంటున్న సమస్యలు సాంకేతికపరమైనవి మాత్రమే కాదని, అందులో వ్యక్తిగత, ఆర్థిక, సంబంధాలపరమైన అంశాలు కూడా ఉన్నాయని రాబర్ట్ బోర్ చెప్పారు. పైలట్లు ఎదుర్కొంటున్న ఇటువంటి ఒత్తిళ్లను పట్టించుకోకుండా, పరిష్కరించకుండా అలాగే ఉపేక్షిస్తే అవి ప్రమాదకరంగా మారతాయని అన్నారు. తాము మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నట్టు పైలట్స్ ఎవరైనా బయటికి చెబితే వారి కెరీర్ రిస్కులో పడుతుందని, పైలట్ లైసెన్స్ కోల్పోయే అవకాశముందని, ఆ భయంతో వారెవరూ ముందుకురారని వైమానిక నిపుణుడు, మాజీ పైలట్ డాన్ బబ్ చెప్పారు. పైలట్ ‘మర్డర్-సూసైడ్’ ఘటనల నివారణకు వీలుగా విమానం కాక్పిట్లో పైలట్లపై నిఘా కోసం వీడియో కెమెరాలు పెట్టాలని అమెరికాలోని జాతీయ రవాణా భద్రతా మండలి 2000 సంవత్సరంలో సూచించింది. తమ గోప్యతకు భంగం వాటిల్లుతుందని పైలట్లు అభ్యంతరం చెబుతుండటంతో కాక్పిట్లో వీడియో రికార్డింగుపై చర్చ నేటికీ కొనసాగుతూనే ఉంది. ఇంజిన్లకు ఇంధనం సరఫరా ఎందుకు ఆపివేశావంటూ ఎయిరిండియా బోయింగ్ 787 విమానం సీనియర్ పైలట్ ను కో-పైలట్ అడిగినట్టు కాక్పిట్ వాయిస్ రికార్డర్ (సీవీఆర్) వెల్లడించడం చూస్తుంటే... పైలట్ల మానసిక ఆరోగ్యం విషయంలో వైమానిక పరిశ్రమ వ్యవహరిస్తున్న తీరుపై ఎన్నో ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. - జమ్ముల శ్రీకాంత్

Sakshi Editorial On Roger Federer, Rafael Nadal Doctorate Degree6
ఏదీ 'సునాయాసం' కాదు!

థాంక్యూ! హలో క్లాస్‌ ఆఫ్‌ 2024! నేనెంత ఉత్సాహంగా ఉన్నానో మీకెవరికీ తెలియదు. నేనొక కాలేజీ క్యాంపస్‌లో అడుగుపెట్టడం నా జీవితంలో ఇది రెండోసారి. కానీ, మీరు దేన్నో దృష్టిలో పెట్టుకుని నాకు డాక్టరేట్‌ డిగ్రీ ప్రదానం చేస్తున్నారు. నేనిక్కడ ప్రసంగించడానికి వచ్చాను. కానీ, ‘డాక్టర్‌ రోజర్‌’గా ఇంటికి తిరిగి వెళతాను. అది నాకు గొప్ప బోనస్‌ లాంటిది. ‘డాక్టర్‌ రోజర్‌’. ఇది నేను ఏమాత్రం ఊహించని విజయం! ఇది నాకు కొద్దిగా పరిచయం లేని వాతావరణం. ఇది నేను ఎప్పుడూ చూసే దృశ్యం కాదు... ఈ దుస్తులు కూడా నేను సాధారణంగా వేసుకునేవి కావు. ఈ పొడవాటి గౌను బరువుగా ఉంది. గత 35 ఏళ్ళుగా ఇంచుమించుగా ప్రతి రోజు నేను పొట్టి నిక్కర్లు, టీ షర్టులతోనే గడిపాను. నాలుగు పదాలే చెప్పగలిగాను!నేను ఇలాంటి ప్రసంగాలు చేసే వ్యక్తిని కూడా కాను. నేను స్విట్జర్లాండ్‌ జాతీయ జట్టులో చేరేనాటికి నాకు 17 ఏళ్ళు. అప్పట్లో నేను ఎంతగా కలవరపడ్డానంటే నాలుగు పదాలకు మించి మాట్లాడలేకపోయాను. ‘‘ఇక్కడకు రావడం సంతోషంగా ఉంది’’ అన్నానంతే. ఇప్పుడు ఇక్కడ 25 ఏళ్ళ తర్వాత, నాకు ఇప్పటికీ కొద్ది కలవరంగానే ఉంది. కాకపోతే ఇపుడు మీకు చెప్ప డానికి నా దగ్గర నాలుగు మాటలకు మించి చాలా ఉన్నాయి. ఈ స్థాయికి వచ్చేందుకు మీరెంతో కష్టపడి ఉంటారు. మీరంతా సాధించిన దానిపట్ల నాకెంతో గౌరవం ఉంది. ఎందుకంటే, పూర్తి స్థాయి టెన్నిస్‌ ఆటగాడిగా మారేందుకు నేను 16వ ఏటనే స్కూలు చదువుకు స్వస్తి చెప్పేశాను. కనుక, నేను కాలేజీలో అడుగు పెట్టింది లేదు. కానీ, నేను ఇటీవలే టెన్నిస్‌లో గ్రాడ్యుయేట్‌నయ్యా. ‘రిటైర్‌’ అనే మాట ఉపయోగించాలని నాకు తెలుసు. ‘‘రోజర్‌ ఫెదరర్‌ టెన్నిస్‌ నుంచి రిటైర్‌ అయ్యాడు.’’ రిటైర్‌ అవడమా? ఆ మాట వినడానికే బాగా లేదు. కాలేజీ నుంచి రిటైర్‌ అవుతున్నామని మీరు చెప్పలేరు. ఔనా? మీలాగే నేను కూడా ఒక పెద్ద పని పూర్తి చేసి మరో దానికి మరలుతున్నా. మీలాగే నేను కూడా తదుపరి ఏం చేయాలనే ఆలోచనలో ఉన్నా. మీ బాధ నాకు అర్థమవుతోంది. చదువు పూర్తయిందిగా, ఏం చేయబోతున్నావు? అని అందరూ అడ గడం మొదలెడతారు. ఆ మాటకొస్తే, ‘‘ఇంక ఇపుడు నువ్వు వృత్తిపరమైన టెన్నిస్‌ ఆటగాడివి కాదు కదా! ఏం చేయ బోతున్నావు?’’ అని నన్నూ అడుగుతారు. ఏం చేయాలో నాకూ తెలియదు. తెలియకపోవడమూ మంచిదే. మరి నేను కాలాన్ని ఎలా వెళ్ళబుచ్చుతా? తండ్రిగా పిల్లల్ని స్కూల్లో దింపి రావచ్చు. ఎవరో అపరిచితులతో ఆన్‌లైన్‌లో చదరంగం ఆడవచ్చు. వాక్యూమ్‌ క్లీనర్‌తో ఇంటిని శుభ్రం చేయ వచ్చు. వాస్తవానికి, టెన్నిస్‌ పట్టభద్రునిగా జీవితాన్ని నేను ఇష్టపడతున్నా. నేను 2022లో టెన్నిస్‌లో గ్రాడ్యుయేట్‌నయ్యా. మీరు 2024లో పట్టభద్రులవుతున్నారు. ఈ పరిణామ క్రమంలో నేను ఆకళింపు చేసుకున్న కొద్ది పాఠాలను మీతో పంచుకోవా లనుకుంటున్నా. వాటిని మనం టెన్నిస్‌ పాఠాలు అనుకోవచ్చు.స్నేహపూరిత ప్రత్యర్థులు: రఫేల్‌ నదాల్‌తో రోజర్‌ ఫెదరర్‌ టెన్నిస్‌ పాఠాలుమొదటిది. ‘సునాయాసంగా’ అనే మాట ఒక భ్రమ! నేను సునాయాసంగా ఆడతానని అంటూంటారు. చాలా సందర్భాల్లో దాన్ని ఒక పొగడ్తగానే చెబుతారు. కానీ, ‘‘అతని దేహంపై ఒక్క స్వేద బిందువు కూడా లేదు చూడండి’’ లాంటి మాటలు వారి నుంచి విన్నప్పుడు నాకు అసహనంగా ఉండేది. సత్యం ఏమంటే, తేలిగ్గా ఆడినట్లు కనిపించడం వెనుక నేను చేసిన కఠోర శ్రమ ఉంది. నన్ను నేను తమాయించుకోవడం నేర్చుకోవడానికి ముందు చాలా ఏళ్ళు కోర్ట్‌లో విసుగు ప్రదర్శించేవాడిని, అనుచితమైన మాటలనేవాడిని, చేతిలో రాకెట్‌ను విసిరేసేవాడిని. కానీ, క్రీడా జీవితం ఆరంభంలోనే, వాటిని సరిదిద్దుకునే అవకాశం లభించింది. ఒకసారి ఇటాలియన్‌ ఓపెన్‌లో నా ప్రత్యర్థి ఒకరు నా మానసిక క్రమశిక్షణను బాహాటంగానే ప్రశ్నించాడు. ‘‘మొదటి రెండు గంటలు రోజర్‌ గెలుస్తాడనుకుంటారు. ఆ తర్వాత, నేను ఫేవరెట్‌గా మారతాను’’ అని వ్యాఖ్యానించాడు. మొదట, నాకు ఆ మాటలు అర్థం కాలేదు. తర్వాత, అతని మాటలలోని ఆంతర్యాన్ని గ్రహించాను. మొదటి రెండు గంటలపాటు ప్రతి ఆటగాడు బాగానే ఆడతాడు. శారీరకంగా శక్తితో ఉంటారు. వేగంగా కదులుతారు. రెండు గంటల తర్వాత, కాళ్ళు పీకడం మొదలెడతాయి. మనసు ఏకాగ్రతను కోల్పోతుంది. నేను నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని ఆ మాటలతో అర్థం చేసుకున్నా. ఆ దిశగా ప్రయాణం ప్రారంభించి, కోరుకున్న స్థితికి చేరుకున్నా. ఆ క్రమంలో నా తల్లితండ్రులు, కోచ్‌లు, ఫిట్‌ నెస్‌ కోచ్‌ నా ప్రవర్తనను సరిదిద్దుతూ వచ్చారు. నా ప్రత్యర్థి ఆటగాళ్ళు కూడా ఆ పని చేస్తున్నారు. ఈ విషయంలో, నాతోటి ఆటగాళ్ళకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను.డార్ట్‌మౌత్‌లో మీరు దీన్ని మరో విధంగా గమనించి ఉంటారు. తోటి విద్యార్థులు ర్యాంకుల మీద ర్యాంకులు సాధించడాన్ని చూసి శాన్‌బర్న్‌ లైబ్రరీలో మీరు ఓ మూలన మౌనంగా రోదించి ఉంటారు. నా లాగానే మీరు కూడా ‘అప్రయత్నంగా’ అనే మాట ఒక భ్రమేనని తెలుసుకుని ఉంటారని భావిస్తున్నా. కేవలం ప్రతిభతోనే నేను ఈ స్థితికి చేరుకోలేదు. ప్రత్యర్థులకన్నా ఎక్కువసేపు, ప్రభావశీలంగా, కఠిన శ్రమకోర్చి ప్రాక్టీసు చేయ బట్టే ఈ స్థితికి చేరా. నిజంగా గర్వపడే విజయాలు అవే!మనం నిరాశతో చతికిలపడే సందర్భాలూ ఎదురవుతా యని గుర్తుంచుకోవాలి. వెన్ను, మోకాళ్ళు నొప్పి పుట్టవచ్చు. స్వల్పంగా అనారోగ్యం పాలుకావచ్చు లేదా ముందున్న లక్ష్యం భయపెట్టనూవచ్చు. అయినా, గెలుపొందడానికి మీరొక మార్గాన్ని కనుగొని తీరాలి. అలా సాధించిన విజయాల గురించి మనం గర్వంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే, మీరు ఉత్తమమైన స్థితిలో ఉన్నప్పుడే కాదు, లేనప్పుడు కూడా విజయాలు సాధించగలరని అవి నిరూపిస్తాయి. ఔను. ప్రతిభ కూడా ఉండి తీరాలి. దానితో పని లేదని చెప్పడానికి నేను ఇక్కడ నుంచో లేదు. కానీ, ప్రతిభ అనే మాటకు విస్తృతమైన నిర్వచనం ఉంది. చాలా సందర్భాలలో, దాన్ని వరంగా చూడకూడదని, వజ్ర సమాన సంకల్పంగా భావించాలని చెప్పదలచుకున్నాను. కానీ, జీవితంలో మాదిరి గానే... టెన్నిస్‌లో కూడా క్రమశిక్షణే ప్రతిభగా పరిణమిస్తుంది. ఓర్పు కూడా అంతే అవసరం. మీపై మీకు నమ్మకం ఉండటం కూడా ప్రతిభే. ఏ ప్రక్రియనైనా సరే స్వాగతించడం, ప్రేమించడం ప్రతిభ కిందకే వస్తుంది. మీ జీవితాన్ని, మిమ్మల్ని నడుపుకోవడం కూడా ప్రతిభ కోవలోకే వస్తుందేమో. కొందరికి పుట్టుకతోనే ఆ లక్షణాలు ఉంటాయి. మిగిలిన అందరూ వాటిని సంతరించుకునే కృషి చేయాలి.అదొక పాయింట్‌ అంతే!రెండవ పాఠం. అదొక పాయింట్‌ మాత్రమే! మీరు సాధ్యం అనుకున్నదానికన్నా ఎక్కువగానే శ్రమించి ఉంటారు... అయినా పరాజయం పాలయ్యారు. ఈ రోజు మీలో ఒక్కరే డిగ్రీ పొందా రని ఊహించుకుందాం. విజేతకు అభినందనలు తెలుపుదాం. మిగిలిన వెయ్యి మంది మాటేమిటి? తదుపరి విడతలో ఉత్తీర్ణులు కావచ్చు... నేనెప్పుడూ గెలుపొందడానికే ప్రయత్నించానని మీకు తెలుసు. కానీ, నేను ఓడిన సందర్భాలున్నాయి. కొన్నిసార్లు పెద్ద టోర్నమెంట్లలోనే ఓటమి చెందా. వింబుల్డన్‌ 2008 ఫైనల్స్‌ వాటిలో ఒకటి. నేను, రఫేల్‌ నదాల్‌ తలపడ్డాం. కొందరు దాన్ని చరిత్రలోనే మరపురాని మ్యాచ్‌గా అభివర్ణిస్తారు. రఫా మీద నాకు పూర్తి గౌరవం ఉంది. కానీ, ఆ మ్యాచ్‌లో నేను గెలుపొంది ఉంటే ఇంకా బాగుండేది. వింబుల్డన్‌లో ఓటమిని తేలిగ్గా తీసు కోలేం... ఏ టెన్నిస్‌ ఆటగాడికైనా వింబుల్డన్‌లో విజయమే సర్వస్వం. నేను 2008లో వరుసగా ఆరవసారి టైటిల్‌ సాధించేందుకు బరిలోకి దిగా. చరిత్రలో సుస్థిర స్థానం కోసం ఆడుతున్నా. ఆ మ్యాచ్‌లో ఒక్కో పాయింట్‌ మా ఇద్దరిలో ఎవరెవరికి ఎలా వచ్చిందీ నేను ఇపుడు వివరించబోవడం లేదు. అదంతా చెప్పా లంటే కొన్ని గంటలు పడుతుంది. సరిగ్గా చెప్పాలంటే, ఆ మ్యాచ్‌ దాదాపు ఐదు గంటలు సాగింది. రఫా రెండు సెట్లు గెలి చాడు. టై–బ్రేక్స్‌లో తదుపరి రెండు సెట్లు నేను గెలిచా. ఐదవ సెట్లో ఏడు పాయింట్లతో ఇద్దరం సమ స్థితిలో ఉన్నాం. ఆట చివరి భాగంపై అందరూ ఎందుకు అంత దృష్టి కేంద్రీ కరిస్తారో నాకు అపుడు అర్థమైంది... చివరి నిమిషాల్లో నాకు కళ్ళు బైర్లు కమ్మాయి. గ్రాస్‌ కోర్టుపై తెల్లని చారలు కూడా మసకగా కనిపించడం మొదలెట్టాయి. అన్నిసార్లూ గెలవలేము!ఇపుడు వెనుతిరిగి చూసుకుంటే... ఆ మ్యాచ్‌లో మొదటి పాయింట్‌ అప్పుడే నేను ఓటమి పాలయ్యాననిపిస్తుంది. ‘ఏయ్, నువ్వు ఐదు విడతలుగా గెలుస్తూ వస్తున్న డిఫెండింగ్‌ చాంపియన్‌వి! పైగా, ఆడుతున్నది గ్రాస్‌ కోర్ట్‌లో. ఇక్కడ ఎలా ఆడాలో నీకు బాగా తెలుసు’ అని నా అంతరంగంలో నేను గుర్తు తెచ్చుకోవడానికి మూడవ సెట్‌ దాకా సమయం పట్టింది. కానీ, ఆ ధైర్యం చాలా ఆలస్యంగా వచ్చింది. రఫా గెలుపొందాడు. దానికతను అన్ని విధాలా యోగ్యుడే!కొన్ని ఓటములు మిగిలినవాటికన్నా ఎక్కువ బాధిస్తాయి. వరుసగా ఆరవసారి టైటిల్‌ కోసం పోటీ పడే అవకాశం జీవితంలో మళ్ళీ లభించదని నాకు తెలుసు. వింబుల్డన్‌లో ఓడాను.నంబర్‌ వన్‌ ర్యాంకింగ్‌ కోల్పోయాను. టెన్నిస్‌లో పరిపూర్ణత అనేది అసాధ్యం. నా వృత్తి జీవితంలో నేను ఆడిన 1,526 సింగిల్స్‌ మ్యాచ్‌లలో దాదాపు 80% గెలుపొందా. కానీ, ఇక్కడ నేను మీకో ప్రశ్న వేయదలచుకున్నా. ఆ మ్యాచ్‌లలో, నేను గెలి చిన పాయింట్ల శాతం ఎంతనుకుంటున్నారు? కేవలం 54%. మరో విధంగా చెప్పాలంటే, అగ్రశ్రేణి టెన్నిస్‌ ఆటగాళ్ళు కూడా వారు అడిన మ్యాచ్‌ల పాయింట్లలో కేవలం సగంపైన మాత్రమే గెలిచి ఉంటారు. కొంపేం మునిగిపోయింది. అది ఒక పాయింట్‌ మాత్రమే అని మీకు మీరే నేర్చుకోవాలి. జీవితంలో మీరు ఏ ఆట ఆడినా... కొన్నిసార్లు ఓటమి తప్పదు. అది ఒక పాయింట్, ఒక మ్యాచ్, ఒక సీజన్, ఒక ఉద్యోగం కోల్పోవడం ఏదైనా కావచ్చు. జీవితం అనేక ఎత్తు పల్లాలున్న రోలర్‌ కోస్టర్‌. కుంగిపోయినపుడు మీ సామర్థ్యంపై మీకు సందేహాలు ఏర్పడటం సహజం. కానీ, మీ ప్రత్యర్థులకు కూడా వారి సామర్థ్యాలపై వారికి సందేహాలుంటాయని మరచి పోకండి. కానీ, నెగెటివ్‌ ఎనర్జీ వృథా ఎనర్జీ! ప్రపంచంలో ఉత్తములుగా పరిగణన పొందుతున్నవారు అన్నింటిలోనూ గెలవడం వల్ల అలాంటి హోదా ఏమీ పొందడం లేదు. ఓటమి పాలవుతామనీ, పరాజయాలు పదే పదే వెక్కిరి స్తాయనీ వారికి తెలుసు. వాటిని తట్టుకుని ఎలా నిలబడాలో వారు నేర్చుకుంటారు కాబట్టి గొప్పవారు అనిపించుకుంటారు. చేస్తున్న పనిని ఆనందించండి!మూడవ పాఠం. జీవితం కోర్ట్‌ కన్నా పెద్దది. టెన్నిస్‌ కోర్ట్‌ చిన్న ప్రదేశం. నిక్కచ్చిగా చెప్పాలంటే, 2,106 చదరపు టడుగులు. అది సింగిల్స్‌ మ్యాచ్‌లు ఆడే కోర్ట్‌ వైశాల్యం. ఒక సత్రం గదికన్నా మరీ పెద్దదిగా ఏమీ ఉండదు. ఆ చిన్న ప్రదేశంలోనే నేను ఎంతో శ్రమించాను. నేర్చుకున్నాను. ఎన్నో మైళ్ళు పరుగెత్తాను. కానీ, ప్రపంచం దానికన్నా చాలా చాలా పెద్దది. టెన్నిస్‌ లోకి అడుగు పెట్టినప్పుడే, టెన్నిస్‌ నాకు ప్రపంచాన్ని చూపిస్తుంది కానీ, టెన్నిస్సే ప్రపంచం కాదన్న సంగతి నాకు తెలుసు. టెన్నిస్‌ నుంచి నిష్క్రమించగానే నేను మాజీ టెన్నిస్‌ క్రీడాకారుడిని అయి పోయా. కానీ, మీరు దేనికీ మాజీలు కాదు. మీరు భవిష్యత్‌ రికార్డు బ్రేకర్లు. ప్రపంచ యాత్రికులు. భవిష్యత్‌ కార్యకర్తలు. దాతలు. విజేతలు, నాయకులు.ఈ గౌరవ డిగ్రీ ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీ విజయో త్సవంలో నాకూ భాగం కల్పించినందుకు కృతజ్ఞతలు. మీలో ప్రతి ఒక్కరి తదుపరి భవిష్యత్‌ కార్యాచరణ ఏమిటో చూడాలని నాకు ఉత్సాహంగా ఉంది. మీరు ఏ రంగాన్ని ఎంచుకున్నా, మీ శక్తి మేరకు ప్రతిభను ప్రదర్శించండి. మీకు నచ్చిన రీతిలో ఆడండి. స్వేచ్ఛగా ఆడండి. అన్నింటిని ప్రయత్నించి చూడండి. అన్నింటికన్నా ముఖ్యంగా, పరస్పరం దయ కలిగి ఉండండి. చేస్తున్న పనిని ఆనందించండి. క్లాస్‌ ఆఫ్‌ 2024కి మరోసారి అభినందనలు.

BCCI earns record revenue of  Rs 9,741.7 crore in FY247
BCCI: క్రికెట్‌ ఒక్కటేనా?.. అదో పెద్ద సామ్రాజ్యం! ఆర్థిక వనరులు ఇవే..

భార‌త క్రికెట్ నియంత్ర‌ణ మండ‌లి(బీసీసీఐ) ప్ర‌పంచ క్రికెట్‌లో పెద్ద‌న్న పాత్ర పోషిస్తుంది. వ‌ర‌ల్డ్‌లోనే సంపన్నమైన క్రికెట్ బోర్డుగా బీసీసీఐ ఖ్యాతి గ‌డించింది. తాజాగా బీసీసీఐ మ‌రోసారి సంప‌ద సృష్టిలో చరిత్ర సృష్టించింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి భారత క్రికెట్ నియంత్రణ మండలి ( BCCI ) రికార్డు స్థాయిలో రూ.9,741.7 కోట్ల ఆదాయాన్ని సంపాదించిన‌ట్లు ఓ నివేదిక వెల్లడించింది. ఈ క్రమంలో భారత క్రికెట్ బోర్డుకు ఆదాయం వచ్చే మార్గాలపై ఓ లుక్కేద్దాం.ఐపీఎల్ బంగారు బాతు..భారత క్రికెట్ బోర్డుకు ఇండియన్ ప్రీమియర్ లీగ్‌(ఐపీఎల్‌) బంగారు బాతులా మారింది. 2007లో పురుడుపోసుకున్న ఐపీఎల్‌.. బీసీసీఐకి ప్రదాయ ఆదాయ వనరుగా ఉంది. తాజా నివేదిక ప్రకారం 2023-2024 సంవత్సరానికి గాను ఈ క్యాష్ రిచ్ లీగ్ నుంచి రూ. 5,761 కోట్లు బోర్డు ఖాతాలో చేరాయి.మీడియా హక్కులు, ఫ్రాంచైజీ ఫీజులు, స్పాన్సర్‌షిప్‌ల రూపంలో వ‌చ్చాయి. బీసీసీఐ ఆర్జించిన మొత్తంలో 59 శాతంతో ఐపీఎల్‌ ప్రధాన వాటాదారుగా నిలిచింది. అదేవిధంగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ద్వారా బీసీసీఐకి రూ.1042 కోట్లు(10.7%) వ‌చ్చాయి.అంతేకాకుండా ఐపీఎల్ యేతర మీడియా హక్కుల(భార‌త అంత‌ర్జాతీయ మ్యాచ్‌లు బ్రాడ్‌కాస్టింగ్‌) ద్వారా బోర్డు అదనంగా రూ. 813 కోట్లు సంపాదించింది. మ‌రోవైపు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ అరంగేట్ర సీజ‌న్‌ ద్వారా బోర్డుకు రూ. 378 కోట్లు వచ్చాయి.భార‌త్ అంత‌ర్జాతీయ ప‌ర్య‌ట‌న‌లో టికెట్ అమ్మ‌కాలు, స్పాన్స‌ర్లు, లైసెన్సింగ్ ద్వారా 361 కోట్లు అద‌నంగా బీసీసీఐకి ల‌భించాయి. స్టేడియంలో ప్ర‌క‌ట‌న‌లు, జరిమానాలు, ఇతర రుసుముల రూపంలో భార‌త క్రికెట్ బోర్డుకు 400 కోట్ల ఆదాయం స‌మ‌కూరింది.వెయ్యి కోట్ల పైగా వ‌డ్డీ..భార‌త క్రికెట్ బోర్డు ద‌గ్గ‌ర దాదాపు రూ. 30 వేల కోట్లు రిజ‌ర్వ్‌లో ఉన్నాయి. దీని వ‌ల్ల ఏడాదికి రూ. 1,000 కోట్ల వడ్డీ వ‌స్తున్న‌ట్లు తెలుస్తోంది.బీసీసీఐకి ఖర్చు కూడా ఎక్కువే..భార‌త క్రికెట్ నియంత్రణ మండలి ఆదాయాన్ని సంపాదించడంలోనే కాదు ఖర్చు చేయడంలో మిగిలిన బోర్డులకంటే ముందు ఉంది. క్రికెట్ అభివృద్ది కోసం బీసీసీఐ ఖర్చు చేసే ఆంశాలను ఓసారి పరిశీలిద్దాం. ఆటగాళ్ల జీతాలు, మ్యాచ్ ఫీజులు, బోనస్‌లు కింద బీసీసీఐ ప్రతీ ఏటా రూ.250 కోట్ల పైగా ఖర్చుచేస్తోంది. అదేవిధంగా కోచింగ్ స్టాప్ జీతాల కోసం రూ.100 కోట్ల పైగా బీసీసీఐ వెచ్చిస్తోంది.అంతేకాకుండా స్టేట్ క్రికెట్ ఆసోయేషిన్‌లకు నిధుల రూపంలో రూ.1000 కోట్ల పైగా భారత క్రికెట్ బోర్డు ఖర్చుచేస్తోంది. మ్యాచ్‌లను నిర్వహించేందుకు రూ. 500 కోట్లు, మహిళల క్రికెట్ అభివృద్ది కోసం 150 కోట్లు బీసీసీఐ ప్రతీ ఊటా కేటాయిస్తోంది.పరిపాలన, కార్యకలాపాలు(ట్రావిలింగ్‌, మార్కెటింగ్‌) కోసం బీసీసీఐ 300 పైగా కోట్లు ఖర్చు చేస్తోంది. మరోవైపు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) ప్రారంభించడానికి బీసీసీఐ భారీ ఖర్చు చేసింది. అందులో మీడియా హక్కుల కోసం రూ. 951 కోట్లు వెచ్చించింది.చదవండి: ENG vs IND: క్రికెట్ ప్లేయ‌ర్లు లంచ్ బ్రేక్‌లో ఏమి తింటారో తెలుసా?

What's Truth Modi Ji Rahul Gandhi On Trump Claims8
మోదీ జీ.. ఇంతకీ నిజం ఏమిటి?: రాహుల్‌ గాంధీ

న్యూఢిల్లీ: భారత్‌-పాకిస్తాన్‌ల మధ్య ఈ మే నెలలో జరిగిన యుద్ధంలో ఐదు యుద్ధ విమానాలు కూలిపోయాయనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వ్యాఖ్యలను కార్నర్‌ చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీని ప్రశ్నించారు ఏఐసీసీ నేత రాహుల్‌ గాంధీ. ట్రంప్‌ చెప్పినదాంట్లో నిజం ఏమిటి? అని ప్రశ్నించారు రాహుల్‌. ఆపరేషన్‌ సింధూర్‌ అంశానికి సంబంధించి దేశ ప్రజలు తెలుసుకోవాలని అనుకుంటున్నారని రాహుల్‌ ట్వీట్‌ చేశారు.मोदी जी, 5 जहाज़ों का सच क्या है?देश को जानने का हक है! pic.twitter.com/mQeaGCz4wp— Rahul Gandhi (@RahulGandhi) July 19, 2025 కాగా, ఇరు దేశాల యుద్ధంలో ఐదు యుద్ధ విమానాలు ధ్వంసమయ్యాయని ట్రంప్‌ చెప్పినప్పటికీ, అవి ఏ దేశానికి చెందినవో చెప్పలేదు. ఇరు దేశాల యుద్ధ విమానాలు కలిపి ఐదా.. లేక పాకిస్తాన్‌వా.. భారత్‌కు చెందినవా? అనేదే క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పుడు దీన్ని ప్రశ్నిస్తోంది ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ పార్టీ. రాహుల్‌ గాంధీతో పాటు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జై రాం రమేశ్‌ కూడా ఇదే అంశాన్ని లేవనెత్తారు. వర్షాకాల పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభం కావడానికి రెండు రోజులే సమయం ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్‌.. ఆపరేషన్‌ సింధూర్‌ వ్యవహారాన్ని ఉభయ సభల్లో ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్నట్లే కనబడుతోంది. ట్రంప్‌ తాజా వ్యాఖ్యలను ఉదహరిస్తూ కాంగ్రెస్‌ జనరల్‌ సెక్రటరీ జై రాం రమేశ్‌.. ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు. ‘ట్రంప్‌ మిసైల్‌ దూసుకుపోతోంది. ఇప్పటికి 24 సార్లు ఒకే సందేశాన్ని ట్రంప్‌.. పదే పదే చెబుతూ వస్తున్నారు. "2019, సెప్టెంబర్‌లో 'హౌడీ మోడీ', 2020, ఫిబ్రవరిలో 'నమస్తే ట్రంప్' వంటి కార్యక్రమాలతో అధ్యక్షుడు ట్రంప్‌తో సంవత్సరాల తరబడి స్నేహం కలిగి ఉన్న ప్రధాని మోదీ.. గత 70 రోజులుగా ట్రంప్‌ ఏమి చెబుతున్నారనే దానిపై పార్లమెంట్‌లో స్పష్టత ఇవ్వాలి. ఆపరేషన్‌ సింధూర్‌కు సంబంధించి ట్రంప్‌ మాట్లాడుతున్న ప్రతీ దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది’ అని జై రాం రమేశ్‌ ముందుగానే తాము ఈ అంశాన్ని పార్లమెంట్‌లో లేవనెత్తనున్నామని విషయాన్ని స్పష్టం చేశారు.

EPFO Rule Change Good news for low salary earners9
ఈపీఎఫ్‌వో రూల్స్‌లో మార్పు.. ఆ కండీషన్లు ఇక ఉండవు

ఈపీఎఫ్ఓ (ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్) ఈడీఎల్ఐ అంటే ఎంప్లాయీ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ నిబంధనల్లో కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ భారీ ఊరటనిచ్చింది. ఇప్పుడు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మునుపటిలా కఠినమైన షరతులు ఉండవు. దీని వల్ల లక్షలాది మంది ఉద్యోగులు, వారి కుటుంబాలకు, ముఖ్యంగా విధుల్లో ఉండగా మరణించిన ఉద్యోగి కుటుంబాలకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరుతుంది.కనీసం రూ .50,000 బీమాతాజా నోటిఫికేషన్ ప్రకారం.. ఇప్పుడు ఉద్యోగి పీఎఫ్ బ్యాలెన్స్ రూ .50,000 కంటే తక్కువగా ఉన్నప్పటికీ, ఆ ఉద్యోగి మరణించినప్పుడు వారి కుటుంబానికి కనీసం రూ .50,000 బీమా ప్రయోజనం లభిస్తుంది. ఇంతకు ముందు ఈ ప్రయోజనాన్ని పొందడానికి, ఉద్యోగి ఖాతాలో నిర్ణీత పరిమితి వరకు బ్యాలెన్స్ ఉండాలి. కానీ ఇప్పుడా షరతు తొలగించారు.మరో ముఖ్యమైన మార్పుకనీస పీఎఫ్ బ్యాలెన్స్ షరతును తొలగించడంతోపాటు ఈ పథకంలో మరో ముఖ్యమైన మార్పు చేశారు. ఈ పథకం కోసం 12 నెలల నిరంతర సర్వీసును లెక్కించేటప్పుడు, ఉద్యోగి కంపెనీలు మారిన సందర్భంలో రెండు ఉద్యోగాల మధ్య 60 రోజుల వరకు గ్యాప్ ఉంటే, దాన్ని ఇకపై విరామంగా పరిగణించరు. అంటే ఉద్యోగి రెండుమూడు ఉద్యోగాలు చేసి, వాటి మధ్య 2 నెలల కంటే తక్కువ విరామం ఉంటే, అప్పుడు అన్ని ఉద్యోగాలు ఒకే (నిరంతర) సర్వీసుగా పరిగణిస్తారుఅంతే కాకుండా పీఎఫ్ పథకంలో సభ్యుడైన ఉద్యోగి చివరి పీఎఫ్ కంట్రిబ్యూషన్ నుండి 6 నెలల్లోపు మరణించిప్పుడు కూడా వారి కుటుంబానికి ఈ పథకం కింద బీమా మొత్తాన్ని ఇస్తారు. అయితే ఆ సమయంలో ఉద్యోగి కంపెనీ రోల్స్‌లో నమోదై ఉండాలి. కుటుంబంలో సంపాదించే వ్యక్తి అనుకోని పరిస్థితుల్లో మరణించినప్పుడు వారి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించడం ఈపీఎఫ్ఓ ఈడీఎల్ఐ పథకం ప్రధాన ఉద్దేశం.

Harihara Veeramallu Movie Ticket Rates Hike Andhra Pradesh10
'హరిహర వీరమల్లు'.. ఏపీలో భారీగా టికెట్ రేట్ల పెంపు

కొన్నాళ్ల కిందట పవన్ కల్యాణ్.. ఆం‍ధ్రాలోని పలు థియేటర్లలో కక్ష కట్టి తనిఖీలు చేయించారు. టికెట్ ధరలు, తినుబండారాల ధరలు తగ్గించాలని చాలా హడావుడి చేశారు. ఇప్పుడు తన సినిమా వస్తుండేసరికి స్వలాభం చూసుకున్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే రేట్లు అలా పెంచేశారు. పవన్ నటించిన 'హరిహర వీరమల్లు'.. వచ్చే గురువారం(జూలై 24) థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే టికెట్ రేట్ల పెంపునకు అనుమతిస్తూ ఏపీ ప్రభుత్వం తాజాగా జీవో జారీ చేసింది. ఒక్కో టికెట్ రేటు ఏకంగా రూ.600 వరకు ఉండేలా అనుమతి ఇవ్వడం ఇక్కడ ఆశ్చర్యపరుస్తోంది.‍(చదవండి: హరి హర వీరమల్లు.. అందుకే హిందీలో ప్రమోషన్స్‌ చేయట్లేదు: నిర్మాత)ఏపీలో గత ప్రభుత్వంలో బెనిఫిట్ షోలు రద్దు చేయగా.. ఇప్పుడు 'హరిహర వీరమల్లు' కోసం మళ్లీ వాటిని తీసుకొచ్చారు. 23న అంటే విడుదలకు ముందు రోజు రాత్రి 9 గంటల ప్రీమియర్ షోలకు అనుమతించారు. ఈ షోకి ఒక్కో టికెట్ ధర రూ.600గా నిర్ణయించారు. ఈ మేరకు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో లోయర్ క్లాస్ రూ.100, అప్పర్ క్లాస్ రూ.150 పెంపునకు అనుమతి ఇచ్చారు. మల్టీప్లెక్స్‌ల్లో అయితే ఏకంగా రూ.200 పెంచుకోవచ్చని ప్రభుత్వం పేర్కొంది. రిలీజ్ రోజైన నాటి నుంచి 10 రోజుల పాటు రేట్ల పెంపు అమల్లో ఉండనుంది. (ఇదీ చదవండి: 'మెగా' లీకులు.. నిర్మాతలు గట్టి వార్నింగ్)సినిమా ఇండస్ట్రీకి చెందిన పవన్ కల్యాణ్ ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్నారు. అంటే జనాలకు ఏది మంచిదో అది ఆయన చేయాల్సి ఉంటుంది. అలాంటి ఆయనే తన సినిమాకు ఎక్కువ రేటు వచ్చేలా చూసుకున్నారు. ఈ రేట్లకు అభిమానులు వెళ్లొచ్చేమో గానీ సాధారణ జనాలు వెళ్తారా అనేది చూడాలి. ఎందుకంటే రీసెంట్ టైంలో జనాలు థియేటర్లకు వెళ్లడమే చాలా తగ్గించేశారు. అలాంటిది ఇంతింత రేట్లు పెంచితే ఎలా అని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.'హరిహర వీరమల్లు' సినిమా దాదాపు ఐదేళ్లపాటు వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ తీశారు. పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్. బాబీ డియోల్ విలన్. తొలుత క్రిష్ డైరెక్టర్ కాగా.. మధ్యలో ఆయన తప్పుకొన్నారు. దీంతో నిర్మాత ఏఎం రత్నం కొడుకు జ్యోతికృష్ణ దర్శకత్వ బాధ్యతలు అందుకున్నారు. ఆయన మిగతా అంతా పూర్తి చేశారు. (ఇదీ చదవండి: 'జూనియర్' కలెక్షన్.. మొదటిరోజు అన్ని కోట్లా?)

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement