annadmk
-
TN: అన్నాడీఎంకే కార్యకర్త హత్య
చెన్నై: తమిళనాడులోని కడలూర్ జిల్లాలో ఆదివారం(జులై 28) అన్నాడీఎంకే కార్యకర్త దారుణ హత్యకు గురయ్యాడు. హత్యకు గురైన వ్యక్తిని తిరుపాప్లియూర్కు చెందిన పద్మనాభన్‌గా గుర్తించారు. ఇతడు ఓ షాపు నడుపుతూ జీవనం సాగిస్తూ అన్నాడీఎంకే పార్టీలో కార్యకర్తగా పనిచేస్తున్నాడు. బాగూర్ గ్రామానికి బైక్‌పై వెళుతుండగా పద్మనాభన్‌ను గుర్తుతెలియని వ్యక్తులు తమ వాహనంతో వేగంగా ఢీకొట్టారు. దీంతో పద్మనాభన్ మృతిచెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చనిపోయిన పద్మనాభన్‌పై గతంలో హత్యకేసు ఉండటం గమనార్హం. -
హైకోర్టు సంచలన తీర్పు: ఎంపీ రవీంద్రనాథ్ పదవి గోవింద
అఫిడవిట్లో సమర్పించిన సమాచారమే ఆయుధంగా.. అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ అధికారులు పెట్టిన సంతకాలే సాక్ష్యాలుగా.. విచ్చలవిడిగా చేసిన డబ్బు పంపకాల దృశ్యాలే ధ్రువీకరణలుగా.. ఓసామాన్యుడు ఏకంగా ఓ ఎంపీపైనే గెలిచాడు.. అయితే ఇదంతా ఎన్నికల్లో కాదు.. న్యాయపోరాటంలో.. నీతి.. న్యాయం.. అనే ధర్మ సూత్రాలను పక్కనబెట్టి అంగ, అర్ధబలంతో అడ్డదారిన అందలమెక్కిన ఓ ప్రజాప్రతినిధిని.. ఓ ఓమాన్యుడు.. అసామాన్య రీతిలో ఎదిరించి కోర్టు ద్వారా చివరికి అతడి పదవికే ఎసరు తెచ్చాడు.. చట్టం ఎవరి చుట్టమూ కాదని నిరూపించాడు.. స్ఫూర్తి కలిగించే ఓటరు ‘మిలానీ’ పోరాటాన్ని మీరూ చదవండి. సాక్షి, చైన్నె: నియోజక వర్గంలోని ఓ ఓటరు అలుపెరగని పోరాటం.. ఏకంగా ఓ ఎంపీ సీటుకి ఎసరు తెచ్చింది. దీంతో అన్నాడీఎంకే ఎంపీ రవీంద్రనాథ్ చివరికి తన పదవిని కొల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. న్యాయ పోరాటంలో సదరు ఓటరు సమర్పించిన ఆధారాలన్నీ ఎంపీకి వ్యతిరేకంగా నిర్ధారణ అయ్యాయి. ఫలితంగా ఎంపీగా రవీంద్రనాథ్ ఎన్నిక చెల్లదు అని కోర్టు ప్రకటించింది. అయితే తీర్పును రిజర్వ్ చేస్తూ.. అప్పీల్‌కు 30 రోజుల పాటు అవకాశం కల్పించింది. నేపథ్యం ఇదీ.. అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కన్వీనర్, మాజీ సీఎం ఓ పన్నీరు సెల్వం వారసుడు రవీంద్రనాథ్ 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు క్రియా శీలక రాజకీయాల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆయన దృష్టి అంతా సొంత జిల్లా తేని మీదే పెట్టారు. ఎన్నికల్లో ఎంపీగా తేని నుంచే పోటీ చేశారు. ఈ కాలంలో రాష్ట్రంలో అన్నాడీఎంకే అధికారంలో ఉండటం, తన తండ్రి పన్నీరు సెల్వం డిప్యూటీ సీఎం, పార్టీ సమన్వయ కమిటీ కన్వీనర్ కావడంతో రవీంద్రనాథ్‌కు అవకాశాలు కలిసి వచ్చాయి. ప్రధాని నరేంద్ర మోదీ సైతం రవీంద్రనాథ్‌కు మద్దతుగా ఎన్నికల ప్రచారం చేశారు. ఎన్నికల సమయంలో ఈ నియోజకవర్గంలో నామినేషన్ దాఖలు మొదలు అనేక అక్రమాలు జరిగినట్లు పెద్దఎత్తున ఆరోపణలు వచ్చాయి. రాష్ట్రంలో అన్నాడీఎంకే అధికారంలో ఉండడంతో స్థానిక ఎన్నికల అధికారి చూసి చూడనట్లు వ్యవహరించారన్న విమర్శలు వచ్చాయి. చివరికి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఈవీకేఎస్‌పై రవీంద్రనాథ్ గెలుపొందారు. సొంత జిల్లాలో కీలక నియోజకవర్గాన్ని పన్నీరు తన కుటుంబ ఖాతాలో వేసుకుంది. తనయుడిని కేంద్ర మంత్రిని చేయడానికి సైతం ప్రయత్నించి, చివరకు అన్నాడీఎంకే గ్రూప్ రాజకీయాల పుణ్యమా అవకాశాన్ని కోల్పోవాల్సి వచ్చింది. కోర్టు సంచలన తీర్పు.. 2019 లోక్ సభ ఎన్నికలలో తేనిలో జరిగిన వ్యవహారాలపై పిటిషనర్ సమర్పించిన ఆధారాలను మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి సుందర్ పరిగణనలోకి తీసుకున్నారు. ఈ ఆధారాలకు రవీంద్రనాథ్ వద్ద వివరణ కోరగా.. సమాధానం కరువైంది. ఇదే రవీంద్రనాథ్ పదవీ గండానికి కారణమైంది. దీంతో గురువారం న్యాయమూర్తి సుందర్ తుది తీర్పు వెలువరించారు. నామినేషన్ దాఖలు, పరిశీలనలో అధికార దుర్వినియోగం జరిగినట్టు ఆధారాలతో సహా నిర్ధారణ అయినట్లు ప్రకటించారు. రవీంద్రనాథ్ గెలుపు చెల్లదంటూ తీర్పు వెలువరించారు. దీంతో ఆయనపై అనర్హత వేటు పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే, అప్పీలుకు అవకాశం ఇవ్వాలని రవీంద్రనాథ్ తరపు న్యాయవాదులు విజ్ఞప్తి చేసుకోగా, న్యాయమూర్తి స్పందించారు. రవీంద్రనాథ్ ఎన్నిక చెల్లదు అని ఇచ్చిన తీర్పును 30 రోజులు పెండింగ్‌లో పెడుతున్నట్టు, అంతలోపు అప్పీల్‌కు వెళ్లవచ్చని గడువు కేటాయించారు. దీంతో అప్పీలు ప్రయత్నాలపై న్యాయవాదులు దృష్టి పెట్టారు. అయితే, అప్పీలుకు వెళ్లినా రవీంద్రనాథ్‌కు అనుకూలంగా స్టే వచ్చేది అనుమానమే అని న్యాయ వర్గాలు భావిస్తున్నాయి. తాము చేయాల్సిన పనిని సాధారణ ఓటరు మిలాని న్యాయ పోరాటంతో ఎంపీ రవీంద్రనాథ్‌కు పదవీ గండం సృష్టించడాన్ని అభినందిస్తున్నానని ఓటమి పాలైన కాంగ్రెస్ అభ్యర్థి ఈవీకేఎస్ ఇలంగోవన్, అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం అభ్యర్థి, ప్రస్తుత డీఎంకే నేత తమిళ్ సెల్వన్ పేర్కొనడం గమనార్హం వెనక్కి తగ్గని మిలానీ.. తేని నియోజకవర్గంలో రవీంథ్రనాథ్ గెలుపును వ్యతిరేకిస్తూ ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు ఎవరూ కోర్టు తలుపు తట్ట లేదు. అయితే, ఆ నియోజకవర్గం ఓటరు అయిన మిలానీ మాత్రం స్పందించారు. నామినేషన్ దాఖలు మొదలు, ఫలితాల లెక్కింపు వరకు జరిగిన అవినీతి అక్రమాలు, అధికార దుర్వినియోగం, నగదు బట్వాడా తదితర అన్ని ఆధారాలనూ సేకరించారు. ఆయన గెలుపు అక్రమం అంటూ 2020లో హైకోర్టును ఆశ్రయించారు. ఆ నియోజకవర్గ ఓటరుగా తనను పరిచయం చేసుకుంటూ పిటిషన్ వేశారు. నామినేషన్ దాఖలు, పరిశీలనలో జరిగిన అక్రమాలు, అధికార దుర్వినియోగం వంటి అంశాలకు ఆధారాలను కోర్టుముందు ఉంచారు. కరోనా కాలం పుణ్యమా రెండేళ్లు విచారణ ముందుకు సాగలేదు. అయితే గత ఏడాది కాలంగా ఈ కేసు విచారణ శరవేగంగా జరుగుతూ వచ్చింది. అదే సమయంలో అన్నాడీఎంకేలో చీలికతో పన్నీరు సెల్వం కొత్త శిబిరం తో రాజకీయ పయానాన్ని మొదలెట్టడంతో రవీంద్రనాథ్‌కు వ్యతిరేకంగా పళణి స్వామి శిబిరం లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది. ఆయన్ని తమ పార్టీ ఎంపీగా పరిగణించ వద్దు అంటూ విజ్ఞప్తి చేసింది. అదే సమయంలో గతంలో ఎప్పుడు సాగిన అక్రమాల వ్యవహారంలో ఈడీ రంగంలోకి దిగడం, రవీంద్రనాథ్ ఆస్తుల అటాచ్ వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ పరిస్థితులలో ఓటరు మిలానీ రూపంలో ఏకంగా రవీంద్రనాథ్ తన ఎంపీ పదవి కోల్పోయే పరిస్థితి నెలకొంది. -
మాయలేడి.. మట్టి గుర్రం!
సాక్షి, చైన్నె: మాయలేడి.. మట్టి గుర్రం ఒక చోట చేరాయని పన్నీరు, టీటీవీ దినకరన్‌ల భేటీ కావడంపై అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామికి వ్యతిరేకంగా ఆ పార్టీ సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీరు సెల్వం వ్యూహాలకు పదును పెట్టిన విషయం తెలిసిందే. ఒకప్పుడు తనకు బద్ధశత్రువుగా ఉన్న టీటీవీ దినకరన్‌ను తాజాగా పన్నీరు సెల్వం మిత్రుడిగా అక్కున చేసుకున్నారు. పళణి స్వామి చేతిలో నుంచి అన్నాడీఎంకేను దక్కించుకునేందుకు పన్నీరు, టీటీవీ సమష్టి వ్యూహాలకు నిర్ణయించారు. అలాగే దివంగత సీఎం జయలలిత నెచ్చెలి శశికళను కూడా కలుపుకు వెళ్లే దిశగా ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ పరిణామాలపై గురువారం మీడియా సంధించిన ప్రశ్నలకు పళణి స్వామి తన దైన శైలిలో స్పందించారు. ద్రోహి.. మరో ద్రోహి చేతులు కలిపారని, ఇద్దరు ద్రోహులే కాబట్టి వారి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదన్నారు. ఇందులో ఒకరు మాయ లేడి అని, మరొకరుడు మట్టి గుర్రం అని ఎద్దేవా చేశారు. అలాగే ఇందులో దినకరన్ గుడారం పూర్తిగా ఖాళీ అవుతోందని, ఇందులోకి ఓ ఒంటె (పన్నీరు) ప్రవేశించినట్లుగా ఈ కలయిక ఉందని వ్యంగ్యాస్త్రం సంధించారు. ఎవరెన్నీ కుట్రలు చేసినా అన్నాడీఎంకేను నీడను కూడా తాకలేరని స్పష్టం చేశారు. మాయలేడి, మట్టి గుర్రం గురించి కాకుండా, పార్టీ బలోపేతం గురించి తాము ప్రత్యేక దృష్టి పెట్టినట్టు పేర్కొన్నారు. ఈ ఇద్దరు తన దృష్టిలో ప్రస్తుతం జీరోలు అని ఎద్దేవా చేశారు. పన్నీరు మద్దతు నేత బన్రూటి రామచంద్రన్ గురించి వ్యాఖ్యలు చేస్తూ, ఆయన మండల కార్యదర్శి పదవికి కూడా అర్హుడు కాడని పేర్కొన్నారు. దివంగత అమ్మ జయలలితను వ్యతిరేకించి పీఎంకేలోకి, ఆ తర్వాత డీఎండీకేలోకి వెళ్లారని గుర్తు చేశారు. ఆయన వెళ్లిన చోటల్లా ఆ పార్టీలకు మిగిలింది కష్టాలేనని పేర్కొన్నారు. ఆయన ఓ చోట నిలకడగా ఉండరని, ఇప్పుడు సున్నా...ప్లస్ సున్నాతో చేతులు కలిపి మరో సున్న కాబోతున్నాడని ఎద్దేవా చేశారు. -
అమిత్ షాతో పళణి భేటీ ఖరారు
సాక్షి, చైన్నె: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి హోదాలో ఢిల్లీ పర్యటనకు పళణి స్వామి సిద్ధమయ్యారు. ఈనెల 26వ తేదీన కేంద్ర హోం శాఖమంత్రి అమిత్ షాతో ఆయన భేటీ కానున్నారు. ఇదిలా ఉండగా పళణి స్వామిని కేంద్ర ఎన్నికల కమిషన్ అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా అంగీకరించడాన్ని వ్యతిరేకిస్తూ మాజీ సీఎం పన్నీరు సెల్వం అప్పీలు పిటిషన్ దాఖలు చేశారు. వివరాలు.. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా గత నెల పళని స్వామి ఏకగ్రీవంగా ఎంపికై న విషయం తెలిసిందే. ఆయన ఎన్నిక, ఆయన నేతృత్వంలో గత ఏడాది జరిగిన సర్వ సభ్య సమావేశానికి కేంద్ర ఎన్నికల కమిషన్ రెండు రోజుల క్రితం ఆమోద ముద్ర వేసింది. దీంతో పార్టీ పై పట్టు సాధించడమే లక్ష్యంగా పళని వ్యూహాలకు పదును పెట్టారు. అలాగే కర్ణాటకలోని పులికేశినగర్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని నిలబెట్టి ఉనికి చాటాలని నిర్ణయించారు. అలాగే ఇక్కడ పన్నీరు సెల్వం తరపున అన్నాడీఎంకే అభ్యర్థులుగా పోటీలో ఉన్న వారిని తిరస్కరించాలని కోరుతూ కేంద్ర ఎన్నికల కమిషన్కుల లేఖ రాశారు. నిజమైన అన్నాడీఎంకేకు చెందిన అభ్యర్థి అన్భరసు పులికేశి నగర్ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారనని, ఆయనకే రెండాకు గుర్తు సైతం కేటాయించాలని కోరారు. పన్నీరుసెల్వం అభ్యర్థులతో అన్నాడీఎంకేకు సంబంధం లేదని స్పష్టం చేశారు. అదే సమయంలో కేంద్రం పెద్దల ఆశీస్సు అందుకునేందుకు సిద్ధమయ్యారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి హోదాలో బుధవారం తొలిసారిగా ఆయన ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈనెల 26వ తేదీని ఢిల్లీ వెళ్లనున్న పళణి స్వామి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో తొలుత భేటీ కానున్నారు. అనంతరం పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో భేటీకి తగ్గ కార్యాచరణతో పళణి స్వామి ఉన్నారు. పన్నీరు అప్పీలు పళణి స్వామిని ప్రధాన కార్యదర్శిగా కేంద్ర ఎన్నికల కమిషన్ అంగీకరించడాన్ని వ్యతిరేకిస్తూ పన్నీరు సెల్వం అప్పీల్‌కు వెళ్లారు. శనివారం ఆయన తరపు ప్రతినిధులు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అన్నాడీఎంకే కు సంబంధించిన కేసులు హైకోర్టులో విచారణలో ఉన్నాయని, ఈ సమయంలో కేంద్ర ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని అందులో వివరించారు. ఈ పిటిషన్ సోమవారం విచారణకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇదిలా ఉండగా పన్నీరు సెల్వం నేతృత్వంలో ఈనెల 24వ తేదీన తిరుచ్చి వేదికగా మహానాడు జరగనున్న విషయం తెలిసిందే. ఇందులో అన్నాడీఎంకే పేరు, పార్టీ జెండా, గుర్తును ఉపయోగించకుండా పన్నీరు మద్దతుదారులపై పళణి మద్దతు దారులు కొరడా ఝుళిపించే పనిలో పడ్డారు. తిరుచ్చితో పాటు పలు చోట్ల పన్నీరు మద్దతుదారులకు వ్యతిరేకంగా పళణి శిబిరం పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం. -
రూటు మార్చిన ఓపీఎస్
సాక్షి, చైన్నె : అన్నాడీఎంకే వ్యవహారంలో మాజీ సీఎం పన్నీరుసెల్వం రూటు మార్చారు. తమ పార్టీ జెండాను ఉపయోగించకూడదని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి పళనిస్వామి వర్గం నుంచి హెచ్చరికలు రావడంతో జెండాకు కొత్త మెరుగులు దిద్దారు. ఆ పార్టీ జెండాలో రెండాకులను జోడించి ఉపయోగించేందుకు నిర్ణయించడం చర్చనీయాంశంగా మారింది. అన్నాడీఎంకే వర్గాల అమ్మ జయలలిత మరణంతో పార్టీలో చీలిక ఏర్పడిన విషయం తెలిసిందే. టీటీవీ దినకరన్ నేతృత్వంలో అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం ఆవిర్భవించింది. ఆ పార్టీ జెండా అన్నాడీఎంకే జెండాను పోలిన వర్ణంతో తీసు కొచ్చినా, జెండా మధ్యలో అన్నాదురై ఫొటోను తొలగించి జయలలిత ఫొటోను పొందు పరిచారు. తాజాగా పళనిస్వామి, పన్నీరుసెల్వం మధ్య వివాదాల నేపథ్యంలో మళ్లీ ఆ జెండా వివాదానికి దారి తీసింది. జెండాలో రెండాకులు.. ప్రస్తుతం కేంద్ర ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు, కోర్టు తీర్పులతో అన్నాడీఎంకే పళనిస్వామి గుప్పెట్లోకి చేరింది. దీంతో తమ పార్టీ పేరును, జెండాను ఉపయోగించకూడదని పన్నీరుసెల్వంకు హెచ్చరికలు జారీ అయ్యాయి. ఒక వేళ ఉపయోగించిన పక్షంలో చట్ట పరంగా చర్యలు తప్పవని పళనిస్వామి శిబిరం స్పష్టం చేసింది. అదే సమయంలో తిరుచ్చి వేదికగా ఈనెల 24న జరగనున్న పన్నీరు సెల్వం నేతృత్వంలోని మహానాడులో పార్టీ జెండా వినియోగం వివాదానికి దారి తీసే అవకాశాలు కనిపించాయి. దీనిని ముందుగానే పసిగట్టిన పన్నీరు శిబిరం జెండాను తమకు అనుకూలంగా మలుచుకోవడం గమనార్హం. అన్నాడీఎంకే జెండా నలుపు, ఎరుపు వర్ణాలతో ఉంటుంది. మధ్యలో దివంగత నేత అన్నాదురై ఫొటో ఉంటుంది. అయితే, ఈ జెండాను అలాగే వాడేసుకుంటూ, అన్నాదురైకు పైభాగంలో రెండాకుల చిహ్నం పన్నీరు శిబిరం పొందుపరచడం చర్చకు దారి తీసింది. పన్నీరు కొత్త పార్టీ పెట్టేనా అన్న చర్చ తెరపైకి వచ్చింది. అయితే, న్యాయపోరాటంలో తుది గెలుపు తమదే అని, అందుకే ప్రస్తుతానికి జెండాలో పార్టీ గుర్తు రెండాకుల చిహ్నంను పొందు పరిచినట్టు పన్నీరు శిబిరం నేతలు పేర్కొంటున్నారు. ఈవ్యవహారంపై పన్నీరు శిబిరం సీనియర్ నేత బన్రూటి రామచంద్రన్ పేర్కొంటూ అన్నాడీఎంకే పేరును, జెండాను, చిహ్నంను తాము వినియోగిస్తామని, ఇది తమ హక్కుగా వ్యాఖ్యలు చేశారు. చట్టపరంగా చర్యలు... పన్నీరు సెల్వం శిబిరం తీరుపై పళనిస్వామి తీవ్రంగా స్పందించారు. ఎన్నికల కమిషన్, కోర్టు స్పష్టంగా పార్టీ, జెండా, చిహ్నం తమకే చెందుతుందని చెప్పాయని, అలాంటప్పుడు ఆయన రాజకీయ నాగరికతకు అనుగుణంగా నడుచుకోకపోవడం శోచనీయమని విమర్శించారు. పార్టీ పేరు, జెండాను ఆయన వినియోగించడం అనాగరిక చర్యగా వ్యాఖ్యలు చేశారు. పార్టీ కోసం విశ్వాసంగా ఉండే వాళ్లను చేర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు, అయితే, ద్రోహులకు అన్నాడీఎంకేలో చోటు లేదని పరోక్షంగా పన్నీరును ఉద్దేశించి పళనిస్వామి వ్యాఖ్యలు చేశారు. అన్నాడీఎంకే సీనియర్‌నేత జయకుమార్ స్పందిస్తూ, పన్నీరు తన ధోరణి మార్చుకోకుంటే చట్టపరంగా చిక్కులు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. పార్టీ పేరు, జెండాను ఆయన వినియోగించడంపై కోర్టులో పిటిషన్ దాఖలు చేయబోతున్నామన్నారు. -
అన్నాడీఎంకేలోకి వెళ్లను..!
సాక్షి, చైన్నె: తాను మళ్లీ అన్నాడీఎంకేలోకి వెళ్లబోనని బీజేపీ శాసన సభాపక్ష నేత నయనార్ నాగేంద్రన్ స్పష్టం చేశారు. తిరునల్వేలి జిల్లా అన్నాడీఎంకేలో ఒకప్పుడు కీలక నేతగా నయనార్ నాగేంద్రన్ ఉండే వారు. దివంగత నేత జయలలితను ఢీకొట్టి మరీ అన్నాడీఎంకే నుంచి బయటకు వచ్చేశారు. ప్రస్తుతం ఉన్న అన్నాడీఎంకేలోని నాయకులలో నయనార్ సీనియర్‌గా చెప్పవచ్చు. అప్పట్లో మంత్రిగా కూడా పనిచేశారు. నయనార్ మంత్రిగా ఉన్న సమయంలో ఆయన పరిధిలోని ఓ విభాగానికి పళణి స్వామి నామినేటెడ్ పదవిలో చైర్మన్‌గా ఉండేవారు. అలాంటి నేత అన్నాడీఎంకే నుంచి బయటకు వచ్చేసి బీజేపీలో రాజకీయ ప్రయాణం సాగిస్తున్నారు. ఆ పార్టీ శాసన సభాపక్ష నేతగా ప్రస్తుతం ఉన్నారు. ఆయన ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నాడీఎంకేలో ఉన్నప్పటి పరిస్థితులను గుర్తు చేసుకున్నారు. అన్నాడీఎంకే నుంచి బయటకు వచ్చే సమయంలో తీవ్ర వేదన చెందానని, ఆవేదన వ్యక్తం చేశానని పేర్కొన్నారు. తనకు పళణి స్వామి సన్నిహితుడు అని గుర్తు చేశారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో తన పరిధిలోని ఓ విభాగానికి ఆయన చైర్మన్‌గా ఉండేవారు అని, అయితే, ఆయన ఎదుగుదల తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. తనను మళ్లీ మాతృసంస్థలోకి వచ్చేయాలని పళణి స్వామితో పాటుగా అన్నాడీఎంకే నేత జయకుమార్ ఆహ్వానించారని తెలిపారు. తాను అన్నాడీఎంకేలోకి వెళ్లే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తాను ఏపార్టీలో ఉన్నా, తనను ఆదరించే వాళ్లు, అభిమానం చూపించే వాళ్లు వెన్నంటి ఉన్నారని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా తనకు అందరితోనూ మంచి స్నేహం ఉందని, అందువల్లే మళ్లీ అన్నాడీఎంకేలోకి వెళ్లను అని స్పష్టం చేశారు. తాను ఎవరినీ సాయం అడగను అని, తన చుట్టూ ఉన్న వారిని ఆదరించడం, ప్రేమ చూపించడం, వారిని కలుపుకు వెళ్లడం తన పయనంగా వివరించారు. -
పన్నీరు ‘ఉప’ పదవికి ఎసరు
సాక్షి, చైన్నె: అన్నాడీఎంకే పళణి స్వామి గుప్పెట్లోకి చేరడంతో డైలమాలో పడ్డ పన్నీరు సెల్వంకు మరో దెబ్బ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన చేతిలో ఉన్న పార్టీ శాసన సభా పక్ష ఉప నేత పదవికి ఎసరు పెట్టేందుకు పళణి శిబిరం సిద్ధమైంది. బుధవారం స్పీకర్ అప్పావును కలిసి అన్నాడీఎంకే విప్ ఎస్పీ వేలుమణి కోర్టు తీర్పుపై చర్చించారు. వివరాలు.. అన్నాడీఎంకే ఆధిపత్య సమరంలో కోర్టు తీర్పుతో పళణి స్వామి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా పగ్గాలు చేపట్టినానంతరం పార్టీపై పట్టు బిగించే పనిలో పళణి నిమగ్నం అయ్యారు. ఇప్పటికే అన్నాడీఎంకే నుంచి పన్నీరును బయటకుపంపించడం, కోర్టు తీర్పు ఆయనకు వ్యతిరేకంగా రావడం వంటి అంశాలను పళణి శిబిరం పరిగణనలోకి తీసుకుంది. పన్నీరు సెల్వం పదవికి ఎసరు పెట్టేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఇది వరకే పన్నీరు సెల్వంను ఆ పదవి నుంచి తప్పిస్తూ అన్నాడీఎంకే శాసన సభాపక్షం తీర్మానం చేసినా, స్పీకర్ అప్పావు ఇంత వరకు స్పందించ లేదు. పన్నీరును తప్పించి ఆ పదవిలో తమ శిబిరం నేత ఆర్బీ ఉదయకుమార్‌ను నియమించాలని స్పీకర్‌కు విజ్ఞప్తి చేసినా ఫలితం శూన్యం. దీంతో సభలో పళణి, పన్నీరు పక్క పక్కనే కూర్చోవాల్సిన పరిస్థితి. ఈసారి వదలి పెట్టం.. ఇది వరకు వ్యవహారం కోర్టులో ఉండడంతో స్పీకర్ ఉప నేత పదవి విషయంగా ఆచీ తూచీ స్పందించారు. పన్నీరును ఆ సీటులో కూర్చునేందుకు అవకాశం కల్పించారు. ప్రస్తుతం అన్నాడీఎంకే వ్యవహారంలో కోర్టు తీర్పు తమకు అనుకూలంగా రావడం,ప్రధాన కార్యదర్శి పదవిని తమ నేత పళని స్వామి స్వీకరించడంతో ఇక, పన్నీరును ఆ సీటులో కూర్చోబెట్టేందుకు అంగీకరించే ప్రసక్తే లేదని మెజారిటీశాతం ఎమ్మెల్యేలు స్పీకర్‌పై ఒత్తిడికి సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా ముందుగా అన్నాడీఎంకే విప్ ఎస్పీ వేలుమణి బుధవారం స్పీకర్ అప్పావును కలిసి విషయాన్ని ప్రస్తావించారు. తమ పార్టీతో సంబంధం లేని వ్యక్తిని ఎలా ఉప నేత సీటులో కూర్చోబెడుతారని, తక్షణం ఆయన్ని తప్పించి, ఆర్బీ ఉదయకుమార్ ఆ స్థానంలో నియమించాలని కోరారు. స్పీకర్ ఒకటి రెండు రోజుల్లో స్పందించని పక్షంలో ఎమ్మెల్యేలతో సభను స్తంభింప చేయడానికి పళణి స్వామి సిద్ధం అవుతుండడం గమనార్హం. కాగా అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఉదయం అసెంబ్లీలో పళణిస్వామి అడుగుపెట్టగానే ఆ పార్టీ ఎమ్మెల్యేలు బల్లలు గుద్ది మరీ కరతాళ ధ్వనులతో ఆహ్వానం పలకడం విశేషం. ఇదిలా ఉండగా మంగళవారం వెలువడ్డ తీర్పునకు వ్యతిరేకంగా పన్నీరు సెల్వం దాఖలు చేసిన అప్పీలు పిటిషన్ విచారణ గురువారం ప్రారంభం కానుంది. బుధవారం పన్నీరు శిబిరానికి చెందిన వైద్యలింగం, మనోజ్ పాండియన్, జేసీడీ ప్రభాకర్‌లు సైతం వేర్వేరుగా పళణికి వ్యతిరేకంగా పిటిషన్లు దాఖలు చేయడం గమనార్హం. అందుకే బుధవారం జరగాల్సిన విచారణ ఒక రోజు వెనక్కి వెళ్లింది. -
రాజకీయరంగంలో సంచలనంగా పళని ప్రస్థానం
తెల్ల చొక్కా, తెల్ల పంచె, నుదుటున విభూదితో కనిపించే పళణి స్వామి ప్రస్థానం తమిళ రాజకీయాల్లో ప్రత్యేకమనే చెప్పాలి. 1954లో సేలం జిల్లా శిలువం పాళయం అనే గ్రామంలో ఆయన జన్మించారు. కోనేటి పట్టిలో బెల్లం వ్యాపారంలో రాణించారు. ఎంజీఆర్ మరణంతో అన్నాడీఎంకే ముక్కలైన సమయంలో 1989లో జయలలిత శిబిరం ఎమ్మెల్యేగా ఎడపాడి నియోజకవర్గం నుంచి తొలిసారి గెలుపొందారు. అప్పటి నుంచి ఎడపాడి ఆయన ఇంటి పేరుగా మారింది. పార్టీ జిల్లా కార్యదర్శిగా, ఎంపీగా, ఎమ్మెల్యేగా విజయాలతో దూసుకొచ్చిన పళణి స్వామి 2011లో తొలిసారి మంత్రి అయ్యారు. 2016లో మరో మారు మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. జయలలిత మరణం తదుపరి పరిణామాలతో అన్నాడీఎంకేలో చోటు చేసుకున్న మార్పుల నేపథ్యంలో అనూహ్యంగా పళణి స్వామి శాసన సభ పక్ష నేతగా మారారు. జయలలిత నెచ్చెలి, చిన్నమ్మ శశికళ అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్తూ, తన ప్రతినిధిగా పళని స్వామిని ఏకంగా సీఎం పీఠంపై కూర్చోబెట్టింది. ఆ తదుపరి పళనిస్వామి రాజకీయ వ్యూహాలకు పదునుపెడుతూ, ఎత్తుకు పై ఎత్తులతో శశికళ శిబిరాన్నే పూర్తిగా పక్కన పెట్టారు. అలాగే, పార్టీకి వ్యతిరేకంగా ఉన్న పన్నీరు సెల్వంను అక్కున చేర్చుకుని జంట నాయకత్వంతో ముందుకెళ్లారు. ఎంత కాలం ఈ ప్రభుత్వం కొనసాగుతుందో అని అనుమానం వ్యక్తం చేసిన వారికి తన మార్కు పాలనతో సమాధానం చెప్పారు. ప్రజల మన్ననలే కాదు, అన్నాడీఎంకే కార్యకర్తలు, నాయకుల మదిలో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. 2021 అసెంబ్లీ ఎన్నికలలో అన్నాడీఎంకేకు అధికారం దూరమైనా, గౌరవప్రదంగా 65కు పైగా ఎమ్మెల్యేలను గెలిపించుకుని తన ప్రత్యేకత చాటుకున్నారు. ప్రధాన ప్రతిపక్ష నేతగా పగ్గాలు చేపట్టి.. తనదైన రాజకీయ వ్యూహాలతో ముందుకు సాగారు. ఇక చివరికి అన్నాడీఎంకేలో తిరుగు లేని నేతగా మారి జయలలిత తర్వాత ప్రధాన కార్యదర్శిగా పగ్గాలు చేపట్టారు. :: సాక్షి, చైన్నె ప్రతినిధి -
ఏ ఒక్క పథకాన్నీ రద్దు చేయలేదు
సాక్షి, చైన్నె: అన్నాడీఎంకే ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాల్లో ఏ ఒక్కదాన్నీ తాము రద్దు చేయలేదని ఆర్థికమంత్రి పిటీఆర్ పళణి వేల్ త్యాగరాజన్ స్పష్టం చేశారు. అనేక పథకాలను సరికొత్తగా మెరుగులు దిద్ది అమలు చేస్తున్నామని వివరించారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మంగళవారం పలువరు సభ్యుల ప్రశ్నలకు మంత్రులు కేఎన్‌నెహ్రూ, ఉదయ నిధి స్టాలిన్, పొన్ముడి, పెరియకరుప్పన్ సమాధానం ఇచ్చారు. 117 బస్టాండ్లను ఆధునీకరించనున్నట్లు మంత్రి నెహ్రూ తెలిపారు. దరఖాస్తు చేసుకున్న 15 రోజులలో మహిళా స్వయం సహాయక బృందాలకు రుణాలు అందుతాయని మంత్రి ఉదయనిధి ప్రకటించారు. రాష్ట్రంలోని 54 పాలిటికెన్నిక్ కళాశాలలను రూ. 2,753 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యుత్తమ శిక్షణ కేంద్రాలుగా మారుస్తామని మంత్రి పొన్ముడి తెలిపారు. రూ. 26,352 కోట్లతో అనుబంధ పద్దు ఈనెల 20వ తేదీన అసెంబ్లీలో 2023–24 సంవత్సరానికి గాను ఆర్థిక బడ్జెట్‌ను అసెంబ్లీలో మంత్రి పిటీఆర్ పళణి వేల్ త్యాగరాజన్ ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన చర్చలో భాగంగా గత ఏడాది చివరిలో అదనంగా ప్రభుత్వం పలు కొత్త పథకాలు, వివిధ పనులకు కేటాయించిన నిధుల వివరాలతో అనుబంధ పద్దు వివరాలను అసెంబ్లీలో మంగళవారం ఆయన దాఖలు చేశారు. రూ. 26,352 కోట్లు ఖర్చుకు సంబంధించిన వివరాలను అందులో పొందు పరిచారు. అలాగే అన్నాడీఎంకే సభ్యులు చేస్తూ వస్తున్న విమర్శలకు సమాధానం ఇస్తూ ప్రసంగించారు. అన్నాడీఎంకే అధికారంలో ఉన్న పదేళ్లలో 507 వాగ్దానాలు ఇచ్చారని, ఇందులో 269 మాత్రమే అమలు చేశారని వివరించారు. అయితే, తాము అధికారంలోకి వచ్చిన రెండేళ్లల్లో 85 శాతం వాగ్దానాలు అమలు చేశామని పేర్కొన్నారు. ఇది తమకు అన్నాడీఎంకేకు మధ్య ఉన్న తేడా అని వ్యాఖ్యానించారు. అన్నాడీఎంకే ప్రవేశ పెట్టిన ఏ ఒక్క పథకాన్నీ తాము రద్దు చేయలేదని స్పష్టం చేశారు. ఆ పథకాలకు మరింత వన్నె తెచ్చే విధంగా మార్పులు చేర్పులతో, లబ్ధిదారులకు మరింత అవకాశం కల్పించే విధంగా అమలు చేస్తున్నామని వివరించారు. -
చర్చనీయాంశంగా మారిన విశాల్ టాటూ.. పొలిటికల్ ఎంట్రీ ఖాయమేనా?
కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ పొలిటికల్ ఎంట్రీ మరోసారి చర్చనీయాంశమైంది. గతంలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత చనిపోయిన సమయంలో ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని భావించినా నామినేషన్ తిరస్కరణకు గురికావడంతో ఆ ఎన్నికల్లో విశాల్ పోటీ చేయలేకపోయారు. కానీ అప్పటినుంచి ఆయన రాజకీయాల్లోకి రావడం ఖాయమనే చెబుతూ వస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా దిగ్గజ నటుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్ ఫొటోను గుండెలపై టాటూ వేయించుకున్నారు. గతంలో విశాల్ పలుమార్లు తాను ఎంజీఆర్‌కు అభిమాని అని పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఏ సందర్బం లేకుండా విశాల్ తన ఛాతిపై ఎంజీఆర్ టాటూను వేయించుకోవడం ఆసక్తిగా మారింది. వచ్చే ఎన్నికల్లో విశాల్ అన్నాడీఎంకే తరఫున ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారని, అందుకే ఆయన ఆ పార్టీకి దగ్గర అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఏదైనా సినిమా కోసం ఇలా టాటూ వేయించుకున్నారా అన్న అనుమానాలు కూడా వినిపిస్తున్నాయి. #NikilNews23 #NikilVideos *புரட்சி தலைவர் எம். ஜி.ஆர் படத்தை தன் நெஞ்சில் பச்சைகுத்தி இருக்கும் நடிகர் விஷால் அவர்கள்* #Vishal @VishalKOfficial @HariKr_official @VffVishal #MGR pic.twitter.com/AmmqIsook5 — Nikil Murukan (@onlynikil) January 24, 2023 -
అర్ధరాత్రి హైడ్రామా.. పన్నీర్ సెల్వంకు భారీ ఊరట
చెన్నై: అన్నాడీఎంకే పార్టీలో వర్గ పోరు పంచాయితీ మరోసారి న్యాయస్థానాన్ని చేరింది. అయితేసారి జరిగిన అర్ధరాత్రి హైడ్రామాలో పళనిస్వామికి ఝలక్ తగిలింది. అధికారం ఒక్కరి చేతుల్లోనే ఉండాలన్న తీర్మానంపై చర్చ మాత్రమే జరగొచ్చని అయితే.. ఆ తీర్మానంపై ఆమోదించడం లాంటి నిర్ణయం తీసుకోకూడదని డివిజన్ బెంచ్ ఆదేశించింది. దీంతో పన్నీర్‌సెల్వం వర్గానికి భారీ ఊరట లభించినట్లు అయ్యింది. జూన్ 23న(ఇవాళ) అన్నాడీఎంకే జనరల్ కౌన్సిల్ భేటీ వెంకటాచలపతి ప్యాలెస్‌లో నిర్వహిస్తున్నారు. ఈ తరుణంలో.. సమావేశంలోనే అధికారం ఒక్కరి చేతిలోనే ఉండాలని మాజీ ముఖ్యమంత్రి, పార్టీ కో-కోఆర్డినేటర్ పళనిస్వామి(EPS) తీర్మానం చేయాలనుకున్నాడు. అయితే.. మాజీ డిప్యూటీ సీఎం.. పార్టీ కోఆర్డినేటర్ పన్నీరుసెల్వం ఆ నిర్ణయాన్ని మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వస్తున్నాడు. అన్నాడీఎంకే జనరల్ కౌన్సిల్ జరపకుండా నిలువరించాలని పోలీసులకు ఫిర్యాదుతో పాటు కోర్టుకు చేరింది ఈ వర్గపోరు పంచాయితీ. అయితే.. మద్రాస్ హైకోర్టు భేటీని, తీర్మానాలు చేయకుండా ఆపేలా పార్టీని ఆదేశించలేమని, అది పూర్తిగా ఆ పార్టీ అంతర్గత వ్యవహారమని జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. అయితే దీనిపై మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించింది పన్నీర్ సెల్వం వర్గం. జనరల్ కౌన్సిల్ సభ్యుడు షణ్ముగం అభ్యర్థనతో అర్ధరాత్రిపూట మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ న్యాయమూర్తి ఎం దురై స్వామి ఇంట్లో వాదనలు నడిచాయి. ఈ విచారణకు జస్టిస్ సుందర్ మోహన్ సైతం హాజరయ్యారు. వాదనల అనంతరం మద్రాస్ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేస్తూ.. ముందుగా ప్రకటించిన 23 తీర్మానాలపై మాత్రం అన్నాడీఎంకే జనరల్ కౌన్సిల్ నిర్ణయం తీసుకోవచ్చని స్పష్టం చేసింది. అయితే ఇతర వ్యవహారాలపై చర్చ మాత్రమే జరగాలని పేర్కొంది. దీంతో ఇవాళ భేటీ జరుగుతుండగా.. ఒక్కరి చేతిలోనే అన్నాడీఎంకే పగ్గాలు ఉండాలన్న పళనిస్వామి తీర్మానానికి ఆమోదం లభించడం కుదరదనే చెప్పాలి. Chennai, Tamil Nadu | AIADMK workers, leaders gather at Shrivaaru Venkatachalapathy Palace, Vanagaram for party's General Council meeting to be held today. pic.twitter.com/9lnaL8OJvD — ANI (@ANI) June 23, 2022 చదవండి: ‘డమ్మీ రాష్ట్రపతి’గా ద్రౌపది ముర్ము.. తీవ్ర ఆరోపణలు -
Tamil Nadu Assembly Election 2021: అధికారం ఎవరిదో?
సాక్షి, చెన్నై: ఎన్నికలంటేనే అధికార పార్టీకి, ప్రతిపక్ష పార్టీకి మధ్య అధికారం దక్కించుకునేది ఎవరనే పోటీ ఉంటుంది. అయితే కొన్ని సమయాల్లో ఎదో ఒక పార్టీకి అనుకూల పవనాలు బలంగా వీచడం, ఆ పార్టీకి మహత్తర విజయాన్ని కల్పించడం సాధారణ విషయం. 1952 నుంచి శాసనసభ ఎన్నికలు జరుగుతున్నాయి. 1952 కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా కమ్యూనిస్టు ఆధ్వర్యంలోని ప్రతిపక్ష పార్టీలు ఒకే కూటమిగా ఎన్నికలను ఎదుర్కొన్నాయి. అప్పట్లో తమిళనాట తీవ్ర ఆహార కొరత ఏర్పడడంతో అధికార పార్టీకి వ్యతిరేక పవనాలు వీచాయి. దీంతో కాంగ్రెస్ వెనుకంజ వేయకతప్పలేదు. 1967లోను అప్పటి అనుకూల పవనాలు డీఎంకేను గెలుపొందేలా చేశాయి. ఆ తర్వాత ఎంజీఆర్ డీఎంకే నుంచి వైదొలగి అన్నాడీఎంకే పార్టీని ఏర్పరిచారు. దీంతో 1972లో ఆ పార్టీ ఆవిర్భవించింది. అప్పట్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో అన్నాడీఎంకే భారీ విజయం సాధించింది. కాంగ్రెస్‌కు మళ్లీ ఘోర పరాభవం తప్పలేదు. 1984 ఎన్నికలలో ఎంజీఆర్ అనారోగ్యానికి గురై అమెరికా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చారు. ఆ సమయంలో ఎన్నికలు జరగడంతో కాంగ్రెస్‌తో పొత్తు కుదుర్చుకుని ఎన్నికలను ఎదుర్కొన్నారు. అయితే అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ హత్యకు గురయ్యారు. దీంతో ఏర్పడిన సానుభూతి పవనాల కారణంగా అన్నాడీఎంకే, కాంగ్రెస్ కూటమి భారీ విజయం సాధించింది. 1989లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో నాటి ప్రధాని రాజీవ్గాందీపై బోఫోర్స్ అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఇది కాంగ్రెస్‌కు వ్యతిరేకత తీసుకొచ్చింది. అప్పట్లో ఎంజీఆర్ మృతితో అన్నాడీఎంకే జయలలిత వర్గం, జానకి వర్గంగా విడిపోయి ఎన్నికలను ఎదుర్కొన్నాయి. ఈ కారణంగా డీఎంకే విజయం సాధించి అధికారం చేపట్టింది. 1991లో అన్నాడీఎంకే, కాంగ్రెస్ కూటమి పోటీ చేశాయి. ఆ సమయంలో శ్రీపెరంబుదూరు ప్రచారానికి వచ్చిన రాజీవ్‌గాంధీ హత్యకు గురికావడంతో సానుభూతి పవనాలు అన్నాడీఎంకే, కాంగ్రెస్ కూటమిని గెలిపించాయి. 1995 అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా ఉన్న జయలలితపై అవినీతి ఆరోపణలు రావడంతో వ్యతిరేకత ఏర్పడింది. దీంతో డీఎంకే, తమిళ మానిల కాంగ్రెస్ కూటమి గెలుపొందింది. 2001లో అన్నాడీఎంకే, 2006లో డీఎంకే అధికారంలోకి వచ్చాయి. 2011 ఎన్నికలు 2జీ స్పెక్ట్రం అవినీతి కారణంగా డీఎంకే పరాజయంపాలై అన్నాడీఎంకే అధికారం చేజిక్కించుకుంది. 2016లో ఎటువంటి పవనాలు వీచలేదు. ఇరుపార్టీల మధ్య తీవ్ర పోటీ నెలకొనగా అన్నాడీఎంకే అధికారం చేపట్టింది. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లోను ఎటువంటి పవనాలు వీచడం లేదు. ఇరు పార్టీలకు ఉన్న పలుకుబడిని బట్టే గెలుపు, ఓటములు ఉంటాయి. -
వైరలైన ఆగస్టు 14 ముహూర్తం..
రాష్ట్ర రాజకీయ తెరపై శశికళ మరోసారి తళుక్కుమన్నారు. నాలుగేళ్ల జైలు శిక్ష పూర్తి కాకుండానే ఆగస్ట్ 14వ తేదీన ముందుగానే విడుదల కానున్నారని జోరుగాప్రచారం జరుగుతోంది. సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో శశికళకున్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. అన్నాడీఎంకే అధినేత్రి, దివంగత జయలలితకు అన్నీతానై 32 ఏళ్లపాటు నీడలా వెంట నిలవడమే ఇందుకు కారణం. జయ తీసుకునే పార్టీ పరమైన అన్ని నిర్ణయాల వెనుక శశికళ ప్రమేయం ఉంటుందని ప్రతీతి. ముఖ్యంగా అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల సమయాల్లో తన అనుయాయులకు టిక్కెట్లు ఇప్పించుకోవడంతో ‘శశికళ వర్గం’ కూడా ఏర్పడింది. పైకి జయకు వీరవిధేయులుగా ఉంటూనే లోలోపల శశికళ బంటులుగా వ్యవహరించిన ఎమ్మెల్యేలు ఎందరో ఉన్నారు. అందుకే జయ కన్నుమూయగానే ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు పోలోమంటూ శశికళకు పాదాక్రాంతమైనారు. అమ్మ తరువాత ఇక చిన్నమ్మే శరణ్యమని పార్టీ ప్రధాన కార్యదర్శిగా, శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. గవర్నర్‌ను కలిసి ఇక సీఎం కావడమే తరువాయి అని అందరూ భావిస్తున్న తరుణంలో ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో నాలుగేళ్ల శిక్ష, రూ.10 కోట్ల జరిమానాతో జైలు పాలుకావడం జరిగిపోయింది. 2017 టూ 2021 ఆస్తుల కేసులో 2017 ఫిబ్రవరిలో బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలు జీవితం ప్రారంభించిన శశికళకు నాలుగేళ్ల శిక్షా కాలం 2021 ఫిబ్రవరితో ముగుస్తుంది. దాదాపుగా ప్రతి ఖైదీ తన శిక్షా కాలంలో అనేక వెసులుబాటులు కలిగి ఉంటారు. విచారణ దశలో రిమాండ్ ఖైదీగా గడిపిన కాలం, సత్ఫ్రవర్తనతో శిక్షాకాలం నుంచి మినహాయింపు పొందే అవకాశం ఉంటుంది. ఆయా కేటగిరిలకు చెందిన ఖైదీలను ప్రతి ఏటా స్వాతంత్య్ర దినోత్సవం రోజున ప్రభుత్వాలు ముందుగా విడుదల చేస్తుంటాయి. శశికళ విషయానికి వస్తే రిమాండ్ ఖైదీగా జయలలితతోపాటు బెంగళూరు జైల్లో మూణ్ణాలుగు నెలలు గడిపి బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ రిమాండ్ కాలాన్ని శశికళ విషయంలో పరిగణనలోకి తీసుకుంటే ముందుగా విడుదలయ్యే అవకాశం ఉంది. అది వీలుపడని పక్షంలో ఇక సత్ఫ్రవర్తన కింద పరిశీలించాల్సి ఉంటుంది. జైళ్ల శాఖ ఉన్నతాధికారుల ‘చేతి’చలువతో జైలు గోడల మధ్య లగ్జరీ జీవితాన్ని అనుభవిస్తున్నారని, ఇష్టారాజ్యంగా ములాఖత్, జైలు నుంచి స్వేచ్ఛగా బయటకు వెళుతూ బెంగళూరు నగరంలో షాపింగ్ చేయడం వంటివి శశికళ సాగించారని బెంగళూరు అప్పట్లో జైళ్లశాఖ డీఐజీ రూప సాక్ష్యాధారాలతో బయటపెట్టారు. శశికళ షాపింగ్‌కు వెళ్లివస్తున్న సీసీటీవీ పుటేజీలు సైతం బహుళ ప్రచారంలోకి వచ్చాయి. వీటిని గనుక ప్రభుత్వం సీరియస్‌గా పరిగణనలోకి తీసుకుంటే సత్ఫ్రవర్తన కోటా కింద శశికళకు ముందస్తు విడుదల యోగం ఉండదు.(జైలులో చిన్నమ్మ జాగ్రత్తలు ) ఆగస్టు 14న విడుదలవుతున్నట్లుగా ప్రచారం సత్ఫ్రవర్తన కోటా కింద నాలుగేళ్ల జైలు శిక్ష ముగియకుండానే ఆగస్టు 14వ తేదీన శశికళ విడుదలవుతున్నట్లు ఒక సమాచారం వైరల్ అవుతోంది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విడుదలవుతున్న శిక్షాఖైదీల్లో శశికళ కూడా ఉన్నారా అనే విషయం స్పష్టం చేయాలని కోరుతూ శశికళ కర్ణాటక రాష్ట్రానికి చెందిన భారతీయ జనతాపార్టీ సీనియర్ నేత ఆశీర్వాదం ఆచారి.. సమాచార హక్కు చట్టం కింద బెంగళూరు పరప్పన అగ్రహార జైలుకు ఇటీవల దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇంకా బదులురాలేదని సమాచారం. ఇదిలా ఉండగా, సత్ఫ్రవర్తన కోటా కింద ఆగస్టు 14వ తేదీన శశికళ విడుదల కానున్నారని ఆశీర్వాదం ఆచారి గురువారం ట్వీట్ చేసి కలకలాన్ని రేపారు. అంతేగాక రాజకీయవర్గాల్లో రసవత్తరమైన చర్చకు తెరలేపారు. వచ్చే ఏడాది (2021) ఏప్రిల్ లేదా మే మాసంలో తమిళనాడు అసెంబ్లీకి సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. అన్నాడీఎంకేలో కీలకపాత్ర పోషించిన శశికళ చలువవల్లే ఎడపాడి పళనిస్వామి ముఖ్యమంత్రి అయ్యారు. అదే తరుణంలో శశికళపై తిరుగుబాటు చేసిన ఓ పన్నీర్‌సెల్వం ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. నటులు కమల్, రజనీకాంత్ రాజకీయ పార్టీలను పక్కనపెడితే అన్నాడీఎంకే, డీఎంకేలే ప్రధాన ప్రత్యర్థులుగా ఎన్నికల రణరంగంలో తలపడుతాయి. ఈ నేపథ్యంలో ముందస్తుగానే శశికళ జైలు నుంచి విడుదలైతే అన్నాడీఎంకే రాజకీయాల్లో కుదుపుతప్పదు. ఈ పరిణామం అన్నాడీఎంకేకు అనుకూలమా ప్రతికూలమా అనేది అంచనాలకు అందని విధంగా ఉంది. రాబోయే ఎన్నికల్లో డీఎంకే దూకుడుకు కళ్లెం వేసేందుకు అన్నాడీఎంకేలోని అన్ని వర్గాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు కమలనాథులు వ్యూహం పన్నుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంటే ఎడపాడి ఎలాగూ విధేయుడు కాబట్టి శశికళ, టీటీవీ దినకరన్, పన్నీర్‌సెల్వంల మధ్య రాజీకి బీజేపీ ప్రయత్నాలు చేయవచ్చు. ఈ వ్యూహంపై రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యంగా అన్నాడీఎంకేలో ప్రతిస్పందన ఎలాగుంటుందో తెలుసుకునేందుకే బీజేపీ అధిష్టానం ‘ట్రయల్ రన్’లా ఆశీర్వాదం ఆచారిచే ట్వీట్ చేయించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. కమలనాథులు ఆశించినట్లుగానే శశికళ ముందస్తు విడుదల రాష్ట్రంలో పెద్ద చర్చనీయాంశమైంది. సత్ఫ్రవర్తన కింద శశికళ ముందుగా విడుదల కావాలంటే రూ.10 కోట్ల జరిమానా చెల్లింపుపై చిక్కు సమస్య ఉంది. ఆస్తుల కేసులో శశికళతోపాటూ జైలు శిక్ష అనుభవిస్తున్న ఇళవరసి, సుధాకరన్ కలిపి మొత్తం రూ.30 కోట్లు జరిమానా కట్టాలి. ఆ సొమ్ము కట్టిన పక్షంలో ఆదాయపు పన్నుశాఖ రంగప్రవేశం చేసి ఇంత సొమ్ము ఎక్కడిదని నిలదీస్తుంది. జరిమానా చెల్లించని పక్షంలో సత్ఫ్రవర్తన జాబితాలో చేరినా ముందస్తు విడుదలకు అవకాశం లేదు. అబ్బే అదేం లేదు : బెంగళూరు జైళ్లశాఖ ఆగస్టు 14వ తేదీన శశికళ విడుదలా, అబ్బే అదేం లేదని బెంగళూరు జైలు అధికారులు శుక్రవారం కొట్టివేశారు. సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. ‘సత్ఫ్రవర్తన కోటా కింద శిక్షా ఖైదీలను విడుదల చేయాలనే అంశంపై స్వాతంత్య్ర దినోత్సవానికి సుమారు పది రోజుల ముందు కర్ణాటక కేబినెట్ సమావేశమై నిర్ణయం తీసుకుంటుంది. ఈ నిర్ణయాన్ని గవర్నర్‌కు ఆమోదానికి పంపుతుంది. ఆ తరువాతనే ఖైదీలను విడుదల చేస్తార’ని జైళ్లశాఖ అధికారి ఒకరు తెలిపారు. సత్ఫ్రవర్తన ఖైదీల విడుదలపై ప్రభుత్వం ఇంతవరకు సమావేశమే కాలేదని ఆయన స్పష్టం చేశారు. -
నటి వింద్య ప్రచారానికి సిద్ధం
పెరంబూరు: సినీ నటి వింద్య సైతం ఎన్నికలప్రచారానికి సిద్ధమైంది. బుధవారం నుంచి 16వ తేదీ వరకూ ఈమె చెన్నైలోని పలు ప్రాంతాల్లో అన్నాడీఎంకే అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయనున్నారు. ఈ మేరకు ఆ పార్టీ ప్రధాన కార్యాలయం మంగళవారం ఒక ప్రకటనను విడుదల చేసింది. ఆమె ప్రచార వేళలను, ప్రాంతాలను వెల్లడించారు. అందులో నటి వింధ్య బుధవారం సాయంత్రం 5 గంటలకు షోళింగర్ ప్రాంతం నుంచి ప్రచారాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. సాయంత్రం 7 గంటలకు కుయాత్తం, 8.30 గంటలకు ఆంబూర్ ప్రాంతాల్లో ప్రచారం చేస్తారని పేర్కొన్నారు. అదే విధంగా 11వ తేదీన ఉదయం 11 గంటలకు హోసూర్, సాయంత్రం 5 గంటలకు ఆరూర్, 7 గంటలకు బాప్పిరెడ్డిపట్టి ప్రాంతాల్లో ప్రచారం చేస్తారని తెలిపారు. అదే విధంగా 12వ తేదీన సాయంత్రం 5 గంటలకు పెరియకుళం, 7 గంటలకు ఆండిపట్టి, 13వ తేదీన నీలకోట్టై, సాందూర్, విళాత్తికుళం ప్రాంతాల్లో ప్రచారం చేయనున్నారని పేర్కొన్నారు. ఇక 14వ తేదీన సాయంత్రం 5 గంటలకు పరమకుడి, 7 గంటలకు మానామధురై ప్రాంతాల్లోనూ, 15వ తేదీన తిరువళ్లూర్ ప్రాంతంలోనూ, 16వ తేదీన పూందమల్లి, తిరుపోరూర్ ప్రాంతాల్లో నటి వింద్య ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటారని వెల్లడించారు. -
మెట్టుదిగని కెప్టెన్
సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే–బీజేపీ కూటమి దాదాపు ఖరారైపోగా ఒక్క డీఎండీకే విషయంలో ప్రతిష్టంభన కొనసాగుతోంది. 9 స్థానాలకు డీఎండీకే పట్టుబడుతుండగా నాలుగు లేదా ఐదు స్థానాలు మాత్రమేనని అన్నాడీఎంకే స్పష్టం చేసింది. మొత్తం 40 పార్లమెంటు స్థానాల్లో కనీసం 20 స్థానాల్లో ఖచ్చితంగా పోటీచేయాలని అన్నాడీఎంకే నేతలు భావిస్తున్నారు. మిగిలిన 20 స్థానాలను మిత్రపక్షాలకు వదిలేశారు. ఇందులో బీజేపీకి ఐదు, పీఎంకేకు ఏడు స్థానాలపై ఒప్పందం జరిగిపోయింది. ఇక మిగిలిన 8 స్థానాల్లో పుదియతమిళగం, తమిళ మానిల కాంగ్రెస్ (ఇంకా చర్చల దశలో), ఇండియా జననాయక కట్చి, పుదియనీదికట్చిలకు తలా ఒకటి కేటాయించాలని నిర్ణయించారు. ఇక డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్‌కు మిగిలింది నాలుగుస్థానాలే. అయితే ఆయన 9 స్థానాలను కోరుతుండగా ఎంతమాత్రం వీలుకాదని అన్నాడీఎంకే తేల్చిచెప్పేసింది. మూడు లేదా నాలుగుస్థానాలు మాత్రమే కేటాయించగలమని స్పష్టం చేసింది. బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్, కేంద్రమంత్రి పీయూష్‌గోయల్ మంగళవారం రాత్రి వరకు విజయకాంత్‌కు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఎంతకూ ఆయన మెట్టుదిగకపోవడంతో పీయూష్‌గోయల్ ఢిల్లీకి వెళ్లిపోయారు. ఈ దశలో ఇరుపక్షాల మధ్య ప్రతిష్టంభన నెలకొంది. ఇదిలా ఉండగా బీజేపీ కూటమిలో పీఎంకే చేరడానికి నిరసనగా పీఎంకే యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి రాజేశ్వరి ప్రియా రాజీనామా చేశారు. ఉప ఎన్నికల షరతుపై డీఎండీకే నో: సీట్ల సర్దుబాట్లు అలా ఉంచితే ఖాళీగా ఉన్న 21 అసెంబ్లీ స్థానాల్లో మిత్రపక్షంగా ఎన్నికల ప్రచారం చేయాలని, పోటీ అభ్యర్థులను పెట్టరాదు, ఎన్నికల ప్రచారం చేయాలనే నిబంధనలకు బీజేపీ, పీఎంకే సమ్మతించినట్లు సమాచారం. అయితే డీఎండీకే మాత్రం ఈ నిబంధనకు ససేమిరా అని కుండబద్దలు కొట్టడం ప్రతిష్టంభనకు మరోకారణౖమైంది. పార్లమెంటు స్థానాల్లో్ల మిత్రపక్షం, అసెంబ్లీ స్థానాలో ప్రతిపక్షంగా వ్యవహరించడం ఏమిటని డీఎండీకేను అన్నాడీఎంకే ప్రశ్నిస్తోంది. ఉప ఎన్నికల్లో అభ్యర్థులను పోటీపెట్టబోమని హామీ ఇచ్చినట్లయితేనే నాలుగు లేదా ఐదు స్థానాలను కేటాయించగలమని అన్నాడీఎంకే వాదిస్తోంది. ఇదిలా ఉండగా, తాము కోరినన్ని సీట్లు కేటాయించని పక్షంలో తీవ్రమైన నిర్ణయం తీసుకోకతప్పదని విజయకాంత్ హెచ్చరించారు. బుధవారం రాత్రికి డీఎండీకే, అన్నాడీఎంకే మధ్య సామరస్యపూర్వకమైన ఒప్పందం జరుగుతుందని అంచనా వేస్తున్నారు. -
కోమలవళ్లి అంటేనే కోపం వస్తుంది
కోమలవళ్లి పేరు ఎవరు చెప్పినా ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. ఇప్పుడు సర్కార్ చిత్రం రచ్చకు ప్రధాన కారణం ఈ పేరే. విజయ్ నటించిన చిత్రం సర్కార్ చిత్రంతో ఎంత వివాదం జరిగిందో తెలిసిందే. అన్నాడీఎంకే పార్టీ నేతల ఆరోపణలు, కార్యకర్తల ఆందోళనలకు సర్కార్ చిత్ర యానిట్ తలొగ్గి చిత్రంలోని వివాదాస్పద సన్నివేశాలను కట్ చేసింది. ముఖ్యంగా చిత్రంలో ప్రతినాయకి పాత్రకు కోమలవళ్లి అనే పేరు పెట్టడం సమస్యకు ప్రధాన కారణం. కారణం ఆ పేరు దివంగత ముఖ్యమంత్రి అసలుపేరు కావడమే.ఎట్టకేలకు సర్కార్ చిత్ర సమస్య సమసినా, రచ్చ మాత్రం కొనసాగుతూనే ఉంది. కోమలవళ్లి పేరు ఇప్పుడు సినిమా రంగంలో రచ్చకు కారణమైంది కానీ, చాలా కాలం క్రితమే రాజకీయపరంగా ఆగ్రహా జ్వాలలు పుట్టించింది. ఆ కథేంటే ఒక్క సారి చూద్దాం. 2002లో కాంగ్రెస్, తమిళ కాంగ్రెస్ పార్టీల కూటమి మదురైలో సమావే«శాన్ని ఏర్పాటు చేశాయి. ఆ సభలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ప్రసంగిస్తూ జయలలిత ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పాలన అంటూ ఘాటుగా ఆరోపిస్తూ, ఇకపై ఎప్పుడూ అన్నాడీఎంకేతో పొత్తు ఉండదని వెల్లడించారు. సోనియా వ్యాఖ్యలు జయలలితకు తీవ్ర ఆగ్రహాన్ని కలిగించాయి. దీంతో ఆమెకు సవాల్ విసిరేలా వెంటనే ఢిల్లీ వెళ్లి బీజేపీ సీనియర్ నేత వాజ్‌పేయిని కలిశారు. అనంతరం ప్రతికా సమావేశంలో ప్రధానమంత్రి కావాలని ఆరాట పడుతున్నారు అడ్వేగే అంథోనియ మయినో అంటూ సోనియాగాంధీ అసలు పేరుతో దుయ్యబట్టారు. దీంతో అప్పటి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఈవీకేఎస్. ఇళంగోవన్ సత్యమూర్తి భవన్లో అత్యవసర విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి జయలలిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. అప్పుడాయన కోమలవల్లి, అమ్ము, జయలలిత అంటూ జయలలిత పేర్లను ప్రస్తవిస్తూ విమర్శించారు. అలా విమర్శల దాడిలో ఆ రాజకీయ నాయకుల అసలు పేరు బయట పడి చాలా మందికి తెలిసేలా చేసినా, మరో పక్క రాజకీయ ప్రకంపనలు పుట్టించాయనే చెప్పాలి. 16 ఏళ్ల అయిన తరువాత మళ్లీ ఇప్పుడు సర్కార్ చిత్రంతో కోమలవళ్లి పేరు ఆగ్రహజ్వాలలకు కారణమైంది. దినకరన్ కూడా అమ్మకు అలాంటి పేరు లేదని అంటున్నారు. అదే నిజమైతే కోమలవళ్లి పేరు ఎందకింత కలకలానికి దారి తీస్తోందన్నదే అంతు చిక్కని ప్రశ్న. -
ఓటుకు రూ.10 వేలు!
సాక్షి, చెన్నై : ప్రభుత్వాన్ని దక్కించుకునేందుకు అన్నాడీఎంకే సమన్వయ కమిటీ ఉప ఎన్నికలను సవాల్‌గా తీసుకుందని, ఓటుకు రూ.పది వేలు పంపిణీకి సిద్ధం అవుతోందని అనర్హత వేటుపడ్డ ఎమ్మెల్యే తంగ తమిళ్ సెల్వన్ ఆరోపించారు. ఇందుకోసం రూ.ఐదు వేల కోట్లు కేటాయించారని పేర్కొన్నారు. తేని జిల్లా ఆండిపట్టిలో ఆదివారం అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నేత, అనర్హత వేటు పడ్డ ఎమ్మెల్యే తంగ తమిళ్ సెల్వన్ మీడియాతో మాట్లాడారు. 18 మంది మీద అనర్హత వేటు వేసిన అన్నాడీఎంకే సమన్వయ కమిటీ, ఇప్పుడు భయంతో వణికిపోతోందని «ధ్వజమెత్తారు. ఉప ఎన్నికల్లో ఓటమి తప్పదన్న ఆందోళన వారిలో బయలుదేరిందని పేర్కొన్నారు. ఈ 18తో పాటు తిరుప్పరంగుండ్రం వారి ఖాతా నుంచి చేజారడం ఖాయం అన్న విషయాన్ని గ్రహించారన్నారు. ఈ స్థానాలన్నీ చేజారిన పక్షంలో ప్రభుత్వం కుప్పకూలడం ఖాయం అన్నారు. ఇదే అదనపుగా తమ నేత దినకరన్ వ్యూహాత్మకంగా వ్యవహరించి , ప్రభుత్వ మార్పు మీద దృష్టి పెట్టే అవకాశాలు ఉన్నాయన్న ఆందోళనలో ఆ సమన్వయ కమిటీ ఉందని ఎద్దేవా చేశారు. అందుకే ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలన్న సంకల్పంతో ఆ కమిటీ ఉందన్నారు. పదే పదే సమావేశాలు నిర్వహిస్తోందని, శనివారం సాగిన సమావేశంలో చర్చకు వచ్చిన రహస్య సమాచారాలు తమ దృష్టికి చేరాయన్నారు. ఓటుకు పది వేలు పంపిణీకి పాలకులు సిద్ధం అయ్యారని ఆరోపించారు. దోచుకున్న సొమ్మును, ప్రభుత్వ పథకాల కోసం కేటాయించిన నిధుల్ని దారి మళ్లించి 19 స్థానాల్ని కైవసం చేసుకునేందుకు తీవ్రంగానే వ్యూహాల్ని రచించారని ఆరోపించారు. ఒక్కో ఓటుకు రూ.పది వేలు అందించేందుకు సిద్ధం అయ్యారని, ఇందుకోసం ఇన్‌చార్జ్‌ల్ని రంగంలోకి దించారని పేర్కొన్నారు. ఒక్కో నియోజకవరా>్గనికి రూ.200 కోట్లు చొప్పున ఖాళీగా ఉన్న 20 నియోజకవర్గాలకు కేవలం ఓటర్లను కొనుగోలు చేయడం కోసం రూ.4 వేల కోట్లు కేటాయించినట్టు సమాచారం అందిందన్నారు. అలాగే, మరో వెయ్యి కోట్లు ఇతర ఖర్చులకు కేటాయించి ఉండడాన్ని బట్టి చూస్తే, ఏమేరకు ఈ పాలకులు దోపిడీలకు పాల్ప డి ఉంటారో అనేది స్పష్టం అవుతోందన్నారు. -
‘నటులు సీఎం కాలేరు.!’
సాక్షి, చెన్నై: సినీరంగంలో ఉన్నవారంతా ముఖ్యమంత్రులు కాలేరని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు తిరునావుక్కరసర్ తెలిపారు. నాగపట్నం జల్లా వేదారణ్యంలో మంగళవారం తిరునావుక్కరసర్ మాట్లాడుతూ కావేరి మేనేజ్మెంట్ కమిషన్‌లో కర్నాటక సభ్యుడిని నియమించేందుకు రాష్ట్ర ప్రభుత్వమే చొరవ తీసుకోవాలని, జయలలిత మృతి తర్వాత అన్నాడీఎంకే పరిస్థితి సరిగా లేదన్నారు. ఓపీఎస్, ఈపీఎస్ జట్లు అధికారం ఉన్నంత వరకు మాత్రమేనని, ప్రస్తుతం దివాకరన్, దినకరన్ పార్టీలు కూడా కొత్తగా బయలుదేరినట్లు తెలిపారు. అందరూ అన్నాడీఎంకేను రూపొందించిన ఎంజీఆర్‌ను విస్మరించినట్లు తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేందుకు నేతలందరూ కృషి చేయాలన్నారు. రాష్ట్రంలో కామరాజర్ పాలనను మళ్లీ తీసుకురావాలని కోరారు. మోదీ అనేక అబద్ధాలు చెప్పి అధికారం చేపట్టారన్నారు. ఆయన అబద్ధాలను నమ్మిన ప్రజలు ఓట్లు వేసి మోసపోయినట్లు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో మోదీ తర్వాత స్థిరమైన పాలన అందజేసే వ్యక్తి రాహుల్ గాంధీ మాత్రమేనన్నారు. -
ఆ రెండు పార్టీలపై కమల్, రజనీ కన్ను
పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఓటు బ్యాంకును కాపాడుకునేందుకు అన్ని పార్టీలూ తంటాలు పడుతున్నాయి. కొత్తగా రాజకీయాల్లో కాలుమోపిన నటులు కమల్‌హాసన్, రజనీకాంత్ డీఎంకే, అన్నాడీఎంకే ఓటర్లతో పాటు పార్టీ సభ్యత్వానికీ కన్నం వేసే ప్రయత్నంలో ఉన్నారని విశ్లేషకులు గుసగుసలాడుతున్నారు. ఆ పార్టీల కార్యకర్తలపై గురిపెట్టి సభ్యత్వ లక్ష్యాన్ని సాధించేందుకు వ్యూహం పన్నుతున్నట్లు సమాచారం. సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే, డీఎంకే పార్టీల్లోని అసంతృప్తిని గమనిస్తున్న కమల్, రజనీ ఆ పార్టీ కార్యకర్తలపై కన్నేశారని తెలుస్తోంది. తమ పార్టీల్లో చేర్చుకునేందుకు పావులు కదుపుతున్నట్లు సమాచారం. రాష్ట్ర రాజకీయాల్లో సుదీర్ఘ విరామం తరువాత తమిళ సినీరంగం నుంచి ఇద్దరు అగ్ర నటులు రాజకీయరంగ ప్రవేశం చేశారు. వెండితెరపై ఒకరిది మాస్, మరొకరిది క్లాస్. రాజకీయ తెరపై కూడా రజనీది ఆధ్యాత్మిక పార్టీ, కమల్‌ది ఇందుకు పూర్తిగా నాస్తిక పార్టీగా ప్రాచుర్యంలోకి వచ్చింది. అయితే నేను నాస్తిక వాదిని, నా పార్టీ కాదు అని కమల్ ఇటీవల వివరణ కూడా ఇచ్చుకున్నారు. అయితే ప్రజల మదిలో మాత్రం అన్నాడీఎంకేలా ఆధ్యాత్మిక ధోరణిలో రజనీ, డీఎంకేలా నాస్తికవాదంలో కమల్ రాజ కీయ ప్రయాణం సాగుతోందని, కేవలం ఈ ఒక్క విషయంలో ఆ రెండు పార్టీలకు ఈ రెండు పార్టీలు ప్రత్యామ్నాయాలని వ్యాఖ్యానిస్తున్నారు. కాగా ఎవరు రాజకీయ పార్టీ పెట్టినా ఇప్పటికే ఏదో ఒక పార్టీలో చురుగ్గా ఉండే కార్యకర్తలనే ఆకర్షించక తప్పదు. ఏదో కొద్ది శాతం మినహా రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్నవారంతా ఏదో ఒక పార్టీలో సభ్యులుగా కొనసాగుతుంటారు. రాష్ట్రంలో అనేక జాతీయ, ప్రాంతీయ పార్టీలున్నా రాజకీయంగానేగాక, సభ్యత్వపరంగా కూడా డీఎంకే, అన్నాడీఎంకే మాత్రమే బలమైనవిగా భావించవచ్చు. అయితే అమ్మ మరణం, నాయకత్వ లేమితో అన్నాడీఎంకే బాగా బలహీనపడిపోయింది. ఇక పార్టీలోని భిన్న ధ్రువాలుగా ఉన్న నేతలను ఏకతాటిపైకి తేవడం అసాధ్యమని తేలిపోయింది. అన్నాడీఎంకేలో జనాకర్షణ ఉన్న నేత కరువయ్యాడు. ఏటా జరిగే సభ్యత్వ నమోదుకు, పునరుద్ధరణకు వేలాదిగా కార్యకర్తలు ముందుకు వచ్చేవారు. అన్నాడీఎంకే కార్యాలయం కిటకిటలాడి పోయేది. ఈ ఏడాది ఫిబ్రవరిలో సభ్యత్వ నమోదుకు పార్టీ కార్యాలయ తలుపులు తెరుచుకోగా గతంలో లాగా ఎవరూ ఆసక్తి చూపలేదు. ఇక డీఎంకే కార్యకలాపాలను అధ్యక్షుడు కరుణానిధి అస్వస్థకు గురికావడం కొందరిలో నిరాశను కలిగించింది. అమ్మ చనిపోయిన కొద్దిరోజుల్లోనే ఈ ప్రభుత్వాన్ని కూల్చివేసి, తమ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి ఉండవచ్చు, వచ్చిన అవకాశాలను పార్టీ సద్వినియోగం చేసుకోవడం లేదని కొందరు అని అసంతృప్తితో ఉన్నారు. ఇలా రెండు పార్టీల్లోని అసంతృప్తిని గమనిస్తున్న కమల్, రజనీ ఆ పార్టీల కార్యకర్తలపై కన్నేశారు. తమ పార్టీల సభ్యత్వ నమోదు లక్ష్యాన్ని చేరుకోవాలంటే అన్నాడీఎంకే, డీఎంకే కార్యకర్తలను అక్కున చేర్చుకునేలా పావులు కదుపుతున్నట్లు సమాచారం. పార్టీలో సభ్యులైనపుడే తమ పార్టీకి చెందిన విజిల్ యాప్‌లో ఫిర్యాదులను నమోదు చేసేందుకు అర్హులవుతారని, అలా ఫిర్యాదులు చేసిన వారిని తాము తరచూ సంప్రదిస్తుంటామని కమల్ సంకేతాలు ఇచ్చారు. అలాగే రజనీ సైతం వీధికి కనీసం పది చొప్పున రజనీ మక్కల్ మన్రంలో సభ్యులుగా చేర్చాలని టార్గెట్ పెట్టారు. ఒక్కో వీధికి ఒక దరఖాస్తు ఫారం అందజేస్తున్నారు. ఈ ఒక దరఖాస్తు ద్వారా 30 మందిని సభ్యులుగా చేర్చవచ్చు. 1.50 కోట్ల సభ్యత్వ లక్ష్యాన్ని చేరుకోవాలంటే రెండు పార్టీల కార్యకర్తలను చేరదీయక తప్పదని భావిస్తున్నట్లు తెలుస్తోంది. డీఎంకే మాజీ మంత్రికి సన్నిహితంగా ఉన్న వ్యక్తి రజనీ మక్కల్ మన్రం రాష్ట్ర నిర్వాహకులుగా నియమితులయ్యారు. డీఎంకేతో ఉన్న పరిచయాలను రజనీ పార్టీ సభ్యత్వ నమోదుకు సద్వినియోగం చేసుకుంటున్నారు. -
ఎంపీ కుమారుడి వివాహం చెల్లదు
టీ.నగర్: జమాత్ జరిపించనందున అన్నాడీఎంకే ఎంపీ అన్వర్‌రాజా కుమారుడి వివాహం చెల్లదని, దీనిపై మద్రాసు హైకోర్టులో కేసు దాఖలు చేయనున్నట్లు బాధిత చెన్నై యువతి రొబినా ఆదివారం వెల్లడించారు. చెన్నై మడిపాక్కం రాంనగర్‌కు చెందిన ప్రబల్లా సుభాష్ అలియాస్ రొబినా (36). రేడియో వ్యాఖ్యాత. ఈనెల 23న ఆమె చెన్నై కమిషనర్ కార్యాలయంలో ఓ ఫిర్యాదు చేశారు. అన్నాడీఎంకే రామనాథపురం ఎంపీ అన్వర్‌రాజా కుమారుడు నాజర్అలి తనను వివాహం చేసుకోకుండా మూడేళ్లు సహజీవనం చేశారని తెలిపారు. అతడు పరిశ్రమ ప్రారంభించేందుకు తన నగలు తాకట్టుపెట్టి రూ.30లక్షలు, బంధువుల వద్ద రూ.20 ఇప్పించానని, అయితే తనను వివాహం చేసుకోకుండా మోసగించినట్లు తెలిపారు. ఎంపీ వ్యక్తిగత కార్యదర్శి దేవాతో తనకు హత్యా బెదిరింపులు చేశారని ఆరోపించారు. శివగంగై జిల్లా కారైకుడిలో నాజర్అలి వేరొక యువతిని వివాహం చేసుకోనున్నారని, ఈ వివాహాన్ని అడ్డుకుని ఎంపీ అన్వర్‌రాజా, నాజర్ అలి, దేవాలపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీనికి సంబంధించి రామనాథపురం ఎస్పీకి ఆధారాలతో ఫిర్యాదు చేశారు. ఎస్పీ ఓం ప్రకాష్మీనా దీని గురించి విచారణ జరుపనున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం శివగంగై జిల్లా కారైకుడి చేరుకున్న రోబినా, నాజర్అలికి మరో యువతితో వివాహాన్ని అడ్డుకునేందుకు పోరాడింది. కారైకుడి కళాశాల రోడ్డు మసీదుకు వెళ్లిన ఆమె అక్కడ జమాత్ నిర్వాహకులను కలిసి ఫిర్యాదు చేశారు. నక్షత్ర హోటల్ మ్యారేజ్ హాల్‌కు చేరుకున్న రోబినా వివాహాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం ఆమె సమీపానగల గోడను దూకి లోనికి వెళ్లేందుకు ప్రయత్నించింది. పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఆమె కల్యాణ మండపం ఎదుట బైఠాయించి ఆందోళన జరిపింది. దీనిగురించి ఆమె విలేకరులతో మాట్లాడుతూ అధికారపార్టీ అండతో ఈ వివాహం జరిగిందని, దీనికి కారైకుడి కాలేజీ రోడ్డు మసీదు జమాత్ అంగీకారం లేదని వివరించారు. దీనిపై మద్రాసు హైకోర్టులో కేసు దాఖలు చేస్తానని అన్నారు. ఇలాఉండగా జమాత్ అధ్యక్షుడు మాట్లాడుతూ ఈ వివాహాన్ని తాము జరిపించలేదని వెల్లడించారు. -
రేపు జాతీయ రహదారులు దిగ్బందం
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా విషయం గురించి పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానంపై చర్చకు గత నాలుగు రోజులుగా స్పీకర్ అనుమతించకుండా...కేంద్రంలో మోదీ కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ బుధవారమిక్కడ మండిపడ్డారు. టీఆర్ఎస్ కూడా బీపేపీతో లాలూచీ పడిందని ఆయన ఆరోపించారు. కేసీఆర్‌కు, అన్నాడీఎంకేలకు చిత్తశుద్ధి ఉంటే హోదా విషయంలో ఏపీకి సహకరించాలని సూచించారు. ఏపీ ప్రజలు విశాఖ రైల్వే జోన్ అడుగుతుంటే ..రైల్వే జోన్ ఇవ్వకపోగా, ఉన్న రైళ్లను రద్దు చేస్తారా అని ప్రశ్నించారు. ఏ ప్రాతిపదికన సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌ను రద్దు చేస్తారని రామకృష్ణ మండిపడ్డారు. గురువారం ఉదయం జాతీయ రహదారులను పెద్ద ఎత్తున దిగ్భందం చేస్తామని, అలాగే విజయవాడ కనకదుర్గమ్మ వారధిని కూడా దిగ్బందం చేస్తామన్నారు. ఇందులో అన్ని రాజకీయ పార్టీలు పాల్గొన్నాలని ఆయన విజ్ఞప్తి చేశారు. -
వివాదాల ముసురు..!
దివంగత సీఎం జయలలిత తిరిగిరాని లోకానికి వెళ్లినా, వార్తల్లో వ్యక్తిగానే ఉన్నారు. అన్నాడీఎంకే వర్గాల తీరుతో ఆమె చుట్టూ వివాదాలు ముసురుకుంటున్నాయి. అసెంబ్లీలో కొలువుదీర్చిన అమ్మ ఫొటోపై వాదం చెలరేగింది. కోర్టు కూడా సంచలన వ్యాఖ్యలు చేసిన న్యాయమూర్తులు స్పీకర్ కోర్టులోకి బంతిని నెట్టారు. సాక్షి, చెన్నై : పురట్చితలైవిగా, అమ్మగా తమిళుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న నాయకురాలు జయలలిత. ఆమె మరణం అనంతరం అన్నాడీఎంకేలో జరుగుతున్న పరిణామాలపై ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అన్నాడీఎంకే పాలకుల పుణ్యమా అని తరచూ ఏదో ఒక రూపంలో అమ్మపై చర్చసాగుతూనే ఉంది. తమకు ఉన్న అధికారాలు ఉపయోగించి అసెంబ్లీలో అమ్మ నిలువెత్తు చిత్రపటాన్ని ఏర్పాటు చేసి, వివాదం రగిల్చారు. అసెంబ్లీలో ఆమె విగ్రహ ఏర్పాటుకు అనుమతి ఇవ్వకూడదంటూ కోర్టులో ఓ వైపు పిటిషన్ విచారణలో ఉన్న నేపథ్యంలో, దాన్ని ఉల్లంఘించి తమ పంతాన్ని నెగ్గించుకున్నారు. ఈ చిత్రపటం ఏర్పాటును వ్యతిరేకిస్తూ డీఎంకే ఎమ్మెల్యే అన్భళగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం విచారణ జరిగింది. స్పీకర్ కోర్టులోకి బంతి ప్రధాన న్యాయమూర్తి ఇందిరా బెనర్జీ నేతృత్వంలోని బెంచ్ ముందు సాగిన విచారణలో ఆ చిత్రపటం ఏర్పాటుకు వ్యతిరేకంగా పిటిషనర్ తరపున వాదనలు జోరుగా సాగాయి. ఆ వాదనల్ని పరిగణలోకి తీసుకున్నా, తాము అసెంబ్లీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేమని న్యాయమూర్తి స్పష్టం చేయడం గమనార్హం. ఇలాంటి విషయాల్లో జోక్యం చేసుకోమని, అసెంబ్లీలో స్పీకర్ నిర్వాకం వ్యక్తిగత ఇబ్బందులకు ఎవర్ని అయినా గురి చేస్తే, వాటిని విచారణకు తీసుకుంటామన్నారు. అందుకే 18 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌ను తాము విచారిస్తున్నామని గుర్తు చేశారు. చిత్రపటం అసెంబ్లీలో ఉండాలా..? వద్ద అనేది ప్రజలు తేలుస్తారన్నారు. వచ్చే ఎన్నికల్లో ఇందుకు తగ్గ ఫలితాలు ప్రతిబింబిస్తాయని, అప్పుడు కొత్తగా వచ్చే స్పీకర్ తుది నిర్ణయం తీసుకుంటారని న్యాయమూర్తులు వ్యాఖ్యానించడం గమనార్హం. విగ్రహంపై చర్చ రాయపేటలోని అన్నాడీఎంకే కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన జయలలిత విగ్రహంలో ఆమె ఛాయలు లేవనే మరో చర్చకు తెరతీసింది. దీంతో ఆ పార్టీ ఎంపీ, పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్ తంబిదురై, మంత్రి ఎస్పీ వేలుమణి కూడా అమ్మ విగ్రహంలో మార్పులకు చర్యలు తీసుకోవాలనే డిమాండ్‌ను తెరమీదకు తెచ్చారు. తక్కువ సమయంలో తయారీ కాగా, అమ్మ విగ్రహం తయారు చేసినఆంధ్రప్రదేశ్‌కు చెందిన శిల్పి ప్రసాద్ స్పందించారు. విగ్రహం తయారీకి కొద్దిరోజుల క్రితం ఆర్డర్ ఇచ్చారన్నారు. తక్కువ సమయం కావడంతో సోదరుడు కామధేను ప్రసాద్, సిబ్బందితో రేయింబవళ్లు శ్రమించి, మొదట బంకమట్టితో విగ్రహాన్ని సిద్ధం చేసినప్పుడు ఎలాంటి అనుమానం కలగలేదన్నారు. విగ్రహం తయారయ్యాక పలు కోణాల్లో ఫొటోలు తీసి అన్నాడిఎంకే వర్గాలకు పంపించామన్నారు. వారు కూడా ఆక్షేపణ చెప్పలేదన్నారు. దీంతో తుది మెరుగులు దిద్ది చెన్నైకు తీసుకువచ్చామన్నారు.ఆ విగ్రహంలో అమ్మ ఛాయలు లేవనే విమర్శలు వస్తున్నందున తామే సరిదిద్దుతామన్నారు. ఇప్పటికి ఎన్నో విగ్రహాలు తయారు చేసినా, పొరబాట్లు జరగలేదన్నారు. ఈ విగ్రహాన్ని సొంత ఖర్చుతో మార్పు చేస్తామని స్పష్టం చేశారు. నన్ను అకారణంగా తొలగించారు ఆ తరువాత అన్నాడీఎంకే నుంచి తనను తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ అన్నాకార్మిక సంఘం నేత చిన్నస్వామి దాఖలు చేసుకున్న పిటిషన్‌ను కోర్టు విచారించింది. ఇది వ్యక్తిగతం కావడంతో విచారణకు స్వీకరిస్తూ, వివరణ ఇవ్వాలని అన్నాడీఎంకే సమన్వయ కమిటీ అధ్యక్షుడు ఓ పన్నీరు సెల్వం, ఉపాధ్యక్షుడు పళని స్వామి, ప్రిసీడియం చైర్మన్ మధుసూదనన్‌కు కోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ మార్చి రెండో తేదీకి వాయిదా వేశారు. -
24న అమ్మ విగ్రహం ఆవిష్కరణ
-
అమ్మకు విగ్రహం
సాక్షి, చెన్నై : దివంగత సీఎం అమ్మ జయలలితకు నిలువెత్తు విగ్రహం అన్నాడీఎంకే నేతృత్వంలో చెన్నై రాయపేటలో ఏర్పాటు కానుంది. పార్టీ ప్రధాన కార్యాలయ ఆవరణలో దివంగత నేత ఎంజీఆర్ విగ్రహం పక్కనే అమ్మ విగ్రహం ఏర్పాటు పనులకు గురువారం శ్రీకారం చుట్టారు. పురట్చి తలైవీగా అన్నాడీఎంకే వర్గాల అమ్మగా తమిళుల హృదయాల్లో సుస్తిర స్థానం సంపాదించుకున్న జయలలిత అందర్నీ వీడి అనంత లోకాలకు వెళ్లి ఏడాది దాటింది. అమ్మ మరణంతో అన్నాడీఎంకే ముక్కలైనా, అమ్మ పాలన మాత్రం రాష్ట్రంలో సాగుతూ వస్తున్నది. అమ్మ నివాసాన్ని స్మారక మందిరంగా, అమ్మ సమాధి పరిసరాల్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు తగ్గ పనులకు పాలకులు శ్రీకారం చుట్టారు. అయితే, అమ్మకు పార్టీ తరఫున ఇంత వరకు ఎలాంటి విగ్రహం ఏర్పాటు కాలేదు. కోయంబత్తూరులో ఇటీవల మంత్రి ఎస్పీ వేలుమణి తన పలుకుబడి చాటే దిశలో దివంగత నేతలు అన్నా, ఎంజీఆర్ విగ్రహాల వరసలో అమ్మ నిలువెత్తు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అదే సమయంలో రాష్ట్ర పార్టీ కార్యాలయ ఆవరణలో అమ్మకు విగ్రహం ఏర్పాటు చేయాలని కేడర్ నినదించారు. వారి కళను సాకారం చేసే విధంగా ఈ ఏడాది ప్రధాన కార్యాలయంలో అమ్మ విగ్రహం ప్రతిష్టించేందుకు చర్యలు తీసుకున్నారు. జయకు విగ్రహం : రాయపేటలోని అవ్వై షణ్ముగం సాలైలో అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయం ఉంది. నిత్యం కేడర్ రాకపోకలతో ఇక్కడ వాతావరణం సందడిగానే ఉంటుంది. ఇక్కడ పార్టీ జెండా స్తూపం, ఆ పక్కనే దివంగత నేత ఎంజీఆర్ నిలువెత్తు విగ్రహం ఉంది. ఇక్కడే అమ్మకు సైతం విగ్రహం ఏర్పాటుకు అన్నాడీఎంకే సమన్వయ కమిటీ నిర్ణయ తీసుకుంది. ఇందుకు తగ్గ పనులకు ఉదయాన్నే శ్రీకారం చుట్టారు. ఎంజీఆర్ విగ్రహానికి పక్కనే ఉన్న జెండా స్తూపాన్ని తొలగించారు. అక్కడ అమ్మ విగ్రహం ప్రతిష్టకు తగ్గ గోతిని తవ్వారు. ఇక్కడ అమ్మ నిలువెత్తు విగ్రహాన్ని కొలువు దీర్చేందుకు పనుల వేగం పెంచారు. నిర్మాణ పనుల్లో ఎంజీఆర్ విగ్రహానికి ఎలాంటి ముప్పు వాటిళ్లకుండా దానిని భద్ర పరిచారు. అలాగే, విగ్రహ ప్రతిష్ట జరగనున్న ప్రాంతం చుట్టూ కంచెను ఏర్పాటు చేసి ఉన్నారు. ఈ పనులు పది రోజుల్లో ముగించేందుకు నిర్ణయించారు. ఈనెల 24వ తేదీన అమ్మ జయలలిత జయంతి కావడంతో, ఆరోజున అశేషాభిమాన అన్నాడీఎంకే కేడర్ సమక్షంలో విగ్రహాన్ని ఆ పార్టీ సమన్వయ కమిటీ అధ్యక్షుడు పన్నీరుసెల్వం, ఉపాధ్యక్షుడు పళని స్వామి ఆవిష్కరించనున్నారు. రాష్ట్ర పార్టీ కార్యాలయం ఆవరణలో అమ్మకు నిలువెత్తు విగ్రహం ఏర్పాటు కానుండడంతో కేడర్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
గెలుపెవరిదో?
ఆర్కేనగర్ రేసులో గెలుపు గుర్రంగా నిలబడబోతోంది ఎవరో అని ఉత్కంఠ నెలకొంది. గెలుపు ధీమా ప్రధానంగా ముగ్గురు అభ్యర్థుల్లో ఉన్నా, ఓటరు తీర్పు ఎలా ఉండబోతుందో అనేది మరి కొన్ని గంటల్లో తేలనుంది. ఓట్ల లెక్కింపునకు ఎన్నికల యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. సాక్షి, చెన్నై: రాష్ట్ర రాజకీయాల్లో మార్పులకు ఆర్కేనగర్ ఉప ఎన్నిక రెఫరెండంగా మారింది. ఈ గెలుపుతో తాము బలహీనపడలేదని చాటుకునేందుకు అన్నాడీఎంకే తీవ్ర వ్యూహాల్నే అమలు చేసింది. అదే గెలుపు తన వశం చేసుకుని సత్తా చాటు కోవడమే లక్ష్యంగా అన్నాడీఎంకే అమ్మ శిబిరం కుస్తీలు పట్టింది. పాలకుల మీద ప్రజలు తీవ్ర ఆక్రోశంతో ఉన్నారని చాటే రీతిలో, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా, అధికారం తమదేనని నిరూపించుకునేందుకు ఈ ఎన్నికల్ని డీఎంకే తీవ్రంగానే పరిగణలోకి తీసుకుంది. ఎన్నికల రేసులో చాంతాడంత క్యూ ఉన్నా, గెలుపు ఓటములు మాత్రం డీఎంకే, అన్నాడీఎంకే, అన్నాడీఎంకే అమ్మ శిబిరాల మధ్య ఉందని చెప్పవచ్చు. 21వ తేదీ జరిగిన ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటుతో తీర్పును ఈవీఎంలలో భద్రతపరిచారు. ఓటింగ్ శాతం మేరకు డీఎంకే అభ్యర్థి మరుదు గణేషన్, అన్నాడీఎంకే అభ్యర్థి మధుసూదనన్, అన్నాడీఎంకే అమ్మ అభ్యర్థి దినకరన్ మధ్య గెలుపు ధీమా ఉన్నా, ఓటరు నాడి ఎలా ఉంటుందో అనే ఉత్కంఠ తప్పడం లేదు. మరి కొన్ని గంటల్లో ఈవీఎంలలోని ఫలితాలు బయటకు రానుండడంతో ఆర్కేనగర్ రేసులో గెలుపు గుర్రంగా నిలబడబోతున్నదెవరోనన్న ఎదురుచూపులు పెరిగాయి. ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు ఓటింగ్‌కు ఉపయోగించిన ఈవీఎంలు అన్నీ థౌజండ్ లైట్స్‌లోని క్వీన్ మేరిస్ కళాశాలలోని స్ట్రాంగ్ రూంలో భద్ర పరిచారు. ఈ పరిసరాల్లో ఐదు అంచెల భద్రతను కల్పించారు. ఆదివారం ఉదయాన్నే ఓట్ల లెక్కింపు ప్రక్రియకు అక్కడే అన్ని ఏర్పాట్లు చేశారు. అభ్యర్థులు, వారి ఏజెంట్లు ఉదయం ఏడు గంటల్లోపు అక్కడికి చేరుకునే విధంగా ఆదేశాలు ఇచ్చారు. పాస్‌లన్నీ ఇప్పటికే అందించారు. కౌంటింగ్ కేంద్రం, పరిసరాల్లో కట్టుదిట్టమైన ఆంక్షలు విధించి, భద్రత కల్పించారు. ఎప్పటికప్పుడు ఫలితాల్ని అందించే విధంగా ప్రత్యేక ఏర్పాట్లు జరిగాయి. వెబ్ టెలికాస్టింగ్ పద్ధతి ద్వారా ఢిల్లీ, చెన్నై కార్పొరేషన్‌లోని కంట్రోల్ రూమ్‌ల నుంచి లెక్కింపు, ఫలితాల సరళిని ఎన్నికల అధికారులు పర్యవేక్షించే విధంగా చర్యలు తీసుకున్నారు. పూర్తిగా వీడియో చిత్రీకరణకు ఏర్పాట్లు చేశారు. 19 రౌండ్లుగా లెక్కింపు ఓట్ల లెక్కింపు 19 రౌండ్లుగా సాగనుంది. ఒక్కో రౌండ్‌కు 14 పోలింగ్ బూత్‌ల ఓట్ల లెక్కింపు సాగుతుంది. చివరి రౌండ్లో మాత్రం ఆరు పోలింగ్ బూత్‌లలో లెక్కింపు జరగనున్నట్టు చెన్నై జిల్లా ఎన్నికల అధికారి, కార్పొరేషన్ కమిషన్ కార్తికేయన్ తెలిపారు. కౌంటింగ్ విధులకు హాజరు కానున్న 200 మంది సిబ్బందికి శనివారం కార్తీకేయన్, ఎన్నికల అధికారి ప్రవీణ్ నాయర్ శిక్షణ ఇచ్చారు. కౌంటింగ్ సరళి, ఏజెంట్లకు సమాచారాలు, అధికారులకు సమాచారాలు, రిటర్నింగ్ అధికారికి వివరాలు, ఇలా అన్ని రకాల అంశాలతో ఈ శిక్షణ సాగింది.