అశ్వత్థం తిరునాళ్లు ప్రారంభం
పెద్దపప్పూరు (తాడిపత్రి రూరల్) : ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన అశ్వత్థం తిరునాళ్లు ఆదివారం ప్రారంభమయ్యాయి. మాఘమాసం పురస్కరించుకొని అశ్వత్థ నారాయణస్వామి, చక్ర భీమలింగేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరునాళ్లుకు జిల్లా నుంచే కాకుండా వైఎస్సార్, కర్నూల్ జిల్లాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు.
ఆలయ ఆవరణలో ఉన్న కోనేటిలో భక్తులు స్నానాలాచరించి, తలనీలాలు సమర్పించారు. భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడిపింది. భక్తుల సౌకర్యాలపై ఆలయ కమిటీ చైర్మన్ నాగిరెడ్డి, కార్యనిర్వహణాధికారి చంద్రమౌళి పర్యవేక్షించారు.