సర్టిఫికెట్ ఇవ్వకుండా యువకుడిపై దాడి
హైదరాబాద్: సర్టిఫికెట్ కోసమని ఎమ్మార్వో ఆఫీసుకు వచ్చిన యువకుడిపై చేయిచేసుకోవడంతో నగరంలోని బాలానగర్ ఎమ్మార్వో ఆఫీసు వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. కుల ధ్రువీకరణ పత్రం కోసం శుక్రవారం ఎమ్మార్వో ఆఫీసుకు వచ్చిన ఓ యువకుడిపై కార్యాలయ సిబ్బంది దాడిచేసి, కొట్టారు. ఘటనకు సంబంధించి పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.