పదెకరాలకు ఏడాది అద్దె రూ.30!
బౌరింగ్‌క్లబ్ కాంట్రాక్టును రద్దు చేయండి
ఈ అవినీతిలో బీబీఎంపీ అధికారుల హస్తం
బీజేపీ బీబీఎంపీ సభ్యుడు పద్మనాభరెడ్డి
బనశంకరి: నగర నడిబొడ్డును ఉన్న పది ఎకరాల స్థలాన్ని బీబీఎంపీ కేవలం ఏడాదికి రూ. 30లకు అద్దెకు ఇచ్చింది. బౌరింగ్ ఇన్సిటిట్యూట్ క్లబ్ కు ఇచ్చిన ఈ కంటాక్ట్ను రద్దు చేయాలని బీజేపీ నేత, బీబీఎంపీ సభ్యుడు పద్మనాభరెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయనిక్కడ మీడియాతో మాట్లాడుతూ.. ‘1956 అప్పటి సిటీ కార్పొరేషన్ ఈ క్లబ్‌ను యే డాదికి రూ.30 కాంట్రాక్టుకు ఇవ్వడం చట్టవిరుద్ధం, ప్రజావ్యతిరేకం. కార్పొరేషన్ మొ త్తం 99 ఏళ్లకు కాంట్రాక్టు ఇచ్చింది. దీనిని కౌన్సిల్ సభ్యుడు దయానంద్ వ్యతిరేకిస్తూ 10 ఏళ్లకే ఆ కంట్రాక్టు ఇవ్వాలని కౌన్సిల్ వాదించాడు.
ఆయన నిర్ణయాన్ని ఏకీభవిస్తూ నా లుగు ఓట్లు, వ్యతిరేకిస్తూ 19 ఓట్లు పడ్డాయి. ప్రభుత్వం కూడా కౌన్సిల్ నిర్ణయానికి ఒప్పుకొని 99 ఏళ్లకు కాంట్రాక్ట్ ఇచ్చింది. బౌరింగ్ ఇన్సిటిట్యూట్ క్లబ్‌పై పూర్తి విచారణ చేపట్టాలి. అలాగే ఆ స్థలాన్ని బీబీఎంపీ స్వాధీనం చేసుకోవాలి. బౌరింగ్‌క్లబ్ పాలకమండలి నిబంధనలు ఉల్లంఘించి పెట్రోల్ బంక్, హాప్‌కామ్, డిపార్టుమెంటల్స్టోర్, కేక్శాప్, పిష్కౌంటర్, క్యాంటిన్, సెలూన్ దుకాణాలకు అద్దెకు ఇచ్చింది. అద్దె రూపంలో లక్షలాది రూపాయలను వసూలు చేస్తోంది. ప్రతి నెలా పెట్రోల్ బంక్ నుంచి రూ. లక్షను అద్దెగా తీసుకుం టోంది. నాలుగేళ్లు క్రితం డిసెంబరు 17 బౌరింగ్‌క్లబ్ పెట్రోల్ బంక్ అద్దెలో 50 శాతం ప్రభుత్వానికి చెల్లించలేదు. కంట్రాక్టు ప్రకారం జెడ్ ప్రదేశాల్లో కట్టడాలు నిర్మించరాదంటూ ఈ కంట్రాక్టుకు ఎందుకు రద్దు చేయకూడదని అని నోటీసులు పంపినా రెవెన్యూ శాఖ చర్యలు చేపట్టలేదు. బౌరింగ్క్లబ్లో అన్ని నిబంధనలు ఉల్లంఘించి పలు కట్టడాలు నిర్మించారు. ఈ అక్రమాల్లో బీబీ ఎంపీ అధికారుల పాత్ర కూడా ఉంది. రూ. ఐదు కోట్ల విలువ చేసే బీబీఎంపీ ఆస్తిని కేవలం శ్రీమంతుల ఆనందం కోసం కంట్రాక్ట్‌కు ఇవ్వడం సరికాదు. ఆ కంట్రాక్టును రద్దు చేసి ప్రజల ఉపయోగాల కోసం వినియోగించాలి. ఈ విషయంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తక్షణం జోక్యం చేసుకోవాలి...* అని డిమాండ్ చేశారు.
తక్కువ అద్దె ఉండవచ్చు: మేయర్
బీబీఎంపీ సభ్యుడు పద్మనాభరెడ్డి ఆరోపణలపై మేయర్ శాంతకుమారిని ఫోన్లో వివరణ కోరగా ఆమె మాట్లాడుతూ ...‘ ప్రస్తుతం నా వద్ద ప్రాథమిక సమాచారం మేరకు బౌరింగ్ క్లబ్‌కు అద్దె చాలా తక్కువగా ఉన్నట్లు చెప్పగలను. అయితే స్పష్టమైన సమాచారంతో శనివారం ఇందుకు సమాధానం ఇస్తాను.’ అని తెలిపారు.