బెల్జియం మహిళపై లైంగిక వేధింపులు
న్యూఢిల్లీ: తూర్పు ఢిల్లీలోని సీఆర్ పార్కు ప్రాంతంలో ఓ బెల్జియం మహిళ(23)పై ఓలా క్యాబ్ డ్రైవర్ శనివారం రాత్రి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. పోలీసులు కొద్దిగంటల్లోనే నిందితుడిని అరెస్టు చేశారు. అనువాదకురాలిగా పనిచేసే ఆ మహిళ గుర్గావ్ నుంచి క్యాబ్‌లో ప్రయాణిస్తోంది. రాజస్తాన్‌కు చెందిన రాజ్‌సింగ్ క్యాబ్ డ్రైవర్. ప్రయాణంలో ముందు సీటులోకి ఆమెను రప్పించాడు.
క్యాబ్‌ను పక్కదారి పట్టించి వేరే ప్రాంతానికి తీసుకువెళ్లాడు. ఆమె ఫోన్లో క్యాబ్‌కు సంబంధించిన వివరాలన్నింటిని తొలగించాడు. ఆ సమయంలో క్యాబ్‌లోని జీపీఎస్ పనిచేయడంలేదు. ఇదే అదనుగా ఆమెను బలవంతంగా ముద్దు పెట్టుకుని, లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదుపై పోలీసులు డ్రైవర్‌ను అరెస్టు చేశారు.