blackbuck and chinkara poaching cases
-
సల్మాన్ ఖాన్ కోసం..
ముంబై : కృష్ణ జింకలను వేటాడిన కేసులో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌కు ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ జోధ్‌పూర్ ట్రయల్ కోర్టు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. జంతు ప్రేమికులు ఈ తీర్పును స్వాగతించగా.. సల్మాన్ స్నేహితులు, అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో సల్మాన్ కోసం ఆయన స్నేహితుడు, బాలీవుడ్ దర్శక నిర్మాత సాజిద్ నడియావాలా తన కార్యక్రమాలన్నీ రద్దు చేసుకున్నారు. తీర్పు వినగానే స్నేహితుడిని కలిసేందుకు జైపూర్ బయల్దేరారు. ప్రస్తుతం బాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూ వారం రోజుల్లోనే రూ. 100 కోట్ల క్లబ్లో చేరిన బాఘీ 2 సక్సెస్ మీట్ కోసం భారీ ఏర్పాట్లు చేసుకున్న చిత్ర నిర్మాత సాజిద్ మిత్రుడి కోసం కార్యక్రమాన్ని రద్దు చేసుకుని స్నేహ బంధాన్ని చాటారు. సల్మాన్ ఖాన్ హీరోగా జుడ్వా, ముజ్ సే షాదీ కరోగీ వంటి విజయవంతమైన చిత్రాలు నిర్మించిన సాజిద్.. సల్మాన్ ఖాన్ ‘కిక్’ సినిమాతోనే దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం బాఘీ 2 విజయాన్ని ఆస్వాదిస్తున్న సాజిద్ త్వరలోనే ‘కిక్’ సీక్వెల్ ‘కిక్ 2 ’ తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. -
సల్మాన్ ఖాన్‌ను వీడని కష్టాలు...
న్యూఢిల్లీ : బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్‌కు కృష్ణ జింక కష్టాలు వీడేలా కనిపించడం లేదు. కృష్ణజింకను వేటాడిన కేసులో సల్మాన్‌పై రాజస్తాన్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ ఏడాది జూలై 25న ఆ రాష్ట్ర హైకోర్టు సల్మాన్ నిర్ధోషి అంటూ తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. కాగా 1998లో జోధ్‌పూర్‌కు సమీపంలోని భావద్, మథానియా ప్రాంతాల్లో ఓ కృష్ణజింకను, ఓ మామూలు జింకను వేటాడి చంపినట్టు సల్మాన్ తోపాటు మరో ఏడుగురిపై కేసులు నమోదయ్యాయి. సల్మాన్‌పై వన్యప్రాణి సంరక్షణ చట్టం సెక్షన్ 51 ప్రకారం ఈ కేసులు నమోదు చేశారు. ట్రయల్ కోర్టు సల్మాన్‌ను దోషిగా నిర్ధారించి.. ఒక కేసులో ఏడాది జైలు శిక్ష, మరో కేసులో ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. దీనిపై సల్మాన్ సెషన్స్ కోర్టులో అప్పీలు చేసుకున్నారు. మిథానియా కేసులో సల్మాన్ అప్పీలును తిరస్కరించిన కోర్టు.. భావద్ కేసును హైకోర్టుకు బదిలీ చేసింది. సరైన సాక్షాలు లేవని సల్మాన్‌ను హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. అయితే ఆ కేసులో తమకు పలు అనుమానాలు ఉన్నాయంటూ, హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రాజస్థాన్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. -
ఆ జింకలను ఎవరు చంపారు?
సల్మాన్ ను నిర్దోషిగా ప్రకటించిన హైకోర్టు సినిమా షూటింగ్ లో పాల్గొంటూ సరదా కోసం రక్షిత వన్యప్రాణులైన కృష్ణజింకలను వెటాడారన్న కేసులో సల్మాన్ ఖాన్ కు ఊరట లభించింది. రాజస్థాన్ హైకోర్టు సల్మాన్ కు ఈ కేసు నుంచి విముక్తి ప్రసాదించింది. ఈ నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించిన కొన్ని కీలక విషయాలు.. 1998 సంవత్సరంలో రాజస్థాన్ లోని జోథ్ పూర్ లో 'హమ్ సాథ్ సాథ్ హై' సినిమా షూటింగ్ జరిగింది. ఆ సమయంలో ఆ సినిమా నటులైన సల్మాన్ ఖాన్, సోనాలి బింద్రె, టబు, నీలమ్ తదితరులు సరదా కోసం వేటకు వెళ్లారని, రక్షిత వన్యప్రాణులైన జింకలను వేటాడారని అప్పట్లో కేసు నమోదైంది. జోథ్ పూర్ శివార్లలోని భవాద్ అటవీ ప్రాంతంలో 1998 సెప్టెంబర్ 26న ఓ జింక, సెప్టెంబర్ 28న ఘోడా ఫార్మ్ హౌస్ లో మరో జింక హత్యకు గురయ్యాయి. ఈ జింకలను వేటాడి చంపిన కేసులో 2006లో జోథ్ పూర్ ట్రయల్ కోర్టు సల్మాన్‌ఖాన్‌కు ఐదేళ్లు శిక్ష విధించింది. ఈ శిక్షను సవాల్ చేస్తూ సల్మాన్ రాజస్థాన్ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు శిక్షపై స్టే విధించింది. అనంతరం సుదీర్ఘకాలం వాదనల అనంతరం సల్మాన్ ను నిర్దోషిగా ప్రకటిస్తూ తాజాగా హైకోర్టు తీర్పునిచ్చింది. జింకలను వెటాడిన కేసులో సల్మాన్ ను నిర్దోషిగా ప్రకటించడంపై స్థానిక బిష్ణోయ్ వర్గం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని ఆ వర్గం తెలిపింది. మరోవైపు రాజస్థాన్ ప్రభుత్వం కూడా ఈ తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని భావిస్తోంది. న్యాయవ్యవస్థ ఎంత నెమ్మదిగా పనిచేస్తోందో సెలబ్రిటీ కేసులే మనకు చెప్తాయి. సల్మాన్ ఖాన్ నిర్దోషి అని చెప్పడానికి కోర్టుకు 20 ఏళ్లు పట్టడం నిజంగా భయం కలిగిస్తున్నది- రాంగోపాల్ వర్మ ట్విట్టర్ లో.. Only celebrity cases make us realise how dead slow judiciary works .it's scary it took 20yrs for court to decide Salman khan is not guilty — Ram Gopal Varma (@RGVzoomin) July 25, 2016 సల్మాన్ ఖాన్ కు కేసులు కొత్త కాదు. 'హిట్ అండ్ రన్' కేసులోనూ ఆయన విచారణ ఎదుర్కొన్నారు. మద్యం తాగి వాహనం నడిపి ఓ వ్యక్తి మృతికి, నలుగురు గాయపడటానికి కారణమైనట్టు అభియోగాలు ఎదుర్కొన్న ఈ కేసులో ముంబై హైకోర్టు ఆయనను గత ఏడాది డిసెంబర్ లో నిర్దోషిగా ప్రకటించింది. 13 ఏళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం ఈ కేసులో సల్మాన్ కు ఊరట లభించింది. అయితే, హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీలు చేయడంతో ఈ కేసు ఇంకా సల్మాన్ ను వెంటాడుతూనే ఉంది. 'సుల్తాన్' సినిమాతో బాక్సాఫీసు రికార్డు బద్దలు కొట్టిన సల్మాన్.. ఈ సినిమా ప్రమోషన్ సమయంలో వివాదాస్పద 'రేప్' వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ సమయంలో తన పరిస్థితి అత్యాచారానికి గురైన మహిళలా ఉండేదని ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. -
సల్మాన్ ఖాన్ కు మరో భారీ ఊరట!
-
సల్మాన్ ఖాన్ కు మరో భారీ ఊరట!
జోథ్ పూర్: బాలీవుడ్ కథనాయకుడు సల్మాన్ ఖాన్ కు భారీ ఊరట లభించింది. కృష్ణజింకలను వేటాడిన రెండు వేర్వేరు కేసులలో ఆయనను నిర్దోషిగా ప్రకటిస్తూ రాజస్థాన్ హైకోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. 1998లో జోథ్ పూర్ లో రెండు వేర్వేరు ఘటనల్లో రక్షిత వన్యప్రాణులైన ఓ కృష్ణజింకను, ఓ మామూలు జింకను వేటాడి చంపినట్టు సల్మాన్ తోపాటు మరో ఏడుగురిపై కేసులు నమోదయ్యాయి. ఈ కేసులలో జోథ్ పూర్ కోర్టు సల్మాన్ కు ఐదేళ్ల జైలుశిక్ష విధించగా.. ఈ ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేసింది. ఈ కేసులో వాదనలు గత మే నెలలో ముగిశాయి. దీంతో తీర్పును రిజర్వ్ చేసిన హైకోర్టు సోమవారం తుది ఉత్తర్వులు వెలువరించింది.