border gavaskar trophy
-
‘వదినమ్మ వచ్చేసింది’.. పెర్త్ స్టేడియంలో అనుష్క రియాక్షన్స్ వైరల్
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి గత కొన్ని రోజులుగా ఫామ్‌లేమితో సతమతమవుతున్నాడు. ముఖ్యంగా టెస్టుల్లో స్థాయికి తగ్గట్లు రాణించలేక విమర్శలు మూటగట్టుకుంటున్నాడు. ఇటీవల స్వదేశంలో బంగ్లాదేశ్, న్యూజిలాండ్‌తో టెస్టుల్లో నిరాశపరిచిన కోహ్లి.. తనకు ఘనమైన రికార్డు ఉన్న ఆస్ట్రేలియా గడ్డ మీద కూడా శుభారంభం అందుకోలేకపోయాడు.పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో శుక్రవారం మొదలైన టెస్టులో కోహ్లి విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో పన్నెండు బంతులు ఎదుర్కొని కేవలం ఐదు పరుగులే చేశాడు. ఆసీస్ పేసర్ జోష్ హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో ఉస్మాన్ ఖవాజాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అయితే, కోహ్లి జాగ్రత్త పడి ఉంటే.. వికెట్ పడకుండా ఉండేదే!ఈ నేపథ్యంలో మరోసారి కోహ్లి ఆట తీరుపై విమర్శలు వస్తున్నాయి. కొంతమందైతే అతడి కుటుంబాన్ని కూడా ఇందులోకి లాగుతూ.. సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నారు. ‘‘ఎప్పుడెప్పుడు మ్యాచ్ ముగుస్తుందా.. ఎప్పుడెప్పుడు లండన్ ఫ్లైట్ ఎక్కేద్దామా! అని చూడటం తప్ప.. జట్టు కోసం నేనేం చేస్తున్నాన్న ఆలోచనే లేదు’’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు.కాగా కోహ్లి భార్య, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ తమ రెండో సంతానానికి లండన్‌లో జన్మనిచ్చిన విషయం తెలిసిందే. కుమారుడు అకాయ్ పుట్టిన తర్వాత విరుష్క జోడీ ఎక్కువగా అక్కడే గడుపుతోంది. ముఖ్యంగా అనుష్క ఏవైనా ప్రమోషన్లు ఉంటే మాత్రమే ఇండియాకు వస్తోంది.మరోవైపు.. కోహ్లి సైతం ఇండియాలో మ్యాచ్ పూర్తవగానే లండన్ వెళ్లిపోతున్నాడు. అయితే, ఆస్ట్రేలియా పర్యటనకు మాత్రం కోహ్లి కుటుంబ సమేతంగా వచ్చినట్లు తెలుస్తోంది. తమ పిల్లలు వామిక, అకాయ్‌లను కూడా వెంట తీసుకు వచ్చినట్లు సమాచారం. ఇక పెర్త్ స్టేడియంలో అనుష్క టీమిండియాను ఉత్సాహపరుస్తూ కనిపించింది. ముఖ్యంగా శనివారం నాటి రెండో రోజు ఆటలో ఆసీస్ ఆలౌట్ కాగానే ఆమె ఇచ్చిన రియాక్షన్ అభిమానులకు ఫిదా చేస్తోంది.‘‘వదినమ్మ వచ్చేసింది.. కోహ్లి భాయ్ నువ్వు సెంచరీ చేయడమే మిగిలి ఉంది’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కనీసం రెండో ఇన్నింగ్స్‌లోనైనా బ్యాట్ ఝులిపిస్తే చూడాలని ఉందని ఫ్యాన్స్ రన్‌మెషీన్‌కు సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేస్తున్నారు.కాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా తొలి టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకు ఆలౌట్ అయింది. ఆసీస్‌ను 104 పరుగులకే కట్టడి చేసి.. మొదటి ఇన్నింగ్స్‌లో 46 పరుగుల ఆధిక్యం సంపాదించింది. Anushka Sharma Reaction, After Australia's last wicket😍#ViratKohli | #AnushkaSharma pic.twitter.com/AItKHrFfpB— 𝙒𝙧𝙤𝙜𝙣🥂 (@wrognxvirat) November 23, 2024 -
నిప్పులు చెరిగిన బుమ్రా.. అరుదైన రికార్డుతో దిగ్గజ కెప్టెన్ల సరసన!
టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా అరుదైన ఘనత సాధించాడు. టెస్టుల్లో ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన కెప్టెన్ల జాబితాలో చోటు సంపాదించాడు. అదే విధంగా.. భారత దిగ్గజ పేసర్ జహీర్ ఖాన్, ఇషాంత్ శర్మల రికార్డును సమం చేశాడు. అసలు విషయం ఏమిటంటే!..బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు టీమిండియా ఆస్ట్రేలియాకు వెళ్లింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య శుక్రవారం తొలి టెస్టు మొదలైంది. అయితే, భారత జట్టు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ వ్యక్తిగత కారణాల వల్ల దూరం కాగా.. పేస్ దళ నాయకుడు బుమ్రా పగ్గాలు చేపట్టాడు. ఇక పెర్త్ వేదికగా మొదటి టెస్టులో టాస్ గెలిచిన బుమ్రా.. తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు.టీమిండియా 150 పరుగులకు ఆలౌట్‌ఈ క్రమంలో టీమిండియా 150 పరుగులకు ఆలౌట్ అయి తమ తొలి ఇన్నింగ్స్ ముగించింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్.. మొదటి రోజు ఆట పూర్తయ్యేసరికి ఏడు వికెట్ల నష్టానికి 67 పరుగులు చేసింది. శుక్రవారం బుమ్రా నాలుగు వికెట్లు దక్కించుకోగా.. మహ్మద్ సిరాజ్ రెండు, హర్షిత్ రాణా ఒక వికెట్ తీశారు.రెండో రోజు ఆరంభంలోనే బుమ్రా ఇలాఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా శనివారం నాటి రెండో రోజు ఆట మొదలుపెట్టిన కాసేపటికే వికెట్ కోల్పోయింది. ప్రమాదకారిగా మారే అవకాశం ఉన్న ఆసీస్ వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ(21)ని అవుట్ చేసి బుమ్రా బ్రేక్ ఇచ్చాడు. అంతేకాదు.. పెర్త్ టెస్టులో తన ఖాతాలో ఐదో వికెట్ జమచేసుకున్నాడు. ఓవరాల్‌గా బుమ్రాకు ఇది టెస్టుల్లో పదకొండో ఫైవ్ వికెట్ హాల్ కాగా.. సారథిగా మొదటిది.ఈ క్రమంలో టెస్టుల్లో ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన టీమిండియా కెప్టెన్ల సరసన బుమ్రా చేరాడు. అతడి కంటే ముందు.. వినోద్ మన్కడ్, బిషన్ బేడి, కపిల్ దేవ్, అనిల్ కుంబ్లే ఈ ఘనత సాధించారు. ఇదిలా ఉంటే.. టెస్టుల్లో టీమిండియా తరఫున అత్యధికసార్లు ఫైవ్ వికెట్ హాల్ సాధించిన బౌలర్ల జాబితాలో జహీర్ ఖాన్, ఇషాంత్ శర్మలను బుమ్రా వెనక్కినెట్టడం మరో విశేషం.టెస్టుల్లో టీమిండియా తరఫున ఐదు వికెట్ల ప్రదర్శన(ఒకే ఇన్నింగ్స్) నమోదు చేసిన టీమిండియా కెప్టెన్లు1. వినోద్ మన్కడ్(1)2. బిషన్ బేడి(8)3. కపిల్ దేవ్(4)4. అనిల్ కుంబ్లే(2)5. జస్ప్రీత్ బుమ్రా(1)టెస్టుల్లో అత్యధికసార్లు ఫైవ్ వికెట్ హాల్ సాధించిన భారత బౌలర్లు1. రవిచంద్రన్ అశ్విన్ - 37 (105 మ్యాచ్‌లు) 2. అనిల్ కుంబ్లే - 35 (132 మ్యాచ్‌లు) 3. హర్భజన్ సింగ్ - 25 (103 మ్యాచ్‌లు) 4. కపిల్ దేవ్ - 23 (131 మ్యాచ్‌లు) 5. బీఎస్ చంద్రశేఖర్ - 16 (58 మ్యాచ్‌లు) 6. రవీంద్ర జడేజా - 15 (77 మ్యాచ్‌లు) 7. బిషన్ సింగ్ బేడీ - 14 (67 మ్యాచ్‌లు) 8. సుభాశ్ చంద్ర పండరీనాథ్ గుప్తే - 12 (36 మ్యాచ్‌లు) 9. జస్ప్రీత్ బుమ్రా - 11 (41 మ్యాచ్‌లు) 10. జహీర్ ఖాన్ - 11 (92 మ్యాచ్‌లు) 11. ఇషాంత్ శర్మ - 11 (105 మ్యాచ్‌లు)ఇదిలా ఉంటే.. ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 104 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో టీమిండియాకు తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగుల ఆధిక్యం లభించింది. భారత పేసర్లలో బుమ్రా ఐదు, రాణా మూడు, సిరాజ్ రెండు వికెట్లు దక్కించుకున్నారు.చదవండి: హర్షిత్.. నీ కంటే నేను ఫాస్ట్‌గా బౌల్ చేయగలను: స్టార్క్ వార్నింగ్.. రాణా రియాక్షన్ వైరల్Make that FIVE! There's the first five-wicket haul of the series #MilestoneMoment #AUSvIND @nrmainsurance pic.twitter.com/t4KIdyMTLI— cricket.com.au (@cricketcomau) November 23, 2024 -
హర్షిత్.. నీ కంటే నేను ఫాస్ట్‌గా బౌల్ చేస్తా: స్టార్క్ వార్నింగ్.. రాణా రియాక్షన్ వైరల్
ఆస్ట్రేలియా- టీమిండియా మధ్య తొలి టెస్టు.. రెండో రోజు ఆట సందర్భంగా ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఆసీస్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్.. భారత యువ ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణాకు ‘స్వీట్ వార్నింగ్’ ఇచ్చాడు. అయితే, ఇందుకు హర్షిత్ స్పందించిన తీరు నెట్టింట వైరల్‌గా మారింది.బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆసీస్- భారత్ మధ్య ఐదు టెస్టులు జరుగనున్నాయి. ఇందులో భాగంగా పెర్త్ వేదికగా ఇరుజట్ల మధ్య శుక్రవారం మొదటి టెస్టు ఆరంభమైంది. ఇక ఈ మ్యాచ్‌కు వ్యక్తిగత కారణాల దృష్ట్యా రోహిత్ శర్మ దూరం కాగా.. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా భారత జట్టుకు సారథ్యం వహిస్తున్నాడు.ఇక పెర్త్‌లో టాస్ గెలిచిన బుమ్రా తొలుత బ్యాటింగ్ ఎంచుకోగా.. టీమిండియా తమ తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ఆతిథ్య ఆసీస్ సైతం తొలి రోజే బ్యాటింగ్‌కు దిగింది. ఈ క్రమంలో ఆది నుంచే ఆసీస్ బ్యాటర్లను టార్గెట్ చేస్తూ పేస్ దళ నాయకుడు బుమ్రా వికెట్ల వేట మొదలుపెట్టగా.. మహ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా అతడికి సహకారం అందించారు.రాణా తొలి వికెట్ అతడేఫలితంగా శుక్రవారం నాటి ఆటలో టీమిండియా పైచేయి సాధించగలిగింది. బుమ్రా నాలుగు వికెట్లతో రాణించగా.. సిరాజ్ రెండు వికెట్లు కూల్చాడు. ఇక అరంగేట్ర బౌలర్ హర్షిత్ రాణా ట్రవిస్ హెడ్(11) రూపంలో తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్లో తొలి వికెట్ దక్కించుకున్నాడు. ఇదిలా ఉంటే.. తొలి రోజు ఆట పూర్తయ్యే సరికి ఆసీస్ ఏడు వికెట్ల నష్టానికి 67 రన్స్ మాత్రమే చేసింది.అంతేకాదు.. శనివారం నాటి రెండో రోజు ఆరంభంలోనే వికెట్ తీసి మరోసారి దూకుడు ప్రదర్శించింది. ప్రమాదకారిగా మారుతున్న అలెక్స్ క్యారీ(21)ని బుమ్రా అవుట్ చేయగా.. నాథన్ లియాన్(5)ను హర్షిత్ పెవిలియన్‌కు పంపాడు.అయితే, ఆసీస్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ మాత్రం క్రీజులో పాతుకుపోయి.. భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు. ఈ క్రమంలో ఆసీస్ ఇన్నింగ్స్ 40వ ఓవర్లో బుమ్రా.. హర్షిత్‌ను రంగంలోకి దించాడు. ఈ క్రమంలో మూడో బంతిని హర్షిత్ బౌన్సర్‌గా సంధించగా.. స్టార్క్ హెల్మెట్‌కు తగిలింది.హర్షిత్.. నేను నీ కంటే వేగంగా బౌలింగ్ చేయగలనుదీంతో కంగారూపడిన హర్షిత్ స్టార్క్ వైపు చూస్తూ అంతే ఓకే కదా అన్నట్లు సైగలతోనే అడిగాడు. ఇందుకు బదులుగా నవ్వులు చిందించిన స్టార్క్.. ‘‘హర్షిత్.. నేను నీ కంటే వేగంగా బౌలింగ్ చేయగలను. పాత జ్ఞాపకాలు గుర్తున్నాయి’’ అంటూ ఐపీఎల్లో తాము కలిసి ఆడిన విషయాన్ని గుర్తు చేశాడు.ఇక స్టార్క్ మాటలతో ఒక్కసారిగా హర్షిత్ చిరునవ్వులు చిందిస్తూ అలాగే అన్నట్లు తలూపాడు. మామూలుగా ఆసీస్- భారత్ మ్యాచ్ అంటే స్లెడ్జింగ్ మొదట గుర్తుకువస్తుంది. అయితే, హర్షిత్- స్టార్క్ మాత్రం ఇలా ఫ్రెండ్లీగా ఉండటం అభిమానులను ఆకర్షించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.కాగా ఐపీఎల్-2024లో హర్షిత్ రాణా, స్టార్క్ కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ప్రాతినిథ్యం వహించారు. జట్టును చాంపియన్‌గా నిలపడంలో ఈ ఇద్దరు పేసర్లు తమ వంతు పాత్రలు పోషించారు. అదీ సంగతి!!104 పరుగులకే కుప్పకూలిన ఆసీస్ఇక క్రీజులో పాతుకుపోయి జిడ్డు బ్యాటింగ్‌తో భారత బౌలర్లను ఇబ్బంది పెట్టిన స్టార్క్ వికెట్‌ను ఆఖరికి హర్షిత్ దక్కించుకోవడం విశేషం. మొత్తంగా 112 బంతులు ఎదుర్కొని 26 పరుగులు చేసిన స్టార్క్ పదో వికెట్‌గా వెనుదిరగడంతో ఆసీస్ ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్‌లో 104 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో బుమ్రా ఐదు, రాణా మూడు, సిరాజ్ రెండు వికెట్లు తీశారు.Mitch Starc offers a little warning to Harshit Rana 😆#AUSvIND pic.twitter.com/KoFFsdNbV2— cricket.com.au (@cricketcomau) November 23, 2024 -
‘దేశం కోసం బుల్లెట్ తీసుకునేందుకు సిద్ధపడు’: అతడి మాటలే నితీశ్ రెడ్డికి స్ఫూర్తి
టీమిండియా యువ సంచలనం, ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి టెస్టు అరంగేట్రం కల శుక్రవారం(నవంబరు 22) నెరవేరింది. ఆస్ట్రేలియా గడ్డ మీద పెర్త్ వేదికగా ఈ 21 ఏళ్ల విశాఖ కుర్రాడు.. టీమిండియా దిగ్గజం విరాట్ కోహ్లి చేతుల మీదుగా టెస్టు క్యాప్ అందుకున్నాడు. దేశం కోసం బుల్లెట్ తీసుకునేందుకు సిద్ధపడుఈ నేపథ్యంలో నితీశ్ కుమార్ రెడ్డి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. కంగారూ గడ్డపై మ్యాచ్‌కు ముందు కాస్త ఒత్తిడిలో ఉన్న సమయంలో హెడ్ కోచ్ గౌతం గంభీర్ వ్యాఖ్యలు తనలో స్ఫూర్తిని రగిల్చాయని తెలిపాడు. ‘దేశం కోసం బుల్లెట్ తీసుకునేందుకు సిద్ధపడు’ అంటూ గంభీర్ తనతో చెప్పినట్లు నితీశ్ పేర్కొన్నాడు. కాగా పేస్‌కు సహకరిస్తున్న పెర్త్ పిచ్‌పై సీనియర్ ఆటగాళ్లే విఫలమైన చోట నితీశ్ రెడ్డి బ్యాట్‌తో విజృంభించడం విశేషం. మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్, జోష్ హాజిల్‌వుడ్, మిచెల్ మార్ష్ వంటి పేసర్లను ఎదుర్కొంటూ పరుగులు రాబట్టి సత్తా చాటాడు. 41 పరుగులతో టీమిండియా టాప్ స్కోరర్‌గా నిలిచాడు.మ్యాచ్ అనంతరం నితీశ్ మాట్లాడుతూ... ‘పెర్త్ గురించి చాలా విన్నా. దీంతో మ్యాచ్‌కు ముందు కాస్త ఆందోళన చెందాను. బౌన్సర్లను ఎదుర్కోవడం కష్టం అనిపించినా... ఆ సమయంలో కోచ్ గంభీర్ నెట్స్‌లో చెప్పిన మాటలు గుర్తు చేసుకున్నా.అదొక గొప్ప అనుభూతి‘ప్రత్యర్థి బౌలర్లు బౌన్సర్లు సంధిస్తే... అది దేశం కోసం బుల్లెట్ అనుకో’ అని కోచ్ చెప్పారు. మ్యాచ్ ఆరంభానికి ఒకరోజు ముందే అరంగేట్రం చేయనున్నట్లు తెలిసింది. విరాట్ కోహ్లి చేతుల మీదుగా టెస్టు క్యాప్ అందుకోవడం గొప్ప అనుభూతి. చిన్నప్పటి నుంచి కోహ్లి ఆట చూస్తూ పెరిగా... అలాంటిది ఇప్పుడు విరాట్ భాయ్‌తో కలిసి ఆడే అవకాశం దక్కడం చాలా ఆనందంగా ఉంది.భారత్ ‘ఎ’ తరఫున ఆస్ట్రేలియా ‘ఎ’తో అనధికారిక టెస్టు సిరీస్ ఆడటం ఎంతో ఉపకరించింది. ఇక్కడి పిచ్‌లపై ఒక అవగాహన ఏర్పడింది. భారత్‌తో పోల్చుకుంటే పూర్తి భిన్నమైన పరిస్థితుల్లో మెరుగైన ప్రదర్శన చేయడం ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించింది. అందుకే అతడిని టార్గెట్ చేశాపిచ్ నుంచి స్పిన్నర్లకు పెద్దగా సహకారం లేకపోవడంతో లియాన్‌ను లక్ష్యంగా చేసుకొని వేగంగా పరుగులు రాబట్టా. పంత్‌తో కలిసి బ్యాటింగ్ చేయడం బాగుంది. క్రమశిక్షణతో బౌలింగ్ చేస్తే వికెట్లు దక్కుతాయని ముందే అనుకున్నాం. బుమ్రా, సిరాజ్, హర్షిత్ అదే చేసి చూపెట్టారు. ప్రస్తుతానికి వికెట్ పేస్ బౌలింగ్‌కు అనుకూలంగా కనిపిస్తోంది’ అని నితీశ్ వివరించాడు. పేస్ ఆల్‌రౌండర్‌గా జట్టులో చోటు దక్కించుకున్న నితీశ్‌కు తొలి రోజు బౌలింగ్ చేసే అవకాశం రాలేదు. కాగా బోర్డర్- గావస్కర్ట్రోఫీలో భాగంగా టీమిండియా ఆసీస్‌తో ఐదు టెస్టులు ఆడనుంది.చదవండి: IND vs AUS: బ్రో అక్కడ ఉన్నది డీఎస్పీ.. లబుషేన్‌కు ఇచ్చిపడేసిన సిరాజ్! వీడియో -
ఆస్ట్రేలియా ఢమాల్
-
Ind vs Aus 1st Day 2: నిలకడగా ఆడుతున్న టీమిండియా ఓపెనర్లు
Australia vs India, 1st Test Day 2 At Perth Updates: టీ బ్రేక్ సమయానికి టీమిండియా స్కోరు: 84/0 (26)జైస్వాల్ 42, రాహుల్ 34 పరుగులతో క్రీజులో ఉన్నారు. 26 ఓవర్లు పూర్తయ్యేసరికి టీమిండియా ఆధిక్యం 130 పరుగులు.20 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా స్కోరు 75-0రాహుల్ 29, జైస్వాల్ 38 పరుగులతో ఆడుతున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ ప్రస్తుతం 121 పరుగుల మెరుగైన ఆధిక్యంలో ఉంది.నిలకడగా ఆడుతున్న టీమిండియా ఓపెనర్లుటీమిండియా తమ రెండో ఇన్నింగ్స్ ఆరంభించింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ నిలకడగా ఆడుతున్నారు. శనివారం నాటి రెండో రోజు ఆటలో 12 ఓవర్లు ముగిసే సరికి రాహుల్ 29 బంతులు ఎదుర్కొని ఎనిమిది, జైస్వాల్ 43 బంతులు ఎదుర్కొని 16 పరుగులు చేశారు. భారత్ స్కోరు: 30-0(12).ఆస్ట్రేలియా ఆలౌట్.. స్కోరు ఎంతంటే?టీమిండియాతో తొలి టెస్టు రెండో రోజు ఆటలో భాగంగా ఆస్ట్రేలియా ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్‌లో 104 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్ ఆటగాళ్లలో టెయిలెండర్ మిచెల్ స్టార్క్ 26 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవడం విశేషం.అయితే, స్టార్క్‌ను అవుట్ చేసేందుకు భారత బౌలర్లు సుదీర్ఘంగా నిరీక్షించాల్సి వచ్చింది. ఎట్టకేలకు హర్షిత్ రాణా అతడిని పెవిలియన్‌కు పంపడంతో ఆసీస్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఆర్డర్లో స్టార్క్‌తో పాటు వాళ్లలో వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ(21) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేశాడు. మిగిలిన వాళ్లంతా పూర్తిగా విఫలమయ్యారు.ఇక టీమిండియా బౌలర్లలో ప్రధాన పేసర్ బుమ్రాకు అత్యధికంగా ఐదు వికెట్లు దక్కగా.. హర్షిత్ మూడు, సిరాజ్ రెండు వికెట్లు పడగొట్టారు. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియాకు 46 పరుగుల ఆధిక్యం లభించింది. కాగా తొలి రోజు ఆటలో భారత్ 150 పరుగులకు ఆలౌట్ అయిన విషయం తెలిసిందే.తొమ్మిదో వికెట్ కోల్పోయిన ఆసీస్హర్షిత్ రాణా బౌలింగ్‌లో నాథన్ లియాన్ థర్డ్ స్లిప్‌లో ఉన్న కేఎల్ రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. దీంతో ఆసీస్ తొమ్మిదో వికెట్ కోల్పోగా.. హర్షిత్ ఖాతాలో రెండో వికెట్ జమైంది. జోష్ హాజిల్ వుడ్ క్రీజులోకి వచ్చాడు. స్టార్క్ 11 పరుగులతో ఉన్నాడు. ఆసీస్ స్కోరు: 79/9 (33.3).ఎనిమిదో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియాఆస్ట్రేలియాతో పెర్త్ టెస్టు రెండో రోజు ఆట ఆరంభంలోనే టీమిండియా అదరగొట్టింది. కెప్టెన్ బుమ్రా బౌలింగ్‌లో అలెక్స్ క్యారీ(21) అవుటయ్యాడు. పంత్‌కు క్యాచ్ ఇచ్చి అతడు పెవిలియన్ చేరాడు. దీంతో ఆస్ట్రేలియా ఎనిమిదో వికెట్ కోల్పోయింది. నాథన్ లియాన్ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 70-8(29).రెండో రోజు ఆట ఆరంభంఆస్ట్రేలియా- టీమిండియా మధ్య తొలి టెస్టు రెండో రోజు ఆట ఆరంభమైంది. శనివారం 67/7 ఓవర్ నైట్ స్కోరుతో ఆసీస్ తమ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది.కాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు టీమిండియా ఆస్ట్రేలియాకు వెళ్లింది. ఈ క్రమంలో ఆసీస్‌తో శుక్రవారం తొలి టెస్టు మొదలుపెట్టింది. పెర్త్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత జట్టు తాత్కాలిక కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు.ఆదుకున్న నితీశ్ రెడ్డి, పంత్టాపార్డర్ కుదేలైన వేళ మిడిలార్డర్ బ్యాటర్ రిషభ్ పంత్(37), లోయర్ ఆర్డర్లో ఆల్‌రౌండర్ నితీశ్ రెడ్డి(41) రాణించారు. ఫలితంగా టీమిండియా తమ తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగుల మేర గౌరవప్రదమైన స్కోరు చేసి ఆలౌట్ అయింది. ఆసీస్ పేసర్లలో హాజిల్‌వుడ్ నాలుగు వికెట్లు దక్కించుకోగా.. స్టార్క్, కెప్టెన్ కమిన్స్, మిచెల్ మార్ష్ రెండేసి వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు.తొలి రోజు బుమ్రాకు నాలుగు వికెట్లుఈ క్రమంలో తొలిరోజే బ్యాటింగ్ మొదలుపెట్టిన ఆసీస్‌కు భారత పేసర్లు చుక్కలు చూపించారు. బుమ్రా నాలుగు వికెట్లతో చెలరేగగా.. మహ్మద్ సిరాజ్ రెండు, అరంగేట్ర బౌలర్ హర్షిత్ ఒక వికెట్ పడగొట్టారు. ఇక టీమిండియా బౌలర్ల దెబ్బకు ఆసీస్ బ్యాటింగ్ ఆర్డర్ కుదేలు కాగా.. తొలి రోజు ఆట ముగిసే సరికి ఏడు వికెట్ల నష్టానికి కేవలం 67 పరుగులు చేసింది.ఆస్ట్రేలియా ఆటగాళ్లలో ఓపెనర్లు ఉస్మాన్ ఖవాజా(8), అరంగేట్ర బ్యాటర్ నాథన్ మెక్‌స్వీనీ(10), స్టీవ్ స్మిత్(0), ప్యాట్ కమిన్స్(3) వికెట్లను బుమ్రా పడగొట్టగా.. మార్నస్ లబుషేన్(2), మార్ష్(6)ను సిరాజ్ వెనక్కి పంపాడు. హర్షిత్ రాణా ట్రవిస్ హెడ్‌ను అవుట్ చేసి అంతర్జాతీయ క్రికెట్లో తన వికెట్ల ఖాతా తెరిచాడు.తుదిజట్లుటీమిండియాకేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, దేవదత్ పడిక్కల్, విరాట్ కోహ్లి, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), ధృవ్ జురెల్, నితీశ్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, జస్ప్రీత్ బుమ్రా (కెప్టెన్), మహ్మద్ సిరాజ్.ఆస్ట్రేలియాఉస్మాన్ ఖవాజా, నాథన్ మెక్ స్వీనీ, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, ట్రవిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ క్యారీ (వికెట్ కీపర్), ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లియాన్, జోష్ హాజిల్‌వుడ్.చదవండి: ఇది నా డ్రీమ్ ఇన్నింగ్స్ కాదు.. అతడే నా ఆరాధ్య దైవం: నితీశ్ రెడ్డి -
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్టు మొదటి రోజు భారత్ జోరు
-
ఇది నా డ్రీమ్ ఇన్నింగ్స్ కాదు.. అతడే నా ఆరాధ్య దైవం: నితీశ్ రెడ్డి
టీమిండియా యువ ఆల్‌రౌండర్, ఆంధ్ర స్టార్ క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి తన టెస్టు అరంగేట్రంలోనే అదరగొట్టాడు. శుక్రవారం(నవంబర్ 22) పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో ప్రారంభమైన తొలి టెస్టుతో డెబ్యూ చేసిన నితీశ్.. తన ప్రదర్శనతో అందరని ఆకట్టుకున్నాడు. జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో క్రీజులోకి వచ్చిన నితీశ్ తన ఫైటింగ్ నాక్‌తో జట్టుకు గౌరవప్రదమైన స్కోర్‌ను అందించాడు. విరాట్ కోహ్లి, జైశ్వాల్ వంటి స్టార్ ప్లేయర్లే తడబడిన చోట కంగారు బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. ప్యాట్ కమిన్స్, జోష్ హేజల్‌వుడ్, నాథన్ లియాన్ లాంటి వరల్డ్ క్లాస్ బౌలర్లను కూడా నితీశ్ సమర్ధవంతంగా ఎదుర్కొన్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో 59 బంతులు ఆడిన నితీశ్.. 6 ఫోర్లు, ఒక సిక్స్‌తో 41 పరుగులు చేశాడు. అతడితో పంత్ 37 పరుగులతో రాణించాడు. వీరిద్దరి పోరాటం ఫలితంగా భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకు ఆలౌటైంది.చాలా సంతోషంగా ఉందిఇక తొలి రోజు ఆట అనంతరం తన ఇన్నింగ్స్‌పై నితీశ్ కుమార్ రెడ్డి స్పందించాడు. టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి చేతుల మీదగా టెస్టు క్యాప్‌ను అందుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని నితీశ్ తెలిపాడు."భారత్ తరపున టెస్టు క్రికెట్ ఆడాలని ఎప్పటినుంచో కలలు కంటున్నాను. ఎట్టకేలకు నా కల నేరవేరింది. నిజంగా చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా విరాట్ భాయ్ నుంచి క్యాప్ అందుకోవడం కూడా నాకు చాలా పత్యేకం. ఈ క్షణం నా జీవితంలో ఎప్పటికి గుర్తుండిపోతుంది.నేను క్రికెట్ ఆడటం మొదలుపెట్టినప్పటి నుంచి విరాట్‌నే ఆరాధ్య దైవంగా భావిస్తున్నాను. అటువంటిది అతడి చేతుల మీదగా ఈ రోజు క్యాప్‌ను అందుకున్నాను. అరంగేట్రం చేయనున్నానని మ్యాచ్‌కు కేవలం ఒక్క రోజు ముందే నాకు తెలిసింది.ఇదే విషయం హర్షిత్ రాణాకు కూడా మేనెజ్మెంట్ తెలియజేసింది. ఆ క్షణాన మా ఆనందానికి అవధులు లేవు. కానీ కొంచెం భయపడ్డాము కూడా. ఎందుకంటే ఆస్ట్రేలియా వంటి పరిస్థితుల్లో రాణించడం అంత సులువు కాదు. ఆ తర్వాత మేము ఎక్కువగా ఆలోచించకుండా డిన్నర్ సెలబ్రేషన్స్ చేసుకున్నాము.ఆసీస్‌తో అనధికారిక టెస్ట్ సిరీస్‌లో ఏ విధంగా అయితే రాణించామో అదే పెర్త్‌లో కొనసాగించాలని నిర్ణయించుకున్నాము. ఎక్కువ ఒత్తిడి తీసుకోకూడదని ఫిక్స్ అయ్యాము. అయితే ఇది నాకు డ్రీమ్ ఇన్నింగ్స్ కాదు, మంచి ఆరంభంగా మాత్రమే భావిస్తాను" అని నితీశ్ రెడ్డి పేర్కొన్నాడు.చదవండి: IND vs AUS: బుమ్రా అరుదైన ఫీట్.. ప్రపంచంలోనే రెండో బౌలర్‌గా -
బ్రో అక్కడ ఉన్నది డీఎస్పీ.. లబుషేన్‌కు ఇచ్చిపడేసిన సిరాజ్! వీడియో
పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో ప్రారంభమైన తొలి టెస్టు మొదటి రోజు ఆటలో టీమిండియా ఆధిపత్యం చెలాయించింది. తొలుత భారత బ్యాటర్లు నిరాశపరిచినప్పటకి బౌలర్లు మాత్రం అదరగొట్టారు. జస్ప్రీత్ బుమ్రా నాయకత్వంలోని భారత ఫాస్ట్ బౌలర్లు ఆసీస్ బ్యాటర్లకు చుక్కలు చూపించారు.టీమిండియా బౌలర్లను ఎదుర్కొనేందుకు కంగారు బ్యాటర్లు విల్లవిల్లాడారు. దీంతో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ ఏడు వికెట్లు కోల్పోయి కేవలం 67 పరుగులు మాత్రమే చేసింది. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా నాలుగు వికెట్లు పడగొట్టగా.. మహ్మద్ సిరాజ్ రెండు, హర్షిత్ రాణా ఒక్క వికెట్ సాధించాడు. అంతకుముందు భారత్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్ బౌలర్లలో అత్యధికంగా జోష్ హాజిల్‌వుడ్ 4 వికెట్లు పడగొట్టాడు.సిరాజ్-లబుషేన్ డిష్యూం.. డిష్యూంఇక మొదటి రోజు ఆటలో టీమిండియా స్టార్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్, ఆసీస్ మిడిలార్డర్ బ్యాటర్ మార్నస్ లబుషేన్ మధ్య చిన్నపాటి వాగ్వాదం చోటు చేసుకుంది. ఆసీస్ ఇన్నింగ్స్ 13 ఓవర్ వేసిన సిరాజ్ మూడో బంతిని మార్నస్కు షార్ట్ బాల్‌గా సంధించాడు. అయితే ఆ బంతిని లెగ్ సైడ్ షాట్ ఆడటానికి సదరు బ్యాటర్ ప్రయత్నించాడు. కానీ బంతి అతడి బ్యాట్‌కు కాకుండా తొడ ప్యాడ్ తాకి స్టంప్స్ దగ్గరలో పడింది. అయితే లబుషేన్ మాత్రం బంతిని చూడకుండా పరుగుకోసం ప్రయత్నించాడు. వెంటనే బంతి క్రీజు వద్దే ఉందని గమనించిన లబుషేన్ పరుగును ఉపసంహరించుకున్నాడు. ఈ క్రమంలో సిరాజ్ తన ఫాల్ త్రూలో వేగంగా క్రీజు వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చి రనౌట్ చేయాలనకున్నాడు. కానీ లబుషేన్ మాత్రం సిరాజ్ రనౌట్ చేస్తాడనే భయంతో బంతిని తన బ్యాట్‌తో పక్కకు నెట్టాడు. అయితే లబుషేన్ బంతిని పక్కకు నెట్టేటప్పుడు క్రీజులో లేడు. దీంతో సదరు ఆసీస్ బ్యాటర్ అలా చేయడం సిరాజ్‌కు కోపం తెప్పించింది. వెంటనే అతడి వద్దకు వెళ్లి సిరాజ్ తీవ్ర అగ్రహం వ్యక్తం చేశాడు. అంతలోనే విరాట్ కోహ్లి వెళ్లి స్టంప్స్‌ను పడగొట్టాడు.కానీ లబుషేన్ అప్పటికే క్రీజులో ఉన్నాడు. కానీ కోహ్లి మాత్రం అతడి ఏకాగ్రతను దెబ్బతీసేందుకు కావాలనే అలా చేశాడు. ఇందుకు సబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు అక్కడ ఉన్నది డీఎస్పీ బ్రో.. జాగ్రత్తగా ఉండాలంటూ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. Things are heating up! Siraj and Labuschagne exchange a few words.#INDvsAUS pic.twitter.com/leKRuZi7Hi— 彡Viя͢ʊs ᴛᴊ ᴘᴇᴛᴇʀ र (@TjPeter2599) November 22, 2024 -
IND vs AUS: అరుదైన రికార్డు.. 72 ఏళ్లలో ఇదే తొలిసారి
పెర్త్ వేదికగా ఆస్ట్రేలియా-భారత్ మధ్య ప్రారంభమైన తొలి టెస్టు మొదటి రోజులో బౌలర్లు అధిపత్యం చెలాయించారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్లు చుక్కలు చూపించారు.ఆసీస్ పేసర్లు నిప్పులు చెరగడంతో టీమిండియా తమ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 150 పరుగులకే కుప్పకూలింది. భారత బ్యాటర్లలో నితీష్ కుమార్ రెడ్డి(41), రిషభ్ పంత్ (37), కేఎల్ రాహుల్(26) మినహా మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ఆసీస్ బౌలర్లలో జోష్ హేజిల్‌వుడ్ 4 వికెట్లు పడగొట్టగా.. స్టార్క్, కమ్మిన్స్, మార్ష్ తలా రెండు వికెట్లు సాధించారు.బుమ్ బుమ్ బుమ్రా...అనంతరం భారత ఫాస్ట్ బౌలర్లు కూడా ఆస్ట్రేలియాకు ధీటుగా బదులిచ్చారు. కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా మరోసారి మ్యాజిక్ చేశాడు. అతడిని ఎదుర్కొవడం ఆసీస్ బ్యాటర్ల తరం కాలేదు. అతడి బౌలింగ్ దాటికి కంగారులు పెవిలియన్‌కు క్యూ కట్టారు. 4 వికెట్లు పడగొట్టి ఆసీస్‌ను బుమ్రా దెబ్బ తీశాడు. దీంతో తొలి రోజు ఆటముగిసే సమయానికి ఆతిథ్య జట్టు తమ మొదటి ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు కోల్పోయి కేవలం 67 పరుగులు మాత్రమే చేసింది. భారత బౌలర్లలో బుమ్రాతో పాటు సిరాజ్ రెండు, హర్షిత్ రానా ఓ వికెట్ సాధించారు.72 ఏళ్లలో ఇదే తొలిసారి..ఓవరాల్‌గా తొలి రోజు ఆటలో మొత్తం 17 వికెట్లను ఇరు జట్ల బౌలర్లు నేలకూల్చారు. ఆస్ట్రేలియా గడ్డపై ఒక టెస్ట్ మ్యాచ్‌లో తొలి రోజు 17 వికెట్లు పడడం 1952 తర్వాత ఇదే మొదటిసారి. ఈ మ్యాచ్‌తో 72 ఏళ్ల రికార్డు బ్రేక్ అయ్యింది. -
చెలరేగిన బుమ్రా.. రాణించిన రాణా, సిరాజ్.. పీకల్లోతు కష్టాల్లో ఆస్ట్రేలియా
ఆస్ట్రేలియాతో పెర్త్ టెస్టులో తొలి రోజు టీమిండియా పైచేయి సాధించింది. పేసర్ల విజృంభణ కారణంగా పటిష్ట స్థితిలో నిలిచింది. బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు భారత జట్టు ఆసీస్ టూర్‌కు వెళ్లింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య శుక్రవారం పెర్త్‌లో మొదటి టెస్టు ఆరంభమైంది.ఆసీస్ పేసర్లు ఆది నుంచే చెలరేగడంతోటాస్ గెలిచిన టీమిండియా తాత్కాలిక కెప్టెన్, ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే, బాల్ ఆది నుంచే బాగా స్వింగ్ కావడంతో భారత బ్యాటర్లు క్రీజులో నిలదొక్కుకోవడం కష్టంగా మారింది. తమకు అనుకూలిస్తున్న పిచ్‌పై ఆసీస్ పేసర్లు ఆది నుంచే చెలరేగారు. మిచెల్ స్టార్క్ టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్‌ను డకౌట్ చేసి ఆసీస్‌కు శుభారంభం అందించాడు.అదే విధంగా.. క్రీజులో నిలదొక్కున్న మరో ఓపెనర్ కేఎల్ రాహుల్(26)ను సైతం స్టార్క్ పెవిలియన్‌కు పంపాడు. మరోవైపు.. జోష్ హాజిల్‌వుడ్ వన్‌డౌన్ బ్యాటర్ దేవ్‌దత్ పడిక్కల్(0)ను అవుట్ చేసి తన ఖాతా తెరిచాడు. అంతేకాదు కీలకమైన విరాట్ కోహ్లి(5) వికెట్‌ను కూడా తానే దక్కించుకున్నాడు.పంత్, నితీశ్ రాణించగా..అయితే, రిషభ్ పంత్(37), అరంగేట్ర ఆల్‌రౌండర్ నితీశ్ రెడ్డి(41) పట్టుదలగా నిలబడి.. ఆసీస్ పేసర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ .. టీమిండియాను మెరుగైన స్కోరు దిశగా నడిపించారు. వీరిద్దరు రాణించడం వల్ల.. భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకు ఆలౌట్ అయింది. మిగతా వాళ్లలో ధ్రువ్ జురెల్(11), వాషింగ్టన్ సుందర్(4), హర్షిత్ రాణా(7), కెప్టెన్ బుమ్రా(8) నిరాశపరిచారు.వికెట్ల వేట మొదలు పెట్టిన బుమ్రా ఆసీస్ పేసర్లలో హాజిల్‌వుడ్ ఓవరాల్‌గా నాలుగు, కమిన్స్, స్టార్క్, మిచెల్ మార్ష్ తలా రెండు వికెట్లు దక్కించుకున్నారు. ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఆస్ట్రేలియాకు.. బుమ్రా ఆది నుంచే చుక్కలు చూపించాడు. ఓపెనర్, అరంగేట్ర బ్యాటర్ నాథన్ మెక్‌స్వీనీ(10)ని అవుట్ చేసి వికెట్ల వేట మొదలుపెట్టాడు.ఒకే ఓవర్లో ఇద్దరిని అవుట్ చేసిఆ తర్వాత ఒకే ఓవర్లో స్టీవ్ స్మిత్(0), ఉస్మాన్ ఖవాజా(8)లను అవుట్ చేసి సత్తా చాటాడు. ఈ క్రమంలో 19 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి ఆసీస్ కష్టాల్లో పడిన వేళ.. వన్‌డౌన్ బ్యాటర్ మార్నస్ లబుషేన్ పరుగులు చేయకపోయినా.. వికెట్ పడకుండా జాగ్రత్త పడుతూ.. భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు. హర్షిత్ రాణాకు తొలి వికెట్మొత్తంగా 52 బంతులు ఎదుర్కొని కేవలం రెండు పరుగులు చేసిన లబుషేన్‌ను సిరాజ్ అవుట్ చేశాడు. అంతకు ముందు మార్ష్(6) వికెట్‌ను కూడా సిరాజ్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ట్రవిస్ హెడ్(11)ను బౌల్డ్ చేసి హర్షిత్ రాణా టెస్టుల్లో తన తొలి వికెట్ నమోదు చేయగా.. కెప్టెన్ ప్యాట్ కమిన్స్(3) వికెట్‌ను భారత సారథి బుమ్రా దక్కించుకున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం నాటి తొలి రోజు ఆట ముగిసే సరికి ఆస్ట్రేలియా 27 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 67 మాత్రమే పరుగులు చేసింది. ఫలితంగా టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ కంటే 83 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. కాగా అలెక్స్ క్యారీ(19*), స్టార్క్(6*) మొదటి రోజు ఆట పూర్తయ్యేసరికి క్రీజులో ఉన్నారు. ఇక భారత బౌలర్లలో బుమ్రా ఓవరాల్‌గా నాలుగు వికెట్లు తీయగా.. సిరాజ్ రెండు, రాణా ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.చదవండి: బుమ్రాను ఒప్పించిన కోహ్లి.. ఆరంభంలోనే ఆసీస్‌కు షాకులు -
బుమ్రాను ఒప్పించిన కోహ్లి.. ఆసీస్‌కు ఆరంభంలోనే షాకులు!
పెర్త్ టెస్టులో టీమిండియా కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా తన పేస్ పదునుతో ఆస్ట్రేలియా బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. ఆరంభం నుంచే దూకుడు ప్రదర్శిస్తూ.. వరుస విరామాల్లో వికెట్లు తీశాడు. బుమ్రా దెబ్బకు ఆసీస్ ఓపెనింగ్ ద్వయం చేతులెత్తేసింది.అదే విధంగా.. అనుభవజ్ఞుడైన స్టీవ్ స్మిత్‌ను సైతం బుమ్రా అద్భుత రీతిలో డకౌట్‌గా పెవిలియన్‌కు పంపాడు. బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా టీమిండియా ఆస్ట్రేలియాతో ఐదు టెస్టులు ఆడనుంది. ఇందులో భాగంగా పెర్త్ వేదికగా శుక్రవారం మ్యాచ్ మొదలైంది. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ గైర్హాజరీలో బుమ్రా టీమిండియా తాత్కాలిక సారథిగా వ్యవహరిస్తున్నాడు.రాణించిన పంత్, నితీశ్ఇక టాస్ గెలిచిన బుమ్రా తొలుత బ్యాటింగ్ ఎంచుకోగా.. భారత జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకు ఆలౌట్ అయింది. రిషభ్ పంత్(37), నితీశ్ రెడ్డి(41) రాణించడంతో ఈ మేర గౌరవప్రదమైన స్కోరు సాధించింది. ఈ క్రమంలో ఆసీస్ బ్యాటింగ్‌కు దిగగా.. బుమ్రా మూడో ఓవర్లోనే కంగారూలకు షాకిచ్చాడు.బుమ్రా బౌలింగ్‌లో మూడో బంతికి ఆసీస్ ఓపెనర్, అరంగేట్ర ఆటగాడు నాథన్ మెక్‌స్వీనీ లెగ్ బిఫోర్ వికెట్(ఎల్బీడబ్ల్యూ)గా వెనుదిరిగాడు. అయితే, తొలుత ఫీల్డ్ అంపైర్ మెక్‌స్వీనీని నాటౌట్‌గా ప్రకటించాడు. ఆ సమయంలో వికెట్ కీపర్ రిషభ్ పంత్‌తో పాటు.. బుమ్రా కూడా రివ్యూకు వెళ్లే విషయంలో కాస్త సంశయించారు.బుమ్రాను ఒప్పించిన కోహ్లి.. అయితే, విరాట్ కోహ్లి మాత్రం బుమ్రాను రివ్యూకు వెళ్లేలా ఒప్పించాడు. ఈ క్రమంలో రీప్లేలో మెక్‌స్వీనీ(10) అవుటైనట్లు తేలింది. దీంతో థర్డ్ అంపైర్ అతడిని అవుట్‌గా ప్రకటించగా.. బుమ్రా, టీమిండియా ఖాతాలో తొలిరోజు తొలి వికెట్ చేరింది.తొలి మూడు వికెట్లు బుమ్రాకేఇక మళ్లీ ఏడో ఓవర్లో బుమ్రా వరుసగా రెండు వికెట్లు పడగొట్టాడు. నాలుగో బంతికి మరో ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా(8)ను అవుట్ చేసిన బుమ్రా.. ఆ మరుసటి బాల్కే స్టీవ్ స్మిత్(0)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. దీంతో 19 పరుగులకే ఆసీస్ మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. బుమ్రా ఆరంభంలోనే ఇలా మూడు వికెట్లు తీయగా.. అరంగేట్ర పేసర్ హర్షిత్ రాణా, మహ్మద్ సిరాజ్ సైతం విజృంభించారు. ఈ క్రమంలో 21 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా ఆరు వికెట్లు కోల్పోయి కేవలం 47 పరుగులు చేసింది.చదవండి: నితీశ్ రెడ్డి ‘ధనాధన్’ ఇన్నింగ్స్.. టీమిండియా 150 ఆలౌట్JASPRIT BUMRAH - THE GREATEST OF THIS GENERATION.🐐 pic.twitter.com/xyxvTRHTF5— Tanuj Singh (@ImTanujSingh) November 22, 2024 -
నితీశ్ రెడ్డి ‘ధనాధన్’ ఇన్నింగ్స్.. టీమిండియా 150 ఆలౌట్
ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో టీమిండియా నామమాత్రపు స్కోరు చేసింది. టాపార్డర్ వైఫల్యం కారణంగా తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 150 పరుగులకే ఆలౌట్ అయింది. కీలక ఆటగాళ్లంతా విఫలమైన చోట.. అరంగేట్ర ఆటగాడు, ఆంధ్ర యువ క్రికెటర్ నితీశ్ రెడ్డి భారత ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలవడం విశేషం.జస్ప్రీత్ బుమ్రా సారథ్యంలోబోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది. ఇందులో భాగంగా పెర్త్ వేదికగా ఇరుజట్ల మధ్య తొలి టెస్టు మొదలైంది. ఈ మ్యాచ్‌కు భారత రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ దూరం కాగా.. పేసర్ జస్ప్రీత్ బుమ్రా సారథ్యం వహిస్తున్నాడు. ఈ మ్యాచ్ ద్వారా నితీశ్ కుమార్‌రెడ్డి, హర్షిత్ రాణా టీమిండియా తరఫున టెస్టుల్లో అరంగేట్రం చేశారు.ఇక పెర్త్ టెస్టులో టాస్ గెలిచిన బుమ్రా తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్లలో యశస్వి జైస్వాల్ డకౌట్ కాగా.. కేఎల్ రాహుల్(26) కాసేపు పట్టుదలగా నిలబడ్డాడు. కానీ అనూహ్యంగా వివాదాస్పద రీతిలో అతడు అవుట్ అయ్యాడు. మరోవైపు.. వన్‌డౌన్‌లో వచ్చిన పడక్కిల్ సున్నా చుట్టగా.. విరాట్ కోహ్లి ఐదు పరుగులకే నిష్క్రమించాడు.రాణించిన రిషభ్ పంత్ ఈ క్రమంలో మిడిలార్డర్లో రిషభ్ పంత్ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. 78 బంతులు ఎదుర్కొన్న ఈ వికెట్ కీపర్ బ్యాటర్ మూడు ఫోర్లతో పాటు తనదైన ట్రేడ్ మార్క్ సిక్సర్ సాయంతో 37 పరుగులు సాధించాడు. మిగతా వాళ్లలో ధ్రువ్ జురెల్(11), వాషింగ్టన్ సుందర్(4) నిరాశపరచగా.. లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్‌కు వచ్చిన నితీశ్ రెడ్డి అద్బుతంగా ఆడాడు.నితీశ్ రెడ్డి ధనాధన్టెస్టుల్లో అదీ ఆసీస్ గడ్డపై అరంగేట్రం చేసిన ఈ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ కేవలం 59 బంతుల్లోనే 41 పరుగులు చేశాడు. నితీశ్ రెడ్డి ఇన్నింగ్స్‌లో ఆరు ఫోర్లు, ఒక సిక్స్ ఉండటం విశేషం. అయితే, ఆసీస్ సారథి, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో తన కెప్టెన్ అయిన ప్యాట్ కమిన్స్ బౌలింగ్‌లో నితీశ్ ఇన్నింగ్స్‌తో పాటు టీమిండియా ఇన్నింగ్స్‌కూ తెరపడింది.ఎనిమిదో స్థానంలో బరిలోకి దిగిన నితీశ్ రెడ్డి.. 49.4వ ఓవర్ వద్ద.. కమిన్స్ బౌలింగ్‌లో ఉస్మాన్ ఖవాజాకు క్యాచ్ ఇచ్చి.. పదో వికెట్‌గా వెనుదిరిగాడు. ఇక మిగిలిన వాళ్లలో హర్షిత్ రాణా 7, బుమ్రా 8 పరుగులు చేయగా.. మహ్మద్ సిరాజ్ 0 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. ఆసీస్ పేసర్లలో జోష్ హాజిల్‌వుడ్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. కమిన్స్, మిచెల్ మార్ష్, మిచెల్ స్టార్క్ తలా రెండు వికెట్లు కూల్చారు.చదవండి: చెత్త అంపైరింగ్.. కేఎల్ రాహుల్ అసంతృప్తి.. మండిపడుతున్న మాజీ క్రికెటర్లు -
చెత్త అంపైరింగ్.. కేఎల్ రాహుల్ అసంతృప్తి.. మండిపడుతున్న మాజీ క్రికెటర్లు
పెర్త్ టెస్టులో టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ అవుటైన తీరు వివాదానికి దారి తీసింది. థర్డ్ అంపైర్ తప్పుడు నిర్ణయం వల్ల భారత జట్టు భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చిందని మాజీ క్రికెటర్లు మండిపడుతున్నారు. అంతేకాదు.. తాను అవుటైన తీరుకు రాహుల్ సైతం ఆశ్చర్యంతో పాటు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇంతకీ ఏం జరిగిందంటే..?!ఆ ముగ్గురు విఫలంబోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా.. ఆస్ట్రేలియాతో శుక్రవారం మొదలైన తొలి టెస్టులో.. టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ యశస్వి జైస్వాల్(0), వన్‌డౌన్ బ్యాటర్ దేవ్‌దత్ పడిక్కల్(0), నాలుగో స్థానంలో వచ్చిన విరాట్ కోహ్లి(5) పూర్తిగా విఫలమయ్యారు. ఇలాంటి తరుణంలో మరో ఓపెనింగ్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు.ఆన్ ఫీల్డ్ అంపైర్ నాటౌట్ ఇచ్చాడు!అయితే, టీమిండియా ఇన్నింగ్స్ 23వ ఓవర్లో ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ బంతితో బరిలోకి దిగాడు. అతడి బౌలింగ్‌లో రాహుల్ షాట్ ఆడేందుకు ప్రయత్నించగా.. బంతి వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ చేతుల్లో పడింది. దీంతో ఆసీస్ అప్పీలు చేయగా.. ఆన్ ఫీల్డ్ అంపైర్ నాటౌట్ ఇచ్చాడు. అయినా సరే.. వెనక్కి తగ్గని ఆతిథ్య జట్టు రివ్యూకు వెళ్లింది.థర్డ్ అంపైర్ మాత్రంఈ క్రమంలో థర్డ్ అంపైర్ రాహుల్‌ను అవుట్‌గా ప్రకటించాడు. నిజానికి.. బంతి కీపర్ చేతుల్లో పడే సమయంలో వచ్చిన శబ్దం.. బ్యాట్ రాహుల్ ప్యాడ్‌కు తాకడం వల్ల వచ్చిందా? లేదంటే బంతిని తాకడం వల్ల వచ్చిందా అన్న అంశంపై స్పష్టత రాలేదు. కానీ రీప్లేలో వివిధ కోణాల్లో పరిశీలించకుండానే.. కేవలం స్నీకో స్పైక్ రాగానే థర్డ్ అంపైర్ రాహుల్‌ను అవుట్‌గా ప్రకటించడం గమనార్హం. థర్డ్ అంపైర్ నిర్ణయంపై ఆగ్రహంథర్డ్ అంపైర్ తీసుకున్న ఈ నిర్ణయం విమర్శలకు కారణమైంది. రాహుల్ సైతం తీవ్ర అసంతృప్తితో మైదానం వీడాడు. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్లు థర్డ్ అంపైర్ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘‘ఇదొక చెత్త నిర్ణయం. పెద్ద జోక్ కూడా’’ అంటూ మాజీ వికెట్ కీపర్ రాబిన్ ఊతప్ప ఫైర్ అయ్యాడు.మరోవైపు.. మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా సైతం.. ‘‘ఆన్ ఫీల్డ్ అంపైర్ నిర్ణయం నాటౌట్. అయినా స్పష్టత లేకుండానే అతడి కాల్‌ను ఎలా తిరస్కరిస్తారు. బ్యాట్ ప్యాడ్‌ను తాకినట్లు కనిపిస్తున్నా.. ఇదేం విచిత్రం. ఇది ఒక మతిలేని నిర్ణయం. చెత్త అంపైరింగ్’’ అంటూ ఘాటుగా విమర్శించాడు. ఇక ఆస్ట్రేలియా మాజీ బ్యాటర్ మాథ్యూ హెడెన్ కూడా రాహుల్ విషయంలో థర్డ్ అంపైర్ నిర్ణయాన్ని తప్పుబట్టడం విశేషం. కాగా రాహుల్ తొలి రోజు ఆటలో భాగంగా 74 బంతులు ఎదుర్కొని 26 పరుగులు చేసి నిష్క్రమించాడు. చదవండి: 77 ఏళ్లలో ఇదే తొలిసారి.. అరుదైన రికార్డుతో చరిత్ర పుటల్లోకి కమిన్స్, బుమ్రా! Matthew Hayden explaining the KL Rahul bat-pad scenario. - Unlucky, KL. 💔 pic.twitter.com/lf0UOWwmy8— Mufaddal Vohra (@mufaddal_vohra) November 22, 2024 -
టీమిండియాతో తలపడబోయే ప్రైమ్ మినిస్టర్ జట్టు ఇదే..!
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్ మధ్యలో (తొలి టెస్ట్ అనంతరం) భారత్ ప్రైమ్ మినిస్టర్ ఎలెవెన్ జట్టుతో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతుంది. కాన్బెర్రా వేదికగా ఈ మ్యాచ్ నవంబర్ 30, డిసెంబర్ 1 తేదీల్లో జరుగనుంది. ఈ మ్యాచ్ పింక్ బాల్‌తో జరుగుతుంది. ఈ మ్యాచ్ కోసం ప్రైమ్ మినిస్టర్ ఎలెవెన్‌ను క్రికెట్ ఆస్ట్రేలియా ఇవాళ (నవంబర్ 22) ప్రకటించింది. ప్రైమ్ మినిస్టర్ ఎలెవెన్‌లో ప్రస్తుత ఆసీస్ జట్టులోని సభ్యుడు స్కాట్ బోలాండ్ ఉన్నాడు. ప్రైమ్ మినిస్టర్ ఎలెవెన్‌కు ఆసీస్ మాజీ వికెట్‌కీపర్ టిమ్ పైన్ హెడ్ కోచ్‌గా వ్యవహరించనుండగా.. జాక్ ఎడ్వర్డ్స్ కెప్టెన్‌గా నియమించబడ్డాడు. ఈ జట్టు ఆస్ట్రేలియా అండర్-19 వరల్డ్‌కప్ విన్నింగ్ హీరోలతో నిండి ఉంది. ఈ జట్టులో స్కాట్ బోలాండ్, మ్యాట్ రెన్షాలకు జాతీయ జట్టుకు ఆడిన అనుభవం ఉంది. మిగతా ఆటగాళ్లంతా అన్క్యాప్డ్ ప్లేయర్లే. అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగే రెండో టెస్ట్ పింక్ బాల్ టెస్ట్ కావడంతో ఈ మ్యాచ్‌కు ప్రాధాన్యత సంతరించుకుంది. గడిచిన మూడేళ్లలో భారత్ పింక్ బాల్ మ్యాచ్ ఆడటం ఇదే మొదటిసారి.టీమిండియా విషయానికొస్తే.. ప్రైమ్ మినిస్టర్ ఎలెవెన్‌తో మ్యాచ్‌కు కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులో ఉంటాడు. తాను ఈ మ్యాచ్‌కు అందుబాటులో ఉండే విషయాన్ని హిట్‌మ్యాన్ బీసీసీఐకి ఇదివరకే తెలిపాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా రెగ్యులర్ జట్టు మొత్తం పాల్గొంటుంది. రెండో టెస్ట్ పింక్ బాల్‌తో ఆడే టెస్ట్ కాబట్టి టీమిండియాకు ఈ మ్యాచ్ చాలా ఉపయెగపడుతుంది.ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్స్ XI స్క్వాడ్..జాక్ ఎడ్వర్డ్స్ (కెప్టెన్), చార్లీ ఆండర్సన్, మహ్లీ బియర్డ్‌మన్, స్కాట్ బోలాండ్, జాక్ క్లేటన్, ఐడాన్ ఓ'కానర్, ఒల్లీ డేవిస్, జేడెన్ గుడ్విన్, సామ్ హార్పర్, హన్నో జాకబ్స్, సామ్ కాన్స్టాస్, లాయిడ్ పోప్, మాథ్యూ రెన్షా, జెమ్ ర్యాన్.ఇదిలా ఉంటే, భారత్-ఆస్ట్రేలియా మధ్య పెర్త్ వేదికగా ఇవాళ (నవంబర్ 22) తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఆస్ట్రేలియా బౌలర్లు పేట్రేగిపోవడంతో భారత్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. భారత ఇన్నింగ్స్ 98/6 స్కోర్ వద్ద కొనసాగుతుంది. భారత ఆటగాళ్లలో యశస్వి జైస్వాల్ 0, కేఎల్ రాహుల్ 26, దేవ్‌దత్ పడిక్కల్ 0, విరాట్ కోహ్లి 5, ధృవ్ జురెల్ 11, వాషింగ్టన్ సుందర్ 4 పరుగులకు ఔటయ్యారు. రిషబ్ పంత్ (27), నితీశ్ కుమార్ రెడ్డి (15) క్రీజ్‌లో ఉన్నారు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్, హాజిల్‌వుడ్, మిచెల్ మార్ష్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. -
77 ఏళ్లలో ఇదే తొలిసారి.. అరుదైన రికార్డుతో చరిత్ర పుటల్లోకి కమిన్స్, బుమ్రా!
ఆస్ట్రేలియా- టీమిండియా మధ్య పెర్త్ టెస్టు సందర్భంగా ఓ అరుదైన రికార్డు నమోదైంది. ఇరుజట్ల కెప్టెన్లు ప్యాట్ కమిన్స్- జస్ప్రీత్ బుమ్రా కలిసి తమ పేర్లను చరిత్ర పుటల్లో లిఖించుకున్నారు. కాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది.రోహిత్ శర్మ దూరంప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) 2023-25 సీజన్లో టీమిండియాకు ఈ సిరీస్ ఆఖరిది. ఇక ఇందులో కనీసం నాలుగు టెస్టులు గెలిస్తేనే భారత్ ఈసారీ డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరుకుంటుంది. ఇంతటి కీలకమైన సిరీస్‌లో తొలి టెస్టుకు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వ్యక్తిగత కారణాల దృష్ట్యా దూరంగా ఉన్నాడు.బుమ్రా తాత్కాలిక కెప్టెన్‌గా పగ్గాలుఈ క్రమంలో రోహిత్ స్థానంలో భారత జట్టు పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా తాత్కాలిక కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టాడు. ఇక పెర్త్ వేదికగా టీమిండియా- ఆసీస్ మధ్య శుక్రవారం తొలి టెస్టు మొదలుకాగా.. టాస్ సమయంలో కెప్టెన్లు బుమ్రా- కమిన్స్ కరచాలనం చేసుకున్న దృశ్యాలు క్రికెట్ ప్రేమికులను ఆకర్షించాయి.77 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారిఈ నేపథ్యంలోనే భారత్- ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలో నమోదైన ఓ అరుదైన ఫీట్ వెలుగులోకి వచ్చింది. ఇలా ఇరుజట్లకు ఫాస్ట్‌బౌలర్లే సారథ్యం వహించడం 77 ఏళ్లలో ఇదే మొదటిసారి కావడం విశేషం. కాగా 2021 ద్వితీయార్థంలోనే ఫాస్ట్ బౌలర్ కమిన్స్ ఆస్ట్రేలియా టెస్టు జట్టు కెప్టెన్ అయ్యాడు.మరోవైపు.. భారత పేసర్ బుమ్రా గతంలో ఇంగ్లండ్‌లో టీమిండియా టెస్టు కెప్టెన్‌గా వ్యవహరించినా.. ఆస్ట్రేలియాలో మాత్రం సారథిగా అతడికి ఇదే తొలి అనుభవం. ఇదిలా ఉంటే.. 1947-48లో భారత్- ఆస్ట్రేలియా మధ్య తొలిసారి టెస్టు సిరీస్ జరిగింది. నాడు వీరి సారథ్యంలోనాడు టీమిండియా ఆసీస్ చేతిలో 4-0తో ఓడిపోయింది. అప్పుడు ఆసీస్ జట్టుకు లెజెండరీ బ్యాటర్ సర్ డొనాల్డ్ బ్రాడ్‌మన్ కెప్టెన్‌గా ఉండగా.. టీమిండియాకు ఆల్‌రౌండర్ లాలా అమర్నాథ్ నాయకుడు.ఇక 1985-86లో పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ కపిల్ దేవ్ కూడా ఆస్ట్రేలియాతో సిరీస్‌లో భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. అయితే, ఇంత వరకు బుమ్రాలా పూర్తిస్థాయిలో ఓ ఫాస్ట్ బౌలర్ ఆసీస్‌తో టెస్టుల్లో టీమిండియాకు సారథ్యం వహించలేదు.పేలవంగా మొదలుకాగా పెర్త్ టెస్టులో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ బుమ్రా తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే, భారత్‌కు మాత్రం శుభారంభం లభించలేదు. శుక్రవారం నాటి తొలిరోజు ఆట భోజన విరామ సమయానికి 25 ఓవర్లలో భారత్ నాలుగు వికెట్లు కోల్పోయి కేవలం 51 పరుగులు చేసింది.చదవండి: Ind vs Aus: ఆ ఇద్దరు డకౌట్.. కోహ్లి మరోసారి విఫలం.. మండిపడుతున్న ఫ్యాన్స్టాలెంటెడ్ కిడ్.. ఇక్కడ కూడా.. : నితీశ్ రెడ్డిపై కమిన్స్ కామెంట్స్🗣️🗣️ 𝙏𝙝𝙚𝙧𝙚'𝙨 𝙣𝙤 𝙜𝙧𝙚𝙖𝙩𝙚𝙧 𝙝𝙤𝙣𝙤𝙪𝙧 𝙩𝙝𝙖𝙣 𝙩𝙝𝙞𝙨.Captain Jasprit Bumrah is charged 🆙 to lead from the front in Perth ⚡️⚡️#TeamIndia | #AUSvIND | @Jaspritbumrah93 pic.twitter.com/0voNU7p014— BCCI (@BCCI) November 21, 2024 -
IND VS AUS 1st Test: అరుదైన క్లబ్లో కేఎల్ రాహుల్
టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ అరుదైన క్లబ్లో చేరాడు. టెస్ట్‌ల్లో 3000 పరుగుల మార్కును దాటాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో రాహుల్ ఈ ఘనతను సాధించాడు. టెస్ట్‌ల్లో భారత్ తరఫున 3000 పరుగుల మార్కును తాకిన 26వ ఆటగాడిగా రాహుల్ రికార్డుల్లోకెక్కాడు. టెస్ట్‌ల్లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఘనత సచిన్ టెండూల్కర్‌కు (15921) దక్కుతుంది. ఓవరాల్‌గా చూసినా టెస్ట్‌ల్లో అత్యధిక పరుగులు చేసింది సచినే. రాహుల్ తన 54వ టెస్ట్‌లో 3000 పరుగుల మార్కును దాటాడు. రాహుల్ 92 ఇన్నింగ్స్‌ల్లో 8 సెంచరీలు, 15 హాఫ్ సెంచరీల సాయంతో 3007 పరుగులు చేశాడు.మ్యాచ్ విషయానికొస్తే.. పెర్త్ టెస్ట్‌లో ఆది నుంచి నిలకడగా ఆడిన కేఎల్ రాహుల్.. ఓ వివాదాస్పద నిర్ణయానికి ఔటయ్యాడు. రాహుల్ 74 బంతులు ఎదుర్కొని 3 ఫోర్ల సాయంతో 26 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో లంచ్ విరామం సమయానికి భారత్ స్కోర్ 51/4గా ఉంది. భారత ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్, దేవ్‌దత్ పడిక్కల్ ఖాతా తెరవకుండానే ఔట్ కాగా.. విరాట్ కోహ్లి 5, రాహుల్ 26 పరుగులు చేసి ఔటయ్యారు. రిషబ్ పంత్ (10), ధృవ్ జురెల్ (4) క్రీజ్‌లో ఉన్నారు. ఆసీస్ బౌలర్లలో హాజిల్‌వుడ్, స్టార్క్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. తొలి సెషన్లో ఆసీస్ బౌలర్ల పూర్తి డామినేషన్ నడిచింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుని తప్పుచేసిందేమో అనిపించింది. పిచ్‌పై బౌన్స్‌తో పాటు అనూహ్యమైన స్వింగ్ లభిస్తుంది. -
Ind vs Aus: ఆ ఇద్దరు డకౌట్.. కోహ్లి మరోసారి విఫలం.. కష్టాల్లో టీమిండియా
టెస్టుల్లో టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి వైఫల్యాల పరంపర కొనసాగుతోంది. స్వదేశంలో సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో స్థాయికి తగ్గట్లు రాణించలేక చతికిలపడ్డ ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ఆస్ట్రేలియాలోనూ శుభారంభం అందుకోలేకపోయాడు. తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో కేవలం ఐదు పరుగులకే కోహ్లి అవుటయ్యాడు.ఫలితంగా మరోసారి కోహ్లి ఆట తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) 2023-25 సీజన్లో భాగంగా టీమిండియా తమ ఆఖరి సిరీస్ ఆడేందుకు టీమిండియా ఆస్ట్రేలియాకు వెళ్లింది. బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆసీస్‌తో ఐదు టెస్టులు ఆడుతోంది.టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ఈ క్రమంలో శుక్రవారం పెర్త్ వేదికగా ఇరుజట్ల మధ్య మొదటి టెస్టు ఆరంభమైంది. టాస్ గెలిచిన టీమిండియా తాత్కాలిక కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే, సీమర్లకు స్వర్గధామమైన పెర్త్ పిచ్‌పై భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ తేలిపోయాడు. ఎనిమిది బంతులు ఎదుర్కొని పరుగుల ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు.మరోవైపు.. వన్‌డౌన్ బ్యాటర్ దేవ్‌దత్ పడిక్కల్ సైతం డకౌట్ అయ్యాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లి క్రీజులోకి రాగానే ఇన్నింగ్స్ చక్కదిద్దుతాడని అభిమానులు ఆశగా ఎదురుచూశారు. కానీ.. భారత ఇన్నింగ్స్ పదిహేడో ఓవర్ రెండో బంతికి కోహ్లి క్యాచ్ అవుట్‌గా వెనుదిరిగాడు.ఐదు పరుగులకే అవుట్ఆసీస్ పేసర్ జోష్ హాజిల్‌వుడ్ వేసిన బంతిని తప్పుగా అంచనా వేసిన కోహ్లి.. ఫ్రంట్‌ఫుట్ షాట్ ఆడేందుకు ముందుకు వచ్చాడు. ఈ క్రమంలో బ్యాట్ ఎడ్జ్‌ను తాకిన బంతి ఫస్ట్ స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న ఉస్మాన్ ఖవాజా చేతిలో పడింది. అలా షార్ట్ లెంగ్త్‌తో వచ్చిన బంతిని తప్పుగా అంచనా వేసి కోహ్లి వికెట్ పారేసుకున్నాడు. మండిపడుతున్న ఫ్యాన్స్మొత్తంగా పన్నెండు బంతులు ఎదుర్కొని కేవలం ఐదు పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. ఈ నేపథ్యంలో కోహ్లిపై టీమిండియా అభిమానులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆస్ట్రేలియా గడ్డపై మెరుగైన రికార్డు ఉన్న కారణంగా తనకు వరుస అవకాశాలు ఇస్తున్నా బాధ్యతాయుతంగా ఆడకపోతే ఎలా అని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారుకష్టాల్లో టీమిండియాఇదిలా ఉంటే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా కేవలం 47 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఓపెనర్లలో యశస్వి జైస్వాల్(0) విఫలం కాగా.. కేఎల్ రాహుల్(26) ఫర్వాలేదనిపించాడు. పడిక్కల్(0), కోహ్లి(5) మాత్రం పూర్తిగా నిరాశపరిచారు. తొలిరోజు లంచ్ బ్రేక్ సమయానికి టీమిండియా స్కోరు: 51/4 (25).చదవండి: IND VS AUS 1st Test: అశ్విన్, జడేజా లేకుండానే..! తుదిజట్లు ఇవేవిధ్వంసం.. డబుల్ సెంచరీతో చెలరేగిన సెహ్వాగ్ కొడుకుExtra bounce from Josh Hazlewood to dismiss Virat Kohli. pic.twitter.com/dQEG1rJSKA— Mufaddal Vohra (@mufaddal_vohra) November 22, 2024We need to start a serious discussion now on kohli pic.twitter.com/WMmAlfdZ8h— Div🦁 (@div_yumm) November 22, 2024 -
IND VS AUS 1st Test: అశ్విన్, జడేజా లేకుండానే..!
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్ట్‌లో టీమిండియా ఇద్దరు స్ట్రయిట్ స్పిన్నర్లు లేకుండానే బరిలోకి దిగింది. ఈ మ్యాచ్‌లో భారత్ రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా లాంటి అనుభవజ్ఞులను పక్కన పెట్టి అంతంతమాత్రం అనుభవం ఉన్న వాషింగ్టన్ సుందర్‌ను తుది జట్టులోకి తీసుకుంది. ఈ మ్యాచ్‌లో భారత్ ఏకైక స్పిన్నర్‌తో బరిలోకి దిగింది. మ్యాచ్ ముందు వరకు ఆ ఏకైక స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అని అంతా అనుకున్నారు. అయితే టీమిండియా మేనేజ్మెంట్ ఆఖరి నిమిషంలో సుందర్వైపు మొగ్గు చూపింది. అశ్విన్‌తో పోలిస్తే సుందర్ మెరుగ్గా బ్యాటింగ్ చేస్తాడన్న కారణంగా అతన్ని తుది జట్టులోకి తీసుకోవడమైంది. మరి టీమిండియా అవళభించిన ఈ వ్యూహం సక్సెస్ అవుతుందా లేక బెడిసికొడుతుందా అన్నది వేచి చూడాలి.ఎందుకంటే అశ్విన్, జడేజా ఇద్దరికి కూడా బ్యాటింగ్ చేసే సామర్థ్యం ఉన్నప్పటికీ మేనేజ్మెంట్ సుందర్‌నే ఎంచుకుని పెద్ద సాహసమే చేసింది. ఇటీవలికాలంలో అశ్విన్, జడేజా లేకుండా టీమిండియా బరిలోకి దిగిందే లేదు. వీరిద్దరు లేకుండా 2021 గబ్బా టెస్ట్‌లో భారత్ చివరిసారిగా బరిలోకి దిగింది.మరోవైపు ఈ మ్యాచ్‌లో భారత్ తరఫున ఇద్దరు ఆటగాళ్లు అరంగేట్రం చేస్తున్నారు. ఇందులో ఒకరు నితీశ్ కుమార్ రెడ్డి కాగా.. రెండో ఆటగాడు హర్షిత్ రాణా. నితీశ్ కుమార్ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ కాగా.. హర్షిత్ రాణా రైట్ ఆర్మ్ మీడియం ఫాస్ట్ బౌలర్. పెర్త్ పిచ్ పేస్ బౌలర్లకు అనుకూలించనుండటంతో ఈ మ్యాచ్‌లో భారత్ ముగ్గురు స్పెషలిస్ట్ పేసర్లు, ఓ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌తో బరిలోకి దిగింది. బుమ్రా భారత పేస్ అటాక్‌ను లీడ్ చేయనుండగా.. హర్షిత్ రాణా, మహ్మద్ సిరాజ్ మరో ఇద్దరు పేసర్లుగా ఉన్నారు. నితీశ్ కుమార్ నాలుగో పేస్ బౌలింగ్ ఆప్షన్‌గా ఉంటాడు.మ్యాచ్ విషయానికొస్తే.. టీమిండియా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఆసీస్ పేసర్ల ధాటికి భారత్ ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్, వన్‌డౌన్ బ్యాటర్ దేవ్‌దత్ పడిక్కల్ ఇద్దరూ డకౌట్ అయ్యారు. జైస్వాల్‌ను స్టార్క్ పెవిలియన్‌కు పంపగా.. పడిక్కల్‌ను హాజిల్‌వుడ్ ఔట్ చేశాడు. 14 ఓవర్ల అనంతరం భారత స్కోర్ 20/2గా ఉంది. కేఎల్ రాహుల్ (14), విరాట్ కోహ్లి (0) క్రీజ్‌లో ఉన్నారు.తుది జట్లు..ఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI): ఉస్మాన్ ఖ్వాజా, నాథన్ మెక్‌స్వీని, మార్నస్ లబూషేన్, స్టీవెన్ స్మిత్, ట్రవిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ క్యారీ(వికెట్‌కీపర్), పాట్ కమిన్స్(కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లియోన్, జోష్ హేజిల్వుడ్భారత్ (ప్లేయింగ్ XI): కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, దేవదత్ పడిక్కల్, విరాట్ కోహ్లి, రిషబ్ పంత్(వికెట్‌కీపర్), ధ్రువ్ జురెల్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, జస్ప్రీత్ బుమ్రా(కెప్టెన్), మహ్మద్ సిరాజ్ -
IND VS AUS: నిప్పులు చెరిగిన బౌలర్లు.. తొలి రోజు టీమిండియాదే
IND VS AUS 1st Test Day 1 Live Updates:ముగిసిన తొలి రోజు ఆట..పెర్త్ వేదికగా ఆస్ట్రేలియా-భారత్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మొదటి రోజు ఆట ముగిసింది. తొలి రోజు ఆతిథ్య జట్టుపై టీమిండియా పై చేయి సాధించింది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు కోల్పోయి కేవలం 67 పరుగులు మాత్రమే చేసింది. ప్రస్తుతం క్రీజులో అలెక్స్ క్యారీ(19), మిచెల్ స్టార్క్(6) పరుగులతో ఉన్నారు.ఇక భారత బ్యాటర్లు నిరాశపరిచినప్పటికి బౌలర్లు మాత్రం నిప్పులు చెరిగారు. కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా 4 వికెట్లతో కంగారులను దెబ్బతీయగా.. సిరాజ్ రెండు, హర్షిత్ రానా ఒక్క వికెట్ సాధించారు. అంతకుముందు టీమిండియా కేవలం 150 పరుగులకు ఆలౌటైంది. అరంగేట్ర ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి(41) అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. అతడితో వికెట్ కీపర్ రిషబ్ పంత్(37) మరోసారి విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. ఆసీస్ బౌలర్లలో హాజిల్ వుడ్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. స్టార్క్, కమ్మిన్స్, మిచెల్ మార్ష్ తలా రెండు వికెట్లు సాధించారు.ఏడో వికెట్ కోల్పోయిన ఆసీస్కెప్టెన్ కమిన్స్ రూపంలో ఆస్ట్రేలియా ఏడో వికెట్ కోల్పోయింది. బుమ్రా బౌలింగ్‌లో వికెట్ కీపర్ పంత్‌కు క్యాచ్ ఇచ్చి కమిన్స్(3) పెవిలియన్ చేరాడు. స్టార్క్ క్రీజులోకి వచ్చాడు. ఆసీస్ స్కోరు: 59/7 (24.4). ఆరో వికెట్ డౌన్..భారత బౌలర్లు నిప్పులు చేరుగుతున్నారు. లబుషేన్ రూపంలో ఆస్ట్రేలియా ఆరో వికెట్ కోల్పోయింది. రెండు పరుగులు చేసిన లబుషేన్.. సిరాజ్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు. 23 ఓవర్లకు ఆసీస్ స్కోరు: 48-6ఆసీస్ ఐదో వికెట్ డౌన్..38 పరుగుల వద్ద ఆస్ట్రేలియా ఐదో వికెట్ కోల్పోయింది. 6 పరుగులు చేసిన మిచెల్ మార్ష్.. సిరాజ్ బౌలింగ్‌లో రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. క్రీజులోకి అలెక్స్ క్యారీ వచ్చాడు. 18 ఓవర్లకు ఆసీస్ స్కోరు: 39-5నాలుగో వికెట్ కోల్పోయిన ఆసీస్ఆస్ట్రేలియా నాలుగో వికెట్ కోల్పోయింది. 11 పరుగులు చేసిన ట్రావిస్ హెడ్.. హర్షిత్ రానా బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.కష్టాల్లో ఆసీస్.. 19 పరుగులకే 3 వికెట్లు డౌన్19 పరుగుల వద్ద ఆస్ట్రేలియా రెండు వికెట్లు కోల్పోయింది. బుమ్రా వరుస బంతుల్లో ఉస్మాన్ ఖ్వాజా (8), స్టీవ్ స్మిత్‌ను (0) ఔట్ చేశాడు. 7 ఓవర్ల అనంతరం ఆస్ట్రేలియా స్కోర్ 19/3గా ఉంది. ట్రవిస్ హెడ్, లబూషేన్ క్రీజ్‌లో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియానాథన్ మెక్స్వినీ రూపంలో ఆసీస్ తొలి వికెట్ కోల్పోయింది. పెర్త్ టెస్టుతో అరంగేట్రం చేసిన ఈ ఓపెనింగ్ బ్యాటర్.. 13 బంతులు ఎదుర్కొని 10 పరుగులు చేయగలిగాడు. బుమ్రా బౌలింగ్ బౌల్డ్ అయి పెవిలియన్ చేరాడు. ఖవాజా , లబుషేన్ క్రీజులో ఉన్నారు. ఆరు ఓవర్లలో ఆసీస్ స్కోరు: 19-1.150 పరుగులకు ఆలౌటైన టీమిండియా150 పరుగుల వద్ద టీమిండియా తొలి ఇన్నింగ్స్ ముగిసింది. నితీశ్ కుమార్ రెడ్డి (41) చివరి వికెట్‌గా వెనురిగాడు. కమిన్స్ బౌలింగ్‌లో ఖ్వాజాకు క్యాచ్ ఇచ్చి నితీశ్ ఔటయ్యాడు. తొమ్మిదో వికెట్ కోల్పోయిన టీమిండియాబుమ్రా రూపంలో టీమిండియా తొమ్మిదో వికెట్ కోల్పోయింది. హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ అలెక్స్ క్యారీకి క్యాచ్ ఇచ్చి బుమ్రా ఎనిమిది పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్ చేరాడు. సిరాజ్ క్రీజులోకి రాగా.. నితీశ్ రెడ్డి 35 పరుగులతో ఆడుతున్నాడు. భారత్‌స్కోరు: 144-9(49)ఎనిమిదో వికెట్ కోల్పోయిన టీమిండియా128 పరుగుల వద్ద టీమిండియా ఎనిమిదో వికెట్ కోల్పోయింది. హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో లబూషేన్ క్యాచ్ పట్టడంతో హర్షిత్ రాణా (7) ఔటయ్యాడు. నితీశ్ కుమార్‌కు (27) జతగా బుమ్రా క్రీజ్‌లోకి వచ్చాడు. ఏడో వికెట్ కోల్పోయిన టీమిండియా.. పంత్ ఔట్121 పరుగుల వద్ద టీమిండియా ఏడో వికెట్ కోల్పోయింది. కమిన్స్ బౌలింగ్‌లో స్టీవ్ స్మిత్‌కు క్యాచ్ ఇచ్చి రిషబ్ పంత్ (37) ఔటయ్యాడు. నితీశ్‌కుమార్ రెడ్డికి (27) జతగా హర్షిత్ రాణా క్రీజ్‌లోకి వచ్చాడు.ఆరో వికెట్ కోల్పోయిన టీమిండియా73 పరుగుల వద్ద టీమిండియా ఆరో వికెట్ కోల్పోయింది. మిచ్ మార్ష్ బౌలింగ్‌లో అలెక్స్ క్యారీకి క్యాచ్ ఇచ్చి వాషింగ్టన్ సుందర్ (4) పెవిలియన్ బాట పట్టాడు. రిషబ్ పంత్‌కు (17) జతగా నితీశ్ కుమార్ రెడ్డి క్రీజ్‌లోకి వచ్చాడు. 59 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన టీమిండియా59 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిపోయింది టీమిండియా. 59 పరుగుల వద్ద మిచ్ మార్ష్ బౌలింగ్‌లో లబూషేన్‌కు క్యాచ్ ఇచ్చి జురెల్ (11) ఔటయ్యాడు. రిషబ్ పంత్‌కు (10) జతగా వాషింగ్టన్ సుందర్ క్రీజ్‌లోకి వచ్చాడు. కష్టాల్లో టీమిండియాలంచ్ బ్రేక్ సమయానికి టీమిండియా స్కోరు: 51/4 (25)పంత్ పది, జురెల్ నాలుగు పరుగులతోక్రీజులో ఉన్నారు.నాలుగో వికెట్ కోల్పోయిన టీమిండియా47 పరుగుల వద్ద టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో అలెక్స్ క్యారీకి క్యాచ్ ఇచ్చి కేఎల్ రాహుల్ (26) ఔటయ్యాడు. రిషబ్ పంత్‌కు (10) జతగా ధృవ్ జురెల్ క్రీజ్‌లోకి వచ్చాడు.32 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన టీమిండియా32 పరుగుల వద్ద టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో ఉస్మాన్ ఖ్వాజాకు క్యాచ్ ఇచ్చి విరాట్ కోహ్లి (5) ఔటయ్యాడు. రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా14 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ అలెక్స్ క్యారీకి క్యాచ్ ఇచ్చి దేవ్‌దత్ పడిక్కల్ డకౌటయ్యాడు. కేఎల్ రాహుల్‌కు జతగా విరాట్ కోహ్లి క్రీజ్‌లోకి వచ్చాడు. తొలి వికెట్ కోల్పోయిన టీమిండియాటాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా ఆదిలోనే వికెట్ కోల్పోయింది. 5 పరుగుల టీమ్ స్కోర్ వద్ద యశస్వి జైస్వాల్ డకౌట్‌గా వెనుదిరిగాడు. మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో నాథన్ మెక్‌స్వీనికి క్యాచ్‌ని జైస్వాల్ పెవిలియన్ బాట పట్టాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్పెర్త్లోని అప్టస్ స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా తరఫున నితీశ్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా అరంగేట్రం చేయనున్నారు. ఆస్ట్రేలియా తరఫున ఓపెనర్ నాథన్ మెక్‌స్వీని డెబ్యూ చేయనున్నాడు. తుది జట్లు..ఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI): ఉస్మాన్ ఖ్వాజా, నాథన్ మెక్‌స్వీని, మార్నస్ లబూషేన్, స్టీవెన్ స్మిత్, ట్రవిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ క్యారీ(వికెట్‌కీపర్), పాట్ కమిన్స్(కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లియోన్, జోష్ హేజిల్వుడ్భారత్ (ప్లేయింగ్ XI): కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, దేవదత్ పడిక్కల్, విరాట్ కోహ్లి, రిషబ్ పంత్(వికెట్‌కీపర్), ధ్రువ్ జురెల్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, జస్ప్రీత్ బుమ్రా(కెప్టెన్), మహ్మద్ సిరాజ్ -
BGT: ఆసీస్‌తో తొలి టెస్ట్.. ఆంధ్రా కుర్రాడితో పాటు మరో ఆటగాడి అరంగేట్రం
క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మొదలైంది. భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగే ఈ ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. పెర్త్‌లోని ఆప్టస్ స్టేడియం వేదికగా జరుగుతున్న తొలి మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా తరఫున ఇద్దరు ఆటగాళ్లు అరంగేట్రం చేస్తున్నారు. ఆంధ్ర ఆటగాడు, పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి, పేసర్ హర్షిత్ రాణా తమ డెబ్యూ క్యాప్‌లు అందుకున్నారు. ఈ మ్యాచ్ కోసం టీమిండియా మరో కీలక మార్పు కూడా చేసింది. తుది జట్టులో రవిచంద్రన్ అశ్విన్ లాంటి సీనియర్‌ను ఆడిస్తారని అంతా అనుకున్నారు. అయితే మేనేజ్మెంట్ వాషింగ్టన్ సుందర్ వైపు మొగ్గు చూపింది. రోహిత్ శర్మ గైర్హాజరీలో కేఎల్ రాహుల్ భారత ఇన్నింగ్స్‌ను ఓపెన్ చేస్తాడు. అలాగే వన్‌డౌన్‌లో దేవ్‌దత్ పడిక్కల్ బరిలోకి దిగనున్నాడు. ధృవ్ జురెల్ స్పెషలిస్ట్ బ్యాటర్‌గా బరిలో ఉంటాడు. మరోవైపు ఆస్ట్రేలియా తరఫున ఓపెనర్ నాథన్ మెక్‌స్వీని అరంగేట్రం చేయనున్నాడు. మెక్‌స్వీని డేవిడ్ వార్నర్ స్థానాన్ని భర్తీ చేస్తున్నాడు.తుది జట్లు..ఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI): ఉస్మాన్ ఖ్వాజా, నాథన్ మెక్‌స్వీని, మార్నస్ లబూషేన్, స్టీవెన్ స్మిత్, ట్రవిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ క్యారీ(వికెట్‌కీపర్), పాట్ కమిన్స్(కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లియోన్, జోష్ హేజిల్వుడ్భారత్ (ప్లేయింగ్ XI): కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, దేవదత్ పడిక్కల్, విరాట్ కోహ్లి, రిషబ్ పంత్(వికెట్‌కీపర్), ధ్రువ్ జురెల్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, జస్ప్రీత్ బుమ్రా(కెప్టెన్), మహ్మద్ సిరాజ్ -
IND vs AUS: అమ్మో పెర్తా? భారత్‌ను భయపెడుతున్న గత రికార్డులు
క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25 ఆరంభానికి సమయం అసన్నమైంది. శుక్రవారం(నవంబర్ 22) పెర్త్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగే తొలి టెస్టుతో ఈ సిరీస్ మొదలుకానుంది.ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను విజయంతో ఆరంభించాలని ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి. పటిష్టమైన ఆస్ట్రేలియాను వారి సొంతగడ్డపై దెబ్బ కొట్టాలంటే భారత్ కచ్చితంగా అసాధారణ ప్రదర్శన చేయాల్సి ఉంది. న్యూజిలాండ్ చేతిలో వైట్‌వాష్ అయ్యి ఆస్ట్రేలియాకు వెళ్లిన భారత జట్టు.. కంగారుల దూకుడుకు ఎలా అడ్డుకుంటుందోనని అభిమానులు అతృతగా ఎదుచూస్తున్నారు. ముఖ్యంగా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్‌కు భారత్ ఆర్హత సాధించాలంటే ఈ సిరీస్ కీలకం. ఈ సిరీస్‌లో 4-0 తేడాతో ఆసీస్‌ను ఓడిస్తేనే భారత్ నేరుగా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు క్వాలిఫై అవుతోంది. ఇక తొలి టెస్టు జరిగే పెర్త్‌లో భారత్ రికార్డు ఎలా ఉందో ఓ లుక్కేద్దాం.ఆసీస్‌దే పై చేయి..?పెర్త్‌లోని ఆప్టస్ స్టేడియంలో టీమిండియాకు పేలవ రికార్డు ఉంది. ఈ మైదానంలో ఇప్పటివరకు భారత్-ఆస్ట్రేలియా మధ్య ఐదు టెస్టులు జరిగాయి. అందులో టీమిండియా కేవలం ఒక్కసారి మాత్రమే విజయం సాధించగా.. ఆస్ట్రేలియా 4 మ్యాచ్‌ల్లో గెలుపొందింది. చివరగా భారత్ 2018 పర్యటనలో ఈ స్టేడియంలో టెస్టు మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్‌లో 146 పరుగుల తేడాతో భారత్ ఓటమి చవిచూసింది.బ్యాటింగ్ రికార్డులు ఎలా ఉన్నాయంటే?ఈ ఆప్టస్ స్టేడియంలో టీమిండియా సాధించిన అత్యధిక స్కోర్ 402 పరుగులు. 1977లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో టీమిండియా తమ మొదటి ఇన్నింగ్స్‌లో 402 పరుగులు నమోదు చేసింది. ఈ వేదికలో భారత్ అత్యల్ప స్కోర్ 141 పరుగులగా ఉంది. 2018లో ఆసీస్‌తో జరిగిన టెస్టు సెకెండ్ ఇన్నింగ్స్‌లో 141 పరుగులకు మెన్ ఇన్ బ్లూ ఆలౌటైంది.విరాట్ ఒక్కడే..ఈ వేదికలో భారత్ నుంచి విరాట్ కోహ్లికి ఒక్కడికే మంచి రికార్డు ఉంది. పెర్త్‌లో ఇప్పటివరకు కేవలం రెండు టెస్టులు మాత్రమే ఆడిన కోహ్లి.. 259 పరుగులు చేసి లీడింగ్ రన్‌స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. ఈ మైదానంలో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన ప్లేయర్‌గా సునీల్ గవాస్కర్(127 పరుగులు, 1977లో) ఉన్నారు. అదేవిధంగా ఈ వేదికలో అత్యధిక వికెట్ల తీసిన జాబితాలో భారత్ నుంచి దిగ్గజం బిషన్ సింగ్ బేడీ(10 వికెట్లు) అగ్రస్ధానంలో ఉన్నారు.చదవండి: విధ్వంసం.. డబుల్ సెంచరీతో చెలరేగిన సెహ్వాగ్ కొడుకు -
టీమిండియాకు గుడ్ న్యూస్.. రోహిత్ శర్మ వచ్చేస్తున్నాడు!
పెర్త్ వేదికగా నవంబర్ 22 నుంచి ఆస్ట్రేలియాతో జరగనున్న తొలి టెస్టుకు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ దూరమైన విషయం తెలిసిందే. తన భార్య రితికా రెండో బిడ్డకు జన్మనివ్వడంతో రోహిత్ భారత్‌లోనే ఉండిపోయాడు. ఈ క్రమంలోనే ఈ ముంబైకర్ పెర్త్ టెస్టుకు అందుబాటులో లేడు.అయితే ఇప్పుడు రోహిత్ ఆస్ట్రేలియాకు పయనమయ్యేందుకు సిద్దమయ్యాడు. తొలుత డిసెంబర్ 6న ఆడిలైడ్ వేదికగా ప్రారంభం కానున్న రెండో టెస్టుకు ముందు హిట్‌మ్యాన్ జట్టుతో కలవనున్నట్లు వార్తలు వినిపించాయి. కానీ ఇప్పుడు భారత కెప్టెన్ తన మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. తొలి టెస్టు జరుగుతున్న సమయంలోనే రోహిత్ జట్టుతో కలవనున్నట్లు సమాచారం. నవంబర్ 24న రోహిత్ ఆస్ట్రేలియాకు చేరుకోనున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. తొలి టెస్టు మూడో రోజు ఆట సమయానికి భారత డ్రెస్సింగ్ రూమ్‌లో రోహిత్ ఉండనున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి."రోహిత్ శర్మ ఈ నెల 23 తేదీన ముంబై నుంచి ప్రత్యేక విమానంలో 24న పెర్త్ చేరుకోనున్నారు. ఆ తర్వాత అతడు జట్టుతో కలిసి తన సలహాలు, సూచనలు ఇవ్వనున్నాడు. అదే విధంగా అడిలైడ్‌లో జరిగే డే-నైట్ టెస్ట్ ప్రాక్టీస్ కోసం కోచింగ్ సిబ్బందితో చర్చించనున్నాడు.అదే విధంగా కాన్బెర్రాలో ప్రాక్టీస్ గేమ్‌కు రోహిత్ అందుబాటులో ఉంటాడు" అని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు. ఇక తొలి టెస్టులో ఎలాగైనా గెలిచి సిరీస్‌ను శుభారంభం చేయాలని భారత్ భావిస్తోంది. ఈ మ్యాచ్‌లో భారత కెప్టెన్‌గా జస్ప్రీత్ బుమ్రా వ్యవహరించనున్నాడు.చదవండి: మైదానంలో ఫ్రెండ్స్ ఉండరు.. గంభీర్ దూకుడు సరైనదే: ఆసీస్ లెజెండ్ -
మైదానంలో ఫ్రెండ్స్ ఉండరు.. గంభీర్ దూకుడు సరైనదే: ఆసీస్ లెజెండ్
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్ ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు శుక్రవారం(నవంబర్ 22) నుంచి పెర్త్ వేదికగా ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు తమ అస్త్రశస్త్రాలను సిద్దం చేసుకున్నాయి. న్యూజిలాండ్ చేతిలో వైట్‌వాష్ అయిన భారత్ జట్టు ఈ సిరీస్‌ను ఎలా ఆరంభిస్తుందోనని అందరూ అతృతగా ఎదురుచూస్తున్నారు. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు టీమిండియా నేరుగా ఆర్హత సాధించాలంటే ఈ సిరీస్‌లో ఆతిథ్య ఆసీస్‌ను 4-1తో ఓడించాలి. మరోవైపు ఈ సిరీస్‌తో భారత సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ టెస్టు భవితవ్యం తేలిపోనుంది. భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్‌కు క్వాలిఫై కాకపోతే ఈ సీనియర్ ద్వయం టెస్టులకు విడ్కోలు పలికే అవకాశముంది.వీరిద్దరిపైనే కాకుండా భారత హెడ్‌కోచ్‌పై కూడా అందరి కళ్లు ఉన్నాయి. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ వంటి ప్రతిష్టాత్మక సిరీస్‌లో గంభీర్ కోచింగ్ వ్యూహాలు ఎలా ఉంటాయో అని భారత ప్యాన్స్ వెయ్యికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో గంభీర్‌పై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ కీలక వ్యాఖ్యలు చేశాడు. మైదానంలో గంభీర్ వైఖరిని క్లార్క్ సమర్థించాడు. ఐపీఎల్ వంటి ఫ్రాంచైజీ లీగ్‌ల వల్ల ఆటగాళ్ల మధ్య స్నేహం ఏర్పడి, పోటీతత్వం తగ్గిపోయిందని క్లార్క్ వ్యాఖ్యనించాడు."ప్రపంచవ్యాప్తంగా ఐపీఎల్ వంటి ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్‌లు చాలా వచ్చాయి. కాబట్టి వేర్వేరు దేశాల ఆటగాళ్లు ఆయా ఫ్రాంచైజీలకు ఆడేటప్పుడు ఎక్కువ సమయం కలిసి ఉంటున్నారు. దీంతో ఆటగాళ్ల మధ్య స్నేహం ఏర్పడి, అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడేటప్పడు ప్రత్యర్ధి ఆటగాళ్లపై దూకుడు చూపలేకపోతున్నారు. గతంలో మేము ఆడేటప్పుడు ప్రత్యర్ధిలుగానే చూసేవాళ్లం. ఎందుకంటే మేము ఆడేటప్పుడు ఐపీఎల్ వంటి లీగ్‌లు లేవు. ఒకరికొకరు బాగా పరిచయం ఉన్నప్పటకి దేశం కోసం ఆడేటప్పుడు ఫీల్డ్‌లో దూకుడుగా ఉండాల్సిందే. మైదానంలో మనకు ఎవరూ స్నేహితులు ఉండరు.ఆఫ్‌ది ఫీల్డ్ ఎలా ఉన్నా పర్వాలేదు, ఆన్ది ఫీల్డ్‌లో మాత్రం ప్రత్యర్థులుగానే చూడాలి. మీరు దేశం కోసం ఆడుతున్నారు, ఒకే ఐపీఎల్ జట్టులో ఆడటం లేదనే సంగతిని గుర్తుంచుకోవాలి. గతంలో భారత జట్టు ఇదే దూకుడు కనబరిచింది. అందుకే గత రెండు పర్యటనలలో ఆస్ట్రేలియాలో భారత్ విజయం సాధించింది. హెడ్ కోచ్ గంభీర్ దూకుడు భారత జట్టుకు మంచిదే. ఆస్ట్రేలియా కూడా అదే మైండ్ సెట్‌తో ఉంది. కాబట్టి ఈ సిరీస్ మరోసారి అభిమానులను మునివేళ్లపై నిలబెట్టనుంది" అని క్లార్క్ పేర్కొన్నాడు.చదవండి: టాలెంటెడ్ కిడ్.. ఇక్కడ కూడా.. : నితీశ్ రెడ్డిపై కమిన్స్ కామెంట్స్ -
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్..! 'ఐరెన్ లెగ్' అంపైర్ వచ్చేశాడు
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25కు సర్వం సిద్దమైంది. మరి కొన్ని గంటల్లో ఈ ప్రతిష్టాత్మక సిరీస్‌కు తెర లేవనుంది. ఈ సిరీస్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు నవంబర్ 22 నుంచి పెర్త్ వేదికగా ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను శుభారంభం చేయాలని ఇరు జట్లు భావిస్తున్నాయి.అందుకు తగ్గట్టే ఇరు జట్లు నెట్స్‌లో తీవ్రంగా శ్రమించాయి. ఇక పెర్త్ వేదికగా జరిగే ఈ తొలి టెస్టుకు అంపైర్లను ఐసీసీ ప్రకటించింది. రిచర్డ్ కెటిల్‌బరో, క్రిస్ గాఫ్నీలు ఆన్-ఫీల్డ్ అంపైర్లుగా వ్యవహరించనున్నారు. అదేవిధంగా రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్ థర్డ్ అంపైర్‌గా, సామ్ నోగాజ్స్కీ నాలుగో అంపైర్‌గా, రంజన్ మదుగల్లె మ్యాచ్ రిఫరీగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు.అయితే ఈ జాబితాలో రిచర్డ్ కెటిల్‌బరో ఉండడంతో భారత అభిమానులు తెగ టెన్షన్ పడుతున్నారు. గతంలో భారత్ ఓడిపోయిన ప్రతీ కీలక మ్యాచ్‌లోనూ రిచర్డ్ కెటిల్‌బరోనే అంపైర్ కావడం గమనార్హం. ముఖ్యంగా అతడు అంపైర్‌గా ఉన్న ఒక్క ఐసీసీ నాకౌట్ మ్యాచ్‌లోనూ భారత్ విజయం సాధించలేదు. దీంతో ఫ్యాన్స్ అతడిని ఐరెన్ లెగ్ అంపైర్‌గా పిలుస్తుంటారు. ఈసారి మరి ఫలితం ఏవిధంగా ఉంటుందో ఎదురు చూడాలి.చదవండి: ఇదంతా విరాట్ భాయ్ వల్లే.. అతడే నాకు ఆదర్శం: యశస్వీ జైశ్వాల్