BSE
-
మార్కెట్లో మతాబులు వెలిగేనా?
ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లపై పలు అంశాలు ప్రభావం చూపనున్నాయి. దేశీయంగా కార్పొరేట్ల క్యూ2 ఫలితాలు, అక్టోబర్ ఎఫ్‌అండ్‌వో సిరీస్ ముగింపు కీలకంగా నిలవనున్నాయి. దీంతో ఈ వారం మార్కెట్లు ఆటుపోట్లకు లోనుకానున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. మరోవైపు ఇప్పటికే వేడెక్కిన అమెరికా అధ్యక్ష ఎన్నికలు, పశి్చమాసియాలో తలెత్తిన యుద్ధ భయాలు సైతం ట్రెండ్‌ను ప్రభావితం చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రపంచ స్టాక్ మార్కెట్ల తీరు, క్యూ2 ఫలితాలపై ఇన్వెస్టర్లు ప్రధానంగా దృష్టి సారించనున్నారు. ఈ వారం బీహెచ్ఈఎల్, డాబర్ ఇండియా, గౌతమ్ అదానీ గ్రూప్ కంపెనీలు.. అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పోర్ట్స్ అండ్ సెజ్, అదానీ పవర్ జులై–సెపె్టంబర్(క్యూ2) పనితీరును వెల్లడించనున్నాయి. గురువారం(31న) అక్టోబర్ డెరివేటివ్స్ గడువు ముగియనుంది. ఇది మార్కెట్లలో హెచ్చుతగ్గులకు కారణంకావచ్చని స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా అంచనా వేశారు. స్వల్ప కాలంలో మార్కెట్లు కన్సాలిడేట్ కావచ్చని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయిర్ పేర్కొన్నారు. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల అమ్మకాలు ఆగడం, యూఎస్ అధ్యక్ష ఎన్నికలు పూర్తికావడం వంటి అంశాలు ట్రెండ్ రివర్స్‌కు దోహదం చేయవచ్చని అభిప్రాయపడ్డారు. ఎఫ్‌పీఐల ఎఫెక్ట్ కొద్ది రోజులుగా దేశీ స్టాక్స్‌లో వెల్లువెత్తుతున్న ఎఫ్‌పీఐల అమ్మకాలు ఇన్వెస్టర్లను ఆందోళనకు లోనుచేస్తున్నట్లు నాయిర్ పేర్కొన్నారు. ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితంకానుంది. దీపావళి సందర్భంగా శుక్రవారం(నవంబర్ 1) మార్కెట్లకు సెలవుకాగా.. సంవత్ 2081 ప్రారంభం సందర్భంగా స్టాక్ ఎక్సే్ఛంజీలు గంటపాటు ప్రత్యేక ట్రేడింగ్‌ను నిర్వహించనున్నాయి. ఎప్పటిలాగే బీఎస్ఈ, ఎన్ఎస్ఈ.. సాయంత్రం 6–7 మధ్య ముహూరత్ ట్రేడింగ్‌కు తెరతీయనున్నాయి. నిరుత్సాహకర క్యూ2 ఫలితాలు, ఎఫ్‌పీఐల భారీ అమ్మకాల నేపథ్యంలో గత వారం మార్కెట్లు పతనబాటలో సాగిన సంగతి తెలిసిందే. దీంతో సెంటిమెంటు బలహీనపడినట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ చీఫ్ఇన్వెస్ట్మెంట్ వ్యూహకర్త వీకే విజయ్‌కుమార్ తెలియజేశారు. అందుబాటు ధరల్లో ఉన్న చైనా మార్కెట్లు, అక్కడి ప్రభుత్వ సహాయక ప్యాకేజీ ఎఫ్‌పీఐ అమ్మకాలకు కారణమవుతున్నట్లు తెలియజేశారు. విదేశీ అంశాలు ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధ పరిస్థితులు, ముడిచమురు ధరలు కీలకంగా నిలవనున్నట్లు సంతోష్ పేర్కొన్నారు. వీటికితోడు ఎఫ్‌పీఐల తీరు, క్యూ2 ఫలితాలకూ ప్రాధాన్యత ఉన్నట్లు వివరించారు. యూఎస్ అధ్యక్ష ఎన్నికలకు ముందు ప్రపంచవ్యాప్తంగా ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరించనున్నట్లు తెలియజేశారు. ఈ వారం యూఎస్ క్యూ3(జులై–సెపె్టంబర్) జీడీపీ గణాంకాలు, సెప్టెంబర్ ఉపాధి రిపోర్ట్, చైనా తయారీ రంగ డేటాతోపాటు.. యూఎస్ పీసీఈ ధరలు వెల్లడికానున్నాయి. ఇవి ఫెడరల్ రిజర్వ్ ద్రవ్యోల్బణ అంచనాలపై ప్రభావం చూపే విషయం విదితమే. జపాన్ మానిటరీ పాలసీ సమావేశం జరగనుంది. 2.2 శాతం డౌన్ గత వారం దేశీ స్టాక్ మార్కెట్లు అమ్మకాలతో నీరసించాయి. సెన్సెక్స్ నికరంగా 1,822 పాయింట్లు(2.25 శాతం) పతనమై 79,402 వద్ద నిలవగా.. నిఫ్టీ మరింత ఎక్కువగా 673 పాయింట్లు(2.7 శాతం) కోల్పోయి 24,181 వద్ద ముగిసింది. మిడ్‌క్యాప్ 5.2 శాతం, స్మాల్‌క్యాప్ 7.4 చొప్పున కుప్పకూలాయి. కాగా.. దేశీ మార్కెట్ రికార్డ్ గరిష్టం నుంచి 8 శాతం పతనమైనట్లు మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ వెల్త్‌మేనేజ్‌మెంట్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా ప్రస్తావించారు. ఇందుకు నిరాశపరుస్తున్న క్యూ2 ఫలితాలు, ఎఫ్‌పీఐల అమ్మకాలు కారణమవుతున్నట్లు తెలియజేశారు. సమీపకాలంలో ఈ ట్రెండ్ కొనసాగే వీలున్నట్లు అభిప్రాయపడ్డారు. ఎఫ్‌పీఐల అమ్మకాల రికార్డ్ గత నెలలో దేశీ స్టాక్స్‌లో నికర ఇన్వెస్టర్లుగా నిలిచిన ఎఫ్‌పీఐలు ఉన్నట్టుండి అక్టోబర్‌లో అమ్మకాల బాట పట్టారు. ఇటీవల అమ్మకాల స్పీడ్ పెంచి నిరవధికంగా స్టాక్స్ నుంచి వైదొలగుతున్నారు. తద్వారా ఈ నెలలో ఇప్పటివరకూ నికరంగా రూ. 85,790 కోట్ల(10.2 బిలియన్ డాలర్లు) పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు. వెరసి మార్కెట్ చరిత్రలోనే అక్టోబర్ నెల అత్యధిక విక్రయాల రికార్డ్‌కు వేదికకానుంది. అంతక్రితం నెల(సెపె్టంబర్)లో ఎఫ్‌పీఐలు గత 9 నెలల్లోనే అత్యధికంగా రూ. 57,724 కోట్లు ఇన్వెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కాగా.. ఇంతక్రితం 2020 మార్చిలో మాత్రమే ఎఫ్‌పీఐలు ఒక నెలలో అత్యధికంగా రూ. 61,973 కోట్ల విలువైన ఈక్విటీలను విక్రయించారు.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
ఐపీఓతో రూ.4,000 కోట్లు సమీకరణ
కమ్యునిషన్ పరికరాలు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వంటి వ్యక్తిగత రక్షణ ఉత్పత్తులను తయారు చేస్తున్న ఎస్పీపీ లిమిటెడ్ సంస్థ ఐపీఓతో స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవ్వనుంది. సంస్థ వ్యాపారంపై ఆసక్తి ఉన్న పెట్టుబడిదారుల నుంచి రూ.4,000 కోట్లు సమీకరించాలని కంపెనీ భావిస్తోంది. ఈమేరకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ)కు డీఆర్‌హెచ్‌పీ దాఖలు చేసింది.ఇదీ చదవండి: గూగుల్‌లో 15 జీబీ స్టోరేజ్ నిండిందా? ఇలా చేయండి..ఈ ఆఫర్లో భాగంగా రూ.580 కోట్ల విలువ చేసే షేర్లను తాజాగా జారీ చేయనుండగా, సెల్లింగ్ షేర్హోల్డర్లు రూ.3,420 కోట్ల వరకు విలువ చేసే షేర్లను ఆఫర్ ఫర్ సేల్ మార్గంలో విక్రయించనున్నారు. డీఆర్‌హెచ్‌పీ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఎస్ఎంపీపీ లిమిటెడ్ షేర్లు బీఎస్ఈ, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఎస్ఈ)లో లిస్ట్ అవుతాయి. అయితే ఐపీఓ కోసం ఎప్పుడు దరఖాస్తు చేసుకోవాలి.. చివరి తేదీ ఎప్పుడు.. లిస్టింగ్ ప్రైస్, లాట్ సైజ్.. వంటి పూర్తి వివరాలు ఇంకా వెలువడాల్సి ఉంది. -
రేసు గుర్రాలు.. చిన్న షేర్లు
కొద్ది నెలలుగా సరికొత్త గరిష్టాల రికార్డులను నెలకొల్పుతూ సాగుతున్న దేశీ స్టాక్ మార్కెట్లలో ఇటీవల మధ్య, చిన్నతరహా కౌంటర్లు సైతం జోరు చూపుతున్నాయి. వెరసి సెన్సెక్స్‌ను మించి బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్సులు లాభాల దౌడు తీస్తున్నాయి. వివరాలు చూద్దాం..ఈ క్యాలెండర్ ఏడాదిలో ఇప్పటివరకూ మధ్య, చిన్నతరహా కౌంటర్లకు భారీ డిమాండ్ కనిపిస్తోంది. చిన్న షేర్లు మార్కెట్ ఫేవరెట్లుగా నిలుస్తున్నాయి. దీంతో పలు చిన్న షేర్లు పెద్ద(భారీ) లాభాలను అందిస్తున్నాయి. ఇందుకు దేశీ ఆర్థిక వ్యవస్థ మూలాలు పటిష్టంగా ఉండటం, మెరుగుపడిన లిక్విడిటీ తదితర అంశాలు తోడ్పాటునిస్తున్నట్లు మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. వెరసి ఈ ఏడాది జూలై 16(మంగళవారం)వరకూ చూస్తే బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 10,985 పాయింట్లు(30 శాతం) దూసుకెళ్లింది. ఈ బాటలో స్మాల్‌క్యాప్ సైతం 11,628 పాయింట్లు(27 శాతంపైగా) జంప్‌చేంది. ఇదే కాలంలో బీఎస్ఈ ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్ కేవలం 8,476 పాయింట్ల(12 శాతం) ర్యాలీ చేసింది.ఏషియన్ పెయింట్స్ లాభం డౌన్ రూ. 1,187 కోట్లుగా నమోదు న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ దిగ్గజం ఏషియన్ పెయింట్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) తొలి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం 25 శాతం క్షీణించి రూ. 1,187 కోట్లకు పరిమితమైంది. వేసవి ఎండలు, సార్వత్రిక ఎన్నికల కారణంగా పెయింట్లకు డిమాండ్ మందగించడం ప్రభావం చూపినట్లు కంపెనీ ఎండీ, సీఈవో అమిత్ సింగ్లే పేర్కొన్నారు. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 1,575 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 9,182 కోట్ల నుంచి రూ. 8,970 కోట్లకు స్వల్పంగా నీరసించింది. మొత్తం వ్యయాలు మాత్రం రూ. 7,305 కోట్ల నుంచి రూ. 7,559 కోట్లకు పెరిగాయి. ఈ కాలంలో డెకొరేటివ్ విభాగం అమ్మకాల పరిమాణం 7% పుంజుకున్నప్పటికీ ప్రొడక్ట్ మిక్స్‌లో మార్పులు, ధరల తగ్గింపు వంటి అంశాలు లాభదాయకతను దెబ్బతీసినట్లు అమిత్ పేర్కొన్నారు. ముడిసరుకుల ధరలు, సప్లైచైన్ సవాళ్లు సైతం ఇందుకు జత కలసినట్లు వెల్లడించారు. అయితే ఇండ్రస్టియల్ బిజినెస్ 6% పుంజుకున్నట్లు తెలిపారు.పర్యాటకానికి పరిశ్రమ హోదా..జీఎస్టీ రేటు క్రమబదీ్ధకరించాలి ట్రావెల్ ఏజెంట్ల సమాఖ్య టీఏఏఐ డిమాండ్ పర్యాటకానికి ఊతమిచ్చే దిశగా బడ్జెట్లో చర్యలు తీసుకోవాలని, టూరిజానికి పరిశ్రమ హోదా కలి్పంచాలని ట్రావెల్ ఏజెంట్ల సమాఖ్య టీఏఏఐ కేంద్రాన్ని కోరింది. అలాగే వీసా నిబంధనలను సరళతరం చేయడం, వీసా–ఫ్రీ ఎంట్రీని ప్రోత్సహించడం, జీఎస్టీ రేట్లను క్రమబద్ధీకరించడం వంటి అంశాలపై దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేసింది. దేశ జీడీపీలో సుమారు 5.8 శాతం వాటాతో, 2047 నాటికి 1 లక్ష కోట్ల డాలర్ల లక్ష్యం పెట్టుకున్న ట్రావెల్, టూరిజం రంగానికి బడ్జెట్‌పై సానుకూల అంచనాలు ఉన్నట్లు వివరించింది. వీటిని అమలు చేస్తే ఇటు వ్యాపారాలు, అటు ప్రయాణికులకు కూడా ప్రయోజనం చేకూరగలదని టీఏఏఐ పేర్కొంది. కొత్త ఎయిర్‌పోర్టుల ఏర్పాటు, రైల్వేలు.. రహదారులు .. జలమార్గాల విస్తరణ ద్వారా మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం రాబోయే బడ్జెట్లోనూ ప్రధానంగా దృష్టి పెట్టడాన్ని కొనసాగించగలదని ఆశిస్తున్నట్లు టీఏఏఐ వివరించింది. జీఎస్టీపై సానుకూలంగా వ్యవహరిస్తే టూరిస్టులకు బస ఏర్పాట్లు అందుబాటు స్థాయిలోకి రాగలవని, ఈ రంగంలో పెట్టుబడులకు ప్రోత్సాహం లభించగలదని పేర్కొంది.మరోవైపు, హోటళ్లపై ప్రస్తుతం వివిధ రకాలుగా ఉన్న జీఎస్టీ రేటును 12 శాతానికి క్రమబదీ్ధకరించాలని ఆన్లైన్ ట్రావెల్ సేవల సంస్థ మేక్మైట్రిప్ సహ వ్యవస్థాపకుడు రాజేష్ మగోవ్ తెలిపారు. ప్రస్తుతం గది అద్దె, సీజన్ తదితర అంశాలను బట్టి ఇది 12 శాతం, 18 శాతంగా ఉంటోందన్నారు. పర్యావరణ అనుకూల విధానాలు పాటించే హోటళ్లు, హోమ్‌స్టేలకు పన్నులపరమైన ప్రోత్సాహకాలు ఇచ్చే అంశాన్ని కూడా పరిశీలించాలని ఆయన చెప్పారు. ‘విద్యుత్ ఆదా చేసే లైటింగ్, నీటిని ఆదా చేసే డివైజ్‌లు, వ్యర్ధాలను తగ్గించే విధానాలను పాటించే వారికి పన్నులపరమైన మినహాయింపులు ఇస్తే పర్యావరణహిత లక్ష్యాల సాధనలో పరిశ్రమ కూడా భాగం కావడానికి తోడ్పడగలదు‘ అని రాజేష్ వివరించారు. పర్యాటకం, ఆతిథ్య రంగానికి మౌలిక పరిశ్రమ హోదా కలి్పస్తే మరిన్ని పెట్టుబడులు రావడానికి ఆస్కారం ఉంటుందని హోటల్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ (వెస్టర్న్ ఇండియా) ప్రెసిడెంట్ ప్రదీప్ శెట్టి పేర్కొన్నారు.బుల్ మార్కెట్ దేశీయంగా లిక్విడిటీ పరిస్థితులు బలపడటం మిడ్, స్మాల్ క్యాప్ షేర్ల వృద్ధికి కారణమవుతున్నట్లు స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ లిమిటెడ్ ఎండీ సునీల్ న్యాతి పేర్కొన్నారు. మ్యూచువల్ ఫండ్స్, పోర్ట్‌ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసులు(పీఎంఎస్), ప్రత్యక్ష పెట్టుబడుల ద్వారా నిధులు చిన్న షేర్లలోకి ప్రవహిస్తున్నట్లు తెలియజేశారు. ప్రస్తుతం దేశీయంగా దీర్ఘకాలిక(స్ట్రక్చరల్) బుల్ ట్రెండ్‌లో మార్కెట్ కొనసాగుతున్నట్లు అభిప్రాయపడ్డారు. దీంతో మిడ్, స్మాల్ క్యాప్స్ మార్కెట్లను మించి పరుగు తీస్తున్నట్లు తెలియజేశారు. అయితే లార్జ్‌క్యాప్ స్టాక్స్ సైతం ర్యాలీ చేస్తున్నప్పటికీ చిన్న షేర్లతో పో లిస్తే వెనకబడుతున్నట్లు వివరించారు. ఎఫ్ ఐఐల అమ్మకాలు ఇందుకు కారణమన్నారు. ప్రస్తుతం యూఎస్ అధ్యక్షతన ప్రపంచవ్యాప్తంగా బుల్ మార్కెట్ల హవా కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. షేర్ల విలువలరీత్యా చూస్తే లార్జ్ క్యాప్స్ మరింత బలపడేందుకు వీలున్నట్లు అంచనా వేశారు. గతేడాది చివర్లో అమ్మకాలకు ప్రాధాన్యత ఇచి్చన ఎఫ్ఐఐలు ప్రస్తుతం పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నట్లు తెలియజేశారు. సరికొత్త రికార్డులు బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ ఈ మంగళవారం(16న) 48,175 పాయింట్లను అధిగమించి చరిత్రాత్మక గరిష్టాన్ని అందుకుంది. అంతకుముందే అంటే ఈ నెల 8న స్మాల్‌క్యాప్ 54,618 పాయింట్లకు చేరడం ద్వారా సరికొత్త గరిష్టాన్ని లిఖించింది. ఇక మరోవైపు సెన్సెక్స్ ఈ నెల 16నే 80,898ను తాకి చరిత్రాత్మక రికార్డుకు తెరతీసింది. ఇందుకు టెక్నాలజీ, హెల్త్‌కేర్, కన్జూమర్ గూడ్స్ రంగాలు ప్రధానంగా దోహదపడినట్లు మాస్టర్ క్యాపిటల్ సరీ్వసెస్ సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ అరి్వందర్ సింగ్ నందా పేర్కొన్నారు. అందుబాటులో షేర్ల విలువలు, అధిక వృద్ధికి వీలు, ఆర్థిక పురోగతి వంటి అంశాలు ఇన్వెస్టర్లకు ప్రోత్సాహాన్నిస్తున్నట్లు తెలియజేశారు. కాగా.. మిడ్, స్మాల్ క్యాప్స్‌లో దిద్దుబాటుకు వీలున్నట్లు సునీల్ అభిప్రాయపడ్డారు. అయితే ప్రస్తుతం పటిష్ట లిక్విడిటీ పరిస్థితుల కారణంగా కరెక్షన్ సమయాన్ని అంచనా వేయలేమని తెలియజేశారు. విధానాల్లో మార్పులు, ఫలితాల్లో నిరాశ తదితర అంశాలు ఇందుకు దారిచూపవచ్చని అభిప్రాయపడ్డారు. వచ్చే వారం వెలువడనున్న సార్వత్రిక బడ్జెట్ సానుకూలంగా ఉండవచ్చని, దీంతో మార్కెట్ల ర్యాలీ కొనసాగేందుకు వీలున్నదని పలువురు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గిస్తే దేశీ స్టాక్స్‌లో మరిన్ని పెట్టుబడులకు వీలుంటుందని అభిప్రాయపడ్డారు. సాధారణంగా చిన్న షేర్లను దేశీ ఫండ్స్, రిటైలర్లు కొనుగోలు చేస్తే, లార్జ్ క్యాప్స్‌లో పెట్టుబడులకు విదేశీ ఇన్వెస్టర్లు ఆసక్తి చూపే సంగతి తెలిసిందే. దేశ ఆర్థిక పరిస్థితులు, కార్పొరేట్ ఫలితాలు, ఇన్వెస్టర్ల సెంటిమెంటు, గ్లోబల్ మార్కెట్లు వంటి పలు అంశాలు మార్కెట్ల ట్రెండ్‌ను నిర్దేశిస్తుంటాయని మార్కెట్ నిపుణులు వివరించారు. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
మార్కెట్ రికార్డుల హ్యాట్రిక్
ముంబై: స్టాక్ సూచీల రికార్డుల జోరు మూడో రోజూ కొనసాగింది. ఐటీ, ఎఫ్ఎంసీజీ, టెలికం షేర్లు రాణించడంతో పాటు విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్ల అంశాలు కలిసొచ్చాయి. సెన్సెక్స్ 52 పాయింట్లు పెరిగి 80,717 వద్ద ముగిసింది. నిఫ్టీ 26 పాయింట్ల లాభంతో 24,613 వద్ద స్థిరపడింది. ముగింపు స్థాయిలు సూచీలకు సరికొత్త రికార్డు. ఉదయ లాభాలతో మొదలైన సూచీలు.., అధిక వాల్యుయేషన్ల ఆందోళనల తో పరిమిత శ్రేణిలో కదలాడాయి. అయినప్పటికీ.., ఒక దశలో సెన్సెక్స్ 233 పాయింట్లు బలపడి 80,862 వద్ద, నిఫ్టీ 133 పాయింట్లు ఎగసి 24,635 వద్ద జీవితకాల గరిష్టాలు నమోదు చేశాయి. ఫైనాన్షియల్ సరీ్వసెస్, యుటిలిటీ, బ్యాంకులు, క్యాపిటల్ గూడ్స్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. వడ్డీరేట్ల తగ్గింపు అంచనాలతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు లాభాల బాటపట్టాయి.⇒ మొహర్రం సందర్భంగా బీఎస్ఈ, ఎన్ఎస్ఈలకు నేడు సెలవు. ట్రేడింగ్ జరగదు. అయితే కమోడిటీ, ఫారెక్స్ మార్కెట్లలో మాత్రం సాయంత్రంసెషన్‌లో ట్రేడింగ్ జరుగుతుంది.వేదాంతా క్విప్ ధర రూ. 461 వేదాంతా అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల జారీ (క్విప్)కి తెరతీసింది. షేరుకి రూ. 461.26 ఫ్లోర్ ధరలో రూ. 8,500 కోట్లు సమీకరించనుంది. నిధులను రుణ చెల్లింపులు, పెట్టుబడి వ్యయాలకు వినియోగించనుంది. సోమవారం ముగింపు ధర రూ. 459.4తో పోలిస్తే ఫ్లోర్ ధర స్వల్ప ప్రీమియం. వేదాంతా షేరు బీఎస్ఈలో 1% నీరసించి రూ. 456 వద్ద ముగిసింది. -
లాభాల్లో దేశీయ స్టాక్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ శుక్రవారం ఉదయం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.30గంటల సమయానికి సెన్సెక్స్ 550 పాయింట్ల లాభంతో 74436 వద్ద నిఫ్టీ 155 పాయింట్ల లాభంతో 22644 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.అదానీ ఎంటర్ ప్రైజెస్,లార్సెన్, అదానీ పోర్ట్స్, ఎం అండ్ ఎం, అపోలో హాస్పిటల్స్, బజాజ్ ఫిన్ సర్వీ, ఎన్టీపీసీ, టాటా మోటార్స్, ఆల్ట్రా టెక్ సిమెంట్, సన్ ఫార్మా షేర్లు లాభాల్లో ట్రేడవుతుండగా.. ఇన్ఫోసిస్, ఎల్టీఐ మైండ్ ట్రీ, భారతీ ఎయిర్టెల్,సిప్లా, టాటా కాన్స్, హెచ్‌సీఎల్ టెక్నాలజీ, ఎథేర్ మోటార్స్ కొటక్ మహీంద్రా, టీసీఎస్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి. -
సెబీ కొత్త నిబంధనలు..రియల్ టైం షేర్ వ్యాల్యూ షేరింగ్‌పై
స్టాక్ మార్కెట్ మదపర్లకు ముఖ్యగమనిక. వివిధ ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్‌లతో పాటు థర్డ్ పార్టీ యాప్‌లకు రియల్ టైమ్ షేర్ వ్యాల్యూ సమాచారాన్ని అందించే అంశంపై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త నిబంధనల్ని అమల్లోకి తెచ్చింది.ఈ సందర్భంగా నిర్దిష్ట ఆన్లైన్ గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌లు, యాప్‌లు, వెబ్సైట్లు మొదలైనవి రియల్ టైం షేర్ వ్యాల్యూ ఆధారంగా వర్చువల్ ట్రేడింగ్ (పేపర్ కరెన్సీ), పలు ట్రేడింగ్ చేయడం ఎలాగో నేర్పించే ఫాంటసీ గేమ్ తయారీ సంస్థలకు అందిస్తున్నట్లు దృష్టికి వచ్చింది. అంతేకాదు కొన్ని లిస్టెడ్ కంపెనీలు సైతం సంబంధిత వర్చువల్ స్టాక్ పోర్ట్‌ఫోలియో పనితీరు ఆధారంగా రివార్డ్స్ లేదంటే డబ్బుల్ని చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విధానంపై పెట్టుబడిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని, వారి సమస్యకు పరిష్కార మార్గంగా సెబీ కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చింది. సెబీ ప్రకారం, అనుమతులు లేకుండా రియల్ ట్రైం ట్రేడింగ్ వ్యాల్యూ ఏంటనేది మధ్యవర్తులకు చేరవేయకూడదని తెలిపింది. ఒకవేళ్ల పంపించాల్సి వస్తే వ్రాతపూర్వక ఒప్పందాలపై సంతకం చేయాలి. ఈ బాధ్యతల్ని మార్కెట్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ ఇనిస్టిట్యూషన్లు (ఎంఐఐఎస్)లు పరిశీలించాల్సి ఉంటుందని సెబీ తన మార్గదర్శకాల్లో వెల్లడించింది. సర్క్యులర్ విడుదలైన ముప్పై రోజుల తర్వాత కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా పెట్టుబడిదారులకు అవగాహన కల్పించడం, అవగాహన కల్పించడం కోసం మార్కెట్ ధరల డేటాను పంచుకునేటప్పుడు ఆర్థిక ప్రోత్సాహకాలు అవసరం లేదని సెబీ పేర్కొంది -
జెరోధా ట్రేడర్లకు అలెర్ట్.. అదిరిపోయే ఫీచర్‌తో
ప్రముఖ బ్రోకరేజీ సంస్థ జెరోదా తన కస్టమర్ల కోసం కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. తన జెరోధా కైట్‌లో ట్రేడర్ల కోసం నోట్స్ అనే ఫీచర్‌ను డెవలప్ చేసింది.జెరోధా కైట్‌లో ట్రేడింగ్ చేసే ఇన్వెస్టర్లకు ఎలాంటి అంతరాయం కలగకుండా నిర్విరామంగా ట్రేడింగ్ చేసుకోవచ్చు. అదే సమయంలో ట్రేడర్లు ఆయా స్టాక్స్‌పై ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేస్తున్నామో తెలుసుకునేందుకు ఈ నోట్స్ ఫీచర్స్‌తో ట్రాక్ చేసుకోవచ్చని జెరోధా ప్రతినిధులు చెబుతున్నారు. Introducing notes on Kite web.At any given point in time, you may be tracking multiple stocks for different reasons. Even if you add the stocks on your marketwatch, it's hard to remember all the reasons why you added them. Now, you can easily add a quick note about why you are… pic.twitter.com/Su7AKm34Ip— Zerodha (@zerodhaonline) May 14, 2024 ప్రస్తుతం ఈ ఫీచర్ కౌట్ వెబ్సైట్లో మాత్రమే అందుబాటులో ఉందని, త్వరలోయాపల్లో సైతం అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు జెరోధా ట్వీట్ చేసింది. ‘ఏ సమయంలోనైనా, మీరు వివిధ కారణాల వల్ల పలు స్టాక్స్‌ను ట్రాక్ చేయొచ్చు. కొన్ని సార్లు మీరు ఆయా స్టాక్స్ ఎందుకు ఎంచుకున్నారో గుర్తించుకోవడం కష్టం. ఆ సమస్యను అధిగమించేలా నోట్ అనే టూల్‌ను అందిస్తున్నట్లు జెరోధా తన ట్వీట్లో పేర్కొంది. -
సాక్షి మనీ మంత్ర : లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ సూచీలు
దేశీయ స్టాక్మార్కెట్లో సరికొత్త రికార్డ్‌లు నమోదయ్యాయి. సోమవారం స్టాక్‌మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ, సెన్సెక్స్ ఆల్‌టైం హైకి చేరుకుని లాభాలతో ముగించాయి. అంతర్జాతీయ సానుకూల అంశాలు, ఐటీ, ఆటోమొబైల్ షేర్ల కొనుగోలు, రాబోయే లోక్‌సభ ఎన్నికల తర్వాత జరిగే రాజకీయ పరిణామాలకు కొనసాగింపుగా పెట్టుబడి దారులు మళ్లీ ఆశాజనకంగా మారడంతో బ్యాంక్ నిఫ్టీ తాజా గరిష్ట స్థాయికి చేరుకుంది. ఫలితంగా సెన్సెక్స్ 494 పాయింట్లు లాభంతో 74,742 వద్ద ముగియగా, నిఫ్టీ 152 పాయింట్ల లాభంతో 22,666 వద్ద ముగిసింది. ఎథేర్ మోటార్స్,మారుతి సుజికీ, ఎం అండ్ ఎం,ఎన్టీపీసీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, శ్రీరామ్ ఫైనాన్స్ షేర్లు లాభాల్లో ముగియగా.. అదానీ పోర్ట్స్,నెస్లే, అపోలో హాస్పిటల్,విప్రో, ఎల్టీఐ మైండ్‌ట్రీ, సన్ ఫార్మా, హెచ్‌సీఎల్ టెక్, హెచ్డీఎఫ్సీ షేర్లు నష్టాల్ని మూటగట్టుకున్నాయి. -
ఈయన్ని నమ్మి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారా?
న్యూఢిల్లీ: ప్రముఖ ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్సర్ (ఫిన్‌ఫ్లూయెన్సర్) రవీంద్ర బాలుకు సెబీ భారీ షాకిచ్చింది. స్టాక్ మార్కెట్ పేరుతో అక్రమంగా సంపాదించిన మొత్తం రూ.12 కోట్లను తిరిగి చెల్లించాలని ఆదేశించింది ఇటీవల కాలంలో స్టాక్ మార్కెట్లో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందచ్చనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. ఆ ప్రచారాన్ని నమ్మి పలువురు స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టి భారీగా నష్టపోతున్నారు. ఇదే అంశంపై మార్కెట్ నియంత్రణ మండలి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ తరుణంలో మార్కెట్ రెగ్యులేటర్ నిబంధనల్ని అతిక్రమించిన సంస్థలు, వ్యక్తులపై సెబీ కొరడా ఝుళిపిస్తోంది. ఈ నేపథ్యంలో రవీంద్ర భారతి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ప్రైవేట్ లిమిటెడ్ (RBEIPL)వ్యవస్థాపకుడు రవీంద్ర బాలుకు సెబీ నోటీసులు అందించింది. రవీంద్రబాలు,తన భార్య శుభాంగి భారతితో కలిసి 2016 నుంచి భారతి షేర్ మార్కెట్ పేరుతో వెబ్‌సైట్‌ను నిర్వహిస్తున్నారు. అందులో స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు, మార్కెట్లో ఎలా పెట్టుబడులు పెట్టాలో తెలిపేలా మదుపర్లకు క్లాసులు ఇస్తున్నారు. ఇందుకోసం భారీ మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారు. అంతేకాదు ఈ వెబ్సైట్ ద్వారా స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన వారికి 25 శాతం నుంచి 1000 శాతం వరకు లాభాలు గడించవచ్చనే ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారంపై సమాచారం అందుకున్న సెబీ రవీంద్ర బాలుకు సంబంధించిన అన్నీ కంపెనీలకు నోటీసులు ఇచ్చింది. తదుపరి నోటీసు వచ్చే వరకు పెట్టుబడి సలహా సేవలు, ట్రేడింగ్ కార్యకలాపాలలో పాల్గొనొద్దంటూ సెబీ వారిని నిషేధించింది. దీంతో పాటు నేషనల్ బ్యాంక్‌లో ప్రత్యేక ఎస్క్రో ఖాతాలో రూ.12 కోట్లను డిపాజిట్ చేయాలని సూచించింది.కాగా, రెగ్యులేటరీ బాడీ నుండి స్పష్టమైన అనుమతి లేకుండా వాటిని విడుదల చేయడం సాధ్యం కాదని నిర్ధారిస్తూ, ఈ ఎస్క్రో ఖాతాలో నిధుల్ని సెబీ సంరక్షణలో ఉంటాయి. -
సాక్షి మనీ మంత్ర : ప్లాట్‌గా ముగిసిన దేశీయ స్టాక్ సూచీలు
దేశీయ స్టాక్‌మార్కెట్లు బుధవారం ఫ్లాట్‌గా ముగిశాయి. సెన్సెక్స్ 27.09 పాయింట్లు నష్టపోయి 73,876.82 వద్ద, నిఫ్టీ 18 పాయింట్లు క్షీణించి 22,434.70 వద్ద ముగింపు పలికాయి. శ్రీరామ్ ఫైనాన్స్, ఎన్టీపీసీ, టీసీఎస్, యాక్సిస్ బ్యాంక్, టెక్ మహీంద్రా షేర్లు లాభపడగా, నెస్లే ఇండియా, బజాజ్ ఆటో, కోటక్ మహీంద్రా బ్యాంక్, బ్రిటానియా ఇండస్ట్రీస్, డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ నష్టపోయాయి. రియల్టీ ఇండెక్స్ 2.5 శాతం క్షీణించగా, ఆటో ఇండెక్స్ 0.4 శాతం పడిపోయింది. మరోవైపు పవర్, పీఎస్‌యూ బ్యాంక్ సూచీలు ఒక్కొక్కటి 1 శాతం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మీడియా సూచీలు 0.5 శాతం చొప్పున పెరిగాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ (0.6 శాతం పెరుగుదల)తో బ్రాడర్ ఇండెక్స్‌లు తాజా రికార్డు గరిష్ట స్థాయిని తాకాయి. స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 1 శాతం పెరిగింది. -
తాత చేసిన పని.. 30 ఏళ్ల తర్వాత ఎగిరి గంతేసిన మనువడు
మనలో చాలా మంది..నేను ఎప్పటికైనా లక్షాధికారిని కాకపోతానా? కోటీశ్వరుణ్ణి కాకపోతానా? అని ప్రతి ఒక్కరూ అనుకుంటూనే ఉంటారు. అయితే అలా ధనవంతులు కావాలంటే లక్షలు కావాల్సిన పనిలేదు. వందల్లో పొదుపు చేసినా అది ధనవంతుల్ని చేస్తుందని నిజం చేశారు ఓ పెద్దాయన. కేవలం రూ.500 పెట్టుబడి కాస్తా ఇప్పుడు రూ.3.75 లక్షలుగా మారడంతో మనవుడు తన తాతకి కృతజ్ఞతలు తెలుపుతూ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టాడు. ఇప్పుడు అది వైరల్‌గా మారింది. చండీగఢ్‌కు చెందిన తన్మయ్ మోతీవాలా పీడియాట్రిక్ సర్జన్‌గా వైద్య సేవలందిస్తున్నారు. అయితే ఓ రోజు తన ఇంటిని సర్ధుతుండగా తాత వినియోగించిన ఓ ట్రంక్ పెట్ట మోతీవాలా కంటపడింది. అందులో ఏమున్నాయా? అని తెరిచి చూశాడు. అంతే అప్పుడే తాత పెట్టిన పెట్టుబడి చూసి ఎగిరి గంతేసినంత పనిచేశారు. అయితే ఆ ట్రంక్ పెట్టెలో 1994లో తన తాత రూ. 500 విలువైన ఎస్బీఐ షేర్లను కొనుగోలు చేసినట్లు, వాటికి సంబంధించిన సర్టిఫికెట్లను షేర్ చేశారు. తన తాత షేర్లను కొనుగోలు చేశారు. వాటిని అమ్మలేదని తర్వాత గుర్తించాడు. ఆ రూ.500 పెట్టబడితో వచ్చిన ప్రాఫిట్ ఎంత వచ్చిందో ఆరా తీశారు. 1994లో ఒక్కో షేర్ రూ.10 చొప్పున రూ.500కి మొత్తం 50 షేర్లను కొనుగోలు చేశారు. ఇప్పుడు ఆ మొత్తం షేర్ల విలువ రూ.3.75లక్షలకు చేరింది. అంటే దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టిన మొత్తం 750 శాతంతో రిటర్న్స్ వచ్చాయని డాక్టర్ మోతీవాలా వెల్లడించారు. The power of holding equity 😊 My Grand parents had purchased SBI shares worth 500 Rs in 1994. They had forgotten about it. Infact they had no idea why they purchased it and if they even hold it. I found some such certificates while consolidating family's holdings in a… pic.twitter.com/GdO7qAJXXL — Dr. Tanmay Motiwala (@Least_ordinary) March 28, 2024 -
25 షేర్లలో నేటి నుంచి కొత్త సెటిల్మెంట్.. టీప్లస్‌జీరో
స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజాలు బీఎస్ఈ, ఎన్ఎస్ఈ నేటి(గురువారం) నుంచి టీప్లస్‌జీరో సెటిల్మెంట్కు తెరతీస్తున్నాయి. తొలుత 25 షేర్లలో ఆప్షనల్ పద్ధతిన అమలు చేయనున్నాయి. ఈక్విటీ నగదు మార్కెట్లో ప్రస్తుతం అమలవుతున్న టీప్లస్1 సెటిల్మెంట్కు జతగా పరిశీలన పద్ధతిలో టీప్లస్0కు శ్రీకారం చుడుతున్నాయి. కొద్దిమంది బ్రోకర్ల ద్వారా మాత్రమే ఇందుకు వీలు కలి్పస్తున్నాయి. వెరసి ఈ నెల 28 నుంచి లావాదేవీ చేపట్టిన రోజునే సెటిల్మెంట్ పూర్తికానుంది. ఈ జాబితాలో బజాజ్ ఆటో, వేదాంతా, హిందాల్కో, ఎస్బీఐ, ట్రెంట్, టాటా కమ్యూనికేషన్స్, నెస్లే, సిప్లా, ఎంఆర్ఎఫ్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, బీపీసీఎల్, ఓఎన్జీసీ, ఎన్ఎండీసీ, అంబుజా సిమెంట్స్ తదితరాలున్నాయి. తాజా సెటిల్మెంట్తో సమయం, వ్యయాలు ఆదా అవుతాయని అంచనా. మార్కెట్ లావాదేవీల్లో ఈ వ్యవస్థ మరింత పారదర్శకత తీసుకువస్తుందని భావిస్తున్నారు. -
సాక్షి మనీ మంత్ర : భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ లాభాలతో ముగింపు పలికాయి. నిన్న నష్టాలతో ముగిసినా బుధవారం ఆటోమొబైల్, రియాలి, పవర్ అండ్ కేపిటల్ గూడ్స్ షేర్ల కొనుగోలుతో నేడు భారీ లాభాల బాట పట్టాయి. దీంతో బుధవారం మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 526 పాయింట్ల లాభంతో 72,996 వద్ద నిఫ్టీ 119 పాయింట్ల లాభంతో 22,123 వద్ద ముగిశాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, మారుతి సుజికీ, బజాజ్ ఆటో, బజాజ్ ఫైనాన్స్, టైటాన్ కంపెనీ షేర్లు లాభాల్లో ముగియగా, హీరోమోటో కార్పో, టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్, అపోలో హాస్పిటల్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, విప్రోలో నష్టాలతో సరిపెట్టుకున్నాయి. -
సాక్షి మనీ మంత్ర : సూచీల సరికొత్త రికార్డ్.. సెన్సెక్స్ 1,200+, నిఫ్టీ 300+
దేశీయ స్టాక్ సూచీలు సరికొత్త రికార్డ్లను నమోదు చేశాయి. సెన్సెక్స్, నిఫ్టీ శుక్రవారం యూఎస్ మార్కెట్ల నుండి సానుకూల సంకేతాలతో నిపుణులు అంచనాల కంటే మెరుగ్గా ట్రేడ్ అయ్యాయి. రంగాల వారీగా ఎక్కువ శాతం సూచీలు సానుకూలంగా ట్రేడ్ అయ్యాయి. అందరి చూపు ఫిబ్రవరి ఆటోమొబైల్ సేల్స్ వైపే ఉండడంతో సంబంధిత స్టాక్స్ సైతం పుంజుకున్నాయి. ఇక శుక్రవారం మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 1245 పాయింట్లు లాభంతో 73745 వద్ద, నిఫ్టీ 355 పాయింట్ల లాభంతో 22338 వద్ద ట్రేడింగ్‌ను ముగించాయి. టాటా స్టీల్,జేఎస్‌డ్ల్యూ స్టీల్,టైటాన్ కంపెనీ, బీపీసీఎల్, హిందాల్కో, మారుతి సుజికీ, గ్రాసిమ్, టాటా మోటార్స్, ఎస్బీఐ షేర్లు భారీ లాభాల్లో మూటగట్టుకోగా.. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, హెచ్‌సీఎల్ టెక్, సన్ ఫార్మా, ఇన్ఫోసిస్, బ్రిటానియా, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, సిప్లా, ఎల్టీఐ మైండ్ ట్రీ, అపోలో హాస్పిటల్ షేర్లు నష్టాలతో ట్రేడింగ్‌ను ముగించాయి. -
సాక్షి మనీ మంత్ర : భారీ నష్టాలతో ముగిసిన మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. ఉదయం ఇతర ఆసియా మార్కెట్ల మిక్స్డ్ ఫలితాల ప్రభావంతో దేశీయ స్టాక్ సూచీలు లాభనష్టాలతో ఊగిసలాడాయి. అదే ధోరణి కొనసాగడంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 790 పాయింట్ల నష్టంతో 72304 వద్ద, నిఫ్టీ 247 పాయింట్లు నష్టపోయి 21951 వద్ద ముగిశాయి. హెచ్‌యూఎల్, ఇన్ఫోసిస్, టీసీఎస్, ఎయిర్టెల్ షేర్లు లాభాల్ని గడించగా.. పవర్ గ్రిడ్ కార్పొరేషన్, అపోలో హాస్పిటల్,ఎథేర్మోటార్స్, మారుతి సుజికి,బజాజ్ ఆటో, ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు నష్టాలతో సరిపెట్టుకున్నాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్ర : నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024 మూడో త్రైమాసికం భారత స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి గణాంకాలు గురువారం(ఫ్రిబవరి 29న) విడుదల కానున్నాయి. ప్రాథమిక మార్కెట్లో ఆరు కంపెనీలు పబ్లిక్ ఇష్యూలు ప్రారంభం కానున్నాయి. డాలర్ ఇండెక్స్, యూఎస్ బాండ్ ఈల్డ్స్, క్రూడాయిల్ ధరలు, రూపాయి విలువ తదితర అంశాలూ ట్రేడింగ్‌పై ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయి. ఫలితంగా ఈ వారం తొలిరోజే దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.30గంటల సమయానికి 144 పాయింట్ల నష్టంతో 72998 వద్ద, నిఫ్టీ 38 పాయింట్లు నష్టపోయి 22174 వద్ద కొనసాగుతున్నాయి. పవర్ గ్రిడ్ కార్పొరేషన్, లార్సెన్, అదానీ ఎంటర్ ప్రైజెస్, సిప్లా, బజాజ్ ఆటో, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, యూపీఎల్,అదానీ పోర్ట్స్, ఎం అండ్ ఎం, ఎస్బీఐ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. ఏసియన్ పెయింట్స్, టెక్ మహీంద్రా, బీపీసీఎల్, విప్రో, ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఎల్టీఐ మైండ్ ట్రీ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. -
ఈ వారం స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతుంది?
ముంబై: ప్రపంచ పరిణామాలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు ఈ వారం స్టాక్ మార్కెట్‌కు దిశానిర్ధేశం చేస్తాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఎఫ్అండ్ఓ డెరివేటివ్స్ గడువు ముగింపు నేపథ్యంలో ఒడిదుడుకుల ట్రేడింగ్ ఉండొచ్చంటున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024 మూడో త్రైమాసికం భారత స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి గణాంకాలు గురువారం(ఫ్రిబవరి 29న) విడుదల కానున్నాయి. ప్రాథమిక మార్కెట్లో ఆరు కంపెనీలు పబ్లిక్ ఇష్యూలు ప్రారంభం కానున్నాయి. డాలర్ ఇండెక్స్, యూఎస్ బాండ్ ఈల్డ్స్, క్రూడాయిల్ ధరలు, రూపాయి విలువ తదితర అంశాలూ ట్రేడింగ్‌పై ప్రభావం చూపొచ్చంటున్నారు. ‘‘చివరి ట్రేడింగ్ సెషన్లో నిఫ్టీ జీవితకాల గరిష్ట స్థాయి(22,297)ని నమోదు చేసిన తర్వాత తీవ్ర ఊగిసలాటకు లోనైంది. కొనుగోళ్ల కొనసాగితే 22,300 – 22,500 స్థాయిని పరిక్షీణింవచ్చు. లాభాల స్వీకరణ జరిగితే దిగువ స్థాయిలో 22,000 వద్ద తక్షణ మద్దతు ఉంది. ఇన్వెస్టర్లు పతనమైన నాణ్యమైన షేర్లను కొనుగోలు చేయడం ఉత్తమం’’ అని రిలిగేర్ బ్రోకింగ్ సాంకేతిక నిపుణుడు అజిత్ మిశ్రా తెలిపారు. ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు, క్రూడాయిల్ ధరలు స్థిరంగా కొనసాగడంతో గతవారం సూచీలు దాదాపు ఒకశాతం పెరిగాయి. సెన్సెక్స్ 716 పాయింట్లు, నిఫ్టీ 172 పాయింట్లు లాభపడ్డాయి. ఐటీ, ప్రభుత్వరంగ బ్యాంకులు, ఇంధన షేర్లు మినహా అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. స్థూల ఆర్థిక గణాంకాలు అమెరికా జనవరి గృహ విక్రయాలు, జపాన్ జనవరి ద్రవ్యోల్బణ డేటా ఫిబ్రవరి 27న, అమెరికా నాలుగో త్రైమాసిక జీడీపీ వృద్ధి గణాంకాలు బుధవారం (28న) విడుదల కానున్నాయి. యూరోజోన్ ఫిబ్రవరి పారిశ్రామిక, సర్వీసెస్, కన్జూమన్ కాన్ఫిడెన్స్ డేటా బుధవారం వెల్లడి అవుతాయి. జపాన్ రిటైల్ అమ్మకాలు, నిర్మాణ ఆర్డర్లు, భారత క్యూ3 జీడీపీ వృద్ధి డేటా, అమెరికా నిరుద్యోగ, పీసీఈ ప్రైస్ ఇండెక్స్ గణాంకాలు గురువారం విడుదల కానున్నాయి. వారాంతాపు రోజైన శుక్రవారం చైనా కాగ్జిన్ మానుఫ్యాక్చరింగ్ పీఎంఐ, జపాన్ నిరుద్యోగ రేటు, యూరోజోన్ హెచ్సీఓబీ కాగ్జిన్ మానుఫ్యాక్చరింగ్ పీఎంఐ, భారత్ ఆటో అమ్మకాలు, పారెక్స్ నిల్వల డేటా వెల్లడి కానున్నాయి. బుధవారం ఎఫ్అండ్ఓ ఎక్స్పైరీ, జీడీపీ వృద్ధి డేటా ఈ గురువారం(ఫిబ్రవరి 29న) నిఫ్టీ సూచీకి చెందిన జనవరి సిరీస్ డెరివేటివ్స్ కాంట్రాక్టులు ముగియనున్నాయి. అదేరోజున బ్యాంక్ నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ తేదీ కూడా ఉంది. ట్రేడర్లు తమ పొజిషన్లపై తీసుకొనే స్క్వేయర్ ఆఫ్ లేదా రోలోవర్ నిర్ణయానికి అనుగుణంగా మార్కెట్ స్పందించవచ్చని నిపుణులు చెబుతున్నారు. అదేరోజున ప్రస్తుత ఆర్థి క సంవత్సరం భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి డేటా విడుదల కానుంది. ప్రభుత్వ వ్యయంలో మందగమనం కారణంగా క్యూ2 జీడీపీ వృద్ధి (7.60%)తో తక్కువగా నమోదు కావచ్చని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. అయితే వార్షిక ప్రాతిపదన గ త ఆర్థిక సంవత్సరం క్యూ3 జీడీపీ వృద్ధి(4.5%)తో పోలిస్తే అధికంగా ఉండొంచ్చంటున్నారు. డెట్ మార్కెట్లోకి రూ.18,500 కోట్లు భారత డెట్(రుణ) మార్కెట్లో ఫిబ్రవరి 2న నాటికి విదేశీ ఇన్వెస్టర్లు రూ.18,500 కోట్లకు పైగా పట్టుబడులు పెట్టారు. త్వరలో భారత ప్రభుత్వ బాండ్లను జేపీ మోర్గాన్ ఇండెక్స్‌లో చేర్చనున్న వార్తలు ఇందుకు కారణమని మార్కెట్ నిపుణులు తెలిపారు. జనవరిలో భారత డెట్ మార్కెట్లోకి రూ.19,836 కోట్ల పెట్టుబడులు రాగా, ఇది ఆరు సంవత్సరాల కంటే ఎక్కువ నెలవారీ ఇన్‌ఫ్లోగా నిలిచింది. గతంలో 2017 జూన్‌లో ఇన్‌ఫ్లో రూ. 25,685 కోట్లుగా నమోదైంది. సమీక్ష కాలంలో (ఫిబ్రవరి 1– 23 తేదీల మధ్య) విదేశీ ఇన్వెస్టర్లు ఈక్విటీల నుంచి రూ.424 కోట్లను వెనక్కి తీసుకున్నారు. జనవరిలో రూ.25,743 కోట్లను ఉపసంహరించుకున్నట్లు ఎన్‌సీడీఎల్ గణాంకాలు చెబుతున్నాయి. 3 ఐపీఓలు, 2 లిస్టింగులు ప్రాథమిక మార్కెట్ నుంచి ఆరు కంపెనీలు ఈ వారంలో రూ.3,330 కోట్ల సమీకరణకు సిద్ధమయ్యాయి. ప్లాటినం ఇండస్ట్రీస్, ఎక్సికం టెలీ–సిస్టమ్స్ పబ్లిక్ ఇష్యూలు ఫిబ్రవరి 27న మొదలై 29న ముగియనున్నాయి. భారత్ హైవేస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఇన్వెస్ట్మెంట్ ఐపీఓ ఫిబ్రవరి 28– మార్చి 1 తేదీల మధ్య జరగనుంది. గతవారం ప్రారంభమైన జీపీటీ హెల్త్‌కేర్ ఐపీఓ ఫిబ్రవరి 26న(సోమవారం) ప్రారంభం కానుంది. ఇదేవారంలో ఫిబ్రవరి 28న జునియర్ హోటల్స్, మరుసటి రోజున జీపీటీ హెల్త్‌కేర్ షేర్లు ఎక్సే్చంజీల్లో లిస్ట్ కానున్నాయి. -
సాక్షి మనీ మంత్ర: వరుస లాభాల్లో స్టాక్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ లో వరుస లాభాలు కొనసాగుతున్నాయి. శుక్రవారం ఉదయం స్టాక్ సూచీలు లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.20గంటల సమయానికి సెన్సెక్స్ 103 పాయింట్ల లాభంతో 73261 వద్ద నిఫ్టీ 35 పాయింట్ల స్వల్ప లాభంతో 22253 వద్ద కొనసాగుతుంది. హీరోమోటో కార్ప్, టైటాన్ కంపెనీ, గ్రాసిం, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఎల్ టీఐ మైండ్ ట్రీ, బజాజ్ ఫిన్ సర్వ్, విప్రో,సిప్లా షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఎయిర్ టెల్, యాక్సిస్ బ్యాంక్, ఏసియన్ పెయింట్స్, బ్రిటానియా,మారుతి సుజికి, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఎన్ టీపీసీ, నెస్లే, హిందాల్కో, ఐటీసీ హేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి. -
సాక్షి మనీ మంత్ర : స్వల్ప లాభాల్లో దేశీయ స్టాక్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.30గంటల సమయంలో సెన్సెక్స్ 76 పాయింట్ల స్వల్ప లాభంతో 73134 వద్ద నిఫ్టీ 21 పాయింట్ల స్వల్ప లాభంతో 22218 వద్ద ట్రేడింగ్ ను కొనసాగిస్తుంది. టాటా స్టీల్, హిందాల్కో, ఐసీఐసీఐ బ్యాంక్, ఎం అండ్ ఎం, ఎథేర్ మోటార్స్,గ్రాసిమ్,ఓఎన్జీసీ,బజాజ్ ఫిన్ సర్వ్, అదానీ ఎంటర్ ప్రైజెస్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఎస్బీఐ, టాటా మోటార్స్, ఆల్ట్రా టెక్ సిమెంట్, అదానీ పోర్ట్స్, ఐటీసీ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. హీరో మోటోకార్ప్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఇన్ఫోసిస్, బీపీసీఎల్, లార్సెన్, బజాజ్ ఆటో, హెచ్ సీఎల్ టెక్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్ర: నష్టాల్లో దేశీయ స్టాక్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.30గంటలకు సెన్సెక్స్ 115 పాయింట్ల నష్టంతో 72592 వద్ద నిఫ్టీ43 పాయింట్ల స్వల్పంగా నష్టపోయి 22079 వద్ద ట్రేడింగ్‌ను కొనసాగిస్తుంది. పవర్ గ్రిడ్ కార్పొరేషన్, గ్రాసిమ్, ఓఎన్జీసీ, కొటక్ మహీంద్రా, ఎల్టీఐ మైండ్ ట్రీ, అపోలో హాస్పిటల్స్, హెచ్డీఎఫ్సీ ,యూపీఎల్, ఎన్టీపీసీ, యాక్సిస్ బ్యాంక్ షేర్లు లాభపడగా...హీరో మోటోకార్ప్, కోల్ ఇండియా, ఎథేర్ మోటార్స్, బజాజ్ఆటో, బీపీసీఎల్, మారుతి సుజికి షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్ర : లాభాల్లో ముగిసిన దేశీయ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. నిఫ్టీ తాజా ఆల్ టైమ్ హైని తాకడంతో ఫిబ్రవరి 19న సూచీలు లాభాలతో ట్రేడింగ్‌ను ముగించాయి. ముగింపులో సెన్సెక్స్ 281 పాయింట్ల లాభంతో 72,708 వద్ద, నిఫ్టీ 81.60 పాయింట్ల లాభంతో 22,122 వద్ద ట్రేడింగ్‌ను ముగించాయి. దాదాపు 2184 షేర్లు లాభాలు గడించగా... 1243 షేర్లు క్షీణించాయి. 123 షేర్లలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. నిఫ్టీలో గ్రాసిమ్ ఇండస్ట్రీస్, బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఆటో, ఐసీఐసీఐ బ్యాంక్, సిప్లా టాప్ లాభాలు గడించగా, కోల్ ఇండియా, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, ఎల్ అండ్ టీ, విప్రో హెచ్డీఎప్సీ లైఫ్ షేర్లు నష్టపోయాయి. -
సాక్షి మనీ మంత్ర : సూచీల్లో కొనసాగుతున్న లాభాల పరంపర
దేశీయ సూచీల్లో లాభాల పరంపర కొనసాగుతుంది. ఫిబ్రవరి 16న నిఫ్టీ 22,000 ఎగువన భారతీయ బెంచ్‌మార్క్ సూచీలు వరుసగా నాల్గవ సెషన్లో లాభాలతో ముగిశాయి. విప్రో, ఎం అండ్ ఎం, ఎస్బిఐ లైఫ్ ఇన్సూరెన్స్, అదానీ పోర్ట్స్, ఎల్ అండ్ టి అత్యధికంగా లాభపడగా, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఓఎన్జీసీ, ఎస్బీఐ, బ్రిటానియా ఇండస్ట్రీస్, రిలయన్స్ ఇండస్ట్రీస్ నష్టాల్లో ముగిశాయి. చమురు అండ్ గ్యాస్, పవర్ మినహా, ఇతర అన్ని సూచీలు ఆటో, క్యాపిటల్ గూడ్స్, ఫార్మా, ఐటీ, రియల్టీ 1-2 శాతం వరకు గ్రీన్‌లో ట్రేడ్ అవ్వగా బీఎస్ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు దాదాపు 1 శాతం పెరిగాయి. -
ఇన్వెస్టర్లకు అలర్ట్.. బీఎస్ఈ హెచ్చరికలు
న్యూఢిల్లీ: తప్పుదారి పట్టిస్తున్న నకిలీ(ఫేక్) సోషల్ మీడియా సంస్థలకు దూరంగా ఉండాలంటూ స్టాక్ ఎక్స్చేంజీ దిగ్గజం బీఎస్ఈ ఇన్వెస్టర్లను తాజాగా హెచ్చరించింది. లింక్డ్ఇన్, ట్విటర్, యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్ తదితర ప్లాట్‌ఫామ్‌ల ద్వారా అనధికార, నకిలీ సంస్థలు బీఎస్ఈ అధికారిక గుర్తింపులను వినియోగిస్తున్నట్లు పేర్కొంది. అంతేకాకుండా బీఎస్ఈతో సహచర్యం కలిగి ఉన్నట్లు తప్పుగా పేర్కొంటున్నాయని తెలియజేసింది. వెరసి ఇలాంటి సంస్థలు లేదా వ్యక్తులపట్ల అప్రమత్తతో వ్యవహరించవలసిందిగా ఇన్వెస్టర్లను హెచ్చరించింది. "తప్పుదోవ పట్టించే సోషల్ మీడియా హ్యాండిల్స్/ ఎంటిటీల బారిన పడకుండా ఇన్వెస్టర్లను బీఎస్ఈ అప్రమత్తం చేస్తోంది. బీఎస్ఈకి ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు క్లెయిమ్ చేసే సోషల్ మీడియా హ్యాండిల్స్ ప్రామాణికతను నిర్ధారించుకోవాల్సిందిగా సూచిస్తోంది" బీఎస్ఈ ఒక ప్రకటనలో పేర్కొంది. బీఎస్ఈ అధికారికంగా ధ్రవీకరించబడిన సోషల్ మీడియా హ్యాండిల్స్‌ను విశ్వసించాలని ఇన్వెస్టర్లను కోరింది. -
సాక్షి మనీ మంత్ర : లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల్లో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 277 పాయింట్ల లాభంతో 71,833.17 వద్ద, నిఫ్టీ స్వల్పంగా 96 పాయింట్లు పెరిగి 21,840 వద్ద ముగించింది. నిఫ్టీలో బీపీసీఎల్, ఎస్బిఐ, కోల్ ఇండియా, ఓఎన్జీసీ, యాక్సిస్ బ్యాంక్ టాప్ గెయినర్స్‌గా ఉండగా, టెక్ మహీంద్రా, సిప్లా, సన్ ఫార్మా, టీసీఎస్, డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ నష్టపోయాయి. సెక్టోరల్‌లో, పీఎస్‌యూ బ్యాంక్, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు ఒక్కొక్కటి 3 శాతం పెరిగాయి, ఆటో, బ్యాంక్, ఎఫ్ఎంసీజీ, క్యాపిటల్ గూడ్స్, మెటల్, పవర్, రియల్టీ షేర్లు ఒక్కొక్కటి 1.2 శాతం పెరిగాయి. మరోవైపు ఐటీ, ఫార్మా సూచీలు 1 శాతం చొప్పున క్షీణించాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు 1 శాతం చొప్పున పెరిగాయి. -
సాక్షి మనీ మంత్ర : భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లకు జాతీయ, అంతర్జాతీయ అంశాలు కలిసొచ్చాయి. ప్రధానంగా అమెరికా ద్రవ్యోల్బణ డేటా విడుదల నేపథ్యంలో మదుపర్లు ఆసియా మార్కెట్లలో మదుపు చేసేందుకు మొగ్గు చూపారు. ఫలితంగా మంగళవారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైనప్పటికి.. మార్కెట్లు ముగిసే సమయానికి పుంజుకున్నాయి. మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 482 పాయింట్ల లాభంతో 71555 వద్ద, నిఫ్టీ 127 పాయింట్ల లాభంతో 21743 పాయింట్ల వద్ద ట్రేడింగ్‌ను ముగించాయి. ఇక, కోల్ ఇండియా, యూపీఎల్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, హెచ్డీఎఫ్సీ, విప్రో షేర్లు లాభాల్లో ముగియగా.. హిందాల్కో, గ్రాసిమ్, ఆల్ట్రాటెక్ సిమెంట్, దివిస్ ల్యాబ్స్, బీపీసీఎల్, ఎం అండ్ ఎం, టైటాన్ కంపెనీ, టాటా మోటార్స్ షేర్లు నష్టాలతో ట్రేడింగ్‌ను ముగించాయి.