Chittoor District Latest News
-
అనధికారికంగా అమలు
ఓ వైపు విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయ సంఘాలు సమయం మార్పు విషయంపై వ్యతిరేకత తెలుపుతున్నా.. ప్రభుత్వం జీఓ విడుదల కాకముందే అధికారులు అత్యుత్సాహం చూపుతున్నారు. అనధికారికంగా ఇప్పటికే పాఠశాలల సమయం మార్చివేశారు. శుక్రవారం రోజున అనధికారికంగా చిత్తూరు జిల్లాలోని పాలసముద్రం మండలం ఎస్ఆర్ కండ్రిగ, బైరెడ్డిపల్లె మండలంలోని బైరెడ్డిపల్లె బాలురు హైస్కూలు, వి.కోట మండలం జౌనిపల్లె, రామకుప్పం మండలంలోని రామకుప్పుం బాలుర ఉన్నత పాఠశాలల్లో సమయం మార్పును అమలు చేశారు. దీంతో విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులు ఇబ్బందులు పడ్డారు. -
● పాఠశాలల సమయం మార్పు వద్దంటున్న టీచర్లు ● కూటమి సర్కారు నిర్ణయంపై వ్యతిరేకత ● నిర్ణయం మార్చుకోకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరిక
బడి పనివేళల పెంపుతో చిన్నారులు అధిక సమయం నాలుగు గోడలకే పరిమితం.. కాసింత సేపు కూడా ఆటపాటలకు దూరం.. వెరసి ఒత్తిడి.. మంకుపట్టు, పిరికితనం పెరుగుదల.. ఫలితం మరుగున పడనున్న నైపుణ్యాలు.. విద్యార్థులు చదువుకు దూరమయ్యే అవకాశం.. మా బిడ్డల చదువెలా సాగాలని తల్లిదండ్రుల అంతర్మథనం.. ఇదీ పాఠశాల సమయం మార్పుతో కలగనున్న దుష్ప్రభావం అని విద్యావేత్తల అభిప్రాయం. చిత్తూరు కలెక్టరేట్ : కూటమి ప్రభుత్వం గత ఎన్నికల్లో విద్యార్థుల తల్లిదండ్రులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా వింత పోకడలకు తెరలేపుతోంది. తల్లికి వందనం హామీ ఇచ్చి అమలు చేయకుండా తల్లిదండ్రులను కూటమి సర్కారు మోసం చేస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులను మెరుగుపర్చడంలో వెనుకబడింది. ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి డీఎస్సీ నిర్వహిస్తామని హామీ ఇచ్చి, ఇంతవరకు నోటిఫికేషన్ జారీ చేయకుండా వెనుకడుగు వేస్తోంది. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి అవసరమైన కార్యక్రమాలు చేపట్టాల్సిన కూటమి సర్కారు విద్యార్థులకు ఇబ్బందులు సృష్టించే వింత నిర్ణయాలు తీసుకుంటోంది. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ సాయంత్రం 5 గంటల వరకు పాఠశాలల సమయం లేదని విద్యావేత్తలు అంటున్నారు. అయితే కూటమి ప్రభుత్వం మాత్రం ఉద యం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పాఠశాలల సమయం పెంచేందుకు నిర్ణయం తీసుకు ని, పైలెట్ ప్రాజెక్టుగా పలు పాఠశాలల్లో అమలు చేసేందుకు సిద్ధమైంది. కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు, టీచర్లు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు.కూటమి ప్రభుత్వం పాఠశాలల సమయం పెంపు విషయంలో తీసుకున్న అనాలోచిత నిర్ణయాన్ని కచ్చితంగా మార్చుకోవాల్సిందేనని ఉపాధ్యాయ సంఘాలు హెచ్చరిస్తున్నాయి. ఈ నిర్ణయంతో ఎలాంటి ఉపయోగం ఉండదంటున్నాయి. క్షేత్రస్థాయిలో సమస్యలను తెలుసుకోకుండా ఏకపక్షంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం తగదని హెచ్చరిస్తున్నాయి. చిత్తూరు జిల్లాకు సమీపంలో ఉన్న తమిళనాడులో ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4.10 గంటల వరకు, కర్ణాటకలో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు నిర్వహిస్తున్నారని టీచర్లు చెబుతున్నారు. తెలంగాణాలో సైతం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4.15 గంటల వరకు పాఠశాలలు నిర్వహిస్తున్నట్లు వాపోతున్నారు. రాష్ట్రంలో మాత్రం కూటమి ప్రభుత్వం క్షేత్రస్థాయిలో పరిస్థితులు తెలుసుకోకుండా సమయం మార్పులు చేయడంపై తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ఉపాధ్యాయ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. సర్కారు నిర్ణయం మార్చుకోకపోతే ఆందోళనలు చేపడుతామని హెచ్చరిస్తున్నారు. నిర్ణయం మార్చు కోవాల్సిందే -
కొదమసింహాలై గర్జించాలి
పలమనేరు/ గంగవరం: ఎన్నికలెప్పుడొచ్చినా వైఎస్సార్ సీపీ కార్యకర్తలు కొదమసింహాలై గర్జించి, మళ్లీ వైఎస్సార్సీపీ జెండాను ఎగురవేసి, జగనన్నను సీఎం చేసుకుందామని ఆ పార్టీ చిత్తూరు,తిరుపతి జిల్లాల అధ్యక్షుడు భూ మన కురుణాకరరెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పలమనేరు సమీపంలోని సాయినగర్‌లో ఉన్న ఓ ప్రైవేటు కన్వెన్షన్ సెంటర్లో స్థానిక పార్టీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ అధ్యక్షతన కార్యకర్తల నియోజకవర్గ సమావేశం శుక్రవారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ తాను మీలో ఒక్కనిగా జగనన్న నియమించిన సైనికునిలా పార్టీ బలోపేతం కోసం మీ సూచనలు, సలహాలతో పార్టీని ముందుకు తీసుకెళతానని చెప్పారు. గతంలో మనం చేసిన పొరబాట్లను సరిదిద్దుకుని వచ్చే ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా పనిచేద్దామని పిలుపునిచ్చారు. కార్యకర్తలకు విలువలేని పార్టీలు మనుగడ సాగించినట్టు చరిత్రలో లేవని అందుకే మనం ఈ దఫా కార్యకర్తలకు పెద్దపీట వేయాలన్న సంకల్పంతో ముందుకెళతామన్నారు. మాట తప్పిన కూటమి ప్రభుత్వాన్ని కడిగేసేందుకు, ప్రజల పక్షాన జగనన్న వచ్చే ఫిబ్రవరి నుంచి జనంలోకి రానున్నారని తెలిపారు. 3,648 కిలో మీటర్ల పాదయాత్ర చేసి, 2.5 కోట్ల మందితో నేరుగా సంభాషించిన నేత జగన్మోహన్రెడ్డి మినహా ప్రపంచంలో మరెవరూ లేరన్నారు. రాష్ట్రంలో 60 శాతం పేదలున్నందున పార్టీలు, కులాలతో సంబంధం లేకుండా అర్హులైన వారికి సంక్షేమాన్ని అందించాలనే తలంపుతో నాడు జగనన్న పథకాలు అందించారన్నారు. అదే ఆయన చేసిన తప్పా? అని ప్రశ్నించారు. శత్రువుకు కూడా మేలు చేయాలనే సంకల్పం ఆయనదని, కూటమినేతల లాంటి స్వార్థరాజకీయాలు ఆయనకు తెలివన్నారు. నాడు చంద్రబాబు ఓటమి చెందాక రెండున్నరేళ్లు జనంలోకి రాలేదని, కానీ జగనన్న జనం కోసం మూడునెలల్లోనే వచ్చాడన్నారు. 40 శాతం ఓట్లు వచ్చి, ఓటమి పాలైన పార్టీ ప్రపంచంలో ఎక్కడా లేదన్నారు. కేవలం కేంద్రంతో లాలూచీ పడి జగన్మోహన్రెడ్డిని ఓ భూతంలా చూపి, కొన్ని శక్తులంతా ఏకమై ఈవీఎలంను మార్చి, అధికారంలోకి వచ్చారని ఆరోపించారు. ఈ సమావేశంలో మాజీ ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, మాజీ ఎంపీ రెడ్డెప్ప, మాజీ ఎమ్మెల్యేలు వెంకటేగౌడ, తిప్పేస్వామి, జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, డీసీసీబీ మాజీ చైర్మన్ రెడ్డెమ్మ, మండల కన్వీనర్లు, ప్రజాప్రతినిధులు, మాజీలు, పార్టీ అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఫిబ్రవరి నుంచి జనంతోనే జగనన్న వచ్చే ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా పనిచేద్దాం భూమన కరుణాకర రెడ్డి -
వీఆర్వోకు దేహశుద్ధి
రామకుప్పం: రపేమ పేరుతో సాటి వీఆర్వోను నమ్మించి పెళ్లి చేసుకోకుండా కాలయాపన చేస్తున్న మరో వీఆర్వోకు ఆమె బంధువులు దేహశుద్ధి చేసిన ఘటన శుక్రవారం రామకుప్పం మండలంలో జరిగింది. బాధితురాలి బంధువుల కథనం మేరకు.. వైఎస్సార్ జిల్లాకు చెందిన శ్రవణ్ రామకుప్పం మండలంలోని కొంగనపల్లి వీఆర్వోగా పనిచేస్తున్నాడు. అదే మండలంలోని మరో పంచాయతీ వీఆర్వోగా పనిచేస్తున్న యువతిని మూడేళ్లు ప్రేమించాడు. శ్రవణ్ ఆ యువతిని వివాహం చేసుకుంటానని చెప్పి ప్రేమాయణం సాగించాడు. ఈ క్రమంలో తనను వివాహం చేసుకోవాలని ఆ యువతి, శ్రవణ్‌ను కోరగా కాలయాపన చేస్తూ వచ్చాడు. అంతేగాక అతని ప్రవర్తనలో మార్పును గమనించిన ఆమె జరిగిన విషయాన్ని బంధువుల దృష్టికి తీసుకెళ్లింది. దీంతో బంధువులతోపాటు యువతి స్థానిక రెవెన్యూ కార్యాలయంలో ఉన్న శ్రవణ్‌ను నిలదీసింది. అతని నుండి పెళ్లి విషయమై సరైన సమాధానం రాకపోవడంతో ఆగ్రహించిన యువతి బంధువులు అతనికి దేహశుద్ధి చేశారు. అనంతరం వారు 100కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. శ్రవణ్ పోలీసులకు అందుబాటులోకి రాకపోవడంతో శనివారం స్థానిక తహసీల్దార్‌తో చర్చించి వీఆర్వోకు న్యాయం జరిగేలా చూస్తామని పోలీసులు యువతి బంధువులకు చెప్పారు. -
క్రీడలకూ ప్రాధాన్యం ఇవ్వాలి
● రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలు ప్రారంభం ● జెండాను ఆవిష్కరించిన జిల్లా ఎస్పీ మణికంఠ తవణంపల్లె: విద్యార్థులు విద్యతోపాటు క్రీడలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా ఎస్సీ మణికంఠ చందోలు అన్నారు. శుక్రవారం మండలంలోని అరగొండ బాలుర ఉన్నత పాఠశాలలో ఏపీ పాఠశాల విద్య, జిల్లా విద్యాశాఖ సౌజన్యంతో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 68వ రాష్ట్రస్థాయి అండర్–14 బాల బాలికలు సాఫ్ట్‌బాల్ టోర్నమెంట్‌ను జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించి, వందన సమర్పణ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ క్రీడలతో మానసికోల్లాసం కలుగుతుందన్నారు. క్రీడలతో శారీరక దారుఢ్యం చేకూరుతుందన్నారు. క్రీడల్లో టీమ్‌వర్క్, క్రమశిక్షణ, నైతిక విలువలను పెంపొందిస్తుందన్నారు. క్రీడల్లో గెలుపు కోసం అన్ని జట్లు పోటీపడినప్పటికీ విజయం సాధించేది ఒకే జట్టు అన్నారు. ఓటమి పాలైన జట్లు నిరుత్సాహపడకుండా మరోసారి విజయం సాధించే దిశగా నిలవాలన్నారు. అనంతరం రాష్ట్రంలోని 13 జిల్లా నుంచి వచ్చిన బాలబాలికలు జట్లను పరిచయం చేసుకుని, మార్చ్ నిర్వహించిన క్రీడాకారులకు వందనం చేశారు. కార్యక్రమంలో డీఈఓ వరలక్ష్మి, డీవైఈఓ చంద్రశేఖర్, డీఎస్డీఓ బాలాజీ, తహసీల్దార్ సుధాకర్, ఎంపీడీఓ రెడ్డిబాబు, ఎంఈఓలు హేమలత, త్యాగరాజులు రెడ్డి, ఎంపీపీ ప్రతాప్సుందర్రాయల్రెడ్డి, జెడ్పీపీటీసీ సభ్యురాలు భారతి, అరగొండ సర్పంచ్ మల్లుదొరై, ఉమామహేశ్వరరెడ్డి, హెచ్ఎంలు భువనేశ్వరి, మోహన్‌రెడ్డి, జిల్లా స్కూల్‌గేమ్స్ కార్యదర్శ వసంతవాణి, టోర్నమెంట్ ఆర్గనైజర్ కృష్ణ, పీడీలు రవీంద్రరెడ్డి, సిరాజ్, శ్రీనివాసులు, అరుణకుమార్, ఢిల్లీరాణి, అరుణ, గురుప్రసాద్, శాంతమ్మ, ఉమాపతి, నూరుద్ధీన్, ఎంపీటీసీ ఇంద్రాణి పాల్గొన్నారు. విజేతలు వీరే.. ● రాష్ట్రస్థాయి అండర్–14 బాలుర సాఫ్ట్‌బాల్ పోటీల్లో మొదటి రోజు బాలుర జట్లలో ప్రకాశం జిల్లాపై శ్రీకాకుళం జట్టు గెలుపొందింది. కృష్ణా జిల్లా జట్టుతో పోరాడి వైఎస్సార్ కడప జిల్లా జట్లు విజయం సాధించింది. విశాఖపట్నం జట్టుపై చిత్తూరు జట్టు గెలిచింది. ప్రకాశం జిల్లా జట్టుపై వైఎస్సార్ కడప జట్టు విజయం సాధించింది. ● బాలికల జట్లు: శ్రీకాకుళం జిల్లా బాలికల జట్టుపై గుంటూరు జట్టు విజయం సాధించింది. పశ్చిమ గోదావరి జిల్లా జట్టుపై కర్నూలు జిల్లా బాలికల జట్టు గెలిచి, పట్టు సాధించింది. -
గుజ్జు పరిశ్రమ నుజ్జు!
రుచిలో మధురం.. వేసవి ప్రత్యేకం.. ఫలాల్లో రాజసం.. ఉద్యాన పంటలకే తలమానికం మామిడి. ఆహార ప్రియుల నోరూరించే మాధుర్యం ఉన్న ఈ పండు ఉత్పత్తులు తయారు చేసే పరిశ్రమలు మాత్రం ఖాయిలా దశకు చేరే స్థితి నెలకొంది. యూరప్ దేశాల్లో యుద్ధం కారణంగా మామిడి గుజ్జు ఎగుమతి ఆగిపోయింది. పరిశ్రమల్లో నిల్వలు పేరుకుపోయాయి. ఫలితంగా అటు వ్యాపారులు.. ఇటు కర్షకులకు చేదు మిగలనుంది. ● జిల్లాలో మామిడి గుజ్జు పరిశ్రమ కుదేలు ● గుజ్జు ఎగుమతి..లేక విలవిల ● యూరప్ దేశాల్లో యుద్ధం ఎఫెక్ట్ ● పేరుకుపోయి .2.75 లక్ష టన్నులు గుజ్జు నిల్వలు కాణిపాకం: మామిడి గుజ్జు పరిశ్రమలు కుదేలవు తోంది. ఎగుమతి లేక వ్యాపారులు విలవిలలాడుతున్నారు. యూరప్ దేశాల్లో యుద్ధం కారణంగా గు జ్జు ఎగుమతికి బ్రేక్ పడింది. దీంతో ఉమ్మడి చి త్తూరు జిల్లాలో 2.75 లక్షల టన్నుల గుజ్జు పేరుకుపోయింది. దీనికితోడు వ్యాపారులను జీఎస్టీ వేధిస్తోంది. బ్యాంకు రుణాల గడువు ముంచుకొస్తోంది. అలాగే మామిడి సీజన్ సమీపిస్తుండడంతో ఫ్యాక్టరీ యజమానులు అయోమయంలో పడ్డారు. దీని ప్రభావం మామిడిసాగు రైతులపై పడనుంది. జిల్లా మామిడికి పెట్టిన పేరు జిల్లా మామిడి సాగుకు పెట్టింది పేరు. జిల్లాలోని మామిడి రుచి..నాణ్యత భేష్ అన్న మార్క్ ఉంది. ఈ క్రమంలో జిల్లాలోని పంట ఉత్పత్తుల కోసం స్థానిక మామిడి గుజ్జు పరిశ్రమల వ్యాపారులు, మా మిడి వ్యాపారులతోపాటు తమిళనాడు, కర్ణాటకలో ని ఫ్యాక్టరీ యజమానులు సైతం క్యూకడుతుంటా రు. ఈ క్రమంలో మామిడి పంట దిగుబడితోపాటు గుజ్జు తయారీలో జిల్లా అగ్రస్థానంలో ఉంది. అయి నా మామిడిని నమ్ముకున్న అన్నదాతకు లాభాల మాధుర్యం ఏటా దూరం అవుతోంది. జిల్లాలో 1.50 లక్షల ఎకరాల్లో సాగు జిల్లాలో 1.50 లక్షల ఎకరాల్లో మామిడి సాగు అవుతోంది. ఇందులో 65 శాతం పంట తోతాపురి రకం ఉంది. ఈ పంటపై సుమారు 80 వేల మంది రైతులు ఆధారపడి జీవిస్తున్నారు. యుద్ధంతో ఎగుమతికి బ్రేక్ ఈ ఏడాది తోతాపురి రకం కిలో రూ.30 వరకు పలికింది. బేనిషా, ఇతర రకాల పండ్లను పరిశ్ర మల యజమానులు కిలో రూ.50 పైగా కొనుగోలు చేశారు. ఈ పండ్లను గుజ్జు తీశారు. ఇలా తయారు చేసిన మామిడి గుజ్జును అధికంగా యూరఫ్ దేశాలకే ఎగుమతి చేస్తారు. అలాగే కొంత మొత్తంలో గల్ఫ్‌కు కూడా ఎగుమతి చేస్తారు. ప్రస్తుతం యూర ప్ దేశాల్లో యుద్ధం కారణంగా గుజ్జు ఎగుమతి ఆగిపోయింది. మూడు నెలలుగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని 47 పల్ప్ ఫ్యాక్టరీల్లో 2.75 లక్షల గుజ్జు ని ల్వ ఉంది. దీని విలువ సుమారు రూ.1,750 కోట్లు ఉంటుందని అంచనా. దీని ప్రభావం రానున్న సీజన్‌పై పడనుంది. ఎగుమతి లేని కారణంగా పలు ఫ్యాక్టరీలు మూతపడే అవకాశం కనిపిస్తోంది. ఇదే జరిగితే వచ్చే సీజన్‌కు మామిడి పంట రోడ్డు పాలుకాక తప్పదని పరిశ్రమల యజమానులు, వ్యాపారులు, రైతులు దిగులు చెందుతున్నారు. ఈ ఏడాది గుజ్జు తయారీ 2.75 లక్షల టన్నులు పండ్ల గుజ్జు పరిశ్రమలు 47 గుజ్జు ఎగుమతి అయ్యే దేశాలు గల్ఫ్, యూరఫ్ నిల్వ ఉన్న గుజ్జు విలువ 1,750 కోట్లు ● ఆరు నెలల పాటు దీర్ఘకాలిక, తాత్కాలిక రుణాలు వర్కింగ్ క్యాపిటల్ లిమిట్స్ వాయిదా వేయాలి. వడ్డీకి రాయితీలిచ్చి ఆదుకోవాలి. జిల్లా కలెక్టర్‌తో కూడిన కమిటీ ఏర్పాటు చేయాలి. ● గుజ్జు పరిశ్రమలకు ఇవ్వాల్సిన రాయితీలను వెంటనే విడుదల చేయాలి. ● కరెంట్ ఫిక్స్డ్ చార్జీలను రద్దు చేయాలి. ● ఇన్ ల్యాండ్ కంటైనర్ డిపో మంజూరు చేయాలి. ● మామిడి గుజ్జు, జ్యూస్ ఎమ్మార్పీపై 12 శాతం జీఎస్టీ వసూలు చేస్తున్నారు. దాన్ని రద్దు చేయాలి. ● విదేశాల్లో దిగుమతి పన్ను 28 శాతం వసూలు చేస్తున్నారు. వీటిని తగ్గించేలా కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలి. ● మామిడి బోర్డు ఏర్పాటుతో పాటు ఆ బోర్డును కూడా జిల్లాకు కేటాయించాలి. పరిశ్రమల యజమానులకు కష్టాల కడలి మొదలైంది. ప్రధానం మామిడి పండ్ల గుజ్జు అమ్ముడు పోతుందా?..లేదా అనే అయోమయంలో పడ్డారు. ఫిబ్రవరి నెలాఖరుకు గుజ్జు ఎగుమతి కాని పక్షంలో ఢీలా పడేలా ఉన్నారు. దీనికి తోడు బ్యాంకుల్లో తీసుకున్న రుణాలతో ఆర్థిక కష్టాలు మొదలవుతున్నాయంటూ పరిశ్రమ యజమానులు కంటతడి పెడుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమను ఆదుకోవాలని పల్ప్ ఫ్యాక్టరీల యజమానులు కోరుతున్నారు. వారి డిమాండ్లు ఇలా ఉన్నాయి. -
వరసిద్ధుడికి రూ.4.49 కోట్లు
కాణిపాకంలో నిర్వహించిన పలు వేలం పాటల్లో వరసిద్ధి వినాయకస్వామికి రూ.4.49 కోట్ల రాబడి వచ్చింది.గ్రామాల పరిస్థితులు తెలుసుకోవాలి మారుమూల గ్రామాల నుంచి చాలా మంది విద్యార్థులు హైస్కూళ్లకు వస్తుంటారు. ఆ గ్రామాల నుంచి బస్సు సౌకర్యం ఉండదు. అలాంటి గ్రామాల విద్యార్థుల పరిస్థితులను ప్రభుత్వం తెలుసుకోవాలి. మారుమూల గ్రామాలు, వాతావరణ పరిస్థితులన్నీ ఆలోచించి, గతంలో పాఠశాలల సమయం నిర్ణయించారు. ఇప్పుడు మళ్లీ తొమ్మిది నుంచి 4 గంటల వరకు సవరించేందుకు ప్రయత్నం చేయడం సరైన పద్ధతి కాదు. – రెడ్డిశేఖర్‌రెడ్డి, వైఎస్సార్ టీఎఫ్ రాష్ట్ర కోశాధికారి, చిత్తూరు జిల్లా పునరాలోచించాలి ప్రస్తుత ప్రభుత్వం ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పాఠశాలల సమయం పెంచాలని ఆలోచించడం సరైన విధానం కాదు. దీనికి అనుగుణంగా పలు జిల్లాల్లో డీఈఓలు పైలెట్ ప్రాజెక్టుగా ఉత్తర్వులు ఇస్తున్నారు. ఈ పైలెట్ ప్రాజెక్టు షెడ్యూల్లో ప్రార్థనకు 20 నిమిషాలు, భోజన విరామం ఒక గంట, మధ్యలో విరామం 15 నిమిషాలుగా పెట్టడం సహేతుకంగా లేదు. విద్యార్థులను అంత సమయం తరగతి గది నుంచి బయటకు పంపడంతో భద్రతాపరమైన ఇబ్బందులు ఏర్పడుతాయి. – మదన్‌మోహన్‌రెడ్డి, ఎస్టీయూ చిత్తూరు జిల్లా అధ్యక్షులు ఇబ్బందులు తలెత్తుతాయి నూతన సమయపాలనతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు ఇ బ్బందులు తలెత్తుతా యి. క్షేత్రస్థాయిలో ఎ లాంటి నిర్ణయాలు సే కరించకుండా ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం సరైన పద్ధతి కాదు. ఏ ఇతర రాష్ట్రాల్లోనూ సాయంత్రం 5 గంటల వరకు పాఠశాలలను నిర్వహించడం లేదు. ఇక్కడ మాత్రం ఇలాంటి అనాలోచిత నిర్ణయాలు తీసుకోవడం ఎంత వరకు సబబు.? – మోహన్, ఎస్టీయూ,చిత్తూరుజిల్లా ప్రధాన కార్యదర్శి – 8లో -
వ్యక్తి అరెస్టు
వి.కోట: ఒక మహిళను మోసగించిన వ్యక్తిని శుక్రవారం వి.కోట పోలీసులు అరెస్టు చేసినట్లు డీఎస్పీ ప్రభాకర్ తెలిపారు. డీఎస్పీ కథనం మేరకు.. మండలంలోని బోయచిన్నాగనపల్లి పంచాయతీ రామనాథపురంలో నివాసం ఉంటున్న ఎస్టీ కులానికి చెందిన ఒక మహిళను అదే గ్రామానికి చెందిన సతీష్ అలీయాస్ దినేష్ అనే వ్యక్తి ప్రేమించాడు. ఆ మహిళను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, వాంఛలు తీర్చుకున్నాడు. తర్వాత ఆ మహిళకు తెలియకుండా మరో మహిళను వివాహం చేసుకుని ఎస్టీ మహిళను మోసగించాడు. దీనిపై కేసు నమోదు చేసి సతీష్‌ను శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన్నట్లు డీఎస్పీ వెల్లడించారు. ఈ సమావేశంలో సీఐ సోమశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు. 22 కిలోల గంజాయి స్వాధీనం తిరుపతి క్రైమ్: ఒడిశా నుంచి తిరుపతి మీదుగా చైన్నెకి తరలిస్తున్న 22 కిలోల గంజాయిని సీజ్ చేసి, ఇద్దరిని అరెస్టు చేసినట్టు తిరుపతి డీఎస్పీ వెంకటనారాయణ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. శుక్రవారం ఉదయం ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా పాత తిరుచానూరులోని ఓ హోటల్ వద్ద తిరుగుతున్నట్లు సమాచారం వచ్చిందన్నారు. వారిని అదుపులోకి తీసుకొని విచారించగా.. వారు చిత్తూరు జిల్లాలోని కుప్పం, నగరి ప్రాంతాలకు చెందిన సాతుపాటి లోకేశ్వరరావు, కుమారిగా గుర్తించామన్నారు. వారిద్దరూ కలిసి గంజాయి అక్రమంగా విక్రయిస్తున్నట్లు తెలిసిందన్నారు. ఒడిశా నుంచి గంజాయిని పెద్ద మొత్తంలో తీసుకొచ్చి తిరుపతి పరిసరాలతో పాటు చైన్నెలో చిన్న చిన్న పొట్లాలు చేసి యువతకు అమ్మేవారని తెలిపారు. వీరి వద్ద నుంచి 22 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో గంజాయి విక్రయిస్తూ వీరు ఇరువురూ ఈస్ట్ పోలీస్ స్టేషన్లో పట్టుబడ్డారన్నారు. అప్పుడు చిత్తూరు జైలు రిమాండ్ ఖైదీలుగా ఉండి బయటకు వచ్చిన అనంతరం తిరిగి పుత్తూరు, తమిళనాడు ప్రాంతాల్లో గంజాయిని విక్రయిస్తున్నట్లుగా గుర్తించామన్నారు. వీరిపై రైల్వే పోలీస్ స్టేషన్లో కూడా అక్రమంగా గుట్కా ప్యాకెట్లు విక్రయిస్తున్నట్లు కేసులు ఉన్నాయని తెలిపారు. -
కిశోర బాలికల్లో మానసిక ఒత్తిడి తగ్గించాలి
చిత్తూరు కలెక్టరేట్: కిశోర బాలికల్లో మానసిక ఒత్తిడి ని తగ్గించాలని ఐసీడీఎస్ పీడీ హైమావతి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో కిశోర వికాసం జిల్లాస్థాయి కార్యక్రమం నిర్వహించారు. ఐసీడీఎస్ పీడీ మాట్లాడుతూ కిశోర బాలికలు శారీరకంగా మానసికంగా సమస్యలు ఎదుర్కొంటారన్నారు. కిశోర బాలికల కు సరైన అవగాహన అవసరమన్నారు. 11–18 ఏళ్ల మధ్య ఉన్న కిశోర బాలికలకు శారీరకంగా మార్పులు సంభవిస్తాయని చెప్పారు. రుతుక్రమం ప్రారంభం కావడం, శారీరకంగా వచ్చే మార్పులపై అవగాహన లేకపోవడంతో మానసిక ఒత్తిడి పెరుగుతుందన్నారు. బాలికలు తమ సమస్యలను తల్లి దండ్రులకు వ్యక్తపరచడానికి సంకోచిస్తారన్నారు. కిశోర వికాసం కార్యక్రమంలో బాలికలకు శారీరకంగా సంభవించే మార్పులు, సమాజంలో మెలగాల్సిన తీరుతెన్నలపై అవగాహన కల్పించాలన్నారు. సమతుల ఆహారం కచ్చితంగా తీసు కోవాలన్నారు. సంబంధిత శాఖల సిబ్బంది గ్రామాల్లోని అంగన్ వాడీ సిబ్బంది, ఏఎన్ఎంకు శిక్షణ ఇచ్చి, మండలా ల్లో ఉన్న కిశోర బాలికలకు అవగాహన కార్యక్రమా లు ఏర్పాటు చేయాలన్నారు. డీఎంఅండ్‌హెచ్‌ఓ ప్రభావతిదేవి మాట్లాడుతూ కిశోర బాలికలకు ఆరోగ్య సంరక్షణ చాలా అవసరమన్నారు. మనదేశంలో దాదాపు 50 శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారన్నారు. జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారి గుణశేఖర్రెడ్డి మాట్లాడుతూ బాలికలకు విద్య అందిస్తే భవిష్యత్తులో సమాజంలో ఉన్నత స్థాయికి చేరుతారన్నారు. విద్యతో బాహ్య ప్రపంచం అర్థమవుతుందన్నారు. మహిళా పోలీస్ స్టేషన్ ఎస్ఐ నాగ సౌజన్య మాట్లాడుతూ ఆకతాయిలు, ఇతర వేధింపులు ఎదురైతే బాలికలు మహిళా సేఫ్టీ యాప్‌లో ఫిర్యాదు చేస్తే రక్షణ కల్పిస్తామన్నారు. అనంతరం కిశోర బాలికలకు అవగాహన పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సీడీపీఓలు, విద్యార్థులు పాల్గొన్నారు. -
క్రీడలకూ ప్రాధాన్యం ఇవ్వాలి
● రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలు ప్రారంభం ● జెండాను ఆవిష్కరించిన జిల్లా ఎస్పీ మణికంఠ తవణంపల్లె: విద్యార్థులు విద్యతోపాటు క్రీడలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా ఎస్సీ మణికంఠ చందోలు అన్నారు. శుక్రవారం మండలంలోని అరగొండ బాలుర ఉన్నత పాఠశాలలో ఏపీ పాఠశాల విద్య, జిల్లా విద్యాశాఖ సౌజన్యంతో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 68వ రాష్ట్రస్థాయి అండర్–14 బాల బాలికలు సాఫ్ట్‌బాల్ టోర్నమెంట్‌ను జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించి, వందన సమర్పణ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ క్రీడలతో మానసికోల్లాసం కలుగుతుందన్నారు. క్రీడలతో శారీరక దారుఢ్యం చేకూరుతుందన్నారు. క్రీడల్లో టీమ్‌వర్క్, క్రమశిక్షణ, నైతిక విలువలను పెంపొందిస్తుందన్నారు. క్రీడల్లో గెలుపు కోసం అన్ని జట్లు పోటీపడినప్పటికీ విజయం సాధించేది ఒకే జట్టు అన్నారు. ఓటమి పాలైన జట్లు నిరుత్సాహపడకుండా మరోసారి విజయం సాధించే దిశగా నిలవాలన్నారు. అనంతరం రాష్ట్రంలోని 13 జిల్లా నుంచి వచ్చిన బాలబాలికలు జట్లను పరిచయం చేసుకుని, మార్చ్ నిర్వహించిన క్రీడాకారులకు వందనం చేశారు. కార్యక్రమంలో డీఈఓ వరలక్ష్మి, డీవైఈఓ చంద్రశేఖర్, డీఎస్డీఓ బాలాజీ, తహసీల్దార్ సుధాకర్, ఎంపీడీఓ రెడ్డిబాబు, ఎంఈఓలు హేమలత, త్యాగరాజులు రెడ్డి, ఎంపీపీ ప్రతాప్సుందర్రాయల్రెడ్డి, జెడ్పీపీటీసీ సభ్యురాలు భారతి, అరగొండ సర్పంచ్ మల్లుదొరై, ఉమామహేశ్వరరెడ్డి, హెచ్ఎంలు భువనేశ్వరి, మోహన్‌రెడ్డి, జిల్లా స్కూల్‌గేమ్స్ కార్యదర్శ వసంతవాణి, టోర్నమెంట్ ఆర్గనైజర్ కృష్ణ, పీడీలు రవీంద్రరెడ్డి, సిరాజ్, శ్రీనివాసులు, అరుణకుమార్, ఢిల్లీరాణి, అరుణ, గురుప్రసాద్, శాంతమ్మ, ఉమాపతి, నూరుద్ధీన్, ఎంపీటీసీ ఇంద్రాణి పాల్గొన్నారు. విజేతలు వీరే.. ● రాష్ట్రస్థాయి అండర్–14 బాలుర సాఫ్ట్‌బాల్ పోటీల్లో మొదటి రోజు బాలుర జట్లలో ప్రకాశం జిల్లాపై శ్రీకాకుళం జట్టు గెలుపొందింది. కృష్ణా జిల్లా జట్టుతో పోరాడి వైఎస్సార్ కడప జిల్లా జట్లు విజయం సాధించింది. విశాఖపట్నం జట్టుపై చిత్తూరు జట్టు గెలిచింది. ప్రకాశం జిల్లా జట్టుపై వైఎస్సార్ కడప జట్టు విజయం సాధించింది. ● బాలికల జట్లు: శ్రీకాకుళం జిల్లా బాలికల జట్టుపై గుంటూరు జట్టు విజయం సాధించింది. పశ్చిమ గోదావరి జిల్లా జట్టుపై కర్నూలు జిల్లా బాలికల జట్టు గెలిచి, పట్టు సాధించింది. -
పెండింగ్‌లో 5వేల వ్యవసాయ సర్వీసులు
● త్వరలో ట్రాన్స్ఫార్మర్లు, కేబుల్స్ విడతల వారీ అందజేస్తాం ● పైలట్ ప్రాజెక్టుగా కుప్పంలో సోలార్ సిస్టం ● డిస్కం సీఎండీ సంతోషరావు వెల్లడి చిత్తూరు కార్పొరేషన్: వ్యవసాయ విద్యుత్ పరికరాల కొరత ఉందని, త్వరలో పరికరాలు వస్తాయని డిస్కం(రాయలసీమ, నెల్లూరు జిల్లాలు) సీఎండీ సంతోషరావు చెప్పారు. శుక్రవారం ఆయన ఎస్ఈ కార్యాలయంలో ట్రాన్స్‌కో అధికారులతో సమావేశమయ్యా రు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి జిల్లాలో (మొత్తం 14 నియోజకవర్గాలు) 5 వేలకు పైగా వ్యవసాయ సర్వీసులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. త్వరలో ట్రాన్స్ఫార్మర్లు, కేబుల్స్ విడతల వారీగా అందజేస్తామన్నారు. జిల్లాలోని కుప్పం నియోజకవర్గాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని ‘పీఎం సూర్య ఘర్’ పథకం కింద మొత్తం 50 వేల సర్వీసులకు సౌర ఫలకాలు ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ఉన్నట్టు వెల్లడించారు. వీటితో పాటు ప్రభుత్వ సర్వీసులకు సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. వ్యవసాయానికి స్మార్ట్ మీటర్లు బిగించామని, ప్రభు త్వ, ప్రైవేటు సర్వీసులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. అనంతరం పాత కలెక్టరేట్లో ఏర్పాటు కానున్న రూరల్ కార్యాలయాన్ని అధికారులతో కలిసి పరిశీలించారు. జిల్లాకు ఎస్ఈ కార్యాలయం కేటా యించడంతో రూరల్ కార్యాలయం నుంచి కార్యకలాపాలు సాగిస్తున్నారు. రూరల్ కార్యాలయ భవనం శిథిలావస్థకు చేరడంతో వాటి మరమ్మతులకు నిధులు కేటాయించాలని అధికారులు కోరారు. కార్యక్రమంలో ప్రాజెక్టు సీజీఎం అయూబ్‌ఖాన్, ఎస్ఈ ఇస్మాయిల్ అహ్మద్, ఈఈలు సురేష్, మునిచంద్ర, జగదీష్, వాసుదేవరెడ్డి, డీఈలు ప్రసాద్, ఆనంద్, రమేష్ పాల్గొన్నారు. -
అంకితభావంతో విధులు నిర్వర్తించండి
చిత్తూరు కలెక్టరేట్: అంకిత భావంతో విధులు నిర్వర్తించాలని నూతనంగా బాధ్యతలు స్వీకరించిన అధికారులను కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ ఆదేశించారు. నూతనంగా జిల్లాకు విచ్చేసిన జిల్లా పంచాయతీ అధికారి సుధాకర్‌రావు, మెప్మా పీడీ రవీంద్ర శుక్రవారం కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేశారు. కలెక్టర్ మాట్లాడుతూ నూతనంగా బాధ్యతలు స్వీకరించిన అధికారులు ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేయాలని ఆదేశించారు. -
అప్రైజర్ చేతివాటం
కంచే చేను మేసిన చందాన ఓ అప్రైజర్ తాను పనిచేస్తున్న బ్యాంకుకే టోకరా వేశాడు. అప్రైజర్‌గా ఉన్న వెసులుబాటును ఉపయోగించుకుని తక్కువ నాణ్యత ఉన్న బంగారాన్ని బినామీ ఖాతాల్లో తాకట్టు పెట్టి రూ.40 లక్షలు రుణం పొందాడు. ఈ బాగోతం ఆడిటింగ్‌లో బయటపడింది. ఈ సంఘటన యాదమరి మండల కేంద్రంలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యుబిఐ)లో కలకలం రేపింది. ● బినామీ ఖాతాలతో రూ.40 లక్షల రుణం! ● తక్కువ బంగారం తాకట్టు పెట్టిన వైనం ● ఆడిట్లో బయటపడ్డ బండారం ● యాదమరి యూనియన్ బ్యాంక్‌లో కలకలం ● అధికారులు ప్రశ్నించడంతో రుణం చెల్లించిన అప్రైజర్ యాదమరి(పూతలపట్టు): యాదమరి యుబిఐలో అప్రైజర్‌గా భాస్కరాచారి కమీషన్ ప్రాతిపదికన పనిచేస్తున్నాడు. ఈ నెల 14వ తేదీ నుంచి బ్యాంకులో ఆడిటింగ్ చేస్తున్నారు. అప్రైజర్ తన బంధువుల పేరిట తొమ్మిది బినామీ ఖాతాలతో నగలు తాకట్టు పెట్టి రూ.40లక్షలు తీసుకున్నట్టు తేలింది. పైగా తాకట్టు పెట్టిన నగల విలువ మొత్తంగా రూ.10లక్షల వరకు మాత్రమే అయితే అతడు మూడురెట్లు ఎక్కువగా పొందినట్లు ఆడిట్ అధికారులు గుర్తించారు. జూలై, ఆగస్టు, సెప్టెంబర్‌లో మొత్తంగా 17 సార్లు అతను ఇలా బినామీ ఖాతాలతో రుణం పొందాడని తేలింది. దీనిపై ఆడిటింగ్ అధికారులు నిలదీయడంతో అప్రైజర్ తాను కుదువపెట్టి తీసుకున్న రూ.40 లక్షల రుణాన్ని చెల్లించేశాడు. ఆడిట్ పూర్తి కాకపోవడంతో అతనికి బ్యాంకు సిబ్బంది తనఖా పెట్టిన నగలను తిరిగి ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో రుణం చెల్లించినా తన నగలను తిరిగి ఇవ్వలేదని భాస్కరాచారి కొందరిని వెంటబెట్టుకొని బ్యాంకు అధికారులను నిలదీశాడు. బ్యాంకులో తనఖా ఉన్న నగలన్నీ పరిశీలించాల్సి ఉందని, అంతవరకూ తిరిగి ఇవ్వలేమని స్పష్టం చేశారు. యుబిఐలో ఏదో గోల్మాల్ జరిగిందని ప్రచారంలోకి రావడంతో శుక్రవారం పెద్ద సంఖ్యలో ఖాతాదారులు బ్యాంకు వద్దకు చేరుకుని తమ నగల గురించి మేనేజర్ మురళిని నిలదీశారు. అప్రైజర్‌కు అంత రుణం ఎలా మంజూరు చేస్తారని ప్రశ్నించారు. ఖాతాదారుల నగలు సురక్షితం యూనియన్ బ్యాంక్‌లో సుమారు 4000 మందికి పైగా బంగారు నగలు తాకట్టు పెట్టి రుణాలు పొందారు. వాటి విలువ రూ.52కోట్లు. అప్రైజర్ భాస్కరాచారి 9 మంది నగల నాణ్యతను పరిశీలించి నాకు ఇచ్చిన నివేదిక ప్రకారమే నేను ఆ ఖాతాలకు రుణం మంజూరు చేశాను. ఆడిట్ అధికారుల పరిశీలనలో ఆ నగలు నాణ్యత తక్కువని, వాటి విలువ రూ.10లక్షలేనని, అయితే రూ.40లక్షలు రుణం తీసుకున్నట్టు ఆడిట్ అధికారులు గుర్తించారు. బినామీ ఖాతాలతో మోసగించినట్టు బండారం బయటపడడంతో భాస్కరాచారి బ్యాంక్ సిబ్బందికి ఆ నగదు ఇచ్చానని చెప్పడం ఎంతమాత్రమూ సరికాదు. ఆడిటింగ్ ముగిసినంతరం అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తాం. ఖాతాదారుల నగలన్నీ సురక్షితంగా ఉన్నాయి. ఆందోళన చెందనవసరం లేదు. –మురళి, మేనేజర్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యాదమరి -
‘జాతీయ బలరంగ్’కు దరఖాస్తుల ఆహ్వానం
కార్వేటినగరం: జిల్లా విద్యాశిక్షణ సంస్థ(డైట్)లో నిర్వహించే జాతీయ బలరంగ్ పండుగ పోటీలకు ఆసక్తి కలిగిన విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవచ్చని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ప్రభాకర్‌రాజు తెలిపారు. శుక్రవారం కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కళాశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ పాఠశాల విద్యాశాఖ కమిషన్ ఆదేశాల మేరకు పాఠశాల విద్యాశాఖ, ఇందిరాగాంధీ మానవ సంగ్రహాలయ, భారత ప్రభుత్వ సాంస్కృతిక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో డిసెంబర్ 21, 22 తేదీల్లో భోపాల్ నంది జాతీయ బలరంగ్ పండుగ–2024 పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పోటీలకు దేశంలోనే వివిధ రాష్ట్రాల నుంచి జానపద, నృత్య కళారీతులపై పోటీలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ పోటీల్లో పాల్గొనే రాష్ట్రస్థాయి జట్టు ఎంపిక కోసం ఈ నెల 29వ తేదీన పోటీలు నిర్వహిస్తామన్నారు. ఈ పోటీల్లో పాల్గొనే చిత్తూరు జిల్లా జట్టు ఎంపిక కోసం ఈ నెల 25, 26 తేదీల్లో డైట్లో పోటీలు నిర్వహించనున్నామని, క్రీడల్లో పాల్గొనేందుకు ఆసక్తి కలిగిన వారు 24వ తేదీలోగా డైట్ కళాశాలలో 94407 57761 నంబర్లో సంప్రదించాలని సూచించారు. -
పేరు ఇళ్లకు.. తరలింపు కర్ణాటకకు..
పలమనేరు: కొందరు అక్రమార్కులు కౌండిన్య నది నుంచి ఇళ్ల నిర్మాణాల పేరుతో ఇసుకను ట్రాక్టర్లలో కర్ణాటకకు తరలిస్తున్నారు. ఎక్కడో ఇసుక డంపులు పెట్టుకుంటే కన్నడ ఇసుక వ్యాపారులు తాము రావడంలేదని తేల్చి చెప్పేశారు. దీంతో ట్రెండ్ మార్చిన ఇక్కడి ఇసుకాసురులు కౌండిన్య నుంచి నిత్యం తోడే ఇసుకను పట్టపగలే కర్ణాటక రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో దించేస్తున్నారు. ఆపై అక్కడి నుంచి లొకేషన్ ఆధారంగా ఇసుకాసురులు స్పాట్‌కు వెళ్లకున్నా ఇసుక కర్ణాటకకు చేరుతోంది. అక్కడి స్మగర్లు సంబంధిత లొకేషన్‌కు వెళ్లి టిప్పర్లతో ఎలాంటి ఇబ్బంది లేకుండా తీసుకెళుతున్నారు. ఎక్కడెక్కడంటే.. : కౌండిన్య నది నుంచి పలమనేరు రూరల్ మండలంలోని ముసలిమొడుగు, కృష్ణాపురం, సముద్రపల్లి, పెంగరగుంట, కూర్మాయి, జల్లిపేట, క్యాటిల్‌ఫామ్, గంగవరం మండలంలోని కూర్నిపల్లి, ఉయ్యాలమిట్ట, కలగటూరు, దండపల్లి, మబ్బువాళ్లపేట, పెద్దపంజాణి మండలంలో బొమ్మరాజుపల్లి, ముదరంపల్లి, గోనుమాకులపల్లి, చామనేరు, శివాడి, నిడిగుంటల నుంచి సమీపంలోని కర్ణాటక రాష్ట్ర సరిహద్దులో రహస్యంగా ఇసుక డంపులను నిల్వ చేస్తున్నట్టు సమాచారం. ఎవరినడిగినా ఇంటి నిర్మాణాకని... : కౌండిన్యలో ఇసుకను తోడుతున్న ఎవరిని అడిగినా ఇంటి నిర్మాణానికని చెబుతున్నారు. నిత్యం కౌండిన్య నది పరిధిలో మూడు మండలాల్లోని 30 గ్రామాల్లో రోజుకు 300 లోడ్ల ఇసుక తరలుతుంటే ఈ ప్రాంతంలో ఎన్ని ఇళ్ల నిర్మాణాలు సాగుతున్నాయో? ఓ సారి అర్థం చేసుకోవచ్చు. కర్ణాటకలో టిప్పర్ ఇసుక రూ.25 వేల నుంచి రూ.30 వేలు పలుకుతుండడంత యథేచ్ఛగా తరలిస్తున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు మాత్రం ఇసుక ఉచితం కాబట్టే పట్టుకోవడం లేదని, పాపం ఇళ్ల నిర్మాణాలకు తీసుకెళుతున్నారని భావించి మాట్లాడడం కొసమెరుపు. మామను చంపిన అల్లుడికి జీవిత ఖైదు మదనపల్లె : తండ్రి మరణానికి కారకుడనే నెపంతో మామను హత్య చేసిన అల్లుడికి జీవితఖైదు విధిస్తూ మదనపల్లె రెండో అడిషనల్ జిల్లా కోర్టు జడ్జి అబ్రహాం తీర్పు ఇచ్చారు. వివరాల్లోకి వెళితే.. చిత్తూరు జిల్లా సోమల మండలం నెల్లిమంద గొల్లపల్లెకు చెందిన వెంకటసిద్ధులు(63) అనే వ్యక్తి 2017 ఆగస్టు 7వ తేదీన కలికిరి మండలం గుట్టపాళెం గొల్లపల్లె పొలాల వద్ద దారుణ హత్యకు గురయ్యాడు. హత్య విషయమై వెంకటసిద్ధులు కుమారుడు నాగరాజ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సోమల ఎస్ఐ లక్ష్మీనారాయణ కేసు నమోదు చేశారు. విచారణ బాధ్యతను అప్పటి చౌడేపల్లె సీఐ రవీంద్రకు అప్పగించారు. పోలీసు విచారణలో వెంకటసిద్ధులు అల్లుడు పి.సుధాకర(45)ను నిందితుడిగా గుర్తించారు. సుధాకర్ తండ్రి రెడ్డెప్ప మరణానికి మామ వెంకటసిద్ధులు చేయించిన చేతబడులు, క్షుద్రపూజలే కారణమని భావించి కక్ష పెంచుకుని, హత్య చేసేందుకు నిర్ణయించుకున్నాడు. గుట్టపాళెంలో జరిగే పాలేటమ్మ జాతరకు మామ వెంకటసిద్ధులును రావాల్సిందిగా కోరాడు. జాతరకు వచ్చిన మామను, పథకం ప్రకారం వ్యవసాయ పొలాల వద్దకు తీసుకెళ్లి హత్య చేశాడు. పోలీసు విచారణలో అల్లుడు మామను హత్యచేసినట్లుగా నిర్ధారణ కావడంతో అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. ఏడేళ్లపాటు కేసు విచారణ మదనపల్లె రెండో అదనపు జిల్లా కోర్టులో జరిగింది. నిందితుడిపై నేరం రుజువు కావడంతో జీవితఖైదుతో పాటు రూ.3 వేల జరిమానా విధిస్తూ శుక్రవారం జడ్జి అబ్రహాం తీర్పు చెప్పారు. కేసులో ఏపీపీ జయనారాయణరెడ్డి వాదించగా, లైజనింగ్ ఆఫీసర్‌గా మోహన్‌రెడ్డి వ్యవహరించారు. -
ఎర్రచందనం పరిరక్షణకు కృషి చేయాలి
తిరుపతి మంగళం : అరుదైన, అత్యంత విలువైన ఎర్రచందనం పరిరక్షణకు అటవీశాఖ, టాస్క్‌ఫోర్స్ సంయుక్తంగా కృషి చేయాలని రాష్ట్ర అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్(పీసీసీఎఫ్) ఎస్ఎస్.శ్రీధర్ సూచించారు. తిరుపతి కపిలతీర్థం సమీపంలోని టాస్క్‌ఫోర్స్ కార్యాలయాన్ని గురువారం ఆయన సందర్శించారు. శేషాచలంలోని ఎర్రచందనం అక్రమంగా తరలిపోకుండా పటిష్ట చర్యలు చేపట్టాల్సిన బాధ్యత అటవీశాఖ, టాస్క్‌ఫోర్స్ పోలీసులపై ఉందన్నారు. స్మగ్లర్లను నిలువరించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. కూంబింగ్, ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు, చెక్ పోస్టులు పనితీరుపై చర్చించారు. టాస్క్‌ఫోర్స్ కార్యాలయం గోడలు పెచ్చులు ఊడుతున్నాయని, స్మగ్లర్లను ఉంచేందుకు పట్టిష్ట గదులు అవసరమని టాస్క్‌ఫోర్స్ ఎస్పీ శ్రీనివాస్ పీసీసీఎఫ్ దృష్టికి తీసుకెళ్లారు. సీసీఎఫ్ సె ల్వం, డీఎఫ్ఓ వివేక్, ఏసీఎఫ్ శ్రీనివాస్, టాస్క్ఫో ర్స్ డీఎస్పీ బాలిరెడ్డి, ఆర్ఐ సురేష్ కుమార్ రెడ్డి, సీఐ సురేష్, ఎస్ఐ రఫీ, ఎఫ్ఆర్ఓలు పాల్గొన్నారు. -
ఎర్రచందనం పరిరక్షణకు కృషి చేయాలి
తిరుపతి మంగళం : అరుదైన, అత్యంత విలువైన ఎర్రచందనం పరిరక్షణకు అటవీశాఖ, టాస్క్‌ఫోర్స్ సంయుక్తంగా కృషి చేయాలని రాష్ట్ర అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్(పీసీసీఎఫ్) ఎస్ఎస్.శ్రీధర్ సూచించారు. తిరుపతి కపిలతీర్థం సమీపంలోని టాస్క్‌ఫోర్స్ కార్యాలయాన్ని గురువారం ఆయన సందర్శించారు. శేషాచలంలోని ఎర్రచందనం అక్రమంగా తరలిపోకుండా పటిష్ట చర్యలు చేపట్టాల్సిన బాధ్యత అటవీశాఖ, టాస్క్‌ఫోర్స్ పోలీసులపై ఉందన్నారు. స్మగ్లర్లను నిలువరించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. కూంబింగ్, ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు, చెక్ పోస్టులు పనితీరుపై చర్చించారు. టాస్క్‌ఫోర్స్ కార్యాలయం గోడలు పెచ్చులు ఊడుతున్నాయని, స్మగ్లర్లను ఉంచేందుకు పట్టిష్ట గదులు అవసరమని టాస్క్‌ఫోర్స్ ఎస్పీ శ్రీనివాస్ పీసీసీఎఫ్ దృష్టికి తీసుకెళ్లారు. సీసీఎఫ్ సె ల్వం, డీఎఫ్ఓ వివేక్, ఏసీఎఫ్ శ్రీనివాస్, టాస్క్ఫో ర్స్ డీఎస్పీ బాలిరెడ్డి, ఆర్ఐ సురేష్ కుమార్ రెడ్డి, సీఐ సురేష్, ఎస్ఐ రఫీ, ఎఫ్ఆర్ఓలు పాల్గొన్నారు. -
No Headline
ఉమ్మడి మద్రాసు రాష్ట్రం ఉన్నప్పుడు వృత్తిరీత్యా, బతుకుదెరువు కోసమో తమిళనాడులో ఆంధ్రులు.. ఆంధ్రా రాష్ట్రంలో తమిళవాసులు స్థిరపడ్డారు. ఏడు దశాబ్దాల కిందట భాష ప్రాతిపదికన నాటి పరిస్థితుల దృష్ట్యా ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్రా వేరుపడింది. అయితే అప్పటికే ఆయా తమిళనాడు, ఆంధ్రాలో స్థిరపడిన వారు అలాగే ఉండిపోయారు. ఎవరు ఎక్కడ నివశిస్తున్నా.. తమ సొంత ప్రాంతం ఆచారాలను, సంస్కృతి సంపద్రాయాలను మాత్రం వీడలేదు. ఆంధ్రాలో ఉన్నవారు తమిళులు తమ పిల్లలను వారి తమిళ మాధ్యమంలో, తమిళనాడులో ఉన్న తెలుగువారు తెలుగు మాధ్యమంలో చదివిస్తూ మాతృభాషపై మమకారం చాటుకుంటున్నారు. -
No Headline
తమిళంలోనే చదువుకుంటున్నా.. మా పూర్వీకులు అందరూ తమిళ సంస్కృతిని పాటించేవారే. తరతరాలుగా ఇంట్లో మాట్లాడే భాష కూడా తమిళమే. పాటించే ఆచారాలు కూడా తమిళ సంస్కృతివే. అందుకే ఆంధ్రరాష్ట్రంలో ఉన్నా తల్లిదండ్రులు నన్ను తమిళ మాధ్యమంలో చేర్చారు. తమిళంతో పాటు ఒక సబ్జెక్ట్ తెలుగు కూడా నేర్చుకుంటున్నా. – చిత్ర, సత్రవాడ, నగరి మున్సిపాలిటీ ఆ విద్యార్థులు ఎక్కువే ఉన్నారు.. సత్రవాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నేను తమిళ మాధ్యమం చదువుకుంటున్నా. నాలాగే పలువురు విద్యార్థులు తమిళంలోనే చదువుకుంటున్నారు. ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా మాకు పాఠాలు చెబుతుండడంతో చక్కగా చదువుకుంటున్నాం. మాతృభాష తమిళంతో పాటు రాష్ట్ర భాష తెలుగును కూడా నేర్చుకుంటున్నాం. – జయలక్ష్మి, సత్రవాడ, నగరి మున్సిపాలిటీ భాషపై మక్కువతోనే తెలుగు మీడియం.. మా మాతృభాష తెలుగు. ఇంటిలో మేము తెలుగే మాట్లాడుకుంటాం. అందుకే భాషపై మక్కువతో నా తల్లిదండ్రులు నన్ను తెలుగు మీడియంలో చేర్పించారు. తెలుగు సబ్జెక్ట్‌తో పాటు అన్ని సబ్జెక్టులు తెలుగులోనే చెబుతున్నారు. వీటితో పాటు తమిళ భాషను కూడా నేర్చుకుంటున్నా. – కరిష్మా, చంద్రప్పనాయుడు కండ్రిగ, తిరుత్తణి తాలుకా -
26న ధర్నా
చిత్తూరు కార్పొరేషన్: కేంద్ర ప్రభుత్వం కార్మిక, రైతాంగ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 26న కలెక్టరేట్ వద్ద చేపట్టే ధర్నాను విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి సురేంద్రన్ పిలుపునిచ్చారు. గురువారం నగరంలో పలు కార్మిక సంఘాల నాయకులకు కరపత్రాలను అందజేశారు. ఎన్డీఏలో భాగస్వామిగా రాష్ట్రప్రభుత్వం బీజేపీ వైఖరిని అనుసరిస్తోందన్నారు. కార్మికులు, ఆకలి తీర్చే రైతులకు కాకుండా కార్పొరేట్ వర్గాలకు మోదీ ప్రభుత్వం లాభం చేకూరుస్తోందన్నారు. గత 10 ఏళ్లలో కేంద్రప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు రూ.19.28 లక్షలకోట్లు రుణమాఫీ, పన్నురాయితీ, ప్రోత్సాహాల పేరిట ప్రజల ధనాన్ని దోచిపెట్టిందన్నారు. విశాఖస్టీల్ ప్లాంట్‌తో సహా భారీ పరిశ్రమలు, గనులు, సముద్రతీరాన్ని కారుచౌకగా కార్పొరేట్లకు బీజేపీ ప్రభుత్వం కట్టబెట్టేందుకు సిద్ధమైందన్నారు. గత పదేళ్లుగా కనీస వేతనం కోసం కార్మికులు పోరాడుతున్నా అమలుకు నోచుకోలేదని, 29 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా కేంద్రం మార్చడం అన్యాయమన్నారు. -
వేగానికి కళ్లెం
● మెసానిక్ మైదానం రోడ్డులో భారీ వాహనాలు నిషేధం ● సాక్షి కథనానికి స్పందించిన పోలీసులు చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలోని మెసానిక్ మైదానం–రిజర్వు ఫారెస్టు రోడ్డులో వేగానికి కళ్లెం పడింది. ఈ మార్గంలో ఓ తల్లి తన కుమారున్ని ద్విచక్రవాహనంలో తీసుకెళ్తుండగా.. ఇసుక ట్రాక్టర్ ఢీకొట్టడంతో ఎమిదేళ్ల పిల్లాడు ఇటీవల చనిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటన జరిగిన తరువాత కూడా ఈ రోడ్డులో భారీగా ట్రాక్టర్లు, వాహనాలు అత్యంత వేగంతో వెళుతున్నాయి. ఈ పరిస్థితిపై ‘సాక్షి’ దినపత్రికలో మూడు రోజుల క్రితం ‘అతివేగం.. పడదా కళ్లెం?’ శీర్షికన వార్త ప్రచురితమైంది. దీనికి చిత్తూరు ట్రాఫిక్ సీఐ నిత్యబాబు స్పందించారు. గురువారం ఈ మార్గంలో వెళ్తున్న ఇసుక, మట్టిని తరలిస్తున్న ట్రాక్టర్లను, ఇతర వాహనాలను తనిఖీ చేశారు. రికార్డులు సక్రమంగా లేని వాటికి జరిమానాలు విధించారు. అనంతరం సీఐ మాట్లాడుతూ మెసానిక్ రోడ్డు గుంతలమయంగా మారడంతో ఇటువైపు వెళ్లే వాహనాలు, ఒక్కోసారి ఎదురుగా వస్తున్న వాహనాలను ఢీకొడుతున్నాయన్నారు. బైక్‌లు, కార్లు, ఆటోలు తప్ప మరే ఇతర వాహనాలు మెసానిక్ రోడ్డు మీదుగా వెళ్లడానికి వీల్లేదన్నారు. వాహన చోదకులు ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. -
పారదర్శక సేవలకు ‘సహకారం’
ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పాత్ర కీలకం. వాటిని మరింత బలోపేతం చేసి రైతులకు మెరుగైన సేవలను అందించాలనే లక్ష్యంతో కేంద్ర సహకార మంత్రిత్వశాఖ అడుగులు వేసింది. ఇంతవరకు చేతిరాతలతోనే కొనసాగిన సహకార సంఘాల ఆర్థిక లావాదేవీలు, రుణాల మంజూరు, వ్యాపారాల నిర్వహణలో అవకతవకలకు చెక్ పెడుతూ పారదర్శకతకు పెద్దపీట వేస్తోంది. అక్రమాలకు తావులేకుండా సంఘాల రికార్డులు, నిర్వహణకు సంబంధించి ఇకపై అన్నీ కంప్యూటరీకరణ వైపు అడుగులు పడుతున్నాయి. క్షేత్రస్థాయిలో సభ్యులు, ఖాతాల లెక్కలు తేల్చి ఆన్లైన్ ప్రక్రియను వేగవంతం అవుతున్నాయి. కాణిపాకం: ప్రాథమిక సహకార సంఘాలు అన్నదాతలకు వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి. కాగా ఇప్పటివరకు ఈ సంఘాల రికార్డుల నిర్వహణ పూర్తిగా చేతిరాతలతోనే జరుగుతున్నాయి. నిర్వహణలో పారదర్శకత లేకపోవడంతో కోట్ల రూపాయలు అవకతవకలు జరుగుతున్నట్లు ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. వీటన్నిటికీ చెక్ పెట్టేందుకు కేంద్ర సహకార మంత్రిత్వశాఖ నడుం బిగించింది. దీంతో ప్రతి సహకార సంఘ రికార్డులను నాబార్డు నిధులతో కంప్యూటరీకరణ చేసే పనిలో సిబ్బంది నిమగ్నమయారు. జిల్లాలో 37 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఉండగా, వాటి పరిధిలో సుమారు 1.50 లక్షల మంది సభ్యులు, ఖాతాదారులు ఉన్నారు. దాదాపు రూ.300 కోట్లు రుణాలు సైతం అందజేశారు. సాంకేతికతకు పెద్దపీట.. అందుబాటులోకి తీసుకురావాలని కేంద్రమంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఆత్మ నిర్భర్ భారత్ ద్వారా చేయూతనిచ్చి రైతులకు సాయం అందించాలని ముందుకొచ్చింది. నాబార్డు ద్వారా తోడ్పాటునందించి మరింత బలోపేతం చేయాలని సంకల్పించింది. ఇందుకు లావాదేవీలు, ఖాతాల నిర్వహణ, రికార్డులు, సభ్యుల సమాచారాన్ని కంప్యూటరీకరణ చేయాలని నిర్ణయం తీసుకుంది. కంప్యూటరీకరణ సేవలను కల్పించేందుకు ఒక్కో పరపతి సంఘానికి రూ.3.90 లక్షలు కేటాయించారు. కేంద్రం వాటా 60 శాతం కాగా, రాష్ట్ర వాటా 30 శాతం, నాబార్డు లేదా పీఏసీఎస్ 10 శాతం ఖర్చు చేసే విధంగా అనుమతిచ్చారు. కంప్యూటరీకరణ, ఆన్లైన్ సేవలందించడానికి ప్రతి సభ్యుడు, ఓటరు సమాచారాన్ని నమోదు చేయడానికి ఆధార్ సంఖ్యతో అనుసంధానం చేయాలని ఆదేశాలందాయి. ఆన్లైన్ ప్రక్రియ వేగవంతం చేస్తూ..నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకోవడానికి సహకార సంఘాల అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోంది. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల రికార్డుల కంప్యూటరీకరణ నాబార్బు నిధులతో శరవేగంగా ప్రక్రియ ఈ నెలాఖరుకు ఆన్లైన్ ప్రక్రియను పూర్తి చేసేందుకు కసరత్తు ఇప్పటికే 80 శాతం సొసైటీల రికార్డుల కంప్యూటరీకరణ పూర్తి త్వరలో పూర్తి చేస్తాం.. ప్రాథమిక సహకార సంఘాల ద్వారా సేవలను మరింత విస్తృతం చేసేందుకే నవీకరణ దిశగా శ్రీకారం చుట్టాం. అక్రమాలకు తావులేకుండా పారదర్శక సేవలు అందాలన్నదే లక్ష్యం. ఈ ప్రక్రియ అమల్లోకి తెచ్చేందుకు యుద్ధప్రాతిపదికన ఆన్లైన్లో నమోదు కొనసాగుతోంది. ఉద్యోగులంతా దీనిపైనే కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో 80 శాతానికి పైగా డేటా ఎంట్రీ పూర్తయింది. ఈ నెలాఖరుకు వందశాతం పూర్తి చేస్తాం. – మనోహర్‌గౌడ్, సీఈఓ, జిల్లా సహకార సంఘ బ్యాంక్, చిత్తూరు ఉపయోగం ఇలా.. పీఏసీఎస్‌లను నాబార్డు సాఫ్ట్వేర్ ద్వారా డీసీసీబీలకు జాతీయ నెట్‌వర్క్‌లతో అనుసంధానం చేసేలా కేంద్ర సహకార మంత్రిత్వశాఖ చర్యలు చేపట్టింది. దీంతో సొసైటీలో నమోదైన ప్రతి ఖాతాదారుడికీ కంప్యూటరైజ్డ్ పాసుబుక్ వస్తుంది. అందులో తీసుకున్న రుణం, చెల్లిస్తున్న సొమ్ము ఖాతాకు జమవుతున్న వడ్డీ, తదితర వివరాలను ఆధార్ అనుసంధానం చేస్తారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీలన్నీ నేరుగా రైతుల ఖాతాలకే జమకానున్నాయి. -
● ఏడు దశాబ్దాల కిందట ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి వేరుపడిన ఆంధ్రా ● తమిళనాడులో తెలుగు వారు.. ఆంధ్రాలో స్థిరపడిన తమిళవాసులు ● వేరుపడినా మాతృభాషపై ఎవరి మమకారం వారిదే ● తమిళనాడులో తెలుగును అభ్యసిస్తున్న 11,028 మంది విద్యార్థులు ● ఆంధ్రాలో తమిళ మాధ్యమంలో చదు
నగరి : భాష ప్రాతిపదికన ఏడు దశాబ్దాల క్రితమే రాష్ట్రాలు విడిపోయాయి. 1956 వరకు ఒక్కటిగా ఉన్న ప్రాంతం ఆ ఏడాది రెండుగా విడిపోయి తెలుగు భాష ప్రాతిపదికన ఆంధ్రరాష్ట్రం, తమిళ భాష ప్రాతిపదికన తమిళనాడు రాష్ట్రం ఏర్పడింది. నివాసిత ప్రాంతం మధ్య సరిహద్దు రేఖ వచ్చింది. పరిస్థితుల దృష్ట్యా తెలుగు మాతృభాషగా ఉన్న కుటుంబాలు తమిళనాడులో, తమిళం మాతృభాషగా ఉన్న కుటుంబాలు మన రాష్ట్రంలోనూ స్థిరపడాల్సి వచ్చింది. ప్రాంతాలపై సరిహద్దు వేసిన ప్రభుత్వాలు మాతృభాషపై ప్రజలకు ఉన్న మమకారంపై సరిహద్దు వేరు చేయలేకపోయింది. రాష్ట్రాలు వేరై ఏడు దశాబ్దాలు దాటినా నేటికీ వారు మాతృభాషనే అభ్యసిస్తున్నారు. వీరి మాతృభాషా అభిమానాన్ని అర్థం చేసుకున్న ప్రభుత్వాలు సరిహద్దుల్లో రెండు మాధ్యమాలు ఉన్న పాఠశాలలను నడుపుతూనే ఉన్నాయి. సరిహద్దుల్లోనే ఎక్కువ.. మన రాష్ట్ర సరిహద్దును ఆనుకుని తమిళనాడు రాష్ట్రంలో తెలుగు మాధ్యమాన్ని బోధించే 391 ప్రాథమిక పాఠశాలలు, 68 ప్రాథమికోన్నత పాఠశాలలు, 60 ఉన్నత పాఠశాలలు, 12 జూనియర్ కళాశాలలు ఉన్నాయి. వాటిల్లో 11,028 మంది విద్యార్థులు తెలుగు మాధ్యమం అభ్యసిస్తున్నారు. 786 మంది ఉపాధ్యాయులు తెలుగును బోధిస్తున్నారు. అలాగే తమిళనాడు సరిహద్దును ఆనుకుని మన రాష్ట్రంలో తమిళ మాధ్యమం కలిగిన 15 ఉన్నత పాఠశాలలు, 36 ప్రాథమిక పాఠశాలలు, 5 ప్రాథమికోన్నత స్కూళ్లు, 3 జూనియర్ కళాశాలలు ఉన్నాయి. 10 వేల మంది విద్యార్థులు తమిళ మాధ్యమం అభ్యసిస్తున్నారు. 252 మంది ఉపాధ్యాయులు తమిళ భాషను బోధిస్తున్నారు. ఇలాఇరు రాష్ట్ర ప్రభుత్వాలు మాతృభాషలో చదువుకునేందుకు సహకారం అందిస్తున్నాయి. దీంతో మాతృభాష హద్దులు దాటి తనకంటూ ఒక ప్రత్యేక బంధాన్ని పెనువేసుకుంది. రాష్ట్ర భాష తప్పనిసరి.. సరిహద్దును ఆనుకుని మన రాష్ట్రంలో ఉన్న పాఠశాలల్లో తమిళం బోధించినా సెకండ్ లాంగ్వేజిగా తెలుగు తప్పనిసరిగా తీసుకోవాలి. అయితే వారికి తెలుగులో పాస్ మార్కులు వందకు 20 మాత్రమే. సరిహద్దును ఆనుకుని తమిళనాడులో ఉన్న పాఠశాలల్లో తెలుగు చదివే విద్యార్థులు తప్పనిసరిగా ఒక లాంగ్వేజ్ తమిళం చదవాల్సిందే. పాస్ కావాలంటే 35 మార్కులు సాధించాల్సిందే.పుస్తకాల పంపిణీ ఇలా.. తమిళనాడులో అన్ని తరగతులకు కేటాయించిన సిలబస్‌ను అనుసరించి పాఠ్యాంశాలను తెలుగులోకి అనువదించి రాష్ట్ర ప్రభుత్వమే పుస్తకాలను అందజేస్తుంది. మన రాష్ట్రంలో తమిళ పాఠ్యాంశం మినహా ఇతర పాఠ్యాంశాల పుస్తకాలు మన ప్రభుత్వమే అనువదించి అందజేస్తుంది. తమిళ పాఠ్యాంశానికి మాత్రం తమిళనాడు నుంచి సీడీలు తెచ్చి ఇక్కడ ముద్రించి ఇస్తారు. ఈ ప్రక్రియ ద్వారా పుస్తకాలు అందడంలో ఆలస్యమవుతుండడంతో గత మూడేళ్లు అప్పటి మంత్రిగా ఉన్న ఆర్కేరోజా తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రులతో చర్చించి సీడీలకు బదులుగా పుస్తకాలే తెచ్చి అందజేశారు. ఈ ఏడాది తమిళ విద్యార్థులకు అవసరమైన తమిళ పాఠ్యాంశ పుస్తకాలు ఇంకా అందలేదు.తెలుగు చక్కగా బోధిస్తున్నారు మాది తెలుగు మాట్లాడే కుటుంబం. నివశించేది తమిళనాడులోనే అయినా మాట్లా డేది తెలుగే. మాకు బంధువు లు కూడా ఎక్కువగా ఆంధ్రలోనే ఉన్నారు. దీంతో మా తల్లిదండ్రులు తెలుగులోనే చదివించాలనుకున్నారు. ఇక్కడే తెలుగు భాష నేర్పిస్తుండడంతో కీచలం స్కూల్ లో చేరి తెలుగులోనే చదువుకుంటున్నా. రాష్ట్ర భాష తమిళం కూడా అభ్యసిస్తున్నా. – ఫాజల్ బాషా, చంద్రప్పనాయుడు కండ్రిగ, తిరుత్తణి తాలుకా -
రోడ్డు ప్రమాదంలో సచివాలయ ఉద్యోగి మృతి
శ్రీకాళహస్తి రూరల్: రోడ్డు ప్రమాదంలో సచివాలయ ఉద్యోగి మృతిచెందిన ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. స్థానికుల సమాచారం మేరకు.. మండలంలోని కాపుగున్నేరి సచివాలయ ఇంజినీరింగ్ అసిస్టెంట్కే కే.రాజ్‌కుమార్ (29) గురువారం విధులు ముగించుకుని సాయంత్రం 6.30 సమయంలో ఇంటికి వెళ్లేందుకు కాపు గున్నేరి హైవే రోడ్డు దాటుతున్నాడు. అదే సమయంలో శ్రీకాళహస్తి వైపు వేగంగా వెళుతున్న కారు ఢీకొంది. దీంతో రాజ్ కుమార్‌కు తీవ్ర గాయాలయ్యాయి. సహచర ఉద్యోగులు హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళుతుండగా.. మార్గమధ్యంలోనే మృతిచెందాడు. శ్రీకాళహస్తి రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదానికి కారణమైన కారుని పోలీస్ స్టేషన్ తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. శ్రీవారి దర్శనానికి 6 గంటలు తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో 9 కంపార్ట్మెంట్లు నిండాయి. బుధవారం అర్ధరాత్రి వరకు 59,231 మంది స్వామివారిని దర్శించుకోగా 22,029 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.3.08 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 6 గంటల్లో దర్శనం లభిస్తోంది. -
ఉమ్మడి చిత్తూరు జిల్లా రీజనల్ కో–ఆర్డినేటర్‌గా పెద్దిరెడ్డి
సాక్షి ప్రతినిధి, తిరుపతి: ఉమ్మడి కర్నూలు, వైఎస్సార్ జిల్లాల రీజనల్ కో–ఆర్డినేటర్‌గా ఉన్న మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి తిరుపతి, చిత్తూరు జిల్లాల రీజనల్ కో–ఆర్డినేటర్‌గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ గరురువారం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీచేసింది. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పెద్దిరెడ్డికి రీజనల్ కో–ఆర్డినేటర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించినట్టు పేర్కొంది. స్టోర్‌కు చేరిన విద్యుత్ పరికరాలు చిత్తూరు కార్పొరేషన్: ఉమ్మడి జిల్లా ట్రాన్స్‌కో స్టోర్స్‌కు విద్యుత్ పరికరాలు వచ్చిందని ఎస్ఈ సురేంద్రనాయుడు గురువారం తెలిపారు. 25 కేవీ సామర్థ్యం గల ట్రాన్స్ఫార్మర్లు 40, కండక్టర్ 168 కిలోమీటర్లు వచ్చిందన్నారు. వీటిని సీనియారిటీ వారీగా దరఖాస్తు చేసుకున్న వారికి, పరిశీలించి అందజేయాలని సూచించారు. ఏఈలు వర్క్ఆర్డర్లు పెట్టి మెటీరియల్స్ డ్రా చేసుకోవాలని వివరించారు. నూతన కమిటీ ఎన్నిక చిత్తూరు కలెక్టరేట్ : గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్ఏ)ల సమస్యల పరిష్కారానికి సమిష్టిగా పోరాడుదామని నూతన వీఆర్ఏ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కోదండన్, దేవరాజు అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని రెవెన్యూ భవనంలో రెవెన్యూ అసోషియేషన్ జిల్లా అధ్యక్షుడు హుస్సేన్ ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించారు. నూతన సంఘం జిల్లా అధ్యక్షుడిగా కోదండన్, ప్రధాన కార్యదర్శిగా దేవరాజు, సహధ్యక్షుడిగా ఇర్ఫాన్ అలీ, గౌరవ అధ్యక్షుడిగా లక్ష్మన్, జిల్లా ఉపాధ్యక్షులుగా యాగమూర్తి, జయబదూరి, మంజుల, మాధవి, వాణి, జిల్లా ట్రెజరర్‌గా అశోక్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులు మాట్లాడుతూ జిల్లాలో ఎన్నో సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్న వీఆర్ఏల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. అనంతరం నూతన కమిటీ సభ్యులకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. నాణ్యమైన విద్య అందించండి రామకుప్పం: స్థానిక డా.బీ.ఆర్.అంబేడ్కర్ గురుకుల పాఠశాల, ఆదర్శ పాఠశాలను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్‌గాంధీ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో పారిశుద్ధ్యంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన విద్యతో పాటు నాణ్యమైన భోజనం వడ్డించాలని పాఠశాల సిబ్బందిని ఆదేశించారు. సకాలంలో విద్యార్థులకు అందాల్సిన పాఠ్యపుస్తకాలు, సామగ్రిని అందజేయాలన్నారు. విద్యార్థులు మంచి ఉత్తీర్ణత సాధించే దిశగా భోదన చేపట్టాలని ఉపాధ్యాయులకు సూచించారు. అదనపు గదులు కావాలని పాఠశాల ప్రిన్సిపల్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా, అవసరమైన సౌకర్యాలను త్వరలోనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఆయన రామకుప్పం సమీపంలోని ఆదర్శ పాఠశాలను తనిఖీ చేశారు. కార్యక్రమంలో కుప్పం కడ ప్రత్యేక అధికారి వికాస్ మర్మత్, స్థానిక అధికారులు పాల్గొన్నారు. రోడ్ల మరమ్మతులకు రూ.21.53 కోట్లు చిత్తూరు కార్పొరేషన్: జిల్లాలో రోడ్ల మరమ్మతుల కోసం రూ.21.53 కోట్లు నిధులు విడుదల చేశారని ఆర్అండ్బీ ఈఈ శ్రీనివాసులు తెలిపారు. సంక్రాంతిలోపు రోడ్లపై గుంతలకు మరమ్మతు చేయనున్నట్లు చెప్పారు. చిత్తూరు నియోజకవర్గంలో 117 కిలోమీటర్లకు రూ.2.86 కోట్లు, పూతలపట్టులో 267 కి.మీ.కు, రూ.3.18 కోట్లు, జీడీనెల్లూరులో 301 కి.మీ.కు, రూ.4.08 కోట్లు, నగరిలో 147 కి.మీ.కు, రూ.2.88 కోట్లు, పలమనేరులో 224 కి.మీ.కు, రూ.2.05 కోట్లు, పుంగనూరు 107 కి.మీ.కు, రూ.2.65 కోట్లు, కుప్పం 547 కి.మీ, రూ.3.83 కోట్లు చొప్పున కేటాయించారన్నారు. మొత్తం 1646 కిలోమీటర్లకు, రూ.21.53 కోట్లతో గుంతలు పూడ్చనున్నట్లు చెప్పారు. వీటికి టెండర్లు పిలిచి పనులు అప్పగించనున్నట్లు వివరించారు.