Cotton Cultivation
-
వర్షాధార భూముల్లో.. అధిక దిగుబడినిచ్చే.. సరికొత్త బీటీ పత్తి సూటి రకం!
ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 11న విడుదల చేసిన 61 పంటలకు సంబంధించిన 109 సరికొత్త వంగడాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దక్షిణాది రాష్ట్రాల్లో వర్షాధార వ్యవసాయం చేసే రైతులకు ఉపయోగపడే పత్తి సూటి రకం ఒకటి ఉంది. దాని పేరు సిఐసిఆర్ హెచ్ బీటీ కాటన్ 40 (ఐసిఎఆర్–సిఐసిఆర్ పికెవి 081 బిటి). నాగపూర్‌లోని కేంద్రీయ పత్తి పరిశోధనా సంస్థ (సిఐసిఆర్) ఈ బీటీ సూటి రకాన్ని రూపొందించింది.ఇప్పటి వరకూ మార్కెట్లో ఉన్న జన్యుమార్పిడి బీటీ పత్తి వంగడాలన్నీ హైబ్రిడ్ రకాలే. ఇది హైబ్రిడ్ కాదు. ఓపెన్ పొల్లినేటెడ్ వంగడం. అంటే.. రైతులు ఈ విత్తనాన్ని ప్రతి సంవత్సరం కొనాల్సిన అవసరం లేదు. దూదిలో నుంచి తీసిన విత్తనాన్ని తిరిగి విత్తుకోవచ్చు. పత్తి సాగులో పెద్ద సమస్యగా మారిన పచ్చదోమ వంటి రసంపీల్చే పురుగులతో ΄ాటు తెగుళ్లను సైతం సమర్థవంతంగా తట్టుకుంటుందని సిఐసిఆర్ డైరెక్టర్ డాక్టర్ వై.జి. ప్రసాద్ ‘సాక్షి సాగుబడి’తో చె΄్పారు.సిఐసిఆర్ హెచ్ బీటీ కాటన్ 40 రకాన్ని మూడేళ్లు 15 చోట్ల పండించి చూసిన తర్వాత సివీఐసి దీన్ని దక్షిణాది మెట్ట భూముల్లో సాగుకు ఎంపిక చేసింది. హెక్టారుకు సగటున 17.3 క్వింటాళ్ల పత్తి(సీడ్ కాటన్) దిగుబడి వచ్చింది. ఆదిలాబాద్‌లో 2023–24 సీజన్లో సాధారణ దూరంలో విత్తినప్పుడు అత్యధికంగా హెక్టారుకు 32.05 క్వింటాళ్ల దిగుబడినిచ్చింది. ఇతర రకాలతో ΄ోల్చితే 11–18% అధిక పత్తి దిగుబడినిస్తోంది. దూదిపింజ 26 ఎం.ఎం. పొడవుంటుంది. సగటు దూది పటుత్వం 25.8 జి/టెక్స్. 34–38% గింజల్లేని పత్తి దిగుబడినిస్తుంది. ఈ రకం చీడపీడలను సమర్థవంతంగా తట్టుకుంటుంది. రసంపీల్చే పురుగులను దీటుగా తట్టుకునే ఈ సరికొత్త బీటీ కాటన్ జినోటైప్ వంగడం దక్షిణాది వర్షాధార తేలిక భూముల్లో అధిక దిగుబడినిస్తుందని సిఐసిఆర్ తెలిపింది.తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు అనువైనది..ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని వర్షాధార తేలిక నేలల్లో అధిక సాంద్రతలో విత్తుకోవటానికి సూటిరకమైన సిఐసిఆర్ హెచ్ బీటీ కాటన్ 40 (ఐసిఎఆర్–సిఐసిఆర్ పికెవి 081 బిటి) చాలా అనువైనది. చీడపీడలను సమర్థవంతంగా తట్టుకుంటూ అధిక దిగుబడినిస్తుంది. సర్టిఫైడ్ సీడ్ వచ్చే ఏడాది ఇవ్వగలం. బ్రీడర్ సీడ్ కొద్ది మొత్తంలో ఉంది. కిలో ధర రూ. 320. వచ్చే ఏడాది విత్తనం కావాలనుకునే వారు ముందుగా బుక్ చేసుకోవచ్చు. నాగపూర్ సిఐసిఆర్లోని విత్తన శాస్త్రవేత్త డా. శాంతిని 98906 84572 నంబరులో సంప్రదించవచ్చు. – డా. వై.జి. ప్రసాద్, డైరెక్టర్, కేంద్రీయ పత్తి పరిశోధనా సంస్థ, నాగపూర్, మహారాష్ట్ర -
మిచాంగ్ తుఫానుకు దెబ్బతిన్నా.. తిరిగి విరగ్గాసిన సేంద్రియ పత్తి!
'రసాయన మందులేమీ వాడకుండా సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో బీటీ హైబ్రిడ్ సీడ్ పత్తిని సాగు చేస్తూ అధిక దిగుబడి సాధిస్తున్నారు రైతు ఏకుల లక్ష్మీనారాయణ. వ్యవసాయమే జీవనంగా బతుకుబండిని నడిపిస్తున్న లక్ష్మీనారాయణ తనకు కౌలుకు ఇచ్చిన భూ యజమాని కోటగిరి చైతన్య సూచనల మేరకు సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్లో బీటీ హైబ్రిడ్ విత్తన పత్తిని రెండేళ్లుగా సమర్ధవంతంగా చేస్తూ విశేషమైన దిగుబడులతో పాటు అధిక నికరాదాయం పొందుతున్నారు.' లక్ష్మీనారాయణది ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండలం అన్నేరావుపేట. శివారు గ్రామమైన సీతారామపురంలో కోటగిరి చైతన్య మామిడి తోటకు పక్కనే ఉన్న మూడెకరాల ఎర్ర నేలను కౌలుకు తీసుకొని విత్తన పత్తిని రెండేళ్లుగా సాగుచేస్తున్నారు. ఒక ఎకరానికి డ్రిప్ వేశారు. రెండెకరాలకు నీటిని పారగడుతున్నారు. 120 రోజుల దశలో ఉన్న పత్తి మొక్కలన్నీ ఆరోగ్యంగా ఎదుగుతూ ఇంకా కొత్త చిగుర్లు వేస్తున్నాయి. మొక్కకు 90 నుంచి 110 వరకు కాయలతో చూపరులను ఆశ్చర్యపరుస్తున్నాయి. తనకు దిగుబడి 12 నుంచి 14 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉందని రైతు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎకరాకు రూ.20 వేల చొప్పున మూడెకరాలకు రూ.60 వేలకు కౌలుకు తీసుకొని విత్తన పత్తిని సాగు చేస్తున్నారు. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న చైతన్య కరోనా కాలంలో ఇంటి దగ్గర ఉన్న కాలంలో సేంద్రియ సాగులో మెళకువలను పూర్తిగా ఆకళింపు చేసుకున్నారు. ఇప్పుడు బెంగళూరు తిరిగి వెళ్లినా అక్కడి నుంచే లక్ష్మీనారాయణకు సూచనలిస్తూ పత్తి సాగు చేయిస్తున్నారు. ఆవు పేడతో జీవామృతం, అనేక రకాల జీవన ఎరువులు కలిపి మగ్గబెట్టి ప్రత్యేకంగా రూపొందించిన ఎన్రిచ్డ్ కంపోస్టును మూడెకరాల్లో దుక్కి 3 టన్నులు వేశారు. పత్తి విత్తిన 20 రోజులకు మరో 3 టన్నుల కం΄ోస్టును మొక్కల మొదళ్ల వద్ద వేశారు. లింగాకర్షక బుట్టలు, జిగురు అట్టలతో సమీకృత చీడపీడల యాజమాన్య మెళకువలు పూర్తిగా పాటిస్తున్నారు. పంచగవ్య, పుల్లటి మజ్జిగతోపాటు అగ్నిస్త్రం, బ్రహ్మాస్త్రం, నీమాస్త్రం, దశపర్ణి కషాయం తదితర కషాయాలను విడతల వారీగా లక్ష్మీనారాయణ సొంతంగా తయారు చేసుకుంటూ ఐదు రోజులకోసారి ఏదో ఒకటి అవసరాన్ని బట్టి పిచికారీ చేస్తున్నారు. దీంతో పత్తి మొక్కలు విత్తి 120 రోజులు అయినప్పటికీ ఇంకా బలంగా ఎదుగుతున్నాయి. అంతేగాకుండా ఒక్కొక్క చెట్టుకు కాయలు కూడా అధిక సంఖ్యలో వచ్చాయి. నెలకొరిగినా తిప్పుకుంది! డిసెంబర్ మొదటి వారంలో వచ్చిన మిచాంగ్ తుఫానుకు మూడెకరాల్లోని పత్తి పంటంతా నేల వాలింది. దీంతో రైతు లక్ష్మీనారాయణ తీవ్రమైన ఆందోళనకు గురయ్యారు. ఏదైతే అది అవుతుందని.. పడిపోయిన మొక్కలను కూలీలతో లేపి నించోబెట్టి మొదళ్లలో మట్టిని వేయించారు. ఆ తర్వాత రెండు రోజులకే తోటంతా ఆశ్చర్యకరంగా నిలదొక్కుకుంది. వానపాములు నేలను గుల్లగా ఉంచటం, వేరువ్యవస్థ బలంగా, లోతుగా ఉండటం వల్లే ఇది సాధ్యమైందని రైతు చెప్పారు. ఎంతో ఆరోగ్యంగా పెరుగుతున్న ఈ పంటను ఇటీవల పరిశీలించిన ప్రసిద్ధ వ్యవసాయ నిపుణులు దేవేంద్ర శర్మ, డా. జీవీ రామాంజనేయులు, పాలాది మోహనయ్య తదితరులు లక్ష్మీనారాయణ కృషిని ప్రశంసించారు. ఇతర రైతులు ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని ఆకాంక్షించారు. మిచాంగ్ తుఫాను గాలులకు నేలకొరిగిన లక్ష్మీనారాయణ పత్తి పంట (ఫైల్) 3 ఎకరాల్లో విత్తన పత్తి సాగు: రూ. 7 లక్షల నికరాదాయం! 3 ఎకరాల పొలంలో విత్తన పత్తి క్రాసింగ్ కోసం అరెకరంలో పోతు (మగ) మొక్కల్ని పెంచుతున్నాను. అంటే.. నికరంగా 2.5 ఎకరాల్లోనే పత్తి పంట ఉన్నట్లు లెక్క. చెట్టుకు సగటున 90–100 కాయలున్నాయి. మొదటి విడత పత్తి తీశాం. మరో మూడుసార్లు తీస్తాం. ఎకరానికి 12–14 క్వింటాళ్ల దిగుబడి వస్తుందనుకుంటున్నాం. కనీసం 30 క్వింటాళ్ల సీడ్ పత్తి వస్తుందనుకున్నా.. 18 క్వింటాళ్ల పత్తి విత్తనాలు, 12 క్వింటాళ్ల దూది వస్తుంది. విత్తనాలు క్వింటా రూ. 53,000, దూది క్వింటా రూ. 14,000కు అమ్ముతా. మొత్తం మీద రూ. 4.5 లక్షల ఖర్చులు పోగా నికరాదాయం రూ. 7 లక్షలకు తగ్గదు. తుఫాను దెబ్బకు కొన్ని కాయలు పాడవ్వకపోతే మరో రూ. లక్ష అదనంగా వచ్చి ఉండేది. – ఏకుల లక్ష్మీనారాయణ (95509 84667), అన్నేరావుపేట,రెడ్డిగూడెం మండలం, ఎన్టీఆర్ జిల్లా – ఉమ్మా రవీంద్ర కుమార్ రెడ్డి, సాక్షి, నూజివీడు (చదవండి: రైతు శాస్త్రవేత్త విజయకుమార్‌కు ‘సృష్టి సమ్మాన్’ పురస్కారం) -
పత్తి తూకంలో ‘రిమోట్’ మోసం! ఓ దళారీ రెడ్ హ్యాండెడ్‌గా..
సాక్షి, వరంగల్: కాంటాలో సాంకేతిక పరికరాన్ని ఉపయోగించి రిమోట్ ఆపరేషన్ సహాయంతో తూకంలో మోసం చేస్తున్న ఓ దళారీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. తమను మోసం చేశాడని ఆగ్రహంతో రైతులు ఆ వ్యక్తికి దేహశుద్ధి చేసిన ఘటన హసన్‌పర్తి మండలం నాగారంలో సోమవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల పరిధి అంబాలకు చెందిన ప్రైవేట్‌గా వ్యాపారి గడ్డం వెంకటేశ్వర్లు పరకాల, సూదన్‌పల్లి, పెంబర్తి, అంబాల, కమలాపూర్, శ్రీరాములపల్లి గ్రామాల్లో రైతుల ఇళ్లకు వెళ్లి అక్కడే పత్తి తూకం వేసి వెంటనే డబ్బులు చెల్లిస్తున్నాడు. మార్కెట్ ధర కంటే మరో రూ.100 అదనంగా చెల్లిస్తుండడంతో రైతులు ఆసక్తితో ముందుకు వచ్చారు. వ్యాపారి వెంకటేశ్వర్లు వద్ద గుమస్తాగా పనిచేస్తున్న అంబాలకు చెందిన కర్ణాకర్ తన యజమాని సూచన మేరకు రెండు నెలలుగా ఆయా గ్రామాలకు వెళ్లి పత్తి కొనుగోలు చేస్తున్నాడు. అయితే వచ్చిన దిగుబడికి.. తూకం వేసిన తర్వాత వ్యత్యాసం కనిపించినా రైతులకు ఏం జరుగుతున్నదో అర్థం కావడంలేదు. మోసాన్ని గుర్తించింది ఇలా.. సోమవారం ఉదయం నాగారంలోని రాజిరెడ్డి ఇంటికి కర్ణాకర్ వచ్చి పత్తి కాంటా వేశాడు. తొలుత 92.6 కిలోల తూకం వచ్చిన పత్తి.. సెకండ్ల వ్యవధిలోనే 74.1 కిలోలకు చేరింది. దీంతో రాజిరెడ్డి కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి గుమస్తా చేతులను పరిశీలించారు. ఏదో జరుగుతున్నదని గమనించి వెంటనే అతడి జేబులను తనిఖీ చేయగా రిమోట్ దొరికింది. దీంతో భయపడిన గుమస్తా ఆ రిమోట్‌ను బయటికి విసరగా.. రాజిరెడ్డి కుటుంబ సభ్యులు వెతికి తీసుకుని వచ్చారు. ఎలక్ట్రానిక్ కాంటాకు రిమోట్ కనెక్షన్.. సదరు దళారీ ఎలక్ట్రానిక్ కాంటాను రిమోట్ కనెక్షన్ ఇచ్చాడు. పత్తి తూకం వేసినప్పుడు జేబులో నుంచి ఒకసారి రిమోట్ ద్వారా ఆపరేట్ చేస్తే 15 కిలోలు, రెండుసార్లు చేస్తే 30 కిలోలు తక్కువ తూకం వచ్చేలా కాంటాలో సాంకేతిక పరికరాన్ని బిగించి రిమోట్‌కు అనుసంధానం చేశాడు. ఓవైపు రైతులు తూకం నమోదు చేస్తుండగా.. మరో వైపు దళారీ రిమోట్‌తో ఆపరేట్ చేయడంతో క్వింటాకు 15 కిలో ల నుంచి 30 కిలోల పత్తి తగ్గుతోంది. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన కర్ణాకర్‌ను రైతులు అదుపులోకి తీసుకుని విచారించగా.. తన యజమాని వెంకటేశ్వర్లు సూచన మేరకు రిమోట్ వాడుతున్నట్లు తెలిపారు. అప్పుడే అక్కడికి చేరిన వెంకటేశ్వర్ల్లును రైతులు ప్రశ్నించగా.. తనకేమీ తెలియనట్లుగా నటించడంతో రైతులు అతడికి కూడా దేహశుద్ధి చేశారు. గుర్తించకుంటే.. పత్తి తూకం వేయగా 92.6 కిలోలు వచ్చింది. ఆ వెంటనే 74.1 కిలోలకు తగ్గింది. అనుమానం వచ్చి అతని జేబులు పరిశీలించగా రిమోట్ కనిపించింది. గుర్తించకుంటే మూడు క్వింటాళ్ల పత్తి మాయమయ్యేది. – రాజిరెడ్డి, రైతు మూడు క్వింటాళ్లు మాయం.. ఇటీవల మార్కెట్ ధర కంటే వంద రూపాయలు అదనంగా ఇస్తామంటే ఇంటి వద్ద పత్తి అమ్మిన. అయితే 15 క్వింటాళ్ల దిగుబడి వస్తే.. తూకంలో 12 క్వింటాళ్లు వచ్చింది. తూకంలో మోసం చేసి మూడు క్వింటాళ్ల పత్తి మాయం చేశాడు. – లింగారెడ్డి, రైతు -
భారీ వర్షాలకు పత్తి పంట నాశనం... సర్కారే ఆదుకోవాలని రైతుల విజ్ఞప్తి
-
పత్తి పంటలో అధిక దిగుబడికి కొత్త ప్రయోగాలు..
-
వరికి పోటీగా పత్తి సాగు... నష్టాల్లో రైతులు
-
అవగాహన, ప్రణాళికతో పంట సాగు చేసుకుంటే మంచి లాభాలు...
-
మల్బరీ, పట్టులో ‘ఉమ్మడి అనంత’ పైచేయి
ఉద్యాన పంటలకు అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాలు రాష్ట్రంలోనే పేరెన్నికగన్నవి. కానీ ఈ రెండు ఇప్పుడు మల్బరీ సాగులోనూ మొదటి వరుసలో నిలిచాయి. శ్రీసత్యసాయి జిల్లాలో ఉత్పత్తయ్యే పట్టు అత్యంత నాణ్యమైనది. ఇక్కడ ఉత్పత్తి అయ్యే పట్టుకు దేశీయంగా మంచి మార్కెట్ ఉంది. రాష్ట్రంలో అత్యధిక విస్తీర్ణంలో మల్బరీ పండించే జిల్లాల్లో శ్రీసత్యసాయి మొదటి స్థానంలో ఉండగా.. అనంతపురం జిల్లా నాలుగో స్థానంలో ఉంది. అంతర్జాతీయంగానూ ధర్మవరంలో తయారయ్యే పట్టుచీరలకు ఎంత ఖ్యాతి ఉందో అందరికీ తెలిసిందే. సాక్షి ప్రతినిధి, అనంతపురం: మనరాష్ట్రంలో శ్రీసత్యసాయి జిల్లాలోని మడకశిర, హిందూపురం, పుట్టపర్తి, ధర్మవరం ప్రాంతాలతో పాటు అనంతపురం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో మల్బరీ సాగు భారీ విస్తీర్ణంలో ఉంది. ఒక్క శ్రీసత్యసాయి జిల్లాలో 26వేల మంది రైతులు 44,487 ఎకరాల్లో మల్బరీ సాగు చేస్తున్నట్టు పట్టుపరిశ్రమ శాఖ అంచనా. చిత్తూరులో 39,849 ఎకరాల్లోనూ, అన్నమయ్య జిల్లాలో 12,839 ఎకరాల్లోనూ పండిస్తుండగా, 6,740 ఎకరాల్లో మల్బరీ సాగుచేస్తూ అనంతపురం జిల్లా నాల్గో స్థానంలో నిలిచింది. శ్రీసత్యసాయి జిల్లాలో 26వేల పైచిలుకు మల్బరీ రైతులుండగా, అనంతపురం జిల్లాలో 8,500 మంది ఉన్నారు. శ్రీసత్యసాయి జిల్లాలో ఉత్పత్తి అవుతున్న పట్టుగూళ్లు అత్యంత నాణ్యమైనవిగా పేరుంది. ప్రస్తుతం రాష్ట్రంలోనే అత్యధికంగా ధర్మవరం పట్టుగూళ్లు కిలో రూ.607 పలుకుతున్నాయి. పట్టుగూళ్ల ధర ఆశాజనకం రెండు ఎకరాల్లో మల్బరీ సాగు చేశాం. ఎకరాకు రూ.30 వేలు పెట్టుబడి పెట్టాం. బైవోల్టిన్ పట్టుగూళ్లు పెంచాం. దిగుబడి బాగా వచ్చింది. పట్టు గూళ్ల ధర కూడా ఆశాజనకంగా ఉంది. కిలో రూ.700పైగా పలికింది. రెండు ఎకరాలకు రూ.లక్షదాకా లాభం వచ్చింది. – రంగనాథ్, రైతు, రొళ్ల మల్బరీ సాగు లాభదాయకం కొన్నేళ్లుగా పట్టు పరుగులు పెంచుతున్నా. రెండెకరాల్లో మల్బరీ సాగు చేశా. ఏటా ఐదు నుంచి ఆరు పంటలు తీసుకుంటా. ఒక పంటకు ఖర్చు పోను రూ.లక్ష నుంచి రూ.1.50 లక్షల వరకు ఆదాయం వస్తుంది. మల్బరీ నర్సరీని కూడా ఏర్పాటు చేశా. నర్సరీ ద్వారా కూడా ఆదాయం వస్తోంది. – నారాయణప్ప, వి.ఆగ్రహారం, అమరాపురం మల్బరీ విస్తీర్ణం పెంపునకు కృషి హిందూపురం పట్టుగూళ్ల మార్కెట్ రాష్ట్రంలోనే అతి పెద్దది. సగటున రోజుకు 6వేల కిలోల పట్టుగూళ్లు వస్తున్నాయి. శ్రీసత్యసాయి జిల్లాలో కదిరి, ధర్మవరంలో కూడా పట్టుగూళ్ల మార్కెట్లు ఉన్నాయి. ఇప్పటికే మల్బరీ సాగు విస్తీర్ణం గణనీయంగా ఉంది. దీన్ని మరింత పెంచేందుకు కృషి చేస్తాం. – పద్మమ్మ, పట్టు పరిశ్రమ శాఖ జేడీ, శ్రీసత్యసాయి జిల్లా -
AP: ఏడేళ్ల తర్వాత రికార్డు స్థాయిలో సాగు.. వెలుగులీనుతోన్న తెల్లబంగారం
సాక్షి, అమరావతి: పత్తి రైతు పంట పండింది. తెల్లబంగారం వెలుగులీనుతోంది. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో రికార్డుస్థాయిలో సాగవడమే కాదు.. దిగుబడులు కూడా భారీగా వచ్చేలా కనిపిస్తోంది. చరిత్రలో ముందెన్నడు లేని రీతిలో గతేడాది క్వింటాల్ రూ.13 వేలకుపైగా పలకడంతో ఈ ఏడాది రెట్టించిన ఉత్సాహంతో రైతులు పత్తిసాగువైపు మళ్లారు. వేరుశనగ సాగుచేసే రైతులు సైతం ఈ ఏడాది పత్తి సాగుచేశారు. ఫలితంగా సాగువిస్తీర్ణం బాగా పెరిగింది. ప్రస్తుతం మార్కెట్లో కనీస మద్దతు ధర కంటే రూ.3 వేలకుపైగా ఎక్కువగా పలుకుతున్న ధర నిలకడగా ఉండడంతో రైతుల్లో ఆశలు చిగురించాయి. రాష్ట్రంలో పత్తి సాధారణ సాగువిస్తీర్ణం 14.73 లక్షల ఎకరాలు. 2019–20లో 16 లక్షల ఎకరాల్లో సాగవగా, 2020–21లో 14.50 లక్షల ఎకరాల్లో, 2021–22లో 13.32 లక్షల ఎకరాల్లో సాగైంది. గతేడాది అకాల వర్షాలు, తెగుళ్ల ప్రభావంతో 12.29 లక్షల టన్నుల దిగుబడులు నమోదయ్యాయి. 2022–23 ఖరీఫ్ సీజన్లో రికార్డు స్థాయిలో 16.50 లక్షల ఎకరాల్లో సాగైంది. పత్తి చరిత్రలో 2014–15లో 16.35 లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది. ఇప్పటివరకు అదే రికార్డు. ఈ రికార్డును అధిగమించే స్థాయిలో ఈ ఏడాది 16.50 లక్షల ఎకరాల్లో పత్తి వేశారు. 2014–15లో 15.50 లక్షల టన్నుల దిగుబడి వచ్చింది. ఈ ఏడాది 17.85 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని మొదటి ముందస్తు అంచనాగా లెక్కించారు. సీజన్ పూర్తయ్యేనాటికి దిగుబడి 20 లక్షల టన్నులకుపైగానే రావచ్చని భావిస్తున్నారు. నిజంగా ఆ స్థాయిలో వస్తే దిగుబడుల్లో కూడా కొత్త రికార్డు నమోదయ్యే అవకాశం ఉంది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది సమయానుకూలంగా కురుస్తున్న వర్షాలు పత్తికి మేలు చేస్తున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది తెగుళ్లు ప్రభావం తక్కువగా ఉందని చెబుతున్నారు. ఏటా కలవరపెట్టే గులాబీ తెగులు కూడా ఈ ఏడాది కొన్ని ప్రాంతాలకే పరిమితం కావడం రైతులకు కలిసొచి్చంది. పత్తి ఎక్కువగా సాగయ్యే కర్నూలు, గుంటూరు ప్రాంతాల్లో బోర్లకింద ఈసారి ఎకరాకు 15–20 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం క్వింటాల్ కనీస మద్దతు ధర.. పొడుగుపింజ పత్తికి రూ.6,380, మధ్యస్థ పత్తికి రూ.6,080గా ప్రకటించింది. గతేడాది క్వింటాల్ రూ.13 వేలవరకు పలికిన ధర ప్రస్తుతం రూ.9,501 ఉంది. ప్రస్తుతం మార్కెట్లో నిలకడగా ఉన్న ధర సీజన్ పూర్తిస్థాయిలో ప్రారంభమయ్యే నాటికి మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. రెండేళ్ల పాటు పత్తికి కనీస మద్దతు ధర లభించకపోవడంతో ప్రభుత్వం జోక్యం చేసుకుని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ద్వారా 2019–20లో 13 లక్షల క్వింటాళ్లు, 2020–21లో 18 లక్షల క్వింటాళ్ల చొప్పున రైతుల నుంచి కనీస మద్దతు ధరకు కొనుగోలుచేసింది. గతేడాది కూడా 50 మార్కెట్ యార్డులతోపాటు 73 జిన్నింగ్ మిల్లుల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. సాగువిస్తీర్ణం తగ్గడం, అంతర్జాతీయంగా కాటన్ యార్న్ ధరలు పెరగడంతో పత్తికి రికార్డుస్థాయి ధర పలికింది. ఫలితంగా రైతులు ఈ కేంద్రాల వైపు కన్నెత్తి చూడలేదు. దక్షిణాది రాష్ట్రాల్లో ప్రధాన పత్తి మార్కెట్‌గా పేరొందిన కర్నూలు జిల్లా ఆదోని యార్డుకు వ్యాపారులు క్యూ కట్టారు. గతేడాది 6.13 లక్షల క్వింటాళ్ల పత్తి యార్డుకు రాగా ఈ ఏడాది ఇప్పటికే 1.80 లక్షల క్వింటాళ్ల పత్తి వచి్చంది. ప్రస్తుతం సగటున రోజుకు ఆరువేల క్వింటాళ్ల చొప్పున ఈ యార్డుకు వస్తోంది. సీజన్ పూర్తిస్థాయిలో ప్రారంభమైతే రోజుకు 15 వేల నుంచి 20 వేల క్వింటాళ్ల వరకు వస్తుందని అంచనా వేస్తున్నారు. కనీసం ఈసారి 7–10 లక్షల క్వింటాళ్ల వరకు వస్తుందని అంచనా వేస్తున్నారు. ధర నిలకడగా ఉంది గత సీజన్లో రికార్డుస్థాయిలో ధర పలికింది. గరిష్టంగా క్వింటాల్ రూ.13 వేలకుపైగా పలికింది. ఆ తర్వాత కాస్త తగ్గినప్పటికీ ప్రస్తుతం ధర రూ.9,501 వద్ద ఉంది. యార్డుకు రోజుకు సగటున ఆరువేల క్వింటాళ్ల చొప్పున పత్తి వస్తోంది. ఈరోజు 1,044 లాట్స్ (4,957 క్వింటాళ్లు) పత్తి వచి్చంది. – బి.శ్రీకాంతరెడ్డి, కార్యదర్శి, ఆదోని మార్కెట్‌యార్డు, కర్నూలు జిల్లా అవసరం ఉండదనుకుంటున్నాం ప్రభుత్వాదేశాలతో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశాం. మార్కెట్లో రికార్డుస్థాయిలో ధర పలకడంతో వ్యాపారులు పోటీపడి కొనుగోలు చేశారు. రైతులెవరు మా కేంద్రాలను ఆశ్రయించలేదు. ఫలితంగా క్వింటా పత్తి కూడా కొనుగోలు చేయలేదు. గతేడాది రికార్డుస్థాయిలో రూ.13 వేలకుపైగా పలికింది. ప్రస్తుతం 9,500 వరకు పలుకుతోంది. గత సీజన్ మాదిరిగానే ధర పెరిగే అవకాశం ఉంది. ఈసారి కూడా కొనుగోలు చేయాల్సిన అవసరం ఉండదనే భావిస్తున్నాం. – జి.సాయిఆదిత్య, ఏజీఎం, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా -
మూడు చక్రాల బుల్లెట్ బండి! లీటర్ డీజిల్‌తో ఎకరం దున్నుకోవచ్చు!
డీజిల్‌తో నడిచే మూడు చక్రాల ‘బుల్లెట్ బండి’తో తక్కువ ఖర్చుతో వ్యవసాయ పనులను చేసుకుంటున్నారు నల్లగొండ జిల్లాకు చెందిన ఓ కౌలు రైతు. నల్లగొండ మండలం రసూల్ పుర గ్రామానికి చెందిన రైతు గుండెబోయిన జానయ్య 8 ఎకరాల కౌలు భూమిలో పత్తి సాగు చేస్తున్నారు. మినీ ట్రాక్టర్ తరహాలో అనేక వ్యవసాయ పనులకు ఉపయోగిస్తున్నారు. గుజరాత్ నుంచి తెప్పించుకొని వాడుతున్న మరో రైతు దగ్గర నుంచి బుల్లెట్ బండిని రూ. 60 వేలకు జానయ్య గత ఏడాది కొన్నారు. అంతర సేద్యానికి గుంటక తోలటం, ఎరువులు వేయడానికి, పురుగుల మందు పిచికారీకి పత్తి, కూరగాయలు తదితర మెట్ట పంటల్లో ఇది చాలా ఉపయోగకరంగా ఉందన్నారు. లీటర్ డీజిల్‌తో ఎకరం దున్నుకుంటున్నానన్నారు. ఇతరుల పొలాల్లో గుంటక కొడితే గంటకు రూ. వెయ్యి తీసుకుంటానని జానయ్య (96761 47981) తెలిపారు. – కంది భజరంగ్ ప్రసాద్, సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, నల్లగొండ చదవండి: Mosambi Cultivation: లాభాల బుట్టలో రైతు.. బత్తాయి కాయలకు తాటాకు బుట్టలు తొడిగి! Maharashtra: ఇక నల్లేరుపై బండి నడకే!.. బండి లాగే ఎద్దుల కష్టం తగ్గించే ఆవిష్కరణ -
పత్తి సాగుపై పల్నాడు రైతుల ఆసక్తి
సాక్షి, నరసరావుపేట: పల్నాడు జిల్లాలో ఖరీఫ్ కోలాహలం నెలకొంది. రైతులు పొలం పనుల్లో బిజీ అయ్యారు. జిల్లాలో ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం 2,87,954 హెక్టార్లు ఉండగా, ఇప్పటి వరకు 55,281 హెక్టార్లలో వివిధ పంటల విత్తనాలు వేశారు. గతేడాది ఇదే సమయంలో 19,164 హెక్టార్లలో మాత్రమే సాగు ఆరంభమైంది. సకాలంలో వర్షాలు కురవడంతో రైతులు సాగుకు ఉత్సాహంగా కదులుతున్నారు. ఈ ఏడాది రైతులు పత్తి సాగుపై అమితాసక్తి కనబరుస్తున్నారు. ఇప్పటివరకు మొదలైన పంటల సాగులో పత్తి విస్తీర్ణమే అధికం కావడం గమనార్హం. రెంటచింతల, పిడుగురాళ్ల, క్రోసూరు, పెదకూరపాడు, అమరావతి ప్రాంతాల్లో ఓపెన్ నర్సరీలు, షేడ్‌నెట్‌లో మిరప నారు పోస్తున్నారు. తగ్గనున్న మిర్చి సాగు గత ఏడాది మిర్చి పంటకు విపరీతమైన తెగుళ్లు సోకాయి. ఫలితంగా ఈ ఏడాది సాధారణ విస్తీర్ణం కన్నా నాలుగు నుంచి ఆరు వేల హెక్టార్లలో సాగు తగ్గే అవకాశం ఉందని వ్యవసాయాధికారులు అంచనా వేస్తున్నారు. పత్తి పంటకు గతేడాది ధర ఎక్కువ పలకడంతో సాధారణ విస్తీర్ణం కంటే 10 నుంచి 15 వేల హెక్టార్లు అధికంగా సాగు చేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. పల్నాడు జిల్లాలో దాదాపు 1.45 లక్షల హెక్టార్లలో పత్తి పంట సాగయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే రబీ అనంతరం రెండునెలల ముందే కొన్నిప్రాంతాల్లో పత్తి, నువ్వులు 5,276 హెక్టార్లలో సాగవడం గమనార్హం. రైతులకు అండగా ప్రభుత్వం కృష్ణానది ఎగువ ప్రాంతాలైన కర్ణాటక, మహారాష్ట్రలలో భారీ వర్షాలు పడటంతో శ్రీశైలానికి భారీ స్థాయిలో వరద నీరు వచ్చి చేరుతోంది. ఇదే స్థాయిలో నీరు వస్తే మరో నాలుగైదు రోజుల్లో సాగర్‌కి నీరు పెద్ద మొత్తంలో విడుదలయ్యే అవకాశం ఉంది. జూలై చివర్లో కాలువలకు సాగర్ నీరు విడుదల చేసే ఆస్కారం ఉండడంతో జిల్లాలోని రైతులు సాగుకు వడివడిగా అడుగులు వేస్తున్నారు. దీంతో ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల ద్వారా నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందజేస్తోంది. అన్నివిధాలా అండగా ఉంటుంది. ఇప్పటికే రైతు భరోసా పథకం ద్వారా పెట్టుబడి సాయం అందజేసిన విషయం తెలిసిందే. జిల్లాలో ఈ ఏడాది 2,43,492 మంది రైతులకు రూ.134.24 కోట్ల లబ్ధి రైతు భరోసా ద్వారా చేకూరింది. అలాగే పంటల బీమా పరిహారం ద్వారా మరో 54,997 మందికి రూ.49.89 కోట్ల లబ్ధి కలిగింది. పుష్కలంగా ఎరువులు జిల్లాలో ఖరీఫ్ సాగుకు ఎరువులు, విత్తనాలు పుష్కలంగా అందుబాటులో ఉన్నాయి. 3,14,635 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమని అధికారులు అంచనా వేయగా, దీనిలో జూలై నెలకు 40,161 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమని తేల్చారు. దీంతో ఇప్పటికే 64,302 మెట్రిక్ టన్నులను సిద్ధం చేశారు. విత్తనాలూ అందుబాటులో ఉన్నాయని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే 6 వేల కింటాళ్ల పిల్లిపెసర, జీలుగ, జనుము విత్తనాలను ఇప్పటికే ఆర్బీకేల ద్వారా పంపిణీ చేయడం గమనార్హం. విత్తనాలు సరఫరా చేశాం జిల్లాలో ఎరువులు, విత్తనాలకు ఎలాంటి కొరతా లేదు. ఇప్పటికే రైతులకు పత్తి, వరి, మిరప విత్తనాలు రైతు భరోసా కేంద్రాల ద్వారా సరఫరా చేశాం. – ఐ.మురళీ, జిల్లా వ్యవసాయశాఖ అధికారి, పల్నాడు జిల్లా వ్యవసాయం కలిసి వచ్చింది.. మాకు 7.5 ఎకరాల పొలం ఉంది. ఇందులో పత్తి, మిర్చి సాగు చేస్తాను. ప్రస్తుతానికి పత్తి పంట బాగా ఉంది. మిరప నారు పోయడానికి సిద్ధపడుతున్నాను. రెండేళ్లుగా వ్యవసాయం బాగా కలసి వచ్చింది. ఈ సారి కూడా ఖరీఫ్ సీజన్‌కు ఢోకా ఉండదనే నమ్మకంతో ఉన్నాం. రైతు భరోసా డబ్బులు జమ చేయడంతోపాటు ఆర్బీకేలలో విత్తనాలు, ఎరువులను ప్రభుత్వం అందుబాటులో ఉంచుతోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తోంది. – అడపా సుబ్బారెడ్డి, వెల్దుర్తి, మాచర్ల నియోజకవర్గం -
యాసంగిలో తొలిసారి పత్తి సాగు
చెన్నూర్: వర్షాధారంగా సాగయ్యే పత్తి పంటను మంచిర్యాల జిల్లా రైతులు రాష్ట్రంలోనే తొలిసారిగా యాసంగిలో సాగు చేసి విజయం సాధించారు. ఈ ఏడాది పత్తికి డిమాండ్ ఉండడంతో మంచి లాభాలు ఆర్జించారు. చెన్నూర్ మండలం శివలింగాపూర్, అక్కెపల్లి గ్రామాల్లో ఎనిమిది మంది రైతులు 17 ఎకరాలు, లక్సెట్టిపేట మండలం ఇటిక్యాల, దండేపల్లి, జైపూర్ మండలం కోటపల్లిలో కొందరు రైతులు ఐదెకరాల చొప్పున మొత్తంగా 37 ఎకరాల్లో పత్తి పంట సాగు చేశారు. ఇందులో ఇటిక్యాల గ్రామంలో కొడె తిరుమల్‌రావుకు ఐదెకరాల్లో.. ఎకరాకు 10 క్వింటాళ్ల నుంచి 12 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. క్వింటాల్‌కు రూ.10 వేలకు పైగా ధర పలకడంతో ఎకరానికి రూ.లక్షకు పైగా రాబడి వచ్చింది. శివలింగాపూర్, అక్కెపల్లి గ్రామాల్లో కొంతమందికి ఎకరానికి ఏడెనిమిది క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశాలున్నాయి. శివలింగాపూర్, అక్కెపల్లి గ్రామాల్లో పత్తి పంటను ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధన విభాగం సంచాలకురాలు ఉమాదేవి తన బృందంతో పరిశీలించారు. రానున్న రోజుల్లో యాసంగిలో పత్తి సాగు చేస్తే బాగుంటుందని ఈ బృందం అభిప్రాయపడింది. ఈ పరిశోధన బృందం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తే యాసంగిలో పత్తి సాగు చేయాలని అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ప్రయత్నం ఫలించింది.. యాసంగిలో వరికి బదులుగా 3.08 ఎకరాల్లో పత్తి సాగు చేశా. తొలి ప్రయత్నం ఫలించి పత్తి ఏపుగా పెరగడమే కాకుండా కాయ నాణ్యత బాగుంది. ఎకరానికి 7 నుంచి 8 క్వింటాళ్లకు పైగా దిగుబడి వస్తుంది. యాసంగి పత్తి పంట లాభమే. – బత్తుల సమ్మయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ ఎకరానికి రూ.లక్ష ఆంధ్రప్రదేశ్‌లో యాసంగిలో పత్తి సాగు చేస్తారు. తెలంగాణలో ప్రయత్నం చేద్దామని ఐదు ఎకరాల్లో పత్తి పంట వేశా. ఎకరానికి రూ.30 వేలు ఖర్చయింది. వర్షాధార పత్తి కంటే దిగుబడి బాగుంది. ఖర్చు కూడా తక్కువే. ఎకరానికి రూ.లక్ష ఆదాయం వచ్చింది. వచ్చే ఏడాది పది ఎకరాల్లో పత్తి వేస్తా. –తిరుమల్‌రావు, రైతు, ఇటిక్యాల డిసెంబర్లో సాగు చేస్తే మేలు.. చెన్నూర్ మండలంలో 17 ఎకరాల్లో పత్తి సాగైంది. పంట బాగుంది. ఎకరానికి 7 నుంచి 8 క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ఇక్కడి రైతులు జనవరిలో విత్తనాలు వేశారు. యాసింగిలో పత్తి సాగు చేయాలని ఆసక్తి ఉన్న రైతులు డిసెంబర్లో విత్తనాలు వేస్తే దిగుబడి మరింత పెరుగుతుంది. –మహేందర్, ఏవో, చెన్నూర్ -
పత్తి ఏరాల్సిన చోట.. చేనులో చేపల వేట
ఇటీవల కురిసిన వర్షాలకు మంచిర్యాల జిల్లాలో గోదావరి పరవళ్లు తొక్కుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద వస్తుండడంతో నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న పంట చేలలోకి వరద నీరు చేరింది. గోదావరి నదిలో వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో బుధవారం చేపల వేటకు అధికారులు అనుమతించలేదు. అయితే కొందరు మత్య్సకారులు నీరు నిలిచిన పొలాల్లో చేపల వేట కొనసాగించడం ఆసక్తికరంగా మారింది. పరివాహక ప్రాంతంలోని పంట చేలలో వరద నీటిపై తెప్పలు వేసుకుని వెళ్లి మత్య్సకారులు చేపలు పట్టారు. తమ రెక్కల కష్టం వరద పాలైందని రైతులు వాపోతున్నారు. పంట నష్టం జరిగిన పొలాలకు ప్రభుత్వం పరిహారం ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు. పత్తి ఏరాల్సిన చోట చేపలు పట్టడం వింతగా ఉంది. - సాక్షి ఫొటోగ్రాఫర్, మంచిర్యాల -
జీన్స్, టీషర్ట్స్ లవర్స్‌కు షాకింగ్ న్యూస్...!
జీన్స్, టీ షర్ట్స్ అంటే యువతకు విపరీతమైన మోజు. ఏదైనా షాపింగ్ మాల్స్‌కు వెళ్లినప్పుడు మనలో ఎక్కువగా ఫ్రీఫర్ చేసేది జీన్స్, టీషర్ట్సే...! కాగా రానున్న రోజుల్లో జీన్స్, టీషర్ట్స్ ధరలకు రెక్కలు వచ్చేలా ఉన్నాయి.దీనికి కారణం ప్రపంచవ్యాప్తంగా కాటన్ ధరలు భారీగా పెరిగినట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ప్రతికూల పరిస్థితులు, షిప్పింగ్ కంపెనీలు కాటన్ రవాణాకు భారీగా ఛార్జీలను వసూలు చేస్తుండటంతో కాటన్ ధరలు విపరీతంగా పెరిగాయి. చదవండి: భారీ డిస్కౌంట్లతో ముందుకువస్తోన్న షావోమీ..! సుమారు రూ. 75 వేల వరకు తగ్గింపు..! భారత్‌తో సహా, అమెరికా లాంటి దేశాల్లో పత్తి పంటకు భారీ సమస్యలు తలెత్తడంతో కాటన్ దిగుబడి తగ్గిపోయింది. అంతేకాకుండా చైనా, మెక్సికో దేశాలు రికార్డు స్ధాయిలో కాటన్‌ను కొనుగోలు చేస్తున్నాయి. గత ఏడాది నుంచి ఈ దేశాల నుంచి అమెరికా పూర్తిగా దిగుమతులను నిలిపివేసింది. భారీ మొత్తంలో కాటన్‌ను కొనుగోలు చేసి కృత్రిమ కొరతను సృష్టించేలా చైనా ముందుకు సాగుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గత పదేళ్లలో తొలిసారి కాటన్ ఫ్యూచర్స్ పౌండ్ (సుమారు 453 గ్రాములు)కు ఒక డాలర్‌కు చేరింది. అంతర్జాతీయంగా కాటన్ ధరలు పెరగడంతో పలు జీన్స్, టీ షర్ట్స్ కంపెనీలు త్వరలోనే భారీగా ధరలను పెంచేందుకు సిద్దమైతున్నట్లు తెలుస్తోంది. కాటన్ ధరల పెరుగుదల లివైస్ స్ట్రాస్లాంటి పెద్ద కంపెనీలకు భారీ ఎత్తున్న ప్రభావితం చేస్తున్నాయి. న్యూయర్క్‌లో డిసెంబర్ నెలలో కాటన్ షిప్పింగ్ ఛార్జీలు ఒక పౌండ్‌కు 3.6 శాతం పెరిగి 1.0155 డాలర్లకు చేరుకుంది. 2011, నవంబర్ తర్వాత ఈ స్థాయిలో పెరగడం ఇదే తొలిసారి. ఈ ఏడాది మొత్తంగా ధర 28 శాతం పెరిగింది. ఎందుకైనా మంచిది ఈ పండుగ సీజన్లో ఓ నాలుగైదు జీన్స్ ఎక్కువ కొనుక్కోవడం మంచిందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. చదవండి: Netflix: ఓటీటీలో సినిమా, వెబ్సిరీస్లేకాదు..గేమ్స్ కూడా..! -
పొట్టేలుతో గుంటక తోలిన రైతు
ఎమ్మిగనూరు రూరల్: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం వెంకటగిరిలో రైతు పింజరి రంజాన్ తన పత్తి పొలంలో పొట్టేలుతో గుంటక తోలాడు. రంజాన్ తనకు ఉన్న ఎకరం పొలంలో పత్తి పంటను సాగు చేస్తున్నాడు. వర్షాలు బాగా కురవడంతో పత్తి చేలో గడ్డిమొక్కలు పెరిగాయి. వీటిని తొలగించాలంటే ఎద్దులతో గుంటక తోలాలి. ఇందుకు రూ.1,000 తీసుకుంటారు. అంత సొమ్ము పెట్టలేని రైతు శనివారం తను పెంచుకుంటున్న పొట్టేలును అరకకు కట్టి గుంటక తోలాడు. పొట్టేలు ముందు కుమారుడు గడ్డి చూపిస్తూ వెళ్తుంటే.. ఆ ఆశతో అది గుంటక లాగుతుండటం పలువురిని ఆకట్టుకుంది. తాను పేద రైతునని, ఎద్దులు కొనే స్థోమత లేక ఇలా సాగు చేసుకుంటున్నానని రంజాన్ తెలిపాడు. -
అక్రమ హెచ్‌టీబీటీ పత్తిసాగుపై చర్యలు తీసుకోవాలి
న్యూఢిల్లీ: దేశంలోని పలు ప్రాంతాల్లో చట్టవిరుద్ధంగా హెచ్‌టీబీటీ పత్తి విత్తనాల సాగు ఒక్కసారిగా ఊపందుకోవడంపై ఫెడరేషన్ ఆఫ్ సీడ్ ఇండస్ట్రీస్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఐఐ), నేషనల్ సీడ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్ఏఐ) ఆందోళన వ్యక్తం చేశాయి. దీనివల్ల పర్యావరణంతోపాటు రైతులకు, చట్టబద్ధమైన విత్తన కంపెనీలకు, ప్రభుత్వాల ఆదాయానికి నష్టమని అసోసియేషన్లు ఆందోళన వ్యక్తం చేశాయి. నాణ్యమైన విత్తనాలతోనే దిగుబడి మెరుగ్గా ఉంటుందన్న వాస్తవాన్ని గుర్తు చేశాయి. గతేడాది 25 లక్షల ప్యాకెట్ల హెచ్‌టీబీటీ కాటన్ విత్తనాలను సాగు చేయగా.. ఈ ఏడాది 70 లక్షల ప్యాకెట్లకు పెరిగిపోయినట్టు రాసి సీడ్స్ చైర్మన్, ఎఫ్‌ఎస్‌ఐఐ చైర్మన్ ఎం.రామసామి పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోకపోతే పరిశ్రమకు, రైతులకు ఎంతో నష్టమన్నారు. -
రంగు మారిన 'దూది'బతుకు
సాక్షి నెట్వర్క్: దూదిరైతుకు దుఃఖమే మిగిలింది. అదనుకు పడిన వర్షాలకు కళకళలాడిన పత్తిచేలు.. అదే వరుణుడి ఆగ్రహంతో ఛిద్రమయ్యాయి. ఎంతో దిగుబడి వస్తుందని ఆశపడ్డ రైతుకు నిరాశే మిగిలింది. అకాల వర్షాలకు సగానికిపైగా దిగుబడి తగ్గిపోయింది. సీసీఐ అధికారులు తేమశాతం, ఎర్రబారిందని కొర్రీలు పెట్టి కొనుగోలు చేయకపోవడంతో దళారులను ఆశ్రయించి వచ్చినకాడికి అమ్ముకున్నారు. పత్తి వేస్తే పెద్దగా లాభాలు రాకపోయినా.. ఖర్చులు పోగా చేసిన కష్టమైనా మిగిలేది. కానీ ఏడాది అంతా తారుమారైంది. పెట్టిన పెట్టుబడులు రాక..అప్పులు నెత్తిన పడ్డాయి. రాష్ట్రంలో పత్తి అధికంగా సాగు చేసిన జిల్లాల్లో నల్లగొండ జిల్లా మొదటి, ఉమ్మడి ఆదిలాబాద్ రెండు స్థానాల్లో ఉన్నాయి. నల్లగొండ జిల్లాలో పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 2,39,865 ఎకరాలకు గాను 7,29,405 ఎకరాలు, సిద్దిపేట జిల్లాలో 2.40 లక్షల ఎకరాలు, ఉమ్మడి ఆదిలాబాద్‌లో 11.35 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. సకాలంలో వర్షాలు పడటంతో చేలు ఏపుగా పెరిగాయి. గూడ బాగా వేసింది. దీంతో తమ పంట పండిందని రైతులు ఆనంద పడ్డారు. వ్యవసాయ అధికారులు కూడా దిగుబడి భారీగా వస్తుందని అంచనా వేశారు. సగానికి తగ్గిన దిగుబడి ఆగస్టు, సెపె్టంబర్, అక్టోబర్ మాసాలలో వచ్చిన తుపాన్లు పత్తి రైతుల ఆశలను అడియాసలు చేశాయి. పూత, పిందె, కాయ దశలలో ఉన్న సమయంలో వర్షాలు కురవడంతో చేలపై ఉన్న పూత, పిందె రాలిపోవడంతో పాటు కాయలు పగిలి రంగుమారిన పత్తి చేతికి వచ్చింది. తెగుళ్లు ఆశించి, చేలు ఎర్రబారి సగానికి సగం కాయలు, పిందెలు రాలిపోయాయి. దీంతో ఎకరానికి 8 నుంచి 10 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని ఆశించిన రైతులకు కేవలం 2 నుంచి 4 క్వింటాళ్ల పత్తి మాత్రమే దిగుబడి వచ్చింది. నల్లగొండ జిల్లాలో సుమారు 58 లక్షల క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తుందని అధికారులు అంచనాలు వేశారు. కానీ తుపానుల కారణంగా 35 లక్షల క్వింటాళ్లు మాత్రమే వచ్చింది. సిద్దిపేట జిల్లాలో 2.4 లక్షల మెట్రిక్ టన్నులు అంచనా వేయగా.. లక్ష టన్నులు కూడా రాలేదు.. అలాగే, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 96 లక్షల క్వింటాళ్ల మేర వస్తుందని అంచనా వేయగా, 36 లక్షల క్వింటాళ్ల మేర వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ఇంకా అక్కడక్కడా చేనుపై కొంత పత్తి ఉంది. మూడు జిల్లాల్లో అంతా కలిపి పది లక్షల క్వింటాళ్ల మేర ఉంటుందని అంచనా. అమ్ముకునేందుకు నానా పాట్లు అంతోఇంతో చేతికొచ్చిన పత్తిని అమ్ముకుందామని వెళ్లిన రైతులకు చుక్కలు కనిపించాయి. పత్తి నల్లగా ఉందని, తేమశాతం ఎక్కువగా ఉందని సగం పత్తిని కూడా కొనుగోలు చేయలేదని రైతులు వాపోతున్నారు. ‘సీసీఐ పత్తి క్వింటాకు రూ. 5,880లకు కొనుగోలు చేయాల్సి ఉంది.. కానీ, పట్టించుకోకపోవడంతో ప్రైవేట్ వ్యాపారులకు రూ.4 వేల నుంచి రూ.4,500లకు అమ్ముకున్నాం’అని సిద్దిపేట జిల్లా చేర్యాలకు చెందిన రైతు రాములు ఆవేదన వ్యక్తం చేశారు. నల్లగొండ జిల్లాలో సీసీఐ కేంద్రాలు ఆలస్యంగా కొనుగోళ్లు ప్రారంభించాయి. రంగు మారిన పత్తిని కొనుగోలు చేయడానికి సీసీఐ అధికారులు నిరాకరించడంతో క్వింటాకు రూ.2,700ల నుంచి రూ.3,500 వరకు దళారులకు విక్రయించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సగానికి మేర ప్రైవేట్‌కు అమ్ముకున్నారు. పెట్టుబడి కూడా రావడం లేదు ఈ రైతు పేరు నెల్లికంటి ముత్తయ్య. నల్లగొండ జిల్లా మునుగోడు మండలం కొంపల్లి గ్రామం. తనకు ఉన్న 8 ఎకరాల్లో పత్తి సాగు చేశాడు. ఎకరానికి రూ.18 వేల చొప్పున రూ.1.44 లక్షలకు పైగా పెట్టుబడి పెట్టాడు. మొదట పూత బాగా రాగా ఈసారి పంట పండిందని ఆనందపడ్డాడు. కానీ వరుస వర్షాలతో అన్నీ తలకిందులయ్యాయి. ఎకరానికి 3 నుంచి 4 క్వింటాళ్ల చొప్పున 27 క్వింటాళ్ల లోపు వచ్చింది. అది కూడా నాణ్యత లేని దిగుబడి రావడంతో సీసీఐ కేంద్రంలో కొంత పత్తిని అమ్మాడు. మిగతా పత్తిని తీసుకోలేదు. ఈ ఏడాది నాకు రూ.50 వేలకుపైగా నష్టం వచ్చింది. తెచ్చిన అప్పులు మీద పడ్డాయి. అప్పే మిగిలింది సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రానికి చెందిన నర్సింహులు మూడెకరాల భూమిని కౌలుకు తీసుకున్నాడు. ఎకరాకు పది క్వింటాళ్లు పండే పత్తి ఈసారి 8 క్వింటాళ్లే పండింది. సీసీఐ కేంద్రానికి పత్తి అమ్మేందుకు వెళ్లగా, పత్తి నల్లబారిందని, తేమశాతం ఎక్కువగా ఉందని వెనక్కి పంపారు. తప్పని పరిస్థితిలో ప్రైవేట్ వ్యాపారికి రూ.40,800కు అమ్ముకున్నాడు. మొత్తం ఖర్చు 1,22,000 వచ్చింది. ఏడాది కాలంగా ఇంటిల్లిపాది కష్టపడితే.., రూ.81,200 అప్పు మిగిలింది. -
ప్రకృతి ప్రకోపాన్ని తట్టుకున్న పంట!
ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అనుసరిస్తే పంటలు అతివృష్టిని, అనావృష్టిని సైతం తట్టుకొని నిలిచి అధిక దిగుబడులిస్తాయని మరోసారి రుజువైంది. ముఖ్యంగా.. ప్రకృతి వ్యవసాయ మూలసూత్రాలకు అదనంగా వానకు ముందే విత్తనం (ప్రీ మాన్సూన్ డ్రై సోవింగ్–పి.ఎం.డి.ఎస్.) వినూత్న పద్ధతిని పాటించి ఏడాదిలో 365 రోజులూ పొలంలో పంటలు ఉండేలా చూసిన భూముల్లో పంటలు అతివృష్టికి, అనావృష్టికి కూడా తట్టుకొని అధిక దిగుబడులు ఇస్తున్నాయనిఆం.ప్ర. ప్రభుత్వానికి చెందిన రైతు సాధికార సంస్థ తాజా నివేదికలో వెల్లడించింది. డిసెంబర్ 5న ప్రపంచ నేలల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన అంతర్జాతీయ వెబినార్‌లో ఈ అంశాలపై చర్చ జరిగింది. ఆహార–వ్యవసాయ సంస్థ (ఎఫ్.ఎ.ఓ.) ఆహ్వానం మేరకు ఆస్ట్రేలియాకు చెందిన నిపుణుడు డా. వాల్టర్ యన గత ఏడాది నవంబర్‌లో ఆం.ప్ర. రాష్ట్రంలో పర్యటించారు. ప్రకృతి వ్యవసాయం పూర్తి ఫలితాలను ఇవ్వాలంటే ప్రధాన పంటలకు ముందుగా అనేక రకాల పచ్చిరొట్ట ఎరువు పంటలు సాగు చేయటం తప్పనిసరి అని సూచించారు. ఆయన సూచనల ప్రకారం 365 రోజులు ప్రధాన పంటలు, అంతర పంటలు, పచ్చిరొట్ట పంటలు నిరంతరాయంగా సాగు చేస్తూ ఏడాది పొడవునా పొలంల్లో పచ్చని పంటలు ఉండేలా చర్యలు తీసుకోవటం ముఖ్యమైన అంశం. దీనితోపాటు ప్రకృతి వ్యవసాయ పద్ధతులను పూర్తిస్థాయిలో పాటించడం వల్ల రైతుల ఆదాయాలు పెరిగాయి. అతివృష్టిని, అనావృష్టిని తట్టుకోవటంతోపాటు భూమిలో జీవరాశిని, జీవవైవిధ్యాన్ని పెంపొందించేందుకు అవకాశం కలిగింది. అధిక వర్షాలకు దెబ్బతిన్న రసాయనిక సేద్యంలో సాగైన వరి పొలం ఈ పద్ధతిని అనుసరించి లక్షకు పైగా రైతులు పంటలు పండిస్తూ మంచి ఫలితాలు సాధిస్తున్నారని రైతుసాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ టి. విజయకుమార్ వెల్లడించారు. ఈ వివరాలను ఆయన వెబినార్‌లో వివరించారు. అనంతపురం, ప.గో. జిల్లా, తూ.గో. జిల్లా, గుంటూరు, విజయనగరం, కడప తదితర జిల్లాల్లో గత ఏడాది కాలంగా పీఎండిఎస్ పద్ధతిలో ప్రకృతి సేద్యం వల్ల ఏయే పంటల్లో ఎటువంటి మెరుగైన, ఆశ్చక్యకరమైన ఫలితాలు వచ్చాయో.. రసాయనిక ఎరువులు/పురుగుమందులు వేసి పండించిన పంటల స్థితిగతులు ఎలా ఉన్నాయో తులనాత్మక అధ్యయన వివరాలను జిల్లా ప్రాజెక్టు మేనేజర్లు వివరించారు. ఈ ఖరీఫ్ కాలంలో ఆం.ప్ర.లో పంటలకు అధిక వర్షాల వల్ల నష్టం చేకూరింది. అయితే, రసాయనిక ఎరువులతో సాగు చేసిన వరి, పత్తి పంటల పరిస్థితి ప్రకృతి వ్యవసాయంలో సాగు చేసిన వరి, పత్తి పంటలకు మధ్య వ్యత్యాసం ఎలా ఉందో తెలుసుకునేందుకు రైతుసాధికార సంస్థ అనేక కోణాల్లో అధ్యయనం చేసింది. తూ.గో. జిల్లాలో రసాయనిక వ్యవసాయంలో వరి పంట దుబ్బుకు 26 పిలకలు వచ్చాయి. వేర్లు 28 సెం.మీ. లోతుకు వెళ్లాయి. ప్రకృతి వ్యవసాయంలో 42 సెం.మీ. (33.3% అధికం) లోతుకు వెళ్లాయి. అందువల్ల వర్షాలు, గాలులకు పంట పెద్దగా పడిపోలేదు. 5% పంట మాత్రమే. అందులోనూ 80–85% పంట కోలుకుంది. అధిక వర్షాలకు తట్టుకున్న ప్రకృతి సేద్యంలో సాగైన పత్తి , అధిక వర్షాలకు దెబ్బతిన్న రసాయనిక సేద్యంలో సాగైన పత్తి అదేప్రాంతంలో రసాయనిక ఎరువులతో పండించిన వరికి 24 పిలకలు వచ్చాయి. అధిక వర్షాలకు 90% పడిపోయి, దెబ్బతింది. 30–40% మాత్రమే కోలుకుంది. నీటి ముంపు విషయంలో కూడా గణనీయమైన వ్యత్యాసం గమనించారు. ప్రకృతి వ్యవసాయ పొలంలో నీరు త్వరగా ఇంకిపోయింది. ప్రకృతి వ్యవసాయంలో వరి పంటకు తెగుళ్లు సోకలేదు. రసాయనిక ఎరువులతో పండించిన వరి పంటకు బాక్టీరియా ఎండు ఆకు తెగులు సోకి ఎండిపోయింది. ఇక గుంటూరు జిల్లాలో పత్తి పంటలో సైతం ప్రకృతి వ్యవసాయానికి, రసాయనిక వ్యవసాయానికి వ్యత్యాసం బాగా కనిపించింది. అధికవర్షాలకు రసాయనిక వ్యవసాయ క్షేత్రంలో పత్తి కాయలు చాలా వరకు పాడయ్యాయి. కొమ్మలు కూడా దెబ్బతిన్నాయి. ఈ నష్టం ప్రకృతి వ్యవసాయ క్షేత్రాల్లో చాలా తక్కువగా ఉంది. ప్రకృతి వ్యవసాయంలో పత్తి పంట 5% పడిపోయి, 75% వరకు కోలుకుంది. రసాయనిక వ్యవసాయంలో పత్తి పంట 95% వరకు పడిపోయింది. ఏమాత్రం కోలుకోలేదు. పంటంతా పోయింది. ప్రకృతి వ్యవసాయంలో పూత, కాయలు 10–11% దెబ్బతింటే, రసాయనిక వ్యవసాయంలో 89–90% దెబ్బతిన్నాయి. ప.గో. జిల్లాలో ప్రకృతి వ్యవసాయంలో సాగైన 41 వరిలో పంట కోత పరీక్షలు జరిపారు. రసాయనిక వ్యవసాయం చేసిన పొలాల్లో కన్నా పిఎండిఎస్+ప్రకృతి వ్యవసాయం చేసిన పొలాల్లో 22% అధిక దిగుబడి వచ్చినట్లు రైతు సాధికార సంస్థ అధికారులు వెబినార్‌లో వెల్లడించారు. క్షేత్రస్థాయిలో పిఎండిఎస్తో కూడిన ప్రకృతి సేద్యంలో రైతులకు అందివస్తున్న ఫలితాలను తెలుసుకొని వివిధ ఖండాల్లోని వ్యవసాయ నిపుణులు ఆశ్చర్యానందాలను ప్రకటించటం విశేషం. ప్రకృతి సేద్యంలో వరి, బ్యాక్టీరియా ఎండాకు తెగులు సోకిన వరి భూతాపాన్ని తగ్గించవచ్చు ఆంధ్రప్రదేశ్‌లో ప్రకృతి వ్యవసాయదారులు సాధిస్తున్న ఫలితాలు ప్రపంచానికే దారిచూపేలా ఉన్నాయి. రైతులు తక్కువ ఖర్చుతో తమ ఆదాయాన్ని పెంచుకుంటూ భూములను పునరుజ్జీవింపజేయటం ఆదర్శప్రాయం. అయితే, ఒకే చోట 2 వేల హెక్టార్లలో పొలాలన్నిటిలోనూ ఏడాది పొడవునా తెంపులేకుండా ప్రకృతి సేద్యం చేపట్టాలి. ఇలా చేస్తే ఆ ప్రాంతంలో కొద్ది సంవత్సరాల్లోనే భూతాపాన్ని కూడా తగ్గించుకోవచ్చు. రుతుపవనాల్లో అపసవ్యతను సరిచేసుకోవచ్చు. భారత రైతులు ప్రపంచానికే దారిచూపిన వారవుతారు. – డా. వాల్టర్ యన, ప్రసిద్ధ శాస్త్రవేత్త, ఆస్ట్రేలియా మన రైతులను చూసి ప్రపంచం నేర్చుకుంటున్నది! ఆంధ్రప్రదేశ్‌లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులు సాధిస్తున్న ఫలితాలను ప్రపంచ దేశాలు ఆశ్చర్యంగా గమనిస్తున్నాయి. ఆస్ట్రేలియా శాస్త్రవేత్త వాల్టర్ యన సూచన మేరకు వివిధ జిల్లాల్లో లక్షకు పైగా చిన్న, సన్నకారు రైతులు పీఎండిఎస్తో కూడిన ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. గణాంకాలను శాస్త్రీయంగా నమోదు చేస్తున్నాం. ఈ ఖరీఫ్‌లో రసాయనిక మందులు వాడిన రైతులకన్నా ఈ రైతులు 22% అధిక దిగుబడులు సాధించారు. వీరి వరి, పత్తి సహా అన్ని రకాల పంటలు చాలా వరకు అతివృష్టిని తట్టుకున్నాయి. ఆహార–వ్యవసాయ సంస్థతోపాటు 12 దేశాలకు చెందిన నిపుణులు ఈ ఫలితాలను తెలుసుకొని ఆశ్చర్యపోతున్నారు. మన రైతుల అనుభవాల నుంచి వారు నేర్చుకోవడానికి సిద్ధమవుతుండటం విశేషం. – టి. విజయకుమార్, ఎగ్జిక్యూటివ్ వైస్‌చైర్మన్, ఆం.ప్ర. రైతు సాధికార సంస్థ -
సిరులు పండాయి!
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది ఖరీఫ్‌లో వరి రికార్డు స్థాయిలో ఉత్పత్తి అవుతుందని సర్కారు అంచనా వేస్తోంది. 21 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టే దిశగా వరి ఉత్పత్తి కానుందని వ్యవసాయ శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. గతేడాది 20 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టగా, ఇప్పుడు దాన్ని కూడా దాటేస్తుందని అధికారులు అంచనా. గత ఖరీఫ్‌లో 61.55 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి కాగా, ఈ ఖరీఫ్‌లో 66.07 లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి కానుందని వెల్లడించాయి. 2019–20 ఖరీఫ్ సీజన్ గత నెలాఖరుతో ముగిసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యవసాయ పంటల మొదటి ముందస్తు అంచనా నివేదికను అర్థ గణాంక శాఖ తాజాగా విడుదల చేయగా, వివరాలను వ్యవసాయ శాఖ వర్గాలు విశ్లేషించాయి. ఈ ఏడాది 28.75 లక్షల ఎకరాల్లో నాట్లు పడతాయని, 59.57 లక్షల మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తి అవుతుందని వ్యవసాయశాఖ తన ప్రణాళికలో ప్రకటించింది. కానీ నైరుతి రుతుపవనాలతో పెద్ద ఎత్తున వర్షాలు కురవడం, జలాశయాలు, చెరువులు, వాగులు, వంకలు పొంగిపొర్లడంతో 31.67 లక్షల ఎకరాల్లో నాట్లు పడ్డాయి. దీంతో వరి రికార్డులను బద్దలుకొట్టనుంది. పత్తి ఉత్పత్తి కూడా భారీనే... ఖరీఫ్‌లో అన్ని పంటల సాధారణ సాగు విస్తీర్ణం 1.08 కోట్ల ఎకరాలు కాగా, 1.10 కోట్ల ఎకరాల్లో సాగయ్యింది. అందులో అత్యధికంగా పత్తి సాగైంది. దాని సాధారణ సాగు విస్తీర్ణం 43.12 లక్షల ఎకరాలు కాగా, ఏకంగా 46.48 లక్షల ఎకరాల్లో (108 శాతం) సాగైంది. పప్పు ధాన్యాల సాగు సాధారణ విస్తీర్ణం 10.37 లక్షల ఎకరాలు కాగా... 9.42 లక్షల (91 శాతం) ఎకరాల్లో సాగు చేశారు. పత్తి గతేడాది 41 లక్షల బేళ్లు ఉత్పత్తి కాగా, ఈసారి 45.93 లక్షల బేళ్లు ఉత్పత్తి అవుతుందని సర్కారు అంచనా వేసింది. మొక్కజొన్న 13.79 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి వస్తుందని పేర్కొంది. ఇక కందులు 7.11 లక్షల ఎకరాల్లో సాగు కాగా 1.94 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి రానున్నట్లు పేర్కొంది. జొన్నలు 42 వేల మెట్రిక్ టన్నులు, పెసర 45 వేల మెట్రిక్ టన్నులు, వేరుశనగ 30 వేల మెట్రిక్ టన్నులు, సోయాబీన్ 2.82 లక్షల మెట్రిక్ టన్నులు, పసుపు 3.14 లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి కానుందని అంచనా వేసింది. ఉత్పత్తి పెరుగుతుం డటంతో సర్కారు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లపై దృష్టి సారించింది. దీని ద్వారా రైతులకు మరింత లబ్ధి చేకూర్చాలని నిర్ణయిం చారు. దీనిపై ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ కసరత్తు ముమ్మరం చేశారు. మరోవైపు నైరుతి సీజన్లో కురిసిన వర్షాలతో రబీ సీజన్ కూడా ఆశాజనకంగా ఉంటుందని వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. -
పత్తికి దెబ్బే..!
సాక్షి, కొత్తగూడెం: ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి వర్షాలు ఆలస్యంగా ప్రారంభమైనప్పటికీ ఒకింత ఎక్కువగా కురవడంతో జిల్లాలో అన్ని పంటలను సాధారణ విస్తీర్ణం కన్నా అధికంగానే రైతులు సాగు చేస్తున్నారు. వరి, మొక్కజొన్న, పెసర, నూనెపంటలు, ఇతర ఆహార, వాణిజ్య పంటలు వందశాతం కంటే మించి పండిస్తున్నారు. వీటన్నింటికీ ప్రస్తుత వర్షాలతో ఇబ్బంది లేకున్నా.. పత్తి పంటకు మాత్రం కొంతమేరకు నష్టం వాటిల్లుతోంది. జిల్లాలో సాధారణ పత్తి సాగు విస్తీర్ణం 46,475 హెక్టార్లు కాగా, ఈ సీజన్లో 46,524 హెక్టార్లలో సాగుచేశారు. అయితే పత్తి రైతులకు ఈ సీజన్లో వరుసగా దెబ్బలు తగిలాయి. సీజన్ ప్రారంభంలో అరకొర వర్షాలు కురవడంతో వెంటవెంటనే రెండు సార్లు పత్తి గింజలు నాటారు. కొందరు రైతులు మూడోసారి కూడా వేయాల్సి వచ్చింది. ఆ తర్వాత వర్షాలు ముఖం చాటేయడంతో అవి మొలవలేదు. కొద్ది రోజులకు వర్షం కురవడంతో మళ్లీ విత్తనాలు వేశారు. ఈ క్రమంలో కొన్ని మండలాల్లో నకిలీ విత్తనాల కారణంగా రైతులు నష్టపోయారు. తరువాత వర్షాలు సమృద్ధిగా కురవడంతో చివరలో నాటిన గింజలు మొలిచాయి. అయితే ఆలస్యంగా ప్రారంభమైన వర్షాలు జిల్లాలో సాధారణం కన్నా ఎక్కువగా కురవడంతో పత్తిపంటపై కొంతమేరకు ప్రభావం చూపుతోంది. వరుసగా కురుస్తున్న వర్షాలతో చాలాచోట్ల మోకాళ్ల ఎత్తులోనే పత్తిపంట ఎర్రబారింది. ఆకు ముడత వస్తోంది. వర్షాలు ఎక్కువగా పడుతుండడంతో పత్తి చేలల్లో భారీగా కలుపు పెరిగి మొక్క ఎదుగుదలపై ప్రభావం పడుతోంది. మరోవైపు కొమ్మతొలుచు పురుగు, గులాబీరంగు పురుగు, పిండినల్లి తెగులు ఆశిస్తున్నాయి. దీంతో మొక్క పెరుగుదలపై ఆశలు లేకుండా పోతోందని రైతులు అంటున్నారు. ఇక రైతులు నాటిన విత్తనాలకు సంబంధించి బీటీ ప్రభావం 100 రోజులు మాత్రమే ఉంటుంది. ఆ వ్యవధి కూడా దాటిపోతుండడంతో పెరుగుదల అంతగా ఉండదని రైతులు ఆందోళన చెందుతున్నారు. మొదట్లో ముఖం చాటేసిన వర్షాలు తరువాత ఎక్కువగా కురుస్తుండడంతో పత్తి దిగుబడిపై ప్రభావం చూపుతుందని అంటున్నారు. ఇక జిల్లాలో కురిసిన వర్షాలతో పాటు ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో గోదావరి గత నెలరోజుల కాలంలో నాలుగుసార్లు ఉధృతంగా ప్రవహించింది. దీంతో గోదావరి పరీవాహక ప్రాంత మండలాల్లో పత్తి పంటలు భారీగా దెబ్బతిన్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో అనుకున్నంత స్థాయిలో పత్తి దిగుబడి వచ్చే అవకాశం లేదని రైతులు అంటున్నారు. మిగితా పంటలకు ఢోకా లేదు.. ఈ ఖరీఫ్‌లో వర్షాలు బాగా కురవడంతో పత్తి మినహా మిగిలిన పంటలకు మాత్రం ఎలాంటి ఢోకా లేదు. ఇప్పటి వరకు వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం సాధారణ విస్తీర్ణంలో వివిధ పంటలను రైతులు సాగు చేస్తున్నారు. ప్రధానంగా వరి, మొక్కజొన్న, పెసర, పత్తి, చెరకు, ఇతర ఆహార పంటలు 100 శాతం సాగులో ఉన్నాయి. జిల్లాలో వరి, పత్తి పంటల వైపు రైతులు మొగ్గు చూపారు. వరి సాధారణ విస్తీర్ణం 43,334 హెక్టార్లు కాగా 43,577 హెక్టార్లలో (109 శాతం), పత్తి 46, 475 హెక్టార్లకు 46,524 హెక్టార్లలో సాగవుతున్నాయి. ఈ రెండింటి తరువాత మొక్కజొన్న వైపు రైతులు మక్కువ చూపారు. ఈ పంట సాధారణ విస్తీర్ణం 6,304 హెక్టార్లు కాగా, 8,398 హెక్టార్లలో (133 శాతం) సాగు చేస్తున్నారు. పెసర 227 హెక్టార్లకు 233 హెక్టార్లతో 103 శాతం, ఇతర నూనె పంటలు 6,531 హెక్టార్లకు 6,644 హెక్టార్లు (102 శాతం), ఇతర ఆహార పంటలు 7,986 హెక్టార్లకు 7,999 హెక్టార్లలో సాగు చేస్తున్నారు. ఇతర ఆహారేతర పంటలు 7,490 హెక్టార్లకు గాను 7,580 హెక్టార్లలో సాగవుతున్నాయి. ఎర్రబడి పూత రాలుతోంది నెలరోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు పత్తి ఎర్రబడి పూత రాలిపోతోంది. కలుపు పెరిగి చెట్లు ఎదగటం లేదు. వర్షాల కు తెగుళ్లు ఎక్కువయ్యా యి. పూత, కాత సమయంలో అధిక వర్షాలతో పంటకు నష్టం జరుగుతోంది. – యారం వెంకటరెడ్డి, రెడ్డిపాలెం దిగుబడి సక్రమంగా రాదు వర్షాలతో పత్తి ఎదుగుదల లేకుండా పోయింది. మొక్కలు ఎర్రబడి పూత రాలిపోతోంది. ఇప్పటికే ఎరువులు, పురుగు మందులకు పెట్టుబడి ఎక్కువగా పెట్టాం. వర్షాలకు పత్తి దెబ్బతింది. దిగుబడులు బాగా తగ్గుతాయని భయంగా ఉంది. – యడమకంటి నర్సింహారెడ్డి, నాగినేనిప్రోలు -
20–22 తేదీల్లో మహారాష్ట్రలో పాలేకర్ క్షేత్ర సందర్శన
మహారాష్ట్రలో పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగువుతున్న ఉత్తమ పత్తి, పసుపు, మునగ, మిరప, పూలు, బత్తాయి తోటల సందర్శన కార్యక్రమం ఈ నెల 20 నుంచి 22వ తేదీ వరకు జరగనుంది. పద్మశ్రీ అవార్డు గ్రహీత సుభాష్ పాలేకర్ స్వయంగా హిందీ/ఇంగ్లిష్‌ల ఈ క్షేత్రాల ఉత్పాదకత గురించి రైతులకు వివరిస్తారు. నాగపూర్ నుంచి 20న ఉ. 8.30 గంటలకు ప్రారంభవమయ్యే యాత్ర వివిధ జిల్లాల్లో 3 రోజులు కొనసాగుతుంది. పాల్గొనదలచిన వారు భోజన, వసతి, రవాణా ఖర్చుల నిమిత్తం రూ. 1,200 చెల్లించాల్సి ఉంటుంది. వివరాలకు.. మనోజ్ జానియల్– 98225 15913, సచిన్ జడె–88050 09737 -
జాడలేని వాన.. రైతన్న హైరానా!
సాక్షి, హైదరాబాద్ : నిర్ణీత సమయానికి ముందే నైరుతి రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకాయి.. రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాయి.. మొదట్లో సాధారణస్థాయికి మించి వానలు కురిశాయి.. అన్నదాతల్లో ఆనందం పొంగింది.. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఆవిరైంది! రుతుపవనాలు బలహీనపడటంతో వానలు ముఖం చాటేశాయి. వారం రోజులుగా వాన జాడలేక రైతన్న దిక్కుతోచని స్థితిలో పడిపోయాడు. వానల్లేక వేసిన విత్తనం భూమిలో ఉండిపోయింది. కొన్నిచోట్ల విత్తనాలు మొలకెత్తినా ఎండలకు మాడిపోతున్నాయి. ఇంకొన్నిచోట్ల దుక్కులు దున్నిన రైతన్నలు ఆశగా నింగి వైపు చూస్తున్నారు. ఆగిన సాగు ఈసారి నైరుతి రుతుపవనాలు ఆశాజనకంగా ఉంటాయని వాతావరణ శాఖ వెల్లడించింది. సాధారణంతో పోలిస్తే 97 శాతం వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ లెక్కన తెలంగాణలో సాధారణ నైరుతి సీజన్ వర్షపాతం 755 మి.మీ. కాగా.. 97 శాతం లెక్కన 732 మి.మీ.లు కురిసే అవకాశముంది. అయితే ఈ నెల 15 నుంచి వర్షాలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. గత రెండ్రోజుల్లోనైతే పరిస్థితి ఘోరంగా ఉంది. ఏకంగా 84 శాతం లోటు వర్షపాతం నమోదైంది. దీంతో ఎక్కడికక్కడ పంటల సాగు నిలిచిపోయింది. నార్లు పోసే దిక్కు కూడా లేదు. రానున్న రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. 4 లక్షల ఎకరాల్లో పత్తి ఈ ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం కోటి ఎకరాలకు పైనే ఉంది. అందులో 45 లక్షల ఎకరాల్లో పత్తి పంట వేస్తారు. పైపెచ్చు ఖరీఫ్‌పై ప్రభుత్వం కోటి ఆశలు పెట్టుకుంది. రుతుపవనాల ఆరంభ సమయంలో వర్షాలు కురుస్తాయన్న ఆశతో అనేక మంది రైతులు పత్తి, మెట్ట పంటల విత్తనాలను చల్లారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 10 లక్షల ఎకరాల్లో విత్తనాలు వేసి ఉంటారని అంచనా. అందులో పత్తి విత్తనాలు దాదాపు 4 లక్షల ఎకరాల్లో చల్లి ఉండొచ్చని చెబుతున్నారు. కొన్నిచోట్ల పెసర, కంది వంటి విత్తనాలను చల్లారు. వర్షాలు నిలిచిపోయి ఎండలు మండిపోతుండటంతో మొలకెత్తిన విత్తనాలు వాడిపోతుంటే, కొన్నిచోట్ల భూమిలోనే మాడిపోతున్నాయని రైతులు అంటున్నారు. ముందుగా వేసిన విత్తనాలు మొలకెత్తినా ప్రయోజనం కనిపించటం లేదు. ఆ మొలకలు కూడా వాలిపోతున్నాయి. దాదాపు 2 లక్షల ఎకరాల్లో పత్తి విత్తనాలు భూమిలోనే మగ్గుతున్నాయి. ఇంకొన్ని చోట్ల పొడి దుక్కుల్లోనే రైతులు పత్తి విత్తనాలను నాటుతున్నారు. నేలలో తగిన తేమ ఉన్న సమయంలోనే పంటలను సాగు చేయాలని అధికారులు చెబుతున్నా రైతులు పట్టించుకోవడం లేదు. 60 మి.మీ. వర్షం కురిసినప్పుడే పత్తి విత్తనాన్ని నాటుకోవాలని వ్యవసాయశాఖ అధికారులు, శాస్త్రవేత్తలు సూచనలు చేస్తున్నారు. ప్రత్యామ్నాయ ప్రణాళిక ఏదీ? ప్రస్తుతం రైతు బీమా పథకంపై తప్ప వ్యవసాయశాఖ దేనిపైనా దృష్టి సారించడం లేదు. మండలాల్లో వ్యవసాయాధికారులు అంతా ఎల్ఐసీ ఫారాలను ముందేసుకొని రైతులను బీమాలో చేర్పించే పనుల్లోనే నిమగ్నమయ్యారు. అలాగే వ్యవసాయశాఖ ఇప్పటికీ 2018–19 ప్రణాళిక విడుదల చేయలేదు. అందులో ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికను తెలియజేయాలి. కానీ ఆ ప్రణాళిక విడుదలపై ఇంకా దృష్టి సారించడం లేదు. రైతులను చైతన్యపరిచేందుకు యాత్రలు కూడా నిర్వహించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. 22 నుంచి వర్షాలు: రాజారావు, సీనియర్ అధికారి, హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఈ నెల 22 లేదా 23వ తేదీ నుంచి వర్షాలు కురుస్తాయి. ప్రస్తుతం రుతుపవనాలు బలహీనంగా ఉన్నాయి. రెండు మూడు రోజుల్లో మళ్లీ పుంజుకుంటాయి. ఈ నెలాఖరుకు అనేకచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. -
భళా.. బదనవాళు ట్రీ కాటన్!
బదనవాళు అనేది కర్ణాటకలోని ఓ కుగ్రామం. మైసూరుకు 38 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అరుదైన ఒక రకం పత్తి చెట్ల జాతికి ఆ ఊరే పుట్టిల్లు. 490 ఏళ్ల క్రితం నాటి పురాతన చెట్టు రకం పత్తి ఇది. అప్పట్లో ఆ ఊళ్లో అంతటా ఈ పత్తి చెట్లే ఉండేవట. అందుకే, ఆ పత్తి చెట్లకు ‘బదనవాళు పత్తి’ అని పేరు వచ్చింది. అయితే, కాలక్రమేణా వీటిపై శ్రద్ధ తగ్గింది. ఇప్పుడు బదనవాళు పత్తి చెట్ల ఆచూకీయే దొరకనంతగా కనుమరుగైపోయాయి. పత్తి పంట అనగానే.. విత్తనం వేసి.. కొద్ది రోజుల్లో పత్తి తీసేసుకొని.. మొక్కను పీకేయటం.. మళ్లీ వర్షాలు పడినాక మళ్లీ విత్తనం వేసుకోవడమే మనకు తెలుసు. అయితే, బదనవాళు అలాకాదు. ఒకసారి విత్తనం వేస్తే పెద్ద చెట్టుగా పెరిగి 40–50 సంవత్సరాల పాటు పత్తి దిగుబడినిస్తుంది. 2–3 ఏళ్లకు కాపుకొస్తుంది. 4 ఏళ్లకు 15 అడుగుల ఎత్తు పెరుగుతుంది. విత్తనాలను 3 రోజులు నీటిలో నానబెట్టి నాటుకోవాలని మైసూరుకు చెందిన ‘అటవీ కృషి’ నిపుణుడు, ప్రఖ్యాత స్వతంత్ర ఆహార శాస్త్రవేత్త డాక్టర్ ఖాదర్ వలి ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు. దాదాపు కనుమరుగైపోయిన బదనవాళు పత్తి గింజలు కొన్నిటిని సేకరించిన ఆయన తన ఇంటి వద్ద, అటవీ కృషి వ్యవసాయ క్షేత్రంలోను నాటారు. తాను ప్రత్యేకంగా తయారు చేసుకున్న ‘అటవీ చైతన్యం’ అనే ద్రవరూప ఎరువుతో ఈ చెట్లను పెంచుతున్నారు. అభయారణ్యం నుంచి తెచ్చిన గుప్పెడు మట్టితోపాటు సిరిధాన్యాలు, పప్పుధాన్యాల పిండి, తాటిబెల్లం కలిపి ‘అటవీ చైతన్యం’ ద్రవరూప ఎరువును ఆయన తయారు చేస్తున్నారు(దీనిపై మరిన్ని వివరాలకు 2017–09–19 నాటి ‘సాక్షి సాగుబడి’ పేజీ చూడండి). నాలుగేళ్ల క్రితం నాటిన చెట్లు 15 అడుగుల వరకు పెరిగాయి. కాయలు కాస్తున్నాయి. దేశీ రకమైనందున బదనవాళు పత్తి చెట్లను రసాయనిక ఎరువులు, పురుగుమందులు వేయకుండానే పెంచవచ్చు. వాణిజ్య స్థాయిలో పంట పొలాల్లో సైతం రైతులు ఈ పత్తి చెట్ల తోటలను సాగు చేసుకోవచ్చని, ప్రతి ఏటా ప్రూనింగ్ చేస్తూ ఉంటే మంచి పత్తి దిగుబడి వస్తుందని డాక్టర్ ఖాదర్ చెబుతున్నారుబదనవాళు పత్తి గింజల నూనె మంచి వంట నూనెగా కూడా పనికొస్తుందని, గతంలో మిల్లుల్లో గ్రీజుకు బదులుగా ఈ నూనెను వాడేవారన్నారు. అంతేకాదు.. ఆడ, మగవారిలో జననాంగ సంబంధమైన ఆరోగ్య సమస్యల నివారణకు ఈ పత్తి చెట్టు ఆకుల కషాయం మంచి ఔషధంగా పనిచేస్తుందని ఆయన తెలిపారు. బహుళ ప్రయోజనాలు కలిగిన బదనవాళు పత్తి చెట్ల గురించి ఇతర సమాచారం కోసం.. ‘అటవీ కృషి’ నిపుణుడు బాలన్ కృష్ణ (097405 31358)ను తెలుగు, కన్నడ, తమిళం, ఆంగ్లంలో సంప్రదించవచ్చు. బదనవాళు పత్తి మొక్క -
నకిలీ.. విచ్చలవిడి!
అధికారులు వద్దన్నా రైతులు ఈ ఏడాది కూడా పత్తివైపే మొగ్గు చూపారు. ఈ ప్రాంతంలో ప్రధాన వాణిజ్య పంటగా పత్తిని సాగుచేయడం అనాదిగా వస్తోంది. దీన్ని ఆసరాగా చేసుకున్న కొందరు విత్తన వ్యాపారులుకాలం చెల్లిన, నకిలీ, నాసిరకం విత్తనాలను రైతులను అంటగట్టి రూ.లక్షలు దండుకుంటున్నారు. జడ్చర్ల : కొన్నేళ్లుగా జడ్చర్ల కేంద్రంగా పత్తి విత్తనాల విక్రయాలు జోరుగా.. వివాదాస్పదంగా కొనసాగుతున్నాయి. వివిధ కంపెనీల పేరుతో బీటీ–2 పత్తి విత్తనాలను వ్యాపారులు లెక్కకు మించి విక్రయిస్తున్నారు. అనుమతి ఉన్న విత్తనాల చాటునే అనుమతి లేని, కాలం తీరిన విత్తనాలను సైతం రైతులకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. స్థానికంగా తయారు చేసిన పత్తి విత్తనాలను వివిధ కంపెనీల పేరుతో ముద్రించిన కవర్లలో ప్యాక్ చేసి విక్రయానికి పెడుతున్నారు. ప్రతీసారి అధికారులు దాడులు చేసిన సమయంలో లూజ్ విత్తనాలు, ఖాళీ కవర్ ప్యాకెట్లు లభిస్తుండడంతో రైతులనుంచి వచ్చే ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా విక్రయాలు విత్తన విక్రయాలు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అడ్డగోలుగా నిర్వహిస్తున్నారు. ఎక్కడా పారదర్శకంగా విత్తన విక్రయాలు జరగడం లేదన్నది నగ్నసత్యం. విత్తనాల తయారీ సంస్థల పూర్తి వివరాలు, ఆయా కంపెనీల అనుభవం, రిమార్కులు కూడా ఆన్లైన్లో సంబంధిత అధికారుల వద్ద ఉంచాల్సి ఉన్నా కంపెనీలు పెద్దగా పట్టించుకోవడం లేదు. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న విత్తన కంపెనీలు ఎంతమేరకు పారదర్శకంగా వ్యవహరిస్తున్నాయో తెలియని పరిస్థితి ఉంది. సమాచారాన్ని రైతు ముంగిట్లోకి తీసుకువచ్చినప్పుడే రైతులు తమకు కావలసిన విత్తనాలను ఎంపిక చేసుకునే పరిస్థితి ఉంటుంది. కానీ ఇవేమి రైతు దరికి చేరకపోవడంతో వ్యాపారి చెప్పిన మాటలే రైతుకు శిరోదార్యమవుతున్నాయి. జాడలేని సమాచారం విత్తన కంపెనీల వివరాలు, ప్రభుత్వం నిర్ణయించిన ధరలు, స్టాక్ వివరాలు తదితర సమాచారం రైతులకు అందుబాటులో ఉంచాలన్న నిబంధనలను వ్యాపారులు బేఖాతరు చేస్తున్నారు. కొనుగోలు సమయంలో రైతులకు సరైన బిల్లులు ఇవ్వాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదు. ఒక వేల బిల్లులు ఇచ్చానా వాటిపై అందుకు సంబంధించిన బ్యాచ్, లాట్ నంబర్లు వంటి పూర్తి వివరాలు పొందుపరచడం లేదు. సరఫరా అయిన బీటీ–3 విత్తనాలు ప్రభుత్వం నిషేధించిన బీటీ–3 విత్తనాలను కొందరు వ్యాపారులు ఇప్పటికే రైతులకు రహస్యంగా అంటగట్టేశారు. గత ఏడాది కూడా ఈ తంతు గోప్యంగా సాగింది. ఈ ఏడాది కూడా బీటీ–3 విత్తనాలను తమకు అనుకూలంగా ఉ న్న రైతులకు వ్యాపారులు విక్రయించే పనిలో నిమగ్నమయ్యారు. గత ఏడాది బీటీ–2 విత్తనాలకు గులాబీ రంగు పురుగు, ఇతర తెగుళ్లు ఆశించడాన్ని ఆసరగా చేసుకున్న వ్యాపారులు ఈసా రి బీటీ–3 విత్తనాలను పెద్ద మొత్తంలో రైతులకు అంటగట్టేందుకు కుట్రపన్నారు. బీటీ–3 విత్తనాలకు సంబం ధించి కలుపు నివారణ మందులు వినియోగించే పరిస్థితి ఉండడంతో పాటుగా తెగుళ్లు, ఇతర కీటకాలను తట్టుకునే పరిస్థితి ఉందని ప్రచారాన్ని చేస్తున్నారు. దీంతో రైతులు బీజీ–3 విత్తనాల వైపు మొగ్గు చూపుతున్నారు. భూత్పూర్ అడ్డాగా విక్రయాలు భూత్పూర్ కేంద్రంగా అనుమతి లేని, నకిలీ పత్తి విత్తనాలను మార్కెట్లోకి భారీగా విక్రయిస్తుంటారు. గత కొన్ని సంవత్సరాలుగా మిగిలిన విత్తనాలను ప్యాక్ మార్చి అంటగడుతున్నా రు. అంతేగాక జిన్నింగ్ చేసిన విత్తనాలకు రంగులేసి బీటీ విత్తనాలుగా ప్యాకెట్లలో నింపి విక్రయిస్తున్నారు. తక్కువ ధరల ముసుగుతో పాటు వ్యాపారులకు పెద్ద ఎత్తున కమీషన్లు, బంపర్ ఆఫర్లు ప్రకటించడంతో వ్యాపారులు పనికి రాని విత్తనాలను రైతులకు అంటగడుతున్నారు. వ్యాపారులేమో సింగపూర్, బ్యాంకాక్ వంటి దేశాల్లో చక్కర్లు కొడుతుండగా రైతులు నాసిరకం పంటలు సాగుచేసి దిగుబడులు రాక అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతున్నారు. అధికారులు దృష్టి సారించాలి నాణ్యమైన విత్తనాలు మాత్రమే రైతులకు అందే విధంగా అధికారులు ముం దస్తు చర్యలు చేపట్టాలి. మరో రెండు నెలల్లో సీజన్ ప్రారంభం అవుతుంది. ముందుగానే చర్యలు చేపట్టి అప్రమత్తం చేస్తే మార్పు కనిపిస్తుంది. అదేవిధంగా బీజీ–3 విత్తనాలను మార్కెట్లోకి రా కుండా అడ్డుకోవాల్సిన అవసరముంది. వ్యాపారులు పారదర్శకంగా వ్యవహరించేలా చర్యలు తీసుకోవాల్సి ఉంది. గ్రామాల్లో రైతులకు అవగాహన కార్యక్రమాలు చేపట్టి సూచనలు చేయాల్సిన అవసరముంది. రైతులు అప్రమత్తంగా ఉండాలి రైతులు అధికారులు సూచించిన నాణ్యమైన విత్తనాలను మాత్రమే కొనుగోలు చేయాలి. లైసెన్స్ ఉన్న వ్యాపారి దగ్గరే కొనుగోలు చేసి తప్పనిసరిగా బిల్లులు తీసుకోవాలి. బీటీ–3 పత్తి విత్తనాలను ఎట్టి పరిస్థితుల్లో సాగు చేయవద్దు. ఎవరైనా అమ్మితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. – నిర్మల, ఏడీఏ, జడ్చర్ల -
పత్తికి 'పురుగు' పీడ!
సాక్షి, హైదరాబాద్ రాష్ట్రంలో పత్తి రైతుల ఆశలను గులాబీ రంగు పురుగు తొలిచేస్తోంది.. పంటను నాశనం చేస్తూ రైతులను నిండా ముంచుతోంది. ఇటీవలి వర్షాలతో ఓ వైపు పత్తి రంగు మారుతోంటే.. మరోవైపు గులాబీరంగు పురుగు కారణంగా దిగుబడులు భారీగా పడిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా పత్తికి గులాబీ రంగు పురుగు పట్టడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కేంద్ర వ్యవసాయశాఖ క్రాప్ సైన్స్ విభాగం ఆధ్వర్యంలో ఈ నెల 25న అన్ని రాష్ట్రాల వ్యవసాయ ఉన్నతాధికారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తోంది. దేశవ్యాప్తంగా గులాబీ రంగు పురుగు తీవ్రతను గుర్తించడం, నష్టాన్ని అంచనా వేయడంతోపాటు తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారని రాష్ట్ర వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. అసలు బీజీ–2 పత్తి విత్తనానికి గులాబీ రంగు పురుగును తట్టుకునే శక్తి లేదని తెలిసినా ప్రభుత్వం ఆ విత్తనం విక్రయించేందుకు బహుళజాతి విత్తన కంపెనీలకు అనుమతి ఇచ్చిందనే విమర్శలు మిగతా వ్యక్తమవుతున్నాయి. ఇక గులాబీ రంగు పురుగు ఉధృతితో ఇంత జరుగుతున్నా రాష్ట్ర వ్యవసాయ శాఖ కనీసం రైతులను అప్రమత్తం చేయలేకపోయిందన్న ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు అనుమతిలేని బీజీ–3 విత్తనంతో జీవ వైవిధ్యానికి ప్రమాదం పొంచి ఉందన్న ఆందోళనల నేపథ్యంలో.. 25వ తేదీనే బీజీ–3పై ఢిల్లీలో మరో సమావేశం జరుగనుంది. 10 లక్షల ఎకరాల్లో నష్టం? రాష్ట్రంలో ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం 1.08 కోట్ల ఎకరాలుకాగా.. ఈ సారి 97.45 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. అందులో అత్యధికంగా 47.72 లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది. గతేడాది పత్తికి మంచి ధర రావడంతో ఈసారి చాలా మంది రైతులు దానివైపే మొగ్గారు. కానీ పత్తి పంట రైతులకు తీవ్ర ఆవేదన మిగుల్చుతోంది. ఇటీవలి భారీ వర్షాలకు 1.35 లక్షల ఎకరాల్లో పత్తికి నష్టం జరగగా.. ఇప్పుడు దాదాపు మరో 10 లక్షల ఎకరాల్లో పత్తికి గులాబీ రంగు కాయతొలుచు పురుగు పట్టింది. దీంతో పంటంతా సర్వనాశనమవుతోందని వ్యవసాయ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. విత్తనాల కోసం వేసిన పత్తి పంటకు కూడా ఈ పురుగు సోకిందని విత్తన సంస్థలు పేర్కొంటున్నాయి. మొత్తంగా దేశవ్యాప్తంగా దాదాపు 25 నుంచి 30 శాతం వరకు పత్తికి గులాబీ పురుగు సోకినట్లు అంచనా. బీటీ టెక్నాలజీ విఫలమైనందునే బీజీ–2 పత్తి విత్తనం గులాబీ పురుగును తట్టుకునే శక్తి కోల్పోయిందని వ్యవసాయ రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వర్షాలు కురిసినా తగ్గని ఉధృతి జూన్‌లో వేసిన పత్తి పంటకు గులాబీ రంగు పురుగు సోకిందని నెల కిందటే రాష్ట్ర వ్యవసాయ శాఖ వర్గాలు గుర్తించాయి. జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో వర్షాభావం, డ్రైస్పెల్స్ ఏర్పడటం, ఎండల తీవ్రతతో గులాబీ రంగు ఉధృతమైంది. సాధారణంగా విస్తారంగా వర్షాలు కురిస్తే ఈ పురుగు ఉధృతి తగ్గిపోతుంది. కానీ ఇటీవల విస్తారంగా వర్షాలు పడినా.. పురుగులు నాశనం కాలేదు. మరింతగా విజృంభించి పత్తికాయలను తొలిచేస్తుండడంతో దిగుబడులు దారుణంగా పడిపోతున్నాయి. గద్వాల జిల్లాకు చెందిన రైతులు తమ విత్తన పంటకు కూడా గులాబీ పురుగు సోకిందని వ్యవసాయ శాఖకు ఫిర్యాదులు చేస్తున్నారు. పట్టించుకోని వ్యవసాయ శాఖ గులాబీరంగు కాయతొలుచు పురుగు రాష్ట్రంలో పత్తి పంటను నాశనం చేస్తున్నా.. వ్యవసాయ శాఖ చేపట్టిన చర్యలు తూతూమంత్రంగానే ఉన్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నెల కిందటే ఈ పురుగు విస్తృతిని గుర్తించినా.. రైతుల్లో అవగాహన కల్పించడంలో విఫలమైందని, ఇంత నష్టం జరుగుతున్నా పరిస్థితిని దాచిపెడుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అసలు ఏడాది క్రితం గులాబీ రంగు పురుగుతో తీవ్ర నష్టం వాటిల్లడంతో.. కర్ణాటక ప్రభుత్వం మోన్శాంటో, మహికో కంపెనీలను రూ. 2 వేల కోట్లు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేయడం గమనార్హం. దేశవ్యాప్తంగా సమస్య ‘‘దేశవ్యాప్తంగా పత్తిని గులాబీ రంగు కాయతొలుచు పురుగు (పింక్ బోల్వార్మ్) పట్టింది. 25 శాతం నుంచి 30 శాతం పంటకు ఈ పురుగు సోకిందని అంచనా. రాష్ట్రంలోనూ ఇదే పరిస్థితి ఉంది. గద్వాల జిల్లాలో పత్తి విత్తన పంటకూ గులాబీ రంగు పురుగు సోకింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ నెల 25న అన్ని రాష్ట్రాల వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించనుంది..’’ – డాక్టర్ కేశవులు, రాష్ట్ర విత్తన సేంద్రియ ధ్రువీకరణ సంస్థ డైరెక్టర్